25 April 2010

వెన్నెల్లో ఆడపిల్ల ...

ఇది ఈ రోజ ఆంద్ర  జ్యోతి పేపర్ లో వచ్చింది ...ఎందుకో నాకు చాల నచ్చింది....
ముక్యంగా ఆ లాస్ట్ లైన్స్ ..
కన్నీటి వేడికి వెన్నెల చల్ల దానం తెలియడం లేదు... తెలిస్తే అవి కన్నీళ్ళు కావు... :)

24 April 2010

వాన..

ఒక రోజు మా  office కి సెలవ ...ఎంతో ఆనందంగా ఉంది అవును.....ఎందుకో తెలుసా ¸...మా  హాస్టల్     మొత్తానికి  నాకు ఒక్క  దానికే  సెలవ...!!!హ..హ...హ......వాళ్ళు తొందరగా లేచి గబా గబా పరుగులు  పెడుతూ ఉంటే.నేను హాయి గ ఇంకా బెడ్  మీదే దొరలుతూ..నవ్వుథూ...bye చెప్పడం .వాళ్ళు  ఏడుస్తూ  ..office కి  వెళ్ళడం ..ఆహా మీకు వినడానికే ఇంత బాగుంటే..ఇక నాకో ..!! భలే భలే..ఉంది.. అసలు  విషయానికి వస్తే .. కిటికీ నుండి బైటికి చూస్తే ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది అది నా friend.. ఒంటరి గా ఉన్నపుడు  దానిని చూస్తు  దానితో కబుర్లు చెప్పడం బాగా అలవాటు...దీన్ని చూసి మొదట లో    అనుకునే దాన్ని ..ఇటు అటూ కాకుండా ఇళ్ళ మధ్య లో ఉందే ...ఏ దారిలోనో ఉంటే వఛి పొయే వారికి నీడనైన ఇచేది అని.మరి వినేసిందో ఏమో ..ఒక వరం రోజులలో అది కొంతమందికి ఆశ్రయం ఇవ్వడం స్టార్ట్ చేసింది ..!! చాల మంచిది కదా ...!! వాళ్ళు వెదురు బుట్టలు అల్లుకుంటూ ఉంటారు...ఆమె అల్లుతూ మద్య మద్య లో చెట్టుకి కట్టిన ఉయ్యాల లో తన పాపని  ఊపుతూ ఉంటుంది ..!!వీటినన్నిటినీ  గమనిస్తున్నా నేను... సడన్ గ పెద్ద గాలి ..దుమ్ము లేచాయి...ఎక్కువగా involve అయ్యి కిటికీ లోకి దూరిపోయనేమొ దుమ్ము వచ్చి కంట్లో పడింది...మొహం కడుక్కుని వచ్చే లోపు సన్నని చినుకులు ..ఇక  పాపం చెట్టు కింద వాళ్ళు వెదురు తడవ కుండా మొత్తం ఒక shed లాంటి దాని కింద పెట్టారు ..ఇక ఆవిడ ఆ పసి బిడ్డను పట్టుకుని పరుగో పరుగు ...ఆ పక్కనే ఉన్న ..ఆవు ,దూడ ..కాసేపు చూసాయి ..వాన విపరీతంగా పడడం తో అవీ పరుగులెత్తాయి ..!!నాకేమో చాల పాపం అనిపించింది ..!! మనమేమో ఇలా బిల్డింగ్ ల లో ఉండి కూడా ఏదో ఒక రోజు వానలో తడిస్తేనే తిటుకుంటూ లేక వాన వాళ్ళ పవర్ పోతేనో ...ఏదో ఒకటి సనుగుతునే ఉంటాము ..!! పసి బిడ్డ తో సహా వాళ్ళు అలా కష్టాలు పడ్తున్నారు ...మరి వాల్లెమనుకోవాలి..??...కానీ ప్రతి దానికి ఒక reason ఉంటుంది ఆ దేవుడి పనికి ...!! అప్పుడు ఒక్కటే ఒకటి అనిపించింది ..That we are blessed...!! అని

ఈ మాట నా friend కి కూడా నచినట్లుంది ...దానికి సంతోషమే ..చాల రోజులైంది వాన పడి..సో కొమ్మల్ని ఊగిస్థూ డాన్స్ చేసేసింది..

3 April 2010

Blogging...

