నేను : పొద్దున్నే ఎవరింత గౌరవం లేకుండా పిలుస్తుంది..??
నేనే వెన్నెల ని..
నేను : నువ్వు పొద్దున్నే వచ్చావ్ ఏంటి ..రాత్రి కదా రావాలి ..
వెన్నెల : నీ కుళ్ళు జోకులు వినే ఓపిక నాకు లేదు కానీ ...ఈ రోజేంటో గుర్తుందా ?
నేను : శుక్రవారం..రేపు వారాంతం.... :D
వెన్నెల : ఛా...రెండు  సంవత్సరాల  క్రితం .........
నేను : హా  క్రితం...
వెన్నెల : ఇంకా  గుర్తు  రాలేదటే ..!!
నేను : లేదు..!!
వెన్నెల : మీ  తమ్ముడికి  కాల్  చెయ్....
నేను : పొద్దున్నే  వాడికా ....ఎందుకు ??
వెన్నెల : వాడికైనా  గుర్తుందేమో  అని..
నేను : ఓయ్  నా  తమ్ముణ్ణి  వాడు... వీడు..అంటావ్  ఏంటి ...?
వెన్నెల : నువ్వు  ఫోన్  కలుపెహే ..
నేను : ఒరేయ్  తమ్ముడు  వెన్నెల  నీతో  మాట్లాడమంది ..
మా తమ్ముడు : బాగుంటుందా....నాన్నతో  నువ్వే మాట్లాడేయి.. బాగుంటే ..నా పర్మిషన్ అవసరం లేదే..
నేను : ఛి  ఛి  వెధవ .. నా  బ్లాగ్  వెన్నెల  రా ...
 మా తమ్ముడు : ఆదా ....
నేను : కికికికికికికికి ..
మా తమ్ముడు : ఏమంటా ?
నేను : ఈ రోజేదో ప్రత్యేకం  అంట ..నిన్ను  అడగమంది..
మా తమ్ముడు : ఎంత  ఈ  రోజూ తారీఖు ...
నేను : నవంబర్ నాలుగు
మా తమ్ముడు : కిరణ్ ..గుర్తొచ్చింది ...ఒకానొక  రోజూ  బుజ్జి  చేత  నామకరణం  చేయించి  నీ  పలుకులు  తీయగా  ఉంటాయని అది  భ్రమ   పడటమే  కాక ..నిన్ను  కూడా  భ్రమలో  పడేసి thenepalukulu.blogspot.com అని  ఒక  బ్లాగ్  మొదలెట్టిన  రోజూ ..నాకు నీ బ్లాగ్ inner voice వినిపిస్తోంది.... 
నేను : ఏమని??
మా తమ్ముడు : నేను  పుట్టాను  లోకం  బెదిరింది..
నేను  ఏడ్చాను  readers  నవ్వారు
నేను  నవ్వాను   readers ఏడ్చారు..
అయినా ఈ కిరణ్ కి వాళ్ల మీద జాలి లేదు....కిరణ్ dont  care ..!!
నేను : దానిది లాగా లేదు..నీదే అనిపిస్తోంది.....సరే  ఫోన్  పెట్టేయి ...
వెన్నెల : నాకు  హ్యాపీ  బర్త్డే  చెప్పి ...అందర్నీ  పిలిచి  పార్టీ  చెయ్యి ...
 వెన్నెల : కోయ్  కోయ్ ..కోతలు  కోయ్ ....
నేను : నిజంగా  నిజం .....సర్లే  పోనీ  ఈ  సంవత్సరం  గుండు  కొట్టించనా ...??పద  గుడికి  పోదాం ...
వెన్నెల : ఎహే  పో ..నేను  అలిగాను ..
నేను : సరే  ఉండు  నీ  అలక  తీరుస్తా
ట్రింగ్  ట్రింగ్ ...
శైలు : హలో  కిరణ్  బాగున్నావా ??
నేను : హా  శైలు  బాగున్నా..శైలు  ఓ  చిన్న  పని ...
శైలు : ఏంటో  చెప్పు...
