21 December 2010

అమ్మమ్మ...ఐ మిస్ యు ...

అమ్మమ్మ..అప్పుడే ఒక సంవత్సరం అయిపోయింది..అమ్మ చెప్పి..అమ్మమ్మకు బాలేదు..అని...

ఆ రోజు నేను నీకు వెంటనే ఫోన్ చేస్తే...తాతయ్య..గొంతు లో నీరసం...

అమ్మమ్మకివ్వండి..అంటే....
పడుకుందమ్మ..లేచిన ఎవరితో మాట్లాడట్లేదు...నీరసంగా ఉంది అంటోంది...

ఏంటి..???అమ్మమ్మకు నీరసమా??..కనీసం మాట్లాడలేనంత...:(..

ఎప్పుడు ఇలా లేదే..

తను అందరి లాగా జలుబు కే ఆరు రోజులు రెస్ట్ తీసుకునే టైపు కాదు..

మనోధైర్యానికి...,ఓర్పుకి ప్రతి రూపం మా అమ్మమ్మ..!!

ఎంతో కంగారు వేసింది....వెంటనే నా గొంతు వణికి..నా ఫ్రండ్ కి ఫోన్ చేస్తే..

ఏం కాదు లే పెద్ద వాళ్ళు కదా..ఇవంతా మాములే..అని తను..

నేనేమో..లేదు..మా అమ్మమ్మ అందరి పెద్ద వాళ్ళలా కాదు...అని చెప్పా..

శరీరం చాల పెద్దది...అంతకన్నా active గ ఉంటుంది తను.....అని ఎక్ష్ప్లైన్ చేస్తూ...క్యాలెండర్ చుస్తే..ఆ రోజు అదృష్టం కొద్ది.. thursday..

ఇక friday రేపు అంటే అదొక ఆనందం..అమ్మమ్మని చూసి రావచ్చు అని...కానీ ఇంకో పక్క దిగులు...ఎలా చుడాల్సోస్తుందో..ఎప్పుడ మంచం మీద చూడలేదే అని..

వెళ్ళాను..అమ్మమ్మను చూశాను....నాన్న కిరణు వచ్చావ....ఎంత సేపైంది..అన్నం పెట్టండే..దీనికి....కంగారు లో రాత్రి అన్నం తినిందో లేదో అంటూ పెద్దమ్మకు చెప్తోంది..

నాకు ఆ మధ్యే ఒక minor surgery జరగడం తో...ఏమ్మా..కాలు ఎలా ఉంది ఇప్పుడు...నొప్పి గ ఉందా...ప్రయాణం వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా..అని అడిగింది...తనకు అంత బాలేక పోయిన..నా గురించి అలా అడగడం తో...అమ్మమ్మ డబల్ నచ్చేసింది ఆ రోజు..!!

తర్వాత చిన్న కునుకు తీసి..కళ్ళు తెరిచి ఎప్పుడు వచ్హావ్ అంది...షాక్ తిన్నాను...ఇందాకే కదా అన్ని అడిగింది అంటూ...

అప్పుడు పిన్ని చెప్పింది..ఇది పరిస్థితి రెండు రోజుల నుండి.....కొన్ని కొన్ని గుర్తుంటాయి..కొన్ని మరచిపోతోంది అని...

మున్దువన్నీ గుర్తుంటున్నాయి..అని...ఒహో..అన్నాను...కాసేపయ్యాక లేచి అమ్మ రాలేదా అంది..అమ్మకు ఇంటికి ఎవరో వచ్చి నాతో రాలేక పోయిందని.. ఒక 5 నిమిషాల కిందే చేప్పాను...

ఐనా నిన్నే కదా వెళ్ళింది...వాళ్ళు వెల్లిపొంగనే..వచేస్తుంది లే అన్నాను...సరే అంది...నేను కనిపించినప్పుడల్లా..అమ్మ,నాన్న ఎప్పుడు వస్తారు అని అడుగుతూనే ఉంది...

నాకు అసలు ఆవిడ ను చూడడం ఎంత కష్టమైందో చెప్పలేను...కన్నీరు...వరదలు గ కారిపోయింది.....!! :(

ఆ ప్రవాహాన్ని చూసి..అమ్మమ్మ నాతో అంది కదా...ధైర్యంగా ఉండాలే...ఎందుకలా??...నన్ను చూడు అంది..దండం పెట్టి తల్లి నీకు ఉన్నంత ధైర్యం నాకు లేదు లే అన్నాను....నాకు తెల్సే....నాకు బాలేదని తెల్సినప్పటి నుండి..నువ్వు పడే కంగారు....!!...అంతలో పెద్దమ్మ వచ్చి చెప్తోంది...ఎవరొచ్చిన రాక పోయిన...నా కిరణమ్మ వస్తుంది...నన్ను చూడటానికి...ఈ వారం అందంట.. :D...

