నా kochi విహార యాత్ర - 3

నా పరిస్థితి పెనం మీద నుండి వచ్చి పోయి మీద పడ్డట్టు ఐంది.. :(..తను మాట్లాడుతాడు కానీ...చాల ఎక్కువ...ఎలా అంటే...మీరు ఒక సినిమా చూస్తున్నారు...దాని dialogues కానీ ,చివరికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా వినిపించదు...అలా ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు...ఆ హీరోయిన్ ఆ సినిమా లో ఇన్ని డ్రెస్ లు మార్చింది..ఆ హీరో పెద్ద వెధవ...ఆ అమ్మాయి ని నేను ఒక సారి చార్మినార్ దగ్గర చూసాను...మొదట్లో చాల ఓపిక గ వినేదాన్ని ..తర్వాత..తర్వాత..వింటున్నట్లు నటించేదాన్ని...నా అదృష్టం బాగుండి...అక్కడ ఉండగానే అతనికి పెళ్లి కుదిరింది...పాపం ఆ పిల్ల కి బలే కోతలు కోసే వాడు...అమాయకురాలు అనిపించేది...kochi చాల చిన్న ఊరె.. ఈ రోజు ఆ actor ని చూసాం....పార్టీ కి వెళ్ళాం ఇలా అన్ని అబద్దాలే..మనిషి మంచోడే కానీ...కోతల రాయుడు...అమ్మయ్య..నన్ను వదిలేసాడు అనుకునే దాన్ని...ఒక సారి నోరు ఊర్కొక..నేనంతకు నేనే..ఎక్కడికైనా వెళ్దాం శంకర్ అన్నాను...కుదరదు లే అన్నట్లు మాట్లాడాడు...ఏంటో ఇతను అనుకున్నా..తర్వాత రోజు అంటున్నాడు..ఏమి అనుకోకు కిరణ్...నిన్ను తీసుకెళ్తే అనవసరమైన కర్చు ..అలా అని ఒక అమ్మాయి చేత కర్చు పెట్టించా లేను అని..వామ్మూ..ఇలా కూడా ఆలోచిస్తారా మనుషులు అనుకున్న..నేనే పెట్టుకుంట నా కర్చు అన్నాను...లేదు అన్నాడు..చీ ..మా నాన్నను కూడా ఇంత బతిమిలాడ లేదు అనుకుని....లైట్ తీస్కున్నాను..ఇంకో వారం వచ్చి కిరణ్ షాపింగ్ కి వెళ్దామా అన్నాడు..అయ్య బాబొఇ ఈ మనిషి తోన అనుకున్నా...సరేలే రోజంతా బోర్ కొడ్తుంది అని..వెళ్ళాను..విషయం ఏంటంటే వాళ్ళ ఆవిడకు ఏదో డ్రెస్ కొనాలి అంట...నాకు సెలక్షన్ తెలిదు అన్నాడు...సరేలే..నేను కూడా చెస్కోవచు అనుకుని...ఒక స్కిర్ట్ కొని దాని మీద టాప్ కోసం మొత్తం kochi అంత తిప్పించాను.. :) ..ఆ రోజు ఏడుపు మొహం తో నా మీద గింత కోపం ఉందా నీకు అన్నాడు....హ..హ..హ..అని గట్టిగ నవ్వేసాను...పోనిలే తెలిసింది అనుకున్నాను...అసలు అంత వెరైటీ మనిషిని నేను చుసుండను..అతను కోపం గ ఉన్నాడా..బాధ గ ఉన్నాడా...ఆనందంగా ఉన్నాడా..అని తెలుసుకోవడం చాల కష్టం.....ఒక వేల నేను research లాంటిది ఏమైనా స్టార్ట్ చేస్తే నా 1st సబ్జెక్టు శంకర్ ... :P...పొదుపు..దాని ఉపయోగాలు...డబ్బు దాని ప్రాధాన్యత లాంటి సబ్జెక్టు ల మీద అతను ఉపన్యాసాలు స్టార్ట్ చేస్తే ఇక దానికి అంతం ఉండదు..రూం లో గోల ఇలా ఉంటె..