15 May 2011

నాలోని కళ..

కిరణు నీకు కలలే అనుకున్నాం ..కళలు కూడా వచ్చా అనే కదా మీ సందేహం ..ఇలాంటి సందేహాలు తీర్చేద్దామనే ఈ టపా..!!ఒక ఆదివారం నాడు ఏమి తోచక అలా కూర్చుని ఏదో ఒకటి చెయ్యి కిరణు అంటూ నాకు నేను చెప్పుకుంటున్న సమయం లో ...అద్దం లో పసుప్పచ్చ కాంతి కనిపిస్తోంది ... (బల్బ్ ఎలిగింది ..)..ఏమని వెలిగిందయ్యా అంటే...నా నేస్తం ఇచ్చిన రెండు తెలుగు పుస్తకాల దుమ్ము దులపమని..ఒకటేమో అమరావతి కథలు..ఇంకొకటేమో రమణీయం..మొదట..అమరావతి కథలు తీశాను..చిన్ని చిన్ని కథలు మొదలెట్టే ముందు 'ముందు మాట' చదివాను..అందులో..బాపు గారి బొమ్మలకి రమణ గారి వివరణ..ఆహా అద్భుతం....నాలుగు అయిదు గీతలతోనే ఎంతో అర్థవంతమయిన కథకు తగ్గట్టు బొమ్మలు..ఎంతయినా బొమ్మలు వేయడం అంటే ఇష్టం వల్ల నాకూ ఏదైనా గీయాలి అనిపించింది..కాదు లే ఎప్పుడయినా గీయచ్చు..ఇలాంటివి చదివటానికి మళ్ళి సమయం దొరకదేమో అనుకుంటూ..రమణీయం ఎలా ఉందో కాస్త చదువుదాం అని మొదలు పెట్టా...మొదట్లోనే..వేణువులు తాయారు చేసే గోపన్న కథ...రాధా గోపాలం ల కథలు...ఎంత నచ్చేశాయో...ఇక నా లోని కళను బయటికి తేవాలి అనిపించేసింది..

ఇక అంతే ..అది అక్కడిక్కక్కడ మూసేసి....అమ్మా..అని ఓ కేకేశా..ఎవరు పోయారు ..ఎందుకలా అరుపులు అంది.సర్లే నెమ్మది గా మాట్లాడుతాలే కానీ ...పాత శుభలేఖలు ఏమైనా ఉన్నాయా ..అని అడిగా ..ఇది మరీ బాగుంది .. పోయిన సారి వచ్చినప్పుడు నువ్వే కదా ..ఇల్లు అసలు నీకు శుభ్రంగా పెట్టుకోడం రాదు అని ..అన్ని తీసుకెళ్ళి చెత్తబుట్టలో వేశావ్ అంది ..

ఆ చెత్త ఇప్పడు పడేశారా అన్నాను ....నువ్వు వచ్చి నెల పైన అయిపొయింది అంది..అమ్మ...ఇంతలో నాన్న ఆ చెత్త తీస్కుని వెళ్ళే అబ్బాయి ఇల్లు నాకు తెల్సు అన్నారు..వామ్మో ఇద్దరు ఈ రోజు నాతో ఆడుకునేలా ఉన్నారు అని...మాట మార్చి..సరే కానీ ఈ మధ్యలో ఎవరివయినా తెల్సిన వాళ్ళ పెళ్ళిళ్ళు ఉన్నాయా అన్నాను ...హా ఆ పక్క వీధిలో సంధ్య ది పెళ్ళంట ..సరే వచ్చినప్పుడు ఓ రెండు శుభలేఖలు ఎక్కువ అడుగు..హా ..ఏమిటి ?..మా అమ్మ మొహం లో ఆశ్చర్యం తో కూడిన చిరాకు ...ఇంతలో మా ఎదురింటి పిన్ని ...అమ్మాయి మా అక్క తల తినడం ఆపేయ్ ..మా ఇంట్లో ఒకటి ఉండాలి రా ఇస్తాను...అంది..సరే దా పిన్ని అని వెళ్లి ఆ శుభలేఖ అరువు తెచ్చుకున్నా ...ఎందుకో తెల్సా ..కింద చూడండి ..

