Posts

Showing posts from June, 2011

నా బుజ్జి నేస్తం..

Image
నిజంగా ఇది నా బుజ్జే...దీన్ని ఇంట్లో అలాగే పిలుస్తారు..మీరు కుక్క పిల్ల అని తప్పుగా అర్థం చేస్కోకండి ...ఆడపిల్లే..అందమైన తెలివైన ఆడపిల్ల...
ఎక్కడ పరిచయమో అనే కదా మీ సందేహం..
నేను ఏదో సాధిద్దాం అని హైదరాబాదు లో నారాయణ జూనియర్ కాలేజీ లో చేరిన రోజులు...మా బామ్మ దగ్గర ఉండి చదివేదాన్ని..ఇది ఓ పే..ద్ద తెలివైనదని కాలనీ కాలనీ కోడై కుసేవాళ్ళు...నేను మనుషులనే నమ్మను..సో కోళ్ళని లెక్కే చేయను..దాని గొప్పలు వింటూ వింటూ ఉండగానే ఓ రోజూ ఫిజిక్స్ లో newtons laws గట్టి గట్టిగా విన్నాను..ఏమిటి ఈ పిల్ల కలలోకి newton గాని వచ్చి బెదిరించాడా ఏంటి 108 సార్లు నామ జపం చేయమని అని అనుకున్నా...ఇంతలో మా బామ్మ వచ్చి ..చూడు బుజ్జి ఎంత బాగా చదువుకుంటోందో ...నువ్వు అసలు బైటికే చదవవేంటే అంది..చూడు నా పెతాపం చూపిస్తా అని..రామ రామవ్ రామః అని అరిచా కాసేపు...వెంటనే బామ్మ లోపలికొచ్చి..ఇవి నేను చిన్నప్పటి నుండి వింటున్నా..నేను విననివి చదువు అంది..సరే టాన్ తీటా..కాట్ తీటా అన్నాను...హా ఇవి చదువుకో అంది..నాకు కూడా trignometry అంటే చాలా ఇష్టం..ఆ తీటా లు గురువింద గింజల్లాగా కనిపించేవి.. ఆ తర్వాత కాసేపయ్య…

పొగ..

Image
ఏం పొగ ..పొయ్యి నుండి వచ్చే పొగ అనుకునేరు....మనకి చిన్నప్పటి నుండి కూడా చాలా తెలివి ..వంటింటి పక్కకే వెళ్ళకపోతే ఇక ఆ పొగ వల్ల ఏం ఇబ్బందులే లేవు కదా ..

ఇది సిగరెట్టు పొగ ..మా ఇంట్లో ఎవరూ తాగరు ..మా తాతయ్య (అమ్మ వల్ల నాన్న ) తప్ప ...చిన్నప్పుడు అపుడప్పుడు ..సెలవలకు వెళ్ళినప్పుడు అంత తెలిసేది కాదు ..నేను హై స్కూల్ మా అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకున్నా కదా ..అప్పుడు తెలిసొచ్చింది ..బాగా ...ఆయన సిగరెట్టు తాగి ఇంట్లోకి రాంగానే గుప్పు గుప్పు మని వాసన...నోరు తెరచి మాట్లాడుతుంటే ఇక భరించలేం ....తాతయ్య అంటే అందరికి బాగా భయం..ఎవరూ ఒక్క సారి కూడా తాగద్దు అని మాట వరసకు కూడా చెప్పడానికి సాహసం చేయలేదు ..నాకు ఓ రోజు బాగా కడుపులో తిప్పేసి తిన్నదంతా బైటికి వచ్చేసి ..వాటి తో పాటు ఓ రెండు నరాలు కూడా పడి పోయాయేమో గమనించలేదు ....కళ్ళల్లో నీళ్ళు వచ్చేలా డోక్కున్నా ...ఇలా కాదని ..మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాను ..అమ్మమ్మ ..ఎప్పుడూ చెప్పలేదా నువ్వు తాతయ్యకు ఇలా సిగరెట్టు కాల్చద్దు అని ...అమ్మో నేనా ..ల…

కాళ్ళు - జీతం

Image
ఒక రెండు,మూడు నెలలు గా ఎంత పాజిటివ్ గా ఉందాము అన్నా ఏదో ఒక ఎదురు దెబ్బ తగలడం తో విసుగ్గా అనిపిస్తోంది ..!!

కానీ ఒక్క నిమిషం కూర్చుని ఆలోచించా ..ఎందుకు అంత విసుగు చిరాకు ...చాలా విషయాలు ఉన్నా..ప్రస్తుతం అయితే ఉద్యోగం వల్లే కదా!!అన్నన్ని వేలు ఇచ్చే ఉద్యోగం లో ఈ మాత్రం చిరాకులు ఉండటం సర్వ సాధారణం అనుకుంటూ నాకు నేను చెప్పుకున్నా ....మళ్లీ ఒక్క నిమిషం ఇలా అనిపించింది ..డబ్బు తీస్కుని అవసరాలకు వాడుకుంటూ సాఫీ గా సాగి పోయే కెరీర్ కావాలనుకోడం లో స్వార్థం ఉందేమో ..ఎంత మందికి అవసరాలకి డబ్బు లేక ఇబ్బందులు పడ్తున్నారో ..ఇలాంటి పరిస్థితిని నాకు ఇవ్వకుండా చేసినందుకు థాంక్ గాడ్ అండ్ .. మీలో కూడా అందరికి ఉద్యోగాలుంటే count ur blessings..!!

ఆ విసుగ్గా ఉన్న ఉద్యోగం వల్లే వచ్చిన డబ్బులతో mr.perfect సినిమా కి వెళ్ళాను కదా మొన్న..అప్పుడు ఇంటర్వల్ లో ఒక బర బర మని ఇనుప చక్రాల బండి శబ్దం ..ఇక్కడేంటి గోల అని ఒక్క సారి వెనక్కి తిరిగాను ...నేల మీద ఒకతను చిన్న పీట లాంటి దాని కింద చక్రాలు ఉంటాయి కదా…