మీరు ఎలా చూస్తున్నారో నాకు తెల్సు..ఒక వింత జంతువు ని చూసి నట్లు...ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది చూసేసారు కాబట్టి.....నాకు తెల్సన్నమాట..:P
ఏదో నాకు దానికి పూర్వ జన్మ కక్షలు లేవు..కానీ మనుషుల వల్ల దూరం అయ్యాను..
అవునండి చిన్నప్పుడేమో...నేను ఒక ఛానల్ లో tom n jerry చూస్తుంటే ..మా తమ్ముడు వచ్చి...హి-మాన్ లు..సూపర్ మాన్ లు పెట్టమనే వాడు..
కాస్త పెద్దయ్యాక...నేను సినిమాలు చూడడం మొదలు పెట్టాక..మీడియా కూడా పెరిగి...2 ,3 తెలుగు ఛానల్ లు వచ్చేవి ..నేను ఒక ఛానల్ చూస్తుంటే వాడు ఇంకోటి కావాలి అనే వాడు..అప్పట్లో..ఇద్దరం..జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకునే వాళ్ళం...నా జుట్టు పొడుగు ఉండటం తో....దూరంగా ఉండి..జడ లాగి..ఆ radius maintain చేస్తూ తిప్పుతూ కాళ్ళతో తన్నే వాడు... మనకి ముందే hieght ప్రాబ్లం..గట్టిగ అరవడం తప్ప ఏమి వచ్చేది కాదు..నా అరుపు తో అమ్మ వచ్చి ఇద్దరినీ చితక బాది...పెద్ద దానివి కదా..వాడిని చుడానిస్తే ఎం పోతుంది..ఐనా ఆడ పిల్లవి...పనులు నేర్చుకుందువు ర..అని లాక్కొని వెళ్ళేది...అమ్మ తోమిన గిన్నెలు అన్ని గూట్లో పెట్టడం.. ఇంకా చిన్న చిన్న పనులు అన్ని పెద్ద సైజు లో చేయించు కునేది..అప్పుడు child labour చెట్ట నేరం అనే concept తెలియక మా అమ్మ కింద బానిస లాగా బతికాను.. :p..అంత జాలి పడకండి..అప్పటివి అన్ని గుర్తు పెటుకుని...ఇప్పుడు కనీసం వంటింట్లో కాళ్ళు కూడా పెట్టం...మా అమ్మ ఎప్పుడైనా గట్టిగ అరిస్తే..నీకేం తెల్సమ్మ బెంగుళూరు లో నేను పడే కష్టాలు...
నా పళ్ళు నేనే తోముకుంట...నా టిఫిన్ నేనే తింట...ఆఫీసు లో పక్క వాడి పని కూడా నేను ఒకొక్క సారి చేస్తూ ఉంటా....అన్న ఏడుపు గాథ వినపిస్తే..అమ్మ మనసు కదా..కరిగి..మీ హాస్టల్ లో చేయని కూర చెప్పు....అని అడుగుతుంది...మా తమ్ముడు...గత సంవత్సరంగా నేను ఇంట్లో నే ఉంటున్న ఎప్పుడు అడగవే..అదేదో కట్టు కథలు చెప్తే కరిగి దానికేమో చేసి పెడ్తావ్ ఆంటాడు...నేను పిచ్హ పిచ్హ గా ఎంజాయ్ చేస్తాను...ఎందుకంటే అప్పుడు కక్ష ఇప్పుడు కూడా తీర్చుకోలేను..ఎందుకంటే..ఇప్పు
ఇది పక్కన పెడ్తే..కొన్ని రోజులయ్యాక అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్ళాను చదువుకోవడానికి ..ఇంక ఎన్నో కలలు...టీవీ remote నా చేతిలోనే ఉన్నట్లు...ఏమి కావాలంటే అవి చూసెస్తున్నత్లు ...ఇంతలో ఆ పై వాడికి నా happiness ..నా కలలు నచ్హ లేదు..స్టొరీ లో ట్విస్ట్ ఇచ్హాడు..కొత్త స్కూల్ లో ఫీజు కట్టాక..ఆ రోజు సాయంత్రం..నేను స్కూల్ నుండి వచ్చి ఏదో కార్టూన్ చూస్తున్న...మా తాతయ్య వచ్చి క్రికెట్ పెట్టమ్మ కిరణమ్మ తల్లి అన్నారు...సరే అని పెట్ట..ఇక అంతే మారిస్తే..హే ..హే...వద్దు..వద్దు అని అరిచే వాళ్ళు..తాతయ్య అయిపోతుంది అంటే..అవి చాలా సార్లు వచ్చాయమ్మ అనే వాళ్ళు..అప్పుడు తమ్ముడు గాడు చూడనివ్వలెదు అంటే..అవి మళ్ళి వచినప్పుడు నేను చెప్తాలే గాని...అమ్మమ్మ ఒక్కతే ఏదో చేస్కుంటోంది పాపం..నువ్వు వెళ్లి హెల్ప్ చెయ్యి అనే వాళ్ళు.....అప్పుడే తెల్సింది..నా ప్లేస్ మారింది కానీ కష్టాలు మారలేదు అని...క్రికెట్ రాని రోజుల్లో సోనీ టీవీ లో వచ్చే CID చూసే వాళ్ళు... అందుకే నాకు ఇప్పటికి క్రికెట్ అన్న CID అన్న ఇష్టం లేదు..అందులో act చేసే వాళ్లన్న పిచ్చ చిరాకు...ఎంత కసి పెరిగింది అంటే..మొన్న శ్రీ రామ్ పాట కోసం అని indian idol చూస్తుంటే CID లో అతను గెస్ట్..ఇక ఆ ఛానల్ ఇంకో గంట వరకు మళ్ళి పెట్టలేదు...మా నాన్న ఎంత బతిమిలదరో..ఐనా పెట్ట లేదు...!!
