Showing posts with label software kaburlu... Show all posts
Showing posts with label software kaburlu... Show all posts
29 December 2009
నా kochi విహార యాత్ర - 3
నా పరిస్థితి పెనం మీద నుండి వచ్చి పోయి మీద పడ్డట్టు ఐంది.. :(..తను మాట్లాడుతాడు కానీ...చాల ఎక్కువ...ఎలా అంటే...మీరు ఒక సినిమా చూస్తున్నారు...దాని dialogues కానీ ,చివరికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా వినిపించదు...అలా ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు...ఆ హీరోయిన్ ఆ సినిమా లో ఇన్ని డ్రెస్ లు మార్చింది..ఆ హీరో పెద్ద వెధవ...ఆ అమ్మాయి ని నేను ఒక సారి చార్మినార్ దగ్గర చూసాను...మొదట్లో చాల ఓపిక గ వినేదాన్ని ..తర్వాత..తర్వాత..వింటున్నట్లు నటించేదాన్ని...నా అదృష్టం బాగుండి...అక్కడ ఉండగానే అతనికి పెళ్లి కుదిరింది...పాపం ఆ పిల్ల కి బలే కోతలు కోసే వాడు...అమాయకురాలు అనిపించేది...kochi చాల చిన్న ఊరె.. ఈ రోజు ఆ actor ని చూసాం....పార్టీ కి వెళ్ళాం ఇలా అన్ని అబద్దాలే..మనిషి మంచోడే కానీ...కోతల రాయుడు...అమ్మయ్య..నన్ను వదిలేసాడు అనుకునే దాన్ని...ఒక సారి నోరు ఊర్కొక..నేనంతకు నేనే..ఎక్కడికైనా వెళ్దాం శంకర్ అన్నాను...కుదరదు లే అన్నట్లు మాట్లాడాడు...ఏంటో ఇతను అనుకున్నా..తర్వాత రోజు అంటున్నాడు..ఏమి అనుకోకు కిరణ్...నిన్ను తీసుకెళ్తే అనవసరమైన కర్చు ..అలా అని ఒక అమ్మాయి చేత కర్చు పెట్టించా లేను అని..వామ్మూ..ఇలా కూడా ఆలోచిస్తారా మనుషులు అనుకున్న..నేనే పెట్టుకుంట నా కర్చు అన్నాను...లేదు అన్నాడు..చీ ..మా నాన్నను కూడా ఇంత బతిమిలాడ లేదు అనుకుని....లైట్ తీస్కున్నాను..ఇంకో వారం వచ్చి కిరణ్ షాపింగ్ కి వెళ్దామా అన్నాడు..అయ్య బాబొఇ ఈ మనిషి తోన అనుకున్నా...సరేలే రోజంతా బోర్ కొడ్తుంది అని..వెళ్ళాను..విషయం ఏంటంటే వాళ్ళ ఆవిడకు ఏదో డ్రెస్ కొనాలి అంట...నాకు సెలక్షన్ తెలిదు అన్నాడు...సరేలే..నేను కూడా చెస్కోవచు అనుకుని...ఒక స్కిర్ట్ కొని దాని మీద టాప్ కోసం మొత్తం kochi అంత తిప్పించాను.. :) ..ఆ రోజు ఏడుపు మొహం తో నా మీద గింత కోపం ఉందా నీకు అన్నాడు....హ..హ..హ..అని గట్టిగ నవ్వేసాను...పోనిలే తెలిసింది అనుకున్నాను...అసలు అంత వెరైటీ మనిషిని నేను చుసుండను..అతను కోపం గ ఉన్నాడా..బాధ గ ఉన్నాడా...ఆనందంగా ఉన్నాడా..అని తెలుసుకోవడం చాల కష్టం.....ఒక వేల నేను research లాంటిది ఏమైనా స్టార్ట్ చేస్తే నా 1st సబ్జెక్టు శంకర్ ... :P...పొదుపు..దాని ఉపయోగాలు...డబ్బు దాని ప్రాధాన్యత లాంటి సబ్జెక్టు ల మీద అతను ఉపన్యాసాలు స్టార్ట్ చేస్తే ఇక దానికి అంతం ఉండదు..రూం లో గోల ఇలా ఉంటె..ఆఫీసు లో క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి...చాల బాగా decorate చేయడం ...competitions పెట్టడం ...gifts ఇవ్వడం..బాగా ఎంజాయ్ చేస్తున్నాం....అక్కడ అలవాటు ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక గిఫ్ట్ కొనాలి....ఒక క్రిస్మస్ త్రీ దగ్గరికి వెళ్లి కొన్ని చిట్స్ పెడతారు...అక్కడికి వెళ్లి మనం ఎం తీస్తే..అందులో ఉన్న వ్యక్తికి మనం గిఫ్ట్ ఇవ్వాలి...