29 August 2012

సీరియల్స్ బామ్మ

 "ఏవండి...మీరు ఉద్యోగం మానేసి ఇంట్లో అన్నా ఉండండి..లేదా..నాకు ఏదో ఒక ఉద్యోగం చేస్కునే అవకాశం ఇవ్వండి..."
"మళ్లీ ఏమైంది...?"
"కొత్తగా అవ్వడానికి ఏమి లేదు...మీ అమ్మ గారున్నారే..."             
"మీ ఇద్దరి గోల నాకు చెప్పద్దు అని ఎన్ని సార్లు చెప్పాను...?"
"హా..చెప్తారు....పిల్లలు కూడా వాళ్ళ బామ్మ అంటేనే పారిపోతున్నారు...."
"మరీ మా అమ్మ అంత గయ్యాళి ఏమి కాదు...."
"నేనన్నానా..??..ఆ టీ వీ ఇంట్లో వద్దు....ఎవరికన్నా ఇచ్చేద్దాం...ప్లీజ్..!!"
"అబ్బా...అది ఉంటే ఏదో ఒకటి కాలక్షేపం ఆవిడకి..."
"సరే నేను రేపు ఎట్టి పరిస్థతిల్లో... మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే...మీరు సెలవ పెట్టుకుని...అత్తయ్య గారిని చూస్కోండి..."
"అలాగే లే...పో.."
--------------
పొద్దున్న ఆరింటికి పెద్దావిడ లేచి...
----------------
"అమ్మా...పార్వతి...కాఫీ ఇవ్వమ్మా....ఆ బ్రూ అడ్డిమెంట్స్ లో వాళ్ళు..ఆహ..ఓహో అంటారు కదా...అలా వాసనా..రుచి రెండు ఉండాలి.."
"అమ్మా..ఈ రోజు అది వాళ్ళ చెల్లి ఇంటికి వెళ్ళిందే....నేనే ఉన్నాను....నాకు టీ చేయడం మాత్రమే వచ్చు...కాఫీ రాదు.....ఏది ఇవ్వమంటావ్..?"
"అదేంట్రా పార్వతి ...పుట్టిల్లు సీరియల్ లో లక్ష్మి వాళ్ళ అత్తగారికి చెప్పకుండా బైటికి వెళ్ళినట్లు వెళ్ళిపోయింది..??...సరేలే...నువ్వు రంగు.. రుచి... చిక్కదనం...మూడు ఉండేలా 3 రొసేస్ తో ఒక కమ్మటి టీ పెట్టివ్వు..."
"అమ్మా..టీవీ లో ఊరకే చూపిస్తారు....అలాగే రావాలంటే కష్టం.."
"ఏదో ఒకటి పెట్టు..ఈ లోపు గీజర్ వేసి రా.....అసలే తల స్నానం చేసి.....వెంకన్న గుడికి వెళ్లి ..ఇక్బాల్ మీద అర్చన చేయించాలి..?"
"వాడెవడు అమ్మ..చిన్ని ని దింపే ఆటో వాడా....?"
"ఛి ఛి..కాదు రా.....ఈ రోజుతో నాలుగు వంద ల ఇరవై రెండో భాగం పూర్తి చేస్కుంటున్నా చెక్కెర పాకం సీరియల్ లో ని ఇక్బాల్ హాస్పిటల్ లో ఉన్నాడు....వాడికి నయం అవ్వాలని...అర్చన చేయిస్తా అని వెంకన్నకు మొక్కుకున్నా...!!"
"అమ్మా...??????????"
"టీ బానే ఉంది రా..ఇంకా కొంచెం రంగు ఉంటే బాగుండేది....ఆ పెద్ద కూతురు సీరియల్ లో వాళ్ళ చిన్న కోడలు...రంగు రంగుల..కప్పులో భలే చిక్కగా పెట్టిస్తుంది రా వాళ్ళ మామగారికి.."
"అమ్మా...?????????"
"నీళ్ళు కాగుంటాయి...ఈ లోపు నువ్వెళ్ళి పక్క కొట్టు లో కొబ్బరికాయ పట్టుకు రా..ఆ తట్టల సవ్వడి సీరియల్ లో వైదేహి కి కడుపొస్తే పంచ ముఖ గణపతి గుడిలో కొబ్బరి కాయ కొడతా అనుకున్నా...మొదట అక్కడికి వెళ్లి వెంకన్న గుడికి వెళ్ళొస్తా..."
