ఒక రోజు మా office కి సెలవ ...ఎంతో ఆనందంగా ఉంది అవును.....ఎందుకో తెలుసా ¸...మా హాస్టల్ మొత్తానికి నాకు ఒక్క దానికే సెలవ...!!!హ..హ...హ......వాళ్ళు తొందరగా లేచి గబా గబా పరుగులు పెడుతూ ఉంటే.నేను హాయి గ ఇంకా బెడ్ మీదే దొరలుతూ..నవ్వుథూ...bye చెప్పడం .వాళ్ళు ఏడుస్తూ ..office కి వెళ్ళడం ..ఆహా మీకు వినడానికే ఇంత బాగుంటే..ఇక నాకో ..!! భలే భలే..ఉంది.. అసలు విషయానికి వస్తే .. కిటికీ నుండి బైటికి చూస్తే ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది అది నా friend.. ఒంటరి గా ఉన్నపుడు దానిని చూస్తు దానితో కబుర్లు చెప్పడం బాగా అలవాటు...దీన్ని చూసి మొదట లో అనుకునే దాన్ని ..ఇటు అటూ కాకుండా ఇళ్ళ మధ్య లో ఉందే ...ఏ దారిలోనో ఉంటే వఛి పొయే వారికి నీడనైన ఇచేది అని.మరి వినేసిందో ఏమో ..ఒక వరం రోజులలో అది కొంతమందికి ఆశ్రయం ఇవ్వడం స్టార్ట్ చేసింది ..!! చాల మంచిది కదా ...!! వాళ్ళు వెదురు బుట్టలు అల్లుకుంటూ ఉంటారు...ఆమె అల్లుతూ మద్య మద్య లో చెట్టుకి కట్టిన ఉయ్యాల లో తన పాపని ఊపుతూ ఉంటుంది ..!!వీటినన్నిటినీ గమనిస్తున్నా నేను... సడన్ గ పెద్ద గాలి ..దుమ్ము లేచాయి...ఎక్కువగా involve అయ్యి కిటికీ లోకి దూరిపోయనేమొ దుమ్ము వచ్చి కంట్లో పడింది...మొహం కడుక్కుని వచ్చే లోపు సన్నని చినుకులు ..ఇక పాపం చెట్టు కింద వాళ్ళు వెదురు తడవ కుండా మొత్తం ఒక shed లాంటి దాని కింద పెట్టారు ..ఇక ఆవిడ ఆ పసి బిడ్డను పట్టుకుని పరుగో పరుగు ...ఆ పక్కనే ఉన్న ..ఆవు ,దూడ ..కాసేపు చూసాయి ..వాన విపరీతంగా పడడం తో అవీ పరుగులెత్తాయి ..!!నాకేమో చాల పాపం అనిపించింది ..!! మనమేమో ఇలా బిల్డింగ్ ల లో ఉండి కూడా ఏదో ఒక రోజు వానలో తడిస్తేనే తిటుకుంటూ లేక వాన వాళ్ళ పవర్ పోతేనో ...ఏదో ఒకటి సనుగుతునే ఉంటాము ..!! పసి బిడ్డ తో సహా వాళ్ళు అలా కష్టాలు పడ్తున్నారు ...మరి వాల్లెమనుకోవాలి..??...కానీ ప్రతి దానికి ఒక reason ఉంటుంది ఆ దేవుడి పనికి ...!! అప్పుడు ఒక్కటే ఒకటి అనిపించింది ..That we are blessed...!! అని
ఈ మాట నా friend కి కూడా నచినట్లుంది ...దానికి సంతోషమే ..చాల రోజులైంది వాన పడి..సో కొమ్మల్ని ఊగిస్థూ డాన్స్ చేసేసింది..
3 comments:
:)
nice
Thank u.. :)
Nice. :)
Post a Comment