అందుకని ఇద్దరం కలిసి ఒక గిఫ్ట్ షాప్ కి వెళ్ళాం..ఎవడో ముక్కు మొహం తెలియనోడికి గిఫ్ట్ కొన్నావ్..మరి నాకు ఎం లేదా అన్నాడు....హా...నాకేమి అర్థం కాలేదు...అది ఒక సారి కాదు చాల సార్లు....సరే అని ఒక డైరీ కొని..ఆఫీసు నుండి వచ్హాక ఇచాను ...అప్పుడు..ఎంత మంచి దానివి కిరణ్ ..అడగంగానే ఇచావు అన్నాడు...దేవుడి creativity కి hatsoff చెప్పి..నా రూం లోకి వెళ్ళిపోయాను...తర్వాత రోజు ఆఫీసు కి వెళ్ళే దారిలో కిరణ్..ఈ రోజు ఇక్కడే దిగుదాం...సాయంత్రం అన్నాదు ..ఎందుకు అంటే నీకు నేను గిఫ్ట్ ఇస్తాను అన్నాడు ..బబొఇ..ఎందుకు అన్నాను ...నీవు నాకు ఇచావు కదా అన్నాడు...నా తల దేనికైనా బాదు కోవాలి అనిపించింది....నాకు గుర్తోచిన మొదటి వ్యక్తి వాళ్ళ ఆవిడ..పాపం అనుకున్నా...ఇంకా ఎన్ని రోజులు ర దేవుడా అనుకుమ్టూ ఆఫీసు లో అడుగు పెట్టాను...అక్కడ అందరు ఎంజాయ్ చేస్తున్నారు....భోజనం సమయానికి అందరు ఈ రోజు చాల బాగుంటాయి వంటలు...అన్ని specials ఏ అని చెప్తే...చాల రోజుల తర్వాత అనుకున్తూ వెళ్ళాం...అక్కడ వంటకాలు చుస్తే అసలు తిన బుడ్డి కావట్లేదు..అన్ని కూరగయలు ..కొబ్బరి నూనె లో ఈథ కొడ్తున్నాయి...ఏమి తీస్కోకుండా ఒక కేకు piece ,ఒక రెడ్ కలర్ లో ఉన్న juice తీస్కున్నా...కిరణ్ ఏందీ అవి తీస్కున్నావ్ అన్నాడు ఇంత లో వచ్చిన శంకర్...ఇవే కొంచం తినే లాగా ఉన్నాయి చూడటానికి అన్నాను...సరే ట్రై చేయి అంటూ వెటకారంగా నవ్వాడు...అప్పుడే అనుకున్నా ఏదో తేడా అని అప్పుడే తెల్సింది...అది నోట్లో పెట్టుకుందాం అనుకుంటుంటే ఏదో వాసనా వచ్చింది...ఏంటది అంటే wine అన్నాడు..mummyyyy ......అని స్నాక్స్ కౌంటర్ లో చుస్తే ఈ రోజు ఎప్పుడు ఉండే సమోసాలు కూడా లేవు..ఎందుకు అంటే స్పెషల్ అన్నాడు....సర్లే..క్రిస్మస్ రోజు ఉపవాసం ఉందాం..ఎలాగో శివ రాత్రికి ఉండే అలవాటు లేదు కదా అనుకున్తూ బైటికి వచ్హం ..ఇంతలో మా మేనేజర్ వచ్చి హౌ ఇస్ ఫుడ్ అన్నాడు...wonderful అన్నాను...నా వెటకారం అతనికి అర్తం ఐనట్లు ఉంది..ఒహ్హ..ఈ రోజు మీకు ఏమి నచవ్..ఇక్కడే ఒక నార్త్ ఇండియన్ restaurant ఉంది అంటే నేను శంకర్ వెళ్ళాం.....అక్కడ నేను noodles ఆర్డర్ చేశాను...ఎక్కడ మీరు అలా చూడలేరు...అంత అద్బుతంగా noodles ని కొబ్బరి నూనె తో తాయారు చేసి ముందర పెట్టాడు....గట్టిగ ఏడవాలి అనిపించింది...శంకర్ నన్ను చూసి ఏడవకు కిరణ్..ఇక్కడ నీవు నా కూతురు అంటే ఎవరైనా నమ్ముతారు..నేనేదో నీకు కొని పెట్టలేదు అనుకుంటారు ప్లీజ్ అన్నాడు..అతను ఆ మాట అనంగానే నాకు నవ్వు వచేసింది...ఇక బైటికి వచ్చి ఎన్ని రోజులో ఈ శిక్ష..దేవుడా కరుణించు అని అడిగాను...ఆఫీసు కు వెళ్ళగానే ఒక మెయిల్ ఉంది...మా అసలు మేనేజర్ నుండి..ఇక నీవు 31st కి వచేయచు అని...ఏసు ప్రభువా...ఉపవాసం ఉండాలి అనుకుంటేనే...ఇంతటి కరుణా నీకు...అందుకే నయ్య నిన్ను కరుణామయుడు అంటారు అనుకుని...సంతోష పడ్డాను ....శంకర్ కి వెళ్లి చెప్పాను...అవునా ..నది ఇంకో 2 నెలలు extend అయ్యింది అన్నాడు..హ..హ..హ..నవ్వాను..అది కాదు కానీ...నీవు వెళ్ళిపోతే ఎవరి బుర్ర తినాలి అన్నాడు......తెలిసే తింటున్నావా మహాను భావ అనుకుని...