10 July 2020

అనన్య చురకలు !మా పాపా పేరు అనన్య 

ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను 

దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో వేశాం.. స్కూల్ అలవాటు అవుతుందని ... మొదట్లో బానే వెళ్ళేది ... కొన్ని రోజులయ్యాక శోకాలు మొదలు పెట్టేది ..ఇంటి నుండి స్కూల్ వరకు ..ఒక కిలోమీటర్ దూరం అంతే .. మధ్యలో ఒక కిరాణా కొట్టు ఉండేది ..అక్కడికి వచ్చాక రాగం ఇంకా పెరిగేది ...ఆ కొట్లో కూర్చునే పెద్దాయన అప్పుడే స్కూల్ ఎందుకు తల్లి దానికి అనేవాడు ...ఇది ఇంకా ట్యూన్ తో కూడిన రాగం పెంచేది... రోజూ ...  పొద్దున్న దీన్ని దింపి నేను ఆఫీస్ కి వెళ్లి ఒక కప్ టీ తాగే లోపల నాకు మా అత్తగారి నుండి ఫోన్ వచ్ఛేది ...ఇంటికి తీస్కొచ్చేశానమ్మా ... నువ్వు కంగారు పడకు అని ... 9 నుండి 11 వరకు స్కూల్ ... ఈ రెండు గంటలకి అంత  సీన్ చేసేసేది ...సాయంత్రం వచ్చి పొద్దున్న ఎందుకు ఏడ్చావు చిట్టి తల్లి... అంటే ..అసలు దాన్ని కాదు అన్నట్టు .... ఉరికేలే అని బొంగురు గొంతుకేసుకొని చెప్పేది .. మా నాన్నకి వీడియో కాల్ చేసి కంప్లైంట్ చెప్పేది... ఆ షాప్ లో తాత కూడా స్కూల్ వద్దన్నాడు తాతా ...అమ్మే పంపుతోంది అని.. !
 
                                                                                              *** 

ఇంకో ఏడాది అయ్యాక స్కూల్ బస్సు ఎక్కి వెళ్ళాలి మేడం గారు.. మిగితా అంతా బానే తయారు  అవుతుంది కానీ .. షూస్ మాత్రం త్వరగా వేసుకోదు ...అనన్య ప్లీజ్ ఫాస్ట్ ..టైం అయిపోతోంది... time is  running అని నేను కాలనీ మొత్తం వినిపించేలా అరుస్తుంటే...ఇది ఒక చిన్న హస్కీ voice తో ... అమ్మ అమ్మ ...నీకో జోక్ చెప్పనా అంది ...చెప్పు ..(విసుగ్గా)... అని నేనంటే - time is not running ...you are running అంది ...ఏమంటాం ...నవ్వి బస్సు ఎక్కిస్తాం !

                                                                                             ***

పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో ఒక సారి 

మేడం ..అనన్య చురుకైన పిల్ల ..మీరు కొంచెం concentrate చేయాలి .. పిల్ల మీద .. 
ఏమైంది మేడం 
మొన్న పోజెక్టు వర్క్ చేయలేదు ..
 నేను వీకెండ్స్ అన్ని చూసి తప్పక చేయిస్తాను ... మీరు డైరీ లో కూడా రాయలేదు కదా మేడం
లేదండి పిల్లలకి చెప్పి పంపించాం ..అనన్య  మీరు బిజీ ఉన్నారని మీకు కుదరదని చెప్పారని చెప్పింది 
ఇంటికొచ్చి ఏంటే స్కూల్ లో ఏదో చెప్పావంట..నేను బిజీ అని 
అవునమ్మా నీకు చెప్పడం మర్చిపోయా ..ఆలా చెప్తే మేడం తిడతారని ..నీ మీద చెప్పా 
వా....! :(
కన్నా ఆలా అబద్దాలు చెప్పకూడదు ...నిజం చెప్పేయ్ ప్లీజ్ .. ఏం కాదు ... మేడం తిట్టరు 
అబ్బా మా మేడం గురించి నీకు తెలీదు పోమ్మా .... శౌర్య ఆలా చెప్తే మా మేడం ఫుల్ గా  తిట్టింది నేను అందుకే ఇలా చెప్పాను 
దేవుడా !!