మొదటిది ....వేణువు ..మన రమణ గారి రమణీయం లో ఉన్న గోపన్న వేణువుల కథ చదివి ఎంతో నచ్చి స్ఫూర్తి(అబ్బాయిలు - ఇది అమ్మాయి పేరు కాదు..) గా తీస్కోని ..ఇలా గీశాను....


రెండవది ..కిట్టయ్య అంటేనే ..నెమలి పించం,మురళి ఇవన్నీ గుర్తోచ్చేస్తాయి కదా ..అలా గుర్తొచ్చి వేసింది ..

ఇంతలో బాపు గారు గుర్తొచ్చారు ..ఆయన శైలి లో కిట్టయ్య ని గీయాలనిపించి ...మొదట కిట్టయ్య ని గీశా ...మా రాధమ్మ ఎక్కడ అన్నాడు?వస్తుంది లే ..కాసేపు నాతో ఆడుకో అని చాలా సేపు కిట్టయ్య తో ఆటలు..పాటలు ..అయ్యాక ....వెన్న అడిగాడు ...బాబు కిట్టి మా ఇంట్లో వెన్న లేదు అన్నాను ..ఏదో ఒకటి పెట్టు ఆకలి అన్నాడు ..మిరపకాయ్ బజ్జి తెస్తా అనే లోపే ...తోలు తీస్తా అన్నాడు ..నో కిట్టి u n me frns అని వెళ్లి ఏమున్నాయా అని వెతికా..సున్నుండలు హై తింటావా అని అడిగా ..సరే పెట్టు అని తినేసి ...నా రాధ అంటూ మళ్లీ మొదలెట్టాడు ..ఒకే ఒక్క చిన్ని సందేహం అది తీర్చి వెళ్ళిపో అన్నాను..ఏమిటో అడుగు..అనంగానే...కాదు కిట్టయ్య ఇందాక నా తోలు తీస్తా అన్నావ్ కదా...నాకు ఇచ్చిందే తోలు అది తీస్తే ఉత్త బొమికెల మీద బతకాలా..అని అడిగాను..ఆయన జవాబు ఇచ్చే లోపే..కాదు కిట్టి అదేంటి కొందరికి..కలర్ + కండ + తోలు ఇస్తావ్..కొందరికి.కేవలం కలర్+తోలు మాత్రమే ఇస్తావ్...నీ దగ్గర రక రకాల packages ఉంటాయా..??దాని menu ఎక్కడ ఉందో చెప్తే వచ్చే జన్మ కి ఎలా కావాలో నేను సెలెక్ట్ చేస్కుంటా అన్నాను.. కిరణు...నీకు ఈ జన్మ లో అనవసరంగా బుర్ర అనేది పెట్టాను...వచ్చే జన్మ లో అది ఉండదు అన్నాడు....ఉండు కిట్టి నీకు BP వస్తోంది అని ఓ పది నిమిషాల్లో ఆవిడను కూడా గీశేసా.. ఇక మనమెందుకు లే వీళ్ళ మధ్య లో అని వీళ్ళను పక్కన పెట్టి

వీళ్ళిద్దరి ప్రేమ ను చూసి మురిసిపోతుంటే ...ప్రేమే నాతో చాలా మాటలు చెప్పింది ...కిరణు చూడవే ..ఆ ప్రేమ ఎంత బాగుందో ...ఇప్పుడు నా పరిస్థితి ఏం బాలేదు ..అసలు నా అర్థం నేనే మరచిపోయా ..ఒకొక్క సారి నిజమైన ప్రేమ ...ఓ సారి వెర్రి ప్రేమ ..ఓ సారి తిక్క ప్రేమ ..ఓ సారి రాక్షస ప్రేమ ...ఇన్ని అవతారాలు ఉన్నాయని నాకే తెలియలేదు ..అంటూ నాతో పలికింది ...హిహిహి అని పళ్ళు ఇకిలించా ....కోపమొచ్చి తుర్రుమంది .


