3 November 2009

నా kochi విహార యాత్ర -1

నిజంగా చెప్పాలంటే ఆ ప్రయాణానికి ఏమి పేరు పెట్టాలో కూడా తెలీదు …మొత్తం చదివాకా దీన్ని ఏమంటారో మీరే చెప్పండి …

అనగనగా ఒక బెంచ్ లో ఉన్న రోజు ..అన్నట్లు ..చెప్పాలి కదూ. .బెంచ్ లో అంటే ….నేను ఒక software ఉద్యోగిని …

చేరి 3 నెలలు అయింది ..కానీ మేనేజర్ చెప్పే చిన్న పనులు చేయటమే కానీ ఒక ప్రాజెక్ట్ కి ఎప్పుడు పని చేయలేదు..

మా ఫ్రెండ్స్ అంతా ఏమో వెళ్లి అడుగు అంటారు ….మా మేనేజర్ ఏమో ఏమైనా వస్తే నీకే 1st ఇప్పిస్తా అనింది ..

సరే అని ..నమ్మాను ..జీవితం ..నమ్మకం పైనే కదా నడిచేది అనుకుని …. J

సడన్ గా ఒక రోజు పిలిచి ..నీవు kochi కి వెళ్ళాలి అంది …అమ్మో …kochi కా …..అనుకుని ….అలొచిస్తూ ఉంటే …వెళ్తావా అంది …ఊఊఊఊఉ ..అని ఆమె ముందే రాగాలూ తీస్తూ ఉంటే …ఇంట్లో వాళ్ళని అడగాలా అంది ..

మళ్లి ఊఊ అని అలొచిస్తూ ఉంటే ..సరే వెళ్లి నాకు వీలైనంత తొందరగా చెప్పు ….అంది …

బైటికి వచ్చి ..కంగారు గా మా నాన్నకు కాల్ చేస్తే …హా వెళ్ళు ఏముంది అందులో ..ఎన్ని రోజులు అంటూ అడిగారు …3 వారాలు లేక నాలుగు వారాలు అన్నా …

వెళ్ళు ..అంటూ పెట్టేసారు ..బయంగా నా ఫ్రెండ్ కి కాల్ చేశాను…తనతో ఎందుకో బయంగా ఉంది ..ఇప్పటి వరకు ఎక్కడకీ వెళ్ళలేదు కదా అంటే …

నీ బొంద అందరూ మంచి గా onsite కే వెళ్తున్నారు ….నీకేంటే బాధ …..అది కూడా ౩ వారాలే కదా అని ధైర్యం చెప్పారు …

నా పాలిట ఇదే onsite అయిపోయింది అనుకుని ….వెళ్లి వెళ్తాను అన్నాను …ఓకే ..నీకు ఇది మంచి opportunity…

అక్కడికి వెళ్లి బాగా నేర్చుకో అంది …

ఏ ముహూర్తాన ఒప్పుకున్ననో కాని ….ఒక గండం తర్వాత ఇంకో గండం ..లా అయిపోయింది ….

సరే అక్కడ ఎవరితో మాట్లాడాలో ఆవిడ ఫోన్ నెంబర్ లు ఇచ్హింది …

కాల్ చేసి …హాయ్ నేను ..banaglore నుండి వస్తున్నా ….అన్నా …హోఓఒ wonderfullllllllllllllll!!!!!...అని గట్టిగ అరిచాడు …బయం వేసిన …కొంచం గుండె గట్టి చేస్కొని ..

అన్ని మాట్లాడాను ….

కంపెనీ వాళ్లే గెస్ట్ హౌస్ అన్ని provide చేస్తారు ..అని మొత్తం procedure మెయిల్ లో పంపాడు అక్కడ మేనేజర్ …

సరే ఆఫీసు లో అన్ని ముగించుకుని ….రూం కి వెళ్లి సర్దడం మొదలు పెట్టాను …..ఒక సూట్ కేసు ,ఇంకో బాగ్ తయారయ్యాయి …

అమ్మో ఇవి ఇప్పుడు నేను మోయాలా అనుకుంటూ ఉంటే ..మా రూం లో వాళ్ళు గొల్లు మని నవ్వారు ..