                                                                                         ***

ఈ  మధ్య నాకు మొక్కల పిచ్సి ఎక్కువయ్యి ... వాటి గురించి ఎక్కువ నేర్చుకుని .. ప్రయోగాలు చేస్తున్నాను 
పొద్దున్నే దీన్ని స్కూల్ బస్సు దగ్గరికి దింపే దారిలో .. కన్నా ఆ పువ్వులు ఇది వరకు పూసేవి కాదు 
నేను ఆ ఎప్సం సాల్ట్ .... ఫ్రూట్ fertilizers వేసాక చాల బాగా వస్తున్నాయ్ ... భలే ఉన్నాయ్ కదా 
నిన్న కంపోస్టింగ్ ... ఈ  రోజు ఎప్సం  సాల్ట్ ఆ .. అమ్మ ... నాకెందుకమ్మా ఇవన్నీ చెప్తున్నావ్ ??
నేను హర్ట్ అనన్య హర్ట్ 
పర్లేదు... లే .. హర్ట్ అవ్వు ... బస్సు వస్తోంది .... నా hug నా kiss నాకిచ్చేయ్ అని తీస్కొని బస్సెక్కేసింది దొంగ మొహంది 

                                                                                        *** 

అమ్మా .. కథ  చెప్పు ... 
సరే ... రామాయణం ?
ఓకే !
మొత్తం చెప్పాను ఏదో పని చేస్కుంటూ ...
వినింది 
అమ్మా....  ఒక important ట్విస్ట్ చెప్పలేదు రామాయణం లో 
ఏంటమ్మా అది ?
సూర్పనఖ అమ్మా ..అసలు ఆ సీన్ లేకుండా ...లక్ష్మణుడు ముక్కు కోయకుండా రామాయణం చెప్పేసావ్ ... ఏంటో .... 
నాన్నా  ...మమ్మా .... అమ్మ రామాయణం మర్చిపోయింది... నేనే బెటర్ అంతా గుర్తు పెట్టుకున్నా !
 

                                                                                      ***

మొన్న ఒక రోజు ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను ... 
నాతో ఆడుకో .. రా ... ప్లీజ్...  అని అడిగింది 
మీటింగ్ లో ఉన్నాను కన్నా ... ఇంకో 30 నిమిషాల్లో వచ్చేస్తా  .. 
స్క్రీన్ దగ్గరికి వచ్చి చూసి వెళ్తూ ..ఏం లేదు లే ..ఫేస్  బుక్ ఓ యూట్యూబ్  ఓ చూస్తున్నావ్ అనుకున్నా  అంది 
ఓసినీ ...నేనే నిన్ను  ఇంత అనుమానించాను కదే !

                                                                                     ***

ఈ కరోనా తో ఆన్లైన్ క్లాస్ లు  ... 

నేను దాని పక్కనే కూర్చుని వర్క్ చేస్కుంటా ... 
మొన్నొక రోజు ... 
అమ్మ .. నువ్వు వినవా ... నేను ఒక సారి  బైటకి వెళ్లి వస్తా ... 
ఎందుకే ?
బోర్ !
చితక్కొడతా ..ఇంకో 10 నిమిషాల్లో అయిపోతుంది ... కూర్చో.. 
ప్లీజ్ ప్లీజ్ ...నువ్వు విను... నేను వెళ్లి నీళ్లు తాగొస్తా .. 
చివరికి దీని క్లాస్ లు కూడా నేనే వినాలి 

                                                                                     ***

మొన్న ఆదివారం మధ్యాహ్నం ... పాటలు వింటూ కన్నడ అక్షరాలు రాస్తోంది ... 
చిన్నా ..ఆలా పాటలు వింటూ రాయాకు ... చెప్తూ రాయి గుర్తుండి  పోతాయి ... 
అబ్బా ... మరి నువ్వు చదువుకునే రోజుల్లో పాటలు వింటూ చదువుకున్నా అని చెప్పావా లేదా?
చెప్పాను ... బుద్ధి తక్కువై చెప్పాను ..కనీసం ఆ ear ఫోన్స్ తీసేసి బైటకి పెట్టు పాటలు అనన్య 
సరే అమ్మా ..కానీ అవి ear  ఫోన్స్ కావు ..head ఫోన్స్ !