ప్రేమ.. ప్రేమ.. పోతావా ప్రేమ అని పాడుకుంటూ ఉంటే ...

కిటికిలోనుండి పువ్వులు కనిపించాయి ....పువ్వులని వెయ్యాలి అని పెయింట్ తీసానో లేదో .....సీతకోకచిలుక సినిమా లోని మాటే మంత్రము పాట వినపడింది ...ఆహా ..పూలు ...సీత కోక చిలుక సూపరు అనుకుంటూ ఈ కిందది గీశేసా..


ఇప్పుడేం చేయాలా అని మిగిలి ఉన్న కార్డు ముక్క ని చూసా ..ఆ కార్డు తాయారు చేసిన వాళ్ళు కూడా ఏదో పుస్తకాలు చదివారనుకుంట ..కాస్త కళాత్మకంగా ఆలోచించి పైన కార్డు మూసే చోట ఇలా వంపు వచ్చేలా తయారు చేసారు ...అది చూడంగానే ..ఇందులో నెమలి ని కూర్చో పెడ్తే భలే ఉంటుంది అనిపించింది ...అంతే .....!!కూర్చో పెట్టేశా...ధన్యవాదములు కిరణు అని కూడా అది చెప్పింది ....నేను యెల్కం అన్నా..


అప్పటికి సమయం సాయంత్రం ఆరు ..అమ్మ వచ్చి ఏమే ..ఏ పిచ్చి పడ్తే అదేనా ..??చాల్లే గది లో నుండి బైటికి రా అనింది ...నా కళను మెచ్చుకోక పోవడమే కాక ...తిట్టిందనే కోపం తో ..ముందున్న కార్డు ముక్క తీస్కోని ...తీగలు చుక్కలు చేతికోచ్చినట్లు వేసి నా బాధ వెలిబుచ్చుకుని ..వెళ్లి కాసేపు అమ్మతో మాట్లాడాను ..

