నేను మొదటి రోజు..సినిమా కి వెళ్తున్నాన్న విషయం పేపర్ లో వేయించాలనిపించింది..నాకే ఇది కాస్త ఎక్కువైంది అనిపించి నా స్నేహితులిద్దరికి ఫోన్ చేసి చెప్పా..అందులో ఒకరు..చీ నా బతుకు..ఏ సినిమా చూడని నువ్వు కూడా సినిమా కి పోతున్నవ్..నేనేమో ఇక్కడ ముఖ్యమైన పనిలో ఇరుక్కుపోయా అని ఏడిసాడు..:D ..ఇంకొక అబ్బాయేమో...మొదటి రోజు నీకు షో అవసరమా మాకే టికెట్లు దొరకట్లేదు అన్నాడు..నాకు దొరికాయి లే నేను వెళ్తున్నా అని అటు నుండి ఏం చెప్తున్నాడో కూడా వినకుండా ఫోన్ కట్ చేసి విజయ గర్వం తో హాల్ లో అడుగు పెట్టా..:)
సినిమా మొదలయ్యింది......
మొదలవుతూనే కిరికెట్టు ...చిన్న హీరో బుల్లి హీరోయిన్ కిరికెట్టు ఆడుకుంటూ ...బుల్లి హీరో అప్పట్లో హీరోయిన్ విలువ తెలియక గొడవ పడ్తుంటే ....వాళ్ల నాన్న నాజర్ నచ్చ చెప్తాడు ...ఎప్పుడు నేను, నా లోకం ..నా గెలుపు అనుకోకుండా ..పక్కనోడి కోసం కూడా ఆలోచించు అని ...అప్పట్లోనే వాడికి వాళ్ల నాన్న మాటలు నచ్చవ్....నేను నాకు నచ్చిందే చేస్తా ..ఎవరి దగ్గర adjust అవ్వను అని గట్టిగా అరచి చెప్పేస్తాడు..
నాకు పై సీన్ ఏ నచ్చేసింది ....first impression is best impression అన్నట్లు సినిమా మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడి పోయింది ...
బుల్లి హీరో కి కాళ్ళు పొడుగ్గా,చేతులు పొడుగ్గా ముక్కు,కళ్ళు,మూతి మొహానికి సరిపోయెంతగా ...మొత్తానికి మొహం అందంగా... ఆరడగుల అందగాడిలా ..ఇలా ఇన్ని మార్పులు వచ్చినా..ఆలోచనల్లో మాత్రం మార్పు ఉండదు..కానీ చివరికి డార్లింగ్ పక్కనోడి కోసం సర్దుకు పోవడం ...అలవాటు చేసుకుని ...అందులో ఉన్న ఆనందాన్ని అర్థం చేస్కుంటాడు ...!!..ఇలా అర్థం చేస్కొడానికి ఇద్దరు హీరోయిన్లను పెట్టి , లచ్చలు లచ్చలు ఖర్చుపెట్టి సినిమా తీసి హీరో కి అర్థమయ్యేలా చేస్తాడు మన డైరెక్టర్..:)
ఇంతకి సినిమా మొత్తం చూసాక కొన్ని conclusions కి రావచ్చు ...ఎడ్డం అంటే ఎడ్డం అంటే ఎక్కడ మజా ఉండదు ....మాటల్లో కానీ ,ఆటల్లో కానీ ,జీవితం లో కానీ ..!!.ఎడ్డం అంటే తెడ్డం అంటేనే జీవితం లో కిక్ ఉంటుంది ...దేవుడు అందుకే అనుకుంటా ఎప్పుడూ అలాగే కలుపుతాడు ...నా స్నేహితుల నుండి చాలా విన్నాను ...అందులో నుండి ఒకటి ..కిరణ్ నాకు black ఇష్టం ...మా ఆయనకి అది తప్ప అన్ని ఇష్టం ...చివరికి గాడి గా కనిపించే పసుపు రంగు తో సహా అనింది ..:D..hmmn...గాడ్ ఇస్ గ్రేట్...:)
