మా పాపా పేరు అనన్య
ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను
దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో వేశాం.. స్కూల్ అలవాటు అవుతుందని ... మొదట్లో బానే వెళ్ళేది ... కొన్ని రోజులయ్యాక శోకాలు మొదలు పెట్టేది ..ఇంటి నుండి స్కూల్ వరకు ..ఒక కిలోమీటర్ దూరం అంతే .. మధ్యలో ఒక కిరాణా కొట్టు ఉండేది ..అక్కడికి వచ్చాక రాగం ఇంకా పెరిగేది ...ఆ కొట్లో కూర్చునే పెద్దాయన అప్పుడే స్కూల్ ఎందుకు తల్లి దానికి అనేవాడు ...ఇది ఇంకా ట్యూన్ తో కూడిన రాగం పెంచేది... రోజూ ... పొద్దున్న దీన్ని దింపి నేను ఆఫీస్ కి వెళ్లి ఒక కప్ టీ తాగే లోపల నాకు మా అత్తగారి నుండి ఫోన్ వచ్ఛేది ...ఇంటికి తీస్కొచ్చేశానమ్మా ... నువ్వు కంగారు పడకు అని ... 9 నుండి 11 వరకు స్కూల్ ... ఈ రెండు గంటలకి అంత సీన్ చేసేసేది ...సాయంత్రం వచ్చి పొద్దున్న ఎందుకు ఏడ్చావు చిట్టి తల్లి... అంటే ..అసలు దాన్ని కాదు అన్నట్టు .... ఉరికేలే అని బొంగురు గొంతుకేసుకొని చెప్పేది .. మా నాన్నకి వీడియో కాల్ చేసి కంప్లైంట్ చెప్పేది... ఆ షాప్ లో తాత కూడా స్కూల్ వద్దన్నాడు తాతా ...అమ్మే పంపుతోంది అని.. !
***
ఇంకో ఏడాది అయ్యాక స్కూల్ బస్సు ఎక్కి వెళ్ళాలి మేడం గారు.. మిగితా అంతా బానే తయారు అవుతుంది కానీ .. షూస్ మాత్రం త్వరగా వేసుకోదు ...అనన్య ప్లీజ్ ఫాస్ట్ ..టైం అయిపోతోంది... time is running అని నేను కాలనీ మొత్తం వినిపించేలా అరుస్తుంటే...ఇది ఒక చిన్న హస్కీ voice తో ... అమ్మ అమ్మ ...నీకో జోక్ చెప్పనా అంది ...చెప్పు ..(విసుగ్గా)... అని నేనంటే - time is not running ...you are running అంది ...ఏమంటాం ...నవ్వి బస్సు ఎక్కిస్తాం !
***
పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో ఒక సారి
మేడం ..అనన్య చురుకైన పిల్ల ..మీరు కొంచెం concentrate చేయాలి .. పిల్ల మీద ..
ఏమైంది మేడం
మొన్న పోజెక్టు వర్క్ చేయలేదు ..
నేను వీకెండ్స్ అన్ని చూసి తప్పక చేయిస్తాను ... మీరు డైరీ లో కూడా రాయలేదు కదా మేడం
లేదండి పిల్లలకి చెప్పి పంపించాం ..అనన్య మీరు బిజీ ఉన్నారని మీకు కుదరదని చెప్పారని చెప్పింది
ఇంటికొచ్చి ఏంటే స్కూల్ లో ఏదో చెప్పావంట..నేను బిజీ అని
అవునమ్మా నీకు చెప్పడం మర్చిపోయా ..ఆలా చెప్తే మేడం తిడతారని ..నీ మీద చెప్పా
వా....! :(
కన్నా ఆలా అబద్దాలు చెప్పకూడదు ...నిజం చెప్పేయ్ ప్లీజ్ .. ఏం కాదు ... మేడం తిట్టరు
అబ్బా మా మేడం గురించి నీకు తెలీదు పోమ్మా .... శౌర్య ఆలా చెప్తే మా మేడం ఫుల్ గా తిట్టింది నేను అందుకే ఇలా చెప్పాను
దేవుడా !!
