Posts

Showing posts from 2010

Happy new year..!!

అప్పుడే 2011 వచ్చెసిందండీ..
మొన్నే కదా..2010 వచ్చింది.. :P అందరికి ఇలాగే అనిపిస్తోంది కదా..!! :D ఒక సంవతసరం గడిచిపోయింది..!! ఎం సాధించావ్???..అయ్యో రోజు టైం కి తినడం …నిద్ర పోవడం…క్రమం తప్పకుండ చెసానండీ.. ..:p ఇవి కాకుండా…!! Hmnnnn….. గుర్తోచ్చేసాయి…!! ఈ సంవత్సరం ఎప్పటి నుండో నేర్చుకోవాలి అనుకున్న భగవద్గీత నేర్చేసుకోడం మొదలు పెట్టేస....!! ఇంకా దగ్గరుండి ఒక బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి,మా అన్నయ్య పెళ్లి జరిపించా..!! :)
జీవితం లో ఎప్పటికి నేను భరించలేను అని అనుకున్నవి..భరించాల్సి వచ్చింది..!! అంటే నా పై నాకున్న నమ్మకం..,ఇష్టం..,ప్రేమ మరింత పెరిగాయి..!! :)
ధైర్యం,సహనం కూడా ..!!..నన్ను నేను నమ్మ లేదు కొన్ని రోజులు…!! అంటే మనిషి గా నేను ఎదిగాను అనే కదా..!! :D అంటే ఇక్కడ మీకు కొన్ని డౌట్ లు రావచ్చు..… మరి ఈ ఇయర్ లో ఏమి అనుకోవా..!!??...ఎదిగావ్ అని ఊరుకుంటావా అని..?? అల...ఎలా..??అన్ని direction ల లోను ఎదగాలి కదా.. :P
ఏది అనుకున్న ..అనుకోక పోయిన…ఒక 10 సంవత్సరాల నుండి…ఒకటి అనుకుంటున్నా…లావు కావాలి అని… సో ఈ సారి కూడా అదే నా లిస్టు…లో మొదటి resolution..!! :P అందరి జీవితం లో ను.ఎలాంటి పరిస్థితి వచ్చిన..…

అమ్మమ్మ...ఐ మిస్ యు ...

అమ్మమ్మ..అప్పుడే ఒక సంవత్సరం అయిపోయింది..అమ్మ చెప్పి..అమ్మమ్మకు బాలేదు..అని...

ఆ రోజు నేను నీకు వెంటనే ఫోన్ చేస్తే...తాతయ్య..గొంతు లో నీరసం...

అమ్మమ్మకివ్వండి..అంటే....పడుకుందమ్మ..లేచిన ఎవరితో మాట్లాడట్లేదు...నీరసంగా ఉంది అంటోంది...

ఏంటి..???అమ్మమ్మకు నీరసమా??..కనీసం మాట్లాడలేనంత...:(..

ఎప్పుడు ఇలా లేదే..

తను అందరి లాగా జలుబు కే ఆరు రోజులు రెస్ట్ తీసుకునే టైపు కాదు..

మనోధైర్యానికి...,ఓర్పుకి ప్రతి రూపం మా అమ్మమ్మ..!!

ఎంతో కంగారు వేసింది....వెంటనే నా గొంతు వణికి..నా ఫ్రండ్ కి ఫోన్ చేస్తే..

ఏం కాదు లే పెద్ద వాళ్ళు కదా..ఇవంతా మాములే..అని తను..

నేనేమో..లేదు..మా అమ్మమ్మ అందరి పెద్ద వాళ్ళలా కాదు...అని చెప్పా..

శరీరం చాల పెద్దది...అంతకన్నా active గ ఉంటుంది తను.....అని ఎక్ష్ప్లైన్ చేస్తూ...క్యాలెండర్ చుస్తే..ఆ రోజు అదృష్టం కొద్ది.. thursday..

ఇక friday రేపు అంటే అదొక ఆనందం..అమ్మమ్మని చూసి రావచ్చు అని...కానీ ఇంకో పక్క దిగులు...ఎలా చుడాల్సోస్తుందో..ఎప్పుడ మంచం మీద చూడలేదే అని..

వెళ్ళాను..అమ్మమ్మను చూశాను....నాన్న కిరణు వచ్చావ....ఎంత సేపైంది..అన్నం పెట్టండే..దీనికి....కంగారు లో రాత్రి అన్నం తినిందో లేదో…

అన్నయ్య పెళ్లి..!! :)

మా అన్నయ్య పెళ్లి జరిగింది తెలుసా..!!మొన్న dec 16th ...:)

అన్నయ్య అంటే సొంత అన్నయ్య కాదు...అలా అని ఈ చుట్టమో కాదు...!!

ఒకే కాలేజీ లో చదువుకున్నాం...!!అంతే....!! :)

కాలేజీ ఎం నేర్పించిందో నాకు తెలిదు కానీ....

