ఈ రోజు భక్తి యోగం సారంశం చెపుతూ...చేసిన ప్రతి పనిని కృష్ణుడికి అర్పించాగలవా? అని అడిగారు మా గురువు...
చాలా కష్టం అని చెప్పాను..
నేను ఇంత వరకు అల ఎప్పుడు చేయలేదు..చేయ లేక పోతున్నాను..అని చెప్పాను...
బాబా పారాయణం లో కూడా బాబా ప్రతి పని ముందు ..చేసేటపుడు...నన్ను తలచుకో అని చెప్తాడు..
కానీ చేయలేను...చేయక పోవడమే కదా...అసలు ఆయనని...మాములుగా రోజుకు ఒక్క సారి కూడా తల్చుకోడానికి బద్ధకిస్తాను...
అప్పుడు ఎంతో guilty గా ఉంటుంది అని చెప్పాను ...
దానికి చిన్న కథ చెప్పారు....
కృష్ణుణ్ణి ఒక సారి నీకు అత్యంత ప్రియమైన భక్తుడు ఎవరు అని అడిగారంట...
అప్పుడు కృష్ణుడు ఒక ఊరిలొ ని పేద రైతు ని చూపించాడు ట ..
అది అక్కడ ఉన్న వాళ్ళకి నచలేదు...అందుకే కృష్ణుడు నారదుణ్ణి పిలిచి ఒక చిన్న గిన్న లో నూనె ని అటు చివరినుండి..ఇటు చివరికి ఒక చుక్క కూడా కింద పడేయకుండా...తీస్కెళ్ళ గలవా ? అని అడిగాడుట ...ఓ..అని తీసుకు వెళ్ళాడు ఒక్క చుక్క కూడా పడేయకుండా....అప్పుడు కృష్ణుడు..నువ్వు ఆ గిన్నె ని మోస్తున్నంత సేపు నన్ను ఎన్ని సార్లు తల్చుకున్నావ్..?అని అడిగాడు...నా ఏకాగ్రత అంత గిన్నె మీదే ఉండి..నీ మీద లేకపాయింది అన్నాడు నారదుడు....
అప్పుడు కృష్ణుడు...ఇంత చిన్న దానికే నువ్వు నన్ను మరచావే..మరి అంత పెద్ద సంసార భారాన్ని మోస్తూ కూడా నన్ను రోజుకు ఒక్క సారైనా తల్చుకుంటాడు....
అందుకే నాకు అంతనంటే ఇష్టం అన్నాడుట..!!
సో బాబా కూడా నువ్వు...నీ హెల్త్ ప్రొబ్లెంస్,ఆఫీసు ప్రొబ్లెంస్ అన్ని భరిస్తూ కూడా ఆయన్ను తల్చుకుంటున్నందుకు హ్యాపీ గా ఫీల్ అవతాడు లే అన్నారు...మా గురువు.. :D
బాగుంది కదా కథ...!!
నాకు ముందే మంచి విషయాలు గుర్తు పెట్టుకునే మెమరీ తక్కువ..
మరచిపోతానని...ఇలా నా లాగా దేవుణ్ణి తలచుకోకుండా బాధ పడే బద్ధకస్తులకి... :P ఈ కథ కాస్త ఊరటనిస్తుందని..ఇక్కడ పెడ్తున్న... :)
7 comments:
:-)
jeevitamlo anni undi kooda.. vaatini vadilesi velladam sanyaasam ata! adi annitikante kashtamata! anduke siddharthudu buddhudu ayyadata!
చాలా చాలా సంతోషం
కొత్త విషయాలను నేర్చుకుంటూ భగవద్ సేవలో నిమగ్నమై ఆత్మ తృప్తిని పొందుతున్నారు అభినందనలు!
యుంజ న్నేవం సదాత్మానం యోగీ విగత కల్మషః
సుఖేన బ్రహ్మ సంస్పర్స మత్యంతం సుఖ మశ్నుతే
ఈ విధంగా ఆత్మనిగ్రహం గల యోగి అన్ని వేళలలో యోగాబ్యాసం లో నిమగ్నుడై సర్వ భౌతిక కాలుశ్యాలనుంచి విముక్తుడవుతాడు. అతడు భగవంతుని ప్రేమ యుక్తమైన దివ్యసేవ లో సంపూర్ణ సౌఖ్యం అనుభవిస్తాడు(భగవద్గీత 6.28)
బాగుంది కదా కథ...!!
చాలా బావుంది :)
ఈ పోస్ట్ కోసం నాకు తెలిసిన ఒక కధ రాయాలని ఉంది
రాసిన వెంటనే మీ కామెంట్ బాక్స్ లో టైపు చేస్తాను
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
శ్రవణం కీర్తనం చెయ్యవలిసిందిగా నా చిరు ప్రార్ధన :)
@krsna - :)
@seetha - hmnnn..!!
@hare krishna - emo andi antha pedda pedda vishayalu teliyav kani oka mnchi sangathi vaipu na dristi mallinanduku happy....anthe..
and sure adi chadavadam modalu peddthanu...
mee katha kosam waiting..
and more over thanks andi...meeru regular ga comments pedthunnanduku..
ee post chusesa!
nice
Post a Comment