31 December 2011

హ...హ...హ..

హ..హా....హా....చ్...
శుభమా అని కొత్త సంవత్సరం మొదలవుతూ ఉంటే ఆ తుమ్ములేంటి...??
ఆహా ఒక్క సారికే...నాకు రోజూ తుమ్మోదయమే అవుతోంది మరి...
కర్రెస్ట్ గా అలారం మోగడం..మా రూం మేట్ హచి హచి మని తుమ్మడం....
ఈ రోజూ ఏ గండం నా ముందుందో అని భయపడుతూ నిద్రలేవడం...ఈ పిల్ల ముక్కు కోసేసి ఆ గూట్లో దాచేయాలి..ఈ చలికాలం అయ్యాక మళ్లీ ఇవ్వాలి...అనుకుంటూ..రామయ్య తండ్రి....ప్లీజ్ హెల్ప్ మీ అనడం...ఆయనేమో బిజీ గా ఉన్నా...గో టు యువర్ కిట్టి అనడం....నేను వెళ్లి..కిట్టే...అని స్టైల్ గా పిలిస్తే....ఆయనేమో ఇస్టైల్ గా చేత్తో బాబా ని చూపించడం....ఈ బాబా ఏమో ఈ మధ్య నన్ను ఎన్ని సార్లు తల్చుకున్నావే..ఇప్పుడు మాత్రం నేను కావాలా..అన్నట్లు చూడటం..సర్వసాధారణమైపోయింది...

"గాడ్..యు ఆర్ basically గుడ్ గాడ్...నా వల్ల కాదు...నేను ఆఫీసు కు పోను...."
"సరే మీ ఆంటీ దగ్గరికి పో ..నిన్న రాత్రి కారట్ కూర చేసిన మూకుడు నుండి ......ఈ రోజూ మీ అంకుల్ తాగిన కాఫీ గ్లాస్ వరకు సింకు లో ఉన్నాయి....కడిగేయి..."
"నో గాడ్...నో..."
"మరి మూసుకుని ఆఫీసు కు పో"
"నచ్చట్లేదు..గాడ్ నచ్చట్లేదు.."
"నువ్వు ఆ ఇంగ్లీష్ లో గాడ్ అని కూయడం కూడా నాకు నచ్చట్లేదు.."
"హిహి...సరే దేవుడా..నా జీవితం మార్చేయి..."
"ఎలాగా?"

"ఏ రోజూ నిద్రలేచినా అది ఆదివారం అయ్యుండాలి...
ఎప్పుడు కళ్ళు తెరిచి అలారం చూసినా అది మోగడానికి ఇంకా అరగంట సమయం ఉండాలి ..
ఒక్క ఇడ్లీ అయినా నవ్వుతూ పెట్టే హాస్టల్ owner కావాలి....
దుమ్ము లేని రోడ్ లు కావాలి....
TL లేని ప్రాజెక్ట్ ని కావాలి...
మాట్లాడలేని మేనేజర్ ని కావాలి....."

"కిరణు ఆపు..."

"ఏం దేవుడా...."

"ఊపిరి లేని కిరణ్ ని చేద్దాం అనుకుంటున్నా...!!..."

"గాడ్...!!!!"

