23 July 2017

ధ్యానం

ధ్యానం ..

ఇప్పడు నేను ఎలా చేయాలో చూపిస్తాను.. కళ్ళు మూసుకుని చదువుతూ చేయండి..ఎల్ .కె .జి  సైన్స్ పుస్తకం పక్కన పెట్టుకుని కూర్చోండి ....

కళ్ళు మూసుకోండి

RelaaaaXxx!!

Relax your toes(పక్కన పుస్తకం తీసి 5 వ పేజీ లో parts of the body తెరవండి.. టోస్ - కాలి  వేళ్ళు .. )..Feel that the energy is passing to your leg (leg - దీనికి పుస్తకం చూడక్కరలేదు ..నాకు తెలుసు మీరు తెలివిమంతులని..)..And then to your knees(చూడండి పర్లేదు.. నేను ఎవరికీ చెప్పను ) and  then to your spine (ముందు కాదు వెనకది ..నేను ఎనర్జీ ని ముందు పంపడానికి ట్రై చేశా .. ఎందుకు వెళ్లట్లేదో అని గూగుల్ చేస్తే ..స్పైన్ ముందు కాదు వెనక అని ఉంది.. )and then to your neck and then to your forehead (నుదురు.. నేనైతే ధ్యానం చేసేటప్పుడు తెలీకుండా నాలుగు తలలు వచ్ఛేస్తాయేమో అని ఎనర్జీ ని  గో గో అంటున్నా.. వెళ్లట్లేదు.. పక్క వాడిని పిలిచి forehead అంటే ?? అని అడిగా ..తల పట్టుకున్నాడు ..ఓహ్ అర్థమైంది ..ఎహె అది కాదు.. ఇది అని అక్కడున్న మార్కర్ తో నుదుటి మీద కొట్టాడు .. అప్పుడు వెలిగింది ..నాకు ముందే తెలుసు.. కానీ వాడిని పరీక్షించా  ) and finally to your heart and you feel relaxed...RelAXeddd...Relaxxxxxeeddd...!

concentrate on your breath!!.. Inhale Peace.. Exhale Stress..Continue doing this ..
ఊహించుకుంటే భలే ఉంది..
Inhale Peace(కారు ,బంగలా,3 కోట్లు బ్యాంకు బాలన్స్ ,నా ప్రమోషన్ (నీ తలకాయ ...3 కోట్లు  ఉంటే బోడి ప్రమోషన్ ఎందుకు.. కుక్క బుద్ధి ).. Exhale Stress (మా మేనేజర్ ,నాకు  బ్యాంకు లోన్ ఇచ్సిన మేనేజర్ .. నాతో పని చేసే ఆ పవన్ గాడు .. బయటికి వెళ్తున్నారు ..  నా ఆఫీస్ మెయిల్స్ అన్ని డిలీట్ అయిపోతున్నట్లు.. ..కనిపిస్తున్నాయ్ )
ఎంత హాయిగా ఉందో ..ఇది నిజం .ఇదే నిజం ... మిగితాది అంతా  అబద్దం ..! నాకు కనిపించేదే నిజం ..!


ఇలా రెండు ఆంటే రెండు నిమిషాలు వాళ్ళు చెప్పేటప్పటికి చాలా అంటే చాలా  హాయి గా అనిపించింది ..ఈ లోపు  ఇలాగే కళ్ళు మూసుకుని ఉండండి..చక్కటి సంగీతం పెడతాము.. వింటూ ఏమి ఆలోచనలు వస్తే వాటిని రానివ్వండి.. దేన్నీ  ఆపద్దు అన్నారు.. ఇక నా బుర్ర మొదలు పెట్టింది ..ధ్యానం ఆంటే ఇంతేనా..మాములుగా అయితే సంగీతం లేకుండా ఏడుస్తాము.. ఇప్పుడు స్పెషల్ ఎఫెక్ట్స్ తో బాధ పడతాము ..ఇంతకీ ఇప్పుడు గిరిధర్ వస్తే ఏం చెప్పాలి.. రాత్రి నుండి టెస్టింగ్ స్టార్ట్ అవుతుంది...ఈ పల్లవి రేపు జ్వరం వచ్చే లా ఉంది అని ఈ రోజు వెళ్ళిపోయింది.. ఆ పవన్ 3 టిఫిన్ లు 30 సిగరెట్లు కాన్సెప్ట్ తో చాలా కూల్ గా ఉంటాడు..వాళ్ల కి కిరీటాలు లేవు..నాకు ఉంది..లీడ్...అన్నిటికీ నేనే బాధ్యురాలిని..దాని జ్వరానికి..వీడి ఆకలికి ..ఈ రోజు ఎలా అయినా పని అయిపోతుంది  అని నిన్నే చెప్పాను.. ఈయన ఎవరిని ఇప్పటికి వరకు తిట్టలేదుట ..నా తోనే మొదలవుతుంది..ఆ సాధు జీవి కి కోపం తెప్పించిన వింత జీవి లా అందరూ నన్ను చూస్తారు..ఆ అవమానం తట్టుకోలేక..ఉద్యోగం మనేస్తాను...ఏదీ దొరక్క ఇంట్లో అంట్లు తోముకుంటూ  ఉంటాను...దానికి మెచ్చి  మా పాత పనమ్మాయికి ఇచ్ఛే 1800 నాకు ఇస్తే ఏం  చేసుకోవాలో తెలీక ..ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలియక సతమవుతుంటే... "కిరణ్ ..స్టాప్"...అందరి ముందు అరుస్తాడేమో..అయ్యయ్యో ..ఎలాగ??..అయ్యే నేను ధ్యానం చేస్తున్నా.. ఇలాంటివి ఆలోచించకూడదు.. శివ శివ ..రామా ..your waiting list number is in next జన్మ .. నంబర్ 123456789..ఇందాక ఎక్కిన ఎనర్జీ అంతా భయంగా మారిపోయి..కాళ్ళు ..వళ్లు.. కళ్ళు ..గోళ్లు..మొత్తం పాకిపోయింది..ఈ భయం లొనే ఈ గిరిధర్ మా బెజవాడ బాబాయ్ లా ఉంటాడు...మెహం అంతే ప్రశాంతంగా.. ఉంటుంది .. నవ్వుతూ పలకరిస్తాడు.. ఇప్పుడు ఎలా స్పందిస్తారో.. అమ్మో..అయిపోయింది.. నా ఉద్యోగానికి స్వస్తి చెప్పే రోజు ఇదే ..ఇక రిటైర్మెంట్ వచ్చే రోజులు దగ్గర పడ్డాయ్ కాబట్టి.. దేవుడు ధ్యానం మీద మొగ్గు చూపేలా చేసాడు...ఇక ఆలోచించలేనంత భయంతో ఉండగా అక్కడ మ్యూజిక్ ఆగిపోయింది...చాలా రిలాక్స్ అయ్యారు కదా..(అది మేము చెప్పాలి.. మీరు చెప్పకూడదు )రోజు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి(అవునవును .. నేను చేసిన లా చేస్తే మా ఇంట్లో వాళ్లకి మంచి ఫలితాలు ఉంటాయి )...ఇంకా వివరాలకు మా వెబ్సైట్ చూడండి.. ఇపుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి...నెమ్మదిగా...


