12 June 2011

పొగ..

ఏం పొగ ..పొయ్యి నుండి వచ్చే పొగ అనుకునేరు....మనకి చిన్నప్పటి నుండి కూడా చాలా తెలివి ..వంటింటి పక్కకే వెళ్ళకపోతే ఇక ఆ పొగ వల్ల ఏం ఇబ్బందులే లేవు కదా ..

ఇది సిగరెట్టు పొగ ..మా ఇంట్లో ఎవరూ తాగరు ..మా తాతయ్య (అమ్మ వల్ల నాన్న ) తప్ప ...చిన్నప్పుడు అపుడప్పుడు ..సెలవలకు వెళ్ళినప్పుడు అంత తెలిసేది కాదు ..నేను హై స్కూల్ మా అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకున్నా కదా ..అప్పుడు తెలిసొచ్చింది ..బాగా ...ఆయన సిగరెట్టు తాగి ఇంట్లోకి రాంగానే గుప్పు గుప్పు మని వాసన...నోరు తెరచి మాట్లాడుతుంటే ఇక భరించలేం ....తాతయ్య అంటే అందరికి బాగా భయం..ఎవరూ ఒక్క సారి కూడా తాగద్దు అని మాట వరసకు కూడా చెప్పడానికి సాహసం చేయలేదు ..నాకు ఓ రోజు బాగా కడుపులో తిప్పేసి తిన్నదంతా బైటికి వచ్చేసి ..వాటి తో పాటు ఓ రెండు నరాలు కూడా పడి పోయాయేమో గమనించలేదు ....కళ్ళల్లో నీళ్ళు వచ్చేలా డోక్కున్నా ...ఇలా కాదని ..మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాను ..అమ్మమ్మ ..ఎప్పుడూ చెప్పలేదా నువ్వు తాతయ్యకు ఇలా సిగరెట్టు కాల్చద్దు అని ...అమ్మో నేనా ..లేదు.. ఒక్క సారి చెప్పా ...నీ లాగే బక్క కదా మీ తాతయ్య ...బక్క కోపం చూపిస్తూ ఊగిపోతూ పక్క గదిలోకి వెళ్ళిపోయారు అంది ...తన శక్తి మేరకు ఈ విషయం లో మా అమ్మమ్మ.. తాతయ్య మీద కోపాన్ని బయట పెట్టినట్లే...మా పెద్దమ్మల్ని..మా పిన్ని ని ,అమ్మని అడిగా మీరు అని ...లేదమ్మా ..అయినా ఈ వారానికే నీకు అంత విసుగు ఏంటే ....అంటే ...మీకు తెలీదు ...ఈ రోజు నరాలు ..రేపు బొమికెలు ఇలాగే రోజుకొకటి నా నోట్లో నుండి పోతూ ఉంటాయి...మీరు చూస్తూ ఉంటారు అన్నాను...!!వాళ్ళు నీ మొహం లే అలవాటు అవుతుంది ..వెళ్లి ఆ sandal talc పౌడర్ ఒక రుమాలు మీద చల్లుకుని దగ్గరెట్టుకో అని ఓ సలహా పడేశారు...
ఒహ్హూ వీళ్ళు అందుకేనా పౌడర్ మీద పడినా కూడా సరిగ్గా దులుపు కోకుండా తిరేగేస్తున్నారు అనుకున్నా..!!

