Posts

Showing posts from 2011

హ...హ...హ..

Image
హ..హా....హా....చ్...శుభమా అని కొత్త సంవత్సరం మొదలవుతూ ఉంటే ఆ తుమ్ములేంటి...?? ఆహా ఒక్క సారికే...నాకు రోజూ తుమ్మోదయమే అవుతోంది మరి... కర్రెస్ట్ గా అలారం మోగడం..మా రూం మేట్ హచి హచి మని తుమ్మడం.... ఈ రోజూ ఏ గండం నా ముందుందో అని భయపడుతూ నిద్రలేవడం...ఈ పిల్ల ముక్కు కోసేసి ఆ గూట్లో దాచేయాలి..ఈ చలికాలం అయ్యాక మళ్లీ ఇవ్వాలి...అనుకుంటూ..రామయ్య తండ్రి....ప్లీజ్ హెల్ప్ మీ అనడం...ఆయనేమో బిజీ గా ఉన్నా...గో టు యువర్ కిట్టి అనడం....నేను వెళ్లి..కిట్టే...అని స్టైల్ గా పిలిస్తే....ఆయనేమో ఇస్టైల్ గా చేత్తో బాబా ని చూపించడం....ఈ బాబా ఏమో ఈ మధ్య నన్ను ఎన్ని సార్లు తల్చుకున్నావే..ఇప్పుడు మాత్రం నేను కావాలా..అన్నట్లు చూడటం..సర్వసాధారణమైపోయింది...
"గాడ్..యు ఆర్ basically గుడ్ గాడ్...నా వల్ల కాదు...నేను ఆఫీసు కు పోను...." "సరే మీ ఆంటీ దగ్గరికి పో ..నిన్న రాత్రి కారట్ కూర చేసిన మూకుడు నుండి ......ఈ రోజూ మీ అంకుల్ తాగిన కాఫీ గ్లాస్ వరకు సింకు లో ఉన్నాయి....కడిగేయి..." "నో గాడ్...నో..." "మరి మూసుకుని ఆఫీసు కు పో" "నచ్చట్లేదు..గాడ్ నచ్చట్లేదు.." "నువ్వు ఆ …

శైలు's వెన్నెల్లో గోదావరి...!!

Image
పుస్తకం లో ఇలా కనిపిస్తోంది..బాగుంది కదా :D


ఆహా...ఒహోఒ.......నేను నిన్న 6 .40 -7 గంటల మధ్య గాలిలో తేలుతూ ఉన్నాను..!!
ఎందుకో చెప్పుకోండి...??
వెన్నెల్లో గోదావరి పుస్తకం చేతిలోకి తీస్కున్నా...
మొదట ఏం చూసానో చెప్పుకోండి....ఎలాగో కథ తెలుసు..కవర్ పేజి కూడా తెలుసు...మొత్తం బ్లాగ్ లో చూసేసా..!!
కాని నా painting ఒక బుక్ లో రావడం...అది నేను చుస్కోడం....అబ్బో..అబ్బో...అసల వద్దు లెండి..
పక్కన నా కజిన్ ఉంటే...తనని పిలిచి నా painting చూడు అని చూపెట్టాను...
తనేమో వావ్ అక్క...భలే ఉంది..!!అనింది....
మరి కథ అంతా బాగుంటేనే కదా...నాకు అలా వేయాలని అనిపించింది...ఇది నా ఫ్రెండ్ రాసింది చదువు అని చెప్పాను..!!
ఏదో buzz లో ,చాట్ లో ఓ మాట్లాడేస్కుంటాం కానీ...
ఓ సారి షాప్ లో పుస్తకం మీద ఆదెళ్ల శైలబాల అని రాసింది చూసి...ఓ.... శైలు నాకు తెల్సు..బాగా తెల్సు... అని కాస్త గర్వంగా కూడా ఫీల్ అయ్యాను...!! :D
ఇక పుస్తకం గురించి చెప్పేదేముంది......మీకందరికీ తెలిసిందే కదా...
ప్రతి line లోను ప్రేమే నిండి ఉంటుంది...కొన్ని సన్నివేశాల్లో మనల్ని మనం చూసుకోగలం ..!!
నాకు అతి ఇష్టమైన అమ్మమ్మ,తాతయ్య ల గురించి ఎంత బాగా రాసిందో...
ఇక శైలు…

నా 'వెన్నెల' నేస్తాలతో....