రాత్రి అయ్యింది .....చందమామను చూద్దాం అంటే ఆయన కనిపించలేదు చుక్కలు కనిపించాయి ..అయ్యయ్యో ..వీళ్ళు ఇంక పండగ చేస్కుంటారు అనిపించింది ...వీళ్ళు ఎవరా అనుకుంటున్నారా....నాకు ఇద్దరు స్నేహితులున్నారు ....పగటి పూట కూడా చుక్కల గురించి చుక్కలు చూపించే రకం ..orion ,small bear ,big bear అంటూ చెప్తారు ..నాకు అర్థం అయ్యే బాషలో సప్తర్షి మండలం ..అనో ఏదో ఒక ఆకారం లో ఉన్నదనో చెప్పరు ...నాకు అప్పుడు ఓ ఆలోచన వచ్చింది ...నా ఆకాశం నేనే చిత్రీకరించుకుంటే...????హుహుఃహహాహ ....వెళ్లి వెంటనే నా ఆకాశం తయారు చేస్కున్నా ...ఇక్కడ ఏ చుక్క ఏంటో నాకు తెల్సు ....వాళ్ళు వచ్చి అడిగితే నేను చుక్కలు చూపిస్తా ..ఇప్పుడు ...అందుకే రెండు నెలవంకలు కూడా పెట్టాను ...ఆకాశం ఇలా బాగుంది కదా ...అన్నం తిని నిద్ర పోయే ముందు ..పొదున్న లేవాలి అనే మాట వినిపించింది ....హ్మ్న్ ....ఇది ఎలాగో ఎప్పుడూ చేయలేమని ..అలా పొద్దున్న ఎలా ఉంటుందో ఊహించుకుంటూ ..చిన్నప్పటినుండి ....ఖాలీ పేపర్.. పెన్ దొరికితే ...గీసే కొబ్బారి చెట్టు ...దాని కింద ఇల్లు ...పక్కన సూర్యుడు ...అక్కడే ఎగురుతున్న పక్షులు అయిన నా trade mark బొమ్మని దించేసా ...మీకో సందేహం మళ్ళి రావచ్చు...అసలు ఏంటి ఇవి అని....పుస్తక గుర్తులు..(బుక్ మార్క్స్).....ఆ ఆగండి..ఇవే ఎందుకు చేయాలనిపించింది అనే కదా..చెబుతా..మీకు నాలాంటి రూం మేట్ ఉంటే ఇలాంటి బోలెడు అవిడియాలు వస్తాయి..నేను ఓ సారి చాలా రోజుల తర్వాత ఇంగ్లీష్ నోవెల్ 'I too had a love story' చదువుతూ ఉంటే నిద్రముంచుకోస్తుంటే...పక్కనే ఉన్న అయిపోయిన టూత్ పేస్టు ట్యూబ్ ఆ పుట లో పెట్టి నిద్ర పోయా....తను రూం సర్దుతూ ఆ ట్యూబ్ ని.. పుస్తకాన్ని వేరు చేసింది...నాకేమో ఆ పేజి నెంబర్ గుర్తు లేదు...ఏదో ఒక పేజి తీసి ఓ ప్రయత్నం చేసా చదువుదాం అని...అందులోని హీరో హీరోయిన్ను చాట్ చేస్కుంటున్నారు...వీళ్ళు మొన్నే కదా చాట్ చేస్కున్నారు అనుకుంటుండగా ..ఒహో ఈ పేజి కాదు ..ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుని ఓ 20 పేజి లు ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను..అక్కడ వాళ్ళు మళ్లీ ప్రేమించుకుంటున్నారు..అయ్యయ్యో అని ఇంకో 10 పేజిలు ముందుకి వెళ్లాను...అక్కడ ఆ అబ్బాయి వాళ్ల ఇంటికి మళ్లీ వెళ్ళాడు...నాకు చిరాకేసి...బుక్ మూసేసి....మా కీర్తి దగ్గరికి వెళ్లి...ఓయ్ నేను ఎక్కడ ఆపానో చెప్పు ....ఈ rewind సీన్ లు నేను చదవలేక చస్తున్నా అన్నాను..నీ కర్మ...ఏదంటే అది పుస్తకం లో పెట్టకూడదు అంది..మళ్లీ ఇప్పటి వరకు ఆ పుస్తకం ముట్ట లేదు..ఇలా మళ్లీ జరగా కూడదు అని...ఇవి తయారు చేసా..మీకు ఇంకో సందేహం రావచ్చు..మీ రూం మేట్స్..నిన్ను ఏం చేయరా..ఇలా టపాలు రాస్తే అని..హుహుహుహహహః..నేను ఉండేది బెంగుళూరు మహా నగరం లో...ఇక్కడ కాస్త కాళ్ళు వెడంగా పెట్టి నుంచోడానికే స్థలం లేదు..నా లాంటి అయిదు అడుగుల ఆజానుబాహురాలిని పాతి పెట్టడానికి స్థలం ఎక్కడండి..??

మనలో మన మాట..మొన్న నేను ఏదో పుస్తకం చదువుతూ నెమలి పుస్తక గుర్తు ని పెట్టుకుని బస్సు లో ప్రయాణం చేస్తుంటే ..నా పక్కన కూర్చున్న ఆ అమ్మాయి..సూపరక్క ...భలే అవిడియా అక్క అని తెగ పొగిడేసింది..నేను రూం కి వచ్చి డాన్సు చేసి ఆ పిల్ల state 1st రావాలి అని దేవుడికి దణ్ణం పెట్టుకున్నా......మీరు కూడా అలాగే సూపర్...కెవ్వ్..కేక అనండి.

37 comments:

వంశీ said...

haha super idea...ayidadugula aajanubaahuraalu ;)

aa chetha abbai illu telusukunnava mari, eesari emanna chethalo paaresi malli kavalanipishey velli techukovachu....

subhaleka ivvadaniki vasthey oka rendu extra teesukovaala....super idea idi... :D

జయ said...

