18 December 2010

అన్నయ్య పెళ్లి..!! :)

మా అన్నయ్య పెళ్లి జరిగింది తెలుసా..!!మొన్న dec 16th ...:)

అన్నయ్య అంటే సొంత అన్నయ్య కాదు...అలా అని ఈ చుట్టమో కాదు...!!

ఒకే కాలేజీ లో చదువుకున్నాం...!!అంతే....!! :)

కాలేజీ ఎం నేర్పించిందో నాకు తెలిదు కానీ....

జీవితానికి సరిపోయేంత ప్రేమ పంచే నలుగురి స్నేహితులని మాత్రం ఇచ్హింది...:D....

ఆ నలుగురిలో ... ఒకడు...ఈ అన్నయ్య...అన్నయ్య..అని అలా తమాషా గ పిలవడం...మొదలు పెట్ట...

అది ఈ రోజుకి..నిజంగా అన్నయ్య ఉన్న అంత importance ఇచ్హే వాడు కాదేమో అని అనిపిస్తుంది...

నేను బాగా నచ్హక పోతే వాళ్ళకి ఏం చెప్పను..అసలు సతాయించను...:P

కానీ వీళ్ళ టైం బాలేక....అతి ఎక్కువగా నచ్చేసి..నాకు సంతోషం వచ్చిన....బాధ వచ్చిన....వీళ్ళనే హింసిస్తూ ఉండేదాన్ని..ఉంటాను...:P

తన పరిచయం అయిపొయింది కదా..!!

పెళ్ళికి...తను షాపింగ్ ఎన్ని రోజుల ముందు చేసాడో నాకు తెలిదు..నేను మాత్రం చేసానండి..ఒక నెల ముందే.. :D...!!

సాయంత్రం 6 ఇంటికి ట్రైన్..ఇక 12 నుండే పని చేయ బుద్ధి కావట్లేదు...

4 కే బయల్దేరిపోయాను.....ట్రైన్ ఎక్కాము...12 మంది...ఒకటే గోల ట్రైన్ దిగే వరకు...

కాలేజీ లో ,బైట కలిసినప్పుడు...మాములుగా కనిపిస్తారు...ఆ పెళ్లి రోజు అదేం కళ వస్తుందో...!!

అబ్బాయి ఐన సరే..అమ్మాయి ఐన సరే.....ఎంత కళగా కనిపిస్తారో...

మా అన్నని పెళ్లి బట్టల్లో చూసి మురిసిపోయా... :)..చక్కగా చంద్రుడి ల ఉన్నాడు...!! :)

పెళ్లి మొత్తం దగ్గరుండి జరిపించాను... :)..హా మరి...ఆడపడుచుని కదా..!!:P :)

ఇంత కాకా ఎందుకు పట్టానో తెల్స...నేను PG షిఫ్ట్ చేసి మా అన్న ఇంటికి షిఫ్ట్ అయిపోవాలని ప్లాన్ వేసి..మా వదిన దగ్గర పర్మిషన్ తీసేస్కున్నా..!! :P...

ఆ పై ఎన్నో నెలల తర్వాత నా ఫ్రెండ్ ని కలిసాను.. :D....!!అదే నులుగు ఉన్నారు అని చెప్పా కదా...ఒకడు మాత్రం బెంగుళూరు లో ఉండడు...వాడిని...

సో ఆల్ వాస్ వెల్ అనమాట...!!

మా అన్న వదిన హ్యాపీ గ ఉండాలని...అందరు దీవించెసి విషెస్ చెప్పేయండి.. :).

12 comments:

Ennela said...

నాకు పిచ్చి ఆనందంగా ఉందండీ..ఫస్ట్ ఫస్ట్ మీ బ్లాగ్ పేరు చూసీ, నా పేరు నా బ్లాగ్ పేరు, 'ఎన్నెల' అన్న మాట....
సెకండు సెకండు... మేము చిన్నప్పుడు చాల యేళ్ళు కలిసి చదువుకున్న అన్నయ్య గుర్తొచ్చేసాడన్న మాట....అన్ ఫార్చునేట్లీ 'నో టచ్' ..అప్పట్లో ఫోను నంబర్లూ ఇ-మైల్ ఐడీలూ లేవుగ......

kiran said...

