1 February 2011

Life is Beautiful..!!

ఇది ఎంత మంది నిజంగా అర్థం చేస్కొని బతుకుతున్నారు..??ఈ మధ్య నేను విన్న ఒక వార్త కి చాలా shock తిన్నాను … :( :(

Life ని చాలా సులభంగా అల ఎలా తీసేస్కుంటారు ..??పోనీ తీస్కుందామనే ఆలోచన వచ్చిన ..ఆ పై వాడు ఎందుకు ఆపడు ..??

ఒకొక్క సారి ఒక్కో రకంగా దాని ఫలితాలు ఉంటాయి ..ప్రాణాలు తీస్కోవాలి అని ఎక్కడి నుండో దూకెయ్యడమొ ..ఏ విషం తాగడమో ..చేస్తే అది అదృష్టమో …దురదృష్టమో ….వాడు బతికేస్తాడు …కొంతమంది బతకరు …అది మళ్ళి ఎలా రాసి పెట్టుంటే అల జరుగుతుంది .. :(

అసలు అంత తీవ్రమైన నిర్ణయం ఎలా తీస్కోవాలి అనిపిస్తుంది …

నాకు ఒకటి అనిపిస్తుంది ..మనిషి ఎంత మేధావో ..అంతకంటే రెట్టింపు మూర్ఖుడు.. …!!

ఆ చావు కోసం ..చివరి క్షణం లో పడే బాధ ,నొప్పి …ఏదో బతికుండగానే తన సమస్యలని వేరే కోణం లో నుండో …కొంచం పాజిటివ్ గా నో ఆలోచించడానికి కష్ట పడితే …ఆ సమస్య మనల్ని వదిలి వెళ్ళిపోయాక …కొన్ని రోజులు అయ్యాక వెనక్కి తిరిగి చూస్కుంటే ఎంత గర్వంగా ..ఆనందంగా ఉంటుంది …నేను కూడా గొప్పే ..అన్ని భరించాను . .అన్నిటిని అధిగమించగలను …ఇన్ని దాటినా ….నేను ఇంక ఉన్నాను ..ఏదో సాధించాలి అనే తపనతో ..అని ఉండద చెప్పండి ??

మొండి …ఏది కావాలి అనుకుంటే ఆది దక్కాలి అనే మొండి …ఏ …ఎందుకు ఇవ్వాలి ??..నువ్వు అర్హుడివో ..కాదో …ఆ ఇచ్చే వాడికి తెలీదా?? …నువ్వేంటో తెలియని నీకు …నీ గురించి తెలుసుకోడానికే ఒక జీవిత కాలం సరిపోతుంది …..అలాంటి 'నిన్ను' లను కొన్ని కోట్ల మంది ని సృష్టించిన దేవుడు ఏ ఆలోచన లేకుండానే …నిన్ను ఈ భువి లోకి లాగడు కదా …

మనం ఒక చిన్న కథ రాయాలి అంటేనే …దాని లోని ప్రతి అక్షరం ,పదం.. వాక్యం …పాత్ర …మొత్తం అయ్యాకే …ఒకొక్క అంకం విడుదల చేస్తాం ….ఒక పేరా రాయంగానే నచ్చేసి …దాన్ని అందరికి చూపించి …తరువాత నాకు తెలీదు అనలేం కదా …అలాంటిది ఇది జీవితం ..మనకు ఏం ఇస్తే బాగుంటుందో కూడా ఆయనకి తెలుసు కదా …

పోనీ ఇవన్ని పక్కన పెడదాం..…..

ఇంట్లో చిన్నప్పటి నుండి పెంచిన ..అమ్మ ,నాన్న …..కలిసి పెరిగిన తోబుట్టువ్వుల పరిస్థతి ఏంటి?:(.....అసలు వాళ్ళు ఇక బతక గలరా ..???80 ఏళ్ళ ముసలి వాడు ..వెల్లిపోతేనే ….అయ్యో మా తాత ఇంక ఉండాలి అనుకుంటాం …అలాంటిది …తను పెంచుకున్న ..కొడుకో... కూతురో ..నేను వీళ్ళ పై ఆధార పడచ్చు అనుకునే సమయం లో నువ్వు లేవు ఇంక అంటే ఎంత మనో వేదన కి గురవుతారు ..?? నాలుగు సార్లు చూసిన వాళ్ళే ఫలానా మనిషి ..ఇలా చేసాడు అంటే ..అయ్యో ..అవునా …అని మనసంతా వికలం అయిపోతుంది …ఏ పని చేయబుద్ది కాదు …కాసేపు....….అటు వెళ్ళిన …నీకు సంబంధించినవి ఏవి గుర్తొచ్చిన …ఇక నరకమే …అలాంటిది …ఇంట్లో వాళ్ల పరిస్థితి ఏంటి …??