నాకు డవిలోగులు అస్సలు గుర్తు ఉండవు ..కానీ ఇదెందుకో అలా గుర్తుండి పోయింది ..ఎంత అంటే చెప్పలేను ...ఎలా అంటే చూపించలేను ...కానీ గుండె కొట్టుకునేంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని....:P..మీరలా అనుమానంగా లుక్కేయ్యకండి ..నాకు నచ్చిందని చెప్పా అంతే..:)..ఇంకో సీన్ కాజల్ ప్రభాస్ కి mms పంపిస్తుంది ..birthday wishes ..ఆ సీన్ నాకు నచ్చింది ....ఎందుకో కాజల్ క్యారెక్టర్ తెగ తెగ నచ్చేసింది....అమ్మాయిలు ..తన ప్రతి డ్రెస్ అదిరిపోయింది లే ...:)
ఒక మంచి సినిమా చూసాం అనే ఫీలింగ్ వస్తుంది మొత్తం అయ్యాక ...ఇలాంటి ఫీలింగ్ లో ఉండగానే ..నాకు ఒక చప్పుడు వినిపించింది ...ఏంటో తెల్సా ...భోరుమని వర్షం ...ధియేటర్ బయటకి రాంగానే పక్కనే ఉన్న bus stand కి నడిస్తేనే సగం తడిచి పోయాం...ఇంకో సగం బస్సెక్కేటప్పుడు తడిచిపోయాం ..బస్సు లో ఉన్నప్పుడు ..అటు ఇటు ఫుట్ పాత్ మీదకి నీళ్ళు ఎగురుతున్నాయి ..అంతలా నీళ్ళతో నిండి పోయింది.అవి ఎగురుతుంటే... మా స్వాతి దాన్ని చూపిస్తూ కిరణ్ అటు చూడు వావ్ అంది ...ఆహా ...అనుకున్నా ....బస్సు దిగాం ..ఇక రూం కి నడుస్తుంటే ....ఒక సుమో వచ్చి ఇందాక మేమున్న బస్సు నీళ్ళు ఎగిరించినట్లు ...ఎగిరించి మా మీద పడేలా చేసి పోయింది ...స్వాతి.. ఏది ఇప్పుడు వావ్ అను అన్నాను ..వా ..వా ..అనింది ...ఏమిటో అప్పుడు అలా....ఇప్పుడు ఇలా..
ఇంతలోనే పుటుక్కు మని నా చెప్పు తెగిపోయింది ....my shoe is gone...my shoe is gone (with tune) తో పాడుకుంటుంటే ..ఏంటి కిరణ్ బాధ లేదా ..అనింది ...హహ్హహ ..లేదు ..దేనితో పెద్ద బంధం పెట్టుకోకూడదు ...అందుకే నేను నా చెప్పు తో పెట్టుకోలేదు అన్నాను ..ఆ పిల్ల అదోల చూసింది ..భయమేసింది ..ఎక్కడైనా manhole లో తోసేస్తుందేమో అని ...అందుకే వెంటనే మార్చేసి ...ఆహా అది కాదు ..చాలా రోజుల నుండి వాడుతున్నా..ఇప్పుడు వాడాలని లేదు ..ఆలా అని పారేయబుద్ధి కాలేదు ..ఈ రోజు వీటికి పోయే కాలం వచ్చింది అన్నాను ...ఒహ్హో ..అని ఊర్కుంది ..హమ్మయ్య ...గండం గట్టేక్కానని ...ఊపిరి పీల్చుకుంటూ మెట్లెక్కి రూం కి చేరాను ..:)...కానీ మీరో విషయం గమనించాలి..మీరు వాడే వస్తువుల్లో ఏదైనా పారేయబుద్ధి కాక ఇంకా మీ దగ్గరే ఉంటే అలా పెద్ద వాన వచ్చినప్పుడు ఓ సారి తీసుకెళ్ళండి..ఓ పనయిపోతుంది..:):P
23 April 2011
వాన లో Mr.Perfect....
Subscribe to:
Post Comments (Atom)
అనన్య చురకలు !