"అమ్మా...???????"
"ఏ రా...వెళ్ళొస్తా...పదకొండు కల్లా వచ్చేస్తా.......కొన్నితెలుగు  సీరియల్ లు తమిళ్ లో వస్తాయ్...కథ ముందే తెల్సుకోవచ్చు.."
"హా..మరే ఎం బి బి ఎస్ పరీక్షలు సిలబస్ ముందే తెల్సుకుని చదువుకోడానికి.."
"దానికంటే గొప్ప రా నేను...ఎన్ని సీరియల్ లు..ఎన్ని పాత్రలు గుర్తు పెట్టుకుంటున్నాను...."
"హా..సరే లే వెళ్ళు....నేను మా ఆవిడకు ఫోన్  చేస్కుంటా..."
ట్రింగ్..ట్రింగ్..ట్రింగ్...
"అయ్యో ఇదేంటి మొబైల్ పట్టుకెళ్ళలేదు..."
"అమ్మా...రామ చంద్ర....ఎండ మండిపోతోంది రా...ఆ ఫ్రిజ్జి లో పెట్టిన చల్లటి మంచి నీళ్లివ్వు రా.."
"ఇదిగో..."
"ఆ వార్తలు పెట్టకు...తల నొప్పి..చెప్పిందే చెప్తూ ఉంటారు...."
"సరే కానీ...పార్వతి ఫోన్ తీసుకెళ్ళలేదు ..మర్చిపోయిందనుకుంటా"
"కాదు రా..నాకోసమే అయ్యుంటుంది..."
"నీకేం పనే ఫోన్ తో..?"
"ఆ ఇత్తడి బొమ్మ సీరియల్ లో ఆ పిల్ల ని కిడ్నాప్ చేసి ఒక చోట పెట్టారు...మొన్న...ఆ విలను...ఆ పిల్ల తండ్రి ఫోన్ నెంబర్ గట్టిగా చెప్తూ ఉంటే నేను ఆ పక్కనే ఉన్న క్యాలెండర్ మీద రాసాను చూడు..."
"ఆ నెంబర్ కి చేసి కూతురు ఎక్కడుందో నేను చెప్పడానికి  పెట్టి  వెళ్ళింది లే "
"అమ్మా..???????????"
"అన్నం  వండావా   ...?..ఆకలి  వేస్తోంది .."
"ఏమ్మా ప్రసాదం పెట్టలేదా..??"
"పులిహోర రా...అయినా ఆ గుడి లో వంట వాళ్ళు మారారు..మడి తో చేసారో లేదో అని నా అనుమానం..అయినా..పన్నీరు ..మసాల తో చేసే వంటలు ఆ వంటింట్లో తంటాలు..ప్రోగ్రాం లో వస్తాయి కదా...అవి చూసి నాకు పార్వతి బోలెడు రకాల వంటలు చేసి పెడ్తుంది..నువ్వేమో ప్రసాదం పెట్ట లేదా అని అడుగుతున్నావ్..."
"ఆహా..మసాల తినచ్చు...బైట బండి వాడి దగ్గర మిరపకాయ బజ్జి లు తినచ్చు...గోబీ మంచురియా లో వెల్లుల్లి తినచ్చు..కానీ గుడి లో ప్రసాదం కి  మాత్రం ఆ అనుమానం ఎందుకొచ్చిందో.."
"పార్వతి ఎన్నడూ ఇన్నేసి మాటలు అనలేదు...నువ్వు ఆ పేద కొడుకు సీరియల్ లో రాము లా మాట్లాడుతున్నవేంటి రా....?"
"అమ్మా....!!!!!!!!!!!!!!!!!!!!!!!!!"
"సరే ఈ రోజు కి నాకు వచ్చిన వంట చేశాను..తిని ...కాసేపు నిద్రపో.."
"అల ఎలా కుదురుతుంది రా .. గ్రహ ప్రవేశం సీరియల్ లో వాళ్ళు కోర్ట్ లో కేసు కు ఏం తీర్పు ఇస్తాడో చూడాలి..."
"లేకపోతే నువ్వెళ్ళి తీర్పు చెప్తావా..."
