21 March 2011

అపర మేధావి - సూపర్ మూన్

శుక్రవారం సాయంత్రం 5:30 అయ్యింది...నేను నా సీట్ దగ్గరనుండి కదలక పోవడంతో...మా టీం కుతూహలంగా...ఏంటి కిరణు మామూలు రోజుల్లోనే నాలుగింటి నుండి మేనేజర్ ఎప్పుడెల్లి పోతాడా..పారిపోదాం అని గోతి కాడ నక్కలా ఎదురు చూసే నువ్వు ..ఇంకా ఉన్నావ్ అంటే...ఏం చేద్దాం ..నా కోసం ..మన మేనేజర్ కోసం కాకపోయినా మా రూం మేట్ మేనేజర్ కోసం ఉండాల్సోస్తోంది ...వాళ్ల టీం లో ఎవరన్నా ఆరింటికి ముందే బలయ్దేరితే ..మన కాంపస్ పక్కన ఉన్న చిన్న చెరువు నిండిపోతుంది అన్నాను ..వాళ్ళు పోనిలే ఇలా అన్నా ఆరు వరకు ఉండు అని నవ్వుతూ వెళ్ళిపోయారు.నాకేమో ఒక్కదాన్నే నడుచు కుంటూ వెళ్ళడం కష్టం.అందుకని తన కోసం ఆగి ఆరింటికి బయలుదేరాను ..వాళ్ల కంపెనీ ముందు నుంచొని ఫోన్ చేసా ..రా ఇక బైటికి అని!!కాస్త రహస్యంగా...హే నువ్వు వెళ్ళు నాకు ఇక్కడ రచ్చ రచ్చ జరుగుతోంది అని అనింది. హ్మ్న్...సర్లే ఏదో వారం నుండి వాళ్ల ప్రాజెక్ట్ లో గొడవలు అని బస్సెక్కి వచ్చేసా...

తను వచ్చి కాస్త మొహం , కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చుంది ..కరెంటు పోయింది హ్మ్న్న్.....అని నిట్టూరుస్తూ...మేడ మీదకి వెళ్ళాం!!అసలు మెట్లు ఎక్కుతుంటేనే ఎంత వెలుతురో....నాకు అర్థమయ్యి పోయింది :D అది నా వెన్నెల మహత్యం అని ..ఓహో నా వెన్నెల ..ఆహా నా వెన్నెల అంటూ గెంతుతూ..పైకి ఎక్కేసి....గట్టి గట్టిగా అరిచేస్తున్నా...!!మా డాబా మధ్యలో నీళ్ళ టాంకులు ఉంటాయి..నేను ఒక వైపు ఉంటె నా బాధ భరించలేక నా స్నేహితులు ఇంకో వైపు ఉన్నారు...నేను ఎవరు లేరని బాగా గట్టి గట్టిగా రామ చక్కని సీతకి..అంటూ ఒక లైను పాడి.....అంతలోనే కృష్ణుడు గుర్తొచ్చి యమునా తటిలో నల్లనయ్యకై...అంటూ దీర్ఘం తీసి అటు వైపుకు వెళ్దామని మలుపు తిరిగా...అక్కడి నుండి ఓ నల్ల చొక్కా వేసుకొని ఒక తెల్లనయ్య కనిపించాడు ..ఆశ్చర్యం !!నా పాట కు కరిగి పోయి ..నా కలర్ కి మ్యాచ్ అవ్వాలి అని తెల్లగా అయిపోయి కృష్ణుడు నా దగ్గరికి వచ్చేసాడా అని ..అంతలో ఎహే కిరణు...వాల్యుం మ్యూట్ అని అరుస్తున్నారు....నాకు అప్పటికి కానీ అర్థం కాలేదు ...అతను మా అపార్ట్మెంట్స్ లోని ఒక అబ్బాయి అని..ఎప్పుడు వెన్నెల్లో మొహాలు సరిగ్గా కనిపించవు ..కానీ ఈ సూపర్ మూన్ మహాత్యమేంటో అతను నా మొహాన్ని కాస్త తేడా చూసి ..చిరాకుగా నవ్వి....కిందకి వెళ్ళిపోయాడు..ఎహే పోతే పోయావ్ లే ..అని దున్నపోతుని ఆదర్శంగా తీసుకొని మొబైల్ తీసి రామ చక్కని సీత పాట వింటూ ...అక్కడ కాస్త పాడయిపోయిన మంచం వేసి ఉంటే దాని మీద కూర్చున్నాం నలుగురం.మా రూం మేట్ ని అడిగా ..ఏమయింది ఇందాక అంత ఖంగారు గా నెమ్మది గా మాట్లాడావ్ అని ..

