13 January 2011

సంక్రాంతి..వచ్చింది తుమ్మెద... :)

పండగ వాతావరణం..చిన్నపుడు అయితే బాగా తెలిసేది...

అసలు..ఇప్పుడు..ఏంటో production issues...ఏవి లేక పోతేనే...అసలు సిసలైన పండగ.. :D
ఏదో కాస్త అవన్నీ మర్చిపోదమనే కదా బ్లాగుల ముందు కూర్చుంది అని మీరు అనుకుంటున్నారు..i know..i know.. :)

సంక్రాంతి అంటే బామ్మ ఇల్లు...దసరా అంటే అమ్మమ్మ ఇల్లు బాగా అలవాటు.. :)...
ఏదేమైనా సంక్రాంతి కి బామ్మ ఇంట్లో ఉండాల్సిందే..లేక పోతే నేను అరచి గోల చేసే దాన్ని..ఎందుకంటే అన్నికుటుంబాలు అక్కడ కలుస్తాం..కొత్త డ్రెస్ లు వేసుకోవచ్చు...ఒక్కర్తే ఆడ పిల్ల అని..పెద్దనాన్న వాళ్ళు,అత్తయ్య వాళ్ళు కూడా డ్రెస్ లు కొనిపెట్టేసే వాళ్ళు.. :P :) ..ఇక మా తాతయ్యగారు..దగ్గర కూర్చో పెట్టుకుని అయన కథలు..నాకు తెల్సిన పద్యాలూ చెప్పించుకుని...మురిసిపోయేవాళ్ళు.. :)

మీరు అలాంటివి అడగకండి...నాకు అసలే short term memory loss.. :D

ఇవన్ని ఒక ఎత్తైతే...ముగ్గులు..బానే నేర్చుకునే దాన్ని...ఏది చూసిన ఒక పుస్తకం లో వేసుకునే దాన్ని..మా అమ్మకు నాకే కాస్త వచ్చు..ఇంకా ఎవరికీ రాదు..అందుకే...మేమోస్తున్నాము అని అంటేనే...రంగులు కొనేది మా పెద్దమ్మ...ముగ్గు వేస్తూ ..అన్ని రంగులు ఐపోయాక...దానికి దిష్టి తీసి..కాలనీ లో ఎవరు ఎలా వేసారో చూడడానికి ఒక ట్రిప్ వెళ్ళే దాన్ని..మా సైన్యాన్ని వేసుకొని...వాళ్ళే కదా మరి రక్షకభటులు.. నాకు..
రాత్రి పది అయ్యిందే ఇప్పుడెక్కడికి అంటే...లేదు బామ్మ..ఇక్కడే ఆ కొట్టు ఉంది చూసావు..అక్కడి వరకు మాత్రమే..అని పరుగు....ఆ దారిలో...అక్క నువ్వేసిన ముగ్గే కెవ్వ్ అక్క...కేక అక్క..అని పోగిడేవాళ్ళు..ఒహ్హూ..సూపరు...అనుకునే దాన్ని..ఇప్పుడు నా ముగ్గు తప్ప...అందరి ముగ్గులు బాగుంటాయి అంటారు వెధవలు.. :(....వాళ్ళు అలాగే చిన్న గ ఉండి పోయి...నేనొక్క దాన్నే పెద్దదాన్నైతే బాగుండేది.. :) :P

ఐనా ముగ్గులు అసలు వేయట్లేదు..ఇప్పుడు..మా అమ్మ ఎంత అడిగిన వేయను..ఆ paintings వేస్కునే బదులు...నాకు సాయం చేయచ్చు కదా అంటే..చలి లో ఎవరు వేస్తారమ్మ పో అని అంటూ ఉంటా..ఇంతలో వచ్చేసాడు ...ఎవరో చెప్పుకోండి...ఆ కర్రెస్ట్ గ మా తమ్ముడే..అబ్బో ..వచ్చిందండి...రాబోయే కాలానికి కాబోయే పికాస్సో..అని నా ఫీలింగ్స్ ని..నా అపురూపమైన చిత్ర కళల్ని insult చేయడానికి..కొట్టుకోకండి..నేనే వేస్కుంట..అని అమ్మ అక్కడి నుండి బైటకు వెళ్ళిపోతుంది..నాకు తెల్సు ఏదో ఒక రోజు నా paintings అన్ని...భోగి మంటల్లోకే ..మా అమ్మకు మండిందంటే.. :P

