4 September 2011

భా..బె..పౌ....

తెల్లవారు జామున ఏడుకి కి అలారం మోగుతోంది ..పొద్దున్నే తొమ్మిదింటికల్లా ఆఫీసు కి వెళ్ళాలని ఎవడు కనిపెట్టాడో కానీ అని అనుకుంటూ నిద్రలేచి గబ గబా స్నానం చేసేసి ....గబ గబా టిఫిన్ చేసేసి...గబ గబా జెడ వేసుకుందాం అని ప్రయత్నిస్తుంటే జుత్తు ఒకటే చిక్కు .. నాకు చిరాకు ...ఇలాక్కదని పెద్ద పళ్ళ దువ్వెన తీసి బర బరా రెండు సార్లు దువ్వానో లేదో సగం జుత్తు చేతిలో ఉంది...నా నెత్తి మీద పావు భాగమే ఉంది ..ఇంకో పావు భాగం ఎక్కడ అని కిందకి చూడంగానే వాటి పై నీటి చుక్కలు ..ఏమిటా ఇవి అని చూస్తే నాకు తెలీకుండా జారిన నా కన్నీరు ...అయ్యయ్యో ..ఏడవకండి కళ్ళు ....మీకు ఇది ఈ రోజే చూపించా ..ఇన్ని రోజులు మీకు తెలీకుండా నేను చెత్త బుట్టలో పడేసేదాన్ని అని వాటికి సర్ది చెప్తుంటే భా.బె .పౌ లు గుర్తొచ్చారు ........

వీళ్ళు ఎవరా ...భావి బెంగుళూరు పౌరులు ...

వీళ్ళ కోసం మనమెంతో కష్ట పడ్తున్నాం ....మన ఆరోగ్యాన్ని...మన అందాన్ని ..చివరికి మన జుత్తుని కూడా వీళ్ల కోసం త్యాగం చేస్తున్నాం ....

ఎలా అంటారా ...??

చూడండి ..పొద్దున్నే ఆఫీసు కి బయల్దేరుతారు ....మీరేమో అనవసంగా ..వందలు వందలు పెట్టి క్రీం లు ..పౌడర్ లు ..perfume లు కొనేస్తారు ....అది కూడా జీతం వచ్చిన మొదటి రోజూ అయితే ఒకటి కి రెండు కొంటారు ...కొన్నాము కదా అని ఓ రాసేసి బయల్దేరుతారు...బయటికి వెళ్ళగానే బోలెడు దుమ్ము మీద పడ్తుంది..ముందే మీ వంటి మీద క్రీం లు ఉండటం తో దుమ్ము ఆనందంగా సెటిల్ అయిపోతుంది..దాని వల్ల సాయంత్రానికి మొటిమలు...చుండ్రు..ఇంకా రకరకాల రోగాలు ...అసలు ఇంత మీరెప్పుడైన ఆలోచించారా..?మీకు సమయం లేదనే.. మీ గురించి కూడా నేనే ఆలోచించాను...మీరు కూడా ఇంచు మించు ఇలాంటి కష్టాలే పడ్తుంటారు...చూడండి...కొన్ని సలహాలు..కొన్ని అనుభవాలు..

నేను క్రీం లు గట్రా కొని ఓ ఆరు నెలలు అయ్యింది ...

పైన గమనించండి ...గబా గబా స్నానం చేశా ...టిఫిన్ చేశా ..జడ వేస్కున్నా ..కానీ క్రీం రాయలేదు ..పౌడర్ పూయ లేదు ...perfume కొట్టలేదు ...మరి అలాగే వెళ్ళిపోతావా ..??హా ..ఆఫీసు నుండి బయల్దేరినప్పుడు ఏం ఉండవు ...ఆఫీసు కి వెళ్ళేటప్పటికి ఉంటాయి ...మొదటిగా మా హాస్టల్ బైటికి రాంగానే ....నా ear phones చెవిలో పెట్టేసి ..నడుస్తూ ఉంటా .ఓ పది అడుగులు వేయంగానే బస్స్టాండ్ ఉంటుంది ...కుడి పక్క బస్స్టాండ్ ...ఎడమ పక్కన flyover construction ..ఆ బస్సు డ్రైవర్ ...ఎక్కడినుండో ..సడన్ break లు వేస్తూ ..వేస్తూ ...బస్సు ఆపేటప్పుడు ..పెద్ద మోత చేస్తూ దుమ్ము ఎగిరిస్తూ ఆపుతాడు ...ఆ డ్రైవర్ ని చూస్తే నాకొకటి అనిపిస్తుంది..అతనికి గుర్రపు స్వారి చేయాలనే తీవ్రమైన కోరిక ఉండి..వాళ్ళ నాన్న గారు దానికి అనుమతించకపోతే ..అది చేయలేక ఈ బస్సునే గుర్రం గా భావించి..ఇలా ఆనందిస్తున్నాడేమో అని...దీనితో ఆ దుమ్మంతా వచ్చి నా మొహం మీద ఉంటుంది ఇది మొదటి లయెర్ పౌడర్ ...ఆ తర్వాత ....కొంచెం ముందుకు నడుస్తుంటే లారి వాడు పెద్ద పెద్ద గా horn లు వేస్కుంటూ నన్ను పక్కకు జరగమని చెప్పి ....నన్ను దాటేసి ...ఇంత పొగ మొహం మీద వదిలేసి వెళ్ళిపోతాడు ...ఈ దుమ్ముతో పాటు కాస్త జిడ్డు కూడా ఉంటుంది ..ఇది క్రీం అన్నమాట ...