చక్కటి కళ. అలా స్పొంటేనియస్ గా గీయటం చిన్న విషయమేమీ కాదు. చాలా బాగుంది మీ క్రియేటివిటీ. నేను కూడా తయారుచేసుకుంటాను. చాలా బాగా రాసారు.

కావ్య said...

హహ సూపర్ కెవ్వ్ కెక .. చాలా ..
నీ టేలంట్ సూపర్ అమ్మయి .. ః) చాలా బాగున్నయి .. నీ బుక్ మార్క్స్ .. నాకు ఒ రెండు ఇవ్వవా ..

Sravya Vattikuti said...

Superb ! podigaa ippudu naakenti ?:)

On the serious note, really superb Kiran !

గిరీష్ said...

>>మిరపకాయ్ బజ్జి తెస్తా అనే లోపే ...తోలు తీస్తా అన్నాడు
నీ దగ్గర రక రకాల packages ఉంటాయా..??దాని menu ఎక్కడ ఉందో చెప్తే వచ్చే జన్మ కి ఎలా కావాలో నేను సెలెక్ట్ చేస్కుంటా అన్నాను.. >>

:)

సూపర్..కెవ్వు..కేక అనేశాను..ఓకె నా.. :)
nice one..

బృంద said...

కిరణు. చూసీ చూసీ అలవాటై పోయింది :) ఇంకా పొగడాలంటావా? నువ్వొద్దన్నా పొగడకుండా ఉండలేకపోతున్నాలే.
Simply awsome work :)

kallurisailabala said...

kiran neeku abhinandanalu...mandara malalu...mandaram vaddu ante mallelu, punnagalu nee istam anta nachindi e post naku

వేణూరాం said...

నాకా కృష్ణుడీ ఏపిసోడ్ బాగా నచ్చేసింది..
బావున్నాయండీ.. మీ కళలూ, మీ పుస్తక గుర్తులూనూ..
మీ పుస్తక గుర్తుల మరియూ పెయింటీంగ్స్ ఎగ్జ్బిషన్ ఎప్పుడూ?? ;) ;)
ఎక్స్లెంట్ పోస్ట్.. నా భాషలో చెప్పాలంటే.. పిచ్చికేక..

Padmavalli said...

చాలా బావున్నాయి కిరణ్. Also good post.

వేణూ శ్రీకాంత్ said...

వావ్ చాలా బాగున్నాయ్ కిరణ్ :)

ఇందు said...

కిరణూ....భలె ఉన్నాయి నీ పుస్తకం గుర్తులు ;) అవే బుక్మార్క్స్ :) నాకు ఎప్పుడు చేసి ఇస్తావ్!! నాకు గోదారి....కొండలు...పక్కన కొబ్బరి చెట్లు....కొండల మధ్య సూర్యుడు ఉన్న ఒక బుక్ మార్క్ చెయవా?! వెనకాల ఆర్ట్ బై కిరణ్ అని కూడా రాయాలి సుమా ;) నీ గుర్తుగా దాచిపెట్టుకుంటా :)

అసలు నీ టాలెంట్ సూపర్ ఫో! నువ్వు కెవ్వ్వ్ అంతే!

MURALI said...

kevvu keka.

kiran said...

Proxy is not permitting me to post this on your blog. So mailing it

Here is a snapshot of the highlights of your post as per me :)
You may use this as a foreword for your post too :P

> అమ్మా..అని ఓ కేకేశా..ఎవరు పోయారు ..ఎందుకలా అరుపులు అంది

> నాన్న ఆ చెత్త తీస్కుని వెళ్ళే అబ్బాయి ఇల్లు నాకు తెల్సు అన్నారు

> ..సరే వచ్చినప్పుడు ఓ రెండు శుభలేఖలు ఎక్కువ అడుగు..

> మిరపకాయ్ బజ్జి తెస్తా అనే లోపే ...తోలు తీస్తా అన్నాడు

> ...ఇన్ని అవతారాలు ఉన్నాయని నాకే తెలియలేదు
ప్రేమకు ఇన్ని అవతారాలు అవతారాలు ఉన్నట్టు నాకూ తెలియదు... :) Nice interpretation indeed.