లేదు ..తేవాలి ..మార్పు తేవాలి అంటూ ..ఆవేశం తో ..ఆ రోజు నుండి మా తాతయ్య ని గమనించడం మొదలెట్టా ...ఆయన లేవగానే మొహం కడుక్కోక ముందొకటి ..తర్వాత ఒకటి ..టిఫిన్ తిన్నాక ఒకటి ..మధ్య లో ఒకటి ...భోజనం ముందొకటి ..తర్వాత ఒకటి .ఇలా అబ్బో ....పెట్టెలు పెట్టెలు అయిపోగోట్టే వాళ్ళు ..ఒక రోజు సిగరెట్టు పెట్టె నేను తీస్కెళ్ళి చెత్త బుట్ట లో వేసేసా.. ఇది ఎవరికీ తెలీదు ...మా అమ్మమ్మ టైం బాలేక ఆ రోజు దాన్ని మా తాతయ్య చూసేసారు ...ఎవరు దాన్ని అలా పడేసింది ..ఇన్ని ఏళ్ళు లేనిది ఏమిటిది కొత్తగా అంటూ అమ్మమ్మ మీద కోప్పడ్డారు ...కింద పడితే పనమ్మాయి ఊడ్చెసిందేమో లే అని అమ్మమ్మ చెప్పింది ...సాయంత్రం ఆ పనమ్మాయి కుక్క తోక తొక్కి ఇంటికి వచ్చి ..మా తాతయ్య దగ్గర అక్షింతలు వేయించుకుంది.అన్ని అరిచారా...చూస్తే వెంటనే తన అల్మారా లో ఇంకో రెండు పెట్టెలు ఉన్నాయి ...అబ్బో బ్యాక్ అప్ అనుకున్నా ..ఇలానే ఆలోచిస్తూ నా బాధని మా తమ్ముడితో వ్యక్తపరుచుకున్నా...!! అక్కయ్యా ...ఏంటి తప్పు సిగరెట్టు కాలిస్తే అని ఓ సందేహం బయట పెట్టాడు...మనం షిరిడి సాయిబాబా లాగా చెయ్యి పైకి పెట్టి ఏదో ఉపదేశిస్తున్నట్లు ...అందులో tobacco ఉంటుంది రా అన్నాను ..పేరు భలే ఉందే ....సరేలే అది ఉంటే ఏం చేస్తుంది ...అన్నాడు ...ఆ రోజు దాని గురించి క్లాసు లో చెప్తుంటే నేను నిద్ర పోతున్నా ..మా సర్ ఏం చెప్పారో నాకు గుర్తు లేదు ...వాడికి అదే చెప్తే చులకన అవుతా...అందుకే కిడ్నీ అని ఒకటి ఉంటుంది..అది పాడయిపోతుంది అని చెప్పాను ..అవునా...సరే మరి ఎలా? ..తాతయ్య మనకు బోలెడు ఐస్క్రీం లు కొనియ్యాలి ... ఈయనకి ఆ జ్వరం వస్తే...ఈ అమ్మ...పెద్దమ్మ వాళ్ళు బఠానీలు కూడా కొనివ్వరు అక్కయ్యా అన్నాడు ...ఒహ్హో ..వీడు ఈ కోణం లో ఆలోచిస్తున్నాడా అనుకోని ..సరే నువ్వు ఈ రోజు నుండి తాతయ్య ఎన్ని సిగరెట్లు కాలుస్తున్నారో కనుక్కో అన్నాను ...వాడు CID లాగా investigation మొదలెట్టాడు ..నాకు తెలియని ఒక ఆసక్తి కరమైన నిజాన్ని కనుక్కున్నాడు ..ఏంటి అంటే ముద్దగన్నేరు చెట్టు దగ్గర గూట్లో సగం కాల్చిన సిగరెట్టు పైన ఏదో ప్లాస్టిక్ దాంట్లో సిగరెట్టు దాచుకుని..మళ్లీ కావలసినప్పుడు వెళ్లి తాగుతున్నారు అని ..అది ఏంటి అని వెళ్లి అమ్మమ్మని అడిగితే ..మీ చిన్న తాతయ్య అమెరికా నుండి ..అన్న ఋణం తీర్చుకోడానికి ఇది గిఫ్ట్ గా పంపాడు ...ఈ అన్న సోదరోత్సాహం తో పొంగి పోతున్నారు అంది ...ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనుకుంటూ నేను తంబి బైటికి వచ్చి ...ఆ ఫిల్టర్ ని బయట పడేసాం...తాతయ్య ..ఆ రోజు మళ్లీ అరిచారు ..ఎవరూ తీసారు ఎక్కడ పడేశారు అని ..ఈ తమ్ముడు పిరికి వెధవ...సత్య హరిశ్చంద్రుడి కజిన్ సిస్టర్ కిరణ్ తమ్ముడిలా ...నిజాలు చెప్పేసాడు ....అక్క ,నేను అని ...మా తాతయ్య ..మా అమ్మని పిలిచి ..ఇంకో సారి వీళ్ళను అక్కడికి పంపద్దు అని చెప్పి వెళ్ళిపోయారు అందరూ వంటిట్లో తిష్ట వేసుంటారు...అక్కడికి పిలిచి బాగా కాల్చిన అట్లకాడ చూపిస్తూ అటు పక్కకి పోయారంటే.. ఇది మీ చేతి మీద , కాళ్ళ మీద ఉంటుంది అని బెదిరించి పంపేసారు..ఆడవాళ్ళ దౌర్జన్యం నశించాలి అంటూ వంటింటి బైటికి వస్తూ తమ్ముడి వైపు చూసా..అవును నశించాలి అన్నాడు ....!!పర్లే కంట్రోల్ లో ఉన్నాడు అనుకున్నా...!!

