16 August 2017

ఫిదా కి ఫిదా

శేఖర్  కమ్ముల గారు బాగున్నారా??
మీకే ??  బానే  ఉంటారు !! ..
మా పరిస్థితే  ఏమి బాలేదు..
ఏం చెప్పమంటారు .??
మాది ఒక  సాఫ్ట్వేర్  జంట .. చి ఛి .. ఏమన్నా ఇంట్రడక్షన్ ఆ..
ఆన్ని వైపుల నుండి  వచ్ఛే  స్ట్రెస్ తట్టుకోలేక  మా మిడిల్ క్లాస్ ఫామిలీస్ సినిమాలకి  వెళ్తూ  ఉంటాం ..మర్చిపొతూ  ఉంటాం ..
కానీ  దీన్ని అలా  మర్చిపోలేక  పొతున్నా...
సర్ .. ఫామిలీ ఫామిలీ సినిమా కి వెళ్లాం ..పిల్ల  జల్ల..అత్త ..మామ
భానుమతి సింగల్ పీస్ అని అరుస్తున్నప్పుడు ..నేను  ఈల వేద్దాం అంటే .. ప క్కన అత్త గారు ఫీల్ అవుతారు అని నా  ఫీలింగ్స్ ని కంట్రోల్ చేస్కున్నాను ..
ఆక్కకి పెళ్లవుతోందంటే ..వాళ్ళ నాన్న  అడిగే మాటలకి ఏడుపొస్తుంటే ..నా కూతురు సుసు అని ఏడుస్తుంటే ..దానితో పాటు నేనూ ఫ్లో లో ఏడ్చేశా ..ఆన్ని ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేం కదా ..
ఇవన్నీ ఓకే సర్ .. 
ఆ ఫీలింగ్స్ ఏంది??
మాలా అరేంజ్డ్ మ్యారేజ్ చేస్కున్న వాళ్ళ గురించి ఆలొచించరా
ఏం ఫీలింగ్స్ ఫీల్ అవ్వకుండా  చేసేసుకున్నారు అని వెక్కిరిస్తున్నరా ??
సర్ ,
పొద్దున్న లేస్తే  మేము ఎన్ని ఫీలింగ్స్ ఫీల్ అవ్వాలో తెలుసా ?

పనమ్మాయికి జ్వరం వస్తే నేను అంట్లు తోముకోడానికి ఫీల్ కావాలి...
మా పిల్ల యూనిఫామ్ మాపుకొస్తే ఫీల్ కావాలి...
దోశ  కాలక పోతే ఫీల్ కావాలి...

ఇన్ని ఫీలింగ్స్ మధ్య  లో  మీరు చెప్పే ఫీలింగ్స్ ని ఫీల్ అవ్వడానికి టైం ఎక్కడుంది

సరే లవ్ రీస్టార్ట్ చేద్దామని .. సినిమా నుండి వచ్చాక  నేను ఆయన్ని వరుణ్ అని ..నన్ను భానుమతి అని ఫిక్ష్ అయ్యాము

ఇద్దరం కూర్చుని మాట్లాడుకుంటున్నాం
సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు వాడు డ్యూ డేట్ గుర్తు చేయడానికి  ఫోన్ చేసాడు.. మా అయన వరుణ్ కాదు కదా మనిషి లా కూడా లేరు ..!!
నన్ను భానుమతి అనుకుని ..పలకరిద్దామని వచ్చారు ...మూలనున్న బట్టలు ..ఆకాశం లో  ఉన్న మబ్బులు మ్యాచ్ అవ్వక ఇర్రిటేషన్ లొ ఉన్న నేను కస్సుమని కసిరాను

అంతే లవ్ మూడ్ కాస్త వార్ మోడ్ లోకి వెళ్ళింది ..!
ప్లీజ్ ప్లీజ్ ..భానుమతి ని వరుణ్ ని పెట్టి పెళ్ళయాక ఎలా ఉంటుందో ఒక మినీ మూవీ తీయండి
అప్పుడు నా లాంటి   ఆంటీ లకు తృప్తి గా ఉంటుంది
అంటే పెళ్ళైన కొత్తల్లో కాదు..ఒక అయిదు ఆరు ఏళ్ళు అయ్యాక ..భానుమతి ఒక పిల్ల తల్లి అయ్యి..వరుణ్ కుటుంబ బరువు బాధ్యతలు మోస్తూ ..అలా అన్నమాట
లేకపోతే జీవితం లో ఏదో మిస్ అయిపోతున్నాం అన్న ఫీలింగ్ ఉండిపోతుంది...

ఆసల్ నాకు తెల్వక అడుగుతాను ..ఇన్ని ఫీలింగ్స్ అర్థం చేస్కునే మీరు..ప్రతి అమ్మాయి .లోను ఒక హిడెన్ భానుమతి ఉంటుంది ..ఎంతో మంది మర్చిపోయిన ఫీలింగ్స్ మల్లి గుర్తు చేసుకుంటారు అన్న  ఆలోచన రాలేదా? ఇది మానిపోయిన గాయాన్ని రేపటం కాదా?

