ఇది లేక పోతే ఒక మనిషి లేడు అని నా గట్టి నమ్మకం..
మీకేమో తెలిదు నాకు మాత్రం....చాల నేర్పింది..స్నేహమే..
వాళ్ళు మంచి చేస్తే అల చేయాలి అని..చెడు చేస్తే అల చేయకూడదు అని...ఒక దిక్సూచి ల గ నిల్చున్నారు..
అతి కష్టమైన సమయాలలో నా పక్కన ఉంది కూడా ఎప్పుడు వాళ్ళే...
నేను విసుక్కున్న..మల్లి తిరగి కాల్ కూడా చేస్తారు..ఎంత మంచి వాళ్ళో కదా...అంటే నేను మంచిదన్నైతే నే కదా..వాళ్ళు అంత మంచి వాళ్ళు అయ్యేది.. :P
ఇక తెల్సిన వాళ్ళు ఇలా ఉంటె...ఈ మద్య...ఈ బ్లాగ్స్ వల్ల బోలెడు మంది పరిచయం..మీరు ఫ్రెండ్స్ ఏ కదా మరి...
సో అందరికి Happy Friendship day…!!
ఒక్క నిమిషం...పైన ఉన్న పిక్ నేనే కష్ట పడి ఫోటోషాప్ నేర్చుకుని చేశాను...కాస్త పొగడచు కదా.. :)..
నాకు కవితలు,పాటలు...రావు...మాటలు అసలే రావు..:P అందుకే అల pictorial representation..!!:)
31 July 2010
30 July 2010
PG కబుర్లు …..
PG అంటే ?? ఏంటో కనుక్కోండి చూద్దాం…
అదేంటి ..చాల రోజుల తర్వాత బ్లాగ్ కి వస్తే ..ఇలా ఎగ్జామ్స్ పెడతావ ….వేల్లిపోతం ………..అంటున్నార ..వద్దు వద్దు ..నేనే చెప్తాను .. :)
అబ్బో కిరణ్ PG చేసి …దాని కబుర్లు కూడా చెప్పేస్తోంది అనుకుంటున్నారా ..బయటికి అనకండి ..నన్ను ..మిమ్మల్నీ కలిపి కొడతారు …B.tech చేయడమే కష్టమైంది ..ఏదో దేవుడికి నేనంటే మరీ ఇష్టం కాబట్టి ఒక ఉద్యోగం ఇప్పించేసాడు ఒక degree కే ..(అసలు విషయం ఏంటంటే ….దీనికి ఒక ఉద్యోగం ఇప్పిస్తే ఇక నా జోలికి రాదు ..రోజుకొక విచిత్రమైన నైవేద్యం పెట్టి పొద్దున్నే నా tongue taste ని బాడ్ చెయ్యదు …అని అనుకోని ఉంటాడు …)
PG అంటే paying guest…మొన్నీ మద్య మా చిన్న తాతయ్య INDIA కి వచినపుడు PG అంటే post graduation అనుకున్నారట …Bangalore మహా నగరం లో ఎక్కడ చుసిన PG పోస్టర్ లు ఉంటె PG కి కూడా tuitions ఏంటి మరీ విడ్డురం కాక పోతే అనుకుని ,ఇంటికి రాంగానే డౌట్ clarify చేస్కొని ఆశ్చర్య చకితులయ్యరట .. :)
మీరు కూడా అలాగే ఆశ్చర్యానికి లోను అవ్వాలి అంటే ఈ పోస్ట్ చదవాల్సిందే …
ఈ పదం నాకు hyderabad లో ఉండగా పరిచయం లేదు ..Bangalore వచకే తెలిసింది …..
Hostel కి కొంచం posh గ polished గ పెట్టిన పేరే ఈ PG….దీని concept ఏంటి అంటే ఇంట్లో వాళ్ళు ఉంటూనే ..వాళ్ళతో పాటూ మనకు ఒక గది ఇచి ..వాళ్ళు చేసుకునే వంటలే మనకి పెడ్తూ …ఇంట్లో పిల్ల లాగా చుస్కుంటారు అని చెప్పారు ….ఇదంతా మాయ అన్న మాట కి నాకు కరెక్ట్ గ అర్థం తెల్సింది నేను PG లో చేరిన తర్వాతే ……
అప్పటి వరకు hostel లో ఉండే దాన్ని ..అదొక పెద్ద building..ఎవరి పని వారిదే ….room లో వాళ్ళతో మాట్లాడటం …time కి తినడం ..నెలకి రెంట్ ఇవ్వడం …..ఏమి పెద్ద kick ఉండేది కాదు ….