మరుసటి రోజు SUPW period లో అన్ని క్లాసు వాళ్ళని కలిపి గ్రౌండ్ లో కూర్చో పెట్టారు ...మా తమ్ముడు గాడు కూడా అక్కడే ఉన్నాడు ....మా సైన్సు సర్ ఓ చెట్టు పక్కన కూర్చున్నారు. ఆయన పక్కన వీడు ...ఆయనకి కాస్త సందు దొరికి వెళ్లి సిగరెట్టు కాల్చేసి వచ్చారు ..వీడు ఆయనని పిలిచి ...smoking is bad for health sir..dnt smoke..ur kidneys will fail అన్నాడు. ఆయన ఎవరు ఇచ్చారు ఇంత జ్ఞానం అని అడిగితే చక్కగా కాస్త కూడా జాలి లేకుండా నా వైపు వేలు చూపించాడు ...ఓహ్ ...తను మీ అక్క కదా అన్నారు ఆయన ..హా అవును అంటూ తల ఊపాడు...మొదటి బెంచులోనే కూర్చుని నిద్ర పోతున్నావా ..నిన్న పాఠం లో ఏం చెప్పా అన్నారు ఆయన ...ఎంతో నమ్మకంగా కిడ్నీ అన్నాను ..అందరూ గొల్లు మని నవ్వారు ..ఎందుకో అనుకుంటే ..కిడ్నీ కాదంట ..లంగ్స్ అంట ..ఏదైతే ఏం లే ఎప్పుడూ వాటిని బైట చూడలేదు గా ఆ మాత్రం తిక మక పడితే పర్లేదు అని నాకు నేను సర్ది చెప్పుకుని మా సర్ మొహాన్ని నా మొహం దీనాతి ధీనంగా పెట్టి చూస్తుంటే ..రేపటి నుండి ...నేను చెప్పిందంతా క్లాసు అయి పోయాక నాకు చెప్పాలి అన్నారు ..మా తమ్ముడిని మింగేసేలా చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయా ...!!...ఇంతకీ మా సైన్సు టీచర్ కూడా అన్ని పాఠాలు చెప్తూ మానలేక పోయారు ....ఇంక మా తాతయ్య ఎంత లే అని ఊర్కున్నాం...!!

ఇంట్లో కాస్త కాస్త అలవాటయ్యింది ..కానీ బజార్ లో అందరూ ఒకటే చోట తాగుతుంటే అటు నుండి వెళ్తే మళ్లీ నరాలు,బొమికెలు బైట పడేవి ..ఇదేమిటి ఇన్నేళ్ళు అలవాటు కాలేదా అనకండి ..ఒక్క సిగరెట్టు వాసనే అలవాటైంది ..పది సిగరెట్ల వాసన అలవాటు కాలేదు ..లాజిక్ అర్థమైందా !

కానీ ఎక్కడా ఎవర్ని మార్చ లేకపోయా ..ఇలా బాధ పడిపోతూ నేను ఎదిగాను ...అలాగే బాగా ఎదిగిన స్నేహితులు పరిచయమయ్యారు..

ఎలా ఎదిగారో తెల్సా ..మా గ్యాంగ్ లో ఒకబ్బాయికి సిగరెట్టు తాగే అలవాటు ఉండేది ...మున్నా ప్లీజ్ మానేయి అని ఓ సారి చెప్పా ....చూద్దాం లే అని ఊర్కున్నాడు...మిగితా వాళ్ళని తిట్టా.. ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు ....ఆ మాత్రం స్నేహితుడితో ఒక అలవాటు మాన్పించలేరా అని...ఆ ఘనత మాకెందుకు ..నీకే దక్కనీ అని వాళ్ళు భారం నా మీద పడేశారు ...ఓ రోజు నేను పిలిచి క్లాసు పీకా ..మున్నా సిగరెట్టు వద్దు ...అది తాగకుండా బతకలేవా అని ..కిరణ్ ఒక్కటే అడుగుతా..నువ్వు ఉపిరి పీల్చకుండా ఉంటావా అని ...ఇప్పుడు నిన్ను తన్నకుండా మాత్రం ఉండలేను అన్నాను ..సరే కానీ ఓ పెన్ను పేపరు పట్టుకురా అన్నాడు ..ఈ జీవికి ఏదైనా అలా వివరించడం అదో అలవాటు ...తీస్కోచ్చా...ఓ పేరు రాసి ..ఈయన ఎవరు అన్నాడు ..పాపం మీ నాన్నగారు అన్నాను ...హా ఈయన ఉద్యోగం వచ్చాక మానేసారుట ..అని ఇంకొక పేరు రాసాడు ...మీ అన్న అన్నాను ..వీడు వాడికి ఉద్యోగం వచ్చాక మానేసాడంట...అని మున్న అని రాసాడు ...నాకు విషయం అర్థమైంది ...!!ఛి మారవు పో అని తిట్టాను ...అలిగాను ..కోప్పడ్డాను ..ఏవీ పని చేయలేదు ..ఇలాక్కదని మా నాన్నకి చెప్పాను ...మున్నా సంగతి చూడండి అని ....ఓ రోజు ఇంటికి వచ్చి వెళ్తూ కిరణ్ ఓ 3 rs change అన్నాడు ...నాన్న వెంటనే ఏ కింగ్ సైజు తాగడం మానేశావా మున్నా అన్నారు ....హుహ్హుహుహుహుహ ...నేను పక్క గదిలో ఉండి పడి పడి నవ్వుతున్న్నా ...కిరణ్ బాయ్ రేపు కాలేజీ లో కలుద్దాం అని వెళ్ళిపోయాడు వెనక్కి తిరగకుండా ...