జీవితానికి సరిపోయేంత ప్రేమ పంచే నలుగురి స్నేహితులని మాత్రం ఇచ్హింది...:D....

ఆ నలుగురిలో ... ఒకడు...ఈ అన్నయ్య...అన్నయ్య..అని అలా తమాషా గ పిలవడం...మొదలు పెట్ట...

అది ఈ రోజుకి..నిజంగా అన్నయ్య ఉన్న అంత importance ఇచ్హే వాడు కాదేమో అని అనిపిస్తుంది...

నేను బాగా నచ్హక పోతే వాళ్ళకి ఏం చెప్పను..అసలు సతాయించను...:P

కానీ వీళ్ళ టైం బాలేక....అతి ఎక్కువగా నచ్చేసి..నాకు సంతోషం వచ్చిన....బాధ వచ్చిన....వీళ్ళనే హింసిస్తూ ఉండేదాన్ని..ఉంటాను...:P

తన పరిచయం అయిపొయింది కదా..!!

పెళ్ళికి...తను షాపింగ్ ఎన్ని రోజుల ముందు చేసాడో నాకు తెలిదు..నేను మాత్రం చేసానండి..ఒక నెల ముందే.. :D...!!

సాయంత్రం 6 ఇంటికి ట్రైన్..ఇక 12 నుండే పని చేయ బుద్ధి కావట్లేదు...

4 కే బయల్దేరిపోయాను.....ట్రైన్ ఎక్కాము...12 మంది...ఒకటే గోల ట్రైన్ దిగే వరకు...

కాలేజీ లో ,బైట కలిసినప్పుడు...మాములుగా కనిపిస్తారు...ఆ పెళ్లి రోజు అదేం కళ వస్తుందో...!!

నేను watch కొనుక్కున్నా .. కదా …!!! :)

ఎన్ని లక్షలు పెట్టి ??అబ్బ ..ఆశ ..అంత కరీదైనదైతే మీకు ఎందుకు చెప్తాను ..కొట్టేస్తారు కదా …. :P
:Pమాములు watch ఏ …మరి ఇన్ని రోజులు watch లేదా నీకు …??లేదు కదా ..:(అప్పుడెప్పుడో ….ఒక watch ఉండేది ..దానికి పైన బోలెడు రంగు రంగుల rings ఉండేవి ..ఏ డ్రెస్ వేసుకేలితే ఆ రంగు పెట్టుకోవచ్చు …అది chain టైపు ….లింక్ లు తీయించి ..తీయించి …అటు ఒక లింక్ ..ఇటు ఒక లింక్ ..మిగిలాయి ….అంత లావు గా ఉండేది నా చెయ్యి మరి …మనిషి ఆశావాది కాబట్టి …కనీసం , ఇటు 3 అటు 3 లింక్ లకు వచ్చే లావు అయ్యాకే ..chain స్ట్రాప్ ఉన్నది కొందాము అని అనుకున్న …So next B.tech చేరాక మా నాన్న ఒక leather strap ఉన్న watch కొనిచ్చారు ..మామూలుగా నేను గమనించిన దాని ప్రకారం 7 చిల్లులు ఉంటాయి.. ..మన లావుకి 10 చిల్లులు ఉండాలి ..ఆ లాస్ట్ పదో చిల్లులో దూరిస్తేనే ..నాకు watch ఉంటుంది ..లేక పోతే చెయ్యి కిందకి అనంగానే నేల మీద ఉంటుంది …భలే ఊహించుకుంటున్నారే ….మీరసలు … :)
ఆ షాప్ అంకుల్ మాకు తెలిసిన ఆయనే …అవ్వడం తో కాస్త చనువు తీస్కోని ..ఏమ్మా ఇలా ఉంటే ఎ…

కార్తీక పౌర్ణమి నాడు శివయ్య ...

Image
నాకు ఈ శివయ్యతో మాట్లాడటం ..పెద్ద అలవాటు లేదండి..

ఎప్పుడు మన తోక సామీ,తొండం సామీ...బాబా తప్ప..

ఎక్కువ శివుడి గుడికి వెళ్ళినట్లు కూడా గుర్తు లేదు..

కానీ ఈ మద్య ఆయనే తెగ పిలుస్తున్నాడు నన్ను... :ప..

ఎం అదృష్టమో ఏమో..ఈ కార్తిక మాసం లో ఎప్పుడు లేనిది ..గుడి కి వెళ్ళాను..

వెళ్ళడమే కాక..దీపాలు వెలిగించాను...

మొన్న అనుకోకుండా..banaglore 100 kms దూరం లో కోటి లింగేశ్వర temple కి వెళ్ళాం..

అక్కడ ఉన్నంత సేపు..ఏమి పెద్ద భక్తి భావం..అల అనిపించలేదు..

కానీ రూం కి వచ్చాక ..ఆ ఫోటో లు చూస్తున్నంత సేపు హ్యాపీ..