నీ సైజు కి తగ్గట్టు లగేజి తేసుకెల్లవె అని …..ఎన్ని తీసేసిన ….సూట్ కేసు ..బాగ్ తప్పలేదు .ఆ రోజు రాత్రంతా .అవి ఎలా మొయలోఒ అని బయపద్థూ నిద్ర పోలేదు .
తర్వాత రోజు మా మేనేజర్ పిలిచి రెడీ ఆ వెళ్ళడానికి అంటే ..hmmmm.yess అని ఒక పెద్ద స్మైల్ ఇచ్చను కానీ లోపల నా లగేజి ఏ గుర్తు వస్తోంది .
సరే అని నా ఫ్రెండ్ కి కాల్ చేసి రేపు స్టేషన్ కి వచ్చి కొంచం ఎక్కించాలి అన్నాను.. సరే అన్నాడు...అక్కడి వచ్చి..పద వెళ్దాం అన్నాడు...ఒక బాగ్ మాత్రం చేతిలోకి తీస్కొని ..ఆ సూట్ కేసు కూడా నాదే అన్నాను ..ఒక లుక్ ఇచ్చి ఆటో అన్నాడు..majestic కి వెళ్ళాక ఆ underground లో కనీసం ఈ సూట్ కేసు ని లాక్కొని రా అన్నాడు...సరే అన్నాను...దాన్ని లాగడం కూడా సరిగ్గా రాక..కింద మీద పడేసి..మొత్తం దుమ్ము దుమ్ము చేశాను...అమ్మ తల్లి ఇటివ్వు అంటూ తీస్కున్నాడు ....సరే హ్యాపీ గా నడుస్తున్న...పోర్టర్ ని చేసేసవ్ కదే అన్నట్లు చూసాడు..సరే అని మాటల్లోకి దించి..గట్టేక్కేసను..ఇక ట్రైన్ రాంగనే ఎక్కాను...మొత్తానికి ట్రైన్ ekkanu a/c coach….sleeper అన్న అయితే జనాలు మాట్లాడతారు ఆ a/c లో అందరూ ఎవరి పనులు వాళ్ళు చేస్కోవట్లేదు కాని .అలా నటిస్తున్నారు.
సరే నేనేమి తక్కువ కాదు అనట్లు నా mp3 తీసాను విందాము అని ..అది నా లగేజి మోసే టెన్షన్ లో మర్చిపోయాను దానికి ఛార్జ్ పెట్టడం .కానీ దాన్ని తీసి లోపల పెట్టలేను కంపెతిషన్ కి తీసా కదామరి ..
దాన్ని ఊర్కె అలా పెట్టుకుని ఆక్ట్ చేస్తున్న తల ఊపక పోతే పక్క నా ఉన్న వాళ్ళకి డౌట్ వస్తుందని ట్రైన్ ఊగె డైరక్షన్ లో నా తల ని కూడా ఊపెసను .మముల్గా అయితే music ని బట్టి చేస్తాం కదా .అలా అన్న మాట . చీ ఇలా నటించడం నాకు వచ్చు అని ముందే తెలిస్తే kochi కాకుండా ఏ hyd ఓ వెళ్లి సినిమా లో ట్రై చేస్కునే దాన్ని కదా అనుకుని .కిటికీ వైపు చూసాను బైట చుస్తూ కాలక్షేపం చేద్దామని .మూసెసి ఉంది L….చీఈఈఈఈఈఈఈఈఇ అనుకుని .పక్కకు తిరగా excuse me అంటూ ఒక పెద్దాయన ఒక 50 యేఅర్స్ ఉంటాయి laptop బాగ్ మాత్రమే తీస్కొని వచాడు . మేనేజర్ అని అర్థమైంది అబ్బోఒ నేను తెలివిగల దాన్ని .కేవలం మాటల వల్ల వాళ్ళు ఏంటో చెప్పేస్తున్నా అని నన్ను నేను పొగుడు కున్న . కాసేపు అయ్యాక ఆయన మాట్లాడాడు ఎక్కడన్నా వర్క్ చేస్తున్నావా అని .yes అన్నాను .gud అన్నాడు hmm..ఇప్పుడు ప్రతి ఒక్కదూ గుడ్ ఆంటాడు..