తనకు ఎప్పుడూ ఉద్యోగం వస్తుందో అనుకుంటూ ...b.tech ఐపోయాక అందరం ఉద్యోగ వేట లో పడ్డాం ...చూస్తే ..ఓ రోజు నేను 1st రౌండ్ లో సెలెక్ట్ అయ్యాను ...ఆ తర్వాత గ్రూప్ discussion ..అక్కడ టాపిక్..will u suport smoking in public places..అని ..మొత్తం పది మంది ...అందులో ఇద్దరమే అమ్మాయిలు ...ఇంక అందరూ అబ్బాయిలే ..బండ గొంతేస్కుని తాగొచ్చు ఏం కాదు అని వాళ్ళు..నేను ఏం కాదు పబ్లిక్ ప్లేసెస్ లో నే కాదు..ఎక్కడ తాగకూడదు అని ..అందులో ఓ అబ్బాయి చాలా కోపంగా చూసాడు ....ఆ discussion కర్రెస్ట్ గా 3 నిముషాలు జరిగింది ...ఇంతలో రిజల్ట్స్ అవుట్ ..మనం కూడా అవుట్ ...ఆ కోపంగా చూసిన అబ్బాయి ఎక్కడ వచ్చి కొడతాడో అని భయం తో నా పక్కనున్న పిల్లతో మాటలు కలిపా ...ఎందుకు మాట్లాడలేదు ఒక్క మాట కూడా అన్నాను ...ఛి అసహ్యంగా మనం సిగరెట్ల గురించి మాట్లాడటం ఏంటి అనింది ..అమ్మా భారత నారీమణి!!..అని ఓ నిమిషం మనసులో అనుకుని ఆ పిల్లని ఒక సారి అసహ్యంగా చూసి మా అన్నకి కాల్ చేశా ..(మరి ఇక్కడికి తీస్కొచ్చింది అన్నయ్యే) ...ఎక్కడున్నావ్ ..అని ...సందు చివర ..ఇంక లోపలికి పిలవలేదా అన్నాడు ....అన్నా ఈ చెల్లలి మీద నీకు నమ్మకం ఎక్కువ ...నువ్ ఎనక్కి వచ్చెయ్యి అన్నాను ..ఏమైందే అంటే ....వాళ్ళు బయటకి పంపించేసారు...అన్నయ్య.. ..ఇంకేక్కడన్నా ఓపెనింగ్స్ ఉన్నాయా అన్నాను ..అక్కడే ఉండు కమింగ్ అన్నాడు ....వచ్చి బండి ఆపి నన్ను డ్రైవర్ లాగా భలే యుటిలైస్ చేస్కుంటున్నావే అన్నాడు ...నీ బండిలో వచ్చే పోయింది అన్నాను ....ఏం మాట్లాడకుండా ఇంట్లో దించి మా పెద్దమ్మ కి వార్నింగ్ ఇచ్చాడు ...అది నా బండి తుడవడానికి కూడా వీల్లేదు అని ..

పైన అన్ని జరిగినా ఇంకా సిగరెట్టు తాగే వాళ్ల చేత ఆ అలవాటు మన్పించాలనే నా కోరిక తీరలేదు...:(..