ఎందుకబ్బా నేను ఇంత హ్యాపీ అని నన్ను నేను ప్రస్నించుకుంటే సమాధానం దొరికింది.. :)

నాకు ఎప్పుడు దేవుడంటే పెద్ద ..బాగా పెద్ద అని ఒక impression..అలా పెద్ద పెద్ద విగ్రహాలను చుస్తే ఇక పట్టరాని ఆనందం.మరి అంత పెద్ద దేవుణ్ణి చూసేసా కదా.. :)

ఇక ఇంటికొచ్చాక వెన్నెల్లో ఎంత బాగుంటుందో.. కదా ఆ ప్లేస్..వర్షం పడ్తే అద్బుతం కదా అనుకుంటూ ఉఉహించు కునే దాన్ని..

painting వేద్దాం అంటే complete చేయడానికి టైం పడ్తుంది..

రిస్క్ ఎందుకు లే అని..ఉఉర్కే అల photoshop తో ట్రై చేశాను..ఇలా వచ్చింది...

మొత్తం అయ్యాక నాకు నచ్చింది..కాకి పి…

దైవమే నేస్తం ..!!

ఎంతో మందికి ఎన్నో సార్లు దేవుడు నేస్తంగా ఉంటాడు …
ఆయన ఎప్పుడు ఉంటాడు ..కానీ కొన్ని సార్లే మనుషులు చూస్తారు ఆయ్యన్ని అలా .. :)ఈ టాపిక్ picture లో కి ఎందుకు వచ్చింది అంటే … నేను ఒక artist ని కలిసాను ఈ మద్య లో ..ఆయన ఒక బొమ్మ గీసారు ….రాఘవేంద్రస్వామి కృష్ణుని ప్రతిమ చేతిలో పట్టుకుని ఏదో చెప్తున్నట్లు ….దానికి explanation ఇలా చెప్పారు .మనిషి ఎంత సంతోషాన్ని అయిన పక్క మనిషి తో పంచుకోవచ్చమ్మ…కానీ …బాధ మాత్రం దేవుడి తోనే చెప్పుకోవాలి …ఎందుకంటే మనిషి చులకన గా చూస్తాడు ..ఒక సారి వింటాదేమో ….ఆ తర్వాత ..బాబోయ్ .. వీదొస్తున్నాడా ..అని అనుకుంటారు ..అని అన్నారు ..ఇది ఎంత నిజం కదా …అసలు ఈ ప్రపంచం లో good listeners చాలా చాలా తక్కువ నా అనుభవం ప్రకారం …!!..ప్రతి మనిషి తనలో ఉన్నదంతా బైటికి కక్కేయాలి అనే చూస్తాడు …అసలు సందు దొరికితే ..చెప్దామ అన్నట్లు …తప్పు అనట్లేదు …కానీ వినడానికే ఆలోచిస్తాడు.. :)
మనకు కొంత మంది పరిచయమయ్యి . .ఆది మంచి స్నేహంగా మారినప్పుడు …నాతో ఎప్పుడు ఈ నేస్తం ఉంటుంది అనిపించినప్పుడు …చెప్పుకోవ…

కదిలించే సాహిత్యం ...

సాహిత్యం ,కళలు కదిలించేంత గ ..

మన బాధలన్ని మరచి పోయేలా చేసేంతగా ....

ఏవి ప్రభావితం చేయలేవు అని నా ఫీలింగ్ .. :)

ఎంతో అలజడి గ ఉన్న మనసు ...కాస్త నచ్హిన సంగీతాన్ని వింటే ఎంతో హాయి గ ఉంటుంది ..

అలాగే ఒక బొమ్మ అద్బుతంగా పదాలు లేకుండా వర్నించేస్తూ ఉంటె ..అభినందించకుండా ఉండలేం కదా ..

అసలు ఇప్పుడు మిమ్మల్ని కదిలించే ల నేనెందుకు ఈ పోస్ట్ రాస్తునన్ను అంటే ...:p

ఒక నేస్తం ఊసులాడే ఒక జాబిలట అనే నోవెల్ ని పంపించారు ...:)...

చక్కటి స్నేహం మీద పుస్తకం ..

నాకు అల కవితాత్మకంగా రాయడం రాదనో ...టైం కి పదాలు గుర్తు రావణో ..(ఏదో covering..:P)

కొంచం మంచి గ ఉన్న కవితలన్న ...పుస్తకాలన్న ...పదాలన్న ..చాల ఇష్టం ...:)

ఈ రోజు ఆ పుస్తకం చదువుతున్నంత సేపు అందులో లీనమై పోయి ..last లో కన్నీరు కర్చేసి ...ఆహ ...ఎంతో మంచి గ అనిపించింది ...

ఇంత భావోద్వేగం ఒక్క సాహిత్యం వల్ల ,కళల వల్లే కలుగుతుందని నా అభిప్రాయం ..