ఆ ఆలోచనే చాలా బలహీనమైన క్షణాల్లో వస్తుంది...అది ఆపడానికి మనం ప్రయత్నించాలి...ఆ మనిషి చుట్టూ ఎవరో ఒకరు ఉండాలి..కొంత మంది చెప్పే వాళ్ళు ఎప్పుడు చెయ్యరు అని అంటారు ..కానీ వాళ్ల బుర్ర లోకి ఆ ఆలోచన దూరడమె తప్పు...ఆ విషయం వాళ్ళకి గుర్తు చెయ్యాలి..కనీసం కొన్ని రోజుల వరకు వాళ్ళని పలకరిస్తునే ఉండాలి...వాళ్ళు మనకు ఎంత ముఖ్యమో చెప్పకనే చెప్పాలి...వాల్లంతకు వాళ్ళు ఆ ఆలోచన నుండి బయట పడాలి..!!మనం వాళ్ల సమస్యల్లోకి దూరి పరిష్కరించక్కర్లేదు..కానీ ఆ మనిషిని కాపాడుకుంటే చాలు..!!ఒక సారి ఆ మనిషి దూరం అయ్యాడంటే ఇక జీవితాంతం మనకు నరకమే..అయ్యో మనమన్న చెప్పాల్సిందే...ముందు రోజే కదా మాట్లాడింది...అప్పుడు ఒక్క సారి అన్న నాకు అనుమానం రాలేదే అనిపిస్తుంది..!!..మనం కాపాడుకోలేకపోయమే అనే బాధ వెంటాడుతూనే ఉంటుంది..

కానీ ఈ మధ్య చాలా చిన్న చిన్న వాటికీ....చస్తాం అనే మాట వస్తోంది...అది చదువుకునే వయస్సు వరకు వచ్చిన ..సరేలే చంచల మనసు అనుకోవచ్చు..కానీ కాస్త జీవితం లో స్థిరపడ్డాక కూడా ..లోకం తెల్సిన తర్వాత కూడా ఇలాంటివి వింటే బాధ అనిపిస్తుంది....అసలు పక్క వాడి గుండెల్లో రైళ్ళు పరిగెత్తుతాయి ఆ మాట విననగానే..ఇంక ఆ మనిషి గురించి వీడికి ఎంత దిగులు..గుబులు...భయం...ఇది కూడా తప్పు కదా...!!...నేను కూడా నాకు జీవితం విలువ తెలియని సమయం లో నేను చస్తా అంటే నా స్నేహితులు..ఎంత భయపడ్డారో ఈ రోజు నాకు తెలుస్తోంది...ఈ రోజు నాకు సిగ్గుగా ఉంది...అసలు ఆ పదం వాడినందుకే..ఎప్పుడో క్షమాపణలు కూడా అడిగేస లెండి వాళ్ళను కానీ..ఇలా ఎంతో మంది ఆలోచిస్తుంటారు...కానీ ఒక మనిషి దూరమైతే కనీసం ఒక 50 మంది జీవితాలు మారుతాయి...నేను చూసిన ప్రకారం..!!


నేను ఈ మధ్యే ఒక సినిమా చూసాను LIfe is beautiful ..అనే ఇంగ్లీష్ మూవీ..అది చూసిన తరువాత అనిపించింది...ప్రతి ఒక్కరు ఆ సినిమా చూడాలి...మన జీవితానికి ఉన్న విలువ తెల్సుకోవాలి అని...!!ఎన్ని రకాలైన కష్టాలైన ఉండచ్చు...మన చుట్టూ..అమ్మ,నాన్న,తోబుట్టువులు..,ప్రాణం ఇచ్చే స్నేహితులు ..అన్నిటిని చూస్తూ నడిపించే ఆ దైవం ఉండగా..మనం దిగులు పడి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడం అనవసరం అనిపిస్తుంది..

నాకు ఒకొక్క సారి ఎంత ఆశ్చర్యం వేస్తుంది అంటే ….ఒక డాక్టర్ నోటి వెంట విన్న నేను …..చాలమ్మా ఈ జీవితం అని …నేను ఒక వారం మాట్లాడ లేదు తనతో …ఎందుకమ్మా అని ఆవిడ ఎంత అడిగారో …నేను ఒకటే చేప్పాను ….ఆంటీ నా లాంటి వాళ్ళు ఆ మాట అంటే చెంప మీద ఒక్కటి ఇచ్చి ..జీవితం విలువ చెప్పాల్సిన మీరు ..అల మాట్లాడితే చాలా బాధ గా అనిపించింది ..అని ….hmnn…ఏమో తల్లీ.. .ఆ క్షణం అంతే అన్నారు …

హా ఆ క్షణికావేశం ఆపుకుంటే ..ముందున్న అద్బుతమైన జీవితం మనదే కదా …!!

