Posts

పెళ్లి రోజు కానుక !!

Image
కికికికి సంవత్సరం అయిపొయింది .... ఇది పెట్ట.. బేడా సర్దుకుని ... ఎక్కడికో వెళ్ళిపోయింది ..దీని గోల తప్పింది  అని ఊపిరి పీల్చుకుంటున్న సమయం లో .... నన్ను చూసి ఉలిక్కి పడ్డారా కాలం ..జీవితం .. పరిగెడుతూ ఉంటాయి .. అన్నీ క్షణాల్లో జరిగినట్లు జరిగిపోతాయి ..  ఖాలీ ఖాలీ గా బ్లాగు లు ఎవరు రాస్తారా .. అని ... అన్ని టపాలు చదివేసే నేను ..ఇలా అయిపోయాను అంటే అది కాలం మహిమే ఇంట్లో ఆఫీసు లో అప్పుడప్పుడు పని చేస్తున్నా .. ఎప్పుడూ  పని చేస్తున్నట్లే అనిపించేస్తోంది... మీ అందరిని అప్పుడప్పుడు బస్సు లో వెళ్తున్నపుడు .. ఆఫీసు లో సరదా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడూ . హాయిగా మనసారా నవ్వినప్పుడు తలుచుకుంటూ ఉంటాను ..

ఇంతకి విషయం ఏంటంటే నా  పెళ్లి అయ్యి అప్పుడే 730 రోజులు అయిపొయింది !

ఒక్క రోజుకే దండం పెట్టిన జనాలు ఉన్నారు..నన్ను  రోజులు గా భరిస్తున్న మా వారు గ్రేట్ కదా!
అదే కాదు నాకు ఈ కింది వస్తువు పెళ్లి రోజు కానుక !! -- easel (పెయింటింగ్ వేసుకునేటప్పుడు కాన్వాస్ పెట్టుకోడానికి )


అమ్మా కిరణు ..ఎలా సాధించావ్ దీన్ని అని అడిగితే ..ఇలా చెప్పగలను 
మా ఆయనకు కొన్ని ప్రమాణాలు చేశాను..   నిలబెట్టుకున్నాను..  దానితో ప…

రెండు రోజుల పెళ్ళి రోజు

Image
ఈ వారం పెళ్ళి చూపులు ..
ఏవరికి నాన్న…?
నాకు ..మీ…అమ్మకి…
అయితే తమ్ముణ్ణి రమ్మని ఫొనె చేస్తాను …
ఏం తిక్క తిక్క గా ఉందా …?
వచ్చే వారం …పెట్టుకుందాం …
వద్దు..అనుకున్నవి అనుకున్నప్పుడే అయిపొవాలి…
ఆవును…మరి మీ నాన్న మా పెళ్ళైన కొత్తల్లో తమిల్ నాడు టూర్ వెళ్దాం అన్నారు …ఇప్పటి వరకు ఎందుకు కుదర్లేదో …అంటూ మాట విసిరింది మాతా శ్రీ ..
హిహిహి
నవ్వాపి ఫొనె పెట్టేయ్ ..శనివారం పొద్దున్నకళ్ళా ఊరికొచ్చెయ్ …

***
ఆసలే వివరాలు అడగవా ….??
ఏమడగాలి ..ఫొటొ చూసాను కదా …?
ఏ ఊరు..ఎంత మంది అక్క చెల్లెల్లు..వయసెంత ..?
సరే మీరే జవాబులు చెప్పండి ..
పొగరు ….ఇలాగే మాట్లాడకు ….వెనక్కెళ్ళిపొతారు ..
జవాబులు ..
ఉఫ్ఫ్ ….ఒక చెల్లి…తూర్పు గోదావరి జిల్లా …
అయ్య్ రాముడికి దగ్గరవుతా …
ఆన్నీ కుదిరితే అవుతావ్ …లెదంటే వేరే అమ్మాయికి అవుతాడు ..
ఎహె నాన్న ..వచ్చే అబ్బాయ్ గురించి కాదు ….శ్రీ రామ చంద్రుడి గురించి మాట్లడుతున్నా ..
గోదావరి చూడచ్చు ..శేకర్ కమ్ముల ఎంత బాగా చూపించాడు …
ఉఫ్ఫ్ …..దానిని ఓ సారి ఆ గుడికి తీస్కెళ్ళి ఏమన్నా పట్టిందేమొ స్వామి ని అడిగేసి రా…

