31 December 2010

Happy new year..!!

అప్పుడే 2011 వచ్చెసిందండీ..

మొన్నే కదా..2010 వచ్చింది.. :P

అందరికి ఇలాగే అనిపిస్తోంది కదా..!! :D

ఒక సంవతసరం గడిచిపోయింది..!!

ఎం సాధించావ్???..అయ్యో రోజు టైం కి తినడం …నిద్ర పోవడం…క్రమం తప్పకుండ చెసానండీ.. ..:p

ఇవి కాకుండా…!! Hmnnnn…..

గుర్తోచ్చేసాయి…!!

ఈ సంవత్సరం ఎప్పటి నుండో నేర్చుకోవాలి అనుకున్న భగవద్గీత నేర్చేసుకోడం మొదలు పెట్టేస....!!

ఇంకా దగ్గరుండి ఒక బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి,మా అన్నయ్య పెళ్లి జరిపించా..!! :)

జీవితం లో ఎప్పటికి నేను భరించలేను అని అనుకున్నవి..భరించాల్సి వచ్చింది..!!

అంటే నా పై నాకున్న నమ్మకం..,ఇష్టం..,ప్రేమ మరింత పెరిగాయి..!! :)

ధైర్యం,సహనం కూడా ..!!..

నన్ను నేను నమ్మ లేదు కొన్ని రోజులు…!!

అంటే మనిషి గా నేను ఎదిగాను అనే కదా..!! :D

అంటే ఇక్కడ మీకు కొన్ని డౌట్ లు రావచ్చు..…

మరి ఈ ఇయర్ లో ఏమి అనుకోవా..!!??...ఎదిగావ్ అని ఊరుకుంటావా అని..??

అల...ఎలా..??అన్ని direction ల లోను ఎదగాలి కదా.. :P

ఏది అనుకున్న ..అనుకోక పోయిన…ఒక 10 సంవత్సరాల నుండి…ఒకటి అనుకుంటున్నా…లావు కావాలి అని…

సో ఈ సారి కూడా అదే నా లిస్టు…లో మొదటి resolution..!! :P

అందరి జీవితం లో ను.ఎలాంటి పరిస్థితి వచ్చిన..వెళ్ళిపోయినా…!!సంతోషం మాత్రం ఎప్పుడు మీ దగరే ఉండాలి అని కోరుకుంటున్న… :D..

ప్రతి ఒక్కరికి ఒక గుర్తుండిపోయే సంవత్సరంగా..ప్రతి రోజు ఆనందం తో నిండి పోవాలి..!!

హ్యాపీ న్యూ ఇయర్..!! :D

21 December 2010

అమ్మమ్మ...ఐ మిస్ యు ...

అమ్మమ్మ..అప్పుడే ఒక సంవత్సరం అయిపోయింది..అమ్మ చెప్పి..అమ్మమ్మకు బాలేదు..అని...

ఆ రోజు నేను నీకు వెంటనే ఫోన్ చేస్తే...తాతయ్య..గొంతు లో నీరసం...

అమ్మమ్మకివ్వండి..అంటే....
పడుకుందమ్మ..లేచిన ఎవరితో మాట్లాడట్లేదు...నీరసంగా ఉంది అంటోంది...

ఏంటి..???అమ్మమ్మకు నీరసమా??..కనీసం మాట్లాడలేనంత...:(..

ఎప్పుడు ఇలా లేదే..

తను అందరి లాగా జలుబు కే ఆరు రోజులు రెస్ట్ తీసుకునే టైపు కాదు..

మనోధైర్యానికి...,ఓర్పుకి ప్రతి రూపం మా అమ్మమ్మ..!!

ఎంతో కంగారు వేసింది....వెంటనే నా గొంతు వణికి..నా ఫ్రండ్ కి ఫోన్ చేస్తే..

ఏం కాదు లే పెద్ద వాళ్ళు కదా..ఇవంతా మాములే..అని తను..

నేనేమో..లేదు..మా అమ్మమ్మ అందరి పెద్ద వాళ్ళలా కాదు...అని చెప్పా..

శరీరం చాల పెద్దది...అంతకన్నా active గ ఉంటుంది తను.....అని ఎక్ష్ప్లైన్ చేస్తూ...క్యాలెండర్ చుస్తే..ఆ రోజు అదృష్టం కొద్ది.. thursday..

ఇక friday రేపు అంటే అదొక ఆనందం..అమ్మమ్మని చూసి రావచ్చు అని...కానీ ఇంకో పక్క దిగులు...ఎలా చుడాల్సోస్తుందో..ఎప్పుడ మంచం మీద చూడలేదే అని..

వెళ్ళాను..అమ్మమ్మను చూశాను....నాన్న కిరణు వచ్చావ....ఎంత సేపైంది..అన్నం పెట్టండే..దీనికి....కంగారు లో రాత్రి అన్నం తినిందో లేదో అంటూ పెద్దమ్మకు చెప్తోంది..

నాకు ఆ మధ్యే ఒక minor surgery జరగడం తో...ఏమ్మా..కాలు ఎలా ఉంది ఇప్పుడు...నొప్పి గ ఉందా...ప్రయాణం వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా..అని అడిగింది...తనకు అంత బాలేక పోయిన..నా గురించి అలా అడగడం తో...అమ్మమ్మ డబల్ నచ్చేసింది ఆ రోజు..!!

తర్వాత చిన్న కునుకు తీసి..కళ్ళు తెరిచి ఎప్పుడు వచ్హావ్ అంది...షాక్ తిన్నాను...ఇందాకే కదా అన్ని అడిగింది అంటూ...

అప్పుడు పిన్ని చెప్పింది..ఇది పరిస్థితి రెండు రోజుల నుండి.....కొన్ని కొన్ని గుర్తుంటాయి..కొన్ని మరచిపోతోంది అని...

మున్దువన్నీ గుర్తుంటున్నాయి..అని...ఒహో..అన్నాను...కాసేపయ్యాక లేచి అమ్మ రాలేదా అంది..అమ్మకు ఇంటికి ఎవరో వచ్చి నాతో రాలేక పోయిందని.. ఒక 5 నిమిషాల కిందే చేప్పాను...

ఐనా నిన్నే కదా వెళ్ళింది...వాళ్ళు వెల్లిపొంగనే..వచేస్తుంది లే అన్నాను...సరే అంది...నేను కనిపించినప్పుడల్లా..అమ్మ,నాన్న ఎప్పుడు వస్తారు అని అడుగుతూనే ఉంది...

నాకు అసలు ఆవిడ ను చూడడం ఎంత కష్టమైందో చెప్పలేను...కన్నీరు...వరదలు గ కారిపోయింది.....!! :(

ఆ ప్రవాహాన్ని చూసి..అమ్మమ్మ నాతో అంది కదా...ధైర్యంగా ఉండాలే...ఎందుకలా??...నన్ను చూడు అంది..దండం పెట్టి తల్లి నీకు ఉన్నంత ధైర్యం నాకు లేదు లే అన్నాను....నాకు తెల్సే....నాకు బాలేదని తెల్సినప్పటి నుండి..నువ్వు పడే కంగారు....!!...అంతలో పెద్దమ్మ వచ్చి చెప్తోంది...ఎవరొచ్చిన రాక పోయిన...నా కిరణమ్మ వస్తుంది...నన్ను చూడటానికి...ఈ వారం అందంట.. :D...

అమ్మమ్మ పక్కనే కుర్చుని తన చేత్తో ఆడుకుంటూ...తననే చూస్తూ చాల సేపు ఏడ్చాను...నాకు ఎందుకో చాల బాధ గ అనిపించింది..

నేను తను దగ్గర చదువుకుంటున్న రోజుల్లో...వాకింగ్ కి వెళ్ళే వాళ్ళం...కనీసం నా చేయి కూడా పట్టుకునేది కాదు..ఎందుకు అంటే...నువ్వేమో గాలికి ఎగిరి పోయే ల ఉంటావ్...

ఇక నేను పట్టుకుంటే...భూమి లోకే..అమ్మో మీ నాన్న వాళ్ళు గొడవ పెట్టేస్తారు.. అని నవ్వేది..

లేదు నేను strong అని...తనకు సపోర్ట్ గ మెట్లు దిగేటప్పుడు....ఎక్కేటప్పుడు..రోడ్ క్రాస్ చేసేటప్పుడు..హెల్ప్ చేసి తెగ సంబర పడిపోయే దాన్ని..

ఇంటికొచ్చాక.....నన్ను పట్టుకుని అలసి పోయావ్ అని....అన్నం ముద్దలు చేసి చేతిలో పెట్టేది...అల అయితే ఎక్కువ తింటాను....అని బోలుడు కబుర్లు చెప్తూ...!!

వద్దు అన్న వినేది..కాదు...

ఏదైనా పని కావాలి అంటే...నాయన కిరణు..నువ్వు మంచి దానివి కదూ..అంటూ మొదలు పెట్టేది.. :)

ఎం కావాలో చెప్పు అంటే..పెరట్లో కరివేపాకు కోసుకు రమ్మనో..తాతయ్యకు...పూజకు పూలు కోసుకు రమ్మనో...చెప్పేది.. :)

నేనేమో పెద్ద పిరికి దాన్ని...అమ్మమ్మ,తాతయ్య నేను ...పెద్ద ఇంట్లో..నాకంటూ ఒక గది కూడా ఉంది..కానీ ఒక్క దాన్నే అక్కడ పడుకోవాలి అంటే భయం..నెమ్మది గ వచ్చి అమ్మమ్మ పక్కన దూరే దాన్ని..

ఏమే భయమా అంటే..లేదు నాకేం భయం...ఊర్కె నీ దగ్గర పడుకోవాలి అనిపించి అనేదాన్ని...ఇక అర్థం చేస్కొని..పక్కకు జరిగేది...తన మీద చేయి వేస్తె సగం మాత్రమే కవర్ అయ్యేది..

అమ్మమ్మ నువ్వు చిన్నప్పటి నుండి ఇంతే లావా..??మరి సన్నగా ఉన్న తాతయ్య నిన్ను ఎలా పెళ్లి చేస్కున్నారు ..అంటూ రక రకాల ప్రశ్నలు వేసేదాన్ని..

మా అమ్మమ్మ నవ్వి..ఈ రోజుల్లో ఉన్నన్ని కోరికలు ఆ రోజుల్లో మా generation కి లేవే అంటూ..ఇంకో కబుర్లు ఏదో చెప్తూ ఉంటె పడుకునే దాన్ని.. :)

ఇక తన దగ్గరి నుండి వచ్చేసాక కూడా..తరచూ గానే వెళ్ళేదాన్ని...అందరు కలిసినప్పుడు....ఆ కిరణ్ ని పిలవండే..ఎక్కడో ఉంటుంది...అన్నానికి అని అంటే..

వెంటనే అమ్మమ్మ మమ్మల్నెందుకు పిలుస్తున్నారు...మేము గాలి భోంచేస్తం అని వెటకారంగా అనేది.. :)

ఇలా అన్ని తలచుకుంటుంఢగానే.. .. నిద్ర లేచి...నన్ను మంచం మీద నుండి కిందకి దింపు అంది..ఇంట్లో ఎవరు లేరు..వచ్చాక.. లేద్దువు లే అంటే...ఏమి లేపలేవ ని అడిగింది...

అసలు తన కండిషన్ ఏంటో అర్థం కాలేదు..ఇక అలా ఉంటె..హైదరాబాద్ కి తీసుకెళ్ళారు......హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు...

నేను అప్పుడు మాట్లాడిందే లాస్ట్....కానీ తను లాస్ట్ లో ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడ లేదు...

ఏదో మౌనంగా చూస్తూ ఉండేది...

మనుషులంటే ..విరక్తి కలిగిన దాని లాగా..!!

హాస్పిటల్ లో అడ్మిట్ చేసిన 2 డేస్ కే కోమా లో కి వెళ్ళిపోయింది.....ఇక ఎవరితో... మాట్లాడనే లేదు..

వెంటనే అందరం వెళ్ళాం...అక్కడికి....నేను వెళ్ళిన ఒక హాఫ్ డే కి దేవుడి దగ్గరకు వెళ్ళిపోయింది.... :(...

ఎంత భాదో... కళ్ళతో చుస్తే భరించలేము.....ఎక్కడ చుసిన pipe లే...నరకం...

చాల మంచిది.....అందరికి మంచే చేసింది..మరి ఇలా ఎందుకు బాధ అని నేను అంటే...

మా సత్య చెప్పారు..వాళ్ళకు ఇక ఈ జన్మ లో పాపాలు నెక్స్ట్ జన్మ కు క్యారీ ఫార్వర్డ్ కాకుండా....దేవుడు ఇప్పుడే పెట్టేసి..తీసుకేల్లిపోతడు...అంది..కాస్త రిలీఫ్..!!!

కానీ నాకు బాగా ఊహ వచ్హాక....అంత లవ్లీ పర్సన్ ని...నేను మిస్ చేస్కుంటాను..అని కూడా నేనెప్పుడు అనుకోలేదు..

తఃన దగ్గర వంటలు...సున్ని పిండి చేయడం ఎలాగో రాసుకుందాం అని ప్రతి సారి అనుకునేదాన్ని...కానీ కుదరలేదు..

దానికి కారణం నా లో ఉన్న ఓవర్ confidence....మా అమ్మమ్మ ఎప్పుడు నాతోనే ఉంటుంది...అని..!!స్వార్థ జీవి కదా మనిషి.. :P
మనం పెరిగేటప్పుడు...మన అమ్మలకి...అమ్మమ్మ లు ..బామ్మ లు ఎన్నెన్ని జాగ్రతలు చెప్తారో కదా...మరి అమ్మ వాళ్ళకు కూడా అప్పటికి తెలియదు కదా...!!
కాస్త పెద్దయ్యాక..బోలుడు కథలు..కబుర్లు...మన వైపే ఫుల్ సపోర్ట్..!!

కానీ ఎంత మనిషిని ప్రేమించిన...తను లేకుండా మన జీవితం మాత్రం అలా సాగిపోతూనే ఉంటుంది...ఇది ఎంతో విచిత్రంగా తోస్తుంది నాకు..!!

రెండు రోజులు ఎక్కువ సెలవలు వస్తే...అమ్మమ్మ ఇల్లు తప్ప ఏమి గుర్తు వచ్చేది కాదు నాకు...ఏం చేద్దాం......ఇప్పుడు ఆ రెండు రోజులు..సెలవలు..తన జ్ఞాపకాలు..తను నేర్పిన పాఠాలు ..తల్చుకోడానికే సరిపోవు...!!

అమ్మమ్మ..ఐ మిస్ యు సో ముచ్..... :(

18 December 2010

అన్నయ్య పెళ్లి..!! :)

మా అన్నయ్య పెళ్లి జరిగింది తెలుసా..!!మొన్న dec 16th ...:)

అన్నయ్య అంటే సొంత అన్నయ్య కాదు...అలా అని ఈ చుట్టమో కాదు...!!

ఒకే కాలేజీ లో చదువుకున్నాం...!!అంతే....!! :)

కాలేజీ ఎం నేర్పించిందో నాకు తెలిదు కానీ....

జీవితానికి సరిపోయేంత ప్రేమ పంచే నలుగురి స్నేహితులని మాత్రం ఇచ్హింది...:D....

ఆ నలుగురిలో ... ఒకడు...ఈ అన్నయ్య...అన్నయ్య..అని అలా తమాషా గ పిలవడం...మొదలు పెట్ట...

అది ఈ రోజుకి..నిజంగా అన్నయ్య ఉన్న అంత importance ఇచ్హే వాడు కాదేమో అని అనిపిస్తుంది...

నేను బాగా నచ్హక పోతే వాళ్ళకి ఏం చెప్పను..అసలు సతాయించను...:P

కానీ వీళ్ళ టైం బాలేక....అతి ఎక్కువగా నచ్చేసి..నాకు సంతోషం వచ్చిన....బాధ వచ్చిన....వీళ్ళనే హింసిస్తూ ఉండేదాన్ని..ఉంటాను...:P

తన పరిచయం అయిపొయింది కదా..!!

పెళ్ళికి...తను షాపింగ్ ఎన్ని రోజుల ముందు చేసాడో నాకు తెలిదు..నేను మాత్రం చేసానండి..ఒక నెల ముందే.. :D...!!