                                                                                        ***

3 July 2020

బొమ్మాలి....

అప్పట్లో మా మేనేజర్ ప్రమోద్  ని  ప్రమోషన్ కోసం వేధిస్తున్న రోజుల్లో ..నాకు కాల్ వచ్చింది.. నీకు కొత్త ప్రాజెక్ట్ ఇస్తున్నాను.. .నువ్వే మేనేజర్ ..అన్నాడు ప్రమోద్
నేను : Salary  కూడా ఈ  month  నుండి పెరుగుతుందా?
ప్రమోద్ : ఛ,experience కోసం ఆ రోల్ ...ఎక్కువ ఉహించుకోకు ...IT లో ఎప్పటినుండి ఉంటున్నావ్ తల్లే
నేను :  సర్లే ..ఎదో ఒకటి ఇవ్వు.. వెలగబెడతా ..
ప్రమోద్ :  నీ పాత టీం అంతా continue అవుతుంది ... ఒక్క పిల్ల కొత్తమ్మాయి ...
నేను :ఎవరు ?
ప్రమోద్ : ఎవరో..నాకు తెలీదు ...రేపు వస్తుంది ...
ఆ పిల్ల రావాడం ..నా  గుండెలో ధడ మొదలవడం రెండూ ఒకే సారి  జరిగాయి.. sixth  sense అంటే ఏంటో ఆ రోజే అర్థం అయ్యింది
మొత్తం టీం అంతా అమ్మలక్కలే ..వీళ్ళకి నేను మేనేజర్ ..అర్థమైపోయింది నా  పరిస్తతి
రోజుకో గొడవ
డాక్యుమెంట్ లో ఫాంట్ సైజు కరెక్ట్ చేయలేదని ..భోజనానికి వెళ్ళేటప్పుడు పర్మిషన్ తీసుకోలేదని ... మెయిల్ లో full  stop  లు కామాలు సరిగ్గాలేవని ..ఇలా ...రోజుకొకటి...
బాబోయ్ అసలే బెంగుళూరు సిటీ బస్సు లో ఆఫీస్ కి వెళ్లేదాన్నేమో.. అక్కడ అరుపులు ఇక్కడ అరుపులు సమానంగా  ఉండేవి...సాయంత్రం అయ్యేసరికి మెంటలొచ్చేసేది ..పనయ్యేది కాదు ... ఇంటికి వెళ్లి ఆ పని నేను ఎవరికీ చెప్పుకోలేక .. నేనే చేస్కునేదాన్ని ...
ఇలా ఉండగా ... దేవుడి లా వెంకట్ వచ్చాడు ...వెంకట్ ఎవరంటే ...సీనియర్ మేనేజర్ ...ఏ పని లేక తిరుగుతున్నాడుట......బెంచ్ లో ఉంటే  కష్టం అని మా ప్రాజెక్ట్ లో కి తోసారు .. అప్పుడు ప్రమోద్ వచ్చి చెప్పాడు.. ఇతను నీకు హెల్ప్ చేస్తాడు ..నువ్వు టీం కి హెల్ప్ చెయ్యి అని ...తిరిగి మన రోల్ మనకు వచ్చేసింది అని అర్థమైంది ..అసలు వర్క్ చేసుకోడం ...దీనంత ప్రశాంతత ఇంకోటి లేదు ... వెంకట్ సీనియర్ మేనేజర్ కదా ...మనకంటే రెండు లెవెల్స్ ఎక్కువ లో ఉన్నాడు ..నోరు జాగ్రత్త గా  ఉండాలి అనుకున్నా.. అక్కర్లేదని అతనితో మాట్లాడిన ఒక 10 నిమిషాలకి తెలిసిపోయింది ...
మొత్తం ప్రాజెక్ట్ గురించి explian  చేసాక ... team  గురించి టాపిక్ వచ్చింది.. ఇక్కడ వద్దు లే అన్నాను..
సరే కాఫీ కి వెళ్దాం పదా అన్నాడు ... కాఫీ ఆర్డర్ ఇస్తూ ..హే team లో అందరూ ఓకే కానీ ..ఆ బొమ్మాలి డేంజర్ లా ఉంది అన్నాడు ..అరే భలే క్యాచ్ చేసావే అనుకుంటూ ...బొమ్మాలి ఎవరు అన్నాను ..అదే ఆ పిల్లే ప్రియా ,నీకు తెల్సులే అన్నాడు :D ... నవ్వుకున్నాం
కానీ ఆ అమ్మాయి ఒక్కటే కొంచెం తేడా ... ఎలా చెప్పినా  వినదు  పని చేయదు ... ఇలాంటి వాళ్ళని ఎంత మందిని హేండిల్ చేయలేదు అన్నాడు ...F2 లో వెంకటేష్ లాగా...
అవును నేను కూడా ఇలాంటి గైడెన్స్ కోసమే ఎదురు చూస్తున్నా ...ఏం  చేయాలి వెంకట్?
ఫ్రెండ్లీ గా ఉండు ... ఉంటున్నాను .. రేస్ గుర్రం లో శృతిహాసన్ లా
లంచ్ కి బ్రేక్ కి ఆ పిల్లతో వెళ్ళు
