3 April 2011

నేనే గెలిపించా


నేనే గెలిపించా..నేనే గెలిపించా..
ఎవరినమ్మా
కిరణు ??
భారత
దేశం ప్రపంచ గిన్నె గెలిచింది కదా ...అది నా వల్లే ...

ఆహా ...ఎలాగా ..??
గోబీమంచూరియా తింటూ ...
ఒహ్హూ ....
మరి ఆడినోళ్ళు?? ...
వాళ్ళేం చేసారు ..ఊర్కె బాట్ తో బంతి ని కొట్టారు అంతే కదా...
అద్దో ...అదే మీ గీత.. అంతకు మించి దాటి నన్ను కొట్టటానికి రాకూడదు .. :P

కిరికెట్ అంటేనే చిరాకు అనే నేను మరి కిరికెట్ చూసి గెలిపించానంటే గొప్పే కదా మరి .. :).నా చిన్నప్పుడు బానే ఆడాను.ప్లాస్టిక్ బంతి ప్లాస్టిక్ బాట్ పట్టుకుని ..అన్నీ నాలుగులు లు ఆరు లే తెల్సా ??

కాస్త అందరం పెద్దయ్యాక ...కాస్త బరువు తక్కువ ఉండే చెక్క బాటు...ఒక రబ్బరు బంతి ఉండేది...దానితో కూడా నాలుగులు ఆరు లు బానే కొట్టారు ..అవును నేను కొట్టడం మానేసా ఎందుకంటే....బాటు, బంతి పట్టుకుని వెనక వైపు వస్తుంటే అమ్మమ్మ పిలచి అక్కడ తులసి కోట ఉంది దాన్ని తప్ప దేన్నైనా కొట్టుకోండి అంది ...మా అన్నయ్యకి నా ముక్కు కనిపించింది ..ఇక అప్పటి నుండి ...వెనకాల పెరట్లో మా వాళ్ళు ఆడుకుంటుంటే నేను ఒక కటకటాల తలుపు వెనక ఒక కుర్చీ వేస్కుని మరీ కూర్చుని చూసేదాన్ని .. :P

ఆలా కిరికెట్ కు నాకు బంధం కాస్త తెగింది ..తర్వాత కొన్ని రోజులు చూసేదాన్ని ..మా ఇంటిల్లపాది నన్ను మోసం చేస్తూ వచ్చేవాళ్ళు ..అవును...అప్పట్లో ఎప్పుడు చూసిన కిరికేట్టే చూసే వాళ్ళు ..నాకు లైవ్ మ్యాచ్ అని ఎలా తెలుసుకోవాలో తెలిసేది కాదు..:P..అందుకని ఇప్పుడు ఆడుతున్నారు..పాత మ్యాచ్ కాదు అని ప్రతి మ్యాచ్ కి అబద్ధం చెప్పే వాళ్ళు. అప్పుడు చిరాకేసి....వీళ్ళు ఆడే బాళ్ళు అన్ని మురిక్కాలువలో పడిపోవాలని ,స్టేడియం లోకి వందల కొద్ది కుక్కలు వచ్చేయ్యాలని అనుకునే దాన్ని ..అసలు రెంటికి లంకె ఏంటి అనే కదా..?? చాలా ఉంది ...మేము కిరికెట్టు ఆడేటప్పుడు బాలు వెళ్లి మురిక్కాలువలో పడ్తే ఇక మళ్ళి వారం,పదిహేను రోజుల వరకు కొనిచ్చే వాళ్ళు కాదు ...ఇంకా పెరట్లోకి కుక్కలు వస్తే కోపం తో బాట్ లు విసిరేసే వాళ్ళు ...అది ఎప్పుడు కుక్క కి తగలకుండా వెళ్లి బండ రాళ్ల మీద పడి ముక్కలైపోయేది ...బాట్ విరిగితే కనీసం రెండు నెలలు పడ్తుంది మళ్ళి బతిమాలి కొనిచ్చుకోడానికి ...ఇప్పుడు అర్థమైందా నా బాధ :p...వాళ్ళవి కూడా ఆలా పోతే వాళ్ళకి ఆడటానికి ఇంకా కొన్ని రోజులు బంతి బాటు ఉండవని నా అపోహ...