సాయంత్రం 6 ఇంటికి ట్రైన్..ఇక 12 నుండే పని చేయ బుద్ధి కావట్లేదు...

4 కే బయల్దేరిపోయాను.....ట్రైన్ ఎక్కాము...12 మంది...ఒకటే గోల ట్రైన్ దిగే వరకు...

కాలేజీ లో ,బైట కలిసినప్పుడు...మాములుగా కనిపిస్తారు...ఆ పెళ్లి రోజు అదేం కళ వస్తుందో...!!

అబ్బాయి ఐన సరే..అమ్మాయి ఐన సరే.....ఎంత కళగా కనిపిస్తారో...

మా అన్నని పెళ్లి బట్టల్లో చూసి మురిసిపోయా... :)..చక్కగా చంద్రుడి ల ఉన్నాడు...!! :)

పెళ్లి మొత్తం దగ్గరుండి జరిపించాను... :)..హా మరి...ఆడపడుచుని కదా..!!:P :)

ఇంత కాకా ఎందుకు పట్టానో తెల్స...నేను PG షిఫ్ట్ చేసి మా అన్న ఇంటికి షిఫ్ట్ అయిపోవాలని ప్లాన్ వేసి..మా వదిన దగ్గర పర్మిషన్ తీసేస్కున్నా..!! :P...

ఆ పై ఎన్నో నెలల తర్వాత నా ఫ్రెండ్ ని కలిసాను.. :D....!!అదే నులుగు ఉన్నారు అని చెప్పా కదా...ఒకడు మాత్రం బెంగుళూరు లో ఉండడు...వాడిని...

సో ఆల్ వాస్ వెల్ అనమాట...!!

మా అన్న వదిన హ్యాపీ గ ఉండాలని...అందరు దీవించెసి విషెస్ చెప్పేయండి.. :).

10 December 2010

నేను watch కొనుక్కున్నా .. కదా …!!! :)

ఎన్ని లక్షలు పెట్టి ??

అబ్బ ..ఆశ ..అంత కరీదైనదైతే మీకు ఎందుకు చెప్తాను ..కొట్టేస్తారు కదా …. :P

:Pమాములు watch ఏ …

మరి ఇన్ని రోజులు watch లేదా నీకు …??

లేదు కదా .. :(

అప్పుడెప్పుడో ….ఒక watch ఉండేది ..దానికి పైన బోలెడు రంగు రంగుల rings ఉండేవి ..ఏ డ్రెస్ వేసుకేలితే ఆ రంగు పెట్టుకోవచ్చు …

అది chain టైపు ….లింక్ లు తీయించి ..తీయించి …అటు ఒక లింక్ ..ఇటు ఒక లింక్ ..మిగిలాయి ….అంత లావు గా ఉండేది నా చెయ్యి మరి …

మనిషి ఆశావాది కాబట్టి …

కనీసం , ఇటు 3 అటు 3 లింక్ లకు వచ్చే లావు అయ్యాకే ..chain స్ట్రాప్ ఉన్నది కొందాము అని అనుకున్న …

So next B.tech చేరాక మా నాన్న ఒక leather strap ఉన్న watch కొనిచ్చారు ..మామూలుగా నేను గమనించిన దాని ప్రకారం 7 చిల్లులు ఉంటాయి.. ..

మన లావుకి 10 చిల్లులు ఉండాలి ..ఆ లాస్ట్ పదో చిల్లులో దూరిస్తేనే ..నాకు watch ఉంటుంది ..లేక పోతే చెయ్యి కిందకి అనంగానే నేల మీద ఉంటుంది …

భలే ఊహించుకుంటున్నారే ….మీరసలు … :)

ఆ షాప్ అంకుల్ మాకు తెలిసిన ఆయనే …అవ్వడం తో కాస్త చనువు తీస్కోని ..ఏమ్మా ఇలా ఉంటే ఎలా …బాగా తినాలి …అని అన్నారు …మా నాన్న అదే ఛాన్స్ అనుకుని …ఆది మాత్రం చెప్పకండి మా అమ్మాయికి …అస్సలు ఎక్కదు అన్నారు …ఎలాగో ఒక్కరే ఉన్నప్పుడు చెప్తే ..ఇల్లు కదిలేలా అరుస్తాను ..లేక గుండె కదిలేలా ఏడుస్తాను.. ..నేనేం చేశాను …ఎంత తిన్న అంతే …ఐనా నాకేమి ఆకలి అంత ఉండదు ..ఊర్కె అరవకండి అని …నేను రివర్స్ లో అరుస్తూ.. :P

Road లో అందరి ముందు అరవను అనే ఒక నమ్మకం ..ఆయన చెప్పించిన చదువు ..ఆయనకే మేలు చేస్తోంది మరి … :)

ఇక అదే last watch నాన్న తో కొనిన్చుకోవడం …

ఆ watch కి కొన్నేల్లయ్యాక ..నూరేళ్ళు నిండాయి అనుకుని …కొత్త watch అన్నాను ..

లేదు …ఒక సారి shop లో చూపిద్దాం అన్నారు ..తీస్కెల్తే సెల్ అయిపోయింది ..మారిస్తే సరిపోతుంది అంటే ..okk అన్నాను …

మళ్ళి Bangalore వచ్హాక మళ్ళి పని చెయ్యట్లేదు …..bangalore లో చూపిస్తే …బానే ఉంది ..ఏమైందో తెలీదు అన్నారు …

ఈ సారి కొన్న చోటకే వెళ్ళాను ..ఆయన ..ఈ watch చర్మానికి కి టచ్ అయితేనే పని చేస్తుంది ….మీ అమ్మాయి చేతికి కండ లేదు …అందుకే ఆది పని చెయ్యట్లేదు అని చెప్పాడు …

ఇక నాకు ఆయన మీద పట్టరాని కోపం ….కొత్తది కొనుక్కుంట ..అంటే ..లావవ్వు కొందాం అని నాన్న …ఆది కుదిరే పని కాదు అనుకుని …ఇంటికి వచ్చి ఒక యుద్ధం చేసినా లాభం లేక పోయింది …

అదే watch కట్టుకుని ….ఊరంత తిరిగే దాన్ని …చేతిలో mobile ఉంది కదా అనే ధైర్యం తో ..

ఒకానొక మంచి రోజు..అంటే ముందు ముందు ఈ మంచి రోజే....ఎన్నో ట్విస్ట్ లు ఉంటాయని తెలియక...దాన్ని అప్పటికి మంచి రోజే అనుకున్నా..….ఒక చేతిలో water bottle..ఇంకో చేతిలో tea cup పట్టుకుని నా cubicle కి నడుస్తూ ఉండగా ..ఒక security అమ్మాయి ….టైం ఎష్టు madam అంది …..నేను 10.30 అనుకుంట అన్నాను ..కాదు madam కరెక్ట్ గా కావాలి సెకండ్ ల తో సహా అంది ..సెల్ తేలేదు అన్నాను ….madam చేతికి watch ఉంది కదా అంది …ఆది పని చేయదు అని చెప్పలేక ….ఇన్ని పట్టుకున్నా కదా …చూడలేను అని చెప్పి ఇక దౌడ్ ….

నన్ను ఆ అమ్మాయి ఎంత చులకన గా చూసిందో నాకు ఆ sairam కి మాత్రమే తెల్సు ..

ఇక ఈ తీరని అవమానాన్ని భరించ లేక …watch ఎలాగైనా కోనేద్దామని ..వెళ్ళాను ….అక్కడ చాలా ఉన్నాయి …కానీ నాకు పట్టేవి కాదు .. :(

పోనీ 100,200 rs watch మోడల్స్ లో ఐనా సన్నగా ఉండే చేతులకి తయారు చేసుంటారు..లే..అవి తక్కువ కాబట్టి..ఒక 2 లింక్ లు తక్కువే పెట్టుంటారు అనీ కొంచం ఎక్కువ బ్రెయిన్ ఉపయోగించి..ఒక పనికి రాని ఆలోచన చేశాను....వెళ్లి చుస్తే..అవి కనీసం నా చేతికి 2 రెట్లు లావు ఉండే చేతికి మాత్రమే సరిపోతాయి...

ఇంతటి బాధని లోలోపలే అనుభవిస్తూ..నా కోసం పుట్టిన watch కోసం ఎదురు చూస్తూ..అప్పటికి కొనడమ విరమించుకున్న..

ఈ సారి birthday కి వచ్చిన విరాళాల తో ….మంచిదేదైనా కొందాం అని వెళ్ళాను …

ఎన్ని మంచి మంచి models ఓ ..Card లో డబ్బు …కానీ చేతికే కండ లేదు ….. :(

కొన్ని చైన్ watch లు try చేశాను ….అవి dial ఒక్కటే నా చెయ్యి మొత్తం కవర్ చేస్తున్నాయి..…ఇక నాతో పాటు వచ్చిన నా friends..కిరణ్ ఒక గం లాంటిది ఇప్పించుకో …dial ఒక్కటే అతికిన్చుకోడానికి అని అంటున్నారు ..లేక పోతే నీ office ట్యాగ్ కి ఇంకో దారం కట్టి వేలాడ తీయి అన్నారు … :(..ఇంతటి బాధ ని అవమానాన్ని భరించలేక ….

నా size కు తగట్ట్లే …ఒక చిన్న watch కొనుకున్న leather strap ది ..

ఇక దాన్ని చూసి కిడ్స్ సెక్షన్ లోని watch అంటే ఒక 10 నిమిషాలలో లో పని అయిపోయేది ర అంటూ వెక్కిరించారు...

నాకు ఇక ఉక్రోషం ఆగక....అవ్తుంది....నా చెయ్యి కూడా ఒక రోజు లావవుతుంది ...అంటూ ..శపథం చేస్తూ బైటకి వచ్హాను...

ఏదైనా చిట్కాలు చెప్పొచ్చు కదా …only చెయ్యి లావు అవ్వడానికి …మీకు బోలెడంత పుణ్యం వచ్చేలా నేను ప్రార్థనలు చేస్తాను .. :)

21 November 2010

కార్తీక పౌర్ణమి నాడు శివయ్య ...

నాకు ఈ శివయ్యతో మాట్లాడటం ..పెద్ద అలవాటు లేదండి..

ఎప్పుడు మన తోక సామీ,తొండం సామీ...బాబా తప్ప..

ఎక్కువ శివుడి గుడికి వెళ్ళినట్లు కూడా గుర్తు లేదు..

కానీ ఈ మద్య ఆయనే తెగ పిలుస్తున్నాడు నన్ను... :ప..

ఎం అదృష్టమో ఏమో..ఈ కార్తిక మాసం లో ఎప్పుడు లేనిది ..గుడి కి వెళ్ళాను..

వెళ్ళడమే కాక..దీపాలు వెలిగించాను...

మొన్న అనుకోకుండా..banaglore 100 kms దూరం లో కోటి లింగేశ్వర temple కి వెళ్ళాం..

అక్కడ ఉన్నంత సేపు..ఏమి పెద్ద భక్తి భావం..అల అనిపించలేదు..

కానీ రూం కి వచ్చాక ..ఆ ఫోటో లు చూస్తున్నంత సేపు హ్యాపీ..

ఎందుకబ్బా నేను ఇంత హ్యాపీ అని నన్ను నేను ప్రస్నించుకుంటే సమాధానం దొరికింది.. :)

నాకు ఎప్పుడు దేవుడంటే పెద్ద ..బాగా పెద్ద అని ఒక impression..అలా పెద్ద పెద్ద విగ్రహాలను చుస్తే ఇక పట్టరాని ఆనందం.మరి అంత పెద్ద దేవుణ్ణి చూసేసా కదా.. :)

ఇక ఇంటికొచ్చాక వెన్నెల్లో ఎంత బాగుంటుందో.. కదా ఆ ప్లేస్..వర్షం పడ్తే అద్బుతం కదా అనుకుంటూ ఉఉహించు కునే దాన్ని..

painting వేద్దాం అంటే complete చేయడానికి టైం పడ్తుంది..

రిస్క్ ఎందుకు లే అని..ఉఉర్కే అల photoshop తో ట్రై చేశాను..ఇలా వచ్చింది...

మొత్తం అయ్యాక నాకు నచ్చింది..కాకి పిల్ల కాకికి ముద్దు కదా మరి.. :)

సరే కానీ మీరందరూ ఏంటి...వన భోజనాలు...అదీ..ఇదీ అంటూ..ఎప్పుడు తిండి ధ్యసేన...:P

శివయ్య కి నా లాంటి భక్తులున్నారు కాబట్టి సరిపోయింది ..లేక పోతే ఆయన ఎంత hurt అయ్యేవాడు.. :P .. :)

నేను ఎంచక్కా early మార్నింగ్ 7 కే లేచి..8 కే స్నానం చేసి..9 కి గుడికి వెళ్లి వత్తులు వెలిగించ...

మరి మీరు???.....సరేలే..మీరేలగు వండటం లో బిజీ కదా...ఆ చేసిందంతా ఇటు పంపండి..

శివయ్యకు ప్రసాదం పెట్టి..నేను జస్ట్ taste చూస్తా అంతే... :) :P

17 November 2010

దైవమే నేస్తం ..!!

ఎంతో మందికి ఎన్నో సార్లు దేవుడు నేస్తంగా ఉంటాడు …

ఆయన ఎప్పుడు ఉంటాడు ..కానీ కొన్ని సార్లే మనుషులు చూస్తారు ఆయ్యన్ని అలా .. :)

ఈ టాపిక్ picture లో కి ఎందుకు వచ్చింది అంటే … నేను ఒక artist ని కలిసాను ఈ మద్య లో ..

ఆయన ఒక బొమ్మ గీసారు ….రాఘవేంద్రస్వామి కృష్ణుని ప్రతిమ చేతిలో పట్టుకుని ఏదో చెప్తున్నట్లు ….

దానికి explanation ఇలా చెప్పారు .

మనిషి ఎంత సంతోషాన్ని అయిన పక్క మనిషి తో పంచుకోవచ్చమ్మ…కానీ …బాధ మాత్రం దేవుడి తోనే చెప్పుకోవాలి …

ఎందుకంటే మనిషి చులకన గా చూస్తాడు ..ఒక సారి వింటాదేమో ….ఆ తర్వాత ..బాబోయ్ .. వీదొస్తున్నాడా ..అని అనుకుంటారు ..అని అన్నారు ..

ఇది ఎంత నిజం కదా …

అసలు ఈ ప్రపంచం లో good listeners చాలా చాలా తక్కువ నా అనుభవం ప్రకారం …!!..

ప్రతి మనిషి తనలో ఉన్నదంతా బైటికి కక్కేయాలి అనే చూస్తాడు …అసలు సందు దొరికితే ..చెప్దామ అన్నట్లు …

తప్పు అనట్లేదు …కానీ వినడానికే ఆలోచిస్తాడు.. :)

మనకు కొంత మంది పరిచయమయ్యి . .ఆది మంచి స్నేహంగా మారినప్పుడు …నాతో ఎప్పుడు ఈ నేస్తం ఉంటుంది అనిపించినప్పుడు …చెప్పుకోవడం తప్పు లేదే ….!!..వినాలి కూడా ….ఎందుకంటే మనిషి వీడు నా సొంత మనిషి అనుకోనిదే తన బాధ బైటికి వ్యక్తం చేయలేడు....ఒక సారి చేస్తే సరే..ఇక పదే పదే ..అంటే ఎవరికైనా విసుగే కదా అంటారా??అల కాదండీ..కొంత మంది బాధ లో నుండి బైటికి తొందరగా వచ్చేయ గలరు..కొంత మందికి టైం పడ్తుంది...చెప్పే వాడికి కూడా దిగులు ఉంటుంది..అయ్యో అనవసరంగా పక్క మనిషిని ఇబ్బంది పెడ్తున్ననేమో అని...కానీ.. ఆ దేవుడికి చెప్పినా..ఆయన వింటున్నాడో లేదో కూడా అర్థం కాదు...చెప్పిన వెంటనే ఒక ఉలుకు ఉండదు...పలుకు ఉండదు..ఇక మన పరిస్థితి లో మార్పు కు ఆయన ఏదో sketch వేసుంటాడు..ఆది మానవుని బుర్ర కి ఎక్కడం ఇంకొంచం టైం పడ్తుంది..ఈ లోపల మనిషికి బెంగ ..కంగారు...మరి మాట్లాడే ..మనిషికి...ఆ దేవుడున్నాడన్నిటికి అని చెప్పే నేస్తనికే కదా ప్రతి చిన్నది..తరచున చెప్పుకో గలం.... కానీ కొంత మందికి వినడానికి కూడా ఓపిక లేదంటేనే నాకు కోపం వస్తుంది …!!