నేను : అప్పుడు  మనం  పెట్టిన  ఉత్తుత్తి  ఛానల్  ఉందా ..??
శైలు : ఇప్పుడు  దాని  పేరు  ఉత్తుత్తి  కాదు ...సుత్తే సుత్తి ఛానల్ ..
నేను : అబ్బో ..బాగుంది ...మన  డైరెక్టర్  వంశీ..,కెమెరా  మాన్  రాజ్, anchor   అప్పు ,script writer ఇందు లు  అక్కడే  ఉన్నారా .. ??
శైలు : హా..ఉన్నారు ....
నేను : సరే  నన్ను , నా  బ్లాగ్  ని  ఈ  రోజూ  నీ  ఛానల్  లో  ఇంటర్వ్యూ  చేయాలి ..
శైలు : ఓహో....ఒక  సారి  వంశీ  ని,రాజ్  ని,అప్పు  ని  కనుక్కోవాలి ..
నేను : వాళ్ళెప్పుడు  ఖాళీ  నే  లే ..నేను  పిలిచా  అని  చెప్పు  వచ్చేస్తారు ..
శైలు : నాది  అదే  భయం కిరణ్ ..నీ  పేరు  చెప్తేనే  రారేమో  అని ...
నేను : కోపం తెప్పించకు ..శైలు  నాకు  తెలీదు  ఏం  చేస్తావో ..ఇంటర్వ్యూ  జరగాలి  అంతే ....
శైలు : ఉండు ..వంశీ  కి  ఫోన్ చేస్తాను..వంశీ  మధ్యానం  మూడింటికి  స్టూడియో  కి  రా ...
వంశీ : ఎందుకు ...?మూసేస్తున్నామా  ఛానల్ ..??జీతం  సెటిల్  చేస్తావా ..?
శైలు : కాదు  కిరణ్  ని  , కిరణ్  బ్లాగ్  ని  ఇంటర్వ్యూ  చేయాలంట ..కాస్త  ప్రోగ్రాం  ని  డైరెక్ట్  చేద్దువు  రా
వంశీ : ఎందుకు  కిరణ్  బ్లాగ్  లోకానికి  వీడుకోలా ...??? అయితే  మనకి  సంబరాలే ....టపాకాయలు  కూడా  తెచ్చేస్తా ..
శైలు : కిరణ్  కూడా  line   లో  ఉంది ...
వంశీ : ముందే  చెప్పాలి  కదా  శైలు...కిరణ్.... ఊరకే  సరదాకి  అన్నాను  లే ....నేను  నీ  ప్రోగ్రాం ని  హిట్  చేస్తా ..వచ్చి  డైరెక్ట్  చేస్తా...
నేను : సరే  ప్రశ్నలు బాగుండాలి...నన్ను  ,నా  బ్లాగ్ ని  బాగా  promote చేయాలి .....పొగడాలి..
శైలు : సర్లే  నువ్వు  మంచి  డ్రెస్  లో  రా..
నేను : సరే  ఆ  రాజ్  ని  తుప్పట్టిన  కెమెరా  కాకుండా  మాంచి  కెమెరా  తీసుకురమ్మని  చెప్పు ...
శైలు : కిరణ్  రాజ్  కూడా  line   లో  నే  ఉన్నాడు ...
నేను : ఏంటి  కొత్తగా  BSNL వాడి  దగ్గర  కాంట్రాక్టు  తీస్కున్నావా ..అందరికి  ఫోన్  లు  కలిపేసి  పండగ  చేస్తున్నావ్ ..
శైలు : అదేమీ  లేదూ  లే...నువ్వోచ్చేయ్ ..
నేను : అన్నట్లు  ఆ  అప్పు  ని  సగం  సగం  తెలుగు  కాకుండా ....మంచిగా  తెలుగు  మాట్లాడమను..
ఇందు,శైలు,వంశీ,రాజ్ : నువ్వు సరిగ్గా మాట్లాడు  ముందు ..
నేను : ఏంటి  అందరూ  ఒకటే  సారి..??