అమ్మమ్మ పక్కనే కుర్చుని తన చేత్తో ఆడుకుంటూ...తననే చూస్తూ చాల సేపు ఏడ్చాను...నాకు ఎందుకో చాల బాధ గ అనిపించింది..

నేను తను దగ్గర చదువుకుంటున్న రోజుల్లో...వాకింగ్ కి వెళ్ళే వాళ్ళం...కనీసం నా చేయి కూడా పట్టుకునేది కాదు..ఎందుకు అంటే...నువ్వేమో గాలికి ఎగిరి పోయే ల ఉంటావ్...

ఇక నేను పట్టుకుంటే...భూమి లోకే..అమ్మో మీ నాన్న వాళ్ళు గొడవ పెట్టేస్తారు.. అని నవ్వేది..

లేదు నేను strong అని...తనకు సపోర్ట్ గ మెట్లు దిగేటప్పుడు....ఎక్కేటప్పుడు..రోడ్ క్రాస్ చేసేటప్పుడు..హెల్ప్ చేసి తెగ సంబర పడిపోయే దాన్ని..

ఇంటికొచ్చాక.....నన్ను పట్టుకుని అలసి పోయావ్ అని....అన్నం ముద్దలు చేసి చేతిలో పెట్టేది...అల అయితే ఎక్కువ తింటాను....అని బోలుడు కబుర్లు చెప్తూ...!!

వద్దు అన్న వినేది..కాదు...

ఏదైనా పని కావాలి అంటే...నాయన కిరణు..నువ్వు మంచి దానివి కదూ..అంటూ మొదలు పెట్టేది.. :)

ఎం కావాలో చెప్పు అంటే..పెరట్లో కరివేపాకు కోసుకు రమ్మనో..తాతయ్యకు...పూజకు పూలు కోసుకు రమ్మనో...చెప్పేది.. :)

నేనేమో పెద్ద పిరికి దాన్ని...అమ్మమ్మ,తాతయ్య నేను ...పెద్ద ఇంట్లో..నాకంటూ ఒక గది కూడా ఉంది..కానీ ఒక్క దాన్నే అక్కడ పడుకోవాలి అంటే భయం..నెమ్మది గ వచ్చి అమ్మమ్మ పక్కన దూరే దాన్ని..

ఏమే భయమా అంటే..లేదు నాకేం భయం...ఊర్కె నీ దగ్గర పడుకోవాలి అనిపించి అనేదాన్ని...ఇక అర్థం చేస్కొని..పక్కకు జరిగేది...తన మీద చేయి వేస్తె సగం మాత్రమే కవర్ అయ్యేది..

అమ్మమ్మ నువ్వు చిన్నప్పటి నుండి ఇంతే లావా..??మరి సన్నగా ఉన్న తాతయ్య నిన్ను ఎలా పెళ్లి చేస్కున్నారు ..అంటూ రక రకాల ప్రశ్నలు వేసేదాన్ని..

మా అమ్మమ్మ నవ్వి..ఈ రోజుల్లో ఉన్నన్ని కోరికలు ఆ రోజుల్లో మా generation కి లేవే అంటూ..ఇంకో కబుర్లు ఏదో చెప్తూ ఉంటె పడుకునే దాన్ని.. :)

ఇక తన దగ్గరి నుండి వచ్చేసాక కూడా..తరచూ గానే వెళ్ళేదాన్ని...అందరు కలిసినప్పుడు....ఆ కిరణ్ ని పిలవండే..ఎక్కడో ఉంటుంది...అన్నానికి అని అంటే..

వెంటనే అమ్మమ్మ మమ్మల్నెందుకు పిలుస్తున్నారు...మేము గాలి భోంచేస్తం అని వెటకారంగా అనేది.. :)

ఇలా అన్ని తలచుకుంటుంఢగానే.. .. నిద్ర లేచి...నన్ను మంచం మీద నుండి కిందకి దింపు అంది..ఇంట్లో ఎవరు లేరు..వచ్చాక.. లేద్దువు లే అంటే...ఏమి లేపలేవ ని అడిగింది...

అసలు తన కండిషన్ ఏంటో అర్థం కాలేదు..ఇక అలా ఉంటె..హైదరాబాద్ కి తీసుకెళ్ళారు......హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు...

నేను అప్పుడు మాట్లాడిందే లాస్ట్....కానీ తను లాస్ట్ లో ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడ లేదు...

