Posts

Showing posts from 2012

సీరియల్స్ బామ్మ

Image
"ఏవండి...మీరు ఉద్యోగం మానేసి ఇంట్లో అన్నా ఉండండి..లేదా..నాకు ఏదో ఒక ఉద్యోగం చేస్కునే అవకాశం ఇవ్వండి..."
"మళ్లీ ఏమైంది...?"
"కొత్తగా అవ్వడానికి ఏమి లేదు...మీ అమ్మ గారున్నారే..."             
"మీ ఇద్దరి గోల నాకు చెప్పద్దు అని ఎన్ని సార్లు చెప్పాను...?"
"హా..చెప్తారు....పిల్లలు కూడా వాళ్ళ బామ్మ అంటేనే పారిపోతున్నారు...."
"మరీ మా అమ్మ అంత గయ్యాళి ఏమి కాదు...."
"నేనన్నానా..??..ఆ టీ వీ ఇంట్లో వద్దు....ఎవరికన్నా ఇచ్చేద్దాం...ప్లీజ్..!!"
"అబ్బా...అది ఉంటే ఏదో ఒకటి కాలక్షేపం ఆవిడకి..."
"సరే నేను రేపు ఎట్టి పరిస్థతిల్లో... మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే...మీరు సెలవ పెట్టుకుని...అత్తయ్య గారిని చూస్కోండి..."
"అలాగే లే...పో.."
--------------
పొద్దున్న ఆరింటికి పెద్దావిడ లేచి...
---------------- "అమ్మా...పార్వతి...కాఫీ ఇవ్వమ్మా....ఆ బ్రూ అడ్డిమెంట్స్ లో వాళ్ళు..ఆహ..ఓహో అంటారు కదా...అలా వాసనా..రుచి రెండు ఉండాలి.."
"అమ్మా..ఈ రోజు అది వాళ్ళ చెల్లి ఇంటికి వెళ్ళిందే....నేనే ఉన్నా…

మీరంతా ఆహ్వానితులే ... :)

Image
నేను వంట చిన్నప్పుడే చేసేదాన్ని...చిన్నప్పుడంటే B.Tech లో ఉన్నప్పుడు... మా అమ్మ ఊర్లో ఉన్నప్పుడు ఎప్పుడూ వంటింట్లోకి వెళ్ళిన పుణ్యానికి పోలేదు...నాకు మా అమ్మ అంటే అంత గౌరవం...తాను చేస్తుండగా..నేను వెళ్లి నీ పని నేను చేస్తా అంటే ..పాపం నా పని సరిగ్గా లేదేమో అని అమ్మ మనసు నొచ్చుకుంటుంది కదా..ఇలా అన్ని రకాలు గా అలోచించి..వంటింట్లో కి కూడా వెళ్ళకుండా...హాల్ లో నుండే నీళ్ళు అడిగేదాన్ని...ఒక్కోసారి చేతికొచ్చేవి...ఒక్కో సారి మొహాన పడేవి...అది మాతృ దేవత మూడ్ ని బట్టి ఉంటుంది..!!అయినా ఏవండోయ్...ఏనాడు వంటింట్లోకి వెళ్ళేదాన్ని కాదు...!!
అమ్మ అమ్మమ్మ కి వంట్లో బాలేదనో..తాతయ్యకి జ్వరంగా ఉందనో..పిన్ని రాక రాక పుట్టింటికి వచ్చిందని చూడటానికి వెళ్తేనో..నా పెతాపం బైట పడేది..కొన్ని రోజులు నాన్న చేసేవారు...తర్వాత అమ్మతో  తిట్లు తినేవారు..."బాగుంది...అన్నీ మీరు చేస్కుంటే దానికేప్పుడు పని వచ్చేది...వదిలేయండి..వచ్చీ..రానీ వంటలు పనులు చేస్కుంటేనే కదా మనం ధైర్యంగా ఇంకో ఇంటికి పంపగలం"..అంటే..అప్పట్లో ఏమనుకునే దాన్నంటే..దీనికి ఉద్యోగం రాకపోతే కనీసం ఈ పని కైనా పంపిద్దాం అనుకున్నారేమో అనుకునే దాన్ని..…