"మీ ఆఫీసు లో టీవీ గానీ ఉందేంటి రా..అచ్చం ఇందాక చెప్పిన రాము లా నే మాట్లాడుతున్నావ్..వాడికి కూడా వాళ్ళ అమ్మ అంటే అసలు లెక్క లేదు..?"
"అమ్మా..నేను వెళ్లి పడుకుంటా...నీ ఇష్టం వచ్చింది చూసుకో..."
కిటికీ రెక్కలు కొట్టుకుని మెలకువ వచ్చింది..సన్నగా మూలుగుతున్న..గొంతు..
"అయ్యో అమ్మ నా మాటలకి బాధ పది జ్వరం తెచ్చుకుని ఏడుస్తోందా ..??"
"ఏమిటో... కలి కాలం..మంచి కి రోజులే కావు..." అంటూ ముక్కు మూతి..మళ్లీ ముక్కు మూతి ఒకటే సరి తుడిచేస్తోంది పెద్దావిడ..
"ఏమయ్యిందిప్పుడు  ...??"
"ఆ ఇద్దరు విడాకులు తీస్కుంటున్నారు...ఇద్దరు సంతానం...ఆ అక్క ,తముళ్ళకి ఒకరంటే ఒకరికి  బాగా ఇష్టం...కాని...ఒకరు తల్లి దగ్గర ..ఒకరు తండ్రి దగ్గర ఉండాలి అని కోర్టు తీర్పు ఇచ్చింది..ఆ పిల్లలు పొద్దున్నుండి అన్నం కూడా తినకుండా ఏడుస్తూనే ఉన్నారు.....నాకు కన్నీరు ఆగట్లేదు...అసలే నీ చెత్త వంటకం తిన్నానేమో అస్సలు ఓపిక లేదు ఏడవటానికి..."
"ఎవరింట్లో ఇంతకి... మన చాకలి అంజి ఇంట్లో నేనా..??"
"నీ మొహం..కళ్ళు పోతాయ్..వాళ్ళు శుభ్రంగా ఉన్నారు..వాళ్ళు కాదు ఇందాక నేను చెప్పిన గ్రహ ప్రవేశం సీరియల్ లో.."
"నా గ్రహాలు బాలేక ఇంట్లో ఉన్నానే...ఇంట్లో ఉన్నా... బైటికి వెళ్ళొస్తా.."
"షర్టు వేసుకుని...లుంగి తో నే ..బైటికి వెళ్తూ ...అలా సందు చివరి పార్క్ లో కుర్చుని వస్తా ప్రశాంతంగా  ..."
"అలాగే నేను కూడా ప్రశాంతి సీరియల్ చూసుకుంటా ప్రశాంతంగా ...ఎక్కడున్నా నాలుగింటికి వచ్చేయి నాకు టీ పెట్టివ్వాలి..."
"అమ్మా..!!!!!!!!!"
"పెద్దమ్మ గారు..నేను వచ్చాను...అంట్లు వెయ్యండి...పారోతమ్మ  లేదా..??" అంటూ వచ్చింది లచ్చి..
"లేదు..మా వెధవ ఉన్నాడు...చల్ల గాలి కోసం పార్కుకి పోయాడు.....వస్తాడేమో...ఓ పది నిముషాలు ఆగు..."
"మీరేయ్యచ్చు కదా...అమ్మా.."
"ఏమిటే నీకు కూడా దెయ్యం సీరియల్ లో రంగి లాగా నోరు లేస్తోంది....అది వాళ్ళ చిన్నప్పటి నుండి తెలుసు  అని దాన్నే పెట్టుకుంటే మాటకి మాట సమాధానం చెప్తోందే.."
"ఈ అయ్యోరు ఎప్పుడొస్తారో ..."
మేడ మీద నుండి మెట్లు దిగుతూ ..వస్తున్నా అతన్ని చూసి..."అయ్యోరు.."..అనే లోపు...అరవద్దు అని సైగ చేస్తాడు...
"వచ్చావా..దానికి అంట్లు వేసి నాకు టీ పెట్టివ్వు..ఈ వెధవ డిష్ పోయింది...ఆ డిష్ వెధవ రానివ్వు...నన్ను టెన్షన్ లో పెట్టినందుకు యాభై రూపాయలు కట్ చేస్తా.."
"నీకెందుకు  టెన్షన్.."
"ఆ ఉత్తరం నీరు అనే సీరియల్ లో..."