సీరియల్స్ బామ్మ

Image
"ఏవండి...మీరు ఉద్యోగం మానేసి ఇంట్లో అన్నా ఉండండి..లేదా..నాకు ఏదో ఒక ఉద్యోగం చేస్కునే అవకాశం ఇవ్వండి..."
"మళ్లీ ఏమైంది...?"
"కొత్తగా అవ్వడానికి ఏమి లేదు...మీ అమ్మ గారున్నారే..."             
"మీ ఇద్దరి గోల నాకు చెప్పద్దు అని ఎన్ని సార్లు చెప్పాను...?"
"హా..చెప్తారు....పిల్లలు కూడా వాళ్ళ బామ్మ అంటేనే పారిపోతున్నారు...."
"మరీ మా అమ్మ అంత గయ్యాళి ఏమి కాదు...."
"నేనన్నానా..??..ఆ టీ వీ ఇంట్లో వద్దు....ఎవరికన్నా ఇచ్చేద్దాం...ప్లీజ్..!!"
"అబ్బా...అది ఉంటే ఏదో ఒకటి కాలక్షేపం ఆవిడకి..."
"సరే నేను రేపు ఎట్టి పరిస్థతిల్లో... మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే...మీరు సెలవ పెట్టుకుని...అత్తయ్య గారిని చూస్కోండి..."
"అలాగే లే...పో.."
--------------
పొద్దున్న ఆరింటికి పెద్దావిడ లేచి...
---------------- "అమ్మా...పార్వతి...కాఫీ ఇవ్వమ్మా....ఆ బ్రూ అడ్డిమెంట్స్ లో వాళ్ళు..ఆహ..ఓహో అంటారు కదా...అలా వాసనా..రుచి రెండు ఉండాలి.."
"అమ్మా..ఈ రోజు అది వాళ్ళ చెల్లి ఇంటికి వెళ్ళిందే....నేనే ఉన్నా…

మీరంతా ఆహ్వానితులే ... :)

Image
నేను వంట చిన్నప్పుడే చేసేదాన్ని...చిన్నప్పుడంటే B.Tech లో ఉన్నప్పుడు... మా అమ్మ ఊర్లో ఉన్నప్పుడు ఎప్పుడూ వంటింట్లోకి వెళ్ళిన పుణ్యానికి పోలేదు...నాకు మా అమ్మ అంటే అంత గౌరవం...తాను చేస్తుండగా..నేను వెళ్లి నీ పని నేను చేస్తా అంటే ..పాపం నా పని సరిగ్గా లేదేమో అని అమ్మ మనసు నొచ్చుకుంటుంది కదా..ఇలా అన్ని రకాలు గా అలోచించి..వంటింట్లో కి కూడా వెళ్ళకుండా...హాల్ లో నుండే నీళ్ళు అడిగేదాన్ని...ఒక్కోసారి చేతికొచ్చేవి...ఒక్కో సారి మొహాన పడేవి...అది మాతృ దేవత మూడ్ ని బట్టి ఉంటుంది..!!అయినా ఏవండోయ్...ఏనాడు వంటింట్లోకి వెళ్ళేదాన్ని కాదు...!!
అమ్మ అమ్మమ్మ కి వంట్లో బాలేదనో..తాతయ్యకి జ్వరంగా ఉందనో..పిన్ని రాక రాక పుట్టింటికి వచ్చిందని చూడటానికి వెళ్తేనో..నా పెతాపం బైట పడేది..కొన్ని రోజులు నాన్న చేసేవారు...తర్వాత అమ్మతో  తిట్లు తినేవారు..."బాగుంది...అన్నీ మీరు చేస్కుంటే దానికేప్పుడు పని వచ్చేది...వదిలేయండి..వచ్చీ..రానీ వంటలు పనులు చేస్కుంటేనే కదా మనం ధైర్యంగా ఇంకో ఇంటికి పంపగలం"..అంటే..అప్పట్లో ఏమనుకునే దాన్నంటే..దీనికి ఉద్యోగం రాకపోతే కనీసం ఈ పని కైనా పంపిద్దాం అనుకున్నారేమో అనుకునే దాన్ని..…

హ...హ...హ..

Image
హ..హా....హా....చ్...శుభమా అని కొత్త సంవత్సరం మొదలవుతూ ఉంటే ఆ తుమ్ములేంటి...?? ఆహా ఒక్క సారికే...నాకు రోజూ తుమ్మోదయమే అవుతోంది మరి... కర్రెస్ట్ గా అలారం మోగడం..మా రూం మేట్ హచి హచి మని తుమ్మడం.... ఈ రోజూ ఏ గండం నా ముందుందో అని భయపడుతూ నిద్రలేవడం...ఈ పిల్ల ముక్కు కోసేసి ఆ గూట్లో దాచేయాలి..ఈ చలికాలం అయ్యాక మళ్లీ ఇవ్వాలి...అనుకుంటూ..రామయ్య తండ్రి....ప్లీజ్ హెల్ప్ మీ అనడం...ఆయనేమో బిజీ గా ఉన్నా...గో టు యువర్ కిట్టి అనడం....నేను వెళ్లి..కిట్టే...అని స్టైల్ గా పిలిస్తే....ఆయనేమో ఇస్టైల్ గా చేత్తో బాబా ని చూపించడం....ఈ బాబా ఏమో ఈ మధ్య నన్ను ఎన్ని సార్లు తల్చుకున్నావే..ఇప్పుడు మాత్రం నేను కావాలా..అన్నట్లు చూడటం..సర్వసాధారణమైపోయింది...
"గాడ్..యు ఆర్ basically గుడ్ గాడ్...నా వల్ల కాదు...నేను ఆఫీసు కు పోను...." "సరే మీ ఆంటీ దగ్గరికి పో ..నిన్న రాత్రి కారట్ కూర చేసిన మూకుడు నుండి ......ఈ రోజూ మీ అంకుల్ తాగిన కాఫీ గ్లాస్ వరకు సింకు లో ఉన్నాయి....కడిగేయి..." "నో గాడ్...నో..." "మరి మూసుకుని ఆఫీసు కు పో" "నచ్చట్లేదు..గాడ్ నచ్చట్లేదు.." "నువ్వు ఆ …

