20 February 2011

కిరణ్'s డైరీ

డైరీ మీలో ఎంత మంది రాస్తారు ...ఒక సారి చేతులు పైకెత్తండి....నేను ఇది వరకు ఇలా అనగానే..రెండు చేతులు ఎత్తేసేదాన్ని...:).ఇప్పుడు అసలు డైరీ ముట్టను..దీని వెనకాల బోలెడు కథలు...అవి చెప్పుకునే ముందు అసలు డైరీ ఎందుకు గుర్తొచ్చిందో చెప్తాను..మొన్న ఒక అద్బుతమైన సినిమా TV లో చూసాను అన్నమాట.... జెమిని TV వాడు 3 రోజుల నుండి ఈ శుక్రవారం రాత్రి కావ్య 's డైరీ అని చెప్తుంటే ఆవేశపడి అందరం కూర్చున్నాం TV ముందు ఆ శుక్రవారం రాత్రి..:) సినిమా మొదలయింది...మొదటి ముప్పావు గంట బానే ఉంది...తర్వాత ఛార్మి పిచ్చి తనం బైటపడ్తుంది.నాకు కథలో మలుపులు నచ్చవు..అందులోన భయంకరమైన భయం పుట్టించే మలుపులు అంటే సలే నచ్చవు..:( సినిమా చూసినంత సేపు ఎప్పుడయిపోతుందా అని కష్టపడి చూసాను !!అయిపోగానే ...మన డైరీ నే బాగుంటుంది కదా అనిపించింది.అప్పుడు మీకు నా డైరీ గురించి చెప్దాం అని ఇటు వచ్చాను..:)

రోజు దినచర్య రాసుకుంటే మంచిది.ఈ రోజు ఏం చేసావో..రేపు ఏం చెయ్యాలనుకుంటున్నావో..ఒక చోట రాసుకుంటే..ఒక పద్ధతి, క్రమశిక్షణ స్తాయి మనిషికి...ఇవి మా ప్రిన్సిపాల్ చెప్పిన మాటలు.ఇంటికి వెళ్లి పుస్తకాల సంచి పడేసి అమ్మా....నాన్న దగ్గర డైరీలు ఉన్నాయి కదా ఇవ్వు అన్నాను.
అమ్మ : ఎందుకు?? ముందు వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కుని రా,బట్టలు మార్చు,మొహం కడిగి,అక్కడ పెట్టిన పాలు తాగు..
నేను:అబ్బ చేస్తాలే అమ్మ please వెతికి ఇవ్వవా ఇప్పుడే
అమ్మ : ఎందుకు???ఏమైంది నీకు??
నేను : సార్ రోజు డైరీ రాయడం అలవాటు చేస్కొండి అని చెప్పారు..
అమ్మ : అబ్బా ..సరేలే ..రాత్రి రాస్కుంటారు పడుకునే ముందు..ఇప్పుడు కాదు ...
నేను : సరే రాత్రి లోపల నాకు ఇవ్వు అని అంటుండగా తమ్ముడు గాడు వచ్చేసాడు ..ఏంటమ్మా అక్కయ్య కి ఇస్తున్నావ్ ...నాకు ఇవ్వట్లేదు??
అమ్మ : నా ప్రాణాలు నాయనా..నా ప్రాణాలు చంపేస్తున్నర్రా ..ఇద్దరు వెళ్లి కాసేపు TV చూడండి వస్తా ....