ఇలానే అనుకుంటూ కోపంగా ఒక రోజు మా పెద్ద బావ కిరికెట్టు పిచ్చోడి లాగా నోరు తెరచుకుని చూస్తుంటే ..బావ స్టేడియం పక్కన మురిక్కాలువ లేదా అని అడిగా...పాపం వాడు వెళ్లి మా అత్తయ్య వంటిట్లో కూరలు తరుగుతుంటే ..అమ్మ కిరణు స్కూల్ ..ఎందుకే నన్ను తినేస్తోంది ..పిలిచి కాస్త పనులు చెప్పవే అన్నాడు ..ఇది విని చాలా తెలివి గా.. మా అత్తయ్య పిలిచే లోపే హాలిడేయ్స్ హోం వర్క్ మొదలెట్టేస ..

ఇలా నర నరల్లోను కిరికెట్టు మీద నాకు అసహ్యం పెరిగిపోయింది ...నాకు ప్రపంచం లో నచ్చని ఆట కిరికెట్టు అని తీర్మానించుకున్న .. :)...

ఇలా గట్టిగా ఫిక్స్ అయిపోయి అంతా మరిచిపోయిన వేళ వరల్డ్ కప్ మొదలైంది ..నా అదృష్టం ఎక్కువయి మా రూం లో కిరికెట్టు వీరాభిమానులు చేరారు ...నేను మాములుగా చూడను ..ఎంత బతిమిలాడిన..అలాంటిది ..ఆస్ట్రేలియా తో మ్యాచ్ జరుగుతున్న రోజున ఆఫీసు లో పెద్ద ప్రొజెక్టర్ పెట్టేసారు ...కాఫీ తాగుదాం అని వెళ్తే గోల గోల ... రోజుకి పని అయిపోవడం తో మా వాళ్ళు అక్కడే కూర్చున్నారు ..ఇక టీం లేకుండా నేనొక్క దాన్నే పని చేస్తే పాపం వాళ్ల అప్ప్రయ్సల్ కి దెబ్బ అని వాళ్ల గురించి అలోచించి ..వాళ్ళతో పాటే ఉంటే ...మా టీం లో ఒక ఆయన కిరణు ఇటు రా..అన్నారు ..వెళ్లి పక్కన కుర్చోంగానే ....ఇద్దో నేను పని ఇవ్వగానే చేయను అరుస్తావే దానికి రెండింతలు ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ల వికెట్ పడితే అరవాలి అన్నారు ...మీరు అన్నాను ..?హా మేము అరుస్తాం అన్నారు .. :)..సర్లే ఎప్పుడో ఖలేజ కి అరిచాము మళ్ళి మగేష్ బాబు సినిమా రావాలంటే ఒక మూడు ఏళ్ళు పడ్తుంది ఇంతలో గొంతు పోతే వచ్చేస్తుంది లే అని గట్టి గట్టిగా అరిచేసాం .. అరవటం తో నాలో నిద్ర పోతున్న కిరికెట్టు అభిమాని లేచిందనుకుంట ...ఇండియా బాటు పట్టుకునే లోపు చేరాలని ...జై పి టి ఉష అన్నాను ..రూం లో ఉన్నాను ...ఇక ఇండియా బాటింగు ..బాబోయ్ బోలెడు రకాల సెంటిమెంట్లు జనాలకి ..ఒక పిల్ల బైటికి వస్తే వికెట్ పడుతుంది అని .. పిల్ల ని గది లో పెట్టి గొళ్ళెం పెట్టారు ...నేను టీవీ ముందు నుండి కదిలితే వికెట్ పద్తోందని ...అన్ని టీవీ దగ్గరికే అందుతున్నాయి ..ఇదేదో బాగుందని ..నేను కూడా అన్ని పనులు 10.30 లోపల చేయించేస్కున్న ..ఇవన్నీ పక్కన పెడ్తే ...ఆశ్చర్యంగా నాకు కంగారు ..గెలుస్తుందో లేదో అని ..ఇదెక్కడ కొత్త గోల రా బాబు అనుకున్నా ..గోర్లు కోరికే అలవాటు లేదు ..అలవాటు ఉన్నా గోర్లు లేవు ..నేను గుడ్ గాల్ ని కదా .. :P..మా రూం లో వాళ్ల మొహాలు మరీ టెన్షన్ గాను ఉన్నాయి ... ...అని చూడటం మొదలెట్టిన నన్ను నేను తిట్టుకుంటూ మ్యాచ్ ని గెలిపించి పడుకున్నా ...