I don't want to start with advantages and disadvantages.Just wanna pen down my thoughts of blogging....
First million thanks to my brother,who introduced me to this beautiful world,next to my friend who sent me some intresting links to follow,laugh and Njoy..!!Lat but not the least,thanks to my self who explored it much and found out very informative and attractive blogs!!! :D
                                         అసలు బ్లాగ్ start  చేసాక ఎంత addiiction వచేస్తుందో   ...అదేంటి sudden గ తెలుగు లో మొదలు పెట్టింది అనుకుంటున్నారా?? ..నా బ్లాగ్ నా ఇష్టం... :P ....yaaa ఈ స్వాతంత్ర్యం భలే ఉంటుంది..కోపం వస్తే ఇస్తమొచినట్లు తిదుతూ రాసేసుకోవచు..ఆనందం వస్తే ...పాట upload చేసుకోవచు...wow !! ఎన్ని చేసినా..అది ఎమీ అనదు..ఎంత మంచిదో  బ్లాగ్...!!!
                                     
                                         ఇక బ్లాగ్ పిచ్చి  మహాసయులు చాల మండే ఉన్నారు ..ఇది వరకు తిట్టినా ఆ జాబితా లో నేను చేరాను కాబట్టి ..ఇప్పుడు తిట్టాను...!! :)
                                           ఒక post రాసి దాన్ని 30 సార్లు నేనే చదువుకోవడం లో ఆనందం!! ఆ వెంటనే కింద comments section లో 0 comments అని ఉంటె చిన్న బుచుకోవడం ...!!..ఏంటి 30 సార్లు చదివే లోపల  ఒక్క comment కూడా రాదా అనకండి ..30 సేచావుండ్ ల   లో 30 సార్లు చదివితే..ఎలా వస్తాయి??
                            
 బ్లాగ్ వచ్హాక..చాల మంది తమ ప్రతిభను బైట పెట్ట గలుగుతున్నారు ...!!
కవితలు ,హాస్య కథలు ,paintings,ఇండియా గురించి,పురాణాల గురించి..ఒకటేంటి అన్ని రంగాల్లో...భలే భలే బ్లాగ్స్ ఉన్నాయి ..ఒకర్ని చూసి ఇంకొకరికి ఉత్సాహం ..!! నెనూ ట్రై చేస్తీ బాగుంటుంది కదా అని ..
ఇంకా కొంతమందైతే వాళ్ళు నేర్చుతున్న ప్రతి పని ని వాళ్ళ బ్లాగ్ లో పెట్టి 10 మందికి ఉపయోగ పడేలా రాస్తారు...ఎంత మంచి వారో కదా...
                                     నా దగ్గర పెద్ద blog చిట్టానే నే ఉంది...అది తొందరలో ఒక post గ పబ్లిష్ చేస్తాను...నేనైతే బోలెడు painting బ్లాగ్స్ follow అయిపోయి inspire అవుతూ  ఉంటా ..
                                   మైండ్ కి కూడా relaxation .... plus knowledge ....
                                   ఇక కామెంట్స్ నుండి వచ్చే encouragemnet భలే ఉంటుంది ...(రావన్నావ్?? )..మీ లాంటి మంచి వాళ్ళు రాస్తారు కదండీ .... :ప
 ఇదంతా మాకు తెలుసు కదా అంటారా??..పొన్లెద్దూ ఇంకో సారి తెల్సుకున్నారు....!! :)
HAPPY BLOGGING

మంచి మాటలు - శ్రీ రామకృష్ణుని పలుకులు

ఈ వాక్యాలు  శ్రీ రామ కృష్ణ పరమహంస జీవిత గాథ లోనిది..

సాధారణంగా లోకులు ఏ మార్గం లో వెళుతూ ఉంటారో ..ఆ మార్గాన్ని వదిలి  ఎవరైనా కొత్త మార్గం లో వెళితే ,లేదా భిన్న రీతి లో మరేదైనా చేస్తే -జన సామాన్యం అతణ్ణి మొదట్లో వెర్రి వాడి కింద జమ కడుతుంది ,ఎగతాళి చేస్తుంది ..అయితే ఆ వ్యక్తి ధృడ సంకల్పం తో దీక్ష గా తన గమ్యం వైపు ప్రగతి సధిస్తూ పోతే ,లోకుల అభిప్రాయం కూడా తదనుగుణంగా మారుథూ వస్తుంది.వారిలో ఆ వ్యక్తి పట్ల భక్తి గౌరవాలు పెంపొందుతాయి...


