29 December 2009

నా kochi విహార యాత్ర - 2

హమ్మయ్యా.....దిగేశను రా బాబు ట్రైన్ అనుకున్న...లోపల నుండి చూస్తే పల్లెటూరి లా ఉంది ...ఏముంది లే చిన్న స్టేషన్ ఏ కదా లాక్కున్టూ ..పాక్కున్టూ బైట పడచ్చు అనుకున్నా..దిగాక పాపం మా సర్ అదే ఆండీ మ్యానేజర్ గారు హెల్ప్ చేయనా అన్నారు...ఎప్పుడు లేని మొహమాటం ఆ రోజే గుర్తోచి  ..వద్దండి థ్యాంక్ యూ అన్నాను...ఆ తర్వాత నడుస్తూ ఉంటే వస్తూనే ఉంది..బాగ్ బండ బరువు చచ్చింది ..నాకు ఇన్ని బట్టలు అవసరమా ....రోజు ఒకటే వేసుకుంటే ఎవడన్న అడిగే వాడా అని నన్ను నేను తిట్టుకుంటూ నాలుగు అడుగులు వేశాను ....చెయ్యి ఎముక విరిగి పోతుందేమో అనుకున్నా..ఇక మా సర్ గారు నా వెనకాలే రా అన్నారు...సరే అని నా కుస్తీ అయ్యాక తల పైకి ఎత్తి చూశాను..ఇంకా ఎక్కడ సర్...ఆయన వెళ్ళిపోయారు...కానీ చాలా మంది పోర్టర్ సర్ లు కనిపించారు ....ఇంకా నేను ఒకతన్ని చూసి పిలవక ముందే వచేసాడు...బహుశా..ఈ పిల్ల మాట్లాడితే పోతుంది అనుకున్నడెమో ....ఇంకా కూళి కూడా మాట్లాడలేదు...సరే లే అనుకూంటూ అతని వెనకాలే నడిచా...రెండు అడుగులు వేయగానే బ్రిడ్జ్ వచింది....అప్పుడు అనుకున్నా...ఇవి కక్కుర్తి పడి నేనే మోసుకోచుంటే ..నెక్స్ట్ డే ఆంధ్ర పేపర్ లో వెరైటీ గా నా గురించి వచేది ఇలా...కేరళ కు వెళ్ళి మరిఈ వెరైటీ గా ఆత్మ హత్యా ప్రయత్నానికి పాల్పడ్డ ఆంధ్ర యువతి అని...ఇక టీవీ వాడు....ఆత్మ హత్యా ప్రయత్నం చేయాలనుకుంటున్నార ఐతే ఈ క్లిప్పింగ్ చూడండి అని నన్ను నఆ బాగ్ లను చూపించే వాడు..ఇలా ఆలోచించుకుంటూ బ్రిడ్జ్ దిగాను ..అంతలో గుర్తోచింది మా మ్యానేజర్ నాకోసం కార్ పంపిస్తాను అన్నారు.. అప్పుడు కొంచం ఆనందం ..ఎందుకో తెల్సా...నా పేరు రాసి పట్టుకుంటాడు అని చెప్పారు...అందుకే...కానీ ఆ మలయాళం డ్రైవర్ మా కంపెనీ పేరు రాసి పట్టుకున్నాడు... :(...ఏదో ఒకటి అనుకుంటు ..వెళ్ళాను..అంతలో ఈ పోర్టర్ కి డబ్బులు ఇవ్వాలి కదా..ఎంత అని సైగలు చేస్తే...40 అని ఇంగ్లీష్ లో చెప్పాడు..ఆ తర్వాత బేరం ఆడుదమంటే..అసలు ఏ బాష రానట్లు తెగ నటించాడు...నేను కూడా...నాకు వచ్చిన అన్ని బాషలు కలిపి ఇలా అడిగాను...క్యు?....ఎదుకు అంత కాస్ట్లీ....నేను 2౦ rs . ఏ కొడ్తాను అని...వాడికి అర్థం ఐంది బాగా..ఇది ఒక టింగరిది ...అని..అందుకే...వాడు దిగలేదు ....నేను వదిలేసా...పై వాడు చుస్కుంటాడు లే అని ..ఆ కార్ డ్రైవర్ కూడా సపోర్ట్ చేయలేదు...వాళ్ళు అంతే అమ్మ అన్నాడు...సరే అని...నన్ను హోటల్ దగ్గరికి తీసుకెళ్ళాడు...అక్కడ 200 డిమాండ్ చేసాడు...అప్పుడు అర్థమైంది ఆ పోర్టర్ ని ఎందుకు సపోర్ట్ చేసాడో ....