ఇంకాస్త ముందుకి నడుస్తూ ఉంటా ..అసలైతే చెవిలో పాటలు మోగుతూనే ఉంటాయి. కొన్ని మంచి మంచి lyrics దగ్గర పోయ్య్యి...పోయ్య్యి.. మని పెద్ద శబ్దాలు ..ఉదాహరణకి ఇది తీస్కోండి..రామ చక్కని సీతకి...పోయ్య్యి...ఈ రెండు ఒకే సారి వినిపిస్తాయి...ఆ హార్న్ వేసినోడిని కోపంగా చూస్తే అతను నన్ను ఇంకా కోపంగా చూస్తూ ఉంటాడు ...ఇంతలో మన hieght weight ..అన్నీ గుర్తొచ్చి ...తల దించుకుని పాటే కదా ...బతికుంటే ఇంకో సారి వినచ్చు లే అని వెళ్తూ ఉంటా ..మెయిన్ రోడ్ మీదే పని జరుగుతుండటం తో జనాలు సర్వీసు రోడ్ మీద పడిపోతారు ...ఇక్కడ వన్ వే ఉండదు ...3 వే ఉంటుంది .2 వే అంటే మీకు తెల్సు ..3rd వే ఏంటంటే మనుషుల మీద నుండి వెల్లిపోడం ....అసలు నడిచే వాళ్ళు ఎలా నడుస్తారన్న ఆలోచనే ఉండదు ....ఉన్న కాస్త స్థలం లోను ఆ వాహనాలని మనిషి మీదకి నడిపించేస్తారు..ఆ పక్కనే మూడు రోజులు కిందట పడ్డ వర్షం నీరు ఉంటుంది ..అయినా ఆ నీటి గుంటకి...ఆలా పాత స్టాక్ పెట్టుకోడం ఇష్టం లేక మన వరుణ్ ని అడుగుతుంది ...ప్లీజ్ బాబు ..i need fresh water అని ....దాని మీద జాలి తో బెంగుళూరు లో రోజుకో సారన్నా వర్షం...ఆ గుంట కాక...దాని చుట్టూ మళ్లీ బురద..ఎటు నడవాలో అర్థం కాని పరిస్థతి.. ఎక్కడ బురద ఎగురుతుందో అని భయం ...అసలే మంచి మంచి బట్టలు ....పొద్దున్న అలమరా తీసినప్పుడు ..తెల్ల డ్రెస్ అడుగుతుంది ...నీకు నేనంటే ఎంత ఇష్టమో ..నువ్వు కూడా నాకు అంతే ఇష్టమే ..ప్లీజ్ ఓ సారి వేస్కోవా కిరణు అని ...అమ్మా తెల్ల బంగారం ..ఉంటున్నది బెంగుళూరు లో ...రోడ్ లు చూసావ్ గా ఎలా ఉన్నాయో..నా మీద దుమ్ము పడ్తే నువ్వు ఫీల్ అవ్వవు ..కానీ నీ మీద పడ్తే నేను తట్టుకోలేను ...అని అంటే ..చా ...నిజాలు మాట్లాడు ..నీ మీద బురద పడ్తే నీళ్ళతో కడిగేస్తావు..అదే నా మీద పడ్తే కొన్ని వందలు వదిలేయాలి..అదే కదా నీ బాధ అంటుంది ..అమ్మో పొద్దున్నే ఇది అన్నీ నిజాలు మాట్లాడేస్తోంది అని..దానికి సర్ది చెప్పి ఇంకో డ్రెస్ తీస్తాను ...ఇలా నా డ్రెస్సులతో జరిగిన సంభాషణ ఆలోచిస్తూ.. బురద గుంటని దాటేటప్పుడు ...ఆ గుంట లో నీరు నా పైన ఎగరకుండా ఉంటే ఎవరో ఒకరు నీకు 1116 వేస్తారు బాబా అని దండం పెట్టుకుంటూ దాటేస్తాను ....