ఇంక మనిషికి మనిషి కి బంధం ఎంటండి ..??మనిషిని మనిషి ,మనసుని మనసే కదండీ అర్థం చేస్కోవాలి..!!

కానీ కొంతమంది ..ప్రపంచం లో ఉన్న అతి పెద్ద కష్టాలు అన్ని వాళ్ళకే ఉన్నట్లు ఫీల్ అవ్తూ ఉంటారు ….వాళ్ల బాధ వింటాను..కానీ ఆ మరుక్షణం డస్ట్ బిన్ లో పడేస్తాను..అదే నా నేస్తాలు నిజంగా బాధ లో ఉంటే..నేను కూడా కొంత సేపు భారాన్ని మోసి ఏమైనా పరిష్కారం ఉందేమో అని ఆలోచిస్తా..నా చేతిలో ఏమి లేదంటే దండం పెట్టుకుంట....గండం గట్టేక్కించు నాయన..అని..!!

ఇది వరకు కాలమే నయం …అప్పట్లో ఈ cell phone లు ఉండేవి కావు ..

అప్పుడు ఎక్కడో దూరంగా ఉన్న నేస్తాన్ని కలిసినప్పుడు ….మొత్తం నా సంతోషాల్ని ..బాధల్ని చెప్పుకుంట అనే చిన్న hope ఉండేది ..

మరి ఇప్పుడో ….cell phone లు వచ్చేసాక ….అసలు అవతల వాడు బాధ లో ఉన్నాడు అంటేనే ఇక ఫోన్ lift చేయడానికి ఆలోచిస్తారు …

మన ప్రాణ నేస్తమా ఇలా చేస్తుంది అని …మన అసులు బాధ ..ఇప్పటి బాధ కలిసి గుండె ఇంక బరవుగా అయిపోతుంది .. :(

నేను ఇలాంటివి చూసాను ..అందుకే చెప్తున్నాను ....

అందరు అలాగే లేరు ….

నా నేస్తాలు నేను ఏం చెప్పిన వింటారు …!! ఎవరో తెల్సా వాళ్ళు ..మీరేనండి బ్లాగు మిత్రులు ..

ఇంక నా సాయి దేవుడు …ఎన్ని తిట్టిన ఏమి పట్టించుకోడు …..next day పొద్దున్నే ..మంచి భగవద్గీత అర్థాలతోనో ..లేక ఎవరో నా paintings ని బాగున్నాయి అనో ….లేక ఈ రోజు office కి హాలిడే అనే మంచి వార్తో ..లేక మా అమ్మ phone చేసి నీకు రెండు జతలు డ్రెస్ లు తీసిపెట్టాను అనో ..చెప్పేల చేసేస్తాడు ..he is my real friend….నేను 1 year అలిగాను ..పారాయణం కూడా చేయలేదు ….ఎక్కడికి వెళ్ళిన వెంట పడే వాడు . .కార్ ల అద్దం మీదో ..ఎవరి బాగ్ మీదో ఇలా ….

నేనే ఎప్పుడో అడిగాను …నేను నిన్ను మర్చిపోయిన నువ్వు మర్చిపోకు అని …..ఆది గుర్తు పెట్టుకొని అంత నిజాయితిగా friendship చేయడం తో …నచ్చేసి మళ్ళి మాటలు కలిపేస ….:D ..నిజం చెప్పనా..నాకు మనిషి దగ్గర ఏడ్చి బాధ వ్యక్తం చేసినా మొత్తం బాధ దిగి పోదు....అదే దిండు మీద తల పెట్టుకుని ఆ బాబా ని తిడ్తూ ..గుక్క పెట్టి ఏడుస్తూ నువ్వే తీసేస్కో ఇంత దుఃఖాన్ని అని దిండు తడచి పోయేలా ఏడిస్తే ఇక ఎంత ఫ్రీ గా ఉంటానో :D ...మరి ఇలా అన్ని ఆయనకీ చెప్పాలి అంటే మాట్లాడేయాలి కదా.. :P

ధన్యోస్మి సాయి …ధన్యోస్మి ..సాయి …!!

ఇంకా ఇంత విన్న మీకు కూడా ధన్యోస్మి .. :)


ఎందుకో ఈ మధ్య కన్నీరొచ్చి తెగ పలకరిస్తోంది..చాల రోజుల తర్వాత...ఎంత గ అంటే...ప్రపంచం లో నా అంత నిన్ను ఎవరు ప్రేమించరు...అని చెప్పకనే చెబుతూ...ఇన్ని గంటలు.ఇన్ని రోజులు..నీకు నాలా తోడు ఎవరున్టారన్నట్లు...చూస్తూ....నేను దానికి సమాధానం చెప్పలేక.....బాబా వైపే చూస్తూ..అల ఉండిపోయాను...నొప్పి గాయం...మల్లి కిరణ్ మామూలైపోయింది.. :)..ఇక మీరు కూడా నవ్వేయండి..:)


11 November 2010

కదిలించే సాహిత్యం ...

సాహిత్యం ,కళలు కదిలించేంత గ ..

మన బాధలన్ని మరచి పోయేలా చేసేంతగా ....

ఏవి ప్రభావితం చేయలేవు అని నా ఫీలింగ్ .. :)

ఎంతో అలజడి గ ఉన్న మనసు ...కాస్త నచ్హిన సంగీతాన్ని వింటే ఎంతో హాయి గ ఉంటుంది ..

అలాగే ఒక బొమ్మ అద్బుతంగా పదాలు లేకుండా వర్నించేస్తూ ఉంటె ..అభినందించకుండా ఉండలేం కదా ..

అసలు ఇప్పుడు మిమ్మల్ని కదిలించే ల నేనెందుకు ఈ పోస్ట్ రాస్తునన్ను అంటే ...:p

ఒక నేస్తం ఊసులాడే ఒక జాబిలట అనే నోవెల్ ని పంపించారు ...:)...

చక్కటి స్నేహం మీద పుస్తకం ..

నాకు అల కవితాత్మకంగా రాయడం రాదనో ...టైం కి పదాలు గుర్తు రావణో ..(ఏదో covering..:P)

కొంచం మంచి గ ఉన్న కవితలన్న ...పుస్తకాలన్న ...పదాలన్న ..చాల ఇష్టం ...:)

ఈ రోజు ఆ పుస్తకం చదువుతున్నంత సేపు అందులో లీనమై పోయి ..last లో కన్నీరు కర్చేసి ...ఆహ ...ఎంతో మంచి గ అనిపించింది ...

ఇంత భావోద్వేగం ఒక్క సాహిత్యం వల్ల ,కళల వల్లే కలుగుతుందని నా అభిప్రాయం ..

ఒక్క నిమిషం ..ఇలా ఊహిన్చుకోన్డి ....మీరు రాసిన కోడ్ కానీ ..program ని కానీ పక్క వాడు చూసి ఆనందం తో కానీ ..ఒక ఫీలింగ్ తో కానీ కన్నీరు కారిస్తే

ఎంత funny గ ఉంటుందో .. :)..నేను దీన్ని తల్చుకుని ..ఎన్ని సార్లు నవ్వుకున్నానో ....

మన కోడ్ చూసి తప్ప కుండ ఏడుస్తాడు పక్క వాడు ..ఎప్పుడంటే ..వాడికి అర్థం కానప్పుడు ... :)

ఇలాంటి మంచి మంచి వాటిని మనం ఎంత మిస్ అవ్తున్నమో కదా ...మీ గురించి నాకు తెలీదండి ..

నేనైతే మిస్ అవ్తున్నాను .. :(

ఇది చదివి మీరు కదిలార..కదిలే ఉంటారు..సిస్టం నుండి పక్కకు.. :P

6 November 2010

దీపావళి ఔర్ దసరా ముచ్చట్లు ..

ఏం లేవండి ... :(.. :P

అన్ని ఆఫీసు ముచ్చట్లే ...

pls..pls..వెళ్ళిపోకండి ..రీడండి ... :)

అసలు ...ఇది వరకు నాకు ఉన్న doubts అంత ఇప్పుడు తీరిపోతున్నాయి ...

ఏంటా ఆ doubts??

దసరా అప్పుడు మా అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్ళే వాళ్ళం ....

ఇంట్లో బొమ్మల కొలువు ...ఇంటి దగ్గర ఉన్న శంకర మఠం లో రోజు ప్రవచనాలు ..

అమ్మ వారికి రక రకాల అలంకరణలు ....అసలు రెండు కళ్ళు సరిపోయేవి కావు ...

ఎంత ముద్దుగా ఉండేదో అమ్మవారు ఆ అలంకరనలకి ...

ఇంక చుట్టు పక్కల ఉన్న అమ్మవారి గుడి లో కూడా ఇలాగె చేసే వారు ....

కానీ next day...paper లో ఒక పేజి మొత్తం ఆ photo లు ఉండేవి ...!!

వెళ్లి మా అమ్మమ్మను అడిగే దాన్ని ...ఎందుకు అమ్మమ్మ మళ్ళి వీళ్ళు photo లు వేస్తారు .అందరూ గుడికి వెళ్లి చూస్తారు కదా అని ..

మా అమ్మమ్మ very very intellegent..ఒకటే మాట చెప్పింది ..నీకంటే మీ నాన్న cycle కొనిచాడమ్మ ...30 సార్లు కొత్త cycle మోజుతో ..గుడి పేరు చెప్పి వెల్లొస్తూ ఆ దేవి దర్శనం చేస్కోస్తావు ...

నా లాంటి దానికి ఒక 5 నిముషాలు అక్కడ నుంచున్న ....అయ్యూ ..పిల్లలు ,అల్లుళ్ళు ,మనవళ్ళు ,మనవరాల్లకు ...time కి వంట చేయగలనో లేదో ...అన్ని సమకూర్చగలనొ లేదో ..అనే దిగులు ఉంటుంది ..అని ...

ఇంటికొచ్చాక మళ్ళి పేపర్ లో ఇంకాసేపు చూడచు కదా నా లాంటి వాళ్ళు అంది ..
ఒహ్హూ సరే అని సగం అర్థమయ్యి ...అర్థం కానట్లు బుర్ర ఊపి వెళ్ళేదాన్ని .. :)

ఇప్పుడు మా అమ్మమ్మ inner voice నాకు అర్థమవ్తోంది ...

ఇంకో విషయం కూడా అర్థమవ్తోంది ...

అలాంటి busy అమ్మమ్మలకే కాకుండా ...మన లాంటి s/w ఇంజనీర్ లకు కూడా media సపోర్ట్ ఇస్తొన్దీ ... :)

ఒక వేల ఆఫీసు నుండి తొందరగా వచ్చిన మా అడవిలో గుడెక్కడ ..ఒక వేల గుడి అప్పటికపుడు వెలసిన ...ఆ సందు వరకు నడిచే ఓపికెక్కడ ?

ఏ ఏ అలంకరణలు ఏ రోజు ..ఏ గుడిలో నో తెల్సుకుని మరి ఉత్సాహంగా వెళ్ళే దాన్ని ..

అప్పట్లో ఏ రోజు ఏంటి అని .అంటే అష్టమి ..నవమి ..దశమి ఉన్నాయి ..కదా ..అవి ...బాగా తెల్సు . ...

ఇప్పుడు కూడా తెల్సు ..ఈ రోజు ఏం రోజే అంటే ...monday,tuesday..అని confident గా చెప్పగలను..

ఒకటే మాట అంటారింట్లో ..గుర్రం ..గాదిదయ్యిన్దన్ట .. :D...

లేదు ..లేదు s/w ఇంజనీర్ అని నేనంట ..రెండు ఒకటేలే అని మా తమ్ముడంటాడు .. :D

వినాయక చవితికి మొదలయ్యాయి మా office లో major enhancements కి సంబరాలు ...కరెక్ట్ గా విజయదశమి నాటికీ ప్రొడక్షన్ లో కి వెళ్ళింది ...మా manager వాడి ఇంట్లో ...njoying..

మా TL bengali ఆవిడ లెండి ...వాళ్ళకి దసరా చాలా famous అంట ...ఆహ్హా అవునా అనకండి ..అందరికి తెల్సిందే ...ఆవిడ ఫీల్ అయ్యేది అక్కడ పూజలు అవి మిస్ అవ్తోందని ఒక 20% అయితే ..

తను ఈ మద్య కొన్న costly చీరలు ,నగలు ఇక్కడ పెట్టలేదుట ...అక్కడికి వెళ్తే అందరికి చూపిన్చచు ..పెట్టుకుంటే బాగుంటావ్ అని అంటారంట ...ఆది 80% miss అవుతోందిట ..

ఆవిడే చెప్పింది ...

అందుకే మా మేనేజర్ తో mails యుద్ధం చేసి ..వెళ్ళింది ఒక వారం ..ఇక పనంత సోలో గా మనమే చేసాం ...!!...ఇది నేను విజయగర్వం తో విజయదసమి నాటికి పూర్తి చేసింది ..

ఇంతా చేస్తే ...

ఆ client కి తెగ నచ్హి 4 certificate lu టీం మొత్తం పేరు పేరు నా పంపాడు ...

కరెక్ట్ గా టీం lo wrk చీసిన వాళ్ళెవరో తెలీదు ..కదా ..సో అన్దరికీ పంపుతున్నాం అని మెయిల్ ...

పోన్లే నా వల్ల వాళ్ళకు కూడా award లు వచ్హాయి అనుకున్న ...

ఇవి దీవాలి ధమాక offer....

next day మెయిల్ చుస్తే ...

ఇంకో major enahancement.... :(..మా TL అప్పుడే ఊరి నుండి వచ్చి ఇంక అదే ప్రపంచం లో ఉండి ..కిరణ్ నువ్వే చేయమ్మా ..ఇది కూడా అని simple గా అనింది .

ఆది కరెక్ట్ గా మొన్న గురువారం ..హా చేస్తాను లే అన్నాను ...

మొదలు పెట్టు అని వెనకాల నుండి ఒకటే గోల ...database work కావట్లేదు అని తెగ act చేసేస ..అల ఎలా మాకు అవ్తోంది అంది ..

నా సిస్టం దగ్గరకు ర చూపిస్తా అని ...చెప్పి ..client network ని disconnect చేసి database కి raka rakalu గా login అవుదాం అని try చేశా .అప్పటికే 2 అయింది ...

ఆవిడ ఎక్కువ శ్రమ పడదు ...

so we will c on monday అంది ..సరే ...అని ఆవిడ పక్కకు వెళ్ళాక ....gmail ఓపెన్ చేసి ...ముచట్లు పెట్ట . . :)

ఎందుకో అసలు పని చేయాలనిపించలేదు ..మరి ..

ఇక త్వరగా బయల్దేరి ఇంటికి వచ్హాను ......friday రోజు లేట్ గా లేచి ..స్నానం కూడా చేయకుండా ..net ముందర కొన్ని గంటలు browse చేసి ...darling cinema చూసి ...relax అవ్తున్న time lo ...oka 2,3 కాల్స్ వచ్హాయి ...దీవాలి wishes...వీళ్ళు రేపు చేయోచు కదా ..ఈ రోజే ఎందుకో ..అనుకున్నా ...

రాత్రి 9 ki పడుకుందాం అంటే నిద్ర పట్టట్లే ..why ఆ అని ఆలోచిస్తే ...నో bath కదా .సో వెళ్లి అప్పుడు బాతి full గా నిద్రపోయ ..

ఈ రోజు 5.30 కే లేచి వేడి నీళ్ళు పెట్టుకుని .స్నానం చేసి ..ఏవో డౌన్లోడ్ చేస్తూ కూర్చుని 9 అయ్యాక మా తమ్ముడికి ...ఫోన్ చేసి ..happy దీవాలి అన్నాను ..

గొర్రె ..పండగ నిన్నేనే ....అన్నాడు ..కాదు గొర్రె ..ఇంట్లో ఉన్నది నువ్వా నేనా ...అని దబాయించ ...