రూం లో ని గోడలకు చెప్ప కొండి మీ గోడు అంటూ రూం కి వెళ్లి అన్ని సర్దేస..కాబ్ ని పిలిచాను...ఇంకో బాగ్ extra అయ్యింది...నేను కోచి లో కొన్న చిప్స్ కి ..అది సెలవల season కాబట్టి ట్రైన్ లో రిజర్వేషన్ దొరకలా ...అందుకని బస్సు లో వెళ్ళిపోయాను...ఉఉరికి ....అంత అయ్యాక మా బ్రాంచ్ కి వచ్చి మా మేనేజర్ ని కలిసాను...ఎలా ఉంది..kochi అండ్ ట్రిప్ అంది..wonderful !! అన్నాను... ఆమెకు అంతరార్థం తెలియ లేదు...అందరు ఇప్పుడు kochi కి వెళ్లి ఎం చూసావు అంటే... మీరు అంత god 's own country ని చూస్తారు ...నేను ...గాడ్ నే చూసాను అని చెప్తూ ఉంటా.. :P
నా kochi విహార యాత్ర - 2
హమ్మయ్యా.....దిగేశను రా బాబు ట్రైన్ అనుకున్న...లోపల నుండి చూస్తే పల్లెటూరి లా ఉంది ...ఏముంది లే చిన్న స్టేషన్ ఏ కదా లాక్కున్టూ ..పాక్కున్టూ బైట పడచ్చు అనుకున్నా..దిగాక పాపం మా సర్ అదే ఆండీ మ్యానేజర్ గారు హెల్ప్ చేయనా అన్నారు...ఎప్పుడు లేని మొహమాటం ఆ రోజే గుర్తోచి ..వద్దండి థ్యాంక్ యూ అన్నాను...ఆ తర్వాత నడుస్తూ ఉంటే వస్తూనే ఉంది..బాగ్ బండ బరువు చచ్చింది ..నాకు ఇన్ని బట్టలు అవసరమా ....రోజు ఒకటే వేసుకుంటే ఎవడన్న అడిగే వాడా అని నన్ను నేను తిట్టుకుంటూ నాలుగు అడుగులు వేశాను ....చెయ్యి ఎముక విరిగి పోతుందేమో అనుకున్నా..ఇక మా సర్ గారు నా వెనకాలే రా అన్నారు...సరే అని నా కుస్తీ అయ్యాక తల పైకి ఎత్తి చూశాను..ఇంకా ఎక్కడ సర్...ఆయన వెళ్ళిపోయారు...కానీ చాలా మంది పోర్టర్ సర్ లు కనిపించారు ....ఇంకా నేను ఒకతన్ని చూసి పిలవక ముందే వచేసాడు...బహుశా..ఈ పిల్ల మాట్లాడితే పోతుంది అనుకున్నడెమో ....ఇంకా కూళి కూడా మాట్లాడలేదు...సరే లే అనుకూంటూ అతని వెనకాలే నడిచా...రెండు అడుగులు వేయగానే బ్రిడ్జ్ వచింది....అప్పుడు అనుకున్నా...ఇవి కక్కుర్తి పడి నేనే మోసుకోచుంటే ..నెక్స్ట్ డే ఆంధ్ర పేపర్ లో వెరైటీ గా నా గురించి వచేది ఇలా...కేరళ కు వెళ్ళి మరిఈ వెరైటీ గా ఆత్మ హత్యా ప్రయత్నానికి పాల్పడ్డ ఆంధ్ర యువతి అని...ఇక టీవీ వాడు....ఆత్మ హత్యా ప్రయత్నం చేయాలనుకుంటున్నార ఐతే ఈ క్లిప్పింగ్ చూడండి అని నన్ను నఆ బాగ్ లను చూపించే వాడు..ఇలా ఆలోచించుకుంటూ బ్రిడ్జ్ దిగాను ..అంతలో గుర్తోచింది మా మ్యానేజర్ నాకోసం కార్ పంపిస్తాను అన్నారు.. అప్పుడు కొంచం ఆనందం ..ఎందుకో తెల్సా...నా పేరు రాసి పట్టుకుంటాడు అని చెప్పారు...అందుకే...కానీ ఆ మలయాళం డ్రైవర్ మా కంపెనీ పేరు రాసి పట్టుకున్నాడు... :(...ఏదో ఒకటి అనుకుంటు ..వెళ్ళాను..అంతలో ఈ పోర్టర్ కి డబ్బులు ఇవ్వాలి కదా..ఎంత అని సైగలు చేస్తే...40 అని ఇంగ్లీష్ లో చెప్పాడు..ఆ తర్వాత బేరం ఆడుదమంటే..అసలు ఏ బాష రానట్లు తెగ నటించాడు...నేను కూడా...నాకు వచ్చిన అన్ని బాషలు కలిపి ఇలా అడిగాను...క్యు?....ఎదుకు అంత కాస్ట్లీ....నేను 2౦ rs . ఏ కొడ్తాను అని...వాడికి అర్థం ఐంది బాగా..ఇది ఒక టింగరిది ...అని..అందుకే...వాడు దిగలేదు ....నేను వదిలేసా...పై వాడు చుస్కుంటాడు లే అని ..ఆ కార్ డ్రైవర్ కూడా సపోర్ట్ చేయలేదు...వాళ్ళు అంతే అమ్మ అన్నాడు...సరే అని...