ఒక్క నిమిషం ..ఇలా ఊహిన్చుకోన్డి ....మీరు రాసిన కోడ్ కానీ ..program ని కానీ పక్క వాడు చూసి ఆనందం తో కానీ ..ఒక ఫీలింగ్ తో కానీ కన్నీరు కారిస్తే

ఎంత funny గ ఉంటుందో .. :)..నేను దీన్ని తల్చుకుని ..ఎన్ని సార్లు నవ్వుకున్నానో ....

దీపావళి ఔర్ దసరా ముచ్చట్లు ..

ఏం లేవండి ... :(.. :P

అన్ని ఆఫీసు ముచ్చట్లే ...

pls..pls..వెళ్ళిపోకండి ..రీడండి ... :)

అసలు ...ఇది వరకు నాకు ఉన్న doubts అంత ఇప్పుడు తీరిపోతున్నాయి ...

ఏంటా ఆ doubts??

దసరా అప్పుడు మా అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్ళే వాళ్ళం ....

ఇంట్లో బొమ్మల కొలువు ...ఇంటి దగ్గర ఉన్న శంకర మఠం లో రోజు ప్రవచనాలు ..

అమ్మ వారికి రక రకాల అలంకరణలు ....అసలు రెండు కళ్ళు సరిపోయేవి కావు ...

ఎంత ముద్దుగా ఉండేదో అమ్మవారు ఆ అలంకరనలకి ...

ఇంక చుట్టు పక్కల ఉన్న అమ్మవారి గుడి లో కూడా ఇలాగె చేసే వారు ....

కానీ next day...paper లో ఒక పేజి మొత్తం ఆ photo లు ఉండేవి ...!!

వెళ్లి మా అమ్మమ్మను అడిగే దాన్ని ...ఎందుకు అమ్మమ్మ మళ్ళి వీళ్ళు photo లు వేస్తారు .అందరూ గుడికి వెళ్లి చూస్తారు కదా అని ..

మా అమ్మమ్మ very very intellegent..ఒకటే మాట చెప్పింది ..నీకంటే మీ నాన్న cycle కొనిచాడమ్మ ...30 సార్లు కొత్త cycle మోజుతో ..గుడి పేరు చెప్పి వెల్లొస్తూ ఆ దేవి దర్శనం చేస్కోస్తావు ...

నా లాంటి దానికి ఒక 5 నిముషాలు అక్కడ నుంచున్న ....అయ్యూ ..పి…

PG కష్టాలు

మొన్న కబుర్లు చెప్తే బానే విన్నారు గా...ఈ రోజు కష్టాలు కూడా అదే ఉత్సాహం తో వినండి.. :p
భోజనం average ga ఉంటుంది..పెద్ద ఊహించుకోకూడదు..
non-veg అడిగితే...మేము తినడం ఆపేసాము అంటారు..మీరు తినక పోతే ఏంటి..మాకు పెట్టండి అని రివర్స్ లో అడిగే ధైర్యం ఎవరికీ లేదు..ఎందుకంటే మా ఓనర్ ఇక సంస్కృతం లో తిడుతుంది...ఇంట్లోనే మాట పడని వాళ్ళు ఇక్కడ మాట పడటం ఇష్టం లేక నోరు మూస్కోని వెళ్ళిపోతారు...ఆవిడ మాట్లాడే మాటలకి పిచ్చెక్కుతుంది...తెలుగు dictionary కోసం వెతుక్కోవాల్సి వస్తుంది...
వాళ్ళు పెట్టె తిండికి dictionary మోసే ఓపిక ఉండదు..సో డ్రాప్ అన్నమాట..
ఎంత వెరైటీ గ చేస్తారు అంటే..ఒక రోజు గ్రహణం...పొద్దున్న..ఇంత మసాల వేసి పులావ్ చేసారు..అది తిన లేక మధ్యానం తిందాం లే అని ఊర్కున్న..1 కి ప్లేట్ తీస్కొని బైటకి వెళ్ళాను...అప్పుడు అంటున్నారు..ఈ రోజు గ్రహణం కదా..మేము ఏమి వండ లేదు..అని...నాకు మండింది...అదేంటి కనీసం చెప్పాలి కదా అంటే...ఉన్నది PG లో మొత్తం 5 మంది...3 బైటికి వెళ్లారు..ఇంకో ఇద్దరు తినమన్నారు...(వీళ్ళు చెప్పించారు వాళ్ళతో మేము తినమని..)..ఒక టింగరిది ఉంది..దాని లవ్ సక్సెస్ కావాలని ఏమైనా చేస్తుంది..మా ఓనర…

ఒక జీవితం సరిపోయేన?

దీనికి మొత్తం వ్యతిరేకమైన ఆలోచన పొద్దున్నుండి....బుర్ర లో తిరుగుతోంది....ఏంటా??..అసలు మనిషికి ఒక రోజు చాలు కదా....అని...

