నేను మొదటి రోజు..సినిమా కి వెళ్తున్నాన్న విషయం పేపర్ లో వేయించాలనిపించింది..నాకే ఇది కాస్త ఎక్కువైంది అనిపించి నా స్నేహితులిద్దరికి ఫోన్ చేసి చెప్పా..అందులో ఒకరు..చీ నా బతుకు..ఏ సినిమా చూడని నువ్వు కూడా సినిమా కి పోతున్నవ్..నేనేమో ఇక్కడ ముఖ్యమైన పనిలో ఇరుక్కుపోయా అని ఏడిసాడు..:D ..ఇంకొక అబ్బాయేమో...మొదటి రోజు నీకు షో అవసరమా మాకే టికెట్లు దొరకట్లేదు అన్నాడు..నాకు దొరికాయి లే నేను వెళ్తున్నా అని అటు నుండి ఏం చెప్తున్నాడో కూడా వినకుండా ఫోన్ కట్ చేసి విజయ గర్వం తో హాల్ లో అడుగు పెట్టా..:)
సినిమా మొదలయ్యింది......
మొదలవుతూనే కిరికెట్టు ...చిన్న హీరో బుల్లి హీరోయిన్ కిరికెట్టు ఆడుకుంటూ ...బుల్లి హీరో అప్పట్లో హీరోయిన్ విలువ తెలియక గొడవ పడ్తుంటే ....వాళ్ల నాన్న నాజర్ నచ్చ చెప్తాడు ...ఎప్పుడు నేను, నా లోకం ..నా గెలుపు అనుకోకుండా ..పక్కనోడి కోసం కూడా ఆలోచించు అని ...అప్పట్లోనే వాడికి వాళ్ల నాన్న మాటలు నచ్చవ్....నేను నాకు నచ్చిందే చేస్తా ..ఎవరి దగ్గర adjust అవ్వను అని గట్టిగా అరచి చెప్పేస్తాడు..
నాకు పై సీన్ ఏ నచ్చేసింది ....first impression is best impression అన్నట్లు సినిమా మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడి పోయింది ...
బుల్లి హీరో కి కాళ్ళు పొడుగ్గా,చేతులు పొడుగ్గా ముక్కు,కళ్ళు,మూతి మొహానికి సరిపోయెంతగా ...మొత్తానికి మొహం అందంగా... ఆరడగుల అందగాడిలా ..ఇలా ఇన్ని మార్పులు వచ్చినా..ఆలోచనల్లో మాత్రం మార్పు ఉండదు..కానీ చివరికి డార్లింగ్ పక్కనోడి కోసం సర్దుకు పోవడం ...అలవాటు చేసుకుని ...అందులో ఉన్న ఆనందాన్ని అర్థం చేస్కుంటాడు ...!!..ఇలా అర్థం చేస్కొడానికి ఇద్దరు హీరోయిన్లను పెట్టి , లచ్చలు లచ్చలు ఖర్చుపెట్టి సినిమా తీసి హీరో కి అర్థమయ్యేలా చేస్తాడు మన డైరెక్టర్..:)
ఇంతకి సినిమా మొత్తం చూసాక కొన్ని conclusions కి రావచ్చు ...ఎడ్డం అంటే ఎడ్డం అంటే ఎక్కడ మజా ఉండదు ....మాటల్లో కానీ ,ఆటల్లో కానీ ,జీవితం లో కానీ ..!!.ఎడ్డం అంటే తెడ్డం అంటేనే జీవితం లో కిక్ ఉంటుంది ...దేవుడు అందుకే అనుకుంటా ఎప్పుడూ అలాగే కలుపుతాడు ...నా స్నేహితుల నుండి చాలా విన్నాను ...అందులో నుండి ఒకటి ..కిరణ్ నాకు black ఇష్టం ...మా ఆయనకి అది తప్ప అన్ని ఇష్టం ...చివరికి గాడి గా కనిపించే పసుపు రంగు తో సహా అనింది ..:D..hmmn...గాడ్ ఇస్ గ్రేట్...:)
నాకు డవిలోగులు అస్సలు గుర్తు ఉండవు ..కానీ ఇదెందుకో అలా గుర్తుండి పోయింది ..ఎంత అంటే చెప్పలేను ...ఎలా అంటే చూపించలేను ...కానీ గుండె కొట్టుకునేంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని....:P..మీరలా అనుమానంగా లుక్కేయ్యకండి ..నాకు నచ్చిందని చెప్పా అంతే..:)..ఇంకో సీన్ కాజల్ ప్రభాస్ కి mms పంపిస్తుంది ..birthday wishes ..ఆ సీన్ నాకు నచ్చింది ....ఎందుకో కాజల్ క్యారెక్టర్ తెగ తెగ నచ్చేసింది....అమ్మాయిలు ..తన ప్రతి డ్రెస్ అదిరిపోయింది లే ...:)