మేము బుద్ధిగా టీవీ చూస్తున్నాము..ఇంతలో నాన్న వచ్చారు.రాత్రి అయ్యింది.నేను మర్చిపోయ అనుకుంది అమ్మ ..మొదలెట్టా మళ్ళి డైరీ అని .అబ్బ ఏదో ఒక పాత డైరీ దాని మొహాన పడేయండి అంది కోపంగా .నాన్న ఇచ్చారు.నాకు సంవత్సరం డైరీ నే కావాలి.అంటే లేదు పైన తేది రాసుకో మీ పుస్తకాల్లో రాస్కున్నట్లు అని ఒకటి పడేసారు :) ఇక నాన్న పక్కన కూర్చుని నాన్న....నాన్న..ఏం రాయాలి నాన్న డైరీ అంటే??అని అడుగుతుంటే...మా నాన్న అమ్మ వైపు చూస్తూ ఆవలిస్తున్నారు.ఆయనకి పాపం నిద్ర వచ్చేస్తోంది నేనేమో సతాయిస్తున్న:P అప్పుడు అమ్మ వచ్చి పక్క గదిలోకి తీస్కెళ్ళి పొద్దున్న నుండి ఏం చేసావో ...నీకు ఏమైనా ముఖ్యం అనిపిస్తే అవన్నీ రాసుకోవచ్చు అనింది .అప్పటికి మనం ఆరవ తరగతి చదువుతున్నాం.ఆ డైరీ బాగా రాసేసాం.పదవ తరగతి కి వచ్హాక ఏదో పాత పుస్తకాలూ సర్దుతూ ఉంటె డైరీ కనిపించింద.పక్కనే తమ్ముడి డైరీ కూడా వుంది ..వాడెప్పుడు రాస్కున్నాడో నాకు తెలీదు.ఇంట్లో ఎవరు లేరు..ఇక నేను ఒకొక్క వాక్యం చదివి దొర్లి దొర్లి నవ్వుతున్నా ..... :D

నా డైరీ లో ఇలా రాసుంది ...

పైన కుడి పక్కన - రోజు తేది.మధ్య లో om sairam.కింద I woke UP early in the morning at 6:30.i brushed ,took bath.went to school.1st period - english,2nd period - telugu then break ,in break bhavani took my pencil and she did not return.3rd period - science ,4th period - social.in lunch - we played color color what color..girls lost..boys won..tomorrow we will try to win.After lunch 5th period - mental mathematics (అప్పట్లో మాకు subject ఉండేది ),6th period - general knowledge,7th period - games .Then i came home అండ్ did home work and slept at 8:30....
ఇలా ఇంచు మించు అన్ని రోజులు ఇంతే....మొత్తం చేసిందేమీ లేదు :D .ఇక మా తమ్ముడి గాడి డైరీ చూస .వాడు ఎంతయినా అబ్బాయి కదా ..ఏం పద్దతులు లేవు ...సరా సరి విషయానికి కి వచ్చేసాడు:)
got up in the morning..went to school...my maths teacher beat me...he is stupid.in the evening,went to tuition,there my sir scolded me.. he is also idiot...
పాపం వాడికి లెక్కలతో సమస్య ఉండేది అందుకే అలా అన్ని చోట్ల తన్నులు తింటూ ఉండే వాడు.ఆలా వాడి కష్టాలు వాడు రాస్కున్నాడు.మా అమ్మ దగ్గర టీచర్ లను తిడ్తే..ఇక అంతే...బైట తిన్న తన్నులే కాక ఇంట్లో వాటా కూడా పడ్తుంది..అందుకే వాడి మనోభావాలు అన్ని ఆ డైరీ తో పంచుకున్నాడు..:)