*************




చందమామ  పిల్లలందరికీ  మామ  ఐనట్లుగానే  భగవంతుడు  ఎల్లరికి  ఆత్మ  బంధువు .ఆయన్ను  ప్రార్థించే  హక్కు  అందరికి  ఉంది
హృదయ  పూర్వకంగా  ప్రార్థించే  వారికి  అయన  దర్శనమిచి  తరింప  చేస్తాడు .నువ్వు  కూడా  ఆయనను  ప్రార్థిస్తే  ,అయన  దర్శనం  పొంద  గలవు


*************


ఓ  మనిషి ! మరణించిన  వ్యక్తి  తిరిగి  రాడు ,
గడిచిపోయిన  రాత్రి  మళ్లీ  రాదు 
మానసిక  ఉద్వేగం  ఎంత  ఆవేశభరితమైనదాయినప్పటికి  మళ్లీ  అదే  రూపు  దాల్చదు
అదే  విధంగా  జీవుడు  రెండు  సార్లు  ఒక  దేహాన్ని  పొందలేడు
కనుక  గతాన్ని  ఆరాధించడం  ఆపి  ,ప్రస్తుతాన్ని  పూజించడానికి  మేము  మిమ్మల్ని  ఆహ్వానిస్తున్నాం .
గతించిన  దాని  కోసం  దుఖించడం  మాని  ప్రస్తుతానికి  పటుపదవలసింది  గ  ఆహ్వానిస్తున్నాం .
కనుమరుగైన  మార్గాలను  కనుగొనడం  లో  నే  మీ  శక్తులన్నిటి ని  వృధా  చేయక  కొత్త  గ  నిర్మిత  మైన   సమీపం  లో  ఉన్న  ఈ  విశాల  మార్గం  లో  అడుగిడమని మిమ్మల్ని   ఆహ్వానిస్తున్నాం .
బుద్దిమంతుడ ! ఈ సూచనను  స్వీకరించు ..!!

 *************


భగవంతుడి  వాకిలి  వద్ద  సహనం  తో  వేచి  ఉండాలి .అలా  సిద్ద  పడి  చేయగలిగినపుడు  మాత్రమే  విజయం  ప్రాప్తిన్చుకొవచు  


 *************


సుఖాలను  పొందడమే  మీ  ఆశక్తి గ  మీరు  ఎందుకు  పరిగణిస్తారు?
సుఖాన్ని  పొందగోరితే  దుఃఖాన్ని  కూడా  ఆహ్వానించ  వలసి  ఉంటుంది 
కనుక  నీ  స్వార్థాన్ని  ఒకింత  ఉన్నత  స్థాయికి  చేర్చి  సుఖము ,దుఃఖము  నా  గురువులు ,దేని  ద్వార  ఈ  రెండిటి  నుండి  శాశ్వత  విముక్తి  పొందగలనో  అదే  నా  యదార్థ  స్వార్థం  లేదా  జీవిత  లక్ష్యం  అని  గ్రహించు 


*************


ఓ  ష్త్రీ  మానసమా! మీరెప్పుడు  మీ  ప్రేమస్పదుని  సదా  బందించి  ‘మీ’ దానిని  గ  సొంతం  చేస్కోవాలని  కోరుకుంటారు .కించిత్తు  ఐన  స్వతంత్రతను  మీ  ప్రేమాస్పదునకు   ఇవ్వ  గోరారు .రవ్వంత  స్వతంత్రత  ఇస్తే  , ఆ  పైన  అతను  మీ  వడైనాడని  ,మీ  కంటే  అధికంగా  మరెవరినైన  ప్రేమిస్తాడని రూడి  గ   మీరు  భావిస్తారు .మీ  మానసిక  బలహీనతే  మిమ్మల్ని  అలా  భావింప  చేస్తుందని  మీకు  అవగతం  కాదు .స్వేచను ఇవ్వ  గోరని ప్రేమ  ప్రేమ  కాదని ,తనను  తను  మరచి  పోయి  ప్రేమస్పదుని  స్వేచలో ఆనందించడం  నేర్చుకుని ,నేర్చుకో  గోరని  ప్రేమ  సత్వరమే  ఇంకి  పోతుందని  మీరు  గ్రహించ  లేకున్నారు .కనుక  హృదయ  పూర్వకంగా  మీ  ప్రేమను  మరెవరికైనా   అర్పించ  గలిగితే  , ఇక  ఏ  బయము  ఉండదు .మీ  ప్రేమాస్పదుడు  ‘మీ ’ వాడి  గానే  ఉండిపోతడనే ,స్వార్థ  రహితమైన  పవిత్ర  ప్రేమ  చివరకు  మీకే  కాక  ,మీ  ప్రేమాస్పదునికి  కూడా  భగవద్దర్సనం సైతం  కలిగిస్తుందని  నిస్సందేహంగా  విశ్వసించండి 
*****************








