15 May 2011

నాలోని కళ..

కిరణు నీకు కలలే అనుకున్నాం ..కళలు కూడా వచ్చా అనే కదా మీ సందేహం ..ఇలాంటి సందేహాలు తీర్చేద్దామనే ఈ టపా..!!ఒక ఆదివారం నాడు ఏమి తోచక అలా కూర్చుని ఏదో ఒకటి చెయ్యి కిరణు అంటూ నాకు నేను చెప్పుకుంటున్న సమయం లో ...అద్దం లో పసుప్పచ్చ కాంతి కనిపిస్తోంది ... (బల్బ్ ఎలిగింది ..)..ఏమని వెలిగిందయ్యా అంటే...నా నేస్తం ఇచ్చిన రెండు తెలుగు పుస్తకాల దుమ్ము దులపమని..ఒకటేమో అమరావతి కథలు..ఇంకొకటేమో రమణీయం..మొదట..అమరావతి కథలు తీశాను..చిన్ని చిన్ని కథలు మొదలెట్టే ముందు 'ముందు మాట' చదివాను..అందులో..బాపు గారి బొమ్మలకి రమణ గారి వివరణ..ఆహా అద్భుతం....నాలుగు అయిదు గీతలతోనే ఎంతో అర్థవంతమయిన కథకు తగ్గట్టు బొమ్మలు..ఎంతయినా బొమ్మలు వేయడం అంటే ఇష్టం వల్ల నాకూ ఏదైనా గీయాలి అనిపించింది..కాదు లే ఎప్పుడయినా గీయచ్చు..ఇలాంటివి చదివటానికి మళ్ళి సమయం దొరకదేమో అనుకుంటూ..రమణీయం ఎలా ఉందో కాస్త చదువుదాం అని మొదలు పెట్టా...మొదట్లోనే..వేణువులు తాయారు చేసే గోపన్న కథ...రాధా గోపాలం ల కథలు...ఎంత నచ్చేశాయో...ఇక నా లోని కళను బయటికి తేవాలి అనిపించేసింది..

ఇక అంతే ..అది అక్కడిక్కక్కడ మూసేసి....అమ్మా..అని ఓ కేకేశా..ఎవరు పోయారు ..ఎందుకలా అరుపులు అంది.సర్లే నెమ్మది గా మాట్లాడుతాలే కానీ ...పాత శుభలేఖలు ఏమైనా ఉన్నాయా ..అని అడిగా ..ఇది మరీ బాగుంది .. పోయిన సారి వచ్చినప్పుడు నువ్వే కదా ..ఇల్లు అసలు నీకు శుభ్రంగా పెట్టుకోడం రాదు అని ..అన్ని తీసుకెళ్ళి చెత్తబుట్టలో వేశావ్ అంది ..

ఆ చెత్త ఇప్పడు పడేశారా అన్నాను ....నువ్వు వచ్చి నెల పైన అయిపొయింది అంది..అమ్మ...ఇంతలో నాన్న ఆ చెత్త తీస్కుని వెళ్ళే అబ్బాయి ఇల్లు నాకు తెల్సు అన్నారు..వామ్మో ఇద్దరు ఈ రోజు నాతో ఆడుకునేలా ఉన్నారు అని...మాట మార్చి..సరే కానీ ఈ మధ్యలో ఎవరివయినా తెల్సిన వాళ్ళ పెళ్ళిళ్ళు ఉన్నాయా అన్నాను ...హా ఆ పక్క వీధిలో సంధ్య ది పెళ్ళంట ..సరే వచ్చినప్పుడు ఓ రెండు శుభలేఖలు ఎక్కువ అడుగు..హా ..ఏమిటి ?..మా అమ్మ మొహం లో ఆశ్చర్యం తో కూడిన చిరాకు ...ఇంతలో మా ఎదురింటి పిన్ని ...అమ్మాయి మా అక్క తల తినడం ఆపేయ్ ..మా ఇంట్లో ఒకటి ఉండాలి రా ఇస్తాను...అంది..సరే దా పిన్ని అని వెళ్లి ఆ శుభలేఖ అరువు తెచ్చుకున్నా ...ఎందుకో తెల్సా ..కింద చూడండి ..