ఆ మరి..పొదున్న లేచి కాసేపు భగవద్గీత చదివాను...అక్కడ వరకు బాగానే ఉంది...తర్వాత ఆఫీసు లో ఎంత పని ఉందొ...అని చుస్కున్న మెయిల్ ఓపెన్ చేసి....కొత్త పని ఈరొజె దిగింది మెయిల్ బాక్స్..లో..
దాన్ని చూసి విపరీతమైన నీరసం.....ఇక రోజు ఎప్పుడైపోతుందా  అనే బెంగ మొదలయ్యాయి...సరే 9 కే వెళ్తే మరీ...తొందరగా చేసి వచేస్త..నాకు తొందరగా వచ్చి ఈ రోజు ఏమి చేయాలనీ లేదు....ఇది నాకు 2 వారాలకు ఒక సారి....బద్ధకం day the week గ నేను ప్రకటించుకుంట.....అసలు ఏమి చేయను....ఆఫీసు లో అంటే తప్పదు నేను చేయను అంటే..మేము జీతం ఇవ్వము అంటారు...అందుకే...ఇక ఇంట్లో నా సొంత పనులకు టాటా చెప్తా ఆ రోజుకు...అలాగే ఈ రోజు 5 .30 కి పని ఐపాయింది....ఇంకా  కాసేపు  చేద్దాం  అన్న ... మాములుగా అయితే నేను చేసే పనులు అన్ని మైండ్ లో లిస్టు రాసుకుని నడుస్తూ ఉంటా ..ఆఫీసు నుండి ఇంటికి నడిచే లోపు....ఈ రోజు ఏదో టెక్నికల్ ది నేర్చుకుందమంటే...దాని license ఐపోయింది..update చేయాలి..అది week-end చేస్కుంట..అని postpone …

TV..నేను బద్ధ శత్రువులం..

అయ్యో అల చూడకండి...
మీరు ఎలా చూస్తున్నారో నాకు తెల్సు..ఒక వింత జంతువు  ని చూసి నట్లు...ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది చూసేసారు కాబట్టి.....నాకు తెల్సన్నమాట..:P
ఏదో నాకు దానికి పూర్వ జన్మ కక్షలు లేవు..కానీ మనుషుల వల్ల దూరం అయ్యాను..
అవునండి చిన్నప్పుడేమో...నేను ఒక ఛానల్ లో tom n jerry చూస్తుంటే ..మా తమ్ముడు వచ్చి...హి-మాన్ లు..సూపర్ మాన్ లు పెట్టమనే వాడు..
కాస్త పెద్దయ్యాక...నేను సినిమాలు చూడడం మొదలు పెట్టాక..మీడియా కూడా పెరిగి...2 ,3 తెలుగు ఛానల్ లు వచ్చేవి   ..నేను ఒక ఛానల్ చూస్తుంటే వాడు ఇంకోటి కావాలి అనే వాడు..అప్పట్లో..ఇద్దరం..జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకునే వాళ్ళం...నా జుట్టు పొడుగు ఉండటం తో....దూరంగా  ఉండి..జడ  లాగి..ఆ radius maintain చేస్తూ తిప్పుతూ కాళ్ళతో తన్నే వాడు... మనకి ముందే hieght ప్రాబ్లం..గట్టిగ అరవడం తప్ప ఏమి వచ్చేది  కాదు..నా అరుపు తో అమ్మ వచ్చి ఇద్దరినీ చితక బాది...పెద్ద దానివి కదా..వాడిని చుడానిస్తే ఎం పోతుంది..ఐనా ఆడ పిల్లవి...పనులు నేర్చుకుందువు ర..అని లాక్కొని వెళ్ళేది...అమ్మ తోమిన గిన్నెలు అన్ని గూట్లో పెట్టడం.. ఇంకా చిన్న చిన్న పనులు అన్ని పెద్ద సైజు లో చేయించ…

దిక్కు తోచని అయోమయం ..!!

ఒక  నిమిషం  ఆనందం .. ఇంకో  క్షణం  పట్టరాని  దుఃఖం    . ఒక  నిమిషం  ధైర్యం .. ఇంకో  క్షణం  పిరికి  తనం .. ఒక  నిమిషం  దైవత్వం … ఇంకో  క్షణం  రాక్షసత్వం … ఒక  నిమిషం  ఎన  లేని  ప్రేమ …ఇంకో  క్షణం  అంతు  లేని  కోపం .. ద్వేషం … ఒక  నిమిషం  మొత్తం  గమ్యం  కళ్ళ  ముందు ..ఇంకో  క్షణం  దిక్కు  తోచని  అయోమయం ..!!
మీకు  ఎప్పుడు  ఇలా  వెంట  వెంటనే  అనిపించలేద  ??
నాకు  ఈ  మద్య  ఇలా  చాలా  సార్లు  అనిపిస్తోంది ..!!
Life ఏంటో  విచిత్రంగా  ఉంది …mixed feelings….!!
Not that ఇప్పుడు  నేనేదో  పుట్టెడు  దుఃఖం  లో  ఉన్నాను  అని  .. but ఏంటో …
Ma TL చెప్పినట్లు …రోజులు  ,ఏళ్ళు  మనిషికి  పెరిగే  కొద్ది ..లోకం  తెలిసిపోతుంది ….so మనకు  ఎం  కావాలి  అనేది  perfect గా తెల్సి  పోతుంది … అందుకే  పక్క  వాడు  నచ్చాలి    అంటే  యుగాలు  పడ్తుంది …అదే  చిన్న  తనం  లో  అయితే  ఎవరినైనా  ఇష్ట  పడతాం  తొందరగా  అంటుంది .. :D… అందుకే  లేట్  అయ్యే  కొద్ది …పెళ్ళిళ్ళు  కుదరడం  కష్టం  ..అని  కూడా  అంటుంది ….జీవిత  సత్యం  చెప్పేసింది  కదా .. :D…
మన  కష్టాలతో  పోల్చుకుంటే ..పక్క  వాడి  కష్టాలు  ఒకొక్క  సారి  పెద్ద  గాను ..మరొక  సారి …ఏపాటి…