అప్పటి అనంద్..ఇప్పటి వరుణ్ ని తల్చుకుంటూ ..రెక్కల గుర్రం కోసం ఎంత మంది ఆడపిల్లలు లు ఎదురు చేస్తున్నారో తెల్సా..ఏమి చేయలేక అనంద్ ని తల్చుకుంటూ కప్పుల కప్పుల కాఫీ లు తాగేస్తున్నారు ..కొంత మంది చీరలు కట్టుకుని సెల్ఫీ లు దిగేసి ..రూప లా ..సీత లా ..భానుమతి లా ఫీల్ అయిపోతున్నారు..
 
గోదావరి సినిమా చూసి  రాముడి కోసం ఎదురు చుసిన లక్షల మంది లొ ఒక దాన్ని నేను

లీడర్ సినిమా చూసొచ్చి హాస్టల్ రూం  లో తలుపులు వేసుకుని   ..వందేమాతరం పాడి ..జనగణమణ చదివేసుకుని ..నా  దగ్గరున్న watercolors తో ఇండియా ని గీసి నెను సైతం .అనుకున్న దాన్ని నేను

హ్యాపీ డేస్ చూస్తూ ఫ్రెండ్స్ అందరం థియేటర్ లో హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ అని కోరస్ పాడుతూ ..కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుంటే ..మా పక్కన అంకుల్స్ మమ్మల్ని చూసి కుళ్ళుకుంటున్న చూపులు అప్పుడు అర్థం కాలేదు..ఇప్పడు భానుమతి ని వరుణ్ ని చూస్తుంటే అర్థం అవుతోంది వాళ్ళ బాధ .. దీన్నే సర్.. కర్మ గోస్ అరౌండ్ ..comes అరౌండ్ అంటారు

అలాంటి   వ్యక్తిత్వాలు ఎక్కడుంటాయి సర్.. ..ఆనంద్..రామ్ ..వరుణ్ ..సీత ..రూప ..భానుమతి ? మీరేమైనా వెకేషన్  కి చంద్రమండలం మీద కి వెళ్తూ ఉంటారా??

మా లా EMI లను ..prodcution issues లను ఫామిలీ డ్రామాస్ ని సీరియస్ గా తీసుకునే మమ్మల్ని మళ్ళీ లవ్ లో ముంచి తేల్చేసి ..ఇప్పుడు అలా ఉన్నామో లేదో తెలియక తికమక ఫీలింగ్స్ తో మిగిలిపోయాం

అసలు పెళ్ళికి నేను పెట్టిన ఒక కండిషన్ శేఖర్ కమ్ముల గారి మూవీస్ కి తీసుకెళ్లమని తెలుసా..
మీకు నేను అంత ఇంపార్టెన్స్ ఇస్తే మీరు నన్ను ఇంత డిస్టర్బ్ చేస్తారా?

దీనికి  శిక్ష గా మీరు నేను చెప్పిన మినీ మూవీ ని తీస్తే నా ఇగో కాస్త చల్లారుతుంది ... ఎనీ వేస్ ..ఐ హేట్ యూ శేఖర్ కమ్ముల గారు..
బట్ ఐ లవ్ ఆనంద్..ఐ లవ్ హ్యాపీ డేస్..ఐ లవ్ గోదావరి ..ఐ లవ్ లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ ...ఐ జస్ట్ లవ్ ఫిదా.. బట్ ఐ హేట్ యు :D 

 

2 comments:

Pranav Ainavolu said...

సూపర్... అదిరింది! చాలా రోజుల తరువాత బ్లాగు చదివాను :) ఏందీ... మూలకున్న బట్టలకు ఆకాశంల మబ్బులకు matching కుదరలేదా?! ఎక్కడినుండి తెస్తారండీ ఇలాంటి ఉపమాలంకారాలు :D

అన్యగామి said...

చాల బావుంది అని వదిలేయచ్చు. అయితే ఎందుకో చెబితే రచయిత ఆనందిస్తారని ఈ వివరణ. సినిమావాళ్లు ఏవస్తువు అమ్మితే సినిమాలకి ప్రేక్షకులొస్తారో అవే అమ్ముతారు. శేఖర్ కమ్ముల ఈపద్ధతికి అతీతం కాదు. ఇవన్నీ మీకు తెలుసు. నాలాంటి మధ్యవయస్కులకి, మీలాంటి వారికి పెళ్లి అయినా తరువాతా కథ ఏ దర్శకుడైన చూపిస్తే బావుంటుందనిపిస్తుంది కానీ వాళ్ళు ఆ పని చెయ్యరు. అమ్ముడవ్వదు కదా? మీ ఆలోచన ఆ మార్గంలో సరదాగా వెళ్ళటం బావుంది.

అనన్య చురకలు !

మా పాపా పేరు అనన్య  ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను  దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...