సాధారణంగా లోకులు ఏ మార్గం లో వెళుతూ ఉంటారో ..ఆ మార్గాన్ని వదిలి ఎవరైనా కొత్త మార్గం లో వెళితే ,లేదా భిన్న రీతి లో మరేదైనా చేస్తే -జన సామాన్యం అతణ్ణి మొదట్లో వెర్రి వాడి కింద జమ కడుతుంది ,ఎగతాళి చేస్తుంది ..అయితే ఆ వ్యక్తి ధృడ సంకల్పం తో దీక్ష గా తన గమ్యం వైపు ప్రగతి సధిస్తూ పోతే ,లోకుల అభిప్రాయం కూడా తదనుగుణంగా మారుథూ వస్తుంది.వారిలో ఆ వ్యక్తి పట్ల భక్తి గౌరవాలు పెంపొందుతాయి...
*************
చందమామ  పిల్లలందరికీ  మామ  ఐనట్లుగానే  భగవంతుడు  ఎల్లరికి  ఆత్మ  బంధువు .ఆయన్ను  ప్రార్థించే  హక్కు  అందరికి  ఉంది 
హృదయ  పూర్వకంగా  ప్రార్థించే  వారికి  అయన  దర్శనమిచి  తరింప  చేస్తాడు .నువ్వు   కూడా  ఆయనను  ప్రార్థిస్తే  ,అయన  దర్శనం  పొంద  గలవు 
*************
ఓ  మనిషి ! మరణించిన  వ్యక్తి  తిరిగి  రాడు ,
గడిచిపోయిన  రాత్రి  మళ్లీ  రాదు 
మానసిక  ఉద్వేగం  ఎంత  ఆవేశభరితమైనదాయినప్పటికి    మళ్లీ  అదే  రూపు  దాల్చదు
అదే  విధంగా  జీవుడు  రెండు  సార్లు  ఒక  దేహాన్ని   పొందలేడు
కనుక  గతాన్ని  ఆరాధించడం  ఆపి  ,ప్రస్తుతాన్ని  పూజించడానికి  మేము  మిమ్మల్ని  ఆహ్వానిస్తున్నాం .
గతించిన  దాని  కోసం  దుఖించడం  మాని  ప్రస్తుతానికి  పటుపదవలసింది  గ  ఆహ్వానిస్తున్నాం .
కనుమరుగైన  మార్గాలను  కనుగొనడం  లో  నే  మీ   శక్తులన్నిటి ని  వృధా  చేయక  కొత్త  గ  నిర్మిత  మైన   సమీపం  లో  ఉన్న  ఈ  విశాల  మార్గం  లో  అడుగిడమని మిమ్మల్ని   ఆహ్వానిస్తున్నాం  .
బుద్దిమంతుడ ! ఈ సూచనను  స్వీకరించు ..!!
 *************
భగవంతుడి  వాకిలి  వద్ద  సహనం  తో  వేచి  ఉండాలి .అలా  సిద్ద  పడి  చేయగలిగినపుడు  మాత్రమే  విజయం  ప్రాప్తిన్చుకొవచు  
 *************
సుఖాలను  పొందడమే  మీ  ఆశక్తి గ  మీరు  ఎందుకు  పరిగణిస్తారు?
సుఖాన్ని  పొందగోరితే  దుఃఖాన్ని  కూడా  ఆహ్వానించ   వలసి  ఉంటుంది  
కనుక  నీ  స్వార్థాన్ని  ఒకింత  ఉన్నత  స్థాయికి   చేర్చి  సుఖము ,దుఃఖము  నా  గురువులు ,దేని  ద్వార  ఈ  రెండిటి  నుండి  శాశ్వత   విముక్తి  పొందగలనో  అదే  నా  యదార్థ  స్వార్థం  లేదా  జీవిత  లక్ష్యం  అని   గ్రహించు 
*************
ఓ  ష్త్రీ  మానసమా! మీరెప్పుడు  మీ  ప్రేమస్పదుని  సదా  బందించి  ‘మీ’ దానిని  గ  సొంతం  చేస్కోవాలని  కోరుకుంటారు .కించిత్తు  ఐన  స్వతంత్రతను   మీ  ప్రేమాస్పదునకు   ఇవ్వ  గోరారు .రవ్వంత  స్వతంత్రత  ఇస్తే  , ఆ  పైన  అతను   మీ  వడైనాడని   ,మీ  కంటే  అధికంగా  మరెవరినైన  ప్రేమిస్తాడని రూడి  గ    మీరు  భావిస్తారు .మీ  మానసిక  బలహీనతే  మిమ్మల్ని  అలా  భావింప  చేస్తుందని   మీకు  అవగతం  కాదు .స్వేచను ఇవ్వ  గోరని ప్రేమ  ప్రేమ  కాదని ,తనను  తను  మరచి   పోయి  ప్రేమస్పదుని  స్వేచలో ఆనందించడం  నేర్చుకుని ,నేర్చుకో  గోరని  ప్రేమ   సత్వరమే  ఇంకి  పోతుందని  మీరు  గ్రహించ  లేకున్నారు .కనుక  హృదయ  పూర్వకంగా  మీ   ప్రేమను  మరెవరికైనా   అర్పించ  గలిగితే  , ఇక  ఏ  బయము  ఉండదు .మీ  ప్రేమాస్పదుడు  ‘మీ ’ వాడి  గానే  ఉండిపోతడనే  ,స్వార్థ  రహితమైన  పవిత్ర  ప్రేమ  చివరకు  మీకే  కాక  ,మీ  ప్రేమాస్పదునికి  కూడా  భగవద్దర్సనం సైతం  కలిగిస్తుందని  నిస్సందేహంగా  విశ్వసించండి  
*****************
 
 
1 comment:
Kiran, can you tell me which book is this?
Post a Comment