మా అమ్మ ...గొర్రె నిన్నే అంది ..మరి చెప్పలేదేంటి అంటే ..చెప్పెదేంటే ఆ మాత్రం తెలిద ...పాయసం ..పులిహోర ..అన్ని బానే తిన్నావ్ ..ఇంటి చుట్టు దీపాలు పెట్టడం చూసావ్ అంది ..

mummyy ...!! :( :(

మీ చీ లు తు లు నాకు ఇక్కడికి వినిస్పిస్తున్నాయి...ఎవరికీ చెప్పకుండా..నా బ్లాగ్ లో ఒక కామెంట్ పెట్టి క్లోజ్ చేసేయండి..:D

26 September 2010

PG కష్టాలు

మొన్న కబుర్లు చెప్తే బానే విన్నారు గా...ఈ రోజు కష్టాలు కూడా అదే ఉత్సాహం తో వినండి.. :p
భోజనం average ga ఉంటుంది..పెద్ద ఊహించుకోకూడదు..
non-veg అడిగితే...మేము తినడం ఆపేసాము అంటారు..మీరు తినక పోతే ఏంటి..మాకు పెట్టండి అని రివర్స్ లో అడిగే ధైర్యం ఎవరికీ లేదు..ఎందుకంటే మా ఓనర్ ఇక సంస్కృతం లో తిడుతుంది...ఇంట్లోనే మాట పడని వాళ్ళు ఇక్కడ మాట పడటం ఇష్టం లేక నోరు మూస్కోని వెళ్ళిపోతారు...ఆవిడ మాట్లాడే మాటలకి పిచ్చెక్కుతుంది...తెలుగు dictionary కోసం వెతుక్కోవాల్సి వస్తుంది...
వాళ్ళు పెట్టె తిండికి dictionary మోసే ఓపిక ఉండదు..సో డ్రాప్ అన్నమాట..
ఎంత వెరైటీ గ చేస్తారు అంటే..ఒక రోజు గ్రహణం...పొద్దున్న..ఇంత మసాల వేసి పులావ్ చేసారు..అది తిన లేక మధ్యానం తిందాం లే అని ఊర్కున్న..1 కి ప్లేట్ తీస్కొని బైటకి వెళ్ళాను...అప్పుడు అంటున్నారు..ఈ రోజు గ్రహణం కదా..మేము ఏమి వండ లేదు..అని...నాకు మండింది...అదేంటి కనీసం చెప్పాలి కదా అంటే...ఉన్నది PG లో మొత్తం 5 మంది...3 బైటికి వెళ్లారు..ఇంకో ఇద్దరు తినమన్నారు...(వీళ్ళు చెప్పించారు వాళ్ళతో మేము తినమని..)..ఒక టింగరిది ఉంది..దాని లవ్ సక్సెస్ కావాలని ఏమైనా చేస్తుంది..మా ఓనర్ కూతురికి అది తెల్సు..
సో అల హింట్ ఇచి ఊర్కుంది....ఈ పిల్ల రెచ్చిపోయింది..చివరికి నేను చచ్చిపోయాను...మరి నన్ను అడగాలి కదా అని నేను అంటే..నువ్వు ఎలాగో పూజలు అవి బానే చేస్తావ్ కదా..సో ఇలాంటి పట్టింపులు ఎక్కువ ఉంటాయి అనుకున్నాం... ఐన తినేది ఒక ముద్ద..దానికి ఎందుకు ఆకలేస్తుంది లే అనుకున్నాం అన్నారు.. :(.. ముందే చెప్పా కదా ఇది ఒక అడవి అని....కనీసం షాప్ కూడా తెరవలేదు…నా దగ్గర buiscuit ప్యాకెట్ కూడా లేదు...:(...ఇక ఉపవాసమే..
నిద్ర కూడా రాలేదు పడుకుందాం అంటే...మా అమ్మ..ఇంత లోపల ఫోన్ చేసి...పోదున్నే చెప్దాం అనుకున్న....మర్చిపోయ పని హడావిడి లో ఉండి...తల స్నానం చేయి..ఎమన్నా తిన్నావా పోదున్నే...ఇప్పుడు కూడా తినేసావ అని అడిగింది..ఆ ఛాన్స్ వీళ్ళు ఇవ్వలేదు లే..పొద్దున్నుండి ఏమి తినలేదు....అని చెప్పను...అయ్యో...అంటూ మా అమ్మ ఫీల్ అయ్యింది..కుక్క లాగా సాయంత్రం కోసం వెయిటింగ్..వీళ్ళకి ఆ రోజే అన్ని పద్దతులు గుర్తొచ్చాయి....గ్రహణం అయ్యాక..ఇల్లు కడగాలి అన్నారు...ఇక...అన్నం అడుగుతాం అని వాళ్ళకి నడుములు పడిపోతున్న..సరే ..కడిగిందే కడిగి ..తుడిచిందే తుడుచుకుంటున్నారు...ఇంతలో కిరణ్ అని పెద్ద గ అరిచారు..మా రూం లో వాళ్ళు...మా పక్క రూం వాళ్ళు నేను టప కట్టేశాను అని ఫిక్స్ అయ్యి వాల్ల రూం లో నే రెండు నిముషాలు మౌనం పాటించి వచ్చారు..వచ్చి చుస్తే...పోయే స్టేజి లో ఉన్నానే కానీ పోలేదని తెల్సి ఫీల్ అయినట్లున్నారు..ఒక పిల్ల తన వాక్చాతుర్యాన్ని 2 నిముషాలు నేను వేస్ట్ చేసినట్లు లుక్ ఇచ్చింది...అడిగితే buiscuit లు అన్న ఇచే వాళ్ళం కదా అని ఒకరు..నిమ్మకాయ నీళ్లన్న కలిపి ఇచే వాళ్ళం కదా అని ఇంకొకరు...అన్నారు..మా అమ్మ అన్నట్లు..నాకు పనికి రాని టైం లో నే మొహమాటాలు గుర్తొస్తాయి..
ఓనర్ లు ఒక రకమైతే...ఇక మా రూం లో వాళ్ళు museum లో ఉండాల్సిన వాళ్ళు...బాబోయ్...
నా ఫ్రెండ్స్..అబ్బాయిలు ఎప్పుడు తిడుతూ ఉంటారు....మీ అమ్మయిలు కి cooperation ఏ ఉండదు అని..అప్పట్లో హాస్టల్ ఎలా ఉంటుందో తెలియక పోట్లాడే దాన్ని...కానీ ఇప్పుడు వాళ్ళకే నా ఫుల్ సపోర్ట్....ఒకొక్కరిది ఒక్కో పద్ధతి...అన్ని నదులు ఒకే చోట కలిసినట్లు..అన్ని బాష లు మా రూం లో నే వినిపిస్తాయి..నేను ఒక సారి మా బామ్మ తో ఫోన్ మాట్లాడుతున్నాను..ఆవిడ...ఏమ్మా కిరణు..నేను బామ్మ ని.. నాకు తెలుగు మాత్రమే వచ్చు అని చెప్పింది...అవును నేను అందులోనే కదా మాట్లాడుతోంది అంటే...లేదమ్మా...పక్కన ఏదో కొండ జాతి బాష ..అంది....వాళ్ళకి ..బైటకి వినపడలేదు కాబట్టి..ఇంకా నా బ్లాగ్ లో పోస్ట్ లు నా చే update చేయబడ్తున్నాయి...సర్లే..ఉండు అని బైటికి వెళ్లి మాట్లాడి వచ్చాను...

ఏమండి ఒక question మీ ఇంట్లో దోమలు కుడుతూ ఉంటె ఏం చేస్తారు..allout పెడతారు..jet లు పెడతారు...మా వాళ్ళు పెట్టుకోరు...ఎవరు పెడతార అని వెయిట్ చెస్తూ పడుకుంటారే తప్ప...అసలు ఇలాంటి వాళ్ళు వేలకు వేలు జీతాలు సంపాదించి ఏం చేస్తారండి...??..రూం లో బట్టలు అరేస్తారు...ముందే నల్లులు..ఆశ్చర్య పోకండి...నల్లులు ఇది వరకు నేను విన లేదు..అప్పుడెప్పుడో మా అమ్మమ్మ చెప్తే..ఎలా ఉంటాయి..అని ప్రాణం తీసే దాన్ని..అబ్బో అవెందుకే..రక్తం లగేస్థాయి అంటే నమ్మ లేదు...ఈ మద్య ఎక్ష్పెరిఎన్కె అయ్యాక..net లో వెతికి ఏ పదార్థాలు తింటే మంచి గ రక్తం పడ్తుందో చూసి..తింటున్న తినే ముందు..దేవుణ్ణి కాక..ఓ నల్లి..నీకు 75%..నాకు 25%...అని deal కుదుర్చుకుని తింటున్న....ఈ మద్య బలే ఎర్రగా తయారవ్తున్నావే.....బాగా పళ్ళు తింటున్నావా అని అడిగారు....లేదు...అని నవ్వుతు చెప్పాను..నల్లులు అని ఈ 21st century లో చెప్పలేక...అయ్యో...అనంగానే చూడు..సిగ్గు తో బుగ్గ ఎరుపెక్కింది అని ఇంకొకరు.....నాకసలే అది కుట్టిన చోటే మండటం కాక...వాళ్ళు అనే మాటల తో ఇంకొంచం మండి..మీ మొహాలు మండ...నిజాలు చెప్తే నమ్మరు అని వెళ్ళిపోతాను...

ఇంతకి మా వాళ్ళు బట్టలు ఆరేశారు...కిటికి రాడ్ ల మీద...తలుపు అంచుల మీద....ఏమి అనలేక..బుద్దున్ని తలచుకుంటూ...లాప్ టాప్ తీద్దాం అని కప్ బోర్డు తీసాను...ఏడుపు...ఆశ్చర్యం...ఒకటే సరి....మా బామ్మ తెలియకుండా అన్నా కరెక్ట్ గ అంది..కొండ జాతి అని..లేక పోతే అక్కడ తోరనల్లగా బట్టలు ఆరేశారు....అసలు మనుషులే కాదు......ఎంత చిరాకుగా ఉంటోందో ఈ మద్య ఇంకా.....మా రూం లో మాకన్నా...నల్లులు,దుమ్ము,దోమలు ఎక్కువ ఉంటాయి...పాపం అవి సంపాదించ లేవు కనుక జాలి తో మేము సంపాదించి రూం rent కడుతున్నాం...వాటికే మాటలు వస్తే బాగుండేది.....కనీసం మానవత్వం ఉండేదేమో...మా రూం లో జనాలకి లేదు..ఇలాంటి వాళ్ళు చదువుకున్న ఒకటే..లేక పోయిన ఒకటే...పక్క దానికి జ్వరంగా ఉన్న రోజే...దీనికి ఫ్యాన్ వేస్కుని పాడుకోవాలి అనిపిస్తుంది.....లేకపోతే బాగా చలి గ ఉన్న రోజే ఫ్యాన్ వేస్కోవాలి అనిపిస్తుంది....మంచి romantic లెండి మా రూం లో వాళ్ళు...నాకు సినిమాల్లో..శాడిస్ట్ లు విలన్ పాత్రలు..ఇలాంటి వాళ్ళని చూసాకే ఐడియా వస్తుందేమో అనుకున్న.....

ఇలా నల్లులు,దోమలు...అనుకుంటూ...ఒక రోజు...రూం లో ఏదో ఆర్టికల్ చాస్తుంటే పిల్లి అని విన్పించింది....వామ్మో...అనుకున్నా..ఇది కూడా నా అన్న రేంజ్ లో బైటికి వెళ్లి చుసా....ఇదేంటి ఆంటీ..ఎక్కడిది అన్నాను..పొరపాటున...మేము కొన్నాము అనే మాట వినాల్సి వస్తుందేమో అని..లేదు..నన్ను బతికించారు...వీధి లో వెళ్తూ ఉంటె మా అబ్బాయి పట్టుకొచ్చాడు అంది....మనుషుల మీద లేని జాలి ,అభిమానం...పిల్లి మీద ఎందుకు చెప్మా అనుకున్న...ఏమైనా ప్రైజ్ అనౌన్స్ చేసారా...ఈ నెల పిల్లిని ఎవరు ప్రేమిస్తే వాళ్ళకి rs.100 అని..rs.100 కి కూడా కక్కుర్తి పడే మొహాలు లెండి..ఇక్కడ వీళ్ళు...ఇంతకి విషయం ఏంటంటే వాల్ల గది...లో ఎలుకలు ఉన్నాయంట....ఉంటె???.....ఎలుకల మందు పని చేయదంట..ఏవైనా natural ఏ అంట....ఇక చేసేదేముంది...అప్పుడప్పుడు ఆ పిల్లి...మీ రూం లోకి అన్నింటిని రాణిస్తారు..నన్ను తప్ప అన్నట్లు గ చూసేది....పాపం అనిపించి...డోర్ తెరిచే ఉంచాను...వచ్చి..కాసేపు కబుర్లు చెప్పింది....ఏమనో తెల్స....ఇంట్రెస్టింగ్ టాపిక్...మా ఓనర్ ని తిట్టింది......మాస్టారు...పొద్దున్న...ఆకలి..ఆకలి అని మూల్గుతున్న....పాలు తేస్తమే ఉండు అంటే వెయిట్ చేశా...తీర చూస్తే...ఒక bournvita డబ్బా మూతలో 1 spoon పాలు పోసారు..అవి..అటు నాకడానికి..లేక...తాగడానికి లేక చూసి ఆనందించు అని అవి వెక్కిరిస్తున్నాయి....బైటకి అన్న వదిలేస్తే....నేను ఏదో ఒకటి తింటాను...నా హెల్త్ పడైపోయింది...ఇక్కడికి వచ్చాక 1 KG తగ్గాను మాస్టారు అంది.....పరిపోవే అన్నాను...మాస్టారు అని ఇందాకటి నుండి పిలుస్తుంది ఇలాంటి చచ్చు సలహాలు ఇవ్వడానికి కాదు అంది..అది తెలీక కాదు....మీ ఓనర్ మా శత్రువు కుక్కకంటే ఎక్కువ కాపల కాస్తోంది...నేను ఎటు వెల్లిపోతనో అని....నా గోల లో నేను ఉంటె....ఆవిడ మనవరాలు వచ్చి..అతి ప్రేమ చూపించి....నా గొంతు కూడా పట్టేసుకుంటోంది...అందుకే కిరణ్..మనుషులకు అలుసు అవ్వకూడదు..అంటారు...అంది..అదేంటే కిరణ్ అంటావ్ అంటే...ఇప్పుడు నీకు నేను నేర్పించా కదా...నన్ను నువ్వు మాష్టారు అను అంది..సరే..మాస్టారు..పొద్దున్న ఏంటి ఆ లావు పిల్ల నిన్నేదో తిప్పలు పెట్టింది అని అడిగాను...అదా కిరణ్....అసలు మేటర్ అది....మర్చిపోయనేంటో...early మార్నింగ్ లేచి.....దాని మొహం చుస...గుడ్ మార్నింగ్ చెప్తుందేమో అనుకుంటే...చిరాకు గ పెట్టింది....నేను reaction ఇచ్చి...పాల కోసం waiting...పాలు పెడుతుంటే..one minute...is it a female cat or male one?? అనింది...........నాకు అన్ని పరిక్షలు చేసి female అని తెలిసాకే పాలు పెట్టించింది....నన్ను ఆడదానిగా పుట్టించి ఈ రోజు దేవుడు ఎలా రక్షించాడో తలచుకుంటేనే నాకు ఆయన మీద ఎన లేని బక్తి వస్తోందో...కిరణ్....నువ్వు వీలైనంత తొందరగా ఈ PG లో నుండి వెళ్ళిపో అంది...అలాగే మాస్టారు...అన్నాను..ఇక నువ్వు నీ పని చేస్కో..ఇప్పుడే పాలు తీస్కోచ్చారు..మీ ఓనర్ కళ్ళు కప్పి ఒక హాఫ్ ప్యాకెట్ తాగుత..మల్లి ఇంకో వారానికి నేను ఉంటె వస్తా అంది...సరే అని వదిలేస...
ఇలాంటి వి ఎన్నెన్నో...మీరు బానే నవ్వుకుంటున్నారు...నేనేమో ఇక్కడ ఏడుస్తున్నాను...:(
మా పిల్లి మాష్టారు చెప్పిన మాటలు ఆ రోజే విని వేల్లిపోయుంటే బాగుండేది...బద్ధకించి అక్కడే ఉన్నాను..అనుకోని సంఘటన వల్ల మారిపోతున్న కదా ఈ వారం... :)...