ఇక ఇంటికి రాంగానే ఆ డైరీ లు అమ్మకు తమ్ముడికి చూపించి పగల బడి నవ్వుతుంటే కాసేపు వాళ్ళు నవ్వారు.తమ్ముడు అంతలో నా పుస్తకాలు పెట్టుకునే గూటి దగ్గరికి వెళ్లి ఒక చిన్న డైరీ తీస్కోచ్చాడు ఏంటే ఇది??ఒక్క ముక్క అర్థం కావట్లేదు అని!!అది అప్పటికి రాసుకుంటున్న డైరీ..నా డైరీ ఎలా ముడతావ్ రా నువ్వసలు??? అని కోప్పడుతుంటే ..నీ బొంద అసలు అందులో బాష లో రాస్కున్నావో చెప్పు నువ్వు అని నిలదీసాడు !!తెరచి చూస్తే అప్పుడు వెలిగింది నాకు కూడా .అంతా రహస్య అక్షరాలు..హా మీకు రహస్యం చెప్తాను చూడండి ..a కి @,b కి *,c కి &..ఇలా z వరకు ఏవేవో ఉన్న గుర్తులన్ని వెతికేసి పెట్టేదాన్ని .అప్పట్లో డైరీ అంటే english లోనే రాయాలి అనే ఒక అపోహ ఉండేది.కాబట్టి వచ్చీ రాని english ని ఖూని చేస్తూ అలా రహస్యంగా రాస్కునే దాన్ని :P నేనే రహస్య గుర్తులు మరచిపోతానని డైరీ చివరి పేజి లో రాసిపెట్టుకున్నా ఏ అక్షరానికి ఏ గుర్తో :D .వాడికి అది కనిపించి ఇక పండగ చేస్కున్నాడు.మొత్తం చదివి ..చీ నా టైం అంత వృధా చేసావ్ నేను టైం లో he-man super man చూస్కునే వాణ్ణి అని తిట్టాడు :P.ఇంతకి ఏముంది రా అని అమ్మ అడిగింది.ఏం లేదమ్మా సోది.in 1st unit test divya got 1st rank..i got second.,this time i will get it..in maths vikram got 25 and kartheek got 25 ..i got only 23...:(
అమ్మ అమ్మాయిలు మారరా??అబ్బాయిలకు 2 మార్కులు కూడా ఎక్కువ రాకూడదు.ఎందుకమ్మా చచ్చి పోతారు??నా లాంటి వాళ్ళు ఎంత మంది నీ కూతురి లాంటి అమ్మాయిల కోసం 15 లు 16 లు తెచ్చుకుని త్యాగం చేస్తున్నాం అని అన్నాడు.మా అమ్మ ఒక్క నిమిషం నవ్వి ఈ సారి నీకు 25 రాలేదో maths లో చితక్కొడత అంది ..వాడు ఇక అక్కడి నుండి అదృశ్యం!! :D

తర్వాత ఇంటర్ లో బామ్మ దగ్గరున్నప్పుడు రాసాను...అప్పుడు తెలుగు లో కూడా డైరీ రాసుకోవచ్చు అని తెలిసింది .అప్పుడు రాసిన కొన్ని మాటలు.

బామ్మ సరిగ్గా జడ వెయ్యట్లేదు.పెద్దమ్మ పెట్టిన అన్నం పూర్తిగా తినడానికి అవ్వట్లేదు అందుకే ఈ రోజు కాలేజీ నుండి వచ్చేటప్పుడు ఒక కుప్పతొట్టి చూసుకున్నపడేయటానికి.దేవుడా నన్ను క్షమించు..పరబ్రహ్మ స్వరూపమైన అన్నం ని పారేస్తున్న!!కానీ నీదే తప్పు.కొంచమే తిండి పట్టే పొట్ట నాకిచ్చావ్ అని దేవుడి మీద తోసేసి శుభ్రంగా డైరీ మూసేసి దాచుకున్న మరుసటి రోజు జెడ వెయ్యమని బామ్మ దగ్గరికి వెళ్తే నాకు రాదు లేవే నువ్వే నేర్చుకో అనింది..మా పెద్దమ్మ అన్నం పెట్టి చేతికిస్తూ ఒక డబ్బాలోనే అన్నం పెట్టానే అంది.విషయం అర్థమయ్యింది.:P

