శ్రీ రామ కృష్ణ పరమహంస సమగ్ర సప్రామానిక జీవిత గాథ…
అసలు ఈ పుస్తకం చదవాలని ఎందుకు అనిపించింది ? అంత వైరాగ్యం నీకెందుకు అంటూ నన్ను చాల మంది ప్రశ్నించారు …
నేను ఎలా వివేకనందుడికి fan అయ్యానో కూడా నాకు తెలియదు ….అలా ఆయనంటే ఇష్టం పెరిగిన రోజుల్లో ఒక రోజు మా అమ్మ school లో అమ్ముతున్నారు అని ఆయన జీవిత గాథ ..(2 volumes) తెచింది ….
ఏదో ఊర్కె చదవడం మొదలు పెట్టాను …అయస్కాంతం ల అతుక్కు పోయాను ..నాకు మొదటి volume విపరీతంగా నచేసింది …
అందులో ఆయన గురువుని అంటే రామ క్రిష్ణులను పొగిడిన విధానం చూసి ..ఎప్పుడైనా సమయం దొరికితే ఆయన జీవిత గాథ కూడా చదవాలి అనుకున్న …srkmath website లో ఈ బుక్ ల ను చూసి తెప్పించ ..!!
అద్బుతం ….ఆయన అయస్కాంతం అయితే …ఇది డబల్ power ఉన్న magnet..ఆకర్షిస్తూనే ఉంటుంది …
ఆయనకు తెలియని మతం లేదు ,వేదం లేదు …అన్ని తెలుసుకోవడమే కాక ..కొన్ని కొన్ని సంవత్సరాలు ఆచరించారు కూడా వాటిని … ఈ గొప్ప వాళ్ళు ఎంత మంచి వాళ్ళంటే …నేను వివేకానందుడి మొదటి భాగం చదువుతున్నపుడు …ఒక సారి వెళ్ళాలి రామ కృష్ణ మతానికి అనుకున్న ….అనుకోకుండా కింద తిరుపతి కి వెళ్ళాం ….అక్కడ మళ్లీ ఇంకో surprise..అక్కడ ఉంది ..మొట్ట మొదటి సారి లోపలి వెళ్ళడం …2 నిమిషాలే ఉంది లోపల …ఎంత అద్బుతమైన అనుభవమో నేను చెప్ప్పలేను …ఎప్పుడు లేనంత ప్రశాంతత నా జీవితం లో ఆ 2 నిముషాలు నేను అనుభవించాను . .:)
బుక్ మొత్తం నచ్చింది ..కానీ కొన్ని చాల చాల నచి ఇక్కడ రాసుకున్న ..అప్పుడప్పుడు చదువుకుందామని .. :)