స్నేహం....

Image
ఇది లేక పోతే ఒక మనిషి లేడు అని నా గట్టి నమ్మకం..

మీకేమో తెలిదు నాకు మాత్రం....చాల నేర్పింది..స్నేహమే..

వాళ్ళు మంచి చేస్తే అల చేయాలి అని..చెడు చేస్తే అల చేయకూడదు అని...ఒక దిక్సూచి ల గ నిల్చున్నారు..

అతి కష్టమైన సమయాలలో నా పక్కన ఉంది కూడా ఎప్పుడు వాళ్ళే...

నేను విసుక్కున్న..మల్లి తిరగి కాల్ కూడా చేస్తారు..ఎంత మంచి వాళ్ళో కదా...అంటే నేను మంచిదన్నైతే నే కదా..వాళ్ళు అంత మంచి వాళ్ళు అయ్యేది.. :P

ఇక తెల్సిన వాళ్ళు ఇలా ఉంటె...ఈ మద్య...ఈ బ్లాగ్స్ వల్ల బోలెడు మంది పరిచయం..మీరు ఫ్రెండ్స్ ఏ కదా మరి...

సో అందరికి Happy Friendship day…!!

ఒక్క నిమిషం...పైన ఉన్న పిక్ నేనే కష్ట  పడి  ఫోటోషాప్ నేర్చుకుని చేశాను...కాస్త పొగడచు కదా.. :)..
నాకు కవితలు,పాటలు...రావు...మాటలు అసలే రావు..:P అందుకే అల pictorial representation..!!:)

PG కబుర్లు …..

PG అంటే  ?? ఏంటో  కనుక్కోండి  చూద్దాం… అదేంటి  ..చాల  రోజుల  తర్వాత  బ్లాగ్  కి  వస్తే  ..ఇలా  ఎగ్జామ్స్  పెడతావ ….వేల్లిపోతం ………..అంటున్నార ..వద్దు  వద్దు  ..నేనే  చెప్తాను .. :) అబ్బో  కిరణ్  PG చేసి  …దాని  కబుర్లు  కూడా  చెప్పేస్తోంది  అనుకుంటున్నారా ..బయటికి  అనకండి ..నన్ను ..మిమ్మల్నీ  కలిపి  కొడతారు …B.tech చేయడమే  కష్టమైంది ..ఏదో  దేవుడికి  నేనంటే   మరీ  ఇష్టం  కాబట్టి  ఒక  ఉద్యోగం  ఇప్పించేసాడు  ఒక  degree కే ..(అసలు  విషయం  ఏంటంటే  ….దీనికి  ఒక  ఉద్యోగం  ఇప్పిస్తే  ఇక  నా  జోలికి  రాదు ..రోజుకొక  విచిత్రమైన  నైవేద్యం  పెట్టి  పొద్దున్నే  నా  tongue   taste   ని     బాడ్  చెయ్యదు  …అని  అనుకోని  ఉంటాడు …) PG అంటే  paying guest…మొన్నీ  మద్య  మా  చిన్న  తాతయ్య  INDIA కి  వచినపుడు  PG అంటే  post graduation అనుకున్నారట …Bangalore   మహా  నగరం  లో  ఎక్కడ  చుసిన  PG పోస్టర్  లు  ఉంటె  PG కి  కూడా  tuitions ఏంటి  మరీ  విడ్డురం  కాక  పోతే  అనుకుని  ,ఇంటికి  రాంగానే  డౌట్   clarify   చేస్కొని  ఆశ్చర్య  చకితులయ్యరట .. :) మీరు  కూడా  అలాగే  ఆశ్చర్యానికి  లోను  అవ్వాలి  అంటే  ఈ …