నేను డైరీ ఎప్పుడు రాసుకున్నా దాన్ని న్యూస్ పేపర్ లా అందరు చదివేస్తున్నారని నా చిన్ని మనసు నొచ్చుకుంది.:P.ఇక ఆ తర్వాత నేను ఎప్పుడు రాయలేదు.మళ్ళి B.tech లో చెయ్యి దురద పెట్టి కాస్త మంచి జ్ఞాపకాలు రాస్కుంటూ ఉండే దాన్ని..ఇప్పుడు మొత్తానికే వదిలేసా.అన్ని ఇక్కడ రాసేస్తున్నా :)
ఎంతయినా తెల్లని పుట లో మనకు ఇష్టం వచ్చినట్లు మన దస్తూరి తో రాస్కుంటే భలే ఉంటుంది కదా!!:)(నా దస్తూరి బాగుంటుందని బోలెడు మంది కితాబు ఇచ్చారు లెండి.. :P)

1 February 2011

Life is Beautiful..!!

ఇది ఎంత మంది నిజంగా అర్థం చేస్కొని బతుకుతున్నారు..??ఈ మధ్య నేను విన్న ఒక వార్త కి చాలా shock తిన్నాను … :( :(

Life ని చాలా సులభంగా అల ఎలా తీసేస్కుంటారు ..??పోనీ తీస్కుందామనే ఆలోచన వచ్చిన ..ఆ పై వాడు ఎందుకు ఆపడు ..??

ఒకొక్క సారి ఒక్కో రకంగా దాని ఫలితాలు ఉంటాయి ..ప్రాణాలు తీస్కోవాలి అని ఎక్కడి నుండో దూకెయ్యడమొ ..ఏ విషం తాగడమో ..చేస్తే అది అదృష్టమో …దురదృష్టమో ….వాడు బతికేస్తాడు …కొంతమంది బతకరు …అది మళ్ళి ఎలా రాసి పెట్టుంటే అల జరుగుతుంది .. :(

అసలు అంత తీవ్రమైన నిర్ణయం ఎలా తీస్కోవాలి అనిపిస్తుంది …

నాకు ఒకటి అనిపిస్తుంది ..మనిషి ఎంత మేధావో ..అంతకంటే రెట్టింపు మూర్ఖుడు.. …!!

ఆ చావు కోసం ..చివరి క్షణం లో పడే బాధ ,నొప్పి …ఏదో బతికుండగానే తన సమస్యలని వేరే కోణం లో నుండో …కొంచం పాజిటివ్ గా నో ఆలోచించడానికి కష్ట పడితే …ఆ సమస్య మనల్ని వదిలి వెళ్ళిపోయాక …కొన్ని రోజులు అయ్యాక వెనక్కి తిరిగి చూస్కుంటే ఎంత గర్వంగా ..ఆనందంగా ఉంటుంది …నేను కూడా గొప్పే ..అన్ని భరించాను . .అన్నిటిని అధిగమించగలను …ఇన్ని దాటినా ….నేను ఇంక ఉన్నాను ..ఏదో సాధించాలి అనే తపనతో ..అని ఉండద చెప్పండి ??

మొండి …ఏది కావాలి అనుకుంటే ఆది దక్కాలి అనే మొండి …ఏ …ఎందుకు ఇవ్వాలి ??..నువ్వు అర్హుడివో ..కాదో …ఆ ఇచ్చే వాడికి తెలీదా?? …నువ్వేంటో తెలియని నీకు …నీ గురించి తెలుసుకోడానికే ఒక జీవిత కాలం సరిపోతుంది …..అలాంటి 'నిన్ను' లను కొన్ని కోట్ల మంది ని సృష్టించిన దేవుడు ఏ ఆలోచన లేకుండానే …నిన్ను ఈ భువి లోకి లాగడు కదా …

మనం ఒక చిన్న కథ రాయాలి అంటేనే …దాని లోని ప్రతి అక్షరం ,పదం.. వాక్యం …పాత్ర …మొత్తం అయ్యాకే …ఒకొక్క అంకం విడుదల చేస్తాం ….ఒక పేరా రాయంగానే నచ్చేసి …దాన్ని అందరికి చూపించి …తరువాత నాకు తెలీదు అనలేం కదా …అలాంటిది ఇది జీవితం ..మనకు ఏం ఇస్తే బాగుంటుందో కూడా ఆయనకి తెలుసు కదా …

పోనీ ఇవన్ని పక్కన పెడదాం..…..