"అమ్మా........."(ఇంక అరవడానికి కూడా ఓపిక పోయింది...)
ఇల్లంతా చాల నిశ్శబ్దం గా మారిపోతుంది...
"కాసేపట్లో...టీ ఇస్తూ...మొన్న రామాయణం తీసుకొచ్చా కదా...చదివావా..??"
"ఎక్కడ రా..సమయం లేదు నాకు...ఒకటే ఒళ్ళు  నొప్పులు..వర్షాలు కదా..బయట వాతావరణం కూడా తేడా గా ఉంది కదా.."
"ఉదయం నుండి బానే ఉన్నావ్ కాబట్టి..ఇప్పుడు కాసేపు చదువు అని చేతిలో పెట్టేసి అతను పేపర్ అందుకున్నాడు.."
"ఎక్కడ రా చలికి షాల్ కప్పుకున్నాకదా..."
"షాల్ కప్పుకుని టీవీ చూసావు కదా..అలాగే ఇది కూడా చదువు.."
"$%$^$%&^$%&^%&* "  పుస్తకం తెరచి.. "శ్రీ రామ చంద్ర మూర్తి కి జై" అని ఒక్క అరుపు ...రాముడు ఇంకో రెండు రోజులు నిద్ర పోకుండా ఉండేలా ...చేసి...పుటలు తిప్పుతోంది...
కొడుకు చూస్తున్నాడు...
"ఏమయ్యిందే..అద్దాలు తెచ్చివ్వనా..??"
"కాదు రా...రాముడి గా సీరియల్ లో చేసే వాళ్ళలో ఎవరు నప్పుతారా..అని ఆలోచిస్తున్నా..??"
"అమ్మా...".
"సర్లే...చదువుకుంటా...."
అప్పుడే   కాలేజీ నుండి వచ్చిన మనవరాలు...వాళ్ళ నాన్న పక్కనే కూర్చునే కాఫీ కలుపుకుని తాగుతూ..చెవిలో "ఏంటి నాన్న ఇది మన బామ్మే నా" అని అడిగింది...
"చూడు..మీ అమ్మా ..మీరు మార్చలేనిది  ..నేను ఒక్క రోజు లోనే మార్చేసా..."
"చిన్ని...ఎక్కడున్నావే..?"
"హా బామ్మా వస్తున్నా..."
"చూడవే రామాయణం ఎంత బాగుందో..రాముడి పేరు తలచుకుంటేనే వళ్ళంతా పులకరిస్తోంది..."
"అవును కదా బామ్మ...మొన్న గుడి లో ప్రవచనాలు చెప్తుంటే రానంటే రాను అన్నావు...మరి.."
"సరే కానీ...నాకు కొన్ని సందేహాలు..ఉనాయి అవి తీర్చు.."
"అమ్మో..నాకేం తెలుసు బామ్మా...రామాయణం...??"
రామాయణం లో వి కాదు లే....ఇందాక మీ నాన్న ని అడిగితే కొర కొర చూసాడు...అందుకే నిన్ను అడుగుతున్నా..."
"రాముడి పాత్రకి నాటకాల్లో వాళ్ళు ఎవరు సరిపోతారు..?
సీతకి..?
మండోదరి మాత్రం అరటి ఆకులు సీరియల్ లో పాటి నే..ఆ 1765  భాగం లో ఆవిడ నటన నన్ను అంత ఆకర్షించింది ..
లక్ష్మణుడు ఏమో సోది అన్నయ్య సీరియల్ లో వేసిన తమ్ముడే..ఆ తమ్ముడు వాళ్ళ సోది అన్నయ్య తాగుబోతని తెలిసి...డబ్బులు ఇద్దరు కర్చు పెట్టకూడదు కాబట్టి..వీడు మందుని త్యాగం చేసాడు
దశరథుడు...పేద నాన్న లో నాన్నే..నలుగురు కూతుర్లైనా...పద్ధతి గా పెంచి..ధైర్యం నేర్పించి...మంచి కుటుంబాలకు పిల్లల్ని పంపించాడు..అల్లుళ్ళు కూడా గుణవంతులే .."
"బామ్మా.........!! :("