మా పాపా పేరు అనన్య ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...
-
హ..హా....హా....చ్... శుభమా అని కొత్త సంవత్సరం మొదలవుతూ ఉంటే ఆ తుమ్ములేంటి...?? ఆహా ఒక్క సారికే...నాకు రోజూ తుమ్మోదయమే అవుతోంది మరి... కర్ర...
-
తెల్లవారు జామున ఏడుకి కి అలారం మోగుతోంది ..పొద్దున్నే తొమ్మిదింటికల్లా ఆఫీసు కి వెళ్ళాలని ఎవడు కనిపెట్టాడో కానీ అని అనుకుంటూ నిద్రలేచి గ...
-
I love blogging as i mentioned in this post ....and promised that will give you all the blogs which will be helpful,informative and enterta...
34 comments:
హ హ బావుంది కిరణ్ నే సినిమా కి వెళ్లి , తిగిగోచ్చే ప్రహసనం :) మొత్తానికి సినిమా నచ్చింది కదా అంట కష్టపడినందుకు . బొత్తి గా మీ స్వాతి మాట మీద నిలబడటం లేదు , ఈసారి నుంచి ఒకటే మాట చెప్పమంది ఎప్పుడు :ద
..మీరు వాడే వస్తువుల్లో ఏదైనా పారేయబుద్ధి కాక ఇంకా మీ దగ్గరే ఉంటే అలా పెద్ద వాన వచ్చినప్పుడు ఓ సారి తీసుకెళ్ళండి >>> హ హ మంచి సలహా :)
kiran garu cinema kanna vaana, vannalo bus,sumo, me shoe tegipovadam, adi kuda enjoy cheyadam life is so simple when u enjoy little things kada. meeru echina finishing touch evi baga nachayi.migata post lu kuda chadivestanu.
హ హ హ...మొత్తనికి వర్షం లొ మొష్టర్ పర్ఫ్హెక్ట్ ని బాగా ఎంజొయ్ చేయడమే గాకా కొత్త జొడు కుడా కొనుక్కున్నరన్న మాట.
"స్వాతి.. ఏది ఇప్పుడు వావ్ అను అన్నాను ..వా ..వా ..అనింది" అయితే భలే నచ్చింది.
సూపర్ గా రాశారు..
my shoe is gone...my shoe is gone (with tune) తో పాడుకుంటుంటే
కెవ్వ్ అంతే :D
Super :-)
సూపర్ పోస్ట్ నేరేషన్ అదరహో.. చాలా బాగుందండీ..
"ఆ పిల్ల అదోల చూసింది ..భయమేసింది ..ఎక్కడైనా manhole లో తోసేస్తుందేమో అని">>> హిహిహిహి
బొమ్మ అరుపులు.. Kiran Rocks... :)
హ హ బాగా రాశారు :-)
హహహ మొత్తనికి మంచి వర్షం సినిమా చూసారన్నమాట...బావుంది.
చివరికి నువ్వు చెప్పిన జీవిత సత్యం ఉంది చూసావూ...సూపరు.
"స్వాతి.. ఏది ఇప్పుడు వావ్ అను అన్నాను ..వా ..వా ..అనింది ...ఏమిటో అప్పుడు అలా....ఇప్పుడు ఇలా.."
".my shoe is gone...my shoe is gone (with tune) తో పాడుకుంటుంటే"
"దేనితో పెద్ద బంధం పెట్టుకోకూడదు ...అందుకే నేను నా చెప్పు తో పెట్టుకోలేదు అన్నాను" .....
.........
పైవన్నీ కెవ్వు కేక :D :D
తీన్మార్ చూసొస్తా అని చెప్పి Mr.పర్‌ఫెక్ట్ చూసొస్తార.. :)
asusual గ బొమ్మ అదుర్స్.
>>బుల్లి హీరో కి కాళ్ళు పొడుగ్గా,చేతులు పొడుగ్గా ముక్కు,కళ్ళు,మూతి మొహానికి సరిపోయెంతగా ...మొత్తానికి మొహం అందంగా... ఆరడగుల అందగాడిలా .. >>
మీరు ప్రబాస్ ఫ్యాన్ అని ఎంత బాగ చెప్పారో.. :) హాస్యం శాతం పెరిగింది ఈ టపాలో, ఇలానే వ్రాయండి.