ఒకానొక రోజు ఊరు చివరున్న ఒక అడవి tech park,forest nagar,Bangalore (అని అంటూ ఉంటారు ) …లో J(Jungle) block ki నీ ప్రాజెక్ట్ మారుస్తున్నాం ..వెళ్ళాల్సిందే అన్నాడు మా మేనేజర్ …తప్పదా …అంటే ..కంపెనీ మారితే తప్పుతుంది అన్నాడు ……..1.5 yrs experience ఏ కదా అని ఆడుకున్టున్నావా ….డబల్ …డబల్ promotion తీస్కోని నీకు మేనేజర్ అయ్యి నీతో ఆడుకుంటాను అన్నట్లుగా ఒక లుక్ ఇచి …okkk…will shift there అంటూ సీట్ దగ్గరికి వచ్చి నసుగుథూ ఉన్నాను …….నా పక్కనే ఉన్న నాగవేణి ..ఏమైందే ….?? అంది ఏమి లేదే …..ఆ అడవి కి వెళ్ళాలి అంట అన్నాను …hooo అవునా ……అది ఇక్కడికి 30 kms….అయితే నువ్వు hostel కూడా మారాలి అన్న నిజాన్ని గుర్తు చేసింది …..నాకు ఆ బెంగ తో typhoid కూడా వచ్చింది …నిజంగా నిజం ….
ఈ అడవికి వచ్చి ….ఆ జ్వరం లో వెతుకున్నా …ఇల్లు చూడడానికి బానే ఉంది …తెలుగు వాళ్లే కదా అని చేరాను ….ఇంకో నిజం ఏంటంటే ..ఆ రోజు ఓపిక లేక commit అయ్యాను …ఇలా post రాసుకోడానికి పనికొచింది ……
అక్కడ condition లు ..గట్రా విని ..typhoid + BP + HEART ATTACK లు వచేస్తాఎమో అనుకున్నా ….ఇంకా నా చేత్తో వెరైటీ వంటలు తినాలి అనుకున్న దేవుడు ..అవేమి రాకుండా ..typhoid కూడా తగ్గించేసాడు .. :)
ఇక PG చూడడానికి వచినప్పుడు 2 sharing లేదా …అని అడిగాను ..ఒక రూం చూపించాడు ….కళ్ళు తిరుగుతున్నా ..వాటిని తిరగ కుండ చేత్తో పట్టుకుని చూసాను …… L shape hall లో సగం L ని చెక్క తో partition చేసి 2 మంచాలు మళ్లీ L shape లో వేసి ..మా ఇంట్లో స్టోర్ రూం లో పెటుకునే బీరవ లాంటిది ఒకటి పెట్టి ..విత్ cupboard ..ఈ రూం కి తప్ప దేనికి లేదు ఈ facility అన్నాడు ..నాకు అంత అదృష్టం ఎందుకు లే అని …చిన్న బెడ్ రూం లో ఉంటాను అని చెప్పను ….ఇంతకీ చెప్ప లేదు కదా …..ఇది ఒక డబల్ bed room house..ఒక kitchen,Lshape hall,master bed room..chitti bedroom…..సరే అని na room లో కి దిగాక …నా రూం లో నే తెలుగు పిల్ల ఉంది ..దానితో మాట మంతి కలిపాను ..ఒకొక్కటి owner ల గురించి లీలలు చెప్పటం మొదలు పెట్టింది ..నేను నమ్మ లేదు …కొంత మందికి ఎంత చేసినా satisfaction ఉండదు లే అనుకున్న్నా …కానీ అప్పుడు తేలీదు కదా PG లో చేరిన మొదటి 2 వారాలు గెస్ట్ లు …ఆ తర్వత ..వాళ్ళకి మేము ..మాకు వాళ్ళు ghost లు అని …..ఇప్పుడు నా room mate కి నా sorry అనమాట ..