నన్ను హోటల్ దగ్గరికి తీసుకెళ్ళాడు...అక్కడ 200 డిమాండ్ చేసాడు...అప్పుడు అర్థమైంది ఆ పోర్టర్ ని ఎందుకు సపోర్ట్ చేసాడో ....ఆ హోటల్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాను...నా పేరు ,నా కంపెనీ చెప్పను...హూ..మీరా...సింగ్లె రూమ్స్ లేవు మేడం..సారీ..ఒక 2 రోజులు సర్దుకొండి ఇక్కడే...మల్లి వేరే రూం కి మారుస్తా అన్నాడు...సరే..ఇప్పుడు ఎన్ని గదులది ఉంది అంటే..౩ BHK ఫ్లాట్ ఉంది అన్నాడు....అప్పుడు ఏడవాలో ..నవ్వాలో తెలియలేదు..ఒక్క దాన్నే..అంత పెద్ద దాంట్లో నా...??..సరే ఇంకా చేసేదేమీ లేక..సరే అన్నాను..అతను బొయ్ ని పిలిచి మేడం కి దారి చూపించు అన్నాడు..అతని వెంటే వెల్ల...డోర్ తెరవగానే...నాకు అది ఒక పెద్ద బంగల లాగా కనిపించింది.. ..అతను..ఒక మూలకి లగెజి పెట్టి..ఈ గది ఒక్కటే వాడుకోండి అన్నాడు..సరే అన్నాను..వెళ్ళే అప్పుడు... ఎమన్నా కావాలంటే బుజ్జర్ నొక్కండి..వస్తాము అన్నాడు..సరే అన్నాను...అతను బైటికి వెళ్ళాడు..తలుపు వేసుకుని...వెనక్కి తిరిగా,,అంతలోనే గుర్తోచింది...టీ తాగాలి అని.. వెంటనే బుజ్జర్ ప్రెస్ చేశా..ఇందాక వచ్చిన అతనే వచాడు...సీరియస్ గ చూసాడు..ఇందాకే చెపచు కదా అన్నట్లు...కాఫీ...అండ్ హాట్ వాటర్ అన్నాను..సరే అని వెళ్లి ఒక పది నిముషాలు అయ్యాక వచాడు...ఇంతలో..నేను బంగల ని సందర్శిస్తున్న..వచాయి కాఫీ..ఇంకా వేడి నీళ్ళు...ఇచేసి..వెళ్ళేటప్పుడు మల్లి..ఇంకో సారి ఆ ఒక్క రూం ఏ అన్నాడు..నాకు చాల కోపం వచ్చింది....తెలుగు లో తిట్టిన ఉపయోగం ఉండదు అని..ఓ.కే...అని కోపం గ చెప్పను...నాకు ఆ ఒక్క గదే చాల పెద్దది గ ఉంటె,..ఇంకో ౩ గదులు ఎం చేస్కోను...????...తయారయ్యాక...మా కంపెనీ కాబ్ కోసం వెయిట్ చెస్తూ ఉన్న..ఇంత లోపల కాల్ వచ్చింది..శంకర్ ఏమో అనుకున్న...చుస్తే మా మేనేజర్...హెలో ఎక్కడున్నావ్ అన్నాడు?...కాబ్ కోసం వెయిట్ చేస్తున్న నఒటే..wonderful అనడు...బాబోయ్ ...ఇది కూడా ఒక వింతేనా అనుకుని...సి యౌ సూన్ అంటూ పెట్టేస్సా..ఇంతలో కాబ్ వచ్చింది..ఆఫీసు కి వెళ్ళాను...అదొక పెద్దా బూత్ బంగల...నిజం...ఎటు వెళ్తే ఏమి వస్తుందో కనుక్కోడానికి నాకు ౩ వారలు పట్టింది...అంటే మూడొ వారం తర్వాత నేను అక్కడ లేననుకోండి... శంకర్ వచ్చి లోపలి కి తీసుకెళ్ళాడు..మా మేనేజర్ ని పరిచయం చేసాడు...wonderful...had ur breakfast అన్నాడు..నో ..అంటే..మీ ఆంధ్ర ఫ్రెండ్ హెల్ప్ చేస్తాడు లే అంటూ శంకర్ ని చూపించాడు..ఇంతకి శంకర్ ఎవరో చెప్పలేదు కదా..ఇతను మా బ్రాంచ్ నుండే ఒక నెల ముందు kochi కి వచ్చిన అతను..అప్పుడు నేను తెగ నవ్వాను...ఆ బాష మీకు కరెక్ట్ అని...ఆ రోజు నా భవిష్యతు తెలిదు కదా మరి.. ఇతను చాల కామెడీ...ఒక రోజు నేను కాల్ చేసి టిఫిన్ అయిందా అంటే..ఆ ఐంది..వాడు ఏందో..గింత కొబ్బరి గిన్న లో..గింత కొబ్బరి నునే తో చేసిన ఇడ్లి లు..పెట్టి..గింత కొబ్బరి చట్నీ వేసిండు అoటు ఏడుపు గొంతు తో చెప్పాడు....ఆ రోజు నేను పగల బడి నవ్వాను.....ఈ రోజు నన్ను చూసి తను అంత కంటే 2 రెట్లు ఎక్కువ ఆనంద పడ్డాడు ...టైం బాబు టైం అనుకున్న...ఆ ఆఫీసు ఆ మనుషులు...నాకు అంత వింత గానే తోచేవి...