2 September 2010

ఒక జీవితం సరిపోయేన?

దీనికి మొత్తం వ్యతిరేకమైన ఆలోచన పొద్దున్నుండి....బుర్ర లో తిరుగుతోంది....ఏంటా??..అసలు మనిషికి ఒక రోజు చాలు కదా....అని...

ఆ మరి..పొదున్న లేచి కాసేపు భగవద్గీత చదివాను...అక్కడ వరకు బాగానే ఉంది...తర్వాత ఆఫీసు లో ఎంత పని ఉందొ...అని చుస్కున్న మెయిల్ ఓపెన్ చేసి....కొత్త పని ఈరొజె దిగింది మెయిల్ బాక్స్..లో..
దాన్ని చూసి విపరీతమైన నీరసం.....ఇక రోజు ఎప్పుడైపోతుందా  అనే బెంగ మొదలయ్యాయి...సరే 9 కే వెళ్తే మరీ...తొందరగా చేసి వచేస్త..నాకు తొందరగా వచ్చి ఈ రోజు ఏమి చేయాలనీ లేదు....ఇది నాకు 2 వారాలకు ఒక సారి....బద్ధకం day the week గ నేను ప్రకటించుకుంట.....అసలు ఏమి చేయను....ఆఫీసు లో అంటే తప్పదు నేను చేయను అంటే..మేము జీతం ఇవ్వము అంటారు...అందుకే...ఇక ఇంట్లో నా సొంత పనులకు టాటా చెప్తా ఆ రోజుకు...అలాగే ఈ రోజు 5 .30 కి పని ఐపాయింది....ఇంకా  కాసేపు  చేద్దాం  అన్న ... మాములుగా అయితే నేను చేసే పనులు అన్ని మైండ్ లో లిస్టు రాసుకుని నడుస్తూ ఉంటా ..ఆఫీసు నుండి ఇంటికి నడిచే లోపు....ఈ రోజు ఏదో టెక్నికల్ ది నేర్చుకుందమంటే...దాని license ఐపోయింది..update చేయాలి..అది week-end చేస్కుంట..అని postpone చేసి...బ్రెయిన్ కి ముందే ట్రైనింగ్ ఇచ్చ..నువ్వు excite అవ్వకు ఈ రోజు కి అని....ఎలా టైం పాస్ చేయల అని ఆలోచిస్తుంటే..బట్టలు ఉతకాలి అని గుర్తోచింది...2 జతలే ఉన్నాయి...అయ్యో ..ఇంకొన్ని వేసుకోనుంటే పోయేది కదా...ఈ రెండు రోజుల్లో అనుకుంటూ,,,PG మెట్లు ఎక్కాను....మా owner కూతురు..నా కోసం తెగ వెయిటింగ్..కిరణ్..కిరణ్...అంటూ ఆపేసింది...నేను నీ కోసం పొద్దున్నుండి ఎదురు చూస్తున్న..ఒకటి చెప్దాం అని..ఏంటా  అని ఆలోచించే లోపు ఇక్కడ నేను ఒక painting gallery చూసాను..అక్కడికి వెళ్దాం అని అంది..నేను ఇక్కడికి అది చాల దూరం అయి ఉంటుందని....ఇంకో రోజు అన్నాను..కిరణ్...ఎక్కడనుకుంతున్నావ్   ..పక్క సందులోనే అని ఒక ల్యాండ్ మార్క్ చెప్పింది...correct గ రెండు సందుల అవతల...అంత దగ్గర గ ఉంది కదా..పద పద అంటూ నా బ్రెయిన్ నా మాటను re-సైకిల్ బిన్ లో వేసి లాక్కెళ్ళింది...ఇక అక్కడికి వెళ్ళాను..అసలు నా బద్దకాన్ని దేవుడి చిటికెను వేలుతో తన్నట్లు అనిపించింది...తలుపు కొట్టి..వెయిట్ చేసాం...ఒక్క సారి తలుపు తీయగానే  నిలువెత్తు paintings ...రాఘవేంద్ర  స్వామి ది..ఇంకొకటి ప్రకృతి గురించి....work in progress state లో ఉన్నాయి...నాకు colors చూస్తేనే ఉత్సాహం వస్తుంది...అలాంటిది అంత అద్బుతమైన paintings చుసిన నా పరిస్థితి  వర్ణించలేను...కాసేపు అక్కడ కూర్చున్నాం...తర్వత....గేలరీ కి తీసుకెళ్ళారు...నేను మొట్ట మొదట సారి అంత పెద్ద పెద్ద paintings చూడడం...with బ్యూటిఫుల్ concepts ...ఆయన explain చేస్తూనే ఉన్నారు...ఇంకా నేను అదొక ప్రపంచం లో ఉంది పోయాను...ఇంకా అక్కడ ఒక మూల కన్నడ actor  రాజ్ కుమార్ తో  దిగిన ఫోటో..బోలెడు అవార్డ్స్ ఉన్నాయి....ఇంకా ప్రతి painting ఏదో abroad కో లేక పెద్ద పెద్ద గుల్లకో వేల్లెవే.....నాకు అక్కడ ఉన్నంత సేపు ఏదో గొప్ప వ్యక్తి తో ఉన్నాను అని మాత్రం పక్కా అర్థం అవుతోంది...కానీ..ఆయన పేరు కూడా తేలీదు....ఎంత వినయమో...ఎంత మర్యాదో...కొంచం ఫిలోసోఫి కూడా మాట్లాడారు...ఆయన....ఆ మాటలు నాకు చాల నచాయి....కళాకారులూ సున్నిత మనస్కులు...అన్ని గ్రహించే శక్తి ఉన్న వాళ్ళు అన్న మాటలు నాకు అక్కడ నమ్మబుద్ది అయ్యాయి....మేము పిల్ల పిచుకాలం....ఆయన ముందర..ఆర్ట్ లో ఐన..జీవితం లో ఐన ..వయసులో ఐన....మాకు అంత సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేదు..ఐన అన్ని చెప్పారు...ఏదో మీ లాంటి వాళ్ళు వచ్చి బాగున్నాయి అంటే...అంత కంటే తృప్తి ఎమున్తున్దమ్మ అన్నారు....అప్పుడు అర్థం ఐంది కదా...నాకు...నేను ఒక్క దాన్నే అలా పీల్ అవ్వను..ఆర్టిస్ట్ అనే ప్రతి వారు తన పని అందరికి నచాలి అనుకుంటారు అని..అంత చూసాక kaallaku దండం పెట్టకుండా ఉండలేక పోయాను...నేను ఏవో బొమ్మలు వేస్తాను అంటే...తీసుకు ర అమ్మ..చూస్తాను అన్నారు..నాకేమో బయంగా ఉంది...కానీ కొన్ని మంచివి ఈ సారి పట్టుకెలత...ఆయనకేమో కానీ....మీరు చుడండి నా paintings ఇక్కడ ....ఇక ఇంత సేపు నేను చెప్పిన ఆయన పేరు...B K S వర్మ...ఆయన వర్క్స్ ఇక్కడ  చూడండీ...

ఇంతకి ఆయన ఏదో కష్ట పడి అన్ని గొప్ప గొప్ప paintings వేస్తుంటే....నీకెందుకు ఒక జీవితం సరిపోయేన అనే డౌట్ వచ్చింది అంటున్నార??

నాలో ఈ రోజు నిద్ర పాయిన నా లోని కోరికలు...అన్ని గుర్తొచాయి...
ఇవన్ని నేను చేయాలి...

Pencil sketching mainly portraits..
water color painitng..
oil painting..
calligraphy...
bhagavadgeetha..
ramayanam...
yoga...
meditation..

ఇంకా ఎన్నో...ఎన్నెన్నో....ఈ లిస్టు అలా పెరుగుతూనే ఉంటుంది...
అసలు ఆఫీసు 9 to 6 ...ఇంకా సాయంత్రం చదువు....పొద్దున్న భగవద్గీత...week -ends ...ఊరికి...నిద్ర...తిండి...అసలు నాకు ఇంకో 24 గంటలు కావాలి..!! :(

చేయగలనంటార?? ఒక  జీవితం  చాలంటార ??
 నాకు ఫైనల్ గ అనిపించింది కదా....అనవసరమైన విషయాల మీద concentration తగ్గించి....నువ్వు సాధించాలి అనుకున్నవన్నీ...ఆలస్యం చేయక మొదలు పెట్టు అని దేవుడు గుర్తు  చేసాడేమో అని... :)

20 August 2010

TV..నేను బద్ధ శత్రువులం..

అయ్యో అల చూడకండి...
మీరు ఎలా చూస్తున్నారో నాకు తెల్సు..ఒక వింత జంతువు  ని చూసి నట్లు...ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది చూసేసారు కాబట్టి.....నాకు తెల్సన్నమాట..:P
ఏదో నాకు దానికి పూర్వ జన్మ కక్షలు లేవు..కానీ మనుషుల వల్ల దూరం అయ్యాను..
అవునండి చిన్నప్పుడేమో...నేను ఒక ఛానల్ లో tom n jerry చూస్తుంటే ..మా తమ్ముడు వచ్చి...హి-మాన్ లు..సూపర్ మాన్ లు పెట్టమనే వాడు..
కాస్త పెద్దయ్యాక...నేను సినిమాలు చూడడం మొదలు పెట్టాక..మీడియా కూడా పెరిగి...2 ,3 తెలుగు ఛానల్ లు వచ్చేవి   ..నేను ఒక ఛానల్ చూస్తుంటే వాడు ఇంకోటి కావాలి అనే వాడు..అప్పట్లో..ఇద్దరం..జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకునే వాళ్ళం...నా జుట్టు పొడుగు ఉండటం తో....దూరంగా  ఉండి..జడ  లాగి..ఆ radius maintain చేస్తూ తిప్పుతూ కాళ్ళతో తన్నే వాడు... మనకి ముందే hieght ప్రాబ్లం..గట్టిగ అరవడం తప్ప ఏమి వచ్చేది  కాదు..నా అరుపు తో అమ్మ వచ్చి ఇద్దరినీ చితక బాది...పెద్ద దానివి కదా..వాడిని చుడానిస్తే ఎం పోతుంది..ఐనా ఆడ పిల్లవి...పనులు నేర్చుకుందువు ర..అని లాక్కొని వెళ్ళేది...అమ్మ తోమిన గిన్నెలు అన్ని గూట్లో పెట్టడం.. ఇంకా చిన్న చిన్న పనులు అన్ని పెద్ద సైజు లో చేయించు కునేది..అప్పుడు child labour చెట్ట నేరం అనే concept తెలియక మా అమ్మ కింద బానిస లాగా బతికాను.. :p..అంత జాలి పడకండి..అప్పటివి అన్ని గుర్తు పెటుకుని...ఇప్పుడు కనీసం వంటింట్లో కాళ్ళు కూడా పెట్టం...మా అమ్మ ఎప్పుడైనా గట్టిగ అరిస్తే..నీకేం తెల్సమ్మ బెంగుళూరు లో నేను పడే కష్టాలు...
నా పళ్ళు నేనే తోముకుంట...నా టిఫిన్ నేనే తింట...ఆఫీసు లో పక్క వాడి పని కూడా నేను ఒకొక్క సారి చేస్తూ ఉంటా....అన్న ఏడుపు గాథ వినపిస్తే..అమ్మ మనసు కదా..కరిగి..మీ హాస్టల్ లో చేయని కూర చెప్పు....అని అడుగుతుంది...మా తమ్ముడు...గత సంవత్సరంగా నేను ఇంట్లో నే ఉంటున్న ఎప్పుడు అడగవే..అదేదో కట్టు కథలు చెప్తే కరిగి దానికేమో చేసి పెడ్తావ్ ఆంటాడు...నేను పిచ్హ పిచ్హ గా ఎంజాయ్ చేస్తాను...ఎందుకంటే అప్పుడు కక్ష ఇప్పుడు కూడా తీర్చుకోలేను..ఎందుకంటే..ఇప్పుడు రెండు problems ...height ..ఇంకా weight కూడా.. :D..

ఇది పక్కన పెడ్తే..కొన్ని రోజులయ్యాక అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్ళాను చదువుకోవడానికి ..ఇంక ఎన్నో కలలు...టీవీ remote నా చేతిలోనే ఉన్నట్లు...ఏమి కావాలంటే అవి చూసెస్తున్నత్లు  ...ఇంతలో ఆ పై వాడికి నా happiness ..నా కలలు నచ్హ లేదు..స్టొరీ లో ట్విస్ట్ ఇచ్హాడు..కొత్త స్కూల్ లో ఫీజు కట్టాక..ఆ రోజు సాయంత్రం..నేను స్కూల్ నుండి వచ్చి ఏదో కార్టూన్ చూస్తున్న...మా తాతయ్య వచ్చి క్రికెట్ పెట్టమ్మ కిరణమ్మ తల్లి అన్నారు...సరే అని పెట్ట..ఇక అంతే మారిస్తే..హే ..హే...వద్దు..వద్దు అని అరిచే వాళ్ళు..తాతయ్య అయిపోతుంది అంటే..అవి చాలా సార్లు వచ్చాయమ్మ అనే వాళ్ళు..అప్పుడు తమ్ముడు గాడు చూడనివ్వలెదు  అంటే..అవి మళ్ళి వచినప్పుడు నేను చెప్తాలే గాని...అమ్మమ్మ ఒక్కతే ఏదో చేస్కుంటోంది పాపం..నువ్వు వెళ్లి హెల్ప్ చెయ్యి అనే వాళ్ళు.....అప్పుడే తెల్సింది..నా ప్లేస్ మారింది కానీ కష్టాలు మారలేదు అని...క్రికెట్ రాని రోజుల్లో సోనీ టీవీ లో వచ్చే CID చూసే వాళ్ళు... అందుకే నాకు ఇప్పటికి క్రికెట్ అన్న CID అన్న ఇష్టం లేదు..అందులో act చేసే వాళ్లన్న  పిచ్చ చిరాకు...ఎంత కసి పెరిగింది అంటే..మొన్న శ్రీ రామ్ పాట కోసం అని indian idol చూస్తుంటే CID లో  అతను గెస్ట్..ఇక ఆ ఛానల్ ఇంకో గంట వరకు మళ్ళి పెట్టలేదు...మా నాన్న ఎంత బతిమిలదరో..ఐనా పెట్ట లేదు...!!

ఇక ఇంటర్ కి వచ్చాక మా బామ్మ దగ్గర ఉన్న ...ఆ నారాయణ కాలేజీ వాడు పెట్టె mental torture తటుకోలేక పొరపాటున టీవీ చూద్దాం అంటే..వెంటనే ఎవరో ఒకరు ప్రత్యక్షం అయ్యే వారు...మా బామ్మో ..మా తమ్ముల్లో ..నీకు ఆదివారం పరీక్ష ఉంటుంది కదా ..చదువుకో పో అని..కాలేజీ వాడు మర్చి పోయిన మా ఇంట్లో వాళ్ళే గుర్తు చేసి పరీక్ష పెట్టెల తగు జాగ్రతలు తీస్కునే వాళ్ళు....కానీ వాళ్ళు ఎం చూసిన 30 లో పెటుకుని చూస్కునే వాళ్ళు.. అంటే నాకు అప్పట్లోనే దేవుడు మైండ్ ని ఎలా కంట్రోల్ లో పెట్టుకొవాలో నేర్పించడానికి ట్రై చేసాడు...కానీ అర్థం కాక..చెవులు ఎలా కంట్రోల్ లో ఉంచుకోవాలో నేర్చుకుని..చదువుకునే దాన్ని...ఇంట్లో వీళ్ళు  ముగ్గురు లేనప్పుడు...మా పెద్దమ్మ పని చేస్కున్తునప్పుడు..మెల్ల గా వెళ్లి టీవీ పెడతా...ఇంతలో మా పెదనాన్న గొంతు..ఏంటే ఎంత వరకు వచ్చింది చదువు అని...ఏంటి ఈయన తొందరగా vachesaru అనుకుంటూ ఉండగా...ఆయనే చెప్తారు..ఇవాళ్ళ అసలు ట్రాఫ్ఫిక్ లేదే...ఏదో నా టైం బాగుండి తొందరగా వచ్చేస..ఏది remote ఇవ్వు...వార్తలు చూద్దాం అని..:( ...ఇక అక్కడ నుండి లేచి వెళ్లిపోతు..నా టైం ని నేను బండ బూతులు తిట్టుకుంట...