అదా ...ఏం లేదు కిరణు.. నేను హైదరాబాద్ కి ట్రాన్స్ఫెర్ ట్రై చేస్తున్నా కదా .....నా స్నేహితురాలు దానికి తెల్సిన ఏదో ప్రాజెక్ట్ లో రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అటెండ్ అవుతావా అంటే....మా మేనేజర్ కి ముందే చెప్పా నేను ...తను చూస్తా అంది అంటే ..నువ్వు కూడా ఓ సారి నీ వైపు నుండి ప్రయత్నం చెయ్యి అంటూ అనింది ....సరే అన్నాను. ఒక గంట తర్వాత ఒక కాల్ వచ్చింది .చుట్టు పక్కల ఎవరూ లేక పోవడం వల్ల ఇంటర్వ్యూ నా క్యూబికల్ లో నే చేసా అంది !!ఓయ్ ..ఏం మాట్లాడుతున్నావ్?? అని ఇక నాకు నోట మాట రాలేదు ...కాస్త తేరుకున్నాక ...ఆలా ఎలా చేసావ్ అంటే .. ఎవరూ లేరన్న నమ్మకం తో చేసేసా ..అది కూడా చెత్తగా చేసా అని నేను నా బాధ లో ఉంటే మా మేనేజర్ కాల్ ఐపోయాక కీర్తి ఇటు రా అంది !!వెళ్తే ..ఇంక ఎప్పుడు క్యూబికల్ నుండి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకు అనిందంట ...ఈ అమ్మాయి మొహం పాలిపోయింది .... మా మొహాల్లో జీవం పోయి చాలా సేపయ్యింది.. అసలు అలాంటి అద్బుతమైన ఆలోచన...ఇంటర్వ్యూ క్యూబికల్ నుండే..అది కూడా మేనేజర్ పక్క సీట్ లో కూర్చుని ఇంటర్వ్యూ లు అటెండ్ అయ్యే అపర మేధావిని నేనెక్కడ చూడలేదందోయ్ .. :).అసలు నేను తన మేధస్సు ని పొగడలేక ..పడి పడి నవ్వాను..మళ్ళి తను బాధ పడుతూ ఉంటే కాస్త సర్ది చెప్పాను..కానీ నేను నవ్వు మాత్రం ఆపుకోలేక పోయాను....!!

మా అపర మేధావి ఇంతలో కరెంటు వచ్చిందని తన తెలివి తేటలు అన్ని వాడి గుర్తించింది ...:P.సరే అని కిందకి దిగాము ..ఇంతలో ఒక కాల్ వచ్చింది ...మా మేధావికి ....వచ్చిన ప్రతి కాల్ లో తన ఘనకార్యం వివరిస్తోంది ...ఇలా కాదని ....అన్నం తిందాం పద అని వెళ్లి తింటూ కబుర్లు చెప్తూ ఉంటే నా ఫోను మోగింది..అది మా సీత నుండి ..రేపు మనం సూపర్ మూన్ ని టెలిస్కోప్ లో చూద్దాం అని..నేను ఆ విషయం ఊరంతా చాటి చెప్పాక విషయం తెల్సిదేంటంటే ..ప్రోగ్రాం మొత్తం కాన్సిల్ అని..అది చెయ్యి కాలు రెండు ఇచ్చిందని బాధ పడ్తుంటే...మా రూం లో వాళ్ళు నువ్వేం బాధ పడకు..మనం మన కళ్ళనే జూం చేసి నీ చంద్రున్ని చూసేద్దాం అని ఓదారుస్తూ శనివారం రోజున డాబా మీదకి తీసుకెళ్ళారు .. :).అప్పటికే నేను 6:30 నుండి కిటికీ లో నుండి తొంగి చూస్తూనే ఉన్నా..అన్నం తినేసి గబా గబా డాబా ఎక్కాం ...ఆహా ఎంత బాగున్నాడో మామయ్య .. :).ఇక మళ్ళి ఆ పాడు బడిన మంచం మీద కూర్చుని ..చంద్రుడు ..నక్షత్రాలు ..రెవోల్యుషన్, రొటేషన్ ల గురించి మాట్లాడుకున్నాం ...చివరికి తేలిందేంటయ్యా అంటే ...అందరు మళ్ళి స్కూల్ లో చేరాలి అని .. :P .ఆ చంద్రున్ని ఆలా చూస్తుంటే రెండు ఆలోచనలు వచ్చాయి.ఒకటి తనని చేతిలోకి తీస్కోని ఆడుకోవాలి అని ..మా ఇంకో రూం మేట్ కి నాకు ఒక సారి చంద్రుడి మీదకి వెళ్ళాలని ..సో వెంటనే AP టూరిజం వాళ్ళ దగ్గరికెళ్ళి ఏమైనా ఏర్పాట్లు చేయగలరేమో కనుక్కుందాం అనుకుంటున్నాం ..:P .మీరు వస్తారా ..??