మొన్న రెండు వారాల కిందట మా పెదనాన్న గారింటికి వెళ్ళాను..అక్కడ వాళ్ల మామ గారు ఉన్నారు ...ఎనభయ్ ఏళ్ళు..చెయిన్ స్మోకర్.....ఆయనకి పాపం కింద పడి చేయి విరిగింది...పెద్ద కట్టు కట్టించుకున్నారు..కానీ సిగరెట్టు తాగాలనే ఆశ మాత్రం ఉంది...మా తమ్ముళ్ళని,పెదనాన్న ని మా పెద్దమ్మ.. కాస్త తాత గారికి సిగరెట్లు తెచ్చి పెట్టండర్రా అని అడిగింది..నో నహి అన్నారు..నా వైపు చూసింది...నేను యాంటి స్మోకర్స్ అస్సోసియేషన్ కి అధ్యక్షురాలిని..అన్నాను..నువ్వు కూడా ఎదురు చెప్తున్నావా..సరే మనిద్దరం సాయంత్రం బజార్ లోకి వెళ్తాం కదా..అక్కడ నేను అడుగుతాలే అంది..ఇంతలో మా తమ్ముడు(పెదనాన్న వాళ్ల అబ్బాయి ) వచ్చి వాళ్ల అమ్మని నాకు తాగాలని ఉందే అన్నాడు....అప్పుడే మా కోసం పకోడీలు చేస్తూ ఉంది..ఆ గరిటె తీసి వాత పెట్టాలని ఉందిరా..ఎవరికి పెట్టాను అంది??..వాడు మాట మార్చేసి..నాన్న ఎప్పుడైనా తాగారేమో తెల్సా నీకు అని అడిగాడు..ఛి ఛి మీ నాన్న అలా ఎప్పుడూ చేయలేదు ..చేసుండరు అంది..వెంటనే మా బామ్మోచ్చి..చిన్నప్పుడు కాల్చడానికి ప్రయత్నించాడు..కానీ తాత గారు వద్దని చెప్పడం తో మానేసాడు...అని అంది..మా పెద్దమ్మ అదేలే 6 ,7 వయస్సులో అంది...మా బామ్మ ఏం నా కొడుకు అంత చిన్న వయసులో అలా చేస్తాడని నీ ఉద్దేశమా అంది...ఈ సీన్ మార్చేయడానికి మా వాడు ఓ సిగరెట్టు తీస్కోని నోట్లో పెట్టుకుని...ఎటు వైపు వెలిగించాలో అన్నాడు..చాలా ఎక్కువ చేస్తున్నావు రా..మరి అంత నటించకు అన్నాను..అయితే వాకే అక్క..అంటూ లేచాడు...అది కాస్త నా వాళ్ళో పడింది..చ..చ..అంటూ లేచాను..ఆ తాత గారికి కోపం వచ్చి..ఏమ్మా అంత అసహ్యం ఏంటి నేను తాగాట్లేదా అన్నారు(వాళ్ళ ఆవిడను తిట్టినా ఇంత ఫీల్ అయ్యేవారు కాదేమో..)..నేను తెలివిగా ..పెద్దమ్మ.. దా బజార్ కి వెళ్దాం..అని అక్కడ నుండి బయట పడ్డాను..

సరే షాప్ కి వెళ్లాం..చార్మినార్ సిగరెట్టు పెట్టె అంది..ఆ షాప్ అతను ఒక్క సారి తల పైకి ఎత్తి చూసాడు...ఏమిటీ ఆడవాళ్ళు అడుగుతున్నారు అని...నాకు నవ్వు ఆగట్లేదు..నవ్వుదాం అంటే భయం..అప్పుడే పెద్దమ్మ కొత్తబట్టలు కొనిచ్చింది..లాగేస్కుంటుందేమో అని...ఆ డ్రెస్ కలర్ కూడా నాకు బాగా నచ్చింది...ఇక ఆవిడే మా నాన్న గారు చాలా పెద్ద వారండి..ఇప్పుడు వంట్లో బాలేదు..కానీ దీనికి బాగా అలవాటు పడ్డారు...ఇంట్లో పిల్లల్ని అడిగితే వాళ్ళకి మొహమాటం వాళ్ళు అడగనన్నారు...మరి నాకు తప్పదు కదా అని ఆ షాప్ వాళ్ళకి చెప్పింది...అందులో ఆ షాప్ లో ఆయన భార్య..అయ్యో ఈ కాలం పిల్లలు ఇంత చవకవి తాగరు అండి...ఒకొక్క సిగరెట్టు 8 రూపాయలు ..దాని పేరు black అని తీసి చూపించింది..అది నాకంటే పోడుగుంది..కర్రి గా కూడా ఉంది...నాకు నవ్వు ఆగట్లే..చూసావా కిరణు..8 రూపాయలంట అంది మా పెద్దమ్మ..నాకు 5 రూపాయలది తెల్సు అన్నాను...ఆ అదెలా అంది..వెంటనే నాలుక్కరచుకొని...మున్నాని తిట్టుకొని...ఏదో లే ఆఫీసు లో మాట్లాడుకుంటే విన్నా అని కవర్ చేసేసా...