ఒక మంచి సినిమా చూసాం అనే ఫీలింగ్ వస్తుంది మొత్తం అయ్యాక ...ఇలాంటి ఫీలింగ్ లో ఉండగానే ..నాకు ఒక చప్పుడు వినిపించింది ...ఏంటో తెల్సా ...భోరుమని వర్షం ...ధియేటర్ బయటకి రాంగానే పక్కనే ఉన్న bus stand కి నడిస్తేనే సగం తడిచి పోయాం...ఇంకో సగం బస్సెక్కేటప్పుడు తడిచిపోయాం ..బస్సు లో ఉన్నప్పుడు ..అటు ఇటు ఫుట్ పాత్ మీదకి నీళ్ళు ఎగురుతున్నాయి ..అంతలా నీళ్ళతో నిండి పోయింది.అవి ఎగురుతుంటే... మా స్వాతి దాన్ని చూపిస్తూ కిరణ్ అటు చూడు వావ్ అంది ...ఆహా ...అనుకున్నా ....బస్సు దిగాం ..ఇక రూం కి నడుస్తుంటే ....ఒక సుమో వచ్చి ఇందాక మేమున్న బస్సు నీళ్ళు ఎగిరించినట్లు ...ఎగిరించి మా మీద పడేలా చేసి పోయింది ...స్వాతి.. ఏది ఇప్పుడు వావ్ అను అన్నాను ..వా ..వా ..అనింది ...ఏమిటో అప్పుడు అలా....ఇప్పుడు ఇలా..
ఇంతలోనే పుటుక్కు మని నా చెప్పు తెగిపోయింది ....my shoe is gone...my shoe is gone (with tune) తో పాడుకుంటుంటే ..ఏంటి కిరణ్ బాధ లేదా ..అనింది ...హహ్హహ ..లేదు ..దేనితో పెద్ద బంధం పెట్టుకోకూడదు ...అందుకే నేను నా చెప్పు తో పెట్టుకోలేదు అన్నాను ..ఆ పిల్ల అదోల చూసింది ..భయమేసింది ..ఎక్కడైనా manhole లో తోసేస్తుందేమో అని ...అందుకే వెంటనే మార్చేసి ...ఆహా అది కాదు ..చాలా రోజుల నుండి వాడుతున్నా..ఇప్పుడు వాడాలని లేదు ..ఆలా అని పారేయబుద్ధి కాలేదు ..ఈ రోజు వీటికి పోయే కాలం వచ్చింది అన్నాను ...ఒహ్హో ..అని ఊర్కుంది ..హమ్మయ్య ...గండం గట్టేక్కానని ...ఊపిరి పీల్చుకుంటూ మెట్లెక్కి రూం కి చేరాను ..:)...కానీ మీరో విషయం గమనించాలి..మీరు వాడే వస్తువుల్లో ఏదైనా పారేయబుద్ధి కాక ఇంకా మీ దగ్గరే ఉంటే అలా పెద్ద వాన వచ్చినప్పుడు ఓ సారి తీసుకెళ్ళండి..ఓ పనయిపోతుంది..:):P
23 April 2011
వాన లో Mr.Perfect....
3 April 2011
నేనే గెలిపించా
నేనే గెలిపించా..నేనే గెలిపించా..
ఎవరినమ్మా కిరణు ??
భారత దేశం ప్రపంచ గిన్నె గెలిచింది కదా ...అది నా వల్లే ...
ఆహా ...ఎలాగా ..??
గోబీమంచూరియా తింటూ ...
ఒహ్హూ ....
మరి ఆడినోళ్ళు?? ...
వాళ్ళేం చేసారు ..ఊర్కె బాట్ తో బంతి ని కొట్టారు అంతే కదా...
అద్దో ...అదే మీ గీత.. అంతకు మించి దాటి నన్ను కొట్టటానికి రాకూడదు .. :P
కిరికెట్ అంటేనే చిరాకు అనే నేను మరి కిరికెట్ చూసి గెలిపించానంటే గొప్పే కదా మరి .. :).నా చిన్నప్పుడు బానే ఆడాను.ప్లాస్టిక్ బంతి ప్లాస్టిక్ బాట్ పట్టుకుని ..అన్నీ నాలుగులు లు ఆరు లే తెల్సా ??