ఇక రెండు వారాలు అయ్యాక అసలు కథ మొదలయ్యింది …….అసలే bangalore …చలి ఎక్కువ …..geaser ఆన్ చేస్కొని tea తాగే లోపు …2,3 సార్లు owner వచ్చి నాకేదో షార్ట్ term memory loss ఉన్నట్లు ..నువ్వు geaser వేసావు ..నీళ్ళు మసలి పోతున్నాయి అంటూ వేళ్ళు పైకి కిందకి అడిన్చెస్తూ ఆ నీళ్ళ temperature ని feel అయ్యేలా చేసి …tea ని cold tea లాగా తాగుదాం లే అని మనల్ని fix అయ్యేలా చేసి వెళ్ళిపోతుంది …లోపలి కి వెళ్లి చుస్తే ఆ నీళ్ళు … ….గోరు వెచ గ చచుంటాయి ……. :(..ఏడుపు వస్తుంది …..
ఫ్యాన్ లు lite ల విషయం లో అతి జాగర్త గ ఉంటారు పాపం …ఏ రూం లో ఎంత సేపు fan తిరుగుతుంది ..ఎంత speed మీద తిరుగుతుంది అన్న విషయాల మీద research చెస్తూ ఉంటుంది మా owner ..ఒక రోజు …నేను ఆవిడకి బకరా of the day లాగా కనిపించనేమో నాకు ఈ రెండు బయన్కరమైన నిజాలు చెప్పింది ….గుండె కొంచం గట్టిగా పట్టుకోండి pleassee..మీ లాంటి వాళ్ళు నా బ్లాగ్ కి మళ్లీ ..మళ్లీ రావాలి ….
1. Fan మీ రూం లో ని తమిళమ్మాయి 5 లో పెట్టుకుంటుంది …నాకేమో బయం వేస్తుంది kiran..అది ఎక్కడ ఊడొచి కింద పడ్తుందో అని …..అంది …నేను ఎంతో అమాయకంగా అదేంటి aunty loose ga ఉందా ఏంటి అంటే ..కాదమ్మా అంత స్పీడ్ న పెడ్తే కింద పడిపోదు ..అంది …watttttttttt???..నాకేమి అర్థం కాలేదు కాసేపు ….room కి వచ్చి ..తలుపు వేసి …రూం లో అందరికి అర్థం అవ్తుంది అని English లో translate చేసి ..బయటకి వినపడకుండా ……గట్టిగా నవ్వేసాము ….2. Kiran మీ రూం లో వాళ్ళు geaser ఎక్కువ సేపు వేస్తున్నారు …..చెప్పు ….మొన్న నేను నీళ్ళు పట్టుకుంటుంటే ..plastic పడింది bucket లో ఏంటా ..అని ఆలోచిస్తే అర్థమైంది ..మీ room లో వాళ్ళు అంత సేపు వేసినందుకు ….plastic కరిగి పొఇ అలా అప్పుడపుడు .. పడి పోతు ఉంటుంది …. ?@#@$#%????..meeku అర్థమైంద ???.....నేనే పాపాల బైరవురలిని …..నాకు ఒక్క దానికే తెలుగు వచ్చు అందులో ఏదో కొంపలన్తుకున్నట్లు పొద్దునే లేచి చల్ల గాలికి కూర్చుందామని వెళ్ళినప్పుడు తగిలిన షాక్ లు ..ఇంకా చాల ఉన్నాయన్డోయి.…
చెప్తాను ….చెప్తాను ..కాస్త విరామం ప్లీజ్ …!!
15 July 2010
Blogs i like…
I love blogging as i mentioned in this post....and promised that will give you all the blogs which will be helpful,informative and entertaining.....and i categorized it ,so that people can easily go to their interesting subject and read the blogs... :)
ఇక మనం తెలుగు లో మాట్లాడుకుందాం..
ఎన్నో మంచి బ్లాగ్ లు ఉన్నాయి...