అదే ఉద్యోగం లేక పోతే క్లాసు లు పీకుతారు అనుకుంటుండంగానే .ఆయన కాళ్ళకి లగేజీ తగిలింది ఎవరది నీదే నా అన్నాడు .అవ్ను అని చెప్పా .అక్కడ పోస్టింగ్ ఆ అని అడిగాడు .లేదు deputation 3 వారాల కు అన్నాను ..లగేజీ ని ఒక సారి నన్ను ఒక సారి చూసాడు .నాకు నవు వస్తున్నా .నవ్వ లేక తల పక్కకు తిప్పాను
నాది కింద బెర్త్ ఆయన అక్కడే కుర్చుని మెయిల్స్ చెక్ చెస్కుంటూ ఉన్నాడు రాత్రి 9 అయింది .కావాలంటే పైన పడుకో అమ్మ అన్నాడు .లేదండి .నేను ఇక్కడే పడుకుంట అన్నాను సరే .కొంచం లేట్ అవ్తుంది అన్నాడు పర్లేదు అన్నాను .నేను పైకి ఎక్కుతానేమో అని చూసాడు .కానీ నేను రివర్స్ లో ఆయన పైకి ఎక్కడం కోసం ఎదురు చుస్తూ ఉన్నాను ఆపకుండా గుడ్ల గూబ లాగా ఆయన laptop వైపే చూస్తుండటం తో .లోపల తిటుకుంటూ .క్లోజ్ చేసేసాడు .తిట్టుకుంటే తిట్టుకునాడు .నా బయం నేను చెప్పుకోలేను కదా నాకు పైకి ఎక్కడం అంటే బయం అదీ కాక ఒక సారి పడుకుంటే మళ్లి మెలకువ రాదు అందులో ఎప్పుదూ వెల్లని ప్లేస్ కి వెళ్తున్న మరి ..సరే పడుకున్తున్నపుడు..అంకుల్ అని అనేసి మళ్లి బాగోదేమో అని సర్ అన్నాను..ఎస్ అన్నాడు...ఆ స్టేషన్ వచ్హాక నాకు చెప్పండి అన్నాను...ఓకే...అన్నాడు...పొద్దున్నే..ఆయనకంటే ముందే లేచి కూర్చున్న..ఒహ్.....అప్పుడే లేచావా...గుడ్...గుడ్ మార్నింగ్ అన్నాడు...గుడ్ మార్నింగ్ అంటూ స్మైల్ చేశా..స్టేషన్ వచ్చింది....మళ్లి నా లగేజీ గుర్తొచి ఏడుపు వచ్చింది...స్టేషన్ ఇంకా పది నిమిషాల్లో వస్తుంది అన్నాడు ఆయన....బాబోయ్ నా లగేజీ డోర్ దగ్గరికి లక్కేల్లటానికే నాకు గంట పద్తుందే అనుకుంటూ ఉండగా...నేను సూట్ కేసు లాకుంటూ వెళ్ళే లోపల ఆయన నా బాగ్ తీసుకోచేసరు....హ హ గమనించారా..ఇంత వరకు ఏక వచనం ఇప్పుడు మర్యాద..నేను మీ లగే మనిషిని కదండీ మరి..:p


ఇప్పుడే చేరాను కదా..కాస్త విశ్రాంతి తీసుకొని మళ్లి నా విశేషాలు చెప్తాను.. ఓకే నా??

9 comments:

Anonymous said...

కిరణ్ గారు బావుందండి మీ విహార యాత్ర. కాకపోతే మీ లగేజ్ వల్ల కొంచం విషాద యాత్ర అయ్యిందండి అంతే . .......
అయితే కొచ్చిలో అన్నా ఎంజాయ్ చేసారా ?..........................

idi cartheek garu na kiran's world blog lo rasaru..
comments rayadaniki ii blog lo kudaratledu ani ..test chesanu..settings change chesi....

సీత said...

Comment

cartheek said...

now its ok kiran gaaru.......

AB said...

:-)

dharshini said...

i can't understood kiran...
.. sorry.

cartheek said...

కిరణ్ నేను నీ బ్లాగ్ని !
ఏంటి నన్ను మర్చోపోయావా ఏంటి ?
నీ పాటికి నువ్వు నన్ను సృష్టించి ఎదో నా మొహాన ఒక టపా పడేసి వెళ్లి పోయావ్?

నీకేం తెలుసమ్మా నా బాద , రోజు వచ్చిపోయే వాళ్లకు సమాదానం చెప్ప లేక చస్తున్న అనుకో ...
నీ పనులు ఎప్పుడు వున్దేయ్యేలేకాని ,ఇక అయిన నా మొహాన ఒక టపా రాసి పడేయ రాదు ..... :) :)

కిరణ్ గారు సరదాకే అలా రాసా కామెంట్.. మిమ్మల్ని ఏకవచనంతో మాట్లాడానని ఏమి అనుకోకండి :)

Anonymous said...

ha..ha..ha..correcte..chala rojulu aindi post chesi....tondarlo chestanu....cartheek garu...parledu...maryadaga ne thittaru.. :P...emi anukonu...

Anonymous said...

yeah..dharshini...every time i face the same problem wen i visit ur blog...i will njoy only ur art work without understanding ur views..this time i took revenge.. :P..just kidding

Sriharsha said...

:)
:P

అనన్య చురకలు !

మా పాపా పేరు అనన్య  ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను  దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...