నా సీట్ నాకు చూపించక..నా సిస్టం కి ఏదో ప్రోబెలం వస్తే నెట్వర్క్ డిపార్టుమెంటు కి కాల్ చేశా...అటు సైడ్ నితిన్ ఒండు అన్నారు..హా...వాట్ అన్నాను...సారీ మేడం ...ఆర్ u న్యూ to థిస్ లొకేషన్ అన్నాడు......నాకు తెలుగు ,ఇంగ్లీష్ తప్ప ఏ బాష రాదు అని చెప్పలేక....ఎస్ అన్నాను...అతనే కాదు..అక్కడ ఏ ఎక్స్టెన్షన్ కి కాల్ చేసిన అంతే మలయాళం లో పలకరింపులు...1st డే మీటింగ్ అంటే వెళ్ళాను..మా టీం లో వాళ్ళకి నన్ను పరిచయం చేసి తన తో ఇంగ్లీష్ లో మాట్లాడండి....especially ప్రాజెక్ట్ discussions అప్పుడు అని టీం కి చెప్పక...తను ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం మొదలు పెట్టాడు..మా మేనేజర్...అంత చెప్పేసి నన్ను చూసి....sorryy...మలయాళం లో చెప్పను అంత....నీ సంగతి మర్చిపోయా అన్నాడు...నీవైన గుర్తు చేయచు కదా అన్నాడు..ఏంటి చేసేది.....అనుకుని...ఐన ఆఫీసు లో మాతృ బాష మీద ప్రేమను చూపించడం మీ దగ్గర నుండి నేర్చుకోవాలి అనుకున్నా..ఇది మన తెలుగు వాళ్ళకి నేర్పియాలి అనుకున్న..ఇది నిజంగా నిజం..ఎమన్నా అనుకోండి...మా ఆఫీసు లో తెలుగు వాళ్ళు మాత్రం ..హిందీ,ఇంగ్లీష్ రాక పొఇన కష్ట పడి మాట్లాడుతారు కానీ....తెలుగు లో మాట్లాడటానికి ఆలోచిస్తారు....వింత జనాలు ...ఆఫీసు లో ఇలా తిక్క తిక్క గ ఉంటె ..ఇక ఆ హోటల్ రూం కి వెళ్ళాక ....చుక్కలు కనిపిస్తాయి ....అన్ని మలయాళం చానల్స్ ఏ .. తెలుగు ఒక్క DD8 మాత్రమే వస్తుంది..ఒక రోజు చూదం అని కూర్చున్న....టాప్ 10 సాంగ్స్ అన్నాడు...అబ్బూ...చూసేద్దాం లే అనుకున్న....టాప్ 10 సాంగ్ N .T .R 1st సినిమా ధీ ...టాప్ 1 సాంగ్ A .N .R . 1st సినిమా డి ...బాబొఇ ఏడవాలి అనిపించింది..ధైర్యంగా ఉండు కిరణ్ అని మనసులో అనుకుని...పక్క ఛానల్ తిప్పాను..అది DD8ఉర్దూ...నాకు బుదీ లేదు అనుకుని టీవీ ఆఫ్ చేసి...కాస్త బైట గాలి పీలుడ్డం అని బాల్కనీ లో నిల్చున్న....ఎవరో ఒక ఆంటీ మలయాళం లో పలకరించింది...పేరు అడిగింది అది అర్థమైంది...కిరణ్ అని చెప్పను..ఇక ఆ బాష లో నే మాట్లాడటం స్టార్ట్ చేసింది...సారీ ఐ డోంట్ నో మలయాళం అన్నాను...ఒహ్హ్హ...అని నవ్వింది...ఏంటి కేరళ ట్రిప్ ఆ?మమ్మీ వాళ్ళు ఎక్కడ? బైటికి వెళ్ళరా అని అడిగింది...చీఈఈ...థూఊఉ....అని నన్ను నేను తిట్టుకుని....ఎస్ అని ఒక నవ్వు నవ్వి లోపలి కి వెళ్లి...కిరణ్ ఓపిక గ ఉండు అని అనుకుని....మల్లి టీవీ పెట్టాను ..హిందీ reality shows చుస్తూ ఉన్న..అంత లో శంకర్ కాల్ చేసి మన కంపెనీ గెస్ట్ హౌస్ కాలి అవ్తోంది..ఇక్కడికి వచేయండి...మాట్లాడటానికి మనుషులు ఉన్నారు...అంతే కాకా టాటా sky ఉంది అన్ని తెలుగు మంచి చానల్స్ వస్తాయి అన్నాడు....తరువాత రోజు ఆఫీసు కి వెళ్ళగానే ఆ డిపార్టుమెంటు కి కాల్ చేసి నన్ను షిఫ్ట్ చేయండి..కాలి ఐంది అని తెల్సింది అన్నాను..సరే మేడం ...you can గో టుడే ఇవేనింగ్ అన్నాడు...సరే అని నేను కాబ్ బుక్ చేస్కుందాం అనుకునే లోపు..శంకర్ వచ్చి వాడి మొహనికి 200వందలు ఎందుకు కిరణ్ నేను ఉన్నాను కదా అన్నాడు....వద్దు లెండి మీకు ఎందుకు శ్రమ..ఐన అక్కడి నుండి ఆటో లో రావాలంటే మల్లి ఒక కిలోమీటర్ ఆ luggage ని మోస్కుని రవళి అంటే..