11 March 2014

పెళ్లి రోజు కానుక !!

కికికికి
సంవత్సరం అయిపొయింది .... ఇది పెట్ట.. బేడా సర్దుకుని ... ఎక్కడికో వెళ్ళిపోయింది ..దీని గోల తప్పింది  అని ఊపిరి పీల్చుకుంటున్న సమయం లో .... నన్ను చూసి ఉలిక్కి పడ్డారా
కాలం ..జీవితం .. పరిగెడుతూ ఉంటాయి .. అన్నీ క్షణాల్లో జరిగినట్లు జరిగిపోతాయి .. 
ఖాలీ ఖాలీ గా బ్లాగు లు ఎవరు రాస్తారా .. అని ... అన్ని టపాలు చదివేసే నేను ..ఇలా అయిపోయాను అంటే అది కాలం మహిమే
ఇంట్లో ఆఫీసు లో అప్పుడప్పుడు పని చేస్తున్నా .. ఎప్పుడూ  పని చేస్తున్నట్లే అనిపించేస్తోంది...
మీ అందరిని అప్పుడప్పుడు బస్సు లో వెళ్తున్నపుడు .. ఆఫీసు లో సరదా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడూ . హాయిగా మనసారా నవ్వినప్పుడు తలుచుకుంటూ ఉంటాను ..

ఇంతకి విషయం ఏంటంటే నా  పెళ్లి అయ్యి అప్పుడే 730 రోజులు అయిపొయింది !

ఒక్క రోజుకే దండం పెట్టిన జనాలు ఉన్నారు..నన్ను  రోజులు గా భరిస్తున్న మా వారు గ్రేట్ కదా!

అదే కాదు నాకు ఈ కింది వస్తువు పెళ్లి రోజు కానుక !! -- easel (పెయింటింగ్ వేసుకునేటప్పుడు కాన్వాస్ పెట్టుకోడానికి )అమ్మా కిరణు ..ఎలా సాధించావ్ దీన్ని అని అడిగితే ..ఇలా చెప్పగలను 

మా ఆయనకు కొన్ని ప్రమాణాలు చేశాను..   నిలబెట్టుకున్నాను..  దానితో ప్రసన్నులై ఇది ఇచ్చారు.. 


 అవి ఏమిటంటే....పెల్లైన కొత్తల్లో ఒక  సారి వంట చేశాను ... తిన్నారు ...తిన్న తరువాత మేడ మీదకి తీసుకెళ్ళారు  ... మెట్లు ఎక్కుతూ ఉండగా సందేహాలు నాకు .... 

తోసేస్తారా (అంత సీన్ లేదులే ఈయనకి )
తొసేయమంటారా (అదే బెటర్ అనుకుని )

నువ్వు ఇక్కడే నుంచో  .. నేను ఇప్పుడే వస్తా అని వెళ్ళిపోయారు ... ఎండలో నుంచో పెట్టి శిక్ష అనుకుంటున్నారా ??  అనుకునే లోపే  పుస్తకం పట్టుకుని పైకి వచ్చారు .. 

కింద మా ఓనర్ అంకుల్ ఉంటే పిలిచారు ... 

ఈయనే మనకి సాక్ష్యం .. అని చెప్పి భగవద్గీత మీద  చేయి వేయించి అంతా  నిజమే చెప్పించారు ..ప్రమాణం చేయించుకున్నారు ... " మా అయన ఆరోగ్యంగా ఉండటం కోసం నేను ఎప్పుడూ వంటింట్లోకి వెళ్ళను .. వెళ్ళినా వంట చేయను .. వండినా మా ఆయనికి పెట్టను " అని 

అది ఈ రోజు వరకు తు చ   తప్పకుండా పాటించాను ! :D ..

అదీ సంగతి 

మళ్లీ  ఇంకో మార్చ్ 10 కి కాకుండా తరచుగా కనిపిద్దాం అనుకుంటున్నా....  మీరేం అంటారు ??

ఏంటో రెండేళ్ళ  నుండి పర్మిషన్  అడగనిదే  ఏ పని చేయలేక పోతున్నా మరి !! :P 

12 comments:

Subbarao said...

Super...:)

రాజ్ కుమార్ said...

Welcome back...
పెళ్ళిరోజు శుభాకాంక్షలు.

ఏమంటాం? సెకండ్ ఇన్నింగ్స్ కుమ్మమంటాం.
ఈ సారి కూసింత పెద్ద పొస్ట్ రాయవలసిందిగా ప్రార్ధన

..nagarjuna.. said...

permission granted :P :)

జయ said...

భలే బాగుందండి:). ఇంకేం, హాయిగా వంటిల్లు వదిలేసి మీ కాన్వాస్ మీద మాకు రోజూ బొమ్మలు, మీ పొస్ట్ లు చూపించేసేయాలి. ఇక్కడ వెయిటింగ్ మరి.
మీరు ఇలాగే కలకాలం ఆనందంగా గడిపేస్తూ మీ పెళ్ళిరోజు కానుకలని మాకు అందింస్తూ ఉండండి.
Congrats & I wish you both a very very happy married life....

nagarani yerra said...

పెళ్లరోజు శుభాకాంక్షలు .చాలా సరదాగా ఉంది ,మీ టపా .

kiran said...

Thank you raj,nagarjuna,jaya garu,nagarani garu :)

ఎగిసే అలలు.... said...

Hha..hha..super Kiran gaaru:):)

వేణూశ్రీకాంత్ said...

కొంచెం ఆలశ్యంగా పెళ్ళిరోజు శుభాకాంక్షలు కిరణ్ :-)
మేమేమంటాం ఆనందంగా అవునంటాం.. మంచి మంచి పోస్టులతో తరచుగా పలకరిస్తుండండి.

స్ఫురిత మైలవరపు said...

కొంచెం ఆలస్యంగా పెఌ రోజు శుభాకాంక్షలు. Happy to see you back. మీ కిరణుడు గారు బాగా అమాయకుల్లా వున్నారమ్మా :)

HVM - హర్ష వీక్షణం said...

పెళ్లి రోజు శుభాకాంక్షలు కిరణ్ :)

HVM - హర్ష వీక్షణం said...

పెళ్లి రోజు శుభాకాంక్షలు కిరణ్ :)

nmraobandi said...

వాటర్ మార్క్ టైపు లో...
మీ బ్లాగ్ ఎంటర్టైన్మెంట్ కి గ్యారంటీ మార్క్ లా ఉందే ...
శుభాకాంక్షలు ...

ఫిదా కి ఫిదా

శేఖర్  కమ్ముల గారు బాగున్నారా?? మీకే ??  బానే  ఉంటారు !! .. మా పరిస్థితే  ఏమి బాలేదు.. ఏం చెప్పమంటారు .?? మాది ఒక  సాఫ్ట్వేర్  జంట .. చి ఛ...