సినిమా కోసం ఇన్ని కస్టాలు పడ్డవా కిరణ్ ..........
>>>>>>>>>> దేనితో పెద్ద బంధం పెట్టుకోకూడదు ...అందుకే నేను నా చెప్పు తో పెట్టుకోలేదు అన్నాను ..>>>>>>>>> కెవ్వ్ ...కెవ్వ్ ....నువ్వు మిస్ పెర్ఫెక్ట్ వి సుమీ
kiran mi cinimaa review mi vaana story adirindi....baavundi
హహహ..శ్రావ్య ..thank u ..:)..మీ మాట గా మా స్వాతి కి చెప్తాను..:)
శైలు గారు - చాలా సంతోషంగా అనిపించింది మీ కామెంట్ చూసి...అవను..కొన్ని కొన్ని చిన్నవి అయినా ఎంజాయ్ చేయడానికి బాగుంటాయ్ :)
వంశీ thank you so ముచ్..ఇంకా కొనలేదు...కొనేస్తా.. :))
కార్తీక్ గారు - థాంక్స్...:)
మీ కెవ్వ్ కి సమాధానంగా...నేను ఓ కేక ..:)
భాస్కర్ గారు :)..మీకు డబల్ థాంక్స్..:))
చంద్ర గారు - :D :D ...నా బొమ్మ ని గుర్తించి నందుకు మీరు కూడా రాక్ తూనే ఉండాలి ...:D
వేణు గారు - థాంక్స్..:)
సౌమ్యా జీ -- ధన్యవాదములు...
మీకు నచ్చినందుకు బోలెడు హాప్పీస్..:))
మీ కెవ్వ్ కేక కు - నేను కూడా ఓ కేవ్వ్వ్వ్ :)
తీన్మార్ గురించి అడగద్దు గిరీష్ గారు..:))..మీ రివ్యూ చదివేసాక ఎందుకు లే చూడటం అని వెళ్ళలేదు..:)
చాలా చాలా థాంక్స్..:)..నా బొమ్మని కూడా గుర్తించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు..:))
ఇలాగె రాయడానికి ప్రయత్నిస్తాను..:)
రంజని - ఏం చేద్దాం ...అప్పుడప్పుడు సినిమాలు చూడటానికి కూడా కష్టపడాలి మరి..చూసావా ఇంతమంది లో నువ్వొక్క దానివే గుర్తుపట్టావ్..:))
మంజు గారు - పెద్ద thank u :)
బాగుంది అమ్మాయి :) ... నీ సినిమా ప్రహసనం ( ఇక్కడ ఈ పదం వాడచ్చో లేదో తెలీదు కాని సౌండ్ బాగుందని వాడా ;) )
అంత కస్టపడి చూసావా .. హహ .. నేను ఇంట్లో చుసేసాగా .. నాకు పెద్ద నచ్చలేదు సినిమా
టాప్సి ని అయితే పట్టుకుని తన్నాలి అనిపించింది .. దాన్లో ఏ కొసన అమ్మాయి లక్షణాలే కనిపించలేదు . .
కాజల్ చాల బాగుంది .. చాల మేర్చురేడ్ గా ఉంది తన కారెక్టర్ .. ప్రభాస్ ని ఎందుకో ఫూల్ ని చేసారు అనిపించింది .. హం దీనికన్నా మా బుజ్జి గాడే బెటర్
కావ్య - నాకు తెలీదు..ఇద్దరం ఇదే కరెక్ట్ అనుకుందాం..:)
హేహేహే..తిట్టు బాగా తిట్టు...నేను పండగ చేస్కుంటా...:)...హ్మ్న్నన్..ధియేటర్ లో చూడు కావ్య..నీకు ఈ సినిమా నచ్చుతుంది..:) :P
పోస్టులో స్మైలీలను వెతుక్కొవాలో, స్మైలీలలో పోస్టును వెతుక్కోవాలో అర్ధం అవట్లా. :P
దశరధ్‌గారి సినిమా నుండి వచ్చేప్పుడు మనతో మొసుకొచ్చే సంభాషణలు కొన్నయినా ఉంటాయి. అసలు ఆయనే పూర్తిగా అన్ని డైలాగ్స్ రాసుంటే ఇంకా బాగుండేది. కాజల్ పాత్ర కాస్త మేడీకోర్‌గా అనిపించినా సినిమా చివరకి వచ్చేసరికి మనకి తెగ నచ్చేస్తుంది. సినిమాతో పాటు మీ పాటలు,పాట్లు కూడా బాగున్నాయి.