ఆ హోటల్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాను...నా పేరు ,నా కంపెనీ చెప్పను...హూ..మీరా...సింగ్లె రూమ్స్ లేవు మేడం..సారీ..ఒక 2 రోజులు  సర్దుకొండి  ఇక్కడే...మల్లి వేరే రూం కి మారుస్తా అన్నాడు...సరే..ఇప్పుడు ఎన్ని గదులది   ఉంది అంటే..౩ BHK ఫ్లాట్ ఉంది అన్నాడు....అప్పుడు ఏడవాలో ..నవ్వాలో తెలియలేదు..ఒక్క దాన్నే..అంత పెద్ద దాంట్లో నా...??..సరే ఇంకా చేసేదేమీ లేక..సరే అన్నాను..అతను బొయ్ ని పిలిచి మేడం కి దారి చూపించు అన్నాడు..అతని వెంటే వెల్ల...డోర్ తెరవగానే...నాకు అది ఒక పెద్ద బంగల లాగా కనిపించింది.. ..అతను..ఒక మూలకి లగెజి పెట్టి..ఈ గది ఒక్కటే వాడుకోండి అన్నాడు..సరే అన్నాను..వెళ్ళే అప్పుడు... ఎమన్నా కావాలంటే బుజ్జర్ నొక్కండి..వస్తాము అన్నాడు..సరే అన్నాను...అతను బైటికి వెళ్ళాడు..తలుపు వేసుకుని...వెనక్కి తిరిగా,,అంతలోనే గుర్తోచింది...టీ తాగాలి అని.. వెంటనే బుజ్జర్ ప్రెస్ చేశా..ఇందాక వచ్చిన అతనే వచాడు...సీరియస్ గ చూసాడు..ఇందాకే చెపచు కదా అన్నట్లు...కాఫీ...అండ్ హాట్ వాటర్ అన్నాను..సరే అని వెళ్లి ఒక పది నిముషాలు అయ్యాక వచాడు...ఇంతలో..నేను బంగల ని సందర్శిస్తున్న..వచాయి కాఫీ..ఇంకా వేడి నీళ్ళు...ఇచేసి..వెళ్ళేటప్పుడు మల్లి..ఇంకో సారి ఆ ఒక్క రూం ఏ అన్నాడు..నాకు చాల కోపం వచ్చింది....తెలుగు లో తిట్టిన ఉపయోగం ఉండదు అని..ఓ.కే...అని కోపం గ చెప్పను...నాకు ఆ ఒక్క గదే చాల పెద్దది గ ఉంటె,..ఇంకో ౩ గదులు ఎం చేస్కోను...????...తయారయ్యాక...మా కంపెనీ  కాబ్ కోసం వెయిట్ చెస్తూ ఉన్న..ఇంత లోపల కాల్ వచ్చింది..శంకర్  ఏమో అనుకున్న...చుస్తే మా మేనేజర్...హెలో  ఎక్కడున్నావ్ అన్నాడు?...కాబ్ కోసం వెయిట్ చేస్తున్న నఒటే..wonderful అనడు...బాబోయ్   ...ఇది కూడా ఒక వింతేనా అనుకుని...సి యౌ సూన్ అంటూ పెట్టేస్సా..ఇంతలో కాబ్ వచ్చింది..ఆఫీసు కి వెళ్ళాను...అదొక పెద్దా బూత్ బంగల...నిజం...ఎటు వెళ్తే ఏమి వస్తుందో కనుక్కోడానికి నాకు ౩ వారలు పట్టింది...అంటే మూడొ వారం తర్వాత నేను అక్కడ లేననుకోండి... శంకర్ వచ్చి లోపలి కి తీసుకెళ్ళాడు..మా మేనేజర్ ని పరిచయం చేసాడు...wonderful...had ur breakfast అన్నాడు..నో ..అంటే..మీ ఆంధ్ర ఫ్రెండ్ హెల్ప్ చేస్తాడు లే అంటూ శంకర్ ని చూపించాడు..ఇంతకి శంకర్ ఎవరో చెప్పలేదు కదా..ఇతను మా బ్రాంచ్ నుండే ఒక నెల ముందు kochi కి వచ్చిన అతను..అప్పుడు నేను తెగ నవ్వాను...ఆ బాష మీకు కరెక్ట్ అని...ఆ రోజు నా భవిష్యతు  తెలిదు కదా మరి.. ఇతను చాల కామెడీ...ఒక రోజు నేను కాల్ చేసి టిఫిన్ అయిందా అంటే..ఆ ఐంది..