మళ్ళి పాకిస్థాన్ తో మ్యాచ్ ...అప్పటికి రూం లో లేను కాబట్టి కాస్త బతికి బైట పడ్డట్లే ..లేక పోతే మా వాళ్ల మొహలకి నా కంగారు కి నా లోని బొమికేలే కాక నరాలు కూడా బైట పడిపోయేవి ..అప్పుడప్పుడు స్కోరు చూసి ఇండియా ని గెలిపించి ఊపిరి పీల్చుకున్నా ..ఇక నిన్న అటు చూడాలని ..ఇటు ఏమవ్తుందో అని ...200 దాటేంత వరకు బానే ఉన్నా ..దాటాక చెమటలు ..అబ్బ ...అబ్బ ..అంటూ ..మా అమ్మ రిమోట్ లాక్కొని లోపలికి వెళ్లి సేకండుకోసారి అరుచుకో అబ్బ ..అమ్మ అని అనింది .. :P..సరే అని ఏవో కొన్ని పుస్తకాలు తెరచి చదువుతుంటే కూడా ఏదో మూల కంగారు ..ఇలా కాదు ....కర్మ మాత్రమే నువ్వు చేయవలెను ...ఫలితము ఆశించ రాదు అని నేను నాకు చెప్పుకుని ...నా ముందు ఆడుతున్న ధోని కి ముప్పై సార్లు చెప్పాను ...ధోని ఒసేయి నోర్ముయ్ అన్నాడు ...చివరికి లాస్ట్ లో ఒక సిక్స్ కొట్టి అద్బుతమైన ఎక్ష్ప్రెషన్ పెట్టాడు ..ఇక్కడ నేను కూడా అలాంటిదే పెట్టాను .. :D...హమయ్య అని టీవీ ఆఫ్ చేస్తున్నంతలో నా చిన్న మెదడు పెద్దగా పని చేయడం మొదలు పెట్టింది ..ఫలితం దక్కే టయానికి టీవీ కట్టేస్తే ఎలాగా అని చూస్తున్నా ...నాకు కిరికేట్టంటే చిరాకయితే అది జరుగుతుండగా వచ్చే కామెంటరీ అన్నా ,ఐపోయాక మెడల్స్ ఇచ్చే సమయం అన్నా పరమ చిరాకు ...నాకు ఏమి అర్థం అయ్యి చచ్చేది కాదు ..అందరు కూడా అర్థమయినట్లు నటిస్తున్నారు అనుకునేదాన్ని :P
అదేంటో విడ్డురంగా నిన్న అంతా అర్థమయిపోయింది .. :P...ఏమి లేదు ...ఇలా మొదలెడతారు...వెల్ ...హౌ ఆర్ యు ఫీలింగ్ ...?అని ...ఆటగాడు ఇలా...hmnnn..రియల్లీ ప్రేషియౌస్ మొమెంట్స్ ...వేరి హ్యాపీ..ప్రౌద్ టు బి ఇన్ ది టీం ..ఇలా ..ఇంకొకరు ...వస్తారు అదే ప్రశ్న ....మళ్ళి ..వెల్ల్ ..హ్మ్న్నన్ ...అండ్ అని 2 ,3 చోట్ల ఉపయోగించి థాంక్స్ చెప్పి వెళ్ళిపోతారు .. :) :P(కాక పోతే కాస్త సాగ దీయాలి )..ఇంత చిన్న ది ఇన్ని రోజులు ఎందుకర్ధం కాలేదా అనుకున్నాను .. :P... నిమిషం లో చాల అర్థమైన్దనిపించి ...దీనికంతా మా నాన్న చెప్ప్పించిన చదువని గుర్తొచ్చి ఆనంద బాష్పాలు కారాయి ...వాటితో మొహం మా నాన్న వైపుకి తిప్పి నాన్న గారు అన్నాను ...అంత సేపు చప్పట్లు , ఈలలు వేసిన నాన్న కూడా దీనంగా మొహం పెట్టి ఇలాంటివే భారత దేశం మొత్తం గర్వించ దగ్గ క్షణాలు అన్నారు ..నాకు అప్పుడు స్ప్రుహోచ్చింది ..అంత కంటే త్వరగా మా అమ్మ లో రియాక్షన్ వచ్చి రిమోట్ తీసి టీవీ ఆఫ్ చేసి ..ఇద్దో ఇప్పటి వరకు చూపించిన మీ ప్రేమ చాలు.. మీకు కావాలంటే వెళ్లి బైట వాళ్ళతో పాటు టపాకాయలు కాల్చుకోండి ..నేను పొద్దున్నే లేవాలి అంది ..గప్ చుప్ గా వచ్చి నిద్రపోయాము ..