మొదటిది ....వేణువు ..మన రమణ గారి రమణీయం లో ఉన్న గోపన్న వేణువుల కథ చదివి ఎంతో నచ్చి స్ఫూర్తి(అబ్బాయిలు - ఇది అమ్మాయి పేరు కాదు..) గా తీస్కోని ..ఇలా గీశాను....


రెండవది ..కిట్టయ్య అంటేనే ..నెమలి పించం,మురళి ఇవన్నీ గుర్తోచ్చేస్తాయి కదా ..అలా గుర్తొచ్చి వేసింది ..

ఇంతలో బాపు గారు గుర్తొచ్చారు ..ఆయన శైలి లో కిట్టయ్య ని గీయాలనిపించి ...మొదట కిట్టయ్య ని గీశా ...మా రాధమ్మ ఎక్కడ అన్నాడు?వస్తుంది లే ..కాసేపు నాతో ఆడుకో అని చాలా సేపు కిట్టయ్య తో ఆటలు..పాటలు ..అయ్యాక ....వెన్న అడిగాడు ...బాబు కిట్టి మా ఇంట్లో వెన్న లేదు అన్నాను ..ఏదో ఒకటి పెట్టు ఆకలి అన్నాడు ..మిరపకాయ్ బజ్జి తెస్తా అనే లోపే ...తోలు తీస్తా అన్నాడు ..నో కిట్టి u n me frns అని వెళ్లి ఏమున్నాయా అని వెతికా..సున్నుండలు హై తింటావా అని అడిగా ..సరే పెట్టు అని తినేసి ...నా రాధ అంటూ మళ్లీ మొదలెట్టాడు ..ఒకే ఒక్క చిన్ని సందేహం అది తీర్చి వెళ్ళిపో అన్నాను..ఏమిటో అడుగు..అనంగానే...కాదు కిట్టయ్య ఇందాక నా తోలు తీస్తా అన్నావ్ కదా...నాకు ఇచ్చిందే తోలు అది తీస్తే ఉత్త బొమికెల మీద బతకాలా..అని అడిగాను..ఆయన జవాబు ఇచ్చే లోపే..కాదు కిట్టి అదేంటి కొందరికి..కలర్ + కండ + తోలు ఇస్తావ్..కొందరికి.కేవలం కలర్+తోలు మాత్రమే ఇస్తావ్...నీ దగ్గర రక రకాల packages ఉంటాయా..??దాని menu ఎక్కడ ఉందో చెప్తే వచ్చే జన్మ కి ఎలా కావాలో నేను సెలెక్ట్ చేస్కుంటా అన్నాను.. కిరణు...నీకు ఈ జన్మ లో అనవసరంగా బుర్ర అనేది పెట్టాను...వచ్చే జన్మ లో అది ఉండదు అన్నాడు....ఉండు కిట్టి నీకు BP వస్తోంది అని ఓ పది నిమిషాల్లో ఆవిడను కూడా గీశేసా.. ఇక మనమెందుకు లే వీళ్ళ మధ్య లో అని వీళ్ళను పక్కన పెట్టి

వీళ్ళిద్దరి ప్రేమ ను చూసి మురిసిపోతుంటే ...ప్రేమే నాతో చాలా మాటలు చెప్పింది ...కిరణు చూడవే ..ఆ ప్రేమ ఎంత బాగుందో ...ఇప్పుడు నా పరిస్థితి ఏం బాలేదు ..అసలు నా అర్థం నేనే మరచిపోయా ..ఒకొక్క సారి నిజమైన ప్రేమ ...ఓ సారి వెర్రి ప్రేమ ..ఓ సారి తిక్క ప్రేమ ..ఓ సారి రాక్షస ప్రేమ ...ఇన్ని అవతారాలు ఉన్నాయని నాకే తెలియలేదు ..అంటూ నాతో పలికింది ...హిహిహి అని పళ్ళు ఇకిలించా ....కోపమొచ్చి తుర్రుమంది .