Image
కార్తీక్ పెళ్ళికి రాని వాళ్ళందరూ వచ్చి నేను చెప్పేదంతా శ్రద్దగా..వినండి..

నేను జీవని ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళే లోపే అందరూ అక్కడ ఉన్నారు.....ఆ కాలనీ లో కి అడుగుపెట్టంగనే...కావ్..కావ్..కావ్..అని వినిపించింది..ఇల్లు ఈజీ గా గుర్తుపట్టేసి ఇంట్లోకి దూరాను..వెళ్ళగానే పెద్ద quiz పెట్టారు...ఎవరు ఎవరో గుర్తు పట్టమని...అప్పు ని ముందే ఫోటోలలో చూడటం వల్ల సౌమ్య గారిని ఈజీ గా కనుక్కో గలిగాను...అప్పటికి అందరూ....టిఫ్ఫినీలు చేస్తున్నారంట...అంట అని ఎందుకు అన్నాను అంటే...ఉగ్గాని..,మిరపకాయ్ బజ్జి లు...,ఇడ్లి లు ..ఇన్ని plate లో ఉంటే నేను భోజనం అనుకున్నా మరి...ఎవరు తలెత్త లేదు..అయినా నేను చాలా తెలివిమంతురాలిని కదా....అందరిని చక చక గుర్తు పట్టేసా..!!....ఆ తర్వాత ప్రసాద్ గారు వచ్చి టిఫిన్ చేయండి అని plate చేతికిచ్చారు..అందరి plate లో ని పదార్థాల్ని చూసి చాలా భయం వేసింది...పొద్దున్నే అగ్ని పరీక్ష లాగా అనిపించింది...కాని ఆకలి ...మండుతోంది..!!కొంచమైనా తిందామనుకున్నా..కానీ నేను గర్వించేలాగా..plate మొత్తం ఖాళి చేసేసాను..!!.....కాకపోతే రెండు గంటలు పట్టింది...!!..ఇంతలో నన్ను చూస్తూ ఊరకే కూర్చోల…

కిరణ్'s తుంటర్వ్యూ ఆన్ వెన్నెలా's బర్త్డే..

Image
ఆకాశవాణి : కిరణ్...ఒసేయ్కిరణ్...
నేను : పొద్దున్నేఎవరింతగౌరవంలేకుండాపిలుస్తుంది..??
నేనేవెన్నెల ని..
నేను : నువ్వుపొద్దున్నేవచ్చావ్ఏంటి ..రాత్రికదారావాలి ..
వెన్నెల : నీకుళ్ళుజోకులువినేఓపికనాకులేదుకానీ ...ఈరోజేంటోగుర్తుందా ?
నేను : శుక్రవారం..రేపువారాంతం.... :D
వెన్నెల : ఛా...రెండుసంవత్సరాలక్రితం .........
నేను : హాక్రితం...
వెన్నెల : ఇంకాగుర్తురాలేదటే ..!!
నేను : లేదు..!!
వెన్నెల : మీతమ్ముడికికాల్చెయ్....
నేను : పొద్దున్నేవాడికా ....ఎందుకు ??
వెన్నెల : వాడికైనాగుర్తుందేమోఅని..
నేను : ఓయ్నాతమ్ముణ్ణివాడు...వీడు..అంటావ్ఏంటి ...?
వెన్నెల : నువ్వుఫోన్కలుపెహే ..
నేను : ఒరేయ్తమ్ముడువెన్నెలనీతోమాట్లాడమంది ..
మా తమ్ముడు : బాగుంటుందా....నాన్నతోనువ్వే మాట్లాడేయి.. బాగుంటే ..నా పర్మిషన్ అవసరం లేదే..
నేను : ఛిఛివెధవ .. నాబ్లాగ్వెన్నెలరా ...
మా తమ్ముడు : ఆదా ....
నేను : కికికికికికికికి ..
మా తమ్ముడు : ఏమంటా ?
నేను : ఈ రోజేదోప్రత్యేకంఅంట ..నిన్నుఅడగమంది..
మా తమ్ముడు : ఎంతఈరోజూ తారీఖు ...
నేను : నవంబర్ నాలుగు
మా తమ్ముడు : కిరణ్ ..గుర్తొచ్చింది ...ఒకానొక