వాడు ఏందో..గింత కొబ్బరి గిన్న లో..గింత కొబ్బరి నునే  తో చేసిన ఇడ్లి లు..పెట్టి..గింత కొబ్బరి చట్నీ వేసిండు అoటు  ఏడుపు గొంతు తో చెప్పాడు....ఆ రోజు నేను పగల బడి నవ్వాను.....ఈ రోజు నన్ను చూసి తను అంత కంటే 2 రెట్లు ఎక్కువ ఆనంద పడ్డాడు ...టైం బాబు టైం అనుకున్న...ఆ ఆఫీసు ఆ మనుషులు...నాకు అంత వింత గానే తోచేవి...నా సీట్ నాకు చూపించక..నా సిస్టం కి ఏదో ప్రోబెలం వస్తే నెట్వర్క్ డిపార్టుమెంటు కి కాల్ చేశా...అటు సైడ్ నితిన్ ఒండు అన్నారు..హా...వాట్ అన్నాను...సారీ మేడం ...ఆర్ u న్యూ to థిస్ లొకేషన్ అన్నాడు......నాకు తెలుగు ,ఇంగ్లీష్ తప్ప ఏ బాష రాదు అని చెప్పలేక....ఎస్ అన్నాను...అతనే కాదు..అక్కడ ఏ ఎక్స్టెన్షన్ కి కాల్ చేసిన అంతే మలయాళం లో పలకరింపులు...1st డే మీటింగ్ అంటే వెళ్ళాను..మా టీం లో వాళ్ళకి నన్ను పరిచయం చేసి తన తో ఇంగ్లీష్ లో మాట్లాడండి....especially ప్రాజెక్ట్ discussions అప్పుడు అని టీం కి చెప్పక...తను ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం మొదలు పెట్టాడు..మా మేనేజర్...అంత చెప్పేసి నన్ను చూసి....sorryy...మలయాళం లో చెప్పను అంత....నీ సంగతి మర్చిపోయా అన్నాడు...నీవైన గుర్తు చేయచు కదా అన్నాడు..ఏంటి చేసేది.....అనుకుని...ఐన ఆఫీసు లో మాతృ బాష మీద ప్రేమను చూపించడం మీ దగ్గర నుండి నేర్చుకోవాలి అనుకున్నా..ఇది మన తెలుగు వాళ్ళకి నేర్పియాలి అనుకున్న..ఇది నిజంగా నిజం..ఎమన్నా అనుకోండి...మా ఆఫీసు లో తెలుగు వాళ్ళు మాత్రం ..హిందీ,ఇంగ్లీష్ రాక పొఇన కష్ట పడి మాట్లాడుతారు కానీ....తెలుగు లో మాట్లాడటానికి ఆలోచిస్తారు....వింత జనాలు ...ఆఫీసు లో ఇలా తిక్క తిక్క గ ఉంటె ..ఇక ఆ హోటల్ రూం కి వెళ్ళాక ....చుక్కలు కనిపిస్తాయి ....అన్ని మలయాళం చానల్స్ ఏ .. తెలుగు ఒక్క DD8 మాత్రమే వస్తుంది..ఒక రోజు చూదం  అని కూర్చున్న....టాప్ 10 సాంగ్స్ అన్నాడు...అబ్బూ...చూసేద్దాం లే అనుకున్న....టాప్ 10 సాంగ్ N .T .R 1st సినిమా ధీ ...టాప్ 1 సాంగ్  A .N .R . 1st సినిమా డి ...బాబొఇ ఏడవాలి అనిపించింది..ధైర్యంగా ఉండు కిరణ్ అని మనసులో అనుకుని...పక్క ఛానల్ తిప్పాను..అది DD8ఉర్దూ...నాకు బుదీ లేదు అనుకుని టీవీ ఆఫ్ చేసి...కాస్త  బైట గాలి పీలుడ్డం అని బాల్కనీ లో నిల్చున్న....ఎవరో ఒక ఆంటీ మలయాళం లో పలకరించింది...పేరు అడిగింది అది అర్థమైంది...కిరణ్ అని చెప్పను..ఇక ఆ బాష లో నే మాట్లాడటం స్టార్ట్ చేసింది...సారీ ఐ డోంట్ నో  మలయాళం అన్నాను...ఒహ్హ్హ...అని నవ్వింది...ఏంటి కేరళ ట్రిప్ ఆ?మమ్మీ వాళ్ళు ఎక్కడ? బైటికి వెళ్ళరా అని అడిగింది...