> ..పుస్తక గుర్తులు..(బుక్ మార్క్స్)..
> అయిపోయిన టూత్ పేస్టు ట్యూబ్ ఆ పుట లో పెట్టి నిద్ర పోయా.... This is most funniest of all :)
> ఆ పిల్ల state 1st రావాలి అని దేవుడికి దణ్ణం పెట్టుకున్నా...
Really moved by this statement!


---pranav

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>> ఆ పిల్ల state 1st రావాలి అని దేవుడికి దణ్ణం పెట్టుకున్నా

నేను కూడా పెట్టాను దండం మరి నాకేంటి? రెండు శుభలేఖల పుస్తక గుర్తులు అన్నమాట.

బొమ్మలు కధనం బాగున్నాయి.

kiran said...

వంశీ - thank u ..thank u ..:))
ఎందుకులే వాళ్ళ ఇల్లు తెల్సుకోడం ...మళ్లి ఎవరి చెత్త కావాల్సిన నన్నే పంపిస్తారు..:)

జయ గారు - చాల సంతోషం మీకు నచ్చినందుకు...చెయ్యండి..చెయ్యండి...చేసాక ...నాకు చూపించండి..:)

కావ్య - :D -- thank u ..ఇద్దో...రెండు కాదు నాలుగు ఇస్తున్నా..:)

kiran said...

శ్రావ్య మీకు salary hike వస్తుంది..:))
thank you very much ..:)

గిరీష్ జీ -- :D ..okok ..:)

బృంద - soo nice to see your comment ..:))
నీ encouragement నాకు ఎప్పుడు కావాలి డియర్..Thankuuuuuu very much ...:)

kiran said...

శైలు - నీ కామెంట్ చూసి మురిసిపోతున్నా..:))...బోలెడు థాంక్స్..చాలు ఇక మాలలు..మోయలేను..:P

రాజ్ - exhibition ఆ..:O ..పెట్టు బడి మీదే..:P
టపా నచ్చింది అన్నందుకు బోలెడు హాప్పీస్..:))

పద్మ గారు - చాల చాల థాంక్స్..:)

రాజేష్ జి said...

$కిరణ్ గారు

Wow..Magnificent work! seeing through... my opinz more in line

రాధాక్రిష్ణల చిత్రం బావుంది. చిత్రం వెనకఉన్న రంగు రాధమ్మ కట్టుకున్న చీరలాగా[గొంతుకు మరీ అనుకో!] భలే వచ్చింది. కళాత్మకం.

ఇంకా ఎగిరేపక్షులు ట్రేడ్మార్క్ :) హి హి.. చాలామంది చి.కాలికి కూడా .. నాకు కూడా..

ఒక పిల్లకాలువ, వెనుక కొండలు, మధ్యలో ఎర్రటి సూర్యుడు, పైన పక్షులు, కాలువలో చేపలు, కాలువ చెట్టూ పేద్ద తాటి చుట్లు... హ్మ్..


బాగా రాసారు కూడా!

kiran said...

వేణు గారు - :D ..థాంక్స్..

ఇందు - ధన్యవదః..:))..తప్పకుండా వేసిస్తాను..:)
మరి నాకేంటంట..ఆవకాయ్ పెడతావ..:P

మురళి గారు - :D ..థాంక్స్..

kiran said...

ప్రణవ్- నీ కామెంట్ చూసి చాల హ్యాపీ గ ఫీల్ అయ్యాను..:)
Thanks a ton ..
ఇంత మంచి కామెంట్ ని వదలలేక నేను పోస్ట్ చేస్కున్న నీ తరపున..మీ ఆఫీసు లో వాళ్ళకి వార్నింగ్ ఇవ్వు...సెట్టింగ్స్ change చేయమని..

బులుసు గారు - :)))....అలాగే ఇచ్చేస్తాం..:)
ఆ అమ్మాయి తరపున ,..నా తరపున..బోలెడు ధన్యవాదములు..:)

kiran said...