ఇక్కడ కట్ చేసి b .tech కి మళ్ళి ఇంటికే వస్తే..మా అమ్మకు  ..నాన్నకు మేము ఎంత freedom ఇచ్చమో అప్పుడే తెల్సింది.. కనీసం ఎదురుగ కూర్చుంటే చూస్తావ అని కూడా అడగకుండా... :p..నాన్న న్యూస్ చానల్స్,CID ,కాలి దొరికితే అమ్మ తేజ టీవీ లో వేసే పాత + ఫ్లోప్ సినిమాలు  చుస్తూ కంటిన్యూ అయిపోయారు..ఎవరు  లేనప్పుడు నేను చూద్దాం  అంటే..నా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చే వాళ్ళు...వాళ్ళు మాకు టీవీ ఉండదు మా రూం లో మేము కాసేపు చూస్తాం అని ...remote లాగేసే వాళ్ళు... :(...ఇలా టీవీ కి నాకు దూరం  ఏర్పడింది...
ఇన్ని experience లు అయ్యాక కూడా ఇంక  టీవీ చూడాలి అనిపిస్తే నేను పక్క దున్నపోతునే అవుతాను...కానీ అప్పుడప్పుడు మనిషిని అని మర్చిపోయి హాస్టల్ లో ఒకటి రెండు సార్లు remote తీస్కున్న...వచేసారండి...పై నుండి north అమ్మాయిలు...పక్క నుండి తమిలమ్మైలు...హే కిరణ్..keep 34 నా..keep 61   నా అని...ఇంక నేను జీతం లేని టీవీ ఆపరేటర్ గా కెరీర్ ని ఊహిన్చుకొలెక..అక్కడి తో స్వస్తి చెప్పి..మరీ అదృష్టం బాగుండి నాకు నచ్చే ప్రోగ్రాం ఏ ఎవరైనా చూస్తూ ఉంటే చూసి ఆనందించి వెళ్ళిపోత...
మొన్న మా తాతయ్య ఎవరో వస్తే చెప్తున్నారు...అసలు కిరణమ్మ వస్తుందే కానీ...నాకు ఏమి పోటి లేదమ్మా..ఆమె పని ఆమె చేస్కొని పోతుంది..నా ప్రోగ్రాం లు నేను చుస్కోవచు అని...!!ఒహ్హూ...ఇలా అనుకుంటున్నారా అని నేను అనుకున్నాను..ఏమి చేయలేక..!!

సో పొరపాటున ఇప్పుడు ఎవరన్న అడిగిన...టీవీ చూస్తావ అని..లేదు అంట....వాళ్ల మొహం లో ఆనందం నాకు అర్థమైపోతుంది...ఇది మనకు అడ్డం కాదు ..అని.. :)

ఇలా ఎన్ని త్యాగాలు చేసానో...త్యాగశీలివమ్మ..కిరణు..నువ్వు త్యాగ  శీలివి..!! :D

14 August 2010

దిక్కు తోచని అయోమయం ..!!

 ఒక  నిమిషం  ఆనందం .. ఇంకో  క్షణం  పట్టరాని  దుఃఖం    .
ఒక  నిమిషం  ధైర్యం .. ఇంకో  క్షణం  పిరికి  తనం ..
ఒక  నిమిషం  దైవత్వం … ఇంకో  క్షణం  రాక్షసత్వం …
ఒక  నిమిషం  ఎన  లేని  ప్రేమ …ఇంకో  క్షణం  అంతు  లేని  కోపం .. ద్వేషం …
ఒక  నిమిషం  మొత్తం  గమ్యం  కళ్ళ  ముందు ..ఇంకో  క్షణం  దిక్కు  తోచని  అయోమయం ..!!

మీకు  ఎప్పుడు  ఇలా  వెంట  వెంటనే  అనిపించలేద  ??

నాకు  ఈ  మద్య  ఇలా  చాలా  సార్లు  అనిపిస్తోంది ..!!

Life ఏంటో  విచిత్రంగా  ఉంది …mixed feelings….!!

Not that ఇప్పుడు  నేనేదో  పుట్టెడు  దుఃఖం  లో  ఉన్నాను  అని  .. but ఏంటో …

Ma TL చెప్పినట్లు …రోజులు  ,ఏళ్ళు  మనిషికి  పెరిగే  కొద్ది ..లోకం  తెలిసిపోతుంది ….so మనకు  ఎం  కావాలి  అనేది  perfect గా తెల్సి  పోతుంది …
అందుకే  పక్క  వాడు  నచ్చాలి    అంటే  యుగాలు  పడ్తుంది …అదే  చిన్న  తనం  లో  అయితే  ఎవరినైనా  ఇష్ట  పడతాం  తొందరగా  అంటుంది .. :D…
అందుకే  లేట్  అయ్యే  కొద్ది …పెళ్ళిళ్ళు  కుదరడం  కష్టం  ..అని  కూడా  అంటుంది ….జీవిత  సత్యం  చెప్పేసింది  కదా .. :D…

మన  కష్టాలతో  పోల్చుకుంటే ..పక్క  వాడి  కష్టాలు  ఒకొక్క  సారి  పెద్ద  గాను ..మరొక  సారి …ఏపాటిది  ఇది  నా  దాని  ముందర  అనే  భావన   కలుగుతాయి …
 ఒక సారి మా తమ్ముడు ..నాతో ఇలా అంటున్నాడు...ఇంతటి బాధ నీకొచ్చింది  కాబట్టి సరిపోయింది..అదే నాకొస్తే నా...అని ఆగిపోయాడు...మా నాన్న వెంటనే..భరించ గలిగే capacity దాని లో ఉంది కాబట్టే దానికి ఇచ్హాడు అని నాన్న అన్నారు..ఇదేమన్యాయం?? ఇంకా ఎక్కువ మాట్లాడితే..కర్మ concept picture లో కి వస్తుంది..ఇప్పుడు నేను అంత depth లోకి వెళ్ళ లేను.. :)
కానీ  ఒకో  సారి  ఉన్న  ధైర్యం ..ఇంకో  సారి  ఎందుకు  ఉండదు ?...అంత  ఏడుపు …ఏదో  జరిగిపోతోంది  అనే  ఫీలింగ్  ఎందుకు  వస్తుంది  అసలు . .
Mind ఒకే  రకంగా  ఎందుకు  ఉండదు ….??

But one thing ..నేను  ఒకటి  గట్టిగ  చెప్పగలను ….మనిషి  చేతిలోనే  ఉంది  మార్పు …చా  …అంటున్నార …

లేదు ..ఇది  వరకు  నేను  నమ్మని  concept…కానీ  change is constant..ఇప్పుడు  నేను  నమ్మే  ఏకైక  concept..!! :)

దేవుడు భలే సాడిస్ట్ అండి ...first దెబ్బ తగిలేల చేస్తాడు...అది తగ్గించుకోవాలని మానవ  ప్రయత్నం చేస్తున్నంత సేపు...తన చుట్టూ ఉండి ..వచ్చి మళ్ళి కిందకి తోసేసి...దెబ్బ తగిలిన చోటే తగిలేల చేసి...పుండు మీద కరం చల్లి...అందరిని పిలిచి పై లోకం లో ....మనల్ని చూపించి పార్టీ చేస్కుంటాడు...

మానవులం కనుక...మనిషి చెప్పిన కొన్ని theory లు ...positive thinking ...,lesson for the next time ...లాంటివి అలొచిస్తూ ముందుకి వెళ్తూ ఉంటాడు మళ్ళి దేవున్నే తలచుకుంటూ...ఇలా ఎన్ని రోజులో ..ఎన్ని పరీక్షలో తెలిసే లోపు...జీవితం THE END చూస్తుంది...ప్రతి phase లో ను మనిషికి బాధే...అందులో నుండి...నేర్చుకోవాల్సినవి ఎన్నో...ఎన్నెన్నో...ఎందుకంటే...నేను ఈ మద్య ఏ  మనిషిని కదల్చిన....వర్షం పడి ఆగిపోయాక చెట్టు కొమ్మను కదిలిస్తే ఎన్ని నీటి చుక్కలు పడతఃయో..అలా కష్టాల కథలు  వినిపిస్తున్నాయి ....అందుకే నా కంటికి అందరూ హీరో హీరోయిన్ లు గాను..దేవుడు విల్లన్  గాను కనిపిస్తున్నాడు.. :D...!!!

కానీ మంసిషి గ్రేట్ అండి...!! రెండు రకాలుగా ఆక్ట్ చేయాలి...బాధ ఉన్నపుడు ఎంతో ధైర్యం తో ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసుకు వెళ్లిపోవాలి..!!అందరూ actors ఏ ..!!మనకు సినిమా ఛాన్స్ లు లేవు కానీ...నంది ఏంటండి ..ఎప్పుడో ఆస్కార్ లు వచేసేవి..!!

అందుకే ఈ మద్య ఒక quote నచ్చి  దాన్ని follow అయిపోయి..వీలైనంత  మనుషులని నా సైడ్ నుండి hurt చేయకూడదు అనుకుంటున్నా..!!

Be kinder than necessary because everyone you meet  is fighting some kind of  battle

మొత్తం చదివాకా...మీకు ఏమైనా confusion ఉందా??..
అది నా పోస్ట్ తప్పు..కాదు..మీ మైండ్ తప్పు...
హహహ్హహః.. :D

31 July 2010

స్నేహం....

ఇది లేక పోతే ఒక మనిషి లేడు అని నా గట్టి నమ్మకం..

మీకేమో తెలిదు నాకు మాత్రం....చాల నేర్పింది..స్నేహమే..

వాళ్ళు మంచి చేస్తే అల చేయాలి అని..చెడు చేస్తే అల చేయకూడదు అని...ఒక దిక్సూచి ల గ నిల్చున్నారు..

అతి కష్టమైన సమయాలలో నా పక్కన ఉంది కూడా ఎప్పుడు వాళ్ళే...

నేను విసుక్కున్న..మల్లి తిరగి కాల్ కూడా చేస్తారు..ఎంత మంచి వాళ్ళో కదా...అంటే నేను మంచిదన్నైతే నే కదా..వాళ్ళు అంత మంచి వాళ్ళు అయ్యేది.. :P

ఇక తెల్సిన వాళ్ళు ఇలా ఉంటె...ఈ మద్య...ఈ బ్లాగ్స్ వల్ల బోలెడు మంది పరిచయం..మీరు ఫ్రెండ్స్ ఏ కదా మరి...

సో అందరికి Happy Friendship day…!!

ఒక్క నిమిషం...పైన ఉన్న పిక్ నేనే కష్ట  పడి  ఫోటోషాప్ నేర్చుకుని చేశాను...కాస్త పొగడచు కదా.. :)..
నాకు కవితలు,పాటలు...రావు...మాటలు అసలే రావు..:P అందుకే అల pictorial representation..!!:)

30 July 2010

PG కబుర్లు …..