ఆ పిల్లవి  పాకిస్తాన్ టైం ..నేను టపా కడతా ..
ఎహె ఒక రోజు లేట్ గా  తింటే ఏం  పోవు.. అయినా నీకు గాలి చాలు ...
టీం కూడా కలవరు ...మన సీతక్క అసలు కలవదు ..
.సీతక్క తో match fixing చేసుకుందాం లే ..అన్నాడు
సీతక్క అంటే మా టెక్నికల్ లీడ్ ... ఆ పిల్లకి తెలివి చాదస్తం రెండూ ఎక్కువే ... ఓవర్ perfectionist
next  డే అందరం కలిసి వెళ్ళాం .. భోజనానికి వెళ్లినట్టు లేదు ఎదో సంతాప సభ కి వెళ్లినట్టు ఉంది
కిరణ్ ఇలా వర్క్ అవ్వదు ... ఎవరూ  లేకుండా ..టీ కి మనం ముగ్గురం వెళ్దాం.. mental or  personal issues ఉన్నాయేమో కనుక్కుందాం ...
ప్రియా  - విల్ యూ కం ఫర్ టీ ?
నో వెంకట్ నేను బిజీ అంది (వెంకట్ ఇన్నర్ వాయిస్ నాకు వినిపించింది )
నో ప్లీజ్ కం ..give  company for us  ..అన్నాడు ... వచ్చింది ..
దారిలో అడిగా .. నువ్వాపిల్లకు లైన్ వేస్తున్నావా అని
అమ్మ తల్లీ ...ఇద్దరు పిల్లలు ... ఒక పెళ్ళాం ..చింత లేని చిట్టి కుటుంబం ... నన్నొదిలెయ్ అన్నాడు...
సర్లే ..పద ... అని కాఫీ ఆర్డర్ చేసుకున్నాం ఇద్దరికి ...బొమ్మాలి ఏమో  ... వెంకట్ ...ఆర్డర్ some fruit juice to  me  అనింది
..వెంకట్ నా వైపు చూసి ఎదో achieve  చేసినట్టు ఫీల్ అయ్యాడు ...
సీట్ దగ్గరికి    వెళ్ళేటప్పుడు .. హే ప్రియా  ..ఆ 2 డాకుమెంట్స్ ఈ  రోజు పంపించవా అన్నాడు..
నో వెంకట్ ..I will leave at 4... my kid will reach home by then ... career is not that important అని బాగ్ సర్దుకుని వెళ్ళిపోయింది
కిరణ్ ..  నాకు ఒకటి అర్థం కావాలి -- ఆ పిల్ల 12 కి వచ్చింది - 1 to 2 లంచ్ చేసింది  ..2-3 ..డాకుమెంట్స్ చూస్తూ ఫోన్ మాట్లాడింది  .. 3-30 మనతో కాఫీ కి వచ్చింది ..ఇప్పుడు ఇంటికి వెళ్తుంది .. exactly ఇదే వెంకట్ ఎవరీ డే...
ఓకే ..లైట్ తీస్కో .. కొత్త resource  ని అడుగు ..ఈ పిల్లకి పర్సనల్ issues  ఏమో అనుకున్నాను ...కాదు పిల్లే ఇష్యూ వద్దు అన్నాడు
next  day  friday
నేను ,వెంకట్, బొమ్మాలి మాత్రమే ఆఫీస్ కి వచ్చాం .. లంచ్ కి వెళ్తూ వెంకట్ ఆ పిల్లని పిలిచాడు
వెళ్లి తాను ఫుడ్ order  తెచ్చుకుంటున్నాడు ..మాకు కూడా పకోడీ తెస్తున్నాడు ...
మొత్తానికి ఏవేవో discussions  లోకి వెళ్ళాం ...చావు..దయ్యాలు దగ్గర టాపిక్ ఆగింది ...
వెంకట్ ఇంకా ఏవేవో తవ్వుతున్నాడు ..ఆ పిల్ల నీకు తెల్సా నాకు దయ్యాలు కనిపిస్తాయి అనింది
నవ్వాడు
Be Serious..I don't joke like you people అంది
అంటే అన్నాం ?
i see them seriously అనింది..
ఎలా అన్నాం భయపడుతూ ...
మాట్లాడతారు ... వాళ్ళు చెప్పాలి అనుకున్నవి చెప్తారు ... ఇంట్లో ఎవరు లేనప్పుడు వస్తారు ..అనింది
నాకూ వెంకట్ కి వణుకు ...మిట్ట మధ్యాహ్నం ... ఎదో చీకట్లో దయ్యాల మధ్య ఉన్న ఫీలింగ్ ...
ఫైనల్ గా ఆ పిల్ల ఎదో చెప్తుంటే ...నేను ... కలలో వస్తారు అంటారు ?అలాగా అన్నా
యా exactly ..but i will feel them అనింది .. ఒకే సరి నేనూ వెంకట్ ..ఫీల్ ఫీల్ ... we have a call now ani వెనిక్కి చూడకుండా పరిగెట్టాం ...