వాటిని నేనే ఆ తాత గారికి ఇస్తూ..మానేయండి అన్నాను...చూడు నాన్నా కిరణు నాకు ఎనభయ్ ఏళ్ళు...ఇంకెన్నాళ్ళు బతుకుతా...ఈ కొంచెం కాలం కోసం ఎందుకు మానేయాలి అన్నారు...ఏమో ఏం చెప్పాలో తెలీలేదు ...!!

వ్యసనం అలాంటిదేమో మనందరికీ బ్లాగ్గింగ్ లాగా..

27 comments:

వంశీ కిషోర్ said...

రైట్రూ, భలె రాసావుగా సిగరెట్టు గురించి.
ఇంతకీ నాకు తెలిసొచ్చింది ఎంటంటే నువ్వు ఎంత ప్రయత్నించిన ఎవరితోను దూమపానం మాంపించలెకపొయెవు.

kalyan said...

Really nice one , Do by any chance there is any fiction included in it or is it complete reality ?

Smoking is bad and one should realize it sooner or latter !

Krishna said...

అందరు చెప్పే మాటే -
వ్యసనమందు పొగ వ్యసనం వేరయా
ఫ్లేక్ మినార్ బ్రిస్టాల్, లైట్ కింగ్ మెంథాల్.

Seriously, addiction cannot be ridden either its blogging or smoking. So we do not have "right" to condemn smoking. Right? :D

బాగా రాసారు అని మాత్రం చెప్తాను ఎందుకు అని అడగద్దు.. అది అంతే. :-P

గిరీష్ said...

నైస్ పోస్ట్ కిరణ్..
యువతనే మారలేకుండ ఉన్నారు ఇంక తాతలేం మారుతారులే లైట్‌తీస్కో..
నీకు తెలుసా ఇప్పుడు కొంతమంది(కొంతమంది - బోల్డ్, ఇటాలిక్, అండర్‌లైన్ :) ) అమ్మాయిలకి అబ్బాయిలు సిగరెట్ కాలిస్తేనే ఇష్టమట.. :).

>>
ఛి అసహ్యంగా మనం సిగరెట్ల గురించి మాట్లాడటం ఏంటి అనింది ..అమ్మా భారత నారీమణి!!
>>

:-)

final touch:
>>వ్యసనం అలాంటిదేమో మనందరికీ బ్లాగ్గింగ్ లాగా..>>
ఇది నేను ఖండిస్తున్నా..బ్లాగింగ్ జీవితమంతా ఉండకపోవచ్చు, కాని సిగరెట్టు కాల్చడం మాత్రం ఉంటుంది. :)

హరే కృష్ణ said...

వ్యసనం అలాంటిదేమో మనందరికీ బ్లాగ్గింగ్ లాగా..
బ్లాగింగ్ పొగ కాదు ఒక సెగ :)))
ఎంత పొగ అయితే మాత్రం
పొద్దున్న ఏడింటికి పోస్ట్ వేయడం..:))) కెవ్వ్

శివరంజని said...

ఫస్ట్ కామెంట్ నాదే ..చదివి మళ్ళీ చెబుతా

వంశీ కిషోర్ said...

girish garu cheppinattu nijame...kontha mandi ammailaki cigarette kalche abbailu istamata...

naa frnd cheppindi

శశి కళ said...

మా బన్గారు తల్లి....కిడ్నిలు పాడవుతాయా....
యెంత బాగా పాటం విన్టున్నావు...హ)))))

కృష్ణప్రియ said...

hmm మా బాబాయి గారు ఇరవైలలో మొదలు పెట్టారు పొగ తాగటం. ఇప్పుడు ఆయనకీ 62. గుండె ఆపరేషన్ చేయించుకుని వచ్చిన వారం లో మళ్లీ మొదలు పెట్టి సంవత్సరం దాటింది. ఊపిరి తిత్తులు నల్లగా అయ్యాయట.

ఎన్ని సార్లు చెప్పినా, ఎవరితో చెప్పించినా. ఇప్పటికి కనీసం ఇరవై సార్లు మానేసుంటాడు పొగ తాగటం. మానినప్పుడల్లా వారానికి, రెండు వారాలకీ.. మానేయటం, మళ్లీ మొదలు పెట్టటం.

రాజ్ కుమార్ said...

వెన్నెల లో మరోక కేక లాంటి పోస్ట్ అన్నమాట ఇది. ;)
ఎప్పటిలాగానే మీ శైలి లో సాఫ్ట్ కామెడీ తో ఆద్యంతం చదివించింది. చాలా సీరియస్ విషయాన్ని కామెడీ గా ప్రెజెంట్ చేశారు.