కాస్త అందరం పెద్దయ్యాక ...కాస్త బరువు తక్కువ ఉండే చెక్క బాటు...ఒక రబ్బరు బంతి ఉండేది...దానితో కూడా నాలుగులు ఆరు లు బానే కొట్టారు ..అవును నేను కొట్టడం మానేసా ఎందుకంటే....బాటు, బంతి పట్టుకుని వెనక వైపు వస్తుంటే అమ్మమ్మ పిలచి అక్కడ తులసి కోట ఉంది దాన్ని తప్ప దేన్నైనా కొట్టుకోండి అంది ...మా అన్నయ్యకి నా ముక్కు కనిపించింది ..ఇక అప్పటి నుండి ...వెనకాల పెరట్లో మా వాళ్ళు ఆడుకుంటుంటే నేను ఒక కటకటాల తలుపు వెనక ఒక కుర్చీ వేస్కుని మరీ కూర్చుని చూసేదాన్ని .. :P
ఆలా కిరికెట్ కు నాకు బంధం కాస్త తెగింది ..తర్వాత కొన్ని రోజులు చూసేదాన్ని ..మా ఇంటిల్లపాది నన్ను మోసం చేస్తూ వచ్చేవాళ్ళు ..అవును...అప్పట్లో ఎప్పుడు చూసిన కిరికేట్టే చూసే వాళ్ళు ..నాకు లైవ్ మ్యాచ్ అని ఎలా తెలుసుకోవాలో తెలిసేది కాదు..:P..అందుకని ఇప్పుడు ఆడుతున్నారు..పాత మ్యాచ్ కాదు అని ప్రతి మ్యాచ్ కి అబద్ధం చెప్పే వాళ్ళు. అప్పుడు చిరాకేసి....వీళ్ళు ఆడే బాళ్ళు అన్ని మురిక్కాలువలో పడిపోవాలని ,స్టేడియం లోకి వందల కొద్ది కుక్కలు వచ్చేయ్యాలని అనుకునే దాన్ని ..అసలు ఈ రెంటికి లంకె ఏంటి అనే కదా..?? చాలా ఉంది ...మేము కిరికెట్టు ఆడేటప్పుడు బాలు వెళ్లి మురిక్కాలువలో పడ్తే ఇక మళ్ళి వారం,పదిహేను రోజుల వరకు కొనిచ్చే వాళ్ళు కాదు ...ఇంకా పెరట్లోకి కుక్కలు వస్తే కోపం తో బాట్ లు విసిరేసే వాళ్ళు ...అది ఎప్పుడు కుక్క కి తగలకుండా వెళ్లి బండ రాళ్ల మీద పడి ముక్కలైపోయేది ...బాట్ విరిగితే కనీసం రెండు నెలలు పడ్తుంది మళ్ళి బతిమాలి కొనిచ్చుకోడానికి ...ఇప్పుడు అర్థమైందా నా బాధ :p...వాళ్ళవి కూడా ఆలా పోతే వాళ్ళకి ఆడటానికి ఇంకా కొన్ని రోజులు బంతి బాటు ఉండవని నా అపోహ...
ఇలానే అనుకుంటూ కోపంగా ఒక రోజు మా పెద్ద బావ కిరికెట్టు పిచ్చోడి లాగా నోరు తెరచుకుని చూస్తుంటే ..బావ ఆ స్టేడియం పక్కన మురిక్కాలువ లేదా అని అడిగా...పాపం వాడు వెళ్లి మా అత్తయ్య వంటిట్లో కూరలు తరుగుతుంటే ..అమ్మ ఈ కిరణు ఏ స్కూల్ ఏ..ఎందుకే నన్ను తినేస్తోంది ..పిలిచి కాస్త పనులు చెప్పవే అన్నాడు ..ఇది విని చాలా తెలివి గా.. మా అత్తయ్య పిలిచే లోపే హాలిడేయ్స్ హోం వర్క్ మొదలెట్టేస ..
ఇలా నర నరల్లోను కిరికెట్టు మీద నాకు అసహ్యం పెరిగిపోయింది ...నాకు ప్రపంచం లో నచ్చని ఆట కిరికెట్టు అని తీర్మానించుకున్న .. :)...