ఇక ఇంటర్ కి వచ్చాక మా బామ్మ దగ్గర ఉన్న ...ఆ నారాయణ కాలేజీ వాడు పెట్టె mental torture తటుకోలేక పొరపాటున టీవీ చూద్దాం అంటే..వెంటనే ఎవరో ఒకరు ప్రత్యక్షం అయ్యే వారు...మా బామ్మో ..మా తమ్ముల్లో ..నీకు ఆదివారం పరీక్ష ఉంటుంది కదా ..చదువుకో పో అని..కాలేజీ వాడు మర్చి పోయిన మా ఇంట్లో వాళ్ళే గుర్తు చేసి పరీక్ష పెట్టెల తగు జాగ్రతలు తీస్కునే వాళ్ళు....కానీ వాళ్ళు ఎం చూసిన 30 లో పెటుకుని చూస్కునే వాళ్ళు.. అంటే నాకు అప్పట్లోనే దేవుడు మైండ్ ని ఎలా కంట్రోల్ లో పెట్టుకొవాలో నేర్పించడానికి ట్రై చేసాడు...కానీ అర్థం కాక..చెవులు ఎలా కంట్రోల్ లో ఉంచుకోవాలో నేర్చుకుని..చదువుకునే దాన్ని...ఇంట్లో వీళ్ళు ముగ్గురు లేనప్పుడు...మా పెద్దమ్మ పని చేస్కున్తునప్పుడు..మెల్ల గా వెళ్లి టీవీ పెడతా...ఇంతలో మా పెదనాన్న గొంతు..ఏంటే ఎంత వరకు వచ్చింది చదువు అని...ఏంటి ఈయన తొందరగా vachesaru అనుకుంటూ ఉండగా...ఆయనే చెప్తారు..ఇవాళ్ళ అసలు ట్రాఫ్ఫిక్ లేదే...ఏదో నా టైం బాగుండి తొందరగా వచ్చేస..ఏది remote ఇవ్వు...వార్తలు చూద్దాం అని..:( ...ఇక అక్కడ నుండి లేచి వెళ్లిపోతు..నా టైం ని నేను బండ బూతులు తిట్టుకుంట...
ఇక్కడ కట్ చేసి b .tech కి మళ్ళి ఇంటికే వస్తే..మా అమ్మకు ..నాన్నకు మేము ఎంత freedom ఇచ్చమో అప్పుడే తెల్సింది.. కనీసం ఎదురుగ కూర్చుంటే చూస్తావ అని కూడా అడగకుండా... :p..నాన్న న్యూస్ చానల్స్,CID ,కాలి దొరికితే అమ్మ తేజ టీవీ లో వేసే పాత + ఫ్లోప్ సినిమాలు చుస్తూ కంటిన్యూ అయిపోయారు..ఎవరు లేనప్పుడు నేను చూద్దాం అంటే..నా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చే వాళ్ళు...వాళ్ళు మాకు టీవీ ఉండదు మా రూం లో మేము కాసేపు చూస్తాం అని ...remote లాగేసే వాళ్ళు... :(...ఇలా టీవీ కి నాకు దూరం ఏర్పడింది...