ఏదో మౌనంగా చూస్తూ ఉండేది...

మనుషులంటే ..విరక్తి కలిగిన దాని లాగా..!!

హాస్పిటల్ లో అడ్మిట్ చేసిన 2 డేస్ కే కోమా లో కి వెళ్ళిపోయింది.....ఇక ఎవరితో... మాట్లాడనే లేదు..

వెంటనే అందరం వెళ్ళాం...అక్కడికి....నేను వెళ్ళిన ఒక హాఫ్ డే కి దేవుడి దగ్గరకు వెళ్ళిపోయింది.... :(...

ఎంత భాదో... కళ్ళతో చుస్తే భరించలేము.....ఎక్కడ చుసిన pipe లే...నరకం...

చాల మంచిది.....అందరికి మంచే చేసింది..మరి ఇలా ఎందుకు బాధ అని నేను అంటే...

మా సత్య చెప్పారు..వాళ్ళకు ఇక ఈ జన్మ లో పాపాలు నెక్స్ట్ జన్మ కు క్యారీ ఫార్వర్డ్ కాకుండా....దేవుడు ఇప్పుడే పెట్టేసి..తీసుకేల్లిపోతడు...అంది..కాస్త రిలీఫ్..!!!

కానీ నాకు బాగా ఊహ వచ్హాక....అంత లవ్లీ పర్సన్ ని...నేను మిస్ చేస్కుంటాను..అని కూడా నేనెప్పుడు అనుకోలేదు..

తఃన దగ్గర వంటలు...సున్ని పిండి చేయడం ఎలాగో రాసుకుందాం అని ప్రతి సారి అనుకునేదాన్ని...కానీ కుదరలేదు..

దానికి కారణం నా లో ఉన్న ఓవర్ confidence....మా అమ్మమ్మ ఎప్పుడు నాతోనే ఉంటుంది...అని..!!స్వార్థ జీవి కదా మనిషి.. :P
మనం పెరిగేటప్పుడు...మన అమ్మలకి...అమ్మమ్మ లు ..బామ్మ లు ఎన్నెన్ని జాగ్రతలు చెప్తారో కదా...మరి అమ్మ వాళ్ళకు కూడా అప్పటికి తెలియదు కదా...!!
కాస్త పెద్దయ్యాక..బోలుడు కథలు..కబుర్లు...మన వైపే ఫుల్ సపోర్ట్..!!

కానీ ఎంత మనిషిని ప్రేమించిన...తను లేకుండా మన జీవితం మాత్రం అలా సాగిపోతూనే ఉంటుంది...ఇది ఎంతో విచిత్రంగా తోస్తుంది నాకు..!!

రెండు రోజులు ఎక్కువ సెలవలు వస్తే...అమ్మమ్మ ఇల్లు తప్ప ఏమి గుర్తు వచ్చేది కాదు నాకు...ఏం చేద్దాం......ఇప్పుడు ఆ రెండు రోజులు..సెలవలు..తన జ్ఞాపకాలు..తను నేర్పిన పాఠాలు ..తల్చుకోడానికే సరిపోవు...!!

అమ్మమ్మ..ఐ మిస్ యు సో ముచ్..... :(

18 comments:

అశోక్ పాపాయి said...

చదువుతున్నంత సేపు చాల భాదగా అనిపించింది:((మీకు వీలైతే మీ కామెంట్ బాక్స్ ని మార్చండి.

ఇందు said...

చాలా బాధేసింది.నాకు ఒక అమ్మమ్మ ఉంది.తనకి పెరాలసిస్.మంచం మీదే ఉంటుంది.అంతా బాగున్నప్పుడు...అందరికీ అన్నీ చేసిపెట్టిన అమ్మమ్మ ఇప్పుడు అందరిచేత చేయించుకునే స్థితిలో చూడలేక నేను అసలు వెళ్ళట్లేదు తన ఇంటికి.మీ పోస్ట్ చదువుతున్నంత సేపు నేను మా అమ్మమ్మనే తలుచుకున్నా! ఐ మిస్ మై అమ్మమ్మా టూ! :((

హరే కృష్ణ said...

u surely miss your grandma
Elders love kids affection towards them are the most precious things in the earth!

Krishna said...

prati vennelaki mundoka amavasya venakoka amavasya unnatte apudapudu grahanalu kuda vastaayi. bahusha jeevitam, anubandhalu ante idenemo. pratii linelonu ammamma ane ekuvaga use chesaru and now I am recollecting my memories. na pani chusukuntu ayina vallani entaga marchipotunano okkosari ilanti tapalu gurtuchestaayi. eesari intiki vellinapudu chusostaanu. mi post ki thanx n chustu undatam tappa vere ea comment cheyalenu. I got to relate myself to something in it. intaki mi ammammagaridi em vuru?

kiran said...