ఎం పర్లేదు..నేనున్నా కదా అన్నాడు...సరే అన్నాను....వెళ్లి లగేజి తీస్కుని..రూం కాలి చేసి బైటికి వచ్చాం ...తను చిన్న ఎయిర్ బాగ్ చేతిలో పట్టుకుని ర కిరణ్ అన్నాడు...ఇప్పుడు నేను ఈ సూట్ కేసు మోయలా...mummyy...అని ఏడుపు మొహం పెట్టి...అతనిని ఏమి అనలేక..పదండి అన్నాను..అదృష్టం ఎక్కువయ్యి....ఒక్క ఆటో కూడా హోటల్ ముందర లేదు...ఇప్పుడు 1.5 కిలోమీటర్ నడవాలి...బబొఈ...తను తొందర తొందరగా నదుస్థూ..అంత మెల్లిగా ఏందీ కిరణ్...తొందరగా రా అన్నాడు..ఆ ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటె చాచే వాళ్ళు...వస్తున్నా అని చెప్పి ...నడిచా... ఒక ఆటో కనిపించింది...అతను 70 అంటే..శంకర్ 50 అంటదు...అలా 2 ఆటో లు పోయాక...ఇంకొక ఆటో వచ్చింది...100 అన్నాడు..వెళ్ళిపో అంటే...ఇది ఉరి అవతల ఉంది..ఇంకొక ఆటో కోసం ఎదురు చుస్తే కష్టం అని ఏదేదో చెప్పాడు..సరే అని ఎక్కాము ..ముందు ఆటో ఎక్కుంటే ౩౦ రూపాయలు మిగిలేవి కిరణ్ అన్నాడు...పోనిలే ఇప్పటికైనా తెల్సింది అనుకుని...ఉర్కే ఉన్న...చివరికి గెస్ట్ హౌస్ చేరం..అది చాల బాగుంది...భోజనం కూడా ఒక నార్త్ ఇండియన్ చేస్తాడు...కాబట్టి పర్లేదు...ఆ హోటల్ లో మాట్లాడే వాళ్ళు లేక నేను ఏడిస్తే...ఇక్కడ ఎక్కువై ఏడుపొస్తుంది...ఆ శంకర్ ఒక్క నిమిషం ఉఉర్కే ఉండదు...ఇక్కడి కష్టాలు చెపుతా మీకు... వచ్చే
టపా లో
టపా లో
3 November 2009
నా kochi విహార యాత్ర -1
నిజంగా చెప్పాలంటే ఆ ప్రయాణానికి ఏమి పేరు పెట్టాలో కూడా తెలీదు …మొత్తం చదివాకా దీన్ని ఏమంటారో మీరే చెప్పండి …
అనగనగా ఒక బెంచ్ లో ఉన్న రోజు ..అన్నట్లు ..చెప్పాలి కదూ. .బెంచ్ లో అంటే ….నేను ఒక software ఉద్యోగిని …
చేరి 3 నెలలు అయింది ..కానీ మేనేజర్ చెప్పే చిన్న పనులు చేయటమే కానీ ఒక ప్రాజెక్ట్ కి ఎప్పుడు పని చేయలేదు..
మా ఫ్రెండ్స్ అంతా ఏమో వెళ్లి అడుగు అంటారు ….మా మేనేజర్ ఏమో ఏమైనా వస్తే నీకే 1st ఇప్పిస్తా అనింది ..
సరే అని ..నమ్మాను ..జీవితం ..నమ్మకం పైనే కదా నడిచేది అనుకుని …. J
సడన్ గా ఒక రోజు పిలిచి ..నీవు kochi కి వెళ్ళాలి అంది …అమ్మో …kochi కా …..అనుకుని ….అలొచిస్తూ ఉంటే …వెళ్తావా అంది …ఊఊఊఊఉ ..అని ఆమె ముందే రాగాలూ తీస్తూ ఉంటే …ఇంట్లో వాళ్ళని అడగాలా అంది ..
మళ్లి ఊఊ అని అలొచిస్తూ ఉంటే ..సరే వెళ్లి నాకు వీలైనంత తొందరగా చెప్పు ….అంది …
బైటికి వచ్చి ..కంగారు గా మా నాన్నకు కాల్ చేస్తే …హా వెళ్ళు ఏముంది అందులో ..ఎన్ని రోజులు అంటూ అడిగారు …3 వారాలు లేక నాలుగు వారాలు అన్నా …
వెళ్ళు ..అంటూ పెట్టేసారు ..బయంగా నా ఫ్రెండ్ కి కాల్ చేశాను…తనతో ఎందుకో బయంగా ఉంది ..ఇప్పటి వరకు ఎక్కడకీ వెళ్ళలేదు కదా అంటే …
నీ బొంద అందరూ మంచి గా onsite కే వెళ్తున్నారు ….నీకేంటే బాధ …..అది కూడా ౩ వారాలే కదా అని ధైర్యం చెప్పారు …
నా పాలిట ఇదే onsite అయిపోయింది అనుకుని ….వెళ్లి వెళ్తాను అన్నాను …ఓకే ..నీకు ఇది మంచి opportunity…
అక్కడికి వెళ్లి బాగా నేర్చుకో అంది …
ఏ ముహూర్తాన ఒప్పుకున్ననో కాని ….ఒక గండం తర్వాత ఇంకో గండం ..లా అయిపోయింది ….