నా బాధలో నేనుంటే ...సమంతా చెవిలో వింటున్నావా ..వింటున్నావా అని ఓ దీర్ఘాలు తీసేస్తూ అంటుంది ....ఏంటే వినేది ఇక్కడ చస్తుంటే అని కసురుకునే లోపల వెనక నుండి ఓ బైక్ ..ఓ వాన్ ముందు నుండి ఓ truck హార్న్ లు ...అబ్బో ఈ సమంతా కి కాస్త సహాయ గుణం ఎక్కువే పాపం ..ఆ సినిమా లో తిక్కది అని అందరం తిట్టుకున్నాం కానీ ..చాలా సార్లే కాపాడింది నా ప్రాణాల్ని ..అసలు ఇన్ని అవస్థలు పడి ....మెయిన్ రోడ్ మీదకి వచ్చేటప్పటికి కాళ్ళు విపరీతమైన నొప్పులు వచ్చేస్తాయి...మడమ కూడా కాస్త వంకర పోయుంటుంది ...అక్కడ కుంటి కుంటి .. ఆచి.. తూచి నడిచి ఉంటా కదా ..రోడ్ మీదకి వచ్చాక కూడా అలాగే నడుస్తుంటే ..కుంటి దాన్ని చూసినట్లు చూస్తారు ..అప్పుడు అర్థం అవ్తుంది ..నేను సరిగ్గా నడవాలి అని ...కాళ్ళు సరిగ్గా పెడతాం అని కిందకి చూస్కుంటే ..ఇక ఆ చెప్పులైతే అబ్బో బ్రహ్మండంగా తయారవుతాయి...కొన్ని యుగాలనుండి వాడుతున్నమేమో అని మనకే అనుమానం వస్తుంది. అసలు ఆ construction దాటి కంపెనీ కాంపస్ చేరేలోపల ...నేను రెండు అడుగులు పెరుగుతా ...ఎందుకో చెప్పుకోండి..??చెప్పులకి బురద 2 layer లు ఉంటుందన్నమాట .....అదే చెప్పులతో ఆఫీసు వరకు వెళ్తాను..అక్కడ ఓ బండ ఉంటుంది ...దాని మీద నా చెప్పు కాలు పెట్టి రుద్దుతూ ఉంటే సెక్యూరిటీ వచ్చి మేడం ...మేరు *** ఏరియా కదా అని అడుగుతాడు ....అవును అంటే ...ఓహ్...ముందే చెప్పాలి కదా మేడం అని నన్ను ఓ పక్కకు తీసుకెళ్ళి అక్కడ ఒక పాతిక మంది దాక ఇదే పని చేస్తుంటే వాళ్ళని చూపించి అంతా మీ ఏరియా వాళ్ళే అని అంటాడు...ఇంత మంది నాతో పాటు ఉన్నారా అని ఓ నిమిషం సంబర పడిపోతూ...ఇంతకీ మా ఏరియా వాళ్ళు మాత్రమే ఎందుకిలా అంటే అక్కడ ఓ లారి ఎర్ర మన్ను మాయమయ్యిందంట మేడం అని చెప్తాడు..వెంటనే నేను ఏమి విన్నట్లుగా ఉండిపోతాను..వెంటనే అతన్ని పిలిచి కంపెనీ బైట ఒక కొళాయి పెట్టచ్చు కదా అని అడిగాను..అవును మేడం అది మంచిదే కానీ వాళ్ళకి ఎలా సలహా ఇవ్వాలి అని నన్ను అవిడియా అడిగాడు...చెవి దగ్గర పెట్టమని చెప్పి...ఇలా చెప్పాను...వర్క్ ఇస్ వర్షిప్ అంటారు కదా..మరి మేము పని చేసే చోటు ఓ దేవాలయం కదా..అందరూ ఆఫీసు లోకి వెళ్ళే ముందు కాళ్ళు కడిగి అడుగు పెట్టాలి అనుకుంటున్నారు అని చెప్పండి అన్నాను....ఓ దేవతని చూసినట్లు చూసి మీరు ఇక వెళ్ళండి మేడం అన్నాడు..!!....చివరికి ఆఫీసు పక్కన కూడా construction జరుగుతుండటం తో లోపలికెళ్ళే ముందు ఇంకొంచెం దుమ్ము మొహం మీద పడ్తుంది.. ఇక లోపలి కెళ్ళి వాష్ రూం లో tissue ని తీస్కుని ఇందాక పడ్డ క్రీం ని పౌడర్ ని సమానంగా ఉండేలా తుడుచుకుంటే అప్పుడే పౌడర్ కొట్టిన మొహం లా ఉంటుంది ...AC కార్ లో వచ్చాం అనుకుంటారు అంతా... పాపం మా టీం మేట్ ఏమో పొద్దున్న 6 ఇంటికి లేచి 8.30 వరకు రెడీ అయ్యి ఆ తర్వాత ఆఫీసు కి వస్తుంది..అయినా ఏం లాభం ..హే కిరణ్ please tell me ur secret na..i m using all imported prodcuts but still my face looks oily అని వాపోతుంది ..హహ ..nothing.. i m natural beauty అని కుర్చుంటా ..అసలు నిజాలు చెప్తే ఓ మనిషిగా ఆ అమ్మాయి ఇంకో సారి చూస్తుందని నాకు నమ్మకం లేదు ...అయినా బెంగుళూరు లో ఉంటే బెంగుళూరు products వాడాలి కానీ ఇంపోర్టెడ్ products ఏంటో..గొప్పలు చెప్పుకోటానికి కాకపోతే..:P