అన్ని రంగాల లోను....నాకు నచినవి నేను ఫాలో అవుతూ ఉంటాను...
అన్ని ఒకే చోట ఉంచితే మీకు,నాకు ఇద్దరికి వీలుగా ఉంటుందని.... ఇలాNOV పోస్ట్ చేస్తున్న..
ఇక ముందు కూడా కొత్తవి తెలిస్తే ఇక్కడే ఆడ్ చేస్తాను...
నా ఒంటరి తనం పోగొట్టిన మీ అందరికి నా కృతజ్ఞతలు...
ఎంతో encourage చేస్తూ....సలహాలు..సూచనలు ఇస్తున్న మీ అందరికి ధన్య వాదాలు.. :)
14 July 2010
భక్తి-భక్తుడు-భగవంతుడు
ఈ రోజు భక్తి యోగం సారంశం చెపుతూ...చేసిన ప్రతి పనిని కృష్ణుడికి అర్పించాగలవా? అని అడిగారు మా గురువు...
చాలా కష్టం అని చెప్పాను..
నేను ఇంత వరకు అల ఎప్పుడు చేయలేదు..చేయ లేక పోతున్నాను..అని చెప్పాను...
బాబా పారాయణం లో కూడా బాబా ప్రతి పని ముందు ..చేసేటపుడు...నన్ను తలచుకో అని చెప్తాడు..
కానీ చేయలేను...చేయక పోవడమే కదా...అసలు ఆయనని...మాములుగా రోజుకు ఒక్క సారి కూడా తల్చుకోడానికి బద్ధకిస్తాను...
అప్పుడు ఎంతో guilty గా ఉంటుంది అని చెప్పాను ...
దానికి చిన్న కథ చెప్పారు....
కృష్ణుణ్ణి ఒక సారి నీకు అత్యంత ప్రియమైన భక్తుడు ఎవరు అని అడిగారంట...
అప్పుడు కృష్ణుడు ఒక ఊరిలొ ని పేద రైతు ని చూపించాడు ట ..
అది అక్కడ ఉన్న వాళ్ళకి నచలేదు...అందుకే కృష్ణుడు నారదుణ్ణి పిలిచి ఒక చిన్న గిన్న లో నూనె ని అటు చివరినుండి..ఇటు చివరికి ఒక చుక్క కూడా కింద పడేయకుండా...తీస్కెళ్ళ గలవా ? అని అడిగాడుట ...ఓ..అని తీసుకు వెళ్ళాడు ఒక్క చుక్క కూడా పడేయకుండా....అప్పుడు కృష్ణుడు..నువ్వు ఆ గిన్నె ని మోస్తున్నంత సేపు నన్ను ఎన్ని సార్లు తల్చుకున్నావ్..?అని అడిగాడు...నా ఏకాగ్రత అంత గిన్నె మీదే ఉండి..నీ మీద లేకపాయింది అన్నాడు నారదుడు....
అప్పుడు కృష్ణుడు...ఇంత చిన్న దానికే నువ్వు నన్ను మరచావే..మరి అంత పెద్ద సంసార భారాన్ని మోస్తూ కూడా నన్ను రోజుకు ఒక్క సారైనా తల్చుకుంటాడు....
అందుకే నాకు అంతనంటే ఇష్టం అన్నాడుట..!!
సో బాబా కూడా నువ్వు...నీ హెల్త్ ప్రొబ్లెంస్,ఆఫీసు ప్రొబ్లెంస్ అన్ని భరిస్తూ కూడా ఆయన్ను తల్చుకుంటున్నందుకు హ్యాపీ గా ఫీల్ అవతాడు లే అన్నారు...మా గురువు.. :D
బాగుంది కదా కథ...!!
నాకు ముందే మంచి విషయాలు గుర్తు పెట్టుకునే మెమరీ తక్కువ..
మరచిపోతానని...ఇలా నా లాగా దేవుణ్ణి తలచుకోకుండా బాధ పడే బద్ధకస్తులకి... :P ఈ కథ కాస్త ఊరటనిస్తుందని..ఇక్కడ పెడ్తున్న... :)
7 July 2010
భగవద్గీత ...