సరే అక్కడ ఎవరితో మాట్లాడాలో ఆవిడ ఫోన్ నెంబర్ లు ఇచ్హింది …
కాల్ చేసి …హాయ్ నేను ..banaglore నుండి వస్తున్నా ….అన్నా …హోఓఒ wonderfullllllllllllllll!!!!!...అని గట్టిగ అరిచాడు …బయం వేసిన …కొంచం గుండె గట్టి చేస్కొని ..
అన్ని మాట్లాడాను ….
కంపెనీ వాళ్లే గెస్ట్ హౌస్ అన్ని provide చేస్తారు ..అని మొత్తం procedure మెయిల్ లో పంపాడు అక్కడ మేనేజర్ …
సరే ఆఫీసు లో అన్ని ముగించుకుని ….రూం కి వెళ్లి సర్దడం మొదలు పెట్టాను …..ఒక సూట్ కేసు ,ఇంకో బాగ్ తయారయ్యాయి …
అమ్మో ఇవి ఇప్పుడు నేను మోయాలా అనుకుంటూ ఉంటే ..మా రూం లో వాళ్ళు గొల్లు మని నవ్వారు ..
నీ సైజు కి తగ్గట్టు లగేజి తేసుకెల్లవె అని …..ఎన్ని తీసేసిన ….సూట్ కేసు ..బాగ్ తప్పలేదు .ఆ రోజు రాత్రంతా .అవి ఎలా మొయలోఒ అని బయపద్థూ నిద్ర పోలేదు .
తర్వాత రోజు మా మేనేజర్ పిలిచి రెడీ ఆ వెళ్ళడానికి అంటే ..hmmmm.yess అని ఒక పెద్ద స్మైల్ ఇచ్చను కానీ లోపల నా లగేజి ఏ గుర్తు వస్తోంది .
సరే అని నా ఫ్రెండ్ కి కాల్ చేసి రేపు స్టేషన్ కి వచ్చి కొంచం ఎక్కించాలి అన్నాను.. సరే అన్నాడు...అక్కడి వచ్చి..పద వెళ్దాం అన్నాడు...ఒక బాగ్ మాత్రం చేతిలోకి తీస్కొని ..ఆ సూట్ కేసు కూడా నాదే అన్నాను ..ఒక లుక్ ఇచ్చి ఆటో అన్నాడు..majestic కి వెళ్ళాక ఆ underground లో కనీసం ఈ సూట్ కేసు ని లాక్కొని రా అన్నాడు...సరే అన్నాను...దాన్ని లాగడం కూడా సరిగ్గా రాక..కింద మీద పడేసి..మొత్తం దుమ్ము దుమ్ము చేశాను...అమ్మ తల్లి ఇటివ్వు అంటూ తీస్కున్నాడు ....సరే హ్యాపీ గా నడుస్తున్న...పోర్టర్ ని చేసేసవ్ కదే అన్నట్లు చూసాడు..సరే అని మాటల్లోకి దించి..గట్టేక్కేసను..ఇక ట్రైన్ రాంగనే ఎక్కాను...మొత్తానికి ట్రైన్ ekkanu a/c coach….sleeper అన్న అయితే జనాలు మాట్లాడతారు ఆ a/c లో అందరూ ఎవరి పనులు వాళ్ళు చేస్కోవట్లేదు కాని .అలా నటిస్తున్నారు.
సరే నేనేమి తక్కువ కాదు అనట్లు నా mp3 తీసాను విందాము అని ..అది నా లగేజి మోసే టెన్షన్ లో మర్చిపోయాను దానికి ఛార్జ్ పెట్టడం .కానీ దాన్ని తీసి లోపల పెట్టలేను కంపెతిషన్ కి తీసా కదామరి ..
దాన్ని ఊర్కె అలా పెట్టుకుని ఆక్ట్ చేస్తున్న తల ఊపక పోతే పక్క నా ఉన్న వాళ్ళకి డౌట్ వస్తుందని ట్రైన్ ఊగె డైరక్షన్ లో నా తల ని కూడా ఊపెసను .మముల్గా అయితే music ని బట్టి చేస్తాం కదా .అలా అన్న మాట . చీ ఇలా నటించడం నాకు వచ్చు అని ముందే తెలిస్తే kochi కాకుండా ఏ hyd ఓ వెళ్లి సినిమా లో ట్రై చేస్కునే దాన్ని కదా అనుకుని .కిటికీ వైపు చూసాను బైట చుస్తూ కాలక్షేపం చేద్దామని .మూసెసి ఉంది L….చీఈఈఈఈఈఈఈఈఇ అనుకుని .పక్కకు తిరగా excuse me అంటూ ఒక పెద్దాయన ఒక 50 యేఅర్స్ ఉంటాయి laptop బాగ్ మాత్రమే తీస్కొని వచాడు . మేనేజర్ అని అర్థమైంది అబ్బోఒ నేను తెలివిగల దాన్ని .కేవలం మాటల వల్ల వాళ్ళు ఏంటో చెప్పేస్తున్నా అని నన్ను నేను పొగుడు కున్న . కాసేపు అయ్యాక ఆయన మాట్లాడాడు ఎక్కడన్నా వర్క్ చేస్తున్నావా అని .yes అన్నాను .gud అన్నాడు hmm..ఇప్పుడు ప్రతి ఒక్కదూ గుడ్ ఆంటాడు..