ఎదురుగా గిరిధర్ ..

బాబాయ్..!!(ఈయన ఇలా ఎదురుగుండా ఎంత సేపు కూర్చున్నాడో ..అయిపొయింది)

కిరణ్ ఏం చేస్తున్నావ్..ఓకే listen

ఆ టెస్టింగ్ టీం వాళ్ళకి ఇంకో వారం పడుతుంది ట మొదలు పెట్టటానికి ..సో రేపు పూర్తి చేసి నాకు చెప్పు చాలు అన్నాడు..

ఇంక చాలా రిలాక్స్డ్ గా అనిపించింది.. అనవసరంగా .. ఇంత సేపు ఆలోచించాను ..అయినా ఆది నా తప్పు కాదు ... నా  ముక్కులోనుండి అందరూ బయటికి  వస్తున్న సమయాన . మ్యూజిక్ పెడతాను ..ఏమి ఆలోచించద్దు అని ఆలోచనలని గుర్తు చేసిన ఆ అమ్మాయిది ...

ఇది ఉమెన్స్ డే న మా ఆఫీస్ లో ఒక సెషన్ ...నేను రూమ్ లోకి వెళ్లే టైం కూడా లేక సీట్ లోనే కూర్చుని జ్ఞానిని అయిపోయాను ..! Yes I am జ్ఞాని .. అలా ఎలా ఆ నిర్ధారణకు వచ్చానో చూడండి ..

కానీ ఆలా ఎనర్జీ ని పాస్  చేసేటప్పుడు .. నా  కళ్ళ ముందు నా task కి  ధ్యానానికి చాలా  లింక్ కనిపించింది .. 1 రన్  అవుతే  2 రన్ అవుతుంది .. 2 రన్ అవుతే 3 రన్ అవుతుంది... ఇలా లింకు ఉంది.. అలాగే.. నా వేళ్ళ నుండి తల వరకు ఆలా ఫోకస్ చేస్తుంటే.. భలే అనిపించింది ..ఇందులో ఏ ఒక్కటి పని చేయక పోయినా మనిషి బె బె కదా.. అన్నీ  పని చేస్తున్నందుకు మనం హ్యాపీ గా  ఉండాలి కదా ..
ఇప్పటికి అర్థం అయ్యిందా గొర్రె .. !  ఎక్కడ ఎవరు అంటున్నది?? మొత్తం చూసాను . ఎవరూ కనిపించలేదు ..మాట మాత్రమే వినిపించింది.. అప్పుడు అర్థం అయ్యింది ..నాకు జ్ఞానోదయం అయ్యింది అని.. !!


మీకు ఇలా జ్ఞాని గా మారాలి అని ఉంటే ..మీ ముక్కులో నుండి మీకు నచ్చనివి అన్ని పంపించేయండి ..

ఇంకో విషయం కూడా తెలిసింది..ఒక ముక్కు రెండు రంద్రాలు ఎందుకున్నాయో ..!!
అబ్బా మీకు నన్ను పొగడాలి అని ఉంది కదా ..పొగడండి ..పర్వాలేదు  .. 

 

ఫిదా కి ఫిదా

శేఖర్  కమ్ముల గారు బాగున్నారా?? మీకే ??  బానే  ఉంటారు !! .. మా పరిస్థితే  ఏమి బాలేదు.. ఏం చెప్పమంటారు .?? మాది ఒక  సాఫ్ట్వేర్  జంట .. చి ఛ...