5 June 2011

కాళ్ళు - జీతం

ఒక రెండు,మూడు నెలలు గా ఎంత పాజిటివ్ గా ఉందాము అన్నా ఏదో ఒక ఎదురు దెబ్బ తగలడం తో విసుగ్గా అనిపిస్తోంది ..!!

కానీ ఒక్క నిమిషం కూర్చుని ఆలోచించా ..ఎందుకు అంత విసుగు చిరాకు ...చాలా విషయాలు ఉన్నా..ప్రస్తుతం అయితే ఉద్యోగం వల్లే కదా!!అన్నన్ని వేలు ఇచ్చే ఉద్యోగం లో ఈ మాత్రం చిరాకులు ఉండటం సర్వ సాధారణం అనుకుంటూ నాకు నేను చెప్పుకున్నా ....మళ్లీ ఒక్క నిమిషం ఇలా అనిపించింది ..డబ్బు తీస్కుని అవసరాలకు వాడుకుంటూ సాఫీ గా సాగి పోయే కెరీర్ కావాలనుకోడం లో స్వార్థం ఉందేమో ..ఎంత మందికి అవసరాలకి డబ్బు లేక ఇబ్బందులు పడ్తున్నారో ..ఇలాంటి పరిస్థితిని నాకు ఇవ్వకుండా చేసినందుకు థాంక్ గాడ్ అండ్ .. మీలో కూడా అందరికి ఉద్యోగాలుంటే count ur blessings..!!

ఆ విసుగ్గా ఉన్న ఉద్యోగం వల్లే వచ్చిన డబ్బులతో mr.perfect సినిమా కి వెళ్ళాను కదా మొన్న..అప్పుడు ఇంటర్వల్ లో ఒక బర బర మని ఇనుప చక్రాల బండి శబ్దం ..ఇక్కడేంటి గోల అని ఒక్క సారి వెనక్కి తిరిగాను ...నేల మీద ఒకతను చిన్న పీట లాంటి దాని కింద చక్రాలు ఉంటాయి కదా ..దాని మీద ముందుకి వెనక్కి వెళ్తున్నాడు ..ఎందుకంటే దారి కదా ..అప్పటి వరకు ఆ దారి లోనే కూర్చుని చూసాడు సినిమా...ఇప్పుడేమో అందరూ స్నాక్స్ కొనుక్కోడానికి బైటికి లోపలికి వస్తూ ఇటు జరుగు అటు జరుగు అంటున్నారు పాపం ఒక్క నిమిషం కోపం వచ్చింది ..ఎందుకు ఇతనికి ఈ రోజే సినిమా చూడాలి అనిపించింది ఇంకో వారం పోయాక రావచ్చు గా అని ...కానీ వెంటనే నా మనసు నన్ను బాగా తిట్టేసింది ..ఛి ఛి నువ్వు కూడా ఇలా ఆలోచిస్తున్నావ ..??ఏ ఒక పక్క మబ్బులు.. ఇంకో పక్క మొదటి రోజు ... రద్దీగా ఉంటుందని తెల్సు ..అమ్మాయిలు తక్కువ ఉంటారు అని తెల్సు ..కానీ చూడాలనిపించి వెళ్ళావ్ ...అతనికి అంతే కదా ...ఏమో ఆ నిమిషం తెలీకుండానే నా కాళ్ళు చూస్కుంటూ థాంక్ గాడ్ అనుకున్నా ...

:) :) so count your blessings..!! :) :)

9 comments:

Unknown said...

Nice post. I donno how I missed out this blog of yours. Good to see you writing blog in telugu. Keep up the good work...

హరే కృష్ణ said...

hmm..
true!

శశి కళ said...

బొమ్మ అదిరిన్ది ......మీ కున్చెనున్చొచిన్దా ....
superrrrr......future artist....
best of luck.

Anonymous said...

good post and pic also

kiran said...

@అన్నయ్య - Thank you ..:))
ఇంకా నుండి అన్ని చదువు..:)

@హరే కృష్ణ - hmmmm

@sasi గారు - అవును ...నా కుంచె నుండే వచ్చింది..:)
Thankyou అండి..:)

@ శివ గారు - చాల థాంక్స్ అండి..:)

ఇందు said...

నైస్ పోస్ట్ కిరణ్! అలా ఆలోచించగలిగితే మనలో చాల పరిపక్వత వస్తుందేమో! ఎప్పుడూ మన ఆనందంలోనొ,దుఖంలోనో మనం ఉండకుండా ఇలా లోకాని,దాని తీరుతెన్నుల్ని...గమనిస్తుంటే బోలెడు జీవితసత్యాలు తెలుస్తాయ్! :)

kiran said...

ఇందు - Thank youu :))

Pranav Ainavolu said...

Nice one... :)

HarshaBharatiya said...

nice one...

అనన్య చురకలు !

మా పాపా పేరు అనన్య  ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను  దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...