భోగి మంటలు అంటే గుర్తొచ్చింది ..పల్లెటూరు ఏమి కాదు...city నే...అందుకే..ప్లేస్ ఉండేది కాదు...కానీ ఇంటి ముందర ఒక ఖాలీ స్థలం ఉండేది..అక్కడ...వేసే వాళ్ళు మంటలు..ఇది నేను ఏ రోజు ప్రత్యక్షంగా చూడలేదు..!!మనం సూర్యుడికంటే ముందు లేచి ఆయన్ని insult చేయాలని అనిపించేది కాదు కాబట్టి... :) :p


బొమ్మల కొలువు మాత్రం పెట్టేదాన్ని.....బోలుడు బొమ్మలు ఉండేవి....ఒక సారి మా బామ్మ అది ఇక్కడ పెట్టుకోనివ్వు ర..ఎప్పుడు మీ ఊర్లొనె అంటే...పాపం మా నాన్న ఎర్ర బుస్స్ లలో..ఆ అత్తపెట్టల్ని అంత మోసి...భుజాలు నొప్పెక్కి...వెళ్ళంగానే నీకు ఇలాంటి కోరికలు ఉంటె నువ్వే అక్కడికి ర..నన్ను వదిలేయ్..అని indirect గ వార్నింగ్ ఇచ్చారు...నేనేమో హ్యాపీ గ పట్టు పరికిణి వేస్కొని....అందర్నీ పేరంటం కి పిలిచి...వచ్చి బొమ్మల పక్క బుట్ట బొమ్మ లాగా నుంచొని ఫోటో లు దిగే దాన్ని.. :)..ఇదంతా సాయంత్రం....


పొద్దున్న కూడా బిజీ గ ఉండాలి కదా...సో మా తమ్ముళ్ళు
..బావలు...పతంగ్ లు ఎగిరేసే వాళ్ళు..వాళ్ళందరికీ...టైం కి గాలి పటాలు..గం....అదే అవి చిరిగిపోతే అతికించుకుంటారు..దానికి..పాత న్యూస్ పేపర్ లు సకాలం లో అందివ్వడం...వెనకాల ఉండి మాంజా పట్టుకోడం..నా డ్యూటీ లు...దీనికి పైకి కిందకి ఒక 100 సార్లు తిప్పిస్తారు... :(....సాయంత్రం వెళ్లి..అమ్మ కాళ్ళు నొప్పులు అంటే..నీకు కావాల్సిందే..అని అదే కాళ్ళ మీద ఒకటి వేసేది అమ్మ.. :(..ఆ మగ వెధవల్తో పాటు నువ్వేంటే...??..కూర్చుని టీవీ చూడు అంటారు...పోనీ సినిమాలు ఎమన్నా పెడతార అంటే..లేదు....న్యూస్... నాకొద్దు...అని మళ్ళి పైకి వెళ్ళిపోత..

ఆ డాబా మీద నుంచుని చూస్తూ ఉంటె..బోలుడు గాలి పటాలు....నేను కొంచం నేర్చుకున్న..ఎలా ఎగరేయలో..హే కిరణ్ జాగ్రత్త..ఆ మాంజా ని చేత్తో పట్టుకోకు...only ఆ కర్ర ని పట్టుకో అని చెప్తూనే ఉన్నారు మా వాళ్ళు...వాళ్ళు ఏదో గాలిపటాన్ని...ఎటాక్ చేయాలని పోయి..అరుస్తూ...గెంతుతూ ఉంటె..అదే ఊపు లో
మర్చిపోయి...నా చేయి మాంజా మీద పడింది..ఇంతలో వేరే పతంగ్ ని కాట్ చేసే టప్పుడు..వెనక్కి లాగుతూ...గాట్టిగా కాట్ అని అరిచాడు...మా వెధవ...అదే టైం లో నేను కూడా అరిచ...అదే అరుపు... నా చెయ్యి తెగింది...:(....రక్తం కారిపోతోంది...!!