మాతో పాటు వచ్చిన మిగితా ఇద్దరు...వీటికి బాగా పిచ్చి ముదిరింది ఇక కిందకి వెళ్దాం అంటుండగానే...మా వాచ్ మాన్ వచ్చి మేడం 11 అయ్యింది..ప్లీజ్ కిందకి వెళ్ళిపొండి అన్నాడు..సరే అని వచ్చి వెన్నెల్లో అంత సేపు గడిపినందుకు ఆనందిస్తూ బాగా బజ్జున్నా .. :)

p.s : ఒక వేల మీరు సూపర్ మూన్ ని అపర మేధావి అని పోగుడుతున్నాను అని పోస్ట్ మొత్తం చదివేసుంటే నేను కూడా తెలుగు సినిమా పరిశ్రమలో ఒక సినిమా కి నామకరణం చేయడానికి అర్హురాలినే.. :D

16 comments:

MURALI said...

:)

Ennela said...

నేనూ..పప్పులో కాలేసా...ఒప్పేసుకున్నా కిరణ్, నువ్వు సినేమాకి నామకరణం చేసెయ్యొచ్చు...
ఆ పాటలేవో గాఠిగా పాడొచ్చుగా..నేనూ వినేదాన్ని! ఆ సూపర్ మూన్ కి చెప్పాల్సింది..'నువ్వు విని, మా ఎన్నెలమ్మకి ఫార్వార్డ్ చెయ్యి' అని!
టపా బాగుంది..ఇంతకీ మీ మేధావికి ఆ జాబ్ దొరికినట్లేనా..? గుడ్ లక్ చెప్పేసుకో నా తరఫున!

Sravya Vattikuti said...

హ హ కిరణ్ మీ రూమ్మేట్ కి తెలుసా మీరు ఈ పోస్టు రాసారని :) :) :)

గిరీష్ said...

me roommate kevvandi babu.. :)

వేణూరాం said...

హహహ.. నాకు హాయి గా అనిపించిందండీ మీ పోస్టు చదువుతుంటే.. మీ అపర మేధావి గారికి నా సెల్యూట్..

.వీటికి బాగా పిచ్చి ముదిరింది ఇక కిందకి వెళ్దాం అంటుండగానే>>>>

వేటికండీ?? :) :)

kiran said...

మురళి గారు - :)
@ఎన్నెల గారు - హహహ...మీరు వినాలే గాని..సూపర్ మూన్ ఎందుకు...మీకు డైరెక్ట్ గా నా పాట వినే అవకాశం కల్పిస్తా.. :)
thank u
@శ్రావ్య గారు - పోస్ట్ మొత్తం చూపించి పర్మిషన్ తీసుకుని ఇక్కడ పబ్లిష్ చేశాను.. :)
@గిరీష్ గారు - shhh ...కాస్త నెమ్మది గా అనండి.. :) :P
@వేణు రాం గారు - మీ కామెంటు చూసి నాకు హాయి గా అనిపించింది.. :):)
వీటికి - అంటే మేమే..నేను ,ఇంకొక అమ్మాయి...(చంద్రున్ని AP టూరిజం ద్వార చూడాలనుకున్నాం కదా..)..అందుకే మమ్మల్ని మనుషుల లిస్టు లో నుండి తీసేసారు.. :D

కావ్య said...