సరేలే ...కర్రెస్ట్ గా మూడింటికి ఉంటా..
అందరూ నా స్నేహితులే అయినా..చణువు తో తింగరి ప్రశ్నలు అడుగుతుందేమో అప్పు అని లోలోపల ఒక భయం..మరి ప్రశ్నలు తయారు చేసింది ఇందు కదా..ఆ రాజ్ నన్ను కాకుండా పక్కనే ఉన్న నిత్య ఫోటో ని షూట్ చేస్తాడేమో అని ఇంకో అనుమానం..
ఇలా అనుకుంటున్నంతలో రాజ్ నా దగ్గరికొచ్చి కెమెరా నే చూస్తూ మాట్లాడు..అప్పుడప్పుడు అప్పు ని కూడా చూడు...అని చెప్పి వెళ్ళిపోయాడు ..అసలు నేను ఇంక రాజ్ చెప్పిన మొదటి మాట మాత్రమే విన్నాను...మీకర్థంయ్యింది కదా...!!
రాజ్,వంశి ఇంటర్వ్యూ మధ్యలో ఎవ్వరికి వినపడకుండా అప్పుడప్పుడు గుసగుసలాడుకుంటారు..ఇంటర్వ్యూ మొదలు అయ్యింది ...
అప్పు : కిరణ్ మీరు స్టూడియో కి ఎందుకు వచ్చారు ?
నేను : వెర్రి చూపులు ...ఇందు ని మింగేలగా చూస్తూ...
వెంటనే అప్పు : షాక్ అయ్యారా ..??..సరదాకి అడిగాను ..మాకు కారణం తెలుసు లెండి..
నేను : అప్పటికే నా తెల్ల డ్రెస్ చెమటల వల్ల సగం నల్లగా అయిపోయింది...
అప్పు : మీరు బ్లాగ్ మొదలు పెట్టి రెండు సంవత్సరాలు అవుతోంది అంటే ఆశ్చర్యంగా ఉంది..
రాజ్ ,వంశీ : అవునవును ....అప్పటి నుండి భరిస్తున్నాం అంటే ఆశ్చర్యమే మరి..
నేను : :)
అప్పు : ఎలా మొదలయ్యింది మీ బ్లాగ్ ప్రయాణం ?
అప్పు : ఓహ్ ...మీ మొదటి బ్లాగ్ బొమ్మలదా..??
నేను : అవును ఆర్ట్ బ్లాగ్ ..
అప్పు : ఎప్పటి నుండి బొమ్మలు వేస్తున్నారు ...మీకు అసలు బొమ్మలు వేయాలని ఎందుకు అనిపించింది ..?
రాజ్,వంశీ.. : వాళ్ల సోషల్ సర్,వాళ్ల ఫ్రెండ్స్ ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్లి చితక్కోట్టేయాలి...
అప్పు : అవునా మరి మహేష్ బాబు బొమ్మ ఎక్కడ కనపడలేదే ...
నేను : ఎప్పుడో ఎనిమిదేళ్ళ క్రిందట గీస్తే వాళ్ళ నాన్న కృష్ణ లాగా వచ్చాడు ..ఇప్పుడు గీస్తుంటే కూడా అలాగే వస్తున్నాడు .. మహేష్ ముసలాడు అవుతున్నాడేమో ..నేను ఆర్ట్ లో improvement చూపించినా తన మొహం లో కూడా ముసలి కళ పెరుగుతోందేమో ...త్వరలో ..గీసి మీ ముందుకు తీసుకొస్తా ...
రాజ్ : అవసరం లేదూ ..మీ వెనకే పెట్టుకోవచ్చు ...
అప్పు : మీరు బొమ్మలు గీయటం లో మరిన్ని మెళకువలు నేర్చుకొని ....ఎంతో మంచి కళాకారిణి కావాలని ..ఉన్నత శిఖరాలు అధిరోహించాలని .....కోరుకుంటున్నాం ..
రాజ్ : ఇంత తెలుగు కిరణ్ కి అర్థమవుతుందంటావా ??