Blogs i like…

I love blogging as i mentioned in thispost....and promised that will give you all the blogs which will be helpful,informative and entertaining.....and i categorized it ,so that people can easily go to their interesting subject and read the blogs... :) ఇక మనం తెలుగు లో మాట్లాడుకుందాం.. ఎన్నో మంచి బ్లాగ్ లు ఉన్నాయి... అన్ని రంగాల లోను....నాకు నచినవి నేను ఫాలో అవుతూ ఉంటాను... అన్ని ఒకే చోట ఉంచితే మీకు,నాకు ఇద్దరికి వీలుగా ఉంటుందని.... ఇలాNOV పోస్ట్ చేస్తున్న.. ఇక ముందు కూడా కొత్తవి తెలిస్తే ఇక్కడే ఆడ్ చేస్తాను... నా ఒంటరి తనం పోగొట్టిన మీ అందరికి నా కృతజ్ఞతలు... ఎంతో encourage చేస్తూ....సలహాలు..సూచనలు ఇస్తున్న మీ అందరికి ధన్య వాదాలు.. :)

Arts and crafts

Daily Painting from Texas Contemporary Fine Artist Laurie PaceLeaping into the world of the Starving ArtistMy ImpressionsAgrufus's BlogAnimal Art AdventuresArt and Craft Workbest water color paintings from zenarts paintingsBlack on Grey on WhiteBRUSH - PAPER - WATERCalligraphy | Art | Drawing | Painting | My Experiments | Reshmi Nair On ArtC…

భక్తి-భక్తుడు-భగవంతుడు

ఈ రోజు భక్తి యోగం సారంశం చెపుతూ...చేసిన ప్రతి పనిని కృష్ణుడికి అర్పించాగలవా? అని అడిగారు మా గురువు... చాలా కష్టం అని చెప్పాను.. నేను ఇంత వరకు అల ఎప్పుడు చేయలేదు..చేయ లేక పోతున్నాను..అని  చెప్పాను... బాబా పారాయణం లో  కూడా బాబా ప్రతి పని ముందు ..చేసేటపుడు...నన్ను తలచుకో అని చెప్తాడు..
కానీ చేయలేను...చేయక పోవడమే కదా...అసలు ఆయనని...మాములుగా రోజుకు ఒక్క సారి కూడా తల్చుకోడానికి బద్ధకిస్తాను... అప్పుడు ఎంతో guilty గా ఉంటుంది అని చెప్పాను ... దానికిచిన్నకథ చెప్పారు....
కృష్ణుణ్ణి ఒక సారి నీకు అత్యంత ప్రియమైన భక్తుడు ఎవరు అని అడిగారంట...  అప్పుడు కృష్ణుడు ఒక ఊరిలొ ని పేద రైతు ని చూపించాడు ట     ..  అది అక్కడ ఉన్న వాళ్ళకి నచలేదు...అందుకే కృష్ణుడు నారదుణ్ణి పిలిచి ఒక చిన్న గిన్న లో నూనె ని అటు చివరినుండి..ఇటు చివరికి ఒక చుక్క కూడా కింద పడేయకుండా...తీస్కెళ్ళ గలవా ? అని అడిగాడుట ...ఓ..అని తీసుకు వెళ్ళాడు ఒక్క చుక్క కూడా పడేయకుండా....అప్పుడు కృష్ణుడు..నువ్వు ఆ గిన్నె నిమోస్తున్నంతసేపు నన్ను ఎన్ని సార్లు తల్చుకున్నావ్..?అని అడిగాడు...నా ఏకాగ్రత అంత గిన్నె మీదే ఉండి..నీ మీద లేకపాయింది అన్నాడు నారదుడు.... అప్పు…

భగవద్గీత ...

అసలు దీని మీద నాకు ఎందుకుఅంత  ఇష్టం ఏర్పడిందో...ఎప్పుడు ఏర్పడిందో తెలీదు ... మే be నేను సాయి పారాయణం ఎక్కువ చేసే దాన్ని.. అందులో బాబా అందరికి రామాయణం కానీ,భగవద్గీత కానీ,విష్ణు సహస్త్రనామం కానీ ,భాగవతం కానీ చదవమని చెప్పే వారు... భగవద్గీత మా బామ్మా చదువుతూ ఉండేది... అన్ని కలిపి అసలు దాన్ని కంటస్థం చేయక పోయిన ..అసలు ఏముంది అందులో అనే కుతూహలం కూడా పెరిగింది.. ఘంటసాల భగవద్గీత వినడం స్టార్ట్ చేశాను..అది mostly  2 years నుండి regular గా వింటాను  ... ఈ మధ్యే సీత నాకు గీత మకరందం గిఫ్ట్ గా ఇప్పించింది సత్య గారి తో...అది ఒక memorable day..!! అదే అద్బుతం అనుకుంటే నా అదృష్టం ఎక్కువ అయ్యి....వాళ్ల  టీచర్ కుంద మిస్ దగ్గరికి వెళ్లి....ఆవిడ చేతుల మీదగా మళ్ళి ఇంకో సారిఅందుకొని.. 12 వ అధ్యాయం లోని కొన్ని శ్లోకాల అర్థాలు చెప్పారు... నాకు ముందే చాలా ఇష్టం..అల పెద్ద వాళ్లఆశీర్వాదాలుఅందుకోవడం... బాబా పారాయణం లో ఆయన ఇలాంటి గ్రంధాలని స్పృశించి ఇస్తూ ఉంటారు... ఎందుకో ఆ ఫీలింగ్కలిగింది... ఇక అది తెచుకున్ననే కానీ ఎప్పుడైనా ఆఫీసు లేని రోజుల్లో గట్టిగ introduction చదవగలిగాను... నాకు ముందే శ్లోకాలు చదవాలంటే భయం  ....తప్పులు  ప…

గాలి వాన లో ..వాన నీటిలో ….

