29 May 2010

గుర్తుకొస్తున్నాయి…..గుర్తుకొస్తున్నాయి...

ఇవాళ్ళ బోలుడు విషయాలు గుర్తొచ్చాయి …

అవన్నీ మీకు చెప్దామని ….

మీ ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరా అమ్మ వినడానికి ….హ..హ..హ..….భలే కనుక్కున్నారండి ….

అందరు  పెళ్ళికి వెళ్లారు …

మరి నువ్వేం చేస్తున్నావ్ ….???

మేము బిజీ s/w engineer లము కాదమ్మా …మాకు సెలవలు దొరకవు …

ఒక వేళ మేనేజర్ కి మంచి బుద్ధి పుట్టి లీవ్ accept చేసిన ..TL కి కోపం ..వస్తుంది ..

పోయిన నెలలో నేనడిగితే నాకు ఇవ్వలే ..ఇప్పుడు నీకెలా ఇస్తాడు అని ..

అప్పటికప్పుడు ఎప్పుడు లేనిది …వెంటనే మేనేజర్ దగ్గరకు వెళ్లి ..

కిరణ్ is a valuable resource…అసలు మీరు అంత critical time లో తనకి లీవ్ ఎలా ఇవ్వగల్గుతారు అంటూ మేనేజర్ బుద్ధి మళ్లీ వక్ర మార్గం లో ఆలోచించేలా చేసి వెళ్ళిపోతుంది …

ఒక చిన్న మెయిల్ వస్తుంది inbox కి ..sorry…cannot grant ur leave as u are very much needed on that particular day…

ఎప్పుడూ పొగడని lead ,manager నన్ను పొగుడుతున్నారు అని ఎగిరి గంతులు వెయ్యాలా??..లేక ఎప్పటి నుండో చూడాలి ..కలవాలి అన్న మనుషులందరూ ఒకే చోట కలుస్తున్నపుడు వెళ్ళలేనని ఏడవాల??..ఇంకా ఇన్ని emotions ఒక s/w engineer కి ఉండటమా??..తప్పు తప్పు …. అంటూ  బుర్ర బుద్ధి చెప్తుంది ….అప్పుడు నోరుముస్కోని పాజిటివ్ గ అలోచించి ..పోగిదినందుకు లీవ్ తీస్కోవలనుకున్న రోజు 3 గంటలు extra వర్క్ చేయాల్సి వస్తుంది …

మరి leave కావాలంటే ఎలా అని అడుగుతున్నారా??....సిక్ లీవ్ …..ఉంది కదా …నా లాంటి వాళ్ళకి …లేని రోగాలు ఉన్నట్లు నటించి ఆఫీసు కి డుమ్మా

హ హ హ హ్హ :D

ఇంతకి అసలు విషయానికి వస్తే …ఎవరు లేని టైం లో బోర్ కొట్టింది ఇంట్లో ..అది కాకా week-end…తాతయ్య నేను ఇంట్లో అంతే …..కాసేపు కబుర్లు చెప్పిన ఇంకా బోర్ కొడ్తుంటే ….మా నాన్న …ఎమన్నా చేసుకున్నార ..తిన్నార అంటూ కాల్ చేసారు …..బోర్ నాన్న అంటే ..ఏముంది బొమ్మలు గీసుకో ..నేనున్నప్పుడు నిమిషానికి ఒకటి గీసి బాగుంది అని చెప్పే వరకు వదలవ్ కదా అన్నారు ….ఇప్పుడు ఎవరూ లేరు కదా అలా అడగటానికి ..soo మూడ్ రావట్లేదు అన్నాను …..మరి మొన్న నీ ఆస్తి సర్దుకుంటాను అన్నావ్ కదా …మేము వచ్చే లోపల ఆ పని చేసేయి తల్లి అన్నారు …

Gud gud ideaaa అనుకుంటూ ….మా తాతయ్య దగ్గరకి వెళ్లి మీరు వేరే room లో మంచం మీద పడుకోండి అని చెప్పా …

పర్లేదు లేమ్మ ….ఎంత సేపు సర్దుతావ్ ….అన్నారు ..

