29 December 2009

Naren's Poem

Few days back , i read the biography of Swami Vivekananda..It is truely awesome book...which will take us to some different world...I liked the whole book..but i cud not stop giving some space in my blog to one poem which he wrote..and no one can love god like him.. :)



నేను నీ పక్కనే ఉన్నాను

అనే నీ తియ్యని పలుకులు నాకు వినిపిస్తాయి

వెంటనే గుండె దిటవు పడ్తుంది

నువ్వు నాతో ఉంటే

వెయ్యి మ్రుత్యువులు కూడా

నన్ను భయపేట్టలేవు




నువ్వు పసి బిడ్డలు కనురెప్పలు మూసే


తల్లి జోలపాట పాడుతావు


అమాయక బిడ్డల ఆట పాటల్లో


నువ్వు వారి పక్కలో నిలబడి ఉండడం


నేను చూస్తాను




పవిత్ర స్నేహం


చేతులు కలిపేటప్పుడు


వారి మధ్య నిలిచేది అతడే

అమ్మ ముద్దుల్లో అమృతం నింపేది అతడే


'అమ్మా' అనే బిడ్డల మాటల్లోని మాధుర్యం కూడా అతడే




ప్రాచీన ప్రవక్తలు పూజించింది

నా దేవుడైన నిన్నే


మతాలన్నీ పుట్టింది


నీ నుండే


వేదాలు,బైబిల్,కురాన్


ముక్త కంఠం తో పడేది


నిన్నే




ప్రచండ జీవన ప్రవాహం లో


అన్ని అంతరాత్మల ఆత్మవు


నువ్వే!నువ్వే


ఓం తత్ సత్ ఓం


నువ్వు నా దేవుడివి


ప్రియతమా!


నేను నీ వాణ్ని,నీ వాణ్ని!!

No comments:

అనన్య చురకలు !

మా పాపా పేరు అనన్య  ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను  దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...