ఒరు నిమిషం ....అందరు ఉగాది పచ్చడి బాగా చేస్కొని తినేయండి ...అందులో ఎంత వేప పూత వేసిన మీ నోటికి తీయగానే తగలాలి ...మీ స్నేహితురాలిని కదా మరి ..అలాగే మీ మంచే కోరుకుంట ..

సర్వేజనా సుఖినోభవంతు .. :)
"ఖరనామ" నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు .. :D

16 comments:

Sai Praveen said...

చాలా ఫున్నీగా రాసారు ఎప్పటి లాగే. :)
మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు.

కావ్య said...

చాలా బాగుంది .. అమ్మాయి నీ క్రికెట్ ఫీవర్ :)
చాలా ఫన్ని గా నేరేట్ చేసావ్ ,, నీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ..

Sravya Vattikuti said...

ha ha really Superb Kiran :)

ఆ.సౌమ్య said...

హహహ చాలా నవ్వొచ్చింది కిరణ. ధోనీ "ఒసేయ్ నోర్ముయ్" అన్నాడా!....హహహ్హహహ.
సరేగానీ కిరణ్ మీరు తమిళులా? 'మగేష్ బాబు', 'ఒరు నిముషం' అని రాస్తే డౌటొచ్చింది. తమిళులయుండి ఇంత చక్కగా తెలుగు రాస్తున్నారంటే (కొన్ని కొన్ని తప్పులున్నా)...great! అభినందనలు!

మీకు, మీ కుటుంబ సభ్యులకి శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

kiran said...

@saipraveen గారు - thank you
@కావ్య , @ శ్రావ్య - thank youuuu
@సౌమ్య గారు - హహ thank you
నచ్చినందుకు చాలా సంతోషం..తమిళా ..హహ..కాదండి..ఆ రెండు పదాలే వచ్చు..ఏదో సరదాకి వాడాను.. :P
తప్పులు ఉన్నాయా.. :(..అవి తొందర పాటు వల్ల దొర్లినవి.. :)

మధురవాణి said...