ఇంకొక్క చిన్న విషయం..ఈ quote నేను ఒక చోట చదివా...సరిగ్గా గుర్తు లేదు..కానీ దాని అర్థం ఇదే..

"Does it really matter after 5 years".. అని ..నిజమే కదా..ఈ రోజు నీకు అతి ముఖ్యమైనది ఇంకో 5 సంవత్సరాలకి నీకు పెద్దది అనిపించక పోవచ్చు...అసలు నువ్వు దాని గురించి ఆలోచించటానికే ఇష్ట పడకపోవచ్చు ..

ప్రతి దానికి కాస్త సమయం ఇస్తే సర్దుకుంటాయి అని నాకు అనిపిస్తుంది..!!

కష్టాలు ..కన్నీళ్లు ..సంబరాలు …కేరింతఃలు....ఇవి అన్ని ఒక మనిషి జీవితం లో ఉంటేనే కదా ఆది పరిపూర్ణం అవుతుంది ….!! :)


19 comments:

karthik said...

>>కష్టాలు ..కన్నీళ్లు ..సంబరాలు …కేరింతఃలు....ఇవి అన్ని ఒక మనిషి జీవితం లో ఉంటేనే కదా ఆది పరిపూర్ణం అవుతుంది

completely agreed!!

మధురవాణి said...

హుమ్మ్..! విషయం ఏంటంటే, తీరిగ్గా ఉన్నప్పుడు ఇలాంటి లాజిక్స్ చాలానే ఆలోచించగలం. కానీ, ఆ ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటివి తట్టవు.. ఎవరన్నా చెప్పినా బుర్రకెక్కవు..అదీ సమస్య..కాకపోతే, ఎవరన్నా బాగా డిప్రెషన్లో ఉన్నారని మనకి తెలిస్తే.. మనకి చేతనయినంతలో వాళ్ళ మూడ్ మార్చే ప్రయత్నం చేయాలి. ఎక్కడో చదివాను ఈ quote..
Suicide is a permanent solutions for a temporary problem!

హరే కృష్ణ said...

Excellent kiran!

రాధిక(నాని ) said...

baagundandi .

వేణూరాం said...

చాలా బాగా రాసారు కిరణ్ గారు.. yes.. Life is beautiful..

కావ్య said...

కిరణ్ నువ్వు చెప్పింది ... నూటికి నూరు పాళ్ళు కరక్ట్ .. కాని ఒక్కటి చెప్తా చూడు .. ఎంత ధైర్యంగా ఉన్న వాళ్ళకైనా .. భరించలేని కష్టం వచ్చినప్పుడు ఈ బాధ కంటే .. చచ్చిపోతే బాగుండు అని అనిపించడం నిజం ..ఇలాంటప్పుడు నాకు మన హిందూ మతం లో చెప్పిన కర్మ సిద్దాంతం నచ్చుతుంది .. అది ఏంటి అంటే .. నువ్వు చేసిన దాని ఫలితాలే నువ్వు అనుభావిస్తావ్ .. కారణం లేకుండా నీకేమి జరగదు .. నీ కర్మ నువ్వు అనుభావిన్చేసాక బతుకుతావో చచ్చిపోతవో నీ ఇష్టం .. కాని మూర్ఖంగా ప్రాణాలు తీసుకుంటే .. మల్లి జన్మలో బల్లి గానో పిల్లి గానో పుట్టి దీనికి రెండు రెట్లు ఎక్కువ బాధలు అనుభవిస్తావ్ .. :) ఈ అవేర్నెస్ జనాల్లో వస్తే కొంచెం ధైర్యంగా ఉంటారేమో కదా :)
నువ్వు ఇంత ఆలోచించి చెప్పింది మాత్రం .. సూపర్ ఉంది .. గ్రేట్ జాబ్ :)

krsna said...

conclusion adirindi. ur post worth lots of praises. uttama post ga nandi award teesuko :)

శివరంజని said...

కిరణ్ పోస్ట్ చాలా బాగుంది నువ్వు చెప్పింది నిజమే & మధుర గారి కామెంట్ కూడా

kiran said...