వంశీ : నాకు డౌటే ...ఆ కళ్ళల్లో చూడు ..నీళ్ళు వస్తున్నాయ్ ..అర్థం కాలేదనుకుంటా ..!!
అప్పు : మీ కోసం ఒక surprise ...!!..అటు చూడండి ..!!...
పక్కనే టీవీ ఆన్ చేసారు ...బొమ్మ రావట్లేదు ..గొంతు వినిపిస్తోంది ...
నేను : అయ్ ..మా బుజ్జి గొంతు :D
రాజ్ ,వంశీ : ఒకరి మొహాలు ఒకరు చూస్కొని ఏమిటో ఈ కిరణ్ కి పొగడ్తకి ..తిట్టుకి కూడా తెలీదు అన్నట్లు మొహాలు పెట్టారు ..
నేను : పైత్యం ఎక్కువయ్యి ...
అప్పు : వెర్రి చూపులు
అప్పు  :  వేరే వాళ్ళ బ్లాగ్స్ చదివినప్పుడు ఎలా  ఫీల్  అవుతారు..??
నేను  :  ఒక్కొక్కరి  భావుకత  ఒక్కో  రకం...ఒక్కోసారి....కిల  కిల  నవ్వితే..ఒక్కో  సారి  మనసంతా భారంగా  అయిపోతుంది ..ఒక్కో  సారి  ఎప్పుడో  కలిసిన  పాత  మిత్రులని  కలిసి  బోలెడు  కబుర్లు ..విశేషాలు ..పంచుకున్నట్లుంటుంది ....మొత్తానికైతే  ఒంటరితనం  అన్న  మాటే  మర్చిపోతాం ..
అప్పు  : బ్లాగులో  నేస్తాలున్నారా ??
నేను  : ఎందుకు  లేరు  మొదట్లో  గారు  గారు  అంటూ  పిలిచినా ..ఆ  తర్వాత  పరిచయమయ్యాక  నువ్వు  అని  పిల్చుకునే చణువు వరకు  వచ్చేసాం ..చాలా  బాగుంటుంది  e-స్నేహం  కూడా ...ఒక్కో  సారి  వారం  రోజులు  ఎక్కడా  కనపడకపోతే...ఎలా  ఉన్నావ్  అంటూ  వచ్చే  పలకరింపులు  ఎంత  ఆనందాన్నిస్తాయో  చెప్పలేం ..
అప్పు : కళ్ళల్లో నీల్లోస్తున్నాయ్ ..మీ మాటలు వింటుంటే (శైలు ,ఇందు కూడా curtain వెనకాల నుంచోని ఏడుస్తున్నారు ...)
వంశీ : ఎహే ..నేను డైరెక్ట్ చేసేది సీరియల్ కాదు ...ఏడవకండి ...ఇందాకే glycerine రాసేస్కున్న్నారా ...???
అప్పు : సరే మీకు మళ్లీ ఓ surprise ...ఈ సారి కూడా ఆడియో రికార్డింగ్ ఏ ..కానీ స్పెషల్ ఎఫ్ఫెక్ట్ టీవీ లో మా తమ్ముడి ఫోటో కనిపిస్తోంది ..
నేను  : అమ్మో  వీడా ..ఏమేమి  నిజాలు  చెప్పేస్తాడో ...
నేను : అంతా వాడి అభిమానం ..కళ్ళు తుడుచుకుంటూ
అప్పు  : మీరు  ఇలాగే  సరదాగా  కబుర్లు  చెప్తూ  ..బ్లాగులో  బోలెడు  టపాలు  రాయాలని ..మీ  బ్లాగ్  స్నేహితులతో  స్నేహం  ఎప్పటికి  కలకాలం  ఉండిపోవాలని  కోరుకుంటున్నాం ..
నేను : thank u very much....thanks a lot...
అప్పు  : చివరిగా  మీ  బ్లాగ్  readers కి  ఎమన్నా చెప్పాలనుకుంటున్నారా...??