శైలు's వెన్నెల్లో గోదావరి...!!

Image
పుస్తకం లో ఇలా కనిపిస్తోంది..బాగుంది కదా :D


ఆహా...ఒహోఒ.......నేను నిన్న 6 .40 -7 గంటల మధ్య గాలిలో తేలుతూ ఉన్నాను..!!
ఎందుకో చెప్పుకోండి...??
వెన్నెల్లో గోదావరి పుస్తకం చేతిలోకి తీస్కున్నా...
మొదట ఏం చూసానో చెప్పుకోండి....ఎలాగో కథ తెలుసు..కవర్ పేజి కూడా తెలుసు...మొత్తం బ్లాగ్ లో చూసేసా..!!
కాని నా painting ఒక బుక్ లో రావడం...అది నేను చుస్కోడం....అబ్బో..అబ్బో...అసల వద్దు లెండి..
పక్కన నా కజిన్ ఉంటే...తనని పిలిచి నా painting చూడు అని చూపెట్టాను...
తనేమో వావ్ అక్క...భలే ఉంది..!!అనింది....
మరి కథ అంతా బాగుంటేనే కదా...నాకు అలా వేయాలని అనిపించింది...ఇది నా ఫ్రెండ్ రాసింది చదువు అని చెప్పాను..!!
ఏదో buzz లో ,చాట్ లో ఓ మాట్లాడేస్కుంటాం కానీ...
ఓ సారి షాప్ లో పుస్తకం మీద ఆదెళ్ల శైలబాల అని రాసింది చూసి...ఓ.... శైలు నాకు తెల్సు..బాగా తెల్సు... అని కాస్త గర్వంగా కూడా ఫీల్ అయ్యాను...!! :D
ఇక పుస్తకం గురించి చెప్పేదేముంది......మీకందరికీ తెలిసిందే కదా...
ప్రతి line లోను ప్రేమే నిండి ఉంటుంది...కొన్ని సన్నివేశాల్లో మనల్ని మనం చూసుకోగలం ..!!
నాకు అతి ఇష్టమైన అమ్మమ్మ,తాతయ్య ల గురించి ఎంత బాగా రాసిందో...
ఇక శైలు…

నా 'వెన్నెల' నేస్తాలతో....

Image
కార్తీక్ పెళ్ళికి రాని వాళ్ళందరూ వచ్చి నేను చెప్పేదంతా శ్రద్దగా..వినండి..

నేను జీవని ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళే లోపే అందరూ అక్కడ ఉన్నారు.....ఆ కాలనీ లో కి అడుగుపెట్టంగనే...కావ్..కావ్..కావ్..అని వినిపించింది..ఇల్లు ఈజీ గా గుర్తుపట్టేసి ఇంట్లోకి దూరాను..వెళ్ళగానే పెద్ద quiz పెట్టారు...ఎవరు ఎవరో గుర్తు పట్టమని...అప్పు ని ముందే ఫోటోలలో చూడటం వల్ల సౌమ్య గారిని ఈజీ గా కనుక్కో గలిగాను...అప్పటికి అందరూ....టిఫ్ఫినీలు చేస్తున్నారంట...అంట అని ఎందుకు అన్నాను అంటే...ఉగ్గాని..,మిరపకాయ్ బజ్జి లు...,ఇడ్లి లు ..ఇన్ని plate లో ఉంటే నేను భోజనం అనుకున్నా మరి...ఎవరు తలెత్త లేదు..అయినా నేను చాలా తెలివిమంతురాలిని కదా....అందరిని చక చక గుర్తు పట్టేసా..!!....ఆ తర్వాత ప్రసాద్ గారు వచ్చి టిఫిన్ చేయండి అని plate చేతికిచ్చారు..అందరి plate లో ని పదార్థాల్ని చూసి చాలా భయం వేసింది...పొద్దున్నే అగ్ని పరీక్ష లాగా అనిపించింది...కాని ఆకలి ...మండుతోంది..!!కొంచమైనా తిందామనుకున్నా..కానీ నేను గర్వించేలాగా..plate మొత్తం ఖాళి చేసేసాను..!!.....కాకపోతే రెండు గంటలు పట్టింది...!!..ఇంతలో నన్ను చూస్తూ ఊరకే కూర్చోల…