@karthik garu - Thanks..
@madhura vani గారు - మీరు కరెక్టే ..ఆ నిమిషం లో అసలు ఇంత ఆలోచించ లేము..
కానీ ఏంటంటే...ఇలా ఎక్కడో ఒక చోట చదివి..కాస్త గుర్తు పెట్టుకుని అలంటి పనులు చేయకుండా ఉంటారేమో అని చిన్న ఆశ..అంతే..:)
@హరే కృష్ణ - Thank you :):)

kiran said...

@వేణు రాం గారు - Thank you .. :)
@కావ్య - Thanks a ton .. :)..కానీ ఆ టైం లో ఏమి ఆలోచించరు కావ్య..అదే కదా బాధ.. :(..
@కృష్ణ గారు..హహ..Thank you very much ..నంది కోసం వెయిటింగ్.. :)
@రంజని - థాంక్స్ అండి..:)..మధుర గారి తరఫున కూడా.. :):)

sivaprasad said...

chala bagundi

Ennela said...

//..మనిషి ఎంత మేధావో ..అంతకంటే రెట్టింపు మూర్ఖుడు//
ఛ యీ రోజే నేనెందుకో నన్ను నేను మేధవి అనుకున్నా..ప్చ్ ప్చ్ ప్చ్
//ఒక పేర రాయంగానే నచ్చేసి దాన్ని అందరికీ చూపించి...తరవాత నాకు తెలియదు అనలేం కద?// వావ్ యీ లయిన్ కెవ్వ్ కెవ్వ్....
బాగుంది కిరణ్ , బాగా వ్రాసారు.
నాకొక డవుటు...ఇంత సీరియస్సు టాపిక్ ఏమిటీ మీరు? కొంప తీసి ఎవరైనా చచ్చిపోతా అంటున్నారా ఏంటి! మీ యీ పోస్టు చదివించెయ్యండి చాలు,. .."Does it really matter after 5 years" యీ లయిన్ ఒక్కటి చాలు మారడానికి..నేను గ్యారంటీ

kiran said...

@శివ ప్రసాద్ గారు and రాధిక గారు - thank you :)
@ఎన్నెల గారు - హహహ..మీరు మేధావే..మూర్ఖులుగా మరే ఛాన్స్ మీకు లేదు లెండి..:)
చాలా సంతోషంగా ఉంది మీకు నచ్చినందుకు..:)
హ్మ్న్..సీరియస్ పోస్ట్ ఎందుకు అంటే..కొన్ని విన్నాను..కొన్ని చూసాను..:(..
అవి ఇక మీదట చూడకుండా ఉండాలి అనే ఆలోచనతో చిన్న చిరాకు తో బైటికి వచ్చిన భావాలూ ఇవి అంతే.. :)

Amrutha said...

baagundhi Kiran!!
idhi chadivi okkaraina maarithe entha baaguntundho kadha!!
meeru rasina visleshana adbutham ga vundhi...
meeru twaralo oka pshycologist ayipotharu ani naa feeling.. :)

kiran said...

thank u .. amrutha...nijanga marithe really i feel so happy.. :)
and nee last line of comment too mcuh..manaku antha ledu..telida na gurinchi..:)

Mauli said...

@@కానీ ఒక మనిషి దూరమైతే కనీసం ఒక 50 మంది జీవితాలు మారుతాయి

అలా మారక పోతే ఆ ఒక్కరిది తప్పు అయితే సరే ..కాని 50 మ౦ది ది తప్పు అయితే ..?

మారుతున్న కాల౦ లో జరుగుతున్నది ఇదే :)

ఇందు said...

adenti kiran? nenu comment petta kada publish cheyalede :(

kiran said...

@mauli garu - nijame
@indu - nuvvu comment ikkada kadu indu pettindi...:)
aina nuvvu commentithe nenu publish cheyakapovatamaa...cheppu...

Siva said...

కిరణ్‌గారూ..మంచి విషయం చెప్పారు. ఎలాంటి జీవితానికైనా - అది అందమైన జీవితం కాకపోయినా సరే - ఒక పర్పస్ అనేది తప్పకుండా ఉంటుందని నేను నమ్ముతాను. అది ఎలాగంటే..మనకి ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా, ఎదో ఒక అల్పప్రాణికైనా సాయంచేసే అవకాశం తప్పకుండా ఉంటుంది. అలాంటప్పుడు విరక్తితో మన జీవితాన్ని ముగించుకుందామని అనుకుంటే అది కేవలం స్వార్ధమే అవుతుంది!

ఫిదా కి ఫిదా

శేఖర్  కమ్ముల గారు బాగున్నారా?? మీకే ??  బానే  ఉంటారు !! .. మా పరిస్థితే  ఏమి బాలేదు.. ఏం చెప్పమంటారు .?? మాది ఒక  సాఫ్ట్వేర్  జంట .. చి ఛ...