ఇంకో friday ..నేను వెంకట్ కి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాను ...బొమ్మాలి ని పిలవకు అని.. బుద్దుందా ఎవడన్నా పిలుస్తాడా అన్నాడు .. మేము వెళ్తుంటే ..can I   join అంది ... ఏడుస్తూ ఓకే అన్నాం ..

ఈ సారి టాపిక్ .. "సీక్రెట్" బుక్ ..
చాలా బాగుంటుంది అంది బొమ్మాలి .. ఏంటి కాన్సెప్ట్ అన్నాను ...
basically what ever you think constantly ,will become true అని intro ఇచ్చింది ...
అంటే అన్నాడు ..
నువ్వు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటావ్ అని అడిగింది ..
చాల సేపు అలోచించి ..ఏం లేదు అన్నాడు .. మనిషన్నాకా dreams ఉంటాయి గా అంది ...
ఓహ్ ప్రూవ్ చేసుకోవాలా అని ... ఒక bungalow కొనుక్కుని అప్పుల పాలు  అయిపోతానని కల వస్తూ  ఉంటుంది ...తప్పకుండా అవుతుంది అలాగే అంటూ అక్కడ నుండి ఫోన్ వచ్చిందని లేచి వెళ్ళిపోయింది ...
పాపం వెంకట్ ...షాక్ లో ఉండి  పోయాడు ...
వెంకట్ లైట్...  తిను ... ఏం  కాదు లే అని టాపిక్ divert  చేశాను
మళ్ళీ friday వస్తోందంటే భయం ... ఇలా కొన్ని friday లు చాలా  గందరగోళంగా ఉండేవి ...
ఇంక ఆ అమ్మాయి ప్రాజెక్ట్ నుండి వెళ్లిపోయే రోజు మేము పార్టీ చేసుకున్నాం
పాపం ఆలా వెంకట్ నాకు మానేజ్మెంట్  పాఠాలు నేర్పిద్దాం అనుకుని ..తానే జీవిత పాఠాలు నేర్చుకున్నాడు ..అనన్య చురకలు !

మా పాపా పేరు అనన్య  ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను  దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...