అసలు దీని మీద నాకు ఎందుకు అంత ఇష్టం ఏర్పడిందో...ఎప్పుడు ఏర్పడిందో తెలీదు ...
మే be నేను సాయి పారాయణం ఎక్కువ చేసే దాన్ని..
అందులో బాబా అందరికి రామాయణం కానీ,భగవద్గీత కానీ,విష్ణు సహస్త్రనామం కానీ ,భాగవతం కానీ చదవమని చెప్పే వారు...
భగవద్గీత మా బామ్మా చదువుతూ ఉండేది...
అన్ని కలిపి అసలు దాన్ని కంటస్థం చేయక పోయిన ..అసలు ఏముంది అందులో అనే కుతూహలం కూడా పెరిగింది..
ఘంటసాల భగవద్గీత వినడం స్టార్ట్ చేశాను..అది mostly 2 years నుండి regular గా వింటాను ...
ఈ మధ్యే సీత నాకు గీత మకరందం గిఫ్ట్ గా ఇప్పించింది సత్య గారి తో...అది ఒక memorable day..!!
అదే అద్బుతం అనుకుంటే నా అదృష్టం ఎక్కువ అయ్యి....వాళ్ల టీచర్ కుంద మిస్ దగ్గరికి వెళ్లి....ఆవిడ చేతుల మీదగా మళ్ళి ఇంకో సారి అందుకొని..
12 వ అధ్యాయం లోని కొన్ని శ్లోకాల అర్థాలు చెప్పారు...
నాకు ముందే చాలా ఇష్టం..అల పెద్ద వాళ్ల ఆశీర్వాదాలు అందుకోవడం...
బాబా పారాయణం లో ఆయన ఇలాంటి గ్రంధాలని స్పృశించి ఇస్తూ ఉంటారు...
ఎందుకో ఆ ఫీలింగ్ కలిగింది...
ఇక అది తెచుకున్ననే కానీ ఎప్పుడైనా ఆఫీసు లేని రోజుల్లో గట్టిగ introduction చదవగలిగాను...
నాకు ముందే శ్లోకాలు చదవాలంటే భయం ....తప్పులు పోతాయేమో అని...
అందుకే ఏదైనా తాత్పర్యం తెలుసుకొని వదిలేస్తా....
కానీ దేవుడు మంచోడు.....కరుణ చూపించి...ఒక గురువును పరిచయం చేసాడు....ఎవరో కాదు సత్య..
తను ఏ విషయమైన చాల మంచి మంచి ఎక్షమ్ప్లెస్ తో అర్థమయ్యేలా explain చేస్తారు....
సత్య గారి పుణ్యమా అని ఎలా పలకాలో నేర్చుకుంటున్న..తనకి తన గురువు అంటే ఎంత ప్రేమ,నమ్మకం ఉన్నాయో....
నాకు ఎప్పటికీ అంతే ప్రేమ గౌరవం ఉండి....నేర్చుకుంటూ ఉండాలని కోరికగా ఉంది.. :)
థాంక్స్ సత్య గారు..!!! :)...
నా ఒక కల నిజమవుతోంది....:)
Subscribe to:
Posts (Atom)
అనన్య చురకలు !
మా పాపా పేరు అనన్య ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...
-
హ..హా....హా....చ్... శుభమా అని కొత్త సంవత్సరం మొదలవుతూ ఉంటే ఆ తుమ్ములేంటి...?? ఆహా ఒక్క సారికే...నాకు రోజూ తుమ్మోదయమే అవుతోంది మరి... కర్ర...
-
తెల్లవారు జామున ఏడుకి కి అలారం మోగుతోంది ..పొద్దున్నే తొమ్మిదింటికల్లా ఆఫీసు కి వెళ్ళాలని ఎవడు కనిపెట్టాడో కానీ అని అనుకుంటూ నిద్రలేచి గ...
-
నిజంగా ఇది నా బుజ్జే...దీన్ని ఇంట్లో అలాగే పిలుస్తారు..మీరు కుక్క పిల్ల అని తప్పుగా అర్థం చేస్కోకండి ...ఆడపిల్లే..అందమైన తెలివైన ఆడపిల్ల......