2 April 2010

నమ్మకం

నేను శ్రీ రామ కృష్ణ పరమహంస జీవిత గాథ చదువుతున్నాను...ఆ పుస్తకం ఎంత బాగుందంటే...ఓపికుంటే ప్రతి పేజి టైపు చేసి పెట్టాలి అనిపిస్తుంది...కాని జీవితం లో ఒక్క సారైనా చదవాల్సిన పుస్తకం. అందులోని చిన్న కథ నాకు చాల నచ్చి ఇక్కడ రాస్తున్నా...

ఒకప్పుడు గోలోకంలో విష్ణువుకి నారదుని పై ఏ కారణంగానో కోపం వచ్చింది .వెంటనే నరక వాసం చేయమని నారదుణ్ణి శపించాడు .ఆ శాపం విని నారదుడు ఎంతో ఆందోళన చెందాడు .భగవంతుణ్ణి ఎన్నో విధాలుగా స్తుతించి ,ప్రసన్నం చేసుకున్నాడు .

" ప్రభూ! నరకం ఎక్కడ - ఎలా - ఎన్ని రకాలు గా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది .దయ చేసి తెలియ పరచండి " అని ప్రార్థించాడు
                            
       అప్పుడు విష్ణువు ఒక సుద్ద ముక్క తీసుకుని ,నేల మీద భూమి - స్వర్గం - నరకం చిత్రం గీసి ,ఏవేవి ఎక్కడ ఉంటాయో వివరించాడు.' ఇదయ్యా నరకం .ఇక్కడ స్వర్గం ఉంటుందయ్యా ' అని చెప్పాడు . 'అలాగా ,అయితే ఇంకేం , నేను నరక  వాసం చేసేస్తాను '  అన్టూ నారదుడు 'నరకం' బొమ్మ మీద పడి దొర్లాడు .దొర్లి పైకి లేచి ప్రణామం చేసాడు.
                                  
                                         అది చూసి విష్ణువు నవ్వి , 'ఇదేమిటి , అది నరక వాసం ఎలా అవుతున్దీ ??' అన్నాడు .
'ఎందుక్కాదు? స్వర్గ - నరకాలు నీ సృష్టే కదా ! నువ్వు గీసి చూపించి ,ఇది నరకం అన్నప్పుడు అది నిజంగానే నరకం అవుతుంది . అంతే కాదు ,నేను దాని పై దోర్లినప్పుడు నిజంగానే నేను నరక యాతన అనుభవించాను ' అని నారదుడు ప్రగాఢ విశ్వాసం తో చెప్పాడు .

                                       అతడి విశ్వాసం చూసి విష్ణువు కూడా , ' తధస్తూ   అన్నాడు . కాని భగవంతుని పైన ప్రగాఢ విశ్వాసం తో కనీసం అ బొమ్మ నరకం పైన అయినా దొరల వలసి వచ్చింది నారదుడికి
ఆ మాత్రం ప్రయత్నం చేయడం వల్లే అతడి కర్మ తీరిపాయింది .కాబట్టి భగవంతుని కృపా రాజ్యం లో సైతం పురుష ప్రయత్నానికి ,పురుష కారణానికి స్తానముందన్న విషయాన్ని గురు దేవులు ఇలాంటి కథల ద్వార అప్పుడప్పుడు తెలియ పరుస్థూ ఉండే వారు.

ఇంతటి నమ్మకం మనలో ప్రతి ఒక్కరికీ దేవుడి పై ఉంటే ఎంత బాగుంటుందో కదా !!!!

Count your blessings!!!

I started this post just to remind myself and people around me about the blessings they have overlooked and so I  will keep on adding more such Incidents which makes me feel blessed to this post.

Staring with 1st one :

On this Ugadi I went to a film in Bangalore where the roads were pretty clean and empty with awesome weather .The trees on either side of the road are green and welcoming us in every street .some trees doesn't had leaves but the flowers were dancing for the wind.I want to capture all such beautiful scenes with a camera instead of enjoying it ,just with the same mood got into a bus.. which had lots of scope to see the weather and enjoy.... the very next moment a blind person has come and just sat opposite to me,then i realized that I am blessed to see this weather and nature with my own eyes .....


*** WE R BLESSED ***

అనన్య చురకలు !

మా పాపా పేరు అనన్య  ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను  దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...