@krsna - yes..yes tappakunda chusi randi...leka pothe..tarvatha regrets untayi...naku ammamma,thatayya anna..bamma tatayya anna love ekkuva..anduke ii roju ila miss avtunna..ma ammamma ni..!!

Krishna said...

intaki mi ammamma garidi em vuro cheppaneledu. madi pithapuram. eesari vellinapudu tappakunda osari visit chesi vastanu. btw.. ee madyane ante 8 mon back ma ammamma garini kalisanu. nenu palana valla abbayi niku manumadini ani parichayam chesukunanu. ila chepte bahusha miru nammaremo kada. em cheyanu nenu 14yrs tarvata modati sari chusanu avidani anduke ala parichayam chesukovalsivachindi :(

kiran said...

krsna garu ma ammamma valladi anantapur andi...!

Krishna said...

:-) aite miru chinapudu stories avi bagane vine untarukada. gurtunnanta varaku tapaalu kottandi. aa kathalu malli jeevam posukuntaayi.

మనసు పలికే said...

కిరణ్ గారు, టపా చదువుతున్నంత సేపూ చాలా బాధగా అనిపించింది. నిజమే కదా, అమ్మొమ్మలు, నానమ్మలు తాతయ్యలతో తెలియకుండానే ఎంతో అనుబంధం ఏర్పడి ఉంటుంది. కథలు చెబుతూ అమ్మొమ్మ, గోదావరికి తీసుకెళ్లి ఆ గౌతమి గురంచి వివరిస్తూ తాతయ్య. మరిచిపోలేని ఙ్ఞాపకాలు. మా అమ్మొమ్మ కూడా లేరు ఇప్పుడు. పాపం తాతయ్య అమ్మొమ్మనే తలుచుకుంటూ ఉంటాడు ఇప్పుడు. వెళ్లినప్పుడల్లా చెబుతూ ఉంటాడు నాకు నా సీతమ్మ పోయిందిరా నన్నొదిలేసి అని. చాలా బాధగా ఉంటుంది:(

kiran said...

@krsna - antha gurthu levu..will try.. :)

hmmmm ..అయ్యో అందరూ...చాలా ఫీల్ అయ్యారండి ఈ పోస్ట్ చదివి..
నెక్స్ట్ టైం నుండి ఇంత టచ్ చేసే పోస్ట్ లు రాయను...
బట్ స్టిల్...అన్డుబంధాలు చాలా గొప్పవి కదా..!!
మా తాతయ్య కూడా అమ్మమ్మ ని ఫుల్ మిస్సింగ్.. :(

Krishna said...

hmmmmmmmmmmmmmmmmmm... goppore :P

మనసు పలికే said...

>>నెక్స్ట్ టైం నుండి ఇంత టచ్ చేసే పోస్ట్ లు రాయను...
అయ్యయ్యో.. రాయాలండీ.. ఇలాంటివి చదువుతూ ఉంటేనే అనుబంధాల్ని మర్చిపోకుండా ఉంటాము. మనుషులు దూరంగా ఉంటేనే వాళ్ల విలువ తెలుస్తుందంటారు. దూరంగా ఉన్న వారిని తలుచుకుని మనం పడే బాధ చూసైనా దగ్గరగా ఉన్న వాళ్ల విలువ తెలుస్తుందేమో..

kiran said...

@krsna - :P

@ అపర్ణ గారు - ఏమో బాధ గ ఉంది అని అందరు చెప్తే అల అన్నాను లెండి.. :)
అయిన...ఒక సరి ఆ మూడ్ వచేసిందంటే...ఇంకా వద్దు అన్న..అల ఫ్లో లో వచేస్తుంది.. :)

శివరంజని said...

kiran మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

Ennela said...

you all are so lucky..i never had any grand parents.. My parents were last children of their families and i am last but one among 7..my grand parents died when my parents were young...i had no luck to be with them...this way, i miss my grand parents....

kiran said...

@ennela garu - :(..no words..
but god is so great andi..
anni realtions lo edo oka speciality undela chustadu.. :)

Unknown said...

హ్మ్ కిరణ్ చాల బాధేసింది .. మీ అమ్మమ్మ ఎక్కడున్నా ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని .. కోరుకుంటున్న

kiran said...

హ్మ్న్..కావ్య.. :(

అనన్య చురకలు !

మా పాపా పేరు అనన్య  ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను  దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...