రాజేష్ జీ - ధన్యవాదములు...:))...నా కళను..నా టపా ని మెచ్చుకున్నందుకు..:)
మీ ట్రేడ్ మార్క్ బొమ్మ కూడా భలే ఉంది..:))
మాకు వేసి చూపించ కూడదు..:)

కొత్త పాళీ said...

రెండు కెవ్వులు మూడు కేకలు

Avineni Bhaskar / అవినేని భాస్కర్ said...

మొదలుపెట్టిన తీరు భలే ఉంది. పడిపడి నవ్వుకున్నాను..

నీ కిట్టి అల్లరి బాగుంది.. మిరపకాయబజ్జీలు, సున్నుండలు... టూత్ పేస్టులు... హిలారియస్..


నాకూ కొన్ని పుస్తకగుర్తులు ఇవ్వు :-) ఈ అందమైన పెయీంటింగులకోసమైనా వాడుతాను... (నిజానికి నా జీవితంలో పుస్తక గుర్తులుపెట్టి ఎఱగను. పేజీకూడా మడతపెట్టను!)

vamc123 said...

కిరణ్ గారు, చాలా బాగా రాశారు..చాలా బాగా గెశారు కూడా..మీరు బాపు రమణ కాంబినేషన్ ఏమో అనిపిస్తోంది..మీ సృజనాత్మకత, ఇమ్యాజినేషన్ సూపర్...కీప్ ఇట్ అప్..

kiran said...

కొత్త పాళీ గారు - నా బ్లాగు కి స్వాగతం :)
మీ కెవ్వులకి కేకలకి బోలెడు ధన్యవాదాలు..:))

భాస్కర్ గారు - :D ..హమ్మయ్య నా వాళ్ల నవ్వుకున్నారా...సంతోషం..
మీరడగటం..నేను ఇవ్వక పోవటమా..తప్పకుండా ఇస్తాను..:))..అది కూడా నా బుక్ మార్క్స్ తో నే వీటిని వాడటం మొదలు పెడతా అంటున్నారు..:)

వంశీ గారు -- :)))))))))))
మీ కామెంట్ సూపరండి..చాలా పోగిడేసారు..:)..peeeeeedddaaa థాంక్స్...:))

Ennela said...

baaboy! superb...naaku dentlono oka daantlo first raavaalani devudiki dannam pettavaa please!
post addirindi...bommalu chhosi kallu chediraayi..jokulaki manasu murisindi...total gaa ippati daaka unna tikka vadilindi....yee post entha baagundo cheppalenu..simply two kevvs..

తృష్ణ said...

ముందు - కేవ్వ్...కేక...
తర్వాత - ఆలస్యానికి క్షమాపణాలు...
తర్వాత - బోలెడు ఆనందం(బొమ్మలు చూసి)
తర్వాత - కాసిని నవ్వులు(జోకులు చూసి)
తర్వాత - ఓ చిన్న సలహా మీ ప్రొఫైల్లో ఆ పెన్సిల్ స్కెచ్ తీసేసి ఈ టపాలోని రాధకృష్ణులు కానీ, నెమలిపింఛెం గానీ పెట్టేయండి. చాలా బావుంటుంది.

తర్వాత - ఇలాగే మా కిరణు ఇంకా మంఛి మంఛి బొమ్మలు బోలెడు వెయ్యాలని దీవెన..!

చివరిగా - అందరికీ ఏవో విషెస్ గ్రాంట్ చేసారు కదా నాక్కూడా గ్రాంట్ చేసేయండి...కిరణ్ పేరు చెప్పేసుకుని నేనూ ఓ గంతు వేసేస్తా..:)


నా వ్యాఖ్య సూపర్ కదా. టపాతో కాస్తైనా పోటికి వచ్చిందా??

తృష్ణ said...

అన్నట్లు టపాకు టైటిలు "నాలోన పొంగెను కళలేవో..." అని ('సూర్య...'పాట లెవెల్లో) పెట్టేయాల్సింది. aptగా ఉండేది.