ఇంట్లో చిన్నప్పటి నుండి పెంచిన ..అమ్మ ,నాన్న …..కలిసి పెరిగిన తోబుట్టువ్వుల పరిస్థతి ఏంటి?:(.....అసలు వాళ్ళు ఇక బతక గలరా ..???80 ఏళ్ళ ముసలి వాడు ..వెల్లిపోతేనే ….అయ్యో మా తాత ఇంక ఉండాలి అనుకుంటాం …అలాంటిది …తను పెంచుకున్న ..కొడుకో... కూతురో ..నేను వీళ్ళ పై ఆధార పడచ్చు అనుకునే సమయం లో నువ్వు లేవు ఇంక అంటే ఎంత మనో వేదన కి గురవుతారు ..?? నాలుగు సార్లు చూసిన వాళ్ళే ఫలానా మనిషి ..ఇలా చేసాడు అంటే ..అయ్యో ..అవునా …అని మనసంతా వికలం అయిపోతుంది …ఏ పని చేయబుద్ది కాదు …కాసేపు....….అటు వెళ్ళిన …నీకు సంబంధించినవి ఏవి గుర్తొచ్చిన …ఇక నరకమే …అలాంటిది …ఇంట్లో వాళ్ల పరిస్థితి ఏంటి …??

ఆ ఆలోచనే చాలా బలహీనమైన క్షణాల్లో వస్తుంది...అది ఆపడానికి మనం ప్రయత్నించాలి...ఆ మనిషి చుట్టూ ఎవరో ఒకరు ఉండాలి..కొంత మంది చెప్పే వాళ్ళు ఎప్పుడు చెయ్యరు అని అంటారు ..కానీ వాళ్ల బుర్ర లోకి ఆ ఆలోచన దూరడమె తప్పు...ఆ విషయం వాళ్ళకి గుర్తు చెయ్యాలి..కనీసం కొన్ని రోజుల వరకు వాళ్ళని పలకరిస్తునే ఉండాలి...వాళ్ళు మనకు ఎంత ముఖ్యమో చెప్పకనే చెప్పాలి...వాల్లంతకు వాళ్ళు ఆ ఆలోచన నుండి బయట పడాలి..!!మనం వాళ్ల సమస్యల్లోకి దూరి పరిష్కరించక్కర్లేదు..కానీ ఆ మనిషిని కాపాడుకుంటే చాలు..!!ఒక సారి ఆ మనిషి దూరం అయ్యాడంటే ఇక జీవితాంతం మనకు నరకమే..అయ్యో మనమన్న చెప్పాల్సిందే...ముందు రోజే కదా మాట్లాడింది...అప్పుడు ఒక్క సారి అన్న నాకు అనుమానం రాలేదే అనిపిస్తుంది..!!..మనం కాపాడుకోలేకపోయమే అనే బాధ వెంటాడుతూనే ఉంటుంది..