ఇక సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఇదే తంతు .....ఓ రోజూ రాత్రి పడుకునేటప్పుడు కాళ్ళు ఒకటే నొప్పులు ..ఏమిటా అని ఆలోచిస్తే చెప్పులు వల్ల ఏమో అని అనుమానం వచ్చింది..మా రూం మేట్ కి కూడా ఇలాంటి అనుమానమే..ఈ రాళ్ళూ రాప్పల్లో..మనం వాడే చెప్పులు కర్రెక్టు కాదనుకుంట కిరణ్ అంది....మరుసటి రోజే షాప్ కి వెళ్ళాం ...కొన్ని చెప్పులు చూసాము ..సౌకర్యంగా ఉండాలి ..చూడటానికి ఎలా ఉన్నా పర్లేదు అన్నాము...కొన్ని చూపించాడు ..అంత నచ్చ లేదు... మాటల మధ్యలో మా ఏరియా పేరు చెప్పాము ..ఓ మీకా మేడం ...మీ ఏరియా కి separate చెప్పులు ఉన్నాయ్ అంటూ తీసాడు ..బాగున్నాయ్ .. నచ్చాయి ..ఆవేశం లో ప్యాక్ దిస్ అన్నాము ....పొద్దున్న విన్న విష్ణు సహస్త్రనామం effect ఏమో ఆ అబ్బాయి విష్ణు మూర్తి లా కనిపించాడు.. కౌంటర్ దగ్గరికెళ్ళాక ఎంత అన్నాం ...1116 మాత్రమే అన్నాడు(బాబా ఆశీర్వాదం అనుకున్నా)...అసలు కౌంటర్ అంటే ఇది అనుకుని ...నోరుమూసుకొని బిల్ కట్టి బైట పడబోతుండగా....బాగా నల్లటి పాదాలకి తెల్లటి చెప్పులు వేస్కుంటూ ఓ కాలు కనిపించింది ...ముదురు కాలు లాగా ఉందే మెట్టెలు లేవేంటి అని తల పైకి ఎత్తి చూస్తే నీగ్రో అమ్మాయి ...నా బ్రెయిన్ నన్ను ఏమని తిట్టిందో తెల్సా ...ఆఫ్రికెన్ కాలికి మెట్టెలు చూసే మోహమూ .. నువ్వూనూ అని ..ssssshhhhh ..మీరు ముందుకి పదండి ..మీరు తిట్టకూడదు ..