"మరేంటి నీ కోరికలు??"
"నువ్వు మనిషివైతే తెలుస్తుంది...!!"
"ఇప్పుడేం చేయమంటావ్..."
"నన్ను దేవతను చెయ్యి..."
"ఆర్ యు sure....."
"yes ..ofcourse..."
"తథాస్తు.."
"అంటే ఇప్పుడు నేను దేవతానా....."
"అవును..నువ్వు దేవతవి...నేను మనిషిని....ఈ ఒక్క రోజూ ఆఫీసు కి సెలవ పెట్టి నా పక్కనే ఉండు..."
"అలాగే..నేను దేవత ని కదా..మా మేనేజర్ ని ఓ ఆట ఆడుకుంటా...చూడు..."
"ఆహా....కలలు కనకు..నీ PA వస్తుంది.."
దేవుడి PA : కిరణ్ దేవత....మీరు ఈ రోజూ X కి promotion లెటర్ వచ్చేలా చేయాలి...
నేను : X కి promotion ఆ ?..నో వే ...నేను ఇవ్వను..X ఏ నా మేనేజర్..
దేవుడు .. పాపా..దేవత కిరణు....ఇయ్యలమ్మా...స్క్రిప్ట్ ముందే రాసుంది....
నేను : :( :(
నేను : ఇద్దో ఆ X నిన్ను నానా మాటలు అనడానికి వస్తున్నాడు....చూసావా...కారాలు మిరియాలు టీం మొత్తం మీద రుద్దు తున్నాడు...
దేవుడు : ఏం పర్లేదు.....నేను మేనేజ్ చేస్కుంటా...
నేను : ఇన్ని రోజులు చేసిన పని కూడా గుర్తు లేదూ..
దేవుడు : ఎవరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు....నాకు నా పని ఎంతో నేర్పించింది..అది చాలు...
నేను : ఎహే నువ్వెలా ఉంటావ్ ఇలా..??
దేవుడు : సరే ఇప్పుడు ఆ గుడికి వచ్చిన భక్తుల్ని చూడు..
నేను : వింటున్నా...వింటున్నా...అన్ని దొంగ దండాలే సామి...పైగా తిట్లు కూడా....వామ్మో..
దేవుడు : చూడు మరి..నువ్వు ఒక్కరి తిట్లే...అది కూడా నీ ముందు తిడ్తే మాత్రమే తెలుస్తుంది...అది కూడా ఎప్పుడో ఓ సారి...
నేను : అవును...నాకు ఈ చెవులోద్దు..ఎన్ని కోరికలు బాబోయ్..ఒక క్షణానికి కొన్ని వేళ కోరికలు...తిట్లు...అప్పుడప్పుడు మాత్రమే పొగడ్తలు...!!
దేవుడు : ఏం తెలిసింది నీకు?
నేను : అన్నిటికన్నా మానవ జన్మ ఉత్తమం..!!
దేవుడు : కిరణు...basically u r very gud కిరణ్ :)
నేను : ఇంకా చెప్తా విను..నువ్వైనా పొగుడు నన్ను..
దేవుడు : చెప్పు..చెప్పు
నేను : మనిషికి కష్టాల్...సుఖాల్....లాభాల్..నష్టాల్..అన్ని కామన్....కానీ వాటి నుండి బైట పడే మార్గాలు కూడా బోలెడు..అయినా వాటినే పట్టుకుని వేలాడుతూ ఉంటాడు...
దేవుడు : సెబాష్..
నేను : ఇద్దో నన్ను మనిషిని చేసేయ్.....కానీ ఓ రిక్వెస్ట్..
దేవుడు : ఏంటో?
నేను : నా జాతకం మార్చేయి..
దేవుడు : ఓ అద్బుతం..దానికేం....
నేను : ఆ ..మొన్న ఒకళ్ళు ఇలాగే చెప్పారు.....ఆ మరుసటి వారం నుండి అబ్బో..జీవితం సూపరు..వాళ్ళు ఎప్పుడు కనిపిస్తారా..ఎప్పుడు కొట్టేద్దామా...అని వెయిటింగ్..
దేవుడు : వాళ్ళు అదృష్టవంతులు...నేనే ఇరుక్కుపోయనన్నమాట..
నేను : సర్లే పో...అందరి కోరికలు వినుపో..టాటా...
దేవుడు : టాటా కిరణ్...హ్యాపీ న్యూ ఇయర్..!!

మీరు వెళ్ళిపోకండి...మీకో అద్బుతమైన అవకాశం...
నా న్యూ ఇయర్ resolution ...కవితలు రాయడం......
హిహిహ్హహుఅహౌహౌఅహౌహాఅ..
ఇద్దో చదవకుండా పారిపోయారంటే..మీ బ్లాగుకొచ్చి..ఇదే కవిత కామెంట్ పెడతాను...

వస్తోంది వస్తోంది...నూతన సంవత్సరం..
పోతోంది పోతోంది....పోతున్న సంవత్సరం...(ప్రాస)
రావాలి రావాలి మీ దగ్గరికి బోలెడు సంబరం..
ఉండాలి ఉండాలి..ఆ..సంతోషం నిరంతరం.....
చెప్దాం చెప్దాం స్వాగతం మనమందరం...(మళ్లీ ప్రాస..)
(బా రాసా కదా....హిహిహిహి..)

మీరు ఏం కోరుకుంటే అవన్నీ మీ దగ్గరకు వచ్చేయాలి...అని మనస్పూర్తి గా కోరుకుంటున్నా... :D

హ..హ...హా...హ్యాపీ న్యూ ఇయర్ :D

25 December 2011

శైలు's వెన్నెల్లో గోదావరి...!!