కానీ ఈ మధ్య చాలా చిన్న చిన్న వాటికీ....చస్తాం అనే మాట వస్తోంది...అది చదువుకునే వయస్సు వరకు వచ్చిన ..సరేలే చంచల మనసు అనుకోవచ్చు..కానీ కాస్త జీవితం లో స్థిరపడ్డాక కూడా ..లోకం తెల్సిన తర్వాత కూడా ఇలాంటివి వింటే బాధ అనిపిస్తుంది....అసలు పక్క వాడి గుండెల్లో రైళ్ళు పరిగెత్తుతాయి ఆ మాట విననగానే..ఇంక ఆ మనిషి గురించి వీడికి ఎంత దిగులు..గుబులు...భయం...ఇది కూడా తప్పు కదా...!!...నేను కూడా నాకు జీవితం విలువ తెలియని సమయం లో నేను చస్తా అంటే నా స్నేహితులు..ఎంత భయపడ్డారో ఈ రోజు నాకు తెలుస్తోంది...ఈ రోజు నాకు సిగ్గుగా ఉంది...అసలు ఆ పదం వాడినందుకే..ఎప్పుడో క్షమాపణలు కూడా అడిగేస లెండి వాళ్ళను కానీ..ఇలా ఎంతో మంది ఆలోచిస్తుంటారు...కానీ ఒక మనిషి దూరమైతే కనీసం ఒక 50 మంది జీవితాలు మారుతాయి...నేను చూసిన ప్రకారం..!!


నేను ఈ మధ్యే ఒక సినిమా చూసాను LIfe is beautiful ..అనే ఇంగ్లీష్ మూవీ..అది చూసిన తరువాత అనిపించింది...ప్రతి ఒక్కరు ఆ సినిమా చూడాలి...మన జీవితానికి ఉన్న విలువ తెల్సుకోవాలి అని...!!ఎన్ని రకాలైన కష్టాలైన ఉండచ్చు...మన చుట్టూ..అమ్మ,నాన్న,తోబుట్టువులు..,ప్రాణం ఇచ్చే స్నేహితులు ..అన్నిటిని చూస్తూ నడిపించే ఆ దైవం ఉండగా..మనం దిగులు పడి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడం అనవసరం అనిపిస్తుంది..

నాకు ఒకొక్క సారి ఎంత ఆశ్చర్యం వేస్తుంది అంటే ….ఒక డాక్టర్ నోటి వెంట విన్న నేను …..చాలమ్మా ఈ జీవితం అని …నేను ఒక వారం మాట్లాడ లేదు తనతో …ఎందుకమ్మా అని ఆవిడ ఎంత అడిగారో …నేను ఒకటే చేప్పాను ….ఆంటీ నా లాంటి వాళ్ళు ఆ మాట అంటే చెంప మీద ఒక్కటి ఇచ్చి ..జీవితం విలువ చెప్పాల్సిన మీరు ..అల మాట్లాడితే చాలా బాధ గా అనిపించింది ..అని ….hmnn…ఏమో తల్లీ.. .ఆ క్షణం అంతే అన్నారు …

హా ఆ క్షణికావేశం ఆపుకుంటే ..ముందున్న అద్బుతమైన జీవితం మనదే కదా …!!

ఇంకొక్క చిన్న విషయం..ఈ quote నేను ఒక చోట చదివా...సరిగ్గా గుర్తు లేదు..కానీ దాని అర్థం ఇదే..

"Does it really matter after 5 years".. అని ..నిజమే కదా..ఈ రోజు నీకు అతి ముఖ్యమైనది ఇంకో 5 సంవత్సరాలకి నీకు పెద్దది అనిపించక పోవచ్చు...అసలు నువ్వు దాని గురించి ఆలోచించటానికే ఇష్ట పడకపోవచ్చు ..

ప్రతి దానికి కాస్త సమయం ఇస్తే సర్దుకుంటాయి అని నాకు అనిపిస్తుంది..!!

కష్టాలు ..కన్నీళ్లు ..సంబరాలు …కేరింతఃలు....ఇవి అన్ని ఒక మనిషి జీవితం లో ఉంటేనే కదా ఆది పరిపూర్ణం అవుతుంది ….!! :)


ఫిదా కి ఫిదా

శేఖర్  కమ్ముల గారు బాగున్నారా?? మీకే ??  బానే  ఉంటారు !! .. మా పరిస్థితే  ఏమి బాలేదు.. ఏం చెప్పమంటారు .?? మాది ఒక  సాఫ్ట్వేర్  జంట .. చి ఛ...