ఆఫీసు లో క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి...చాల బాగా decorate చేయడం ...competitions పెట్టడం ...gifts ఇవ్వడం..బాగా ఎంజాయ్ చేస్తున్నాం....అక్కడ అలవాటు ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక గిఫ్ట్ కొనాలి....ఒక క్రిస్మస్ త్రీ దగ్గరికి వెళ్లి కొన్ని చిట్స్ పెడతారు...అక్కడికి వెళ్లి మనం ఎం తీస్తే..అందులో ఉన్న వ్యక్తికి మనం గిఫ్ట్ ఇవ్వాలి...అందుకని ఇద్దరం కలిసి ఒక గిఫ్ట్ షాప్ కి వెళ్ళాం..ఎవడో ముక్కు మొహం తెలియనోడికి గిఫ్ట్ కొన్నావ్..మరి నాకు ఎం లేదా అన్నాడు....హా...నాకేమి అర్థం కాలేదు...అది ఒక సారి కాదు చాల సార్లు....సరే అని ఒక డైరీ కొని..ఆఫీసు నుండి వచ్హాక ఇచాను ...అప్పుడు..ఎంత మంచి దానివి కిరణ్ ..అడగంగానే ఇచావు అన్నాడు...దేవుడి creativity కి hatsoff చెప్పి..నా రూం లోకి వెళ్ళిపోయాను...తర్వాత రోజు ఆఫీసు కి వెళ్ళే దారిలో కిరణ్..ఈ రోజు ఇక్కడే దిగుదాం...సాయంత్రం అన్నాదు ..ఎందుకు అంటే నీకు నేను గిఫ్ట్ ఇస్తాను అన్నాడు ..బబొఇ..ఎందుకు అన్నాను ...నీవు నాకు ఇచావు కదా అన్నాడు...నా తల దేనికైనా బాదు కోవాలి అనిపించింది....నాకు గుర్తోచిన మొదటి వ్యక్తి వాళ్ళ ఆవిడ..పాపం అనుకున్నా...ఇంకా ఎన్ని రోజులు ర దేవుడా అనుకుమ్టూ ఆఫీసు లో అడుగు పెట్టాను...అక్కడ అందరు ఎంజాయ్ చేస్తున్నారు....భోజనం సమయానికి అందరు ఈ రోజు చాల బాగుంటాయి వంటలు...అన్ని specials ఏ అని చెప్తే...చాల రోజుల తర్వాత అనుకున్తూ వెళ్ళాం...అక్కడ వంటకాలు చుస్తే అసలు తిన బుడ్డి కావట్లేదు..అన్ని కూరగయలు ..కొబ్బరి నూనె లో ఈథ కొడ్తున్నాయి...ఏమి తీస్కోకుండా ఒక కేకు piece ,ఒక రెడ్ కలర్ లో ఉన్న juice తీస్కున్నా...కిరణ్ ఏందీ అవి తీస్కున్నావ్ అన్నాడు ఇంత లో వచ్చిన శంకర్...ఇవే కొంచం తినే లాగా ఉన్నాయి చూడటానికి అన్నాను...సరే ట్రై చేయి అంటూ వెటకారంగా నవ్వాడు...అప్పుడే అనుకున్నా ఏదో తేడా అని అప్పుడే తెల్సింది...అది నోట్లో పెట్టుకుందాం అనుకుంటుంటే ఏదో వాసనా వచ్చింది...ఏంటది అంటే wine అన్నాడు..mummyyyy ......అని స్నాక్స్ కౌంటర్ లో చుస్తే ఈ రోజు ఎప్పుడు ఉండే సమోసాలు కూడా లేవు..ఎందుకు అంటే స్పెషల్ అన్నాడు....సర్లే..క్రిస్మస్ రోజు ఉపవాసం ఉందాం..ఎలాగో శివ రాత్రికి ఉండే అలవాటు లేదు కదా అనుకున్తూ బైటికి వచ్హం ..ఇంతలో మా మేనేజర్ వచ్చి హౌ ఇస్ ఫుడ్ అన్నాడు...wonderful అన్నాను...నా వెటకారం అతనికి అర్తం ఐనట్లు ఉంది..ఒహ్హ..