ఒక నిమిషం ఆనందం .. ఇంకో క్షణం పట్టరాని దుఃఖం .
ఒక నిమిషం ధైర్యం .. ఇంకో క్షణం పిరికి తనం ..
ఒక నిమిషం దైవత్వం … ఇంకో క్షణం రాక్షసత్వం …
ఒక నిమిషం ఎన లేని ప్రేమ …ఇంకో క్షణం అంతు లేని కోపం .. ద్వేషం …
ఒక నిమిషం మొత్తం గమ్యం కళ్ళ ముందు ..ఇంకో క్షణం దిక్కు తోచని అయోమయం ..!!
మీకు ఎప్పుడు ఇలా వెంట వెంటనే అనిపించలేద ??
నాకు ఈ మద్య ఇలా చాలా సార్లు అనిపిస్తోంది ..!!
Life ఏంటో విచిత్రంగా ఉంది …mixed feelings….!!
Not that ఇప్పుడు నేనేదో పుట్టెడు దుఃఖం లో ఉన్నాను అని .. but ఏంటో …
Ma TL చెప్పినట్లు …రోజులు ,ఏళ్ళు మనిషికి పెరిగే కొద్ది ..లోకం తెలిసిపోతుంది ….so మనకు ఎం కావాలి అనేది perfect గా తెల్సి పోతుంది …
అందుకే పక్క వాడు నచ్చాలి అంటే యుగాలు పడ్తుంది …అదే చిన్న తనం లో అయితే ఎవరినైనా ఇష్ట పడతాం తొందరగా అంటుంది .. :D…
అందుకే లేట్ అయ్యే కొద్ది …పెళ్ళిళ్ళు కుదరడం కష్టం ..అని కూడా అంటుంది ….జీవిత సత్యం చెప్పేసింది కదా .. :D…
మన కష్టాలతో పోల్చుకుంటే ..పక్క వాడి కష్టాలు ఒకొక్క సారి పెద్ద గాను ..మరొక సారి …ఏపాటిది ఇది నా దాని ముందర అనే భావన కలుగుతాయి …
ఒక సారి మా తమ్ముడు ..నాతో ఇలా అంటున్నాడు...ఇంతటి బాధ నీకొచ్చింది కాబట్టి సరిపోయింది..అదే నాకొస్తే నా...అని ఆగిపోయాడు...మా నాన్న వెంటనే..భరించ గలిగే capacity దాని లో ఉంది కాబట్టే దానికి ఇచ్హాడు అని నాన్న అన్నారు..ఇదేమన్యాయం?? ఇంకా ఎక్కువ మాట్లాడితే..కర్మ concept picture లో కి వస్తుంది..ఇప్పుడు నేను అంత depth లోకి వెళ్ళ లేను.. :)
కానీ ఒకో సారి ఉన్న ధైర్యం ..ఇంకో సారి ఎందుకు ఉండదు ?...అంత ఏడుపు …ఏదో జరిగిపోతోంది అనే ఫీలింగ్ ఎందుకు వస్తుంది అసలు . .
Mind ఒకే రకంగా ఎందుకు ఉండదు ….??
But one thing ..నేను ఒకటి గట్టిగ చెప్పగలను ….మనిషి చేతిలోనే ఉంది మార్పు …చా …అంటున్నార …
లేదు ..ఇది వరకు నేను నమ్మని concept…కానీ change is constant..ఇప్పుడు నేను నమ్మే ఏకైక concept..!! :)
దేవుడు భలే సాడిస్ట్ అండి ...first దెబ్బ తగిలేల చేస్తాడు...అది తగ్గించుకోవాలని మానవ ప్రయత్నం చేస్తున్నంత సేపు...తన చుట్టూ ఉండి ..వచ్చి మళ్ళి కిందకి తోసేసి...దెబ్బ తగిలిన చోటే తగిలేల చేసి...పుండు మీద కరం చల్లి...అందరిని పిలిచి పై లోకం లో ....మనల్ని చూపించి పార్టీ చేస్కుంటాడు...
మానవులం కనుక...మనిషి చెప్పిన కొన్ని theory లు ...positive thinking ...,lesson for the next time ...లాంటివి అలొచిస్తూ ముందుకి వెళ్తూ ఉంటాడు మళ్ళి దేవున్నే తలచుకుంటూ...ఇలా ఎన్ని రోజులో ..ఎన్ని పరీక్షలో తెలిసే లోపు...జీవితం THE END చూస్తుంది...ప్రతి phase లో ను మనిషికి బాధే...అందులో నుండి...నేర్చుకోవాల్సినవి ఎన్నో...ఎన్నెన్నో...ఎందుకంటే.. .నేను ఈ మద్య ఏ మనిషిని కదల్చిన....వర్షం పడి ఆగిపోయాక చెట్టు కొమ్మను కదిలిస్తే ఎన్ని నీటి చుక్కలు పడతఃయో..అలా కష్టాల కథలు వినిపిస్తున్నాయి ....అందుకే నా కంటికి అందరూ హీరో హీరోయిన్ లు గాను..దేవుడు విల్లన్ గాను కనిపిస్తున్నాడు.. :D...!!!
కానీ మంసిషి గ్రేట్ అండి...!! రెండు రకాలుగా ఆక్ట్ చేయాలి...బాధ ఉన్నపుడు ఎంతో ధైర్యం తో ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసుకు వెళ్లిపోవాలి..!!అందరూ actors ఏ ..!!మనకు సినిమా ఛాన్స్ లు లేవు కానీ...నంది ఏంటండి ..ఎప్పుడో ఆస్కార్ లు వచేసేవి..!!
అందుకే ఈ మద్య ఒక quote నచ్చి దాన్ని follow అయిపోయి..వీలైనంత మనుషులని నా సైడ్ నుండి hurt చేయకూడదు అనుకుంటున్నా..!!
Be kinder than necessary because everyone you meet is fighting some kind of battle
మొత్తం చదివాకా...మీకు ఏమైనా confusion ఉందా??..
అది నా పోస్ట్ తప్పు..కాదు..మీ మైండ్ తప్పు...
హహహ్హహః.. :D