అదే ఉద్యోగం లేక పోతే క్లాసు లు పీకుతారు అనుకుంటుండంగానే .ఆయన కాళ్ళకి లగేజీ తగిలింది ఎవరది నీదే నా అన్నాడు .అవ్ను అని చెప్పా .అక్కడ పోస్టింగ్ ఆ అని అడిగాడు .లేదు deputation 3 వారాల కు అన్నాను ..లగేజీ ని ఒక సారి నన్ను ఒక సారి చూసాడు .నాకు నవు వస్తున్నా .నవ్వ లేక తల పక్కకు తిప్పాను
నాది కింద బెర్త్ ఆయన అక్కడే కుర్చుని మెయిల్స్ చెక్ చెస్కుంటూ ఉన్నాడు రాత్రి 9 అయింది .కావాలంటే పైన పడుకో అమ్మ అన్నాడు .లేదండి .నేను ఇక్కడే పడుకుంట అన్నాను సరే .కొంచం లేట్ అవ్తుంది అన్నాడు పర్లేదు అన్నాను .నేను పైకి ఎక్కుతానేమో అని చూసాడు .కానీ నేను రివర్స్ లో ఆయన పైకి ఎక్కడం కోసం ఎదురు చుస్తూ ఉన్నాను ఆపకుండా గుడ్ల గూబ లాగా ఆయన laptop వైపే చూస్తుండటం తో .లోపల తిటుకుంటూ .క్లోజ్ చేసేసాడు .తిట్టుకుంటే తిట్టుకునాడు .నా బయం నేను చెప్పుకోలేను కదా నాకు పైకి ఎక్కడం అంటే బయం అదీ కాక ఒక సారి పడుకుంటే మళ్లి మెలకువ రాదు అందులో ఎప్పుదూ వెల్లని ప్లేస్ కి వెళ్తున్న మరి ..సరే పడుకున్తున్నపుడు..అంకుల్ అని అనేసి మళ్లి బాగోదేమో అని సర్ అన్నాను..ఎస్ అన్నాడు...ఆ స్టేషన్ వచ్హాక నాకు చెప్పండి అన్నాను...ఓకే...అన్నాడు...పొద్దున్నే..ఆయనకంటే ముందే లేచి కూర్చున్న..ఒహ్.....అప్పుడే లేచావా...గుడ్...గుడ్ మార్నింగ్ అన్నాడు...గుడ్ మార్నింగ్ అంటూ స్మైల్ చేశా..స్టేషన్ వచ్చింది....మళ్లి నా లగేజీ గుర్తొచి ఏడుపు వచ్చింది...స్టేషన్ ఇంకా పది నిమిషాల్లో వస్తుంది అన్నాడు ఆయన....బాబోయ్ నా లగేజీ డోర్ దగ్గరికి లక్కేల్లటానికే నాకు గంట పద్తుందే అనుకుంటూ ఉండగా...నేను సూట్ కేసు లాకుంటూ వెళ్ళే లోపల ఆయన నా బాగ్ తీసుకోచేసరు....హ హ గమనించారా..ఇంత వరకు ఏక వచనం ఇప్పుడు మర్యాద..నేను మీ లగే మనిషిని కదండీ మరి..:p
ఇప్పుడే చేరాను కదా..కాస్త విశ్రాంతి తీసుకొని మళ్లి నా విశేషాలు చెప్తాను.. ఓకే నా??

Subscribe to:
Posts (Atom)
అనన్య చురకలు !
మా పాపా పేరు అనన్య ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...
-
తెల్లవారు జామున ఏడుకి కి అలారం మోగుతోంది ..పొద్దున్నే తొమ్మిదింటికల్లా ఆఫీసు కి వెళ్ళాలని ఎవడు కనిపెట్టాడో కానీ అని అనుకుంటూ నిద్రలేచి గ...
-
కిరణు నీకు కలలే అనుకున్నాం ..కళలు కూడా వచ్చా అనే కదా మీ సందేహం ..ఇలాంటి సందేహాలు తీర్చేద్దామనే ఈ టపా..!!ఒక ఆదివారం నాడు ఏమి...
-
నిజంగా ఇది నా బుజ్జే...దీన్ని ఇంట్లో అలాగే పిలుస్తారు..మీరు కుక్క పిల్ల అని తప్పుగా అర్థం చేస్కోకండి ...ఆడపిల్లే..అందమైన తెలివైన ఆడపిల్ల......