***
ఈ మధ్య నాకు మొక్కల పిచ్సి ఎక్కువయ్యి ... వాటి గురించి ఎక్కువ నేర్చుకుని .. ప్రయోగాలు చేస్తున్నాను
పొద్దున్నే దీన్ని స్కూల్ బస్సు దగ్గరికి దింపే దారిలో .. కన్నా ఆ పువ్వులు ఇది వరకు పూసేవి కాదు
నేను ఆ ఎప్సం సాల్ట్ .... ఫ్రూట్ fertilizers వేసాక చాల బాగా వస్తున్నాయ్ ... భలే ఉన్నాయ్ కదా
నిన్న కంపోస్టింగ్ ... ఈ రోజు ఎప్సం సాల్ట్ ఆ .. అమ్మ ... నాకెందుకమ్మా ఇవన్నీ చెప్తున్నావ్ ??
నేను హర్ట్ అనన్య హర్ట్
పర్లేదు... లే .. హర్ట్ అవ్వు ... బస్సు వస్తోంది .... నా hug నా kiss నాకిచ్చేయ్ అని తీస్కొని బస్సెక్కేసింది దొంగ మొహంది
***
అమ్మా .. కథ చెప్పు ...
సరే ... రామాయణం ?
ఓకే !
మొత్తం చెప్పాను ఏదో పని చేస్కుంటూ ...
వినింది
అమ్మా.... ఒక important ట్విస్ట్ చెప్పలేదు రామాయణం లో
ఏంటమ్మా అది ?
సూర్పనఖ అమ్మా ..అసలు ఆ సీన్ లేకుండా ...లక్ష్మణుడు ముక్కు కోయకుండా రామాయణం చెప్పేసావ్ ... ఏంటో ....
నాన్నా ...మమ్మా .... అమ్మ రామాయణం మర్చిపోయింది... నేనే బెటర్ అంతా గుర్తు పెట్టుకున్నా !
***
మొన్న ఒక రోజు ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను ...
నాతో ఆడుకో .. రా ... ప్లీజ్... అని అడిగింది
మీటింగ్ లో ఉన్నాను కన్నా ... ఇంకో 30 నిమిషాల్లో వచ్చేస్తా ..
స్క్రీన్ దగ్గరికి వచ్చి చూసి వెళ్తూ ..ఏం లేదు లే ..ఫేస్ బుక్ ఓ యూట్యూబ్ ఓ చూస్తున్నావ్ అనుకున్నా అంది
ఓసినీ ...నేనే నిన్ను ఇంత అనుమానించాను కదే !
***
ఈ కరోనా తో ఆన్లైన్ క్లాస్ లు ...
నేను దాని పక్కనే కూర్చుని వర్క్ చేస్కుంటా ...
మొన్నొక రోజు ...
అమ్మ .. నువ్వు వినవా ... నేను ఒక సారి బైటకి వెళ్లి వస్తా ...
ఎందుకే ?
బోర్ !
చితక్కొడతా ..ఇంకో 10 నిమిషాల్లో అయిపోతుంది ... కూర్చో..
ప్లీజ్ ప్లీజ్ ...నువ్వు విను... నేను వెళ్లి నీళ్లు తాగొస్తా ..
చివరికి దీని క్లాస్ లు కూడా నేనే వినాలి
***
మొన్న ఆదివారం మధ్యాహ్నం ... పాటలు వింటూ కన్నడ అక్షరాలు రాస్తోంది ...
చిన్నా ..ఆలా పాటలు వింటూ రాయాకు ... చెప్తూ రాయి గుర్తుండి పోతాయి ...
అబ్బా ... మరి నువ్వు చదువుకునే రోజుల్లో పాటలు వింటూ చదువుకున్నా అని చెప్పావా లేదా?
చెప్పాను ... బుద్ధి తక్కువై చెప్పాను ..కనీసం ఆ ear ఫోన్స్ తీసేసి బైటకి పెట్టు పాటలు అనన్య
సరే అమ్మా ..కానీ అవి ear ఫోన్స్ కావు ..head ఫోన్స్ !
***
No comments:
Post a Comment