PG అంటే  ?? ఏంటో  కనుక్కోండి  చూద్దాం…
అదేంటి  ..చాల  రోజుల  తర్వాత  బ్లాగ్  కి  వస్తే  ..ఇలా  ఎగ్జామ్స్  పెడతావ ….వేల్లిపోతం ………..అంటున్నార ..వద్దు  వద్దు  ..నేనే  చెప్తాను .. :)
అబ్బో  కిరణ్  PG చేసి  …దాని  కబుర్లు  కూడా  చెప్పేస్తోంది  అనుకుంటున్నారా ..బయటికి  అనకండి ..నన్ను ..మిమ్మల్నీ  కలిపి  కొడతారు …B.tech చేయడమే  కష్టమైంది ..ఏదో  దేవుడికి  నేనంటే   మరీ  ఇష్టం  కాబట్టి  ఒక  ఉద్యోగం  ఇప్పించేసాడు  ఒక  degree కే ..(అసలు  విషయం  ఏంటంటే  ….దీనికి  ఒక  ఉద్యోగం  ఇప్పిస్తే  ఇక  నా  జోలికి  రాదు ..రోజుకొక  విచిత్రమైన  నైవేద్యం  పెట్టి  పొద్దున్నే  నా  tongue   taste   ని     బాడ్  చెయ్యదు  …అని  అనుకోని  ఉంటాడు …)
PG అంటే  paying guest…మొన్నీ  మద్య  మా  చిన్న  తాతయ్య  INDIA కి  వచినపుడు  PG అంటే  post graduation అనుకున్నారట …Bangalore   మహా  నగరం  లో  ఎక్కడ  చుసిన  PG పోస్టర్  లు  ఉంటె  PG కి  కూడా  tuitions ఏంటి  మరీ  విడ్డురం  కాక  పోతే  అనుకుని  ,ఇంటికి  రాంగానే  డౌట్   clarify   చేస్కొని  ఆశ్చర్య  చకితులయ్యరట .. :)
మీరు  కూడా  అలాగే  ఆశ్చర్యానికి  లోను  అవ్వాలి  అంటే  ఈ  పోస్ట్  చదవాల్సిందే …
ఈ   పదం  నాకు   hyderabad లో  ఉండగా  పరిచయం  లేదు ..Bangalore వచకే  తెలిసింది …..
Hostel కి  కొంచం  posh   గ  polished గ  పెట్టిన  పేరే  ఈ PG….దీని  concept ఏంటి  అంటే  ఇంట్లో  వాళ్ళు  ఉంటూనే ..వాళ్ళతో  పాటూ  మనకు  ఒక  గది  ఇచి ..వాళ్ళు  చేసుకునే  వంటలే    మనకి  పెడ్తూ …ఇంట్లో  పిల్ల  లాగా  చుస్కుంటారు  అని  చెప్పారు ….ఇదంతా  మాయ  అన్న  మాట  కి  నాకు  కరెక్ట్  గ  అర్థం  తెల్సింది  నేను  PG లో  చేరిన  తర్వాతే ……
అప్పటి  వరకు  hostel లో  ఉండే  దాన్ని ..అదొక  పెద్ద  building..ఎవరి  పని  వారిదే ….room లో  వాళ్ళతో  మాట్లాడటం …time కి  తినడం ..నెలకి  రెంట్  ఇవ్వడం …..ఏమి  పెద్ద  kick ఉండేది  కాదు ….
ఒకానొక  రోజు   ఊరు    చివరున్న  ఒక  అడవి  tech park,forest nagar,Bangalore (అని  అంటూ  ఉంటారు ) …లో  J(Jungle) block ki నీ  ప్రాజెక్ట్  మారుస్తున్నాం ..వెళ్ళాల్సిందే  అన్నాడు  మా  మేనేజర్ …తప్పదా  …అంటే ..కంపెనీ  మారితే  తప్పుతుంది  అన్నాడు ……..1.5 yrs experience   ఏ  కదా  అని  ఆడుకున్టున్నావా ….డబల్ …డబల్  promotion తీస్కోని  నీకు  మేనేజర్  అయ్యి  నీతో  ఆడుకుంటాను  అన్నట్లుగా  ఒక  లుక్  ఇచి …okkk…will shift there అంటూ  సీట్  దగ్గరికి  వచ్చి  నసుగుథూ  ఉన్నాను …….నా  పక్కనే  ఉన్న  నాగవేణి ..ఏమైందే ….?? అంది  ఏమి  లేదే …..ఆ  అడవి  కి  వెళ్ళాలి  అంట  అన్నాను …hooo అవునా ……అది  ఇక్కడికి  30 kms….అయితే  నువ్వు   hostel కూడా  మారాలి  అన్న  నిజాన్ని  గుర్తు  చేసింది …..నాకు  ఆ  బెంగ  తో  typhoid కూడా  వచ్చింది …నిజంగా  నిజం ….
ఈ   అడవికి  వచ్చి ….ఆ  జ్వరం  లో  వెతుకున్నా …ఇల్లు  చూడడానికి  బానే  ఉంది …తెలుగు  వాళ్లే  కదా  అని  చేరాను ….ఇంకో  నిజం  ఏంటంటే ..ఆ  రోజు  ఓపిక  లేక  commit అయ్యాను …ఇలా  post రాసుకోడానికి  పనికొచింది ……
అక్కడ  condition లు ..గట్రా  విని ..typhoid + BP + HEART ATTACK లు  వచేస్తాఎమో  అనుకున్నా ….ఇంకా  నా  చేత్తో  వెరైటీ  వంటలు  తినాలి  అనుకున్న  దేవుడు ..అవేమి  రాకుండా ..typhoid   కూడా  తగ్గించేసాడు .. :)
ఇక  PG చూడడానికి   వచినప్పుడు  2 sharing   లేదా …అని  అడిగాను ..ఒక  రూం  చూపించాడు ….కళ్ళు  తిరుగుతున్నా  ..వాటిని  తిరగ  కుండ  చేత్తో  పట్టుకుని  చూసాను …… L shape hall లో  సగం  L ని  చెక్క  తో  partition   చేసి  2 మంచాలు  మళ్లీ  L shape లో  వేసి ..మా  ఇంట్లో  స్టోర్  రూం  లో  పెటుకునే  బీరవ  లాంటిది  ఒకటి  పెట్టి ..విత్  cupboard ..ఈ  రూం  కి  తప్ప  దేనికి  లేదు  ఈ  facility   అన్నాడు ..నాకు  అంత  అదృష్టం  ఎందుకు  లే  అని …చిన్న  బెడ్  రూం  లో  ఉంటాను  అని  చెప్పను ….ఇంతకీ  చెప్ప  లేదు  కదా …..ఇది  ఒక  డబల్  bed room house..ఒక  kitchen,Lshape hall,master bed room..chitti bedroom…..సరే  అని  na room లో  కి  దిగాక …నా  రూం  లో  నే  తెలుగు  పిల్ల  ఉంది ..దానితో  మాట  మంతి  కలిపాను ..ఒకొక్కటి  owner   ల  గురించి  లీలలు  చెప్పటం  మొదలు  పెట్టింది  ..నేను  నమ్మ  లేదు …కొంత  మందికి  ఎంత  చేసినా  satisfaction ఉండదు  లే   అనుకున్న్నా …కానీ  అప్పుడు  తేలీదు  కదా  PG లో  చేరిన  మొదటి  2  వారాలు  గెస్ట్  లు  …ఆ  తర్వత ..వాళ్ళకి  మేము ..మాకు  వాళ్ళు  ghost లు  అని …..ఇప్పుడు  నా  room mate కి  నా  sorry అనమాట ..
ఇక   రెండు  వారాలు  అయ్యాక  అసలు  కథ  మొదలయ్యింది …….అసలే  bangalore …చలి  ఎక్కువ …..geaser ఆన్  చేస్కొని  tea తాగే  లోపు …2,3 సార్లు  owner   వచ్చి  నాకేదో  షార్ట్  term memory loss  ఉన్నట్లు ..నువ్వు  geaser వేసావు ..నీళ్ళు  మసలి  పోతున్నాయి  అంటూ    వేళ్ళు  పైకి  కిందకి  అడిన్చెస్తూ      ఆ  నీళ్ళ  temperature ని  feel అయ్యేలా  చేసి …tea ని  cold tea లాగా  తాగుదాం   లే  అని  మనల్ని  fix అయ్యేలా  చేసి  వెళ్ళిపోతుంది …లోపలి కి  వెళ్లి  చుస్తే  ఆ   నీళ్ళు … ….గోరు  వెచ  గ   చచుంటాయి  ……. :(..ఏడుపు  వస్తుంది …..
ఫ్యాన్  లు  lite ల  విషయం  లో  అతి  జాగర్త  గ  ఉంటారు  పాపం …ఏ  రూం  లో  ఎంత  సేపు  fan తిరుగుతుంది ..ఎంత  speed మీద  తిరుగుతుంది  అన్న  విషయాల  మీద  research చెస్తూ  ఉంటుంది  మా  owner   ..ఒక  రోజు …నేను   ఆవిడకి  బకరా  of the day లాగా  కనిపించనేమో  నాకు  ఈ  రెండు  బయన్కరమైన  నిజాలు  చెప్పింది ….గుండె  కొంచం  గట్టిగా  పట్టుకోండి  pleassee..మీ  లాంటి  వాళ్ళు  నా  బ్లాగ్  కి  మళ్లీ ..మళ్లీ  రావాలి ….
1.       Fan మీ  రూం  లో  ని  తమిళమ్మాయి  5 లో  పెట్టుకుంటుంది …నాకేమో  బయం  వేస్తుంది  kiran..అది  ఎక్కడ  ఊడొచి    కింద  పడ్తుందో  అని …..అంది …నేను  ఎంతో   అమాయకంగా  అదేంటి  aunty loose   ga ఉందా  ఏంటి  అంటే ..కాదమ్మా  అంత  స్పీడ్  న  పెడ్తే  కింద  పడిపోదు ..అంది …watttttttttt???..నాకేమి  అర్థం  కాలేదు  కాసేపు ….room కి  వచ్చి ..తలుపు  వేసి …రూం  లో  అందరికి  అర్థం  అవ్తుంది  అని  English లో  translate   చేసి ..బయటకి   వినపడకుండా ……గట్టిగా  నవ్వేసాము  ….
2.       Kiran మీ  రూం  లో  వాళ్ళు  geaser   ఎక్కువ  సేపు  వేస్తున్నారు …..చెప్పు ….మొన్న  నేను  నీళ్ళు  పట్టుకుంటుంటే ..plastic పడింది  bucket లో  ఏంటా ..అని  ఆలోచిస్తే  అర్థమైంది ..మీ  room లో  వాళ్ళు  అంత  సేపు  వేసినందుకు ….plastic కరిగి  పొఇ  అలా  అప్పుడపుడు .. పడి  పోతు   ఉంటుంది …. ?@#@$#%????..meeku అర్థమైంద ???.....నేనే  పాపాల  బైరవురలిని …..నాకు  ఒక్క  దానికే  తెలుగు  వచ్చు  అందులో  ఏదో  కొంపలన్తుకున్నట్లు  పొద్దునే  లేచి  చల్ల  గాలికి  కూర్చుందామని  వెళ్ళినప్పుడు  తగిలిన  షాక్  లు ..ఇంకా  చాల  ఉన్నాయన్డోయి.…
చెప్తాను ….చెప్తాను ..కాస్త  విరామం  ప్లీజ్ …!!

15 July 2010

Blogs i like…

I love blogging as i mentioned in this post....and promised that will give you all the blogs which will be helpful,informative and entertaining.....and i categorized it ,so that people can easily go to their interesting subject and read the blogs... :)
ఇక మనం తెలుగు లో మాట్లాడుకుందాం..
ఎన్నో మంచి బ్లాగ్ లు ఉన్నాయి...
అన్ని రంగాల లోను....నాకు నచినవి నేను ఫాలో అవుతూ ఉంటాను...
అన్ని ఒకే చోట ఉంచితే మీకు,నాకు ఇద్దరికి వీలుగా ఉంటుందని.... ఇలాNOV పోస్ట్ చేస్తున్న..
ఇక ముందు కూడా కొత్తవి తెలిస్తే ఇక్కడే ఆడ్ చేస్తాను...
నా ఒంటరి తనం పోగొట్టిన మీ అందరికి నా కృతజ్ఞతలు...
ఎంతో encourage చేస్తూ....సలహాలు..సూచనలు ఇస్తున్న మీ అందరికి ధన్య వాదాలు.. :)


Arts and crafts

Daily Painting from Texas Contemporary Fine Artist Laurie Pace
Leaping into the world of the Starving Artist
My Impressions
Agrufus's Blog
Animal Art Adventures
Art and Craft Work
best water color paintings from zenarts paintings
Black on Grey on White
BRUSH - PAPER - WATER
Calligraphy | Art | Drawing | Painting | My Experiments | Reshmi Nair On Art
Chitravali
Contemporary Realism
Creative Collage
DEWBERRY FINE ART
ENTER THE WORLD OF ARTS
Figments of Imagination
Flower Fest
FUR IN THE PAINT
Glass Paintings
Glitter Birdie
HAND EMBROIDERY FROM SADALAS....
In the studio with artist Robert L Caldwell
Kai Kriye
kiran's Art world
Mercy's Pensieve
MEROPS
My creations
Nicole Caulfield Art Journal
Nits Arts and Crafts
PAINTINGS GALLERIES
Pencil Shavings
Pencil Sketching
Pinx Art Gallery
reshmi's art
Ryan Studio
Scott D. Tillett - Art Journal
Sree's Canvas - Garden of Hues
Steve Atkinson painting blog
Stop and Draw the Roses
Susie Short's Watercolor Splashes & Splatters
The Creative Bug
The graphite art of Clive Meredith
VanDerHoek Art
violet
Watercolor Painting
Watercolors of Nature
Watercolour Artist Diary
இன்று முதல்
క ళా స్పూ ర్తి
చైత్రరధం
మనోభిరామం
లీలామోహనం
♥* ` My Paintings ` *♥
udyama arts
Arti's art -- Life as I see it
pencil arts


Telugu


ఆడపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ . . .
ఆత్మానందం..
జాజి పూలు
జ్యోతి
తృష్ణ...
ప్రణవనాదం
మరువం
రెండు రెళ్ళు ఆరు
సాహితి
అమృత
ఆనంద మాయేటి మనసు కథ!!!
మానస - నా హ్రుదయం పలికే పదాలు
విశాల ప్రపంచం...
మనసు పలికే..
వెన్నెల సంతకం

ఎన్నెల
నాతో నేను నా గురించి...
నా పరిధి దాటి

Poetry

Poetry~Reflection of my feelings
Anu's world!
Padmarpita....
తొలి అడుగు
స్నేహమా....
నీకై నేను
ఏకాంత వేళ... ఉప్పొంగే భావా

మానసవీణ


Photography

of facts and fables
photos..
Praveena's world
Inner Lens
Photo Journalism
Untold Riddles
ചിത്രപ്പെട്ടി

చిత్తరువు

మధుర'చిత్రాలు

హరే చిత్రాలు

చిత్రాంజలి
బొమ్మని తీస్తే

Spirituality

Sai In My Breath
shirdibaba
Sri RamaKrishna & Swami Vivekananda Teaching Quotes
bhargavasarma
Dhivya Dharsanam


writing
ancient indians - satya samhita


Ek Sparsh
Gnyanam - A word to the wise
Kishkinda - Ancient Deccan Civilization
NovoSphere
Old Thoughts
Pranav`s Microcosm
Pranav`s Space
SatyaVeda: All about the Veda
Stories and Stuff!
Thatha and the Magic Grain

ZEN INSPIRATION

updated on : 23-Jan-2011

14 July 2010

భక్తి-భక్తుడు-భగవంతుడు

ఈ రోజు భక్తి యోగం  సారంశం చెపుతూ...చేసిన ప్రతి పనిని కృష్ణుడికి అర్పించాగలవా? అని అడిగారు మా గురువు...
చాలా కష్టం అని చెప్పాను..
నేను ఇంత వరకు అల ఎప్పుడు చేయలేదు..చేయ లేక పోతున్నాను..అని  చెప్పాను...
బాబా పారాయణం లో  కూడా బాబా ప్రతి పని ముందు ..చేసేటపుడు...నన్ను తలచుకో అని చెప్తాడు..

కానీ చేయలేను...చేయక పోవడమే కదా...అసలు ఆయనని...మాములుగా రోజుకు ఒక్క సారి కూడా తల్చుకోడానికి బద్ధకిస్తాను...
అప్పుడు ఎంతో guilty గా ఉంటుంది అని చెప్పాను ...
దానికి చిన్న కథ చెప్పారు....

కృష్ణుణ్ణి ఒక సారి నీకు అత్యంత ప్రియమైన భక్తుడు ఎవరు అని అడిగారంట... 
అప్పుడు కృష్ణుడు ఒక ఊరిలొ ని పేద రైతు ని చూపించాడు ట     .. 
అది అక్కడ ఉన్న వాళ్ళకి నచలేదు...అందుకే కృష్ణుడు నారదుణ్ణి పిలిచి ఒక చిన్న గిన్న లో నూనె ని అటు చివరినుండి..ఇటు చివరికి ఒక చుక్క కూడా కింద పడేయకుండా...తీస్కెళ్ళ గలవా ? అని అడిగాడుట ...ఓ..అని తీసుకు వెళ్ళాడు ఒక్క చుక్క కూడా పడేయకుండా....అప్పుడు కృష్ణుడు..నువ్వు ఆ గిన్నె ని మోస్తున్నంత సేపు నన్ను ఎన్ని సార్లు తల్చుకున్నావ్..?అని అడిగాడు...నా ఏకాగ్రత అంత గిన్నె మీదే ఉండి..నీ మీద లేకపాయింది అన్నాడు నారదుడు....
అప్పుడు కృష్ణుడు...ఇంత చిన్న దానికే నువ్వు నన్ను మరచావే..మరి అంత పెద్ద సంసార భారాన్ని మోస్తూ కూడా నన్ను రోజుకు ఒక్క సారైనా తల్చుకుంటాడు....
అందుకే నాకు అంతనంటే ఇష్టం అన్నాడుట..!!

సో బాబా కూడా నువ్వు...నీ హెల్త్ ప్రొబ్లెంస్,ఆఫీసు ప్రొబ్లెంస్ అన్ని భరిస్తూ కూడా ఆయన్ను తల్చుకుంటున్నందుకు హ్యాపీ గా ఫీల్ అవతాడు లే అన్నారు...మా గురువు.. :D
బాగుంది కదా కథ...!!
నాకు ముందే మంచి విషయాలు గుర్తు పెట్టుకునే మెమరీ తక్కువ..
మరచిపోతానని...ఇలా నా లాగా దేవుణ్ణి తలచుకోకుండా బాధ పడే బద్ధకస్తులకి... :P ఈ కథ కాస్త ఊరటనిస్తుందని..ఇక్కడ పెడ్తున్న... :)
 

7 July 2010

భగవద్గీత ...

అసలు దీని మీద నాకు ఎందుకు అంత  ఇష్టం ఏర్పడిందో...ఎప్పుడు ఏర్పడిందో తెలీదు ...
మే be నేను సాయి పారాయణం ఎక్కువ చేసే దాన్ని..
అందులో బాబా అందరికి రామాయణం కానీ,భగవద్గీత కానీ,విష్ణు సహస్త్రనామం కానీ ,భాగవతం కానీ చదవమని చెప్పే వారు...
భగవద్గీత మా బామ్మా చదువుతూ ఉండేది...
అన్ని కలిపి అసలు దాన్ని కంటస్థం చేయక పోయిన ..అసలు ఏముంది అందులో అనే కుతూహలం కూడా పెరిగింది..
ఘంటసాల భగవద్గీత వినడం స్టార్ట్ చేశాను..అది mostly  2 years నుండి regular గా వింటాను  ...
ఈ మధ్యే సీత నాకు గీత మకరందం గిఫ్ట్ గా ఇప్పించింది సత్య గారి తో...అది ఒక memorable day..!!
అదే అద్బుతం అనుకుంటే నా అదృష్టం ఎక్కువ అయ్యి....వాళ్ల  టీచర్ కుంద మిస్ దగ్గరికి వెళ్లి....ఆవిడ చేతుల మీదగా మళ్ళి ఇంకో సారి అందుకొని..
12 వ అధ్యాయం లోని కొన్ని శ్లోకాల అర్థాలు చెప్పారు...
నాకు ముందే చాలా ఇష్టం..అల పెద్ద వాళ్ల ఆశీర్వాదాలు అందుకోవడం...
బాబా పారాయణం లో ఆయన ఇలాంటి గ్రంధాలని స్పృశించి ఇస్తూ ఉంటారు...
ఎందుకో ఆ ఫీలింగ్ కలిగింది...
ఇక అది తెచుకున్ననే కానీ ఎప్పుడైనా ఆఫీసు లేని రోజుల్లో గట్టిగ introduction చదవగలిగాను...
నాకు ముందే శ్లోకాలు చదవాలంటే భయం  ....తప్పులు  పోతాయేమో అని...
అందుకే ఏదైనా  తాత్పర్యం తెలుసుకొని వదిలేస్తా....
కానీ దేవుడు మంచోడు.....కరుణ చూపించి...ఒక గురువును పరిచయం చేసాడు....ఎవరో కాదు సత్య..
తను ఏ విషయమైన చాల మంచి మంచి ఎక్షమ్ప్లెస్ తో అర్థమయ్యేలా explain చేస్తారు....
సత్య గారి పుణ్యమా అని ఎలా పలకాలో నేర్చుకుంటున్న..తనకి తన గురువు అంటే ఎంత ప్రేమ,నమ్మకం ఉన్నాయో....
నాకు ఎప్పటికీ అంతే ప్రేమ గౌరవం ఉండి....నేర్చుకుంటూ ఉండాలని కోరికగా ఉంది.. :)  
థాంక్స్ సత్య గారు..!!! :)...
నా ఒక కల నిజమవుతోంది....:)


 
 

23 June 2010

గాలి వాన లో ..వాన నీటిలో ….