అంతలో నాన్న ..మళ్లీ tring…tring చేసారు ….

నాన్న ఇప్పుడే సర్దడం మొదలు పెట్టాను అన్నాను …..

1st నువ్వు మీ తాతయ్య కు ఫోన్ ఇవ్వు అని ....

మామయ్య గారు ..మీరు ఇంకో 5,6 గంటలు ఆ రూం లోకి వెళ్లకుండ ఉంటె …మీకే మంచిది అన్నారు ….

మా తాతయ్య బుద్ధి గ వెళ్లి వేరే గది లో పడుకున్నారు ….ఎంతైనా అనుభవం తో చెప్పిన మాటలు వినాలి అని నమ్మి ఉంటారు ….అందుకే వెంటనే అడగకుండా వెళ్ళిపోయారు …

ఇక నాకు పండగే పండగ ….

నాకు ఒక దివాన్ ఉంది అది box టైపు ..అందులో నా ఆస్తి (మా వాళ్ళ ద్రుష్టి లో చెత్త ) ఉంటుంది ..

ఏముంటాయి అంటారా???

చెప్తా …..అది తెరవంగానే ..ప్రతి వస్తువు మీద బొలుడంత దుమ్ము ఉంది ….అదంతా బైట పెట్టి ..ఒకొక్కటి తీసాను ..ఏంటో తెల్సా అవి కొన్ని ఏళ్ళ ముందు నా friends నాకు ఇచిన గిఫ్ట్ లు అన్నీ ….. :D….

ఇల్లు చిన్నది కావడం చేత అందులో దాచుకుంట.. అన్ని డబ్బాలో నుండి తీయడం ..వాటిని చూడటం …మళ్లీ నవ్వుకుంటూ లోపల పెట్టడం ..కొన్ని గిఫ్ట్ లు ఎవరు ఇచ్హరో కూడా మర్చిపోయాను ….:P

కానీ వాటిని తెరిచిన ప్రతి సారి ఎంతో సంతోషంగా ఉంటుంది ..అందులో నుండి బైటకి ప్రేమ వస్తున్నట్లు అనిపిస్తుంది ….తోక్కేం కాదు ..అనకండి ..నిజం ..:)

ఇది వరకట్లో వారానికి ఒక సారి ఇంట్లో అందరూ ఉండగా ఈ పని చేసే దాన్నీ …మా ఇంట్లో వాళ్ళు ….నువ్వు నాకు నచ్హావ్ సినిమా లో ప్రకాష్ రాజ్ కవిత అంటే ఎంత దూరంగా ఉంటారో …నేను దివాన్ అంటే అంత దూరంగా ఉండేవాళ్ళు ..ఉంటున్నారు …ఉంటారు ..:P

అసలు ఇవాళ్ళ చూస్తుంటే నాకే అవి చెత్త గ అనిపించాయి ……..for example నా మొదటి కళ్ళజోడు …అది వాడటం ఆపేసి 12 years అవ్తోంది అది ఇంకా ఉంది ….కొన్ని వెరైటీ rubber band లు ..ఇష్టమైన చున్ని లు ….మా తమ్ముడు అంటూ ఉంటాడు ….నువ్వేమైన mother teresa వ …indira Gandhi వ ..నువ్వు పోయాక కిరణ్ వాడిన వస్తువులు అని ఒక museum లో పెట్టడానికి ….అని …నీకు తెలీదు ర వీటి విలువ అంటూ ఉంటాను …

కానీ ఇవాళ్ళ నాకే కొన్ని చెత్త గ అనిప్తిస్తే పడేసాను ..