ఎన్నెల గారు...సో హ్యాపీ..మీరు హ్యాపీ అయినందుకు నా బ్లాగ్ చూసి.. :)
అల టచ్ లో లేకపోయినా ...ఇంక గుర్తున్నారంటే....అభిమానం గొప్పదనే కదా అర్థం... :)..గ్రేట్..:)

హరే కృష్ణ said...

వారినాయనో ఆడపడుచు కట్నం తో పాటు PG హాస్టల్ పేరు చెప్పుకొని వడ్డీ కూడా కొట్టేసే ప్లాన్ లో ఉన్నారా..
మీ అన్న వదినలకి పెళ్లిరోజు శుభాకాంక్షలు.. శుభమస్తు

ఇందు said...

హ్మ్! మీకోసం రేపే కథ మొత్తం వేసేస్తా నాబ్లాగ్లో సరేనా? ఇంక మీ పోస్ట్ విషయానికి వస్తే నాకు సేం ఒక అన్నయ్య ఉన్నాడు...కాలెజి చివరి రొజుల్లో పరిచయం అయిన ఎంసీయె అన్నయ్య.తనని నేను అన్న అనే పిలిచేదాన్ని కాలెజిలో...అలా అలవాటైపోయింది.నా పెళ్ళి కి కూడా వచ్చి నాలుగు వెండిగిన్నెల సెట్ ఇచ్చాడు.అది నాకు వచ్చిన బెస్ట్ గిఫ్ట్స్లో ఒకటి. కాబట్టి నాకు ఈ పోస్ట్ చాలా చాలా నచ్చింది :)

krsna said...

mii mugguriki subhakankshalu. :D (vivahamainanduku vaalliddariki, vadina dorikinanduku miku) :P

kiran said...

@హరే కృష్ణ - నేనేమి ఆడపడుచు కట్నం తీసుకోలేదండి..!!...
ఐనా ఉంటానా...ఏంటి ఇంట్లో..ఊర్కె అంటాం అంతే...
థాంక్స్ మీ విషెస్ కి...

@ఇందు - sure ..sure ...వెయిటింగ్..ఇక్కడ...మీ పోస్ట్ కోసం...
అంతే అండి...కొన్ని relations చాల special ...!! :)

@krsna - double thanks ...
variety wishes meevi ..!! :D

prince said...

kalasi vunna kaalam kalmasham lenidi

vidipoina vela varnincha ranidi

jeevita gamanam evarini etu cherchina

nenu nee nestham enni yugalaina.

Happy marriedlife to my friend and dedicating this lines to him.

kiran said...

@prince - donga sachinoda....aa lines naku kuda ani chepachu kadaa.. ...
kavitha eppati lage soooper..anna jeevitham dhanyam... :D..
anna ii post chuste..nenu rasina post kante..nuvvu rasina comment ke pandaga cheskuntadu.. :D...

మనసు పలికే said...

హ్మ్.. దేవుడిచ్చిన అన్నయ్య అన్నమాట. నా భాషలో అయితే అప్పు తెచ్చుకున్న అన్నయ్య:) నాకు సొంత అన్నయ్యలు లేకపోవడం చేత బోల్డంత మంది ప్రేమను పంచే అన్నయ్యలని నేనే సంపాదించుకున్నాను:)
మీ అన్నా వదినలు సంతోషంగా ఉండాలని, అలాగే నేను సంపాదించుకున్న అన్నయ్యలకి కూడా తొందర్లో వదినలు దొరకాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను:)

kiran said...

అపర్ణ గారు - welcome అండి నా బ్లాగ్ కి.. :)

థాంక్స్ మా అన్నయ కి విషెస్ చెప్పినందుకు..
మీ అన్నయ్యలకు అడ్వాన్స్డ్ విషెస్ మరి.. :ద

మనసు పలికే said...

మ అన్నయ్యల తరఫున ధన్యవాదాలు..:)))

kiran said...

@ aparna - :D

ఫిదా కి ఫిదా

శేఖర్  కమ్ముల గారు బాగున్నారా?? మీకే ??  బానే  ఉంటారు !! .. మా పరిస్థితే  ఏమి బాలేదు.. ఏం చెప్పమంటారు .?? మాది ఒక  సాఫ్ట్వేర్  జంట .. చి ఛ...