పడవ ప్రయాణం కాదండీ …

Bangalore జీవన విధానం …

ఇక్కడ ఉండే ఎవరిని అడిగిన తప్పక చెప్తారు …!! నేను అన్నది 200% correct అని …!!

ఎండా కాలం లో కూడా వర్షాలు పడతాయి …..ఇది విన్న మా చుట్టాలు మాకు కాస్త పంపవే వాటిని అంటారు …

నేను ..అయితే okkk..ఇవాళ్ళ 4 can లు పట్టి ఉంచుత ఇక్కడికి వచ్చి తీసుకేల్లిపొండి అని చెప్తాను …:P

నా జవాబు విపరీతంగా నచ్హి ….నన్ను పొగడలేక ..ఇక మాటలు పొడిగించా లేక phone పెట్టేస్తారు

వాళ్ళు ఒక రకంగా బాధ పడతు ఉంటె నేను ఈ కింది రకంగా ఫీల్ అవుతూ ఉంటాను..

ఎప్పుడైతే తెల్ల డ్రెస్ వేసుకొని ..heal లేకుండా చెప్పులు వేసుకున్దమనుకుంతనో ….అప్పుడు time 8:30….మంచి ఎండగా ఉంటుంది …heal లేని అని ఎందుకు అన్నాను అంటే అవి వేసుకుంటే అచ్చం నేల మీద నడిచినట్లే ఉంటుంది 
 తెల్ల డ్రెస్ వేసుకొని ….heal లేని చెప్పులు వేసుకొని ..బైటికి అడుగు పెడతాను ….అప్పుడు టైం 8:45

అప్పుడే వరున దేవుడు పైనుండి చూస్తాడు …పాపం ఎవరూ తోడు లేకుండా వెళ్తోంది..నేను వెళ్దాం దీనికి తోడు అనే అద్బుతమైన ఆలోచన ఆయనకు వస్తుంది..
మా సందు చివరకు వెళ్ళగానే మబ్బులు స్టార్ట్ అవతాయి ..నా నెతి పైన కుండ కూడా కారడానికి ready గ ఉంటుంది …

Road క్రాస్ చేసేటప్పుడు ….కింద మట్టి …బురద ఏమి చుస్కోకుండా ప్రాణ బయం తో ఒక కాలు అటూ ఇటూ పెట్టేసి …ఆ బురద లో జారెంత పని చేసి …ఎట్ట కేలకు …ఇటు వైపుకు వచేసాక ..

చినుకులు స్టార్ట్ అవుతాయి …..నా కుండ కూడా పగిలి పోతుంది ..

ఇక ఆ కన్నీటికి అంతం లేక పెట్టుకున్న కాటుక కూడా చెరిగిపోయి ..ఆ వానలో సగం జుట్టు ..సగం dress తడిసి ..అప్పలమ్మ లాగా ఉంటా ..ఆఫీసు కి చేరంగనే వాష్ రూం లోని పెద్ద అద్దం వెక్కిరిస్తూ ఉంటుంది ..పొద్దున్నే ….angel angel అంటూ రెచిపోయావ్ కదా ..ఇప్పుడు చూస్కో నీ మొహం ..అని ..

ఉక్రోషం తో అద్దం పగల కొట్టేదామన్న కోపం వచెస్తూ ఉంటుంది ..ఆ పక్కనే ఉన్న సెక్యూరిటీ అప్పటికే doubt గ చూస్తూ ఉంటుంది ….అసలు ఇది ఈ కంపెనీ లో పని చేసే అమ్మాయా?? లేక నా పోస్ట్ కు పోటి గ వచ్చిన ఇంకో Tingarida అని??
ఎందుకోచింది లే అని …మొహం కడుక్కొని …వెళ్ళిపోతాను …

ఇక మల్లి సాయంత్రం వచేటప్పుడు …correct గ కాలు తీసి బైట పెట్టాకే ..వాన పడ్తుంది …అది 4:30 కానివ్వండి ..5,5:30,6,6:30 ఏ time ఐన సరే …

పాపం నేను లేకుంటే వాన లేదు …

రోజు మా Tl car లో కాస్త దూరం drop చేస్తుంది ..నేను car నుండి దిగంగానే వాన start అయిపోతుంది ….నాకు గొడుగు మోస్కేల్లాలంటే బద్ధకం …తడిచిన తడుస్త కానీ అది మాత్రం తీసుకెల్లను ..

కానీ మా TL car డ్రైవర్ ఊర్కొడు …madam వద్దు …తీస్కేల్లండి ..పర్లేదు ..madam దగ్గర 2 ఉన్నాయి అంటూ ..అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు చేస్తాడు ..

వానను …డ్రైవర్ ని ఇద్దరినీ తిట్టుకుంటూ  దిగుత car..

నేను రూం కి చెప్పులు వదిలే వరకు మాత్రమే ఉంటుంది ఆ వాన ..

అందుకే మా టీం వాళ్ళు నేను చేరాను అని confirm చేస్కున్నకే వాళ్ళు ఇంటికి స్టార్ట్ అవతారు

మల్లి సూర్యుడు కూడా వస్తాడు …

సరే గతం గతః …

అని మర్చిపోయి

బట్టలు ఉతకడానికి పైకి వెళ్త ..

అన్ని నాన పెట్టి …

కిందకి వచ్చి బాగా ఎండగా ఉన్ద్ధమ్మాయి    …..తప్పకుండ ఆరి పోతాయి ….

అంటూ  …

8 జతఃలు డ్రెస్ లు,2 జతల nite డ్రెస్ లు,ఒక దుప్పటి ,ఒక towel ,ఒక దిండు కవర్ ….అన్ని వీరావేశం తో

బట్టలుతికే వీర నారి అన్తూ ఉతికేసి …..

అన్ని చక్క గా ఆరేసి ..క్లిప్ లు పెట్టి …bucket తీసుకు వచేస్తుంటే …………….పెద్ద వాన ఒక్క సారిగా  పడుతుంది …

పొద్దున్న ఏడుపుని కంటిన్యూ చేయలేక ..

కిందకి రాంగానే నా frns….తప్పకుండ ఆరిపోతాయే ..రేపు పొద్దున్నకీ అంటూ నేనన్న మాటలు నాకు గుర్తు చెస్తూ …ఉడికిస్తారు …

అందుకే నేను బెంగుళూరు లో బట్టలు ఉతికే పద్ధతి కనిపెట్టాను …

బట్టలు నానపెట్టండి …కానీ …..brush చేయకండి ..కనీసం జాదించడానికి కూడా ప్రయత్నించ వద్దు …ఒకే సరి …తాడు మీద వేసి క్లిప్ లు పెట్టేయండి ..ఒక 10 నిమిషాల్లో ఎలాగో వాన పడుతుంది …

రెండో option..

ఓపిక లేదా ?? నాన పెట్టడానికి కూడా …వద్దు శ్రమ పడద్దు ..

ఇలా ఫాలో ఐపోండి ..

ఉతకాల్సిన బట్టలు తాడు మీద వేసి clip పెట్టి ..తగినంత సుర్ఫ్ దాని మీద చల్లండి …..ఆ పై వర్షం తన పని తను చేసుకుపోతుంది …

ఇదండీ .. సంగతి …

ఇక అవి ఆరడానికి ఒక యజ్ఞం …

2 రోజులు ఐన వర్షం పాడడం ..ఆరడం ..మల్లి తీసే లోపల మల్లి పడడం ..

ఈఇ process లో నాలుగు జతలు కలర్ లు పోయుంటాయి …ఇంకో నాలుగు జతలు మీవని మీరు గుర్తుపట్టలేరు ..

సో …కొత్త dress లు కొనుక్కునే ఛాన్స్ లు ఎక్కువ ,….ఉంది …

ఎండ రావడానికి ఒక తపస్సు చేద్దామనే ఆలోచన వచ్చింది …..

కాసేపు కళ్ళు ముఉసుకొని ..సూర్యుడా …సూర్యుడా అని జపించాను …

అన్నం time ఐంది అని పొట్టకి తెల్సింది …తినడానికి లేస్తూ ఉంటె అందరు వచ్చి తపస్సు చేసేటప్పుడు ఎవరు అన్నం తినరు …సో నీకు చేయలేదు ..ఆ మాట owner తో చెప్పెసం అన్నారు …

ఏడవలేక …నవ్వుథూ ఉంటె ..ఎలుకలు పందికొక్కులు అవుతున్న వేల ఎన్టీ మాటలు ???? అన్నట్లు వాళ్ళ కేసి చుస్తూ ఉంటె ..

మా owner నన్ను ఎగ దిగ చూసి ..

పోతానేమో అనుకుని …వాళ్ళేదో సరదా గ అంటున్నరులే నీవెళ్ళి plate తెచుకో అంది ..

Okk…అన్నం తినచు కానీ తపస్సు కంటిన్యూ సూర్యుడు కనిపించే దాక అన్నాను …

సరే కుమ్ము అన్నట్లు చూసారు …

అన్నం తిన్నాక ….

Time చూసాను 10 ఐంది ..నిద్ర ముంచుకొస్తోంది …

ఎలా చెప్పాలో తెలియక ..

తపస్సు ..కూర్చునే చేయాలి అని ఏముంది …

పడుకుని కూడా సూర్యున్ని తల్చుకున్తూ ఉంటె పొద్దున్నకల్ల వచేస్తాడు అని ..ఎవరి కి దొరకకుండా ..గబుక్కున రూం కి వెళ్లి తలుపేసి ముసుగుతన్నాను …

అంతే కళ్ళు తెరిచి చూసే సరికి చిమ్మ చీకటి ….

Early morning లేచానేమో అనుకున్న ….

కాదు ….చుట్టూ మా HOSTEL వాళ్ళు వెలుతురు అనేది లోపలికి రానీయకుండా నిల్చున్నారు ….

ఏమైంది అంటే …

నీ లాంటి వాళ్ళు తప్పు తప్పు తపస్సులు చేసి …అసలు సూర్యుడు 10 ఐన రాకపోవదేమే కాక …

పొద్దున్నుండి కుండ పోత గ వర్షం …..

మేము ఈ రోజు w-end అని ఎన్ని ప్లాన్ లు వేసుకున్నాము ..

సినిమా టికెట్ లు బుక్ చేస్కున్నం …

అంత flap…అంత flap..

కేవలం నీ వల్ల ..నీ తపస్సు వల్ల అత్నూ ..

నేనేం చేసానండి ..????

14 June 2010

వెర్రి మనసు

ఎంతైన చిన్నప్పటి కల్మషం లేని మనసు మల్లి మనిషి జీవితం లో పొందలేడేమో కదా...
ఎంతో అమాయకం,.. మంచితనం...
అబద్దాలు ఉండవు...అపార్థాలు ఉండవు...
స్వార్థం అసలే ఉండదు ...
పక్క వాడు తప్పు చేసిన...గాయ పరచినా కూడా తెలియని తనం..
అబ్బా !!! మల్లి ఆ రోజులు వస్తే ఎంత బాగుండో కదా....
ఈ లోకం తెలిసిన మనసుకి ఎన్ని రకాలుగా నచ్చ చెప్పిన మాట వినదు ....
మొండికేస్తుంది..
ఎంత చెట్టుకి అంత గాలే....ఎవరి రేంజ్ లో వాళ్ళు తప్పులు చెస్తూ ఉంటారు.....బాధపడుతూ ఉంటారు.....
ఈ ప్రాసెస్ లో పక్క వాళ్ళని hurt చేయాల్సి వస్తుంది అని చెప్పాను...
ఊహు కాదు...వారికీ ఇలాంటిదే జరిగితే ఉర్కుంటారా ?...అవునే ఊరుకుంటారు ..వాళ్ళు కూడా ఏమి చేయలేరు...అని చెప్పాను..వాళ్ళు ఇంకొకరి వళ్ళ బాధ పడ్తు ఉంటారు ..ఇదంతా ఒక పెద్ద నాటకం ..దేవుడు స్క్రిప్ట్ రాసాడు..మనకి అర్థం కాదు అన్నాను...
ఆహా...అల ఏమి కాదు..
అన్నింటిని అర్థం చేసుకునే మెదడు అందరికి ఇచ్చాడు...ఎప్పుడు నువ్వే ఎందుకు అర్థం చేసుకోవాలి??..
అబ్బా ..అలాగే వాళ్ళు అనుకుంటూ ఉంటారే మానసా అని చెప్పను...
ఏమో అనింది...
సరే పోనీ నిన్ను గాయ పరచిన వారు లేక... వచ్చి నిన్ను క్షమాపణ అడిగితే చాల?? అని అడిగాను...
ఊహు వద్దు పక్క వారు బాధ పడినా guilty గ ఫీల్ ఐనా నాకు మల్లి వాళ్ళు నా గురించి hurt అయ్యారు అని ఫీల్ అవుత అనింది ..
మరేం చేయాలో పాలుపోవట్లేదు...
ఎవరు గాయ పరిచారో వాళ్ళకి వెళ్లి..ఇన్కెవరినీ ఇలా గాయపరచకు ...అని చెప్పి రానా?
అమ్మో వద్దు..అది ఇంకా బాధ పెడ్తుంది ఇద్దరినీ....
వాళ్ళకు ఎలా తెలుస్తుంది వాళ్ళు తప్పు చేసారు అని మరి ??
ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉంటుంది..
కానీ మనుషులకు ఇగో ఎక్కువ ఐపోయి .వారి తప్పు తెలిసినా కనీసం సారీ కూడా చెప్పరు...కానీ hurt ఐన వాల్లేమో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎం చేసారో అనుకుంటూ ఉంటారు..
మరెందుకు దీని గురించి ఇంత దిస్చుస్సిఒన్..??
తెలియదు...
అది కదమ్మా ......నీ స్థాయి లో నువ్వు తప్పులు చేయ కుండా ఉండటానికి ప్రయత్నించు...బాధ పెట్టకుండా ఉండటానికి ప్రయత్నించు.....ఇక ఆ పై నీ జోలికి కూడా ఎవరు రారు..
అవసరమైతే నోరు విప్పి మాట్లాడు...
నాకు మాట్లాడాలి అనిపించదు..
వాదించ బుది కాదు.....అరవ బుది కాదు .....దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు....ఎవరికి ఎం జరగాలో అది జరుగుతుంది....మన చేతుల్లో ఏమి లేదు అని అనిపిస్తుంది...
ఏమే సన్యాసం తీస్కున్నావా?
లేదు...మరెంటా మాటలు..??
నాకు అవే నిజంగా అనిపిస్తున్నాయి,.......
అనవసరంగా సూటి పోటి మాటలు మాట్లాడుకొని చివరికి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు...
మనుషులంత ఇంతే.....నన్ను బాధ పెట్టకుదడనే ఆలోచనతో....వాళ్ళ ల్లో వాళ్ళు బాధ పది పోయి శారీరక బాధ లు తెచుకుంటూ ఉంటారు
నాకర్థం కవట్లేదే...ఎం చేయాలి ????
దానికి కల్మషం లేని మనసు కావాలి... అంటూ కన్ను కొట్టి పారి పోయింది...
నాకు జవాబు చెపరూ .. :(

అనన్య చురకలు !

మా పాపా పేరు అనన్య  ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను  దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...