ఎవ్వరి చేతా మాన్పించ లేమండీ. మా తాతయ్య గారు డాక్టరు. ఆయనకి తెలియనిది కాదు. కానీ రోజొ పెట్టెలకి పెట్టెలు ఊదేస్తారు. హ్మ్మ్.. ;(

మీ తమ్ముడు కూడా అచ్చం మీలాగే అనుకుంటా. ఆ ఎపిసోడ్ బాగా నచ్చింది నాకు.;)

నాకో డౌట్

ఆ పనమ్మాయి కుక్క తోక తొక్కి ఇంటికి వచ్చి>>>

ఆ కుక్క ఊరుకుందా?? కరవలేదూ?? ;)

రాజ్ కుమార్ said...

శివరంజని గారూ. ఫస్ట్ కామేంట్ మీదే.. మధ్యలోనుండీ.. హహహహ్.. ;)

బులుసు సుబ్రహ్మణ్యం said...

నాకు సిగరెట్టు లంటే కోపం. నేను సిగరెట్టులు కాల్చి భస్మం చేసి పాడేస్తాను, ఇంకెవరూ కాల్చకుండా.అన్నట్టు నా కిడ్నీ లు బాగానే ఉన్నాయి. :))

Unknown said...

Good post. Any habit is tough to break. It all starts with the first one. Understanding why people took to smoking might help in making them quit smoking. As they say, cigarette is tobacco rolled in a paper with fire at one end and fool at the other. I wonder why people spend money on cigarettes and spoil their health and they spend more money to recover their health.

మధురవాణి said...

ఎప్పట్లాగే చాలా బాగా రాసారు కిరణ్! బోల్డు సార్లు నవ్వాను ఈ పోస్ట్ చదువుతూ! :D
నేను కూడా ఒక స్నేహితుడి చేత సిగిరెట్ మాన్పించడానికి చాలా కష్టపడాను. అలగడాలూ, అన్నం మానెయ్యడాలూ కూడా పని చెయ్యలేదు.. :P అప్పుడే నాకు జ్ఞానోదయం అయ్యింది.. ఎవరికీ వాళ్లకి జ్ఞానోదయం అయితే తప్ప ఈ అలవాటు మానరు.. మనకి కంఠశోష అనవసరం అని.. ;)

MURALI said...

అమ్మాయ్ కిరణు అస్సలు బాలేదు. ఒక్కరిచేత కూడా మాన్పించలేని నిన్ను చూసి తలకొట్టేసినట్టయ్యింది. ఏవో రెండు మూడు పాడయిపోయిన కాలేయం, ఊపిరితిత్తులు బొమ్మలేసన్నా ఎవరో ఒకరిచేత మాన్పించి కనిపించు.

kiran said...

వంశీ - డైరెట్రు - Thank you ..:)
అవును..మాన్పించలేక పోయా..:(..ఏమైనా avidea లు ఉన్నాయా..:) ?

హహహ కళ్యాణ్...కొన్ని జరిగినవి..కొన్ని కల్పితం..:)
Thank you soooo much ra ..:))

@krsna గారు - చూసారా...మీ కవి హృదయం బయటికి వచ్చేసింది..నా టపా చదివి..
అంతే అంటారా..ఆపే హక్కు మనకు లేదంటారా..:P
చాల థాంక్స్ అండి..:)

kiran said...

@గిరీష్ - హహహ్హహ..అంతే అంటావా?
లైట్ తీస్కో గిరీష్ ....వ్యసనం అని చెప్పా కానీ...దాని validity గురించి ఇక్కడ మాట్లాడలేదు గ...:)

మీకు & వంశీ కి - ఓ గమనిక - సిగరెట్లు అంటే ఇష్టం లేని అమ్మాయిలే ఎక్కువ....ఈ విషయం ఓ సారి ఆలోచించండి..:)
అయినా మన కోసం మనం బతకాలి..పక్కనోల్ల కోసం కాదు..:P (కొట్టకండి ఇద్దరు...)

@హరే కృష్ణ - :D :D
>>>పొద్దున్న ఏడింటికి పోస్ట్ వేయడం..:))) కెవ్వ్
నువ్వు దీన్ని గమనించడం ఇంకా కెవ్వు..:D

@రంజని - అమ్మాయి ..కుదరక కామెంట్లు పబ్లిష్ చేయాలే...అపార్థం చేస్కొని..ఆనందపడ్డావ్..
నేను ఇంకో కామెంటు కోసం వెయిటింగ్..:P

kiran said...