"నాన్నా..ఏం మార్చావు...ఆవిడా రామాయణం పట్టుకుని  కూడా సీరియల్ ల గురించే ఆలోచిస్తోంది..మారింది అనుకుని ఎంతో ఆనందపడ్డాను"
"చిన్ని..రాత్రికి చోలే పటోడా చేయవే.."
"బామ్మా...సెనగలు నానేసి లేవు...."
"ఉండు నేను గుడి కి వెళ్లి గుగ్గిళ్ళు తీసుకొస్తా.."
"అయ్యో నేనొక్క దాన్నే అయితే తక్కువ ఇస్తారు...నువ్వూ..మీ నాన్నా కూడా రండి..."
"అమ్మా..."
"ఏమిట్రా..పొద్దున్నుండి.....అన్నిటికీ అడ్డం పడుతున్నావు.....నాకు అసలు స్వాతంత్ర్యం లేదా..???నన్ను ఒక old  age  home  లో పడేయి...." మళ్లీ మూతి ముక్కు...ముక్కు మూతి తుడిచేస్తోంది ఈవిడ
"ఇప్పుడు ఏమన్నా..?? పదా..వెళ్దాం..."
గుడికి వెళ్ళే దారి లో ..ఈ బామ్మ ఇంకో బామ్మ కనిపిస్తే ఉత్తమ కోడలు అనే సీరియల్ గురించి మాట్లాడుకుంటూ...ఉండగా..తప్పించుకుని...కొంచెం వెనక నడుస్తూ...
"ఎమ్మా...చిన్ని...రోజు బామ్మ ఇంతేనా..?ఇంత సీరియల్ పిచ్చి ఏంటి..??"
"నాన్నా..అమ్మా రోజు చెప్తుంటే నీకు అర్థం కావట్లేదు...ఇంతే...ఇంకా సాయంత్రం నుండి డిష్ రావట్లేదు...లేకపోతే....లైవ్ కామెంట్రి ఇస్తూ చంపేస్తుంది...ఇంకా ఆ anchor  లు వేసుకునే డ్రెస్ లు.. చీరలు ..బాగుంటే నీ పాత డైరీ లో వెనుక కొన్ని పేజి లు ఖాలీ గా ఉంటే అందులో వాటి డిజైన్ లు వేస్తుంది...సాయంత్రం రాంగానే...నాకు చూపిస్తుంది...ఇలాంటి సహాయాలు చేస్తుంది...నేను చదువుకోడానికి పక్క వీధి లో ఉన్న సుధా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను.."
"నాకు ఒకటి బాగా అర్థమయ్యింది...నేను సెలవ పెట్టకూడదు కాక పెట్టకూడదు  .."
"అంతే నాన్న..ఎప్పుడు నీ స్వార్థమే..మేమూ... అమ్మా...మీ ఆమ్మ మాటలు.. సీరియల్ లు... వింటూ.. చూస్తూ... ఉండాలా..గట్టిగా ఎమన్నా అంటే..వీధి వీధి అంత వినపడేలా అరిచేస్తుంది..."
"పెద్దది కావడం తో ఏమి అనలేకపోతున్నానే...సరే లే...ఇంకో టీవీ కొని మీకు బెడ్ రూం లో పెట్టిస్తా లే.."
"సరే..ఇంకో విషయం.....ఇందాక డిష్ వైర్ ....నేనే లాగేసా....ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు పెట్టకండి..."
"హహహ...అలాగే..నాన్న.."
"ఇంతకీ బుజ్జోడెక్కడ..??"
"వాడు మెడ మీద క్రికెట్ ఆడుకుంటాడు..రోజు స్కూల్ నుండి రాంగానే..."
"ఓహో..."
"నాన్న..నాన్న....టీవీ లో ఫుట్ బాల్ మ్యాచ్ వస్తోంది అడ్డు జరగండి.."అంటూ వెనక నుండి వచ్చాడు...బుజ్జోడు
"డిష్ రావట్లేదు రా..మధ్యానం  నుండి..."
"లేదు లే...వైర్ ఏ కోతో లాగేసినట్లుంది...నేనిప్పుడే పెట్టేసి వచ్చా...."

