25 December 2011
శైలు's వెన్నెల్లో గోదావరి...!!
ఆహా...ఒహోఒ.......నేను నిన్న 6 .40 -7 గంటల మధ్య గాలిలో తేలుతూ ఉన్నాను..!!
ఎందుకో చెప్పుకోండి...??
వెన్నెల్లో గోదావరి పుస్తకం చేతిలోకి తీస్కున్నా...
మొదట ఏం చూసానో చెప్పుకోండి....ఎలాగో కథ తెలుసు..కవర్ పేజి కూడా తెలుసు...మొత్తం బ్లాగ్ లో చూసేసా..!!
కాని నా painting ఒక బుక్ లో రావడం...అది నేను చుస్కోడం....అబ్బో..అబ్బో...అసల వద్దు లెండి..
పక్కన నా కజిన్ ఉంటే...తనని పిలిచి నా painting చూడు అని చూపెట్టాను...
తనేమో వావ్ అక్క...భలే ఉంది..!!అనింది....
మరి కథ అంతా బాగుంటేనే కదా...నాకు అలా వేయాలని అనిపించింది...ఇది నా ఫ్రెండ్ రాసింది చదువు అని చెప్పాను..!!
ఏదో buzz లో ,చాట్ లో ఓ మాట్లాడేస్కుంటాం కానీ...
ఓ సారి షాప్ లో పుస్తకం మీద ఆదెళ్ల శైలబాల అని రాసింది చూసి...ఓ.... శైలు నాకు తెల్సు..బాగా తెల్సు... అని కాస్త గర్వంగా కూడా ఫీల్ అయ్యాను...!! :D
ఇక పుస్తకం గురించి చెప్పేదేముంది......మీకందరికీ తెలిసిందే కదా...
ప్రతి line లోను ప్రేమే నిండి ఉంటుంది...కొన్ని సన్నివేశాల్లో మనల్ని మనం చూసుకోగలం ..!!
నాకు అతి ఇష్టమైన అమ్మమ్మ,తాతయ్య ల గురించి ఎంత బాగా రాసిందో...
ఇక శైలు క్యారెక్టర్ లో ఆల్మోస్ట్ సున్నితంగా ఆలోచించే ప్రతి అమ్మాయి తనను తాను పోల్చుకోగలదు....
అబ్బాయిలు ఏది పట్టించుకోనట్లు కనిపిస్తూనే అన్ని పట్టించుకుంటారు..అని ఎంతో చక్కగా కుమార్ క్యారెక్టర్ లో చూపించింది..!!
నాకు ఇంకో సారి ...ఇంకో సారి...ఇంకో సారి... చదివిన బోర్ కొట్టట్లేదు..
మొదటి సారి చదివినప్పుడు...గీజర్ ఆన్ చేసి నీళ్ళు కాగేలోపల..అసలు ఈ శైలు గారు(అప్పట్లో గారు ఉండేది లెండి :P)..ఏం రాస్తున్నారో..అంత అద్బుతమైన బాక్గ్రౌండ్ పెట్టి అని
అనుకుంటూ అని బ్లాగ్ ఓపెన్ చేశాను...ఒక అరగంట అయ్యాక మా రూం మేట్ వచ్చి..అక్క ఆంటీ కి నీ వల్ల హార్ట్ ఎటాక్ రావడం నీకు ఇష్టమా అంది..
అప్పుడు అర్థమైంది...గీజర్ గురించి మాట్లాడుతోంది అని..ఇక నేను దీన్ని మధ్యలో ఆపలేను లే అని దాన్ని ఆఫ్ చేసి...ఇక్కడ మొత్తం చదివేసాకే ..మిగితా పనులు చుస్కున్నాను..
మొదటి సారే ...అలా కట్టి పడేసింది....
ఏమో నాకు ఆ పుస్తకాన్ని వివరించేంత బాష నా దగ్గర లేదనిపిస్తోంది...కానీ ఇప్పటి కాలంవారు ప్రతి ఒక్కరు ఓ సారి ఆ పుస్తకాన్ని చదివితే బాగుంటుంది :)
కాస్త పరిచయమయ్యాక...నాకు వెన్నెల్లోకి ఒక బొమ్మ వేయచ్చు కదా కిరణ్ అంది...నేను ఏదో కాస్త ప్రయత్నించాను....
నాకు నచ్చింది నా ప్రయత్నం :)
కానీ తాను నా మీద అభిమానంతో ఆ పుస్తకం లో వేయించడమే నాకు ఓ పెద్ద ఆనందం..!!
Thank you so much sailuuuu...!!!! :D
Subscribe to:
Post Comments (Atom)
అనన్య చురకలు !
మా పాపా పేరు అనన్య ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...
-
హ..హా....హా....చ్... శుభమా అని కొత్త సంవత్సరం మొదలవుతూ ఉంటే ఆ తుమ్ములేంటి...?? ఆహా ఒక్క సారికే...నాకు రోజూ తుమ్మోదయమే అవుతోంది మరి... కర్ర...
-
తెల్లవారు జామున ఏడుకి కి అలారం మోగుతోంది ..పొద్దున్నే తొమ్మిదింటికల్లా ఆఫీసు కి వెళ్ళాలని ఎవడు కనిపెట్టాడో కానీ అని అనుకుంటూ నిద్రలేచి గ...
-
నిజంగా ఇది నా బుజ్జే...దీన్ని ఇంట్లో అలాగే పిలుస్తారు..మీరు కుక్క పిల్ల అని తప్పుగా అర్థం చేస్కోకండి ...ఆడపిల్లే..అందమైన తెలివైన ఆడపిల్ల......
13 comments:
వావ్.. వెన్నెల్లో గోదావరి వచ్చేసిందా.. ;)
శైలూ గారికి అభినందనలు..
నీకు కూడా అభినందనలు కిరణా.. ;)
Nice
:)
?!
గుడ్ గుడ్ మీ ఇద్దరికీ అభినందనలు :-)
iddariki iddare....sailu,kiran...iddariki congrats
వ్రాసిన శైలబాల గారికి బొమ్మ వేసిన మీకూ శుభాభినందనలు.
కిరణ్ గారు... :-))
నేను ఇంతవరికి శైలు గారి ఒక్క పుస్తకం కోడ చదవలేదు :-(
శైలు గారి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి...నాకు చదవాలని ఉంది....
నాకు ఇంకొక డౌట్ ఏంటి అంటే కల్లూరి శైల బాల గారు + అదెల్ల శైల గారు ఒక్కరేనా...
థాంక్ యు కిరణ్.
నాతొ పాటు వెన్నెల్లో గోదావరి పుస్తకంలో మీరు అంతా ఉండటం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది.
Congrats Kiran.
శేఖర్ గారూ అవునండీ ఇద్దరూ ఒక్కరే(ట)నాకు మొన్న పుస్తకాల సంత లోనే తెల్సింది,అప్పుడే చూశాను ఈ పుస్తకం కూడా
థాంక్ యు పప్పు గారు... :-)
అవునండి నేనే చెప్తున్న కదా ఇద్దరు ఒకరే.( ట ) అక్కర్లేదు.
:)))
Congrats to both of you!
Nice...
Post a Comment