పడవ ప్రయాణం కాదండీ …

Bangalore జీవన విధానం …

ఇక్కడ ఉండే ఎవరిని అడిగిన తప్పక చెప్తారు …!! నేను అన్నది 200% correct అని …!!

ఎండా కాలం లో కూడా వర్షాలు పడతాయి …..ఇది విన్న మా చుట్టాలు మాకు కాస్త పంపవే వాటిని అంటారు …

నేను ..అయితే okkk..ఇవాళ్ళ 4 can లు పట్టి ఉంచుత ఇక్కడికి వచ్చి తీసుకేల్లిపొండి అని చెప్తాను …:P

నా జవాబు విపరీతంగా నచ్హి ….నన్ను పొగడలేక ..ఇక మాటలు పొడిగించా లేక phone పెట్టేస్తారు

వాళ్ళు ఒక రకంగా బాధ పడతు ఉంటె నేను ఈ కింది రకంగా ఫీల్ అవుతూ ఉంటాను..

ఎప్పుడైతే తెల్ల డ్రెస్ వేసుకొని ..heal లేకుండా చెప్పులు వేసుకున్దమనుకుంతనో ….అప్పుడు time 8:30….మంచి ఎండగా ఉంటుంది …heal లేని అని ఎందుకు అన్నాను అంటే అవి వేసుకుంటే అచ్చం నేల మీద నడిచినట్లే ఉంటుంది 
 తెల్ల డ్రెస్ వేసుకొని ….heal లేని చెప్పులు వేసుకొని ..బైటికి అడుగు పెడతాను ….అప్పుడు టైం 8:45

అప్పుడే వరున దేవుడు పైనుండి చూస్తాడు …పాపం ఎవరూ తోడు లేకుండా వెళ్తోంది..నేను వెళ్దాం దీనికి తోడు అనే అద్బుతమైన ఆలోచన ఆయనకు వస్తుంది..
మా సందు చివరకు వెళ్ళగానే మబ్బులు స్టా…

వెర్రి మనసు

ఎంతైన చిన్నప్పటి కల్మషం లేని మనసు మల్లి మనిషి జీవితం లో పొందలేడేమో కదా...
ఎంతో అమాయకం,.. మంచితనం...
అబద్దాలు ఉండవు...అపార్థాలు ఉండవు...
స్వార్థం అసలే ఉండదు ...
పక్క వాడు తప్పు చేసిన...గాయ పరచినా కూడా తెలియని తనం..
అబ్బా !!! మల్లి ఆ రోజులు వస్తే ఎంత బాగుండో కదా....
ఈ లోకం తెలిసిన మనసుకి ఎన్ని రకాలుగా నచ్చ చెప్పిన మాట వినదు ....
మొండికేస్తుంది..
ఎంత చెట్టుకి అంత గాలే....ఎవరి రేంజ్ లో వాళ్ళు తప్పులు చెస్తూ ఉంటారు.....బాధపడుతూ ఉంటారు.....
ఈ ప్రాసెస్ లో పక్క వాళ్ళని hurt చేయాల్సి వస్తుంది అని చెప్పాను...
ఊహు కాదు...వారికీ ఇలాంటిదే జరిగితే ఉర్కుంటారా ?...అవునే ఊరుకుంటారు ..వాళ్ళు కూడా ఏమి చేయలేరు...అని చెప్పాను..వాళ్ళు ఇంకొకరి వళ్ళ బాధ పడ్తు ఉంటారు ..ఇదంతా ఒక పెద్ద నాటకం ..దేవుడు స్క్రిప్ట్ రాసాడు..మనకి అర్థం కాదు అన్నాను...
ఆహా...అల ఏమి కాదు..
అన్నింటిని అర్థం చేసుకునే మెదడు అందరికి ఇచ్చాడు...ఎప్పుడు నువ్వే ఎందుకు అర్థం చేసుకోవాలి??..
అబ్బా ..అలాగే వాళ్ళు అనుకుంటూ ఉంటారే మానసా అని చెప్పను...
ఏమో అనింది...
సరే పోనీ నిన్ను గాయ పరచిన వారు లేక... వచ్చి నిన్ను క్షమాపణ అడిగితే చాల?? అని అడిగా…