ప్రేమ.. ప్రేమ.. పోతావా ప్రేమ అని పాడుకుంటూ ఉంటే ...

కిటికిలోనుండి పువ్వులు కనిపించాయి ....పువ్వులని వెయ్యాలి అని పెయింట్ తీసానో లేదో .....సీతకోకచిలుక సినిమా లోని మాటే మంత్రము పాట వినపడింది ...ఆహా ..పూలు ...సీత కోక చిలుక సూపరు అనుకుంటూ ఈ కిందది గీశేసా..


ఇప్పుడేం చేయాలా అని మిగిలి ఉన్న కార్డు ముక్క ని చూసా ..ఆ కార్డు తాయారు చేసిన వాళ్ళు కూడా ఏదో పుస్తకాలు చదివారనుకుంట ..కాస్త కళాత్మకంగా ఆలోచించి పైన కార్డు మూసే చోట ఇలా వంపు వచ్చేలా తయారు చేసారు ...అది చూడంగానే ..ఇందులో నెమలి ని కూర్చో పెడ్తే భలే ఉంటుంది అనిపించింది ...అంతే .....!!కూర్చో పెట్టేశా...ధన్యవాదములు కిరణు అని కూడా అది చెప్పింది ....నేను యెల్కం అన్నా..


అప్పటికి సమయం సాయంత్రం ఆరు ..అమ్మ వచ్చి ఏమే ..ఏ పిచ్చి పడ్తే అదేనా ..??చాల్లే గది లో నుండి బైటికి రా అనింది ...నా కళను మెచ్చుకోక పోవడమే కాక ...తిట్టిందనే కోపం తో ..ముందున్న కార్డు ముక్క తీస్కోని ...తీగలు చుక్కలు చేతికోచ్చినట్లు వేసి నా బాధ వెలిబుచ్చుకుని ..వెళ్లి కాసేపు అమ్మతో మాట్లాడాను ..

రాత్రి అయ్యింది .....చందమామను చూద్దాం అంటే ఆయన కనిపించలేదు చుక్కలు కనిపించాయి ..అయ్యయ్యో ..వీళ్ళు ఇంక పండగ చేస్కుంటారు అనిపించింది ...వీళ్ళు ఎవరా అనుకుంటున్నారా....నాకు ఇద్దరు స్నేహితులున్నారు ....పగటి పూట కూడా చుక్కల గురించి చుక్కలు చూపించే రకం ..orion ,small bear ,big bear అంటూ చెప్తారు ..నాకు అర్థం అయ్యే బాషలో సప్తర్షి మండలం ..అనో ఏదో ఒక ఆకారం లో ఉన్నదనో చెప్పరు ...నాకు అప్పుడు ఓ ఆలోచన వచ్చింది ...నా ఆకాశం నేనే చిత్రీకరించుకుంటే...????హుహుఃహహాహ ....వెళ్లి వెంటనే నా ఆకాశం తయారు చేస్కున్నా ...ఇక్కడ ఏ చుక్క ఏంటో నాకు తెల్సు ....వాళ్ళు వచ్చి అడిగితే నేను చుక్కలు చూపిస్తా ..ఇప్పుడు ...అందుకే రెండు నెలవంకలు కూడా పెట్టాను ...ఆకాశం ఇలా బాగుంది కదా ...



అన్నం తిని నిద్ర పోయే ముందు ..పొదున్న లేవాలి అనే మాట వినిపించింది ....హ్మ్న్ ....ఇది ఎలాగో ఎప్పుడూ చేయలేమని ..అలా పొద్దున్న ఎలా ఉంటుందో ఊహించుకుంటూ ..చిన్నప్పటినుండి ....ఖాలీ పేపర్.. పెన్ దొరికితే ...గీసే కొబ్బారి చెట్టు ...దాని కింద ఇల్లు ...పక్కన సూర్యుడు ...అక్కడే ఎగురుతున్న పక్షులు అయిన నా trade mark బొమ్మని దించేసా ...