ఇంతకి నీ తెల్ల కృష్ణుడు .. బతికే ఉన్నదా .. నీ పాటకి జడుసుకుని చచ్చాడా ??

బాగుంది నీ చంద్రుడు కదా .. నేను చూడలేదు :( .. నీ కళ్ళతో జూమ్ చేసింది .. ఒక ప్రింట్ వేసి నాకు పంపువా ..

నీ ఫ్రెండ్ కేక .. నాకు ఒక తింగరి ఫ్రెండ్ ఉండేది .. ఇవాళ పొద్దున్నే దాని గురించి ఒక కధ రాద్దాం అని అనుకున్న .. :) సెం పించ్

Avineni Bhaskar / అవినేని భాస్కర్ said...

అపర మేధావి అని మీ రూంమేట్ ని వ్యంగ్యంగా అనడం ద్వారా నాకు అర్థమైన ఓ మొఖ్య విషయం ఏంటంటే "మీ రూమ్మేట్ నిజంగానే మేధావి"! మీకే తనంటే కుళ్ళు - ఆమె మేధస్సుని ఓర్వలేక అలా సటైర్లేస్తున్నారు ;-)

ఆఫీసు క్యూబికల్లో కూర్చుని ఇంటర్వ్యూ అటెండ్ అయిందంటే ఆవిడ self-confident ఏ rangeలో ఉందో ఆలోయించండి...

kiran said...

కావ్యా - కృష్ణుడు సూపర్ ఉన్నాడు..మళ్ళి మళ్ళి పాడమని అడుగుతున్నాడు.. :) :ప
ప్రింటౌట్ తీసా..నా జూమ్ కి సపోర్ట్ చేసే ప్రింటర్స్ ఇంక రాలేదు ..:ప
రాయి..రాయి..చదివేస్తా..:)

భాస్కర్ గారు - మీరు నన్ను ఎమన్నా పర్లేదు..:P
ఇక్కడ మా రూం మాటే కి సపోర్ట్ చేసి నా నెత్తిన పాలు పోసారు.. :)
అయినా ఆది సెల్ఫ్ కాన్ఫిడెన్సు కాదండీ బాబు..ఖంగారు..ఆ నిమిషం లో ఎటు పోవాలో కూడా తెలియని టెన్షన్..ఎతూ పోలేక అక్కడే అటెండ్ చేసేసింది..:)

శివరంజని said...

కిరణ్, నువ్వు సినేమాకి నామకరణం చేసెయ్యొచ్చు.


. కాని ఆ అపర మేధావికి అన్ని తెలివి తేటలు ఎలా వచ్చాయి ...నువ్వు కాని ఇవ్వలేదు కదా ( no offense ...just joke )

vamc123 said...

కిరణ్ గారు చాలా బాగుందండి..మీ ఫ్రెండ్ కీర్తి మోస్ట్లీ అక్కడే ఇంటర్‌వ్యూ అటెండ్ అవ్వటానికి కారణం, ఏమన్నా డౌట్స్ వస్తే డిరెక్ట్‌గా మ్యానేజర్ ని అడగచు అనుకున్నరేమో మరి....

డేవిడ్ said...

చాలా బాగుంది.... ఏంతైనా మేధావి కదా?

kiran said...

హహః రంజని - :))..నా మీద ఎంత నమ్మకం నీకు..:)
Thank you ..పెట్టేద్దమ అన్ని సినిమాలకు మనమే పేర్లు :)

వంశీ గారు - హహహ..అయ్యుండచ్చు.. :):)
@డేవిడ్ గారు - Thank you :)...హ్మ్న్నన్ కదా.. :)

Sai Praveen said...

మీ నేరేషన్ బావుంది ఎప్పటి లాగే. P.S అయితే సూపరో సూపరు.

kiran said...

ప్రవీణ్ గారు - బోలెడు ధన్యవాదాలు :)

Bharatiya said...

దున్నపోతుని ఆదర్శంగా తీసుకొని మొబైల్ తీసి
hmmm nice post andi kiran gaaaru

ఫిదా కి ఫిదా

శేఖర్  కమ్ముల గారు బాగున్నారా?? మీకే ??  బానే  ఉంటారు !! .. మా పరిస్థితే  ఏమి బాలేదు.. ఏం చెప్పమంటారు .?? మాది ఒక  సాఫ్ట్వేర్  జంట .. చి ఛ...