పుస్తకం లో ఇలా కనిపిస్తోంది..బాగుంది కదా :D


ఆహా...ఒహోఒ.......నేను నిన్న 6 .40 -7 గంటల మధ్య గాలిలో తేలుతూ ఉన్నాను..!!
ఎందుకో చెప్పుకోండి...??
వెన్నెల్లో గోదావరి పుస్తకం చేతిలోకి తీస్కున్నా...
మొదట ఏం చూసానో చెప్పుకోండి....ఎలాగో కథ తెలుసు..కవర్ పేజి కూడా తెలుసు...మొత్తం బ్లాగ్ లో చూసేసా..!!
కాని నా painting ఒక బుక్ లో రావడం...అది నేను చుస్కోడం....అబ్బో..అబ్బో...అసల వద్దు లెండి..
పక్కన నా కజిన్ ఉంటే...తనని పిలిచి నా painting చూడు అని చూపెట్టాను...
తనేమో వావ్ అక్క...భలే ఉంది..!!అనింది....
మరి కథ అంతా బాగుంటేనే కదా...నాకు అలా వేయాలని అనిపించింది...ఇది నా ఫ్రెండ్ రాసింది చదువు అని చెప్పాను..!!
ఏదో buzz లో ,చాట్ లో ఓ మాట్లాడేస్కుంటాం కానీ...
ఓ సారి షాప్ లో పుస్తకం మీద ఆదెళ్ల శైలబాల అని రాసింది చూసి...ఓ.... శైలు నాకు తెల్సు..బాగా తెల్సు... అని కాస్త గర్వంగా కూడా ఫీల్ అయ్యాను...!! :D
ఇక పుస్తకం గురించి చెప్పేదేముంది......మీకందరికీ తెలిసిందే కదా...
ప్రతి line లోను ప్రేమే నిండి ఉంటుంది...కొన్ని సన్నివేశాల్లో మనల్ని మనం చూసుకోగలం ..!!
నాకు అతి ఇష్టమైన అమ్మమ్మ,తాతయ్య ల గురించి ఎంత బాగా రాసిందో...
ఇక శైలు క్యారెక్టర్ లో ఆల్మోస్ట్ సున్నితంగా ఆలోచించే ప్రతి అమ్మాయి తనను తాను పోల్చుకోగలదు....
అబ్బాయిలు ఏది పట్టించుకోనట్లు కనిపిస్తూనే అన్ని పట్టించుకుంటారు..అని ఎంతో చక్కగా కుమార్ క్యారెక్టర్ లో చూపించింది..!!
నాకు ఇంకో సారి ...ఇంకో సారి...ఇంకో సారి... చదివిన బోర్ కొట్టట్లేదు..
మొదటి సారి చదివినప్పుడు...గీజర్ ఆన్ చేసి నీళ్ళు కాగేలోపల..అసలు ఈ శైలు గారు(అప్పట్లో గారు ఉండేది లెండి :P)..ఏం రాస్తున్నారో..అంత అద్బుతమైన బాక్గ్రౌండ్ పెట్టి అని
అనుకుంటూ అని బ్లాగ్ ఓపెన్ చేశాను...ఒక అరగంట అయ్యాక మా రూం మేట్ వచ్చి..అక్క ఆంటీ కి నీ వల్ల హార్ట్ ఎటాక్ రావడం నీకు ఇష్టమా అంది..
అప్పుడు అర్థమైంది...గీజర్ గురించి మాట్లాడుతోంది అని..ఇక నేను దీన్ని మధ్యలో ఆపలేను లే అని దాన్ని ఆఫ్ చేసి...ఇక్కడ మొత్తం చదివేసాకే ..మిగితా పనులు చుస్కున్నాను..
మొదటి సారే ...అలా కట్టి పడేసింది....
ఏమో నాకు ఆ పుస్తకాన్ని వివరించేంత బాష నా దగ్గర లేదనిపిస్తోంది...కానీ ఇప్పటి కాలంవారు ప్రతి ఒక్కరు ఓ సారి ఆ పుస్తకాన్ని చదివితే బాగుంటుంది :)
కాస్త పరిచయమయ్యాక...నాకు వెన్నెల్లోకి ఒక బొమ్మ వేయచ్చు కదా కిరణ్ అంది...నేను ఏదో కాస్త ప్రయత్నించాను....
నాకు నచ్చింది నా ప్రయత్నం :)
కానీ తాను నా మీద అభిమానంతో ఆ పుస్తకం లో వేయించడమే నాకు ఓ పెద్ద ఆనందం..!!
Thank you so much sailuuuu...!!!! :D

అనన్య చురకలు !

మా పాపా పేరు అనన్య  ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను  దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...