అప్పు  : మా  స్టూడియో  కి  వచ్చినందుకు  మీకు  బోలెడు  ధన్యవాదములు ....మా  అందరి  తరఫున  మీ  బ్లాగుకి  పుట్టిన  రోజూ  శుభాకాంక్షలు ...
నేను  : ఓయ్.. వెన్నెల  చూడవే .....నీ birthday celebrations...
అప్పు  : ఉండండి  కేకు  తెచ్చాము ....
శైలు  : హా   కిరణే  ఇందాక  ఫోన్  లో  అడిగింది ...కేకు  కూడా  కట్  చేయించండి  అని ...
నేను  : నమిలి,మింగేసేలా చూస్తూ
శైలు ,వంశీ ,రాజ్ ,అప్పు ,ఇందు ,నేను  :
happy birthday to u...
happy birthday to u...vennela....:)
నేను : thank you so much again...!! :)
రాజ్  : ఒక్క  ఫోటో  చివరిగా  ..మీ  బ్లాగ్  తో  మీకు ...
నేను : అలాగే
రాజ్  : క్లిక్ ...క్లిక్ ...క్లిక్ ..
నేను  : ఇంతకీ  ఎప్పుడు  టెలికాస్ట్  చేస్తారు ..??
రాజ్  : ఏంటది ...
నేను : ఇప్పుడు  మీరు  వీడియో  తీసింది ...??
నేను  :  వాఆఆఆఆఅ..వాఆఆఆఆఅ...వాఆఆఆఆఅ....
శైలు : కిరణ్ అలా ఏడవకు ....ఇదంతా నీ బ్లాగ్ లో నే రాసుకో ......అందరూ చదివి దీవిస్తారు ...
నేను : గుడ్  ఐడియా  శైలు ....టాటా  :D
ఇందు : కిరణు..కిరణు....నీకు బోలెడు థాంకులు....ప్రశ్నలే కాక జవాబులు కూడా నాతోనే రాయించుకున్నావ్...ఎక్కడ సరిగ్గా పలకవో అని కాస్త కంగారు పడ్డాను...పర్లేదు...బానే మేనేజ్ చేసావ్...
నేను : ఇప్పుడు ఆ విషయం అందరికి తేలియాలా?? ..బాయ్ ఇందు..!!పిల్లలు...శైలు,అప్పు,ఇందు,రాజ్,వంశీ...మీకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు గాను...నాకు పార్టీ ఇచ్చేయండి :P
 
 
28 comments:
>>అప్పు : ఎప్పటి నుండి బొమ్మలు వేస్తున్నారు ...మీకు అసలు బొమ్మలు వేయాలని ఎందుకు అనిపించింది ..?
kiran's actual response:సాధారణంగా ప్రతీమనిషికి తనను ఎదుటివాళ్లు ఎలా చూస్తున్నారో తెలుస్కోవాలని ఉంటుంది.నాక్కూడా అసాధారణంగా అలాగే అనిపించింది.మనకు వచ్చిందే ఎమోషను అన్నట్టు మా ఫ్రెండ్స్‌ను నాబొమ్మ వేయమన్నా. చాలా ఘోరంగా వేసారు. నేను ఎప్పుడు ఏం మాట్లాడినా మొదటి పదానికే కెవ్వు కేక అనేవాళ్లు ఇలా చేస్తారని అనుకొలేదు. ఆ బొమ్మ చూసాక మొదట నాకు బాధేసింది, ఆ తరువాత కోపం వచ్చింది, ఆ తరువాత పైత్యం వచ్చింది. ఎలాంటి బొమ్మవేసి నన్నేడిపించారో అలాంటొ బొమ్మలేవేసి వాళ్లనేడిపించాలని జడవేసుకొని మరీ చేసా మంగమ్మ శపధం.
jokes apart.....చాలా చాలా బావుంది స్క్ర్రిప్ట్.
Happy birthday to VENNELA :)
వెన్నెల కి పుట్టిన రోజు శుభాకాంక్షలు..
చివరాఖర్న నేను తీసి ఫోటో కేక కదా.. ;) ;)
మరిన్ని మంచి మంచి పోస్ట్లు రాస్తూ ఇలాంటి పుట్టీనరోజుల్ మరెన్నో జరుపుకోవాలని వెన్నెల ని కోరుకుంటూ...