మరుసటి రోజు కొత్త చెప్పుల మోజు తో ఓ అరగంట ముందే తయారయ్యి ..రోడ్ మీద పడ్డాక కానీ అర్థం కాలేదు ..నా కో.చే (కొత్త చెప్పులు..ముద్దు పేరు..) కి పళ్ళు ఎత్తు అని ...ఓ కోరికేసాయి .....అరగంట ముందే బయల్దేరినా ..ఎప్పుడూ చేరే సమయానికే ఆఫీసు కి చేరడం ..చేరిన వెంటనే మా TL ఏదో ఒక సోది పని చెప్పడం తో నా చెప్పుల్ని చూసి ఎటాక్ అన్నాను ...సైజు వేరే కిరణ్ లేకపోతే కోరికేద్దుము అన్నాయి ...పాపం వాటిని చూసి జాలేసింది ...కానీ వీటికి నా మీద జాలి లేదు ..సాయంత్రం ఇంటికి వెళ్తున్నపుడు కూడా కోరికేసాయి ....సరే అని వచ్చి విసురుగా ఓ మూల కి వదిలి లోపలి కి వెళ్లి కాళ్ళు కడుక్కోచ్చానో లేదో ...బాత్ రూం బైట చెప్పులు ఉన్నాయ్ ...నీ కాళ్ళయితే కడిగావ్ ..మరి మమ్మల్ని కడుగు అన్నాయి.. కాసేపయ్యాక కడుగుతాలే..you get out out of my sight అంటే ..నీ పని రేపు చెప్తాం అన్నట్లు చూసాయి ..నాకు భయమేసి ...వాటిని వెళ్లి కొళాయి కింద పెట్టాను ..పొద్దున్న వెళ్ళేటప్పుడు ఎంత బాగున్నాం..ఇప్పుడు చూడు ఎలా ఉన్నామో..అని అడిగాయి ..నా కాళ్ళు చూపించి సేం కొస్చేన్ అన్నాను ..అదంతా మాకు తెలీదు ..నువ్వు నివియ క్రీం రాస్తున్నావ్...మాకు కనీసం డవ్ షాంపూ తో స్నానం చేయించు అన్నాయి ..నా ఆర్థిక స్తోమత మొత్తం చెప్పాను ..బోర్ కొడ్తే సరదాగా డిస్నీ ల్యాండ్ కి వెళ్ళలేని ఈ పేద బ్రతుకుని వివరించాను .కానీ అర్థం చేస్కోలేదు ..ఎంతైనా మనిషి కాదు కదా..చెప్పులు కదా ...కానీ కొన్ని రోజులయ్యాక బాగున్నాయి నా కో.చె.

అన్నిటి గురించి చెప్పాను కానీ.perfume గురించి చెప్పలేదు కదా..మీరు surf వాడుతుంటే ఇక perfume అవసరం లేదు..ఎలా అంటారా...ఈ మధ్య సర్ఫులు కూడా రక రకాల flavours వస్తున్నాయ్.....jasmine అంట..lily అంట...ఇలా బోలెడు!!...బట్టలు నానపెట్టేటప్పుడే కక్కుర్తి పడకుండా ఓ గుప్పెడు సర్ఫ్ ఎక్కువ వేశామనుకోండి ..ఇక perfume ఏ అవసరం లేదు..

కొన్నేళ్ళయ్యాక ట్రాఫ్ఫిక్ ఉంటుందా..?దుమ్ము ఉంటుందా..?చక్క గా fly over లు ఉంటాయి..మెట్రో లు ఉంటాయి..చక్కటి రోడ్ లు...ఇవంతా మనం దగ్గరుండి కట్టిస్తున్నాం...ఎన్నో ఎన్నెన్నో త్యాగాలు చేసి....భా.బె.పౌ లు మనకు ఎంతో కృతజ్ఞులుగా ఉండాలి..మనల్ని ఓ ఆదర్శంగా తీస్కోవాలి...మనల్ని తలచుకోవాలి...మనకి ధన్యవాదాలు చెప్పుకోవాలి..వీలైతే మన ఫోటోలు పెట్టుకుని పూజ చేస్కోవాలి..అవునంటారా...కాదంటారా..?

ముందుగా మీరంతా కూడా నాకు ధన్యవాదాలు చెప్పుకోవాలి..మీరు ఆలోచించలేని విషయాలు మీ కోసం కూడా అలోచించినందుకు....చాలా సలహాలు ఇచ్చాను...ఏ రకమైన చెప్పులు వాడాలో బొమ్మ గీసి చూపెట్టాను....అసలు క్రీం లే వాడద్దు అని సలహా ఇచ్చి మీకు కొన్ని వేలు మిగిల్చాను..ఎక్కువ మొహమాట పడనక్కర్లేదు..ఒక్క థాంక్స్ చెప్తే ఏమి అరిగిపోరు..:P

ఓ చిన్న మాట..ఈ construction పని అయ్యే వరకు..మెట్రో పని అయ్యే దాకా..మనందరికీ సెలవలు ప్రకటించాలంట..కావాలంటే వారానికి ఓ సారి work from home చేస్తాం..కానీ జీతం మాత్రం ఒకటో తారీఖున పడిపోవాలి...ఆహా భలే ఐడియా ఇచ్చాను కదా..కిరణు కేక కదా..సూపరు కదా...కత్తి కదా..బంగారం కదా...:) :P

అనన్య చురకలు !

మా పాపా పేరు అనన్య  ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను  దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...