ఒకడు వెనక నుండి వచ్చీ..అన్నాడు కదా...ఈ బక్కి దాన్ని అసిస్టెంట్ ఏంట్రా అంటే ఎవరు వినలేదు..ఇప్పుడు చూడండి..అప్పటికప్పుడు డాబా మీద నా చేతికి ఏమి చుట్టడానికి లేక పోతే...పేపర్ లు తీస్కురంమన్నాడు ఒకడు...ఇంకొకడు...ఆ రోజు ఏం సినిమా వేసాడో..టీవీ లో ..సినిమా పేజి లో చూస్తున్నాడు.. :(..అంత సినిమా పిచ్చి వాడికి..:)..మొత్తానికి కిందికి వెళ్ళిన..ఏమి తెగనట్లు..ఊర్కున్నమ్..లేకపోతే అందరికి పడతాయి..పండగ పూట..

అన్నం ముద్దలు చేసి పిల్లలందరికీ పెట్టేది...మా అత్తయ్య..కిరణ్ రామ్మా చేయి జాపు..అంటే ..నోట్లో పెట్టు అన్నా...ఆఅ మరీ గారం ఎక్కువైందే అంటే..మా సైన్యం అంత..అబ్బ పెట్టు...అత్త...అడుగుతోంది కదా అని నాకు వంత పడే వాళ్ళు.. :)..మరి చెయ్యి చూసారంటే..ఎవరికీ ఇంకో ముద్ద పెట్టించుకునే ఛాన్స్ రాదు...అన్ని గుర్తు తెచ్చుకుంటే నవ్వొస్తుంది.. :)

చాల సరదా రోజులు...ఇప్పుడు కలుద్దాం అన్న..ఒకరు అమెరికా లో..ఒకరు ఢిల్లీ లో..ఇంకొకరు గోవా లో..ఉన్నారు...

ఇన్ని బాగున్నా..నాకు పల్లెటూర్లో సంక్రాంతి బాగా చేస్తారు అని విన్నాను...అక్కడికి వెళ్లి జరుపుకోవాలని ముచ్చట.. :)..ఏవండి..మీ పిలుపులు నాకు వినిపిస్తున్నాయి..వచ్చేయన..?? :)

అమ్మ పండగ వంట చేస్తోంది...ఒక కన్నేసోస్త..ఆ ..సాయం చేయడానికి కాదు..ఏవేవి వండిందో చూడటానికి...మీ batch లో ఉండి..నేను పనులెల చేస్తా..?? :p

అందరికి...సంక్రాంతి శుభాకాంక్షలు.. :)


19 comments:

వేణూశ్రీకాంత్ said...

బాగున్నాయ్ కిరణ్ మీ ఙ్ఞాపకాలు :-) మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

kiran said...

వేణు గారు...బోలుడు థాంకులు.. :)

ఇందు said...

హ్హహ్హహ్హా! కిరణ్ మీరు కేక...

>>మనం సూర్యుడికంటే ముందు లేచి ఆయన్ని ఇన్సుల్త్ చేయాలని అనిపించేది కాదు కాబట్టి.

భలే ఐడియాలొస్తాయే!

>>ఈ బక్కి దాన్ని అసిస్టెంట్ ఏంట్రా అంటే ఎవరు వినలేదు..ఇప్పుడు చూడండి..

హ్హహ్హహా! అందుకే నేను చెప్పినవన్ని పాటించేయండీ...తొందరగా లావైపోతారు :))

>.ఒక కన్నేసోస్త..ఆ ..సాయం చేయడానికి కాదు..ఏవేవి వండిందో చూడటానికి...మీ బత్చ్ లో ఉండి..నేను పనులెల చేస్తా..??