డైరెక్టర్ వంశీ తో కేమెరామన్ రాజ్ కుమార్
Too good Kiran! :)
నీ 'వెన్నెల' కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒకే ఒక్క ఫోటో తీసినా అదే సూపర్ గా వచ్చింది. Cute! :))
వెన్నెల కి పుట్టిన రోజు శుభాకాంక్షలు..
వెన్నెల కి యాపీ యాపీ బత్తడే...
ఇంటర్వ్యూ కేక... :)
స్క్రిప్ట్ అదిరింది...:)
ఇలాగే రాస్తూ, మమ్మలను హింసిస్తూ వంద వసంతాలు జరుపుకోవాలని కోరుకుంటూ...:))))
ఈ సందర్భం గా అయినా పార్టీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.... :)
వెన్నెల కి మరో సారి జన్మదిన శుభాకాంక్షలు.
వెన్నెలకి పుట్టినరోజు శుభాకాంక్షలు
పుట్టిన రోజు పండక్కి అందరికి పార్టీ ఇవ్వాలి
మీ బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు !!
మరిన్ని మంచి scripts రాస్తూ ఇలాంటి yappy yappy birthdays మరెన్నో జరుపుకోవాలని tenepalukulanu కోరుకుంటూ...veekshakuraalu sunita.
hahaa.... baagundi.. entandi puttinarojulake mee vennela gurthostunda... appudappudu kooda palakarinchandi daanni... maree 2-3 months ki palakaristhe ela?
congrats.. good going...
మీ బ్లాగు వెన్నెలకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
ఇలాగే మరెన్నో మంచి టపాలు వేసి మమ్మలనందరిని ఆనందపరచ వలసిందిగా కోరుచున్నాము.
ఈ టపా కొంచెం డిఫరెంట్ గా చాలా బాగుంది.
పుట్టిన రోజు శుభాకాంక్షలు వెన్నెలకి
:)
వెన్నెల కి పుట్టిన రోజు శుభాకాంక్షలు..
కిరణ్ గారు బ్లాగ్ పుట్టిన రోజు శుభాకాక్షలు .
Cutest!!!!!!!!!!!!!!1
అబ్బో ఇంటర్వ్యూ టెలికాస్ట్ చెయ్యకపోయినా నిజ్జం గా చూస్తున్నాట్టే ఉంది. నేనయితే లయివ్ షూటింగ్ చూస్తున్నా..ఇందు స్క్రిప్టు, వంశీ గారి డైరెక్షను, రాజ్ గారి ఫొటోగ్రఫీ సూపరు...వెరసి శైలు గారికి ఓనరానీ గా ఫుల్లు క్రెడిటు...అప్పు గురించి చెప్పేదేముంది...యీ మధ్యే ఒక బ్లాగరు పుణ్యమాని మంచమ్మాయ్ ప్రోగ్రాం ఒకటి డవును లోడ్ చేసి చూసా..ఆ లెవెల్ కి తగ్గకుండా మన అప్పు చక్కగా మ్యానేజ్ చేసింది.ఆ మాటకొస్తే నాకు మన అప్పు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది.ఇంక యే ప్రోగ్రాం చేసినా ఆంకరింగు అప్పుకే.
చివరాఖరిగా..మా కిరణ్ పిచ్చి చూపులు హై లైట్.