ఇలా గట్టిగా ఫిక్స్ అయిపోయి అంతా మరిచిపోయిన వేళ వరల్డ్ కప్ మొదలైంది ..నా అదృష్టం ఎక్కువయి మా రూం లో కిరికెట్టు వీరాభిమానులు చేరారు ...నేను మాములుగా చూడను ..ఎంత బతిమిలాడిన..అలాంటిది ..ఆస్ట్రేలియా తో మ్యాచ్ జరుగుతున్న రోజున ఆఫీసు లో పెద్ద ప్రొజెక్టర్ పెట్టేసారు ...కాఫీ తాగుదాం అని వెళ్తే గోల గోల ...ఆ రోజుకి పని అయిపోవడం తో మా వాళ్ళు అక్కడే కూర్చున్నారు ..ఇక టీం లేకుండా నేనొక్క దాన్నే పని చేస్తే పాపం వాళ్ల అప్ప్రయ్సల్ కి దెబ్బ అని వాళ్ల గురించి అలోచించి ..వాళ్ళతో పాటే ఉంటే ...మా టీం లో ఒక ఆయన కిరణు ఇటు రా..అన్నారు ..వెళ్లి పక్కన కుర్చోంగానే ....ఇద్దో నేను పని ఇవ్వగానే చేయను అరుస్తావే దానికి రెండింతలు ఇప్పుడు ఈ ఆస్ట్రేలియా వాళ్ల వికెట్ పడితే అరవాలి అన్నారు ...మీరు అన్నాను ..?హా మేము అరుస్తాం అన్నారు .. :)..సర్లే ఎప్పుడో ఖలేజ కి అరిచాము మళ్ళి మగేష్ బాబు సినిమా రావాలంటే ఒక మూడు ఏళ్ళు పడ్తుంది ఇంతలో గొంతు పోతే వచ్చేస్తుంది లే అని గట్టి గట్టిగా అరిచేసాం ..ఆ అరవటం తో నాలో నిద్ర పోతున్న కిరికెట్టు అభిమాని లేచిందనుకుంట ...ఇండియా బాటు పట్టుకునే లోపు చేరాలని ...జై పి టి ఉష అన్నాను ..రూం లో ఉన్నాను ...ఇక ఇండియా బాటింగు ..బాబోయ్ బోలెడు రకాల సెంటిమెంట్లు జనాలకి ..ఒక పిల్ల బైటికి వస్తే వికెట్ పడుతుంది అని ..ఆ పిల్ల ని గది లో పెట్టి గొళ్ళెం పెట్టారు ...నేను టీవీ ముందు నుండి కదిలితే వికెట్ పద్తోందని ...అన్ని టీవీ దగ్గరికే అందుతున్నాయి ..ఇదేదో బాగుందని ..నేను కూడా అన్ని పనులు 10.30 లోపల చేయించేస్కున్న ..ఇవన్నీ పక్కన పెడ్తే ...ఆశ్చర్యంగా నాకు కంగారు ..గెలుస్తుందో లేదో అని ..ఇదెక్కడ కొత్త గోల రా బాబు అనుకున్నా ..గోర్లు కోరికే అలవాటు లేదు ..అలవాటు ఉన్నా గోర్లు లేవు ..నేను గుడ్ గాల్ ని కదా .. :P..మా రూం లో వాళ్ల మొహాలు మరీ టెన్షన్ గాను ఉన్నాయి ...చ చ ...అని చూడటం మొదలెట్టిన నన్ను నేను తిట్టుకుంటూ ఆ మ్యాచ్ ని గెలిపించి పడుకున్నా ...