భలే కనిపెట్టారే

టపా బాగుందీ..మీకు సంక్రాంతి శుభాకాంక్షలు :)

kiran said...

ఇందు - హహః..
ఏంటో అండి ..చిన్నప్పటి నుండి స్మార్ట్ థింకింగ్ అలవాటై పోయింది.. :)
ఇక ఆ సన్నం మాట ఎప్పటిదో...ఇప్పుడు ప్రతి రోజు ఇందు ఇందు అన్కుంటూ అన్ని ఫాలో అయిపోతున్న అండి.. :)
టపా నచ్చి నందుకు ఫుల్ హాప్పీస్.. :D

భాను said...

కిరణ్
బాగున్నాయి మీ సంక్రాంతి జ్ఞాపకాలు. చిన్నప్పటి రోజుల్లోకి తీసుకెళ్ళారు, అడాల్లందరూ ముగ్గులు పెడుతుంటే మేం "మగ వెదవలం :) " కదా ఏదో గొబ్బెమ్మలు పెడుతూ వెనకాల తిరిగే వాళ్ళం. గుడ్ పోస్ట్

kiran said...

హహ..భాను గారు..thank you .. :)
గొబ్బెమ్మలు -- ఈ సెక్షన్ మాది కాదు.. :)

హరే కృష్ణ said...

సంక్రాంతి శుభాకాంక్షలు కిరణ్ గారు

మనసు పలికే said...

హహ్హహ్హా.. కిరణ్ చాలా బాగున్నాయి నీ పండగ ముచ్చట్లు. నా చిన్నతనం గుర్తొచ్చింది. ముఖ్యంగా గాలి పటాల విషయంలో:)
Nice post..:))

శివరంజని said...

బాగున్నాయి మీ సంక్రాంతి జ్ఞాపకాలు. కిరణ్ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

kiran said...

థాంక్స్ హరే కృష్ణ.. :) అండ్ శివరంజని గారు.. :)
@అప్పు - అవునా..ఆ గాలి పటాలు....ఎగరెయ్యడానికి కి కూడా పెద్ద యుద్దమే జరిగేది..:) నాకు..
thank you so much ..

Unknown said...

కిరణు కుమ్మావ్ పో :) నువ్వు కూడా పెద్ద కోతివే ..
నేను ఇందులో ఒక్క పని మాత్రమే చేసేదాన్ని ముగ్గేయ్యడం .. గాలిపటాలు ... బొమ్మలకొలువులు మనకి జాంత నై :)
బట్ చాల బాగుంది నీ చిన్నతనం :)

kiran said...

నీ batch కదా కావ్య...
అలాగే ఉంటా మరి నేను ..:)
Thank you ..:)

Krishna said...

panDaga ayipOyaaka mii panDaga Tapaa satikaanammaayi. flaash^byaak sankraanti vishEshaalu/gyaapakaalu saradaagaa baavunnaayi. konni panktulu/padaalu ayitE sooparu.

kiran said...

chala chala thanks krsna garu.. :)
edo mee abhimanam...
ponlendi pandaga roju meeru busy ayyuntaru...:)

కృష్ణప్రియ said...

:)) బాగా రాశారు

Ennela said...

మనం సూర్యుడికంటే ముందు లేచి ఆయన్ని insult చేయాలని అనిపించేది కాదు కాబట్టి... :) ..hahaha..

kiran said...

@కృష్ణప్రియ గారు - thank you అండి.. :)
@ఎన్నెల గారు - అంత మీ ట్రైనింగ్ ఏ .. :P

vamc123 said...

Fentastic Kiran garu..chala baga rasaru...ilanti experiences andariki untaye kani vatini intha baga rayatam...chala bagundi..well done..

kiran said...

chala thanks vamsi garu.. :)...thanks for encouragement too.. :)

అనన్య చురకలు !

మా పాపా పేరు అనన్య  ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను  దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...