నవంబరులో పుట్టినవాళ్ళందరూ మేధావులవుతారంటలే.!!!బులుసు గారు చెప్పారు.! చిన్నారి వెన్నెల మరిన్ని పుట్టిన రోజులు , తుంటర్వ్యూలు జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
ఎన్నెల
autograph please
భలే డిఫరెంట్ గా రాసావ్ కిరణ్ ;) ఎంతైనా నా ట్రైనింగ్ కదా :))) ఇలాగే నా సలహాలు-సూచనలు తీసుకుంటూ.... నీ వెన్నెల బ్లాగు..... ఎప్పుడు పున్నమివెన్నెలలాగే వెలుగులు చిమ్ముతూ ఉండాలని కోరుకుంటున్నా! అలాగే....అప్పు ఏంకరింగు,రాజు ఫొటొగ్రఫీ సూపరూ...సరే కాని.. నీకు స్క్రిప్టు, డిలాగులు, కొషెన్లు, ఆన్సర్లు రాసిచ్చాను కదా! మరి నాకేంటి? అదే తాయిలం..అదే మరీఇ మరీ చాకోలు అలా అన్నమాట :D అయినా పుట్టినరోజని ఇంత చేసావే... ఒక్క చాక్లెట్ ముక్క పెట్టావా? శివ కి చెప్తా ఆగు :))
హప్పి హాప్పి బర్త్డే టు మై డియర్ వెన్నెల :)
అమ్మయ్య మొన్నటి నుంచి చూస్తున్నా ఈ రోజు మొత్తం చదివేసా తీరిగ్గా :))) భలే ఉంది కిరణ్ !
ఏదో ఒక రోజు ఇలాగే వెన్నెల గురించి నిజం గా టీవీ లో మాట్లడతావ్ కిరణ్ మాట్లడతావ్ :)))
Birthday to cute Vennela :)
నీ 'వెన్నెల' కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
పోస్ట్ చాలా బావుంది.
కిరణ్ నాకు చెల్లెళ్ళు లేని లోటు తీర్చేసింది.
ఒక్క రోజు కనబడకపోతే అంటే చాట్ లో ఉన్నావా అని అడిగేస్తుంది.
అట్లతద్ది రోజు పిల్ల! నీ కోసం కూడా పూజ చేస్తున్న ఏమి తినకు...ఫలానా టైం లో దణ్ణం పెట్టుకో...ఇట్లా ఏదో ఒకటి నేను చెప్తూ ఉంటాను.
పాపం చేసేస్తుంది.
కొంచం భయం...భక్తీ ( అక్క అన్న ఫీలింగ్ తో ) ఉన్నాయి...( అంటే నేను అలా అనుకుంటూ ఉంటాను.)
కిరణ్ బ్లాగ్ ఇలాంటివి ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని, తను ఎప్పుడు ఇలా నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలని అక్కగా కోరుకుంటూ..
నిజంగా నాకు ఛానల్ ఉంటె తప్పకుండ తన బ్లాగ్ గురించి ఇంటర్వ్యూ తప్పకుండా చేసేదాన్ని.
రాజ్, వంశి, ఇందు, అప్పులకి కూడా ఈ సందర్భంగా థాంక్స్ ..
వెన్నెలకి జన్మదిన శుభాకాంక్షలు కిరణ్ గారూ..ఆలస్యంగా చెప్తున్నానని అనుకోకండి మీ పరిచయ భాగ్యం ఇప్పుడేగా కలిగింది.
హహ్హాహ్హ కిరణ...సూపర్ పోస్ట్. excellent idea....హమ్మ ఆద్యంతం నవ్వుతూనే ఉన్నాను...కొత్తరకంగా బావుంది :)
యాపీ యపీ బత్తడే టు వెన్నెల. ...ఇలాగే మరిన్ని చిరునవ్వుల కిరణాలు కురిపించాలని కోరుకుంటున్నాను.
నాగార్జున - grrrrrrrrr..