23 comments:

జలతారు వెన్నెల said...

Hilarious! బాబోయి! ఇంతగా టీవీ పిచ్చివాళ్ళు ఉన్నారా?

Sravya V said...

వావ్ కిరణ్ సూపర్బ్ ! మనలో మన మాట ఎవరిని చూసి రాసారేంటి ?:P

రాజ్ కుమార్ said...

"అయ్యో నేనొక్క దాన్నే అయితే తక్కువ ఇస్తారు...నువ్వూ..మీ నాన్నా కూడా రండి..."
"అమ్మా..."

అసలు ఈ "అమ్మా...!!!!" కాన్సెప్ట్ అరాచకం... సో వెన్నెల కిరణ్ కధా రచయిత అవతారం ఎత్తారన్న మాట ;) బాగు బాగు ;)


రాజ్ కుమార్ said...

<>

కికికికి

"అమ్మా...!!!!!!!!"

zenith said...

mottam chadavaledu kani, bomma bagundi. will continue later..

మనసు పలికే said...

అమ్మా కిరణూ... కొంప తీసి మీ ఇంట్లో కానీ, నీకు తెలిసిన ఇంట్లో కానీ ఎక్కడైనా ఇలాంటి బామ్మని చూశావా?? ;) జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం అడుగుతున్నాలే. టపా పేల్చేశావ్ అంతే :)))

మనసు పలికే said...

మర్చిపోయా, అంతా ఒకెత్తైతే చివర్లో ఆ బొమ్మ ఒకెత్తు :)) అద్భుతం అంతే :D:D

ఫోటాన్ said...

హ హ హ హ :))
సూపర్ కిరణ్ :)

Lasya Ramakrishna said...

ha ha ha...super comedy...

రహ్మానుద్దీన్ షేక్ said...

:)

సిరిసిరిమువ్వ said...

:)))

Chandu S said...

బాగుంది. బాగా నవ్వించారు.

శశి కళ said...

హ..హ..నేను పిల్లలు చదివి కిం.ప.దొ.న
ఏమి వ్రాసావు కిరనూ

Kranthi M said...

ఈ బుజ్జోడు ఎక్కడినించొచ్చాడు లాస్ట్‌లో. భలే భలే బాగుంది కిరణ్.

రసజ్ఞ said...

హహహ భలే వ్రాశారండీ!
అసలన్ని సీరియల్స్, వాటిల్లో మళ్ళీ పాత్రలు (ఆ పాత్రలు ఆ సీరియల్స్ కు చెందినవే అని భావిస్తూ) అన్ని ఎలా గుర్తుంచుకుని వ్రాశారండీ? మీరు గానీ ఆ బామ్మగారి రేంజ్ లో చూడటం లేదు కదా ;)

..nagarjuna.. said...

అమ్మా..!!

(ఎమోషన్ కోసం శివాజీ గణేషన్ గొంతులో)

:))

శిశిర said...

:) :)

Anonymous said...

నిజం చెప్పండి. మీ కథలో బామ్మ పాత్రకి ప్రేరణ ఎవరు ?
టపా చాలా బావుంది.

Unknown said...

బలే ఉంది కిరణ్ ఈ పోస్ట్

Radha said...

nizamga andi.. intha late ga posts chesthunnanduku meeku choopinchali kurchopetti inni serials. meekade siksha. :D
just too good post. haayiga navvukunna chala rojula tharvatha.

keep it up

మధురవాణి said...

Hahhahhaa.. Hilarious.. Good one Kiran! :D

చాతకం said...

Hillarious. LOL.

BTW, what happened to your new year resolution? ;)

గీతిక బి said...

చాలా చాలా బావుంది..

అనన్య చురకలు !

మా పాపా పేరు అనన్య  ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను  దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...