హహహ్హా! తెగ నవ్వించేసారు కిరణ్! సూపర్ గా రాశారు! మొత్తానికి ఇండియా కప్పు గెలిపించింది మీరేనన్న గొప్ప నిజాన్ని మాకు తెలియజేసినందుకు థాంక్స్! :) గెలిపించినందుకు డబుల్ థాంక్స్! :)
మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు.

గిరీష్ said...

బొమ్మదిరింది.. :)
తెలుసు తెలుసు ఆ బ్యాట్, ఆ బాల్ తో నో రన్, 1,2,3లు రావులెండి :D
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఖరనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు..

kiran said...

@మధుర - thank you thank you .. :)
@గిరీష్ గారు - నా బొమ్మ ని గుర్తిన్చేసారా .. :D thank youu ..
ఏంటండి..నా దగ్గర ఇంకా ఆ బాట్ ఉంది..రండి ఆడుదాం..అప్పుడు తెలుస్తుంది మీకు.. :P

chandra said...

చాలా ఫన్నీ గా రాశారు చాలా హాయిగా అనిపీచిందండి. ఇలాంటి మరిన్ని పోస్ట్లు రాస్తారని ఆశిస్తున్నాను.

Ennela said...

kiran..nuvvu tamilammaayaa?...hahahaha..alaa 'evaru raaste burra tirigi mind block ayi ilaanti prasnalu vastaayo, aa ammaye kiran-oka manchi telugammaayi'
sare ippati daakaa criket ki arichaavu kadaa...ippudu naa comment ki adey range lo aravaali..lepotey nenoppukonante!!!
bhale bhale wraasaavule!

kiran said...

chandra garu chala thanks andi... :)

ennela garu - :D:D..thank u.. :D
kevvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
saripoyinda na arupu... :)

Radha said...

"...ఆ నిమిషం లో చాల అర్థమైన్దనిపించి ...దీనికంతా మా నాన్న చెప్ప్పించిన చదువని గుర్తొచ్చి ఆనంద బాష్పాలు కారాయి ...:
super!!!!!
meeku kooda khara naama samvatsara subhaakankshalu... ee year lo aina meeru naa antha laaaaaaaaaaavu avvalani aasistunna ;)

kallurisailabala said...

Nenu kuda achham alage anukunna...nenu cricket chuste match odipotundi ani India gelichedaka tv chudaledu...nice post andi migatavi kuda chaduvutanu...meku velunnapudu na blog chusi me opinion cheppandi

http:/kallurisailabala.blogspot.com

క్రాంతి కుమార్ మలినేని said...

good bagundandi. chaduvu mee naanna garu nerpinchaaru ilaa raayatam evaru nerpinchaaru??? ;-). I liked the way of narration very much.

kiran said...

రాధా గారు ..హహ్హ...అలాగే..:)
శైలు - :))...చెప్పేసాను ..నీ బ్లాగ్ ఓ అద్బుతం..:)
క్రాంతి కుమార్ గారు - :)...మీ కామెంట్ చూసి చాలా సంతోషం వేసింది..:)..థాంక్స్..:)

Bharatiya said...

..............దీనికంతా మా నాన్న చెప్ప్పించిన చదువని గుర్తొచ్చి ఆనంద బాష్పాలు కారాయి ...వాటితో మొహం మా నాన్న వైపుకి తిప్పి నాన్న గారు అన్నాను ...
ahahaha
ఎమ్మన్నా రాసావా కిరణు
bhaga navvisthunaru
thnkx for ur post andi

ఫిదా కి ఫిదా

శేఖర్  కమ్ముల గారు బాగున్నారా?? మీకే ??  బానే  ఉంటారు !! .. మా పరిస్థితే  ఏమి బాలేదు.. ఏం చెప్పమంటారు .?? మాది ఒక  సాఫ్ట్వేర్  జంట .. చి ఛ...