చీఈఈ...థూఊఉ....అని నన్ను నేను తిట్టుకుని....ఎస్  అని ఒక నవ్వు నవ్వి లోపలి కి  వెళ్లి...కిరణ్ ఓపిక గ ఉండు అని అనుకుని....మల్లి టీవీ పెట్టాను ..హిందీ reality shows చుస్తూ ఉన్న..అంత లో శంకర్ కాల్ చేసి మన కంపెనీ గెస్ట్ హౌస్ కాలి అవ్తోంది..ఇక్కడికి వచేయండి...మాట్లాడటానికి మనుషులు ఉన్నారు...అంతే కాకా టాటా sky    ఉంది అన్ని తెలుగు మంచి చానల్స్ వస్తాయి అన్నాడు....తరువాత రోజు ఆఫీసు కి వెళ్ళగానే ఆ డిపార్టుమెంటు కి కాల్ చేసి నన్ను షిఫ్ట్ చేయండి..కాలి ఐంది అని తెల్సింది అన్నాను..సరే మేడం ...you can గో టుడే ఇవేనింగ్ అన్నాడు...సరే అని నేను కాబ్ బుక్ చేస్కుందాం అనుకునే లోపు..శంకర్ వచ్చి వాడి మొహనికి 200వందలు ఎందుకు కిరణ్ నేను ఉన్నాను కదా అన్నాడు....వద్దు లెండి మీకు ఎందుకు శ్రమ..ఐన అక్కడి నుండి ఆటో లో రావాలంటే మల్లి ఒక కిలోమీటర్ ఆ luggage ని మోస్కుని రవళి అంటే..ఎం పర్లేదు..నేనున్నా కదా అన్నాడు...సరే అన్నాను....వెళ్లి లగేజి  తీస్కుని..రూం కాలి చేసి బైటికి వచ్చాం ...తను చిన్న ఎయిర్ బాగ్ చేతిలో పట్టుకుని ర కిరణ్ అన్నాడు...ఇప్పుడు నేను ఈ సూట్ కేసు మోయలా...mummyy...అని ఏడుపు మొహం పెట్టి...అతనిని ఏమి అనలేక..పదండి అన్నాను..అదృష్టం ఎక్కువయ్యి....ఒక్క ఆటో కూడా హోటల్ ముందర లేదు...ఇప్పుడు 1.5 కిలోమీటర్ నడవాలి...బబొఈ...తను తొందర తొందరగా నదుస్థూ..అంత మెల్లిగా ఏందీ కిరణ్...తొందరగా రా అన్నాడు..ఆ ప్లేస్ లో ఇంకెవరైనా  ఉంటె చాచే వాళ్ళు...వస్తున్నా అని చెప్పి ...నడిచా... ఒక ఆటో కనిపించింది...అతను 70 అంటే..శంకర్ 50 అంటదు...అలా 2 ఆటో లు పోయాక...ఇంకొక ఆటో వచ్చింది...100 అన్నాడు..వెళ్ళిపో అంటే...ఇది ఉరి అవతల ఉంది..ఇంకొక ఆటో కోసం ఎదురు చుస్తే కష్టం అని ఏదేదో చెప్పాడు..సరే అని ఎక్కాము ..ముందు ఆటో ఎక్కుంటే ౩౦ రూపాయలు మిగిలేవి కిరణ్ అన్నాడు...పోనిలే ఇప్పటికైనా తెల్సింది అనుకుని...ఉర్కే ఉన్న...చివరికి గెస్ట్ హౌస్ చేరం..అది చాల బాగుంది...భోజనం కూడా ఒక నార్త్ ఇండియన్ చేస్తాడు...కాబట్టి పర్లేదు...ఆ హోటల్ లో మాట్లాడే వాళ్ళు లేక నేను ఏడిస్తే...ఇక్కడ ఎక్కువై ఏడుపొస్తుంది...ఆ శంకర్ ఒక్క నిమిషం ఉఉర్కే ఉండదు...ఇక్కడి కష్టాలు చెపుతా మీకు... వచ్చే
 టపా లో





2 comments:

సీత said...

Bavundandi kiran garu.. meelo maaanchi comedy undi

Anonymous said...

bujji garu...thank u.. :)

అనన్య చురకలు !

మా పాపా పేరు అనన్య  ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను  దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...