ఐన నా వస్తువు అంటే నాకు మక్కువ ఎక్కువే … :P..oka example చెప్తా..నేను బొమ్మలు వేసేటప్పుడు వాడె eraser ఒక 8 years నుండి వాడుతున్నాను …అది ఇంట్లో కాబట్టి నా నోటి పవర్ తెల్సీ ఇంట్లో ఎవరు ముట్ట లేదు …మా hostel లో ఎలాగో పోయింది ..దాని కోసం తెగ వెతికాను 3 రోజులు ….చివరికి ఏదో ఒక మూల కనిపించే టప్పటికి ఆనందమేసి ….మా hostel లో దొరికింది ఇక వెతకడం ఆపేయండి అని ప్రకటించాను …..అందరూ వచ్చి నా eraser ని సందర్శించారు …ఆ తర్వాత 3 రోజులు నన్ను చాల హింసించారు వాళ్ళ looks తో ..కేవలం looks తో ….ఆ రోజు అర్థమైంది ……మా ఇంట్లో వాళ్ళు ఎంత మంచి వాళ్ళో అని :)

కానీ ఆ చిన్న చిన్న gift లు ఎంత బాగున్నాయో ….చిన్ని వినాయకుడు ..laughing బుద్ధ …కృష్ణుడు ..చిలుకలు ……..ఇప్పుడన్నీ కాస్ట్లీ వె కదా ….గిఫ్ట్ ఇవ్వాలి అంటే rate lu అలోచించి ఇస్తున్నాం ..minimum 100 లేనిదే అసలు కొనం…కానీ అప్పటి gift లే నాకు నచాయి …ఆగండాగండి ….ఇంకా నుండి నాకు అల చిన్నవే ఇవ్వకండి ..పెద్దవి కూడా నచుతాయి … :P

అన్నిటికంటే ఈ రోజు నాకు విరక్తి వచ్చింది ఏంటంటే gift కవర్ లు .నలిగి పాయినా వాటిని మడత పెట్టి ..పైన wishes cards కూడా దాచుకున్న …

ఇక పాత ఫోటో లు …అవి చూస్తే ఎంతో బాగున్నాయి ..అందరు చిన్న గ ఉన్నపడివి …

నేను కాలేజీ కి తీసుకెళ్ళిన బాగ్ ….ఆ బాగ్ free గ ఇచ్చిన ఎవరూ తీసుకోరు ..ఆ బాగ్ ని మా పనమ్మాయి కి ఇచ్చి నీ కూతురికి ఇవ్వు....ఈ బాగ్ వాడితే నా అంత గొప్పది అవ్తుంది అంటూ చేతిలో పెట్ట ...అనుమానంగా తీసుకుని నన్ను ఏమి అనలేక తన కూతురి భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంటూ ఇంటి పని చేసింది..

ఐన వీటన్నిటి మీద మమకారం ఎందుకో ..

Magazines లో ,బుక్స్ లో నచిన పైంటింగ్ articles వి కొన్ని 100 లు ఉన్నాయి …ఈ రోజే దుమ్ము దులిపాను ..అవి cut చేసిన ప్రతి సారి అంత మంచి గ వేయాలనే ఆస ..తపన ..ఇప్పతికీ అలాగే ఉంది …మరి ఎప్పుడు వేస్తావ్ ???..shh ఆ ఒక్కటి అడగద్దు .. :D

ఇంకా నా friends కి నేను ఎప్పటికీ చిన్న పిల్లనే …children’s day కి నా friend ఒక diary ఇచాడు ..ఒకనోకప్పట్లో దాంట్లో వాళ్ళు పంపిన మెసేజెస్ ఏ రాసుకునే దాన్ని …

ఏదో friend ship quotes ఓ…లేక …inspiring quotes oo అయితే okk….దాంట్లో పొద్దున్నే లేచి చదువుకూ ..మజ్జు గ పడుకోకు …అన్న మెసేజ్ నుండి (నా active ness ని నాకు గుర్తు చెస్తూ )…ఇప్పుడే మేము చిప్స్ తిన్నాం …ఈ రోజు ఇంటర్వ్యూ పోయింది ,….ఇంకో కంపెనీ నా కోసం waiting లాంటి message లు కూడా రాసుకున్న ….మా అమ్మ అనే మాట వెర్రి బాగుల్ది కి కరెక్ట్ meaning ఆ నిమిషం తెల్సింది ..