ఇన్ని experience లు అయ్యాక కూడా ఇంక టీవీ చూడాలి అనిపిస్తే నేను పక్క దున్నపోతునే అవుతాను...కానీ అప్పుడప్పుడు మనిషిని అని మర్చిపోయి హాస్టల్ లో ఒకటి రెండు సార్లు remote తీస్కున్న...వచేసారండి...పై నుండి north అమ్మాయిలు...పక్క నుండి తమిలమ్మైలు...హే కిరణ్..keep 34 నా..keep 61 నా అని...ఇంక నేను జీతం లేని టీవీ ఆపరేటర్ గా కెరీర్ ని ఊహిన్చుకొలెక..అక్కడి తో స్వస్తి చెప్పి..మరీ అదృష్టం బాగుండి నాకు నచ్చే ప్రోగ్రాం ఏ ఎవరైనా చూస్తూ ఉంటే చూసి ఆనందించి వెళ్ళిపోత...
మొన్న మా తాతయ్య ఎవరో వస్తే చెప్తున్నారు...అసలు కిరణమ్మ వస్తుందే కానీ...నాకు ఏమి పోటి లేదమ్మా..ఆమె పని ఆమె చేస్కొని పోతుంది..నా ప్రోగ్రాం లు నేను చుస్కోవచు అని...!!ఒహ్హూ...ఇలా అనుకుంటున్నారా అని నేను అనుకున్నాను..ఏమి చేయలేక..!!
సో పొరపాటున ఇప్పుడు ఎవరన్న అడిగిన...టీవీ చూస్తావ అని..లేదు అంట....వాళ్ల మొహం లో ఆనందం నాకు అర్థమైపోతుంది...ఇది మనకు అడ్డం కాదు ..అని.. :)
ఇలా ఎన్ని త్యాగాలు చేసానో...త్యాగశీలివమ్మ..కిరణు.
16 comments:
Good one. Keep posting similar tales.
Thanks sri...
పోనిలెండి.. మొత్తానికి క్లైమాక్స్ లోనైనా కొన్ని కాంప్లిమెంట్స్ సంపాదించుకున్నారు :). ఎందుకండీ పెద్ద టీవీ కోసం అందరితో గొడవలు.. ఈ మధ్య సెల్ ఫోన్ లలో టీవీలు వచ్చేస్తున్నాయి కదా మీ లాంటి వారి కోసం..
హ హ హ్హ
super
:D :D
మొబైల్ టీవీ చూసుకుంటా నేను ఎంచక్కా బెంగుళూరు కి కూడా త్వరలోనే వచ్చేస్తుంది లెండి
ఆ CID గాడిని చూస్తే నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి చాలా చిరాకు వాడంటే :)
మీరు ఏదోకరోజు టీవీ చూస్తారు కిరణ్ గారు టీవీ చూస్తారు ఉహు ఉహు..
:D :D
too good
hahhahha... nijamenandi kiranmai kadu miru tyagamai :P
'టివి తెచ్చిన కష్టాలు' అని పెడితే బాగుండేదేమో :)
It happens kiran, it happens... ఐనా కష్టాలు మనుషులకు కాక monitors కి mosquitoes కి వస్తాయా చెప్పు? :)
@hare krishna nad rama garu...- vaddu lendi..naku TV meeda istame poyindi..malli aa mobile tv techukunna ila edo oka addu vastundi... :).. im happy now..
@krsna -chala thanks andi artham cheskunnanduku.. :)
@pranav - ante pranav marii inni kastala..oka ammayiki cheppu.. ??
Best post .... Thoroughly enjoyed... :)
Thnaks amrutha. :)
hello kiran gaaru.. baagundi post... andariki ilanti story defenite ga untundi... peddainaaka anni sweet memories la untai. aina TV lo manam miss ayyenni programmes emi undatam ledulendi.. so dont worry much
anyway good post..
ofcourse...emi ravaltedu..anduke manesa asalu TV chudatam.. :)
Chala thanks radha garu na blog visit chesinanduku.. :)..
Double like pranavs comment... hahahahahahaha!
asalu brain upayoginchatledu ga bujji nuvvu...oka rendu varalu office lo pani chesinanatha matrana.. :P...
pakka valla comments ni mechukuntunnav ..!!..nuvu brain upayoginchakunda..
meeku kruthajnatha ledu,meevaallantha meeru inteligent kaavaalani mimmulanu idiotboxlonchi bhayataku theeste vaallanu annesi maatalantaaraa?tyaagam chesindi vaallu(vaalla premanu tyagamu chesi mee patla khatinamugaa vunnaru)
abbo asalu ma intlo vallaki intha support evrau ichundaru.... :)...
Thanks for visiting my blog.... :)
Post a Comment