మళ్ళి పాకిస్థాన్ తో మ్యాచ్ ...అప్పటికి రూం లో లేను కాబట్టి కాస్త బతికి బైట పడ్డట్లే ..లేక పోతే మా వాళ్ల మొహలకి నా కంగారు కి నా లోని బొమికేలే కాక నరాలు కూడా బైట పడిపోయేవి ..అప్పుడప్పుడు స్కోరు చూసి ఇండియా ని గెలిపించి ఊపిరి పీల్చుకున్నా ..ఇక నిన్న అటు చూడాలని ..ఇటు ఏమవ్తుందో అని ...200 దాటేంత వరకు బానే ఉన్నా ..దాటాక చెమటలు ..అబ్బ ...అబ్బ ..అంటూ ..మా అమ్మ రిమోట్ లాక్కొని లోపలికి వెళ్లి సేకండుకోసారి అరుచుకో అబ్బ ..అమ్మ అని అనింది .. :P..సరే అని ఏవో కొన్ని పుస్తకాలు తెరచి చదువుతుంటే కూడా ఏదో మూల కంగారు ..ఇలా కాదు ....కర్మ మాత్రమే నువ్వు చేయవలెను ...ఫలితము ఆశించ రాదు అని నేను నాకు చెప్పుకుని ...నా ముందు ఆడుతున్న ధోని కి ముప్పై సార్లు చెప్పాను ...ధోని ఒసేయి నోర్ముయ్ అన్నాడు ...చివరికి లాస్ట్ లో ఒక సిక్స్ కొట్టి అద్బుతమైన ఎక్ష్ప్రెషన్ పెట్టాడు ..ఇక్కడ నేను కూడా అలాంటిదే పెట్టాను .. :D...హమయ్య అని టీవీ ఆఫ్ చేస్తున్నంతలో నా చిన్న మెదడు పెద్దగా పని చేయడం మొదలు పెట్టింది ..ఫలితం దక్కే టయానికి టీవీ కట్టేస్తే ఎలాగా అని చూస్తున్నా ...నాకు కిరికేట్టంటే చిరాకయితే అది జరుగుతుండగా వచ్చే కామెంటరీ అన్నా ,ఐపోయాక మెడల్స్ ఇచ్చే సమయం అన్నా పరమ చిరాకు ...నాకు ఏమి అర్థం అయ్యి చచ్చేది కాదు ..అందరు కూడా అర్థమయినట్లు నటిస్తున్నారు అనుకునేదాన్ని :P
అదేంటో విడ్డురంగా నిన్న అంతా అర్థమయిపోయింది .. :P...ఏమి లేదు ...ఇలా మొదలెడతారు...వెల్ ...హౌ ఆర్ యు ఫీలింగ్ ...?అని ...ఆటగాడు ఇలా...hmnnn..రియల్లీ ప్రేషియౌస్ మొమెంట్స్ ...వేరి హ్యాపీ..ప్రౌద్ టు బి ఇన్ ది టీం ..ఇలా ..ఇంకొకరు ...వస్తారు అదే ప్రశ్న ....మళ్ళి ..వెల్ల్ ..హ్మ్న్నన్ ...అండ్ అని 2 ,3 చోట్ల ఉపయోగించి థాంక్స్ చెప్పి వెళ్ళిపోతారు .. :) :P(కాక పోతే కాస్త సాగ దీయాలి )..ఇంత చిన్న ది ఇన్ని రోజులు ఎందుకర్ధం కాలేదా అనుకున్నాను .. :P...ఆ నిమిషం లో చాల అర్థమైన్దనిపించి ...దీనికంతా మా నాన్న చెప్ప్పించిన చదువని గుర్తొచ్చి ఆనంద బాష్పాలు కారాయి ...వాటితో మొహం మా నాన్న వైపుకి తిప్పి నాన్న గారు అన్నాను ...అంత సేపు చప్పట్లు , ఈలలు వేసిన నాన్న కూడా దీనంగా మొహం పెట్టి ఇలాంటివే భారత దేశం మొత్తం గర్వించ దగ్గ క్షణాలు అన్నారు ..నాకు అప్పుడు స్ప్రుహోచ్చింది ..అంత కంటే త్వరగా మా అమ్మ లో రియాక్షన్ వచ్చి రిమోట్ తీసి టీవీ ఆఫ్ చేసి ..ఇద్దో ఇప్పటి వరకు చూపించిన మీ ప్రేమ చాలు.. మీకు కావాలంటే వెళ్లి బైట వాళ్ళతో పాటు టపాకాయలు కాల్చుకోండి ..నేను పొద్దున్నే లేవాలి అంది ..గప్ చుప్ గా వచ్చి నిద్రపోయాము ..
ఒరు నిమిషం ....అందరు ఉగాది పచ్చడి బాగా చేస్కొని తినేయండి ...అందులో ఎంత వేప పూత వేసిన మీ నోటికి తీయగానే తగలాలి ...మీ స్నేహితురాలిని కదా మరి ..అలాగే మీ మంచే కోరుకుంట ..
అనన్య చురకలు !
మా పాపా పేరు అనన్య ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...
-
హ..హా....హా....చ్... శుభమా అని కొత్త సంవత్సరం మొదలవుతూ ఉంటే ఆ తుమ్ములేంటి...?? ఆహా ఒక్క సారికే...నాకు రోజూ తుమ్మోదయమే అవుతోంది మరి... కర్ర...
-
తెల్లవారు జామున ఏడుకి కి అలారం మోగుతోంది ..పొద్దున్నే తొమ్మిదింటికల్లా ఆఫీసు కి వెళ్ళాలని ఎవడు కనిపెట్టాడో కానీ అని అనుకుంటూ నిద్రలేచి గ...
-
I love blogging as i mentioned in this post ....and promised that will give you all the blogs which will be helpful,informative and enterta...