అందరు బొమ్మ బొమ్మ అంటే ఏంటొ అర్ధం కలా, పోస్ట్‌ను మరొకసారి చూస్తే కనిపించింది. బొమ్మ బాగుంది :)
నాగార్జున - ఎంత మాట..ఎంత మాట..:)...సరిగ్గా చూడండి..నాలుగే నలుగు స్మిలెయ్ లు ఉన్నాయి..మొత్తం టపాలో..:)
బొమ్మ నచ్చినందుకు బోలెడు సంతోషం :)
మురళి గారు - అవును చాలా సంభాషణలు నాతో వచ్చాయి..ఇంటి వరకు..:)..ధన్యవాదాలు.:)
"ఇలా అర్థం చేస్కొడానికి ఇద్దరు హీరోయిన్లను పెట్టి , లచ్చలు లచ్చలు ఖర్చుపెట్టి సినిమా తీసి హీరో కి అర్థమయ్యేలా చేస్తాడు మన డైరెక్టర్"-వామ్మో మా కిరణ్ కి చాలా జీవిత సత్యాలు తెలిసిపోతున్నాయి!!..నీ సినెమా ప్రహసనం సింప్లీ సూపర్బ్
ఎన్నెల గారు ధన్యవాదాలు..మరి మనం వందలు వందలు పెట్టి చూస్తున్నప్పుడు ఆ మాత్రం అర్థం చేస్కోవాలి కదా..:)
:-) :-) :-) :-) . . . . . . . . meelO manchi talent kanapaDutundi keep going. :-)
క్రాంతి కుమార్ గారు నిజంగా ఉందంటార...
చాలా సంతోషం మీకు నచ్చినందుకు :)
సూపర్ గా రాశారు..
kiran garu.. chala chala baagundandi..
అరుణ్ కుమార్ గారు - నా బ్లాగ్ కి స్వాగతం..:)
ధన్యవాదాలు..:)
దివ్య గారు - చాలా థాంక్స్ అండి..:)
baagunnai mee ideas and paints... good ones.
kavya gaari outofmyscope blog open kaavatam ledentandi... naa system problem ah leka blog problem oh... mee laanti blog writers eh cheppagalaru... konchem cheppi punyam kattukondi
హ హ్హ కేక కష్టాలు (సినిమా )
pics are as usual
Excellent!
@హరే కృష్ణ - నా కష్టాలు చూసి నవ్వుతావ.. గుర్ర్ర్రర్ర్ర్..
Thank u ..:))
ఆ మధ్యనెప్పుడో నన్ను వర్షంలో తడవాల్సిందని సలహా చెప్పారు ఇప్పుడర్ధమయ్యింది ఆ సలహా వెనక అంతరార్ధం...ఐనా నా షూ పాతదవలేదు...అందుకే నేను తడవలేదు హి హి హి...
పోస్టు మాత్రం పైన అందరూ చెప్పినట్టు సూపరు
స్పురిత గారు...మీకు సలహా ఇచ్చింది నిజంగా ఎంజాయ్ చేయమని చెప్పడానికే అండి :)
థాంక్ యు :))
కేక సినిమా కేక పోస్ట్
నైస్ post కిరణ్
ఎక్కడైనా manhole లో తోసేస్తుందేమో అని
lol
భారతీయ గారు - :))))..థాంక్స్ :)
Post a Comment