శివరంజని said...

kirannnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn

వచ్చినప్పుడు ఓ రెండు శుభలేఖలు ఎక్కువ అడగాలా ?? అమ్మా పిల్ల
పళ్ళు పట పట కొరుకుతూ మరి చదువుతున్నాను ... ఇలా నీ కళలు చూసి జెలసీ తో ...........

అమ్మా ఏమి రాసావు పోస్ట్ ఎంత బాగుందో............ అనుకుంటే ఆ పిక్చర్స్ చూసి ....... కెవ్వ్ అని కేక వెయ్యాలని ఉంది ఒక సారి చెవి పట్టు

kiran said...

ఎన్నెల గారు చూసారా..నా టపా చదివి మీకు కవిత్వము పొంగి పొర్లింది..
కాబట్టి ఈ సారి కవితల పోటి ఎక్కడైనా పెడ్తే మీదే మొదటి స్థానం..:)
బోలెడు ధన్యవాదాలు..చాలా సంతోషం మీకు నచ్చినందుకు..:)

త్రిష్ణ గారు.
ముందు గా మీకు నా స్వాగతం
తర్వాత బోలెడు ధన్యవాదాలు..మీకు నచ్చింది అని చెప్పినందుకు..ఇంకా దీవేనలకి..:)
తర్వాత మీ క్షమాపణలు rejected ..(మీరు నా బ్లాగ్ లోకి రావడమే చాలా ఆందకరమైన విషయం...ఆ పై ఆలస్యం లెక్కలోకి రాదు..)
మీరు ఎప్పుడో 1st కదా ఈ బ్లాగ్ ప్రపంచం లో..మళ్లీ నేను మీకు విషెస్ ఎందుకండీ..??:)
ఐనా సరే ఈ సారి వంటల పోటీలు పెడ్తే మీదే మొదటి స్థానం
మీ కామెంట్ కి ఓఒ కెవ్వ్ ....:)
ప్రొఫైల్ పిక్ మారుస్తా...
అయ్యయ్యో...నాకు ఆ పాట ఆ నిమిషం లో గుర్తు రాలేదు త్రిష్ణ గారు.. :)

రంజని ఈఈఈఈఇ
అయ్యో వద్దు....dentist దగ్గరికి వెళ్తే బోలెడు karchu..!!
ఐనా frendotsaham ఉండాలి...:)...
సరే నువ్వు నా చెవిలో కేవ్వ్వ్ మని అరువు...నేను నీ చెవిలో thanksssssssssssss అని అరుస్తా...:)

εﺓз♪♥In a Girl's Heart♥♪εﺓз said...

kiran nee tenepalukule kaadu nee srujanathmakatha kuda entha baagundi >:D<

kiran said...

keerthana...thank u..so much...:))

తృష్ణ said...

నిజంగా ఆ రాధాకృష్ణుల బొమ్మ ఫోఫైల్లోకి మార్చండి బావుంటుంది. అది చూద్దామనే మళ్ళీ వచ్చా ..

kiran said...

త్రిష్ణ గారు - ఆ బొమ్మ నిలువు గా ఉందండి...సరిగ్గా కుదరట్లే...మార్చిన సగమే కనిపిస్తోంది..అందుకే నేను వేసిన ఇంకో పక్షి బొమ్మ పెట్టుకున్నా..:)

it is sasi world let us share said...

CHAALA CHKKAGAGAA UNDI.YEPPUDEPPUDU NAALONI KALANI THEEDDAMAA anipisthundi.mee art keka andi.sasi

Bujji-Smiley said...

Nice one Kiran...

kiran said...

sasi garu ...aalasyamenduku..try cheseyandi ..thank u so much..:)

@bujji-smiley - Thank u..:))

ఫిదా కి ఫిదా

శేఖర్  కమ్ముల గారు బాగున్నారా?? మీకే ??  బానే  ఉంటారు !! .. మా పరిస్థితే  ఏమి బాలేదు.. ఏం చెప్పమంటారు .?? మాది ఒక  సాఫ్ట్వేర్  జంట .. చి ఛ...