కొత్త కొత్త పాటలు …lyrical హిట్స్ …ఇలాంటి మంచి మంచి పాటలు రికార్డు చేసి నాకు CD లు gift చేసినవి కనిపించాయి …..కానీ మా తాతయ్య గుర్తోచారు ….ఇప్పుడు ఇవన్ని నా ముందర పెట్టుకుని అవీ వింటూ ఉంటె నాకు పిచేక్కిసిన్దుకుంటారని ..ఎందుకు లే సాహసం అని …..CD లో నుండే అన్ని రాగాలు చుసెసీ ….దుమ్ము దులిపి …వెనక్కి పెట్టేస …

ఇంకో కవర్ బైటికి వచ్చింది ..అది చుస్తే మా తమ్ముడి గాడి ఆస్తి ..వాడి friends ఇచిన greeting cards..అప్పుడెప్పుడో ఇచాడు …నీ దగ్గర అయితే జాగ్రత్త గ ఉంటుంది అని ..ఇంకా మా friend వాళ్ళ పాత family photo album…వామ్మో ...వీటి గురించి మర్చి పోయా ...వాళ్ళు ఈ సారి చెత్త అంటే ..వీటిని చూపిస్తా ముందు … :)…

ఇలాంటివి ఎన్నో ..ఎన్నెన్నో …..నేను ఎంతో సంబర పడిపోతు ఉంటె ఒక paper ముక్క మీద తెలుగు లో ఏదో రాసుంది ….అప్పుడు గుర్తోచింది …నా friend ఒకడు కవితలు కేక ల రాస్తాడు ….సో .. వాడు రాసిన కవిత పేపర్ ఒకటి అలా ఉంది పాయినట్లుంది …..

చూసి ఎలా ఉందొ చెప్పండి ..

నా కష్టం లో కన్నీరువు నువ్వు ..

నా సంతోషం లో చిరునవ్వువు నువ్వు ..

నా ఓటమి లో ఒదార్పువి నువ్వు ..

నా విజయం లో అభినందన నువ్వు ..

నా లో ఆవేశానికి అడ్డుకట్ట నువ్వు ..

నా లో ఆలోచనలకు ఆది బిందువు నువ్వు

నువ్వే లేక పోతే నేనంటూ ఉంటానా …!!!!

ఇది వాడి కవితల్లో నేను చుసిన మొదటి కవిత ….ఈ శ్రావణ మాసం లో వాడికి పెళ్లి ..so వాళ్ళ ఆవిడకి dedicate చేసేద్దాం పై దాన్నీ ..
మల్లి మన లోకం లో కి వస్తే ..అప్పుడు అనిపించింది ….
సంవత్సర…సంవత్సరానికి ..మనిషి లో ఎంతో మార్పు వస్తుంది ..
ఏళ్ళు పెరుగుతాయి ..దానితో పాటూ ముందు ఉన్న అమాయకత్వం, ప్రేమ ,జాలి ..కొత్త గ పరిచయం అయ్యే వాళ్ళకి కూడా distribute చేస్తూ పని లో busy ఐపోయి ..పాత జ్ఞాపకాలు తగ్గిపోతు ఉంటాయి ..ఇది నాకు ..అందరికి వర్తిస్తుంది ..

ట్విస్ట్ ఏంటంటే నా దివాన్ మూత పడక పోతే ఎదురింటి టింకు నీ పిలిచి కొంచం హెల్ప్ చేయి ర అన్నాను ..వాడు దానిలో ఉన్న సామాను చూసి ఏమిటక్క ఈ చెత్త అన్నాడు... :( :(

ఇలా కాసేపు పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ enjoy చెస్తూ ….

గుర్తుకొస్తున్నాయి …..గుర్తుకొస్తున్నాయి పాట పడేస్తూ …మీకు నా sweet memories చెప్పేసాను ..:)

మా నాన్న మళ్లీ tring tring…అయిపోయిందా వెంకట సుబ్బమ్మ అంటూ (అది వాళ్ళ బామ్మ పేరు …ఆవిడా ఇలా టైం దొరికినప్పుదంతా ఆవిడ ఇనుప పెట్టె తీసి సర్డుకునేది ట )..

చూసారా ..ఇది నా అలవాటు కాదు …మా వంశ పారంపర్యం

బాగుందా అలవాటు ..బాగున్నాయ నా తీపి జ్ఞాపకాలు ??

అనన్య చురకలు !

మా పాపా పేరు అనన్య  ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను  దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...