@బులుసు గారు - ఏది ఓ సారి ఇటు ఇవ్వండి..అన్ని..ఒకే సారి పొయ్యి లో వేసేసి కాల్చేస్తా..
మీ కిడ్నీ లు..ఎప్పుడు బాగుండాలనే కోరుకుంటాం అందరం..:)

@శశి గారు - మీలాంటి టీచర్ లు ఉన్నారని మరచిపోయి నిజాలు రాసేసా..:)
మనసులో ఉంచుకోకండి...బోలెడు ధన్యవాదాలు..:)

@కృష్ణ ప్రియ గారు - hmmmmmmmm ...నో కామెంట్స్
వాఖ్య పెట్టినందుకు ధన్యవాదములు..:)

kiran said...

@రాజ్ - :D ...మీకు పెద్ద thankssssssss :D
మీకు నచ్చినందుకు చాల సంతోషం..
ఈ పెద్దోల్లున్నారే...వినరు..మారారు..:P
ఎంతైనా బ్లడ్ relation కదా...పోలికలుంటాయి మరి...:)
>>>>ఆ కుక్క ఊరుకుందా?? కరవలేదూ?? ;)...హహ్హహః.....ఆ కుక్క కి అప్పట్లో మన బ్లాగుల గురించి తెలియదు గ..మనుషుల ఫీలింగ్స్ అప్పటికి తెలిలేదు ..లేక పోతే కరిచేసుండేది..:)

@అన్నయ్య..థాంక్స్..
hmmmmmmm ......can 't change

@మధుర - నేను ఇక్కడ ఫుల్ హాప్పీస్..మీకు నచ్చినందుకు..:)))
నిజమే...మనిద్దరికీ చిన్న వయసులోనే జ్ఞానోదయం అయ్యింది

kiran said...

@మురళి గారు - ఇది చాల చల్ కష్టమైన పనండి..:(
అంత వరకు నా తల ఎక్కడ దాచుకోను..??

Unknown said...

kiran chala chala baga rasavu.
ఛి అసహ్యంగా మనం సిగరెట్ల గురించి మాట్లాడటం ఏంటి అనింది ..అమ్మా భారత నారీమణి!!nijaniki adavallu passive smoking valla ento badhapadutunna manam dani gurinchi matladamu. public places lo no smoking zones lo evarina smoke chestunte matram manam object cheyachhu kanisam adi start cheste kontamandi ayina marataremo. wonderful writing style also. Inda e sari nenu iche Fanta tagu

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగా రాశారు కిరణ్...
ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే కానీ మనం ఎన్ని చెప్పినా మారరు.. ఈ విషయం ఎపుడో రియలైజ్ ఐ నేను అసలు ఆ ప్రయత్నమే చేయడం మానేశా... వాళ్ళకి దూరంగా ఉండటం మాత్రమే మనం చేయగలిగింది..

వ్యసనం అలాంటిదేమో మనందరికీ బ్లాగ్గింగ్ లాగా..
మరే మా బాగా చెప్పారు :-)

vamc123 said...

కిరణ్ గారు..చాలా బాగా రాశారు..అందుకే హిందీలో ఒక సెంటెన్సే ఉంది.." आदते सही वक्तपे नही बदलते है तो ज़रूरते बन्जाते है" దేనికి కరెక్ట్ ఎగ్స్యాంపల్ మీరు రాసిన స్టోరీ....

Ennela said...

వేర్ ఇస్ మై కామెంట్?
నా కామెంట్ ఎక్కడ?
మెరీ కామెంట్ కహా హై?

kiran said...

ముందు గా శైలు కి ,వేణు గారికి వంశి గారికి ,ఎన్నెల గారికి న క్షమాపణలు..
ముందే మీకు సమాధానాలు ఇచ్చేశాను అనుకుని ఇటు చూడలేదు..

శైలు - చాలా Thank you ..:)..నీ fanta అయిపొయింది..ఇంకొకటి ఇవ్వవా..?
మారితే బాగుండు..

వేణు గారు - :) Thank u ..
hmmmm...అంతే అంటారా?

వంశి గారు - నేను హిందీ పండిట్ ని అని మీకు ఎక్కడినుండో ఇన్ఫర్మేషన్ వచ్చినట్లుందే..:P
థాంక్స్ అండి..:)

ఎన్నెల గారు - అదే నేను అడుగుతున్నా...ఎక్కడ..న కామెంట్ ఎక్కడ..?? :(

Sriharsha said...

Rofl....
nice post andi kiran gaaru
cigarette paina oka quote okasari chadivaanu sariga gurthu ledhu kindha quote ane ankuntunanu

"it is easy to quit smoke cause i quit smoke so many times"

kiran said...

భారతీయ గారు - :))))..థాంక్స్ :)

అనన్య చురకలు !

మా పాపా పేరు అనన్య  ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను  దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...