నమ్మకం

నేను శ్రీ రామ కృష్ణ పరమహంస జీవిత గాథ చదువుతున్నాను...ఆ పుస్తకం ఎంత బాగుందంటే...ఓపికుంటే ప్రతి పేజి టైపు చేసి పెట్టాలి అనిపిస్తుంది...కాని జీవితం లో ఒక్క సారైనా చదవాల్సిన పుస్తకం. అందులోని చిన్న కథ నాకు చాల నచ్చి ఇక్కడ రాస్తున్నా...

ఒకప్పుడు గోలోకంలో విష్ణువుకి నారదుని పై ఏ కారణంగానో కోపం వచ్చింది .వెంటనే నరక వాసం చేయమని నారదుణ్ణి శపించాడు .ఆ శాపం విని నారదుడు ఎంతో ఆందోళన చెందాడు .భగవంతుణ్ణి ఎన్నో విధాలుగా స్తుతించి ,ప్రసన్నం చేసుకున్నాడు .

" ప్రభూ! నరకం ఎక్కడ - ఎలా - ఎన్ని రకాలు గా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది .దయ చేసి తెలియ పరచండి " అని ప్రార్థించాడు
                            
       అప్పుడు విష్ణువు ఒక సుద్ద ముక్క తీసుకుని ,నేల మీద భూమి - స్వర్గం - నరకం చిత్రం గీసి ,ఏవేవి ఎక్కడ ఉంటాయో వివరించాడు.' ఇదయ్యా నరకం .ఇక్కడ స్వర్గం ఉంటుందయ్యా ' అని చెప్పాడు . 'అలాగా ,అయితే ఇంకేం , నేను నరక  వాసం చేసేస్తాను '  అన్టూ నారదుడు 'నరకం' బొమ్మ మీద పడి దొర్లాడు .దొర్లి పైకి లేచి ప్రణామం చేసాడు.
                                  
                                         అది చూసి విష్ణువు నవ్వి , 'ఇదేమిటి , అది నరక వాసం ఎలా అవుతున్దీ ??' అన్నాడు .
'ఎందుక్కాదు? స్వర్గ - నరకాలు నీ సృష్టే కదా ! నువ్వు గీసి చూపించి ,ఇది నరకం అన్నప్పుడు అది నిజంగానే నరకం అవుతుంది . అంతే కాదు ,నేను దాని పై దోర్లినప్పుడు నిజంగానే నేను నరక యాతన అనుభవించాను ' అని నారదుడు ప్రగాఢ విశ్వాసం తో చెప్పాడు .

                                       అతడి విశ్వాసం చూసి విష్ణువు కూడా , ' తధస్తూ   అన్నాడు . కాని భగవంతుని పైన ప్రగాఢ విశ్వాసం తో కనీసం అ బొమ్మ నరకం పైన అయినా దొరల వలసి వచ్చింది నారదుడికి
ఆ మాత్రం ప్రయత్నం చేయడం వల్లే అతడి కర్మ తీరిపాయింది .కాబట్టి భగవంతుని కృపా రాజ్యం లో సైతం పురుష ప్రయత్నానికి ,పురుష కారణానికి స్తానముందన్న విషయాన్ని గురు దేవులు ఇలాంటి కథల ద్వార అప్పుడప్పుడు తెలియ పరుస్థూ ఉండే వారు.

ఇంతటి నమ్మకం మనలో ప్రతి ఒక్కరికీ దేవుడి పై ఉంటే ఎంత బాగుంటుందో కదా !!!!

Comments

excellent
ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో కాస్త చెప్పగలరా
kiran said…
idi sri rama krisha mision lo dorukutundi..!!

Popular posts from this blog

oka telugu navala nundi...

పెళ్లి రోజు కానుక !!

From 'A thing beyond forever'