మీకో సందేహం మళ్ళి రావచ్చు...అసలు ఏంటి ఇవి అని....పుస్తక గుర్తులు..(బుక్ మార్క్స్).....ఆ ఆగండి..ఇవే ఎందుకు చేయాలనిపించింది అనే కదా..చెబుతా..మీకు నాలాంటి రూం మేట్ ఉంటే ఇలాంటి బోలెడు అవిడియాలు వస్తాయి..నేను ఓ సారి చాలా రోజుల తర్వాత ఇంగ్లీష్ నోవెల్ 'I too had a love story' చదువుతూ ఉంటే నిద్రముంచుకోస్తుంటే...పక్కనే ఉన్న అయిపోయిన టూత్ పేస్టు ట్యూబ్ ఆ పుట లో పెట్టి నిద్ర పోయా....తను రూం సర్దుతూ ఆ ట్యూబ్ ని.. పుస్తకాన్ని వేరు చేసింది...నాకేమో ఆ పేజి నెంబర్ గుర్తు లేదు...ఏదో ఒక పేజి తీసి ఓ ప్రయత్నం చేసా చదువుదాం అని...అందులోని హీరో హీరోయిన్ను చాట్ చేస్కుంటున్నారు...వీళ్ళు మొన్నే కదా చాట్ చేస్కున్నారు అనుకుంటుండగా ..ఒహో ఈ పేజి కాదు ..ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుని ఓ 20 పేజి లు ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను..అక్కడ వాళ్ళు మళ్లీ ప్రేమించుకుంటున్నారు..అయ్యయ్యో అని ఇంకో 10 పేజిలు ముందుకి వెళ్లాను...అక్కడ ఆ అబ్బాయి వాళ్ల ఇంటికి మళ్లీ వెళ్ళాడు...నాకు చిరాకేసి...బుక్ మూసేసి....మా కీర్తి దగ్గరికి వెళ్లి...ఓయ్ నేను ఎక్కడ ఆపానో చెప్పు ....ఈ rewind సీన్ లు నేను చదవలేక చస్తున్నా అన్నాను..నీ కర్మ...ఏదంటే అది పుస్తకం లో పెట్టకూడదు అంది..మళ్లీ ఇప్పటి వరకు ఆ పుస్తకం ముట్ట లేదు..ఇలా మళ్లీ జరగా కూడదు అని...ఇవి తయారు చేసా..మీకు ఇంకో సందేహం రావచ్చు..మీ రూం మేట్స్..నిన్ను ఏం చేయరా..ఇలా టపాలు రాస్తే అని..హుహుహుహహహః..నేను ఉండేది బెంగుళూరు మహా నగరం లో...ఇక్కడ కాస్త కాళ్ళు వెడంగా పెట్టి నుంచోడానికే స్థలం లేదు..నా లాంటి అయిదు అడుగుల ఆజానుబాహురాలిని పాతి పెట్టడానికి స్థలం ఎక్కడండి..??

మనలో మన మాట..మొన్న నేను ఏదో పుస్తకం చదువుతూ నెమలి పుస్తక గుర్తు ని పెట్టుకుని బస్సు లో ప్రయాణం చేస్తుంటే ..నా పక్కన కూర్చున్న ఆ అమ్మాయి..సూపరక్క ...భలే అవిడియా అక్క అని తెగ పొగిడేసింది..నేను రూం కి వచ్చి డాన్సు చేసి ఆ పిల్ల state 1st రావాలి అని దేవుడికి దణ్ణం పెట్టుకున్నా......మీరు కూడా అలాగే సూపర్...కెవ్వ్..కేక అనండి.

అనన్య చురకలు !

మా పాపా పేరు అనన్య  ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను  దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...