Thank u వేరి ముచ్ :)
రాజ్ - నువ్వు కేక కదా....ఫోటో భలే వచ్చింది లే :)
Thank u so much :)
మధుర - థాంక్స్ డియర్ :)
భాస్కర్ గారు - :)))))))))))))))))
మురళి గోరు - థాంకులు :)
హర్ష - బోలెడు థాంకులు..:)..పార్టీ..కాంటాక్ట్ బంతి :)
లలిత గారు - ధన్యవాదాలు :)
వంశీ - నీకసలు నేనంటే భయం లేకుండా పోతోంది ......అసలు న వెన్నెలకు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు కానీ...పార్టీ మాత్రం అడుగుతున్నావ్..:(
సునీత గారు - హహహః...వీక్షించినందుకు ధన్యవాదాలు :)...యప్పీ యప్పీ బర్త్డే చెప్పినందుకు థాంకులు :)
రాధా గారు - మీకు బోలెడు తన్క్సులు..మీకు బ్లాగ్ ఉంటె దాని లింక్ ఇటు ఇవ్వండి...:)..చాల రోజులనుండి అడుగుదాం అనుకుంటూ మరచిపోతున్న :)
ఎం చేద్దాం..బిజీ అయిపోతున్న :ప
బులుసు గారు - థాంకులు :) థాంకులు :)
భారతీయ గారు - థాంక్స్ :)
జ్యోతి గారు, మాలా కుమార్ గారు - బోలెడు ధన్యవాదాలు :)
బుజ్జాయ్..థాంక్సు :)
ఎన్నెలమ్మ :)))))))))...మీ ఆశీర్వాదం ఉంది గా..చాలు చాలు... :)
అవును...మీ ఎన్నెల..నా వెన్నెల రెండు ఇద్దరి మేధావుల చేత నడప బడుతున్నాయి..:)
రూప - అలాగే వచ్చేయి..బెంగుళూరు..:)
ఇందు అవునవును ...అంతా నీ ట్రైనింగ్ ఏ :)..Thank u very much :)
నీకు నేనే ఊ పెద్ద గిఫ్ట్...సరే ఏడుస్తావ్ అని..ఓ చాకి :)
శ్రావ్య గారు - :D :D ...
ఓపిక,వీలు చూసుకుని మొత్తం చదివినందుకు థాంకులు :)
kevvvvvvvvvvvvvvvvvvvv--టీవీ లో నా..అంతా మీ అభిమానం :D
బుజ్జాయ్..థాంక్సు :)
ఎన్నెలమ్మ :)))))))))...మీ ఆశీర్వాదం ఉంది గా..చాలు చాలు... :)
అవును...మీ ఎన్నెల..నా వెన్నెల రెండు ఇద్దరి మేధావుల చేత నడప బడుతున్నాయి..:)
రూప - అలాగే వచ్చేయి..బెంగుళూరు..:)
ఇందు అవునవును ...అంతా నీ ట్రైనింగ్ ఏ :)..Thank u very much :)
నీకు నేనే ఊ పెద్ద గిఫ్ట్...సరే ఏడుస్తావ్ అని..ఓ చాకి :)
శ్రావ్య గారు - :D :D ...
ఓపిక,వీలు చూసుకుని మొత్తం చదివినందుకు థాంకులు :)
kevvvvvvvvvvvvvvvvvvvv--టీవీ లో నా..అంతా మీ అభిమానం :D
శైలుఊఊఊఊఉ ---థాంక్ఊఊఊఊఊఊఊఊఊఊఉ :)
( అంటే నేను అలా అనుకుంటూ ఉంటాను.) - కికికికికికికికి - అనుకో...
సరే కానీ..కష్టపడి పోస్ట్ రాస్తే వాళ్ళందరికీ నువ్వు థాంక్స్ ఎందుకు చెప్పావు??
జ్యోతిర్మయి గారు - :D ..thank u so much :)
నా పుట్టిన రోజున మీరు కలిసారు కాబట్టి...తప్పక గుర్తు పెట్టుకుంట :)
గురుజీ -- ధన్యవాదములు :)
వెన్నెల కి పుట్టిన రోజు శుభాకాంక్షలు
కిరణ్ అన్నయ్య బొమ్మలు ఇంకా బాగా వెయ్యాలి
వెన్నెలకి పుట్టినరోజు శుభాకాంక్షలు...చాలా ఆలీశం గా చెప్తున్నాని ఏమీ అనుకోకండీ...మళ్ళీ పుట్టినరోజు వచ్చేదాక చెప్పొచ్చు చిన్న పిల్లే కదా... :D
మీ creativity చాలా బావుంది...
మీరు వేసిన బొమ్మ ఇంకా బోల్డు బావుంది...
Post a Comment