ఈ రోజు మీకు ఏమి నచవ్..ఇక్కడే ఒక నార్త్ ఇండియన్ restaurant ఉంది అంటే నేను శంకర్ వెళ్ళాం.....అక్కడ నేను noodles ఆర్డర్ చేశాను...ఎక్కడ మీరు అలా చూడలేరు...అంత అద్బుతంగా noodles ని కొబ్బరి నూనె తో తాయారు చేసి ముందర పెట్టాడు....గట్టిగ ఏడవాలి అనిపించింది...శంకర్ నన్ను చూసి ఏడవకు కిరణ్..ఇక్కడ నీవు నా కూతురు అంటే ఎవరైనా నమ్ముతారు..నేనేదో నీకు కొని పెట్టలేదు అనుకుంటారు ప్లీజ్ అన్నాడు..అతను ఆ మాట అనంగానే నాకు నవ్వు వచేసింది...ఇక బైటికి వచ్చి ఎన్ని రోజులో ఈ శిక్ష..దేవుడా కరుణించు అని అడిగాను...ఆఫీసు కు వెళ్ళగానే ఒక మెయిల్ ఉంది...మా అసలు మేనేజర్ నుండి..ఇక నీవు 31st కి వచేయచు అని...ఏసు ప్రభువా...ఉపవాసం ఉండాలి అనుకుంటేనే...ఇంతటి కరుణా నీకు...అందుకే నయ్య నిన్ను కరుణామయుడు అంటారు అనుకుని...సంతోష పడ్డాను ....శంకర్ కి వెళ్లి చెప్పాను...అవునా ..నది ఇంకో 2 నెలలు extend అయ్యింది అన్నాడు..హ..హ..హ..నవ్వాను..అది కాదు కానీ...నీవు వెళ్ళిపోతే ఎవరి బుర్ర తినాలి అన్నాడు......తెలిసే తింటున్నావా మహాను భావ అనుకుని...రూం లో ని గోడలకు చెప్ప కొండి మీ గోడు అంటూ రూం కి వెళ్లి అన్ని సర్దేస..కాబ్ ని పిలిచాను...ఇంకో బాగ్ extra అయ్యింది...నేను కోచి లో కొన్న చిప్స్ కి ..అది సెలవల season కాబట్టి ట్రైన్ లో రిజర్వేషన్ దొరకలా ...అందుకని బస్సు లో వెళ్ళిపోయాను...ఉఉరికి ....అంత అయ్యాక మా బ్రాంచ్ కి వచ్చి మా మేనేజర్ ని కలిసాను...ఎలా ఉంది..kochi అండ్ ట్రిప్ అంది..wonderful !! అన్నాను... ఆమెకు అంతరార్థం తెలియ లేదు...అందరు ఇప్పుడు kochi కి వెళ్లి ఎం చూసావు అంటే... మీరు అంత god 's own country ని చూస్తారు ...నేను ...గాడ్ నే చూసాను అని చెప్తూ ఉంటా.. :P

Comments

Joy said…
ha ha ha ha ha ha ha.. good
kiran said…
thank uuu.. :)
Praveena said…
Kiran, u have got great writing skill :)
kiran said…
Thanks Praveena.. :)
Sai Praveen said…
చమత్కారం బాగానే ఉంది మీకు :)
బాగా రాసారు.
kiran said…
hahahha..thanks praveen.. :)
కావ్య said…
kiran kevv undi asalu nenaite padi padi navva :) entaina neku dairyam ekkuve ..
kiran said…
thank u sao much kavya.. :)
dhairayam...inko rakanga chepu.. :)
Bharatiya said…
చాలా బావుంది మీ kochi యాత్ర

Popular posts from this blog

oka telugu navala nundi...

పెళ్లి రోజు కానుక !!

From 'A thing beyond forever'