శుభమా అని కొత్త సంవత్సరం మొదలవుతూ ఉంటే ఆ తుమ్ములేంటి...??
ఆహా ఒక్క సారికే...నాకు రోజూ తుమ్మోదయమే అవుతోంది మరి...
కర్రెస్ట్ గా అలారం మోగడం..మా రూం మేట్ హచి హచి మని తుమ్మడం....
ఈ రోజూ ఏ గండం నా ముందుందో అని భయపడుతూ నిద్రలేవడం...ఈ పిల్ల ముక్కు కోసేసి ఆ గూట్లో దాచేయాలి..ఈ చలికాలం అయ్యాక మళ్లీ ఇవ్వాలి...అనుకుంటూ..రామయ్య తండ్రి....ప్లీజ్ హెల్ప్ మీ అనడం...ఆయనేమో బిజీ గా ఉన్నా...గో టు యువర్ కిట్టి అనడం....నేను వెళ్లి..కిట్టే...అని స్టైల్ గా పిలిస్తే....ఆయనేమో ఇస్టైల్ గా చేత్తో బాబా ని చూపించడం....ఈ బాబా ఏమో ఈ మధ్య నన్ను ఎన్ని సార్లు తల్చుకున్నావే..ఇప్పుడు మాత్రం నేను కావాలా..అన్నట్లు చూడటం..సర్వసాధారణమైపోయింది...
"గాడ్..యు ఆర్ basically గుడ్ గాడ్...నా వల్ల కాదు...నేను ఆఫీసు కు పోను...."
"సరే మీ ఆంటీ దగ్గరికి పో ..నిన్న రాత్రి కారట్ కూర చేసిన మూకుడు నుండి ......ఈ రోజూ మీ అంకుల్ తాగిన కాఫీ గ్లాస్ వరకు సింకు లో ఉన్నాయి....కడిగేయి..."
"నో గాడ్...నో..."
"మరి మూసుకుని ఆఫీసు కు పో"
"నచ్చట్లేదు..గాడ్ నచ్చట్లేదు.."
"నువ్వు ఆ ఇంగ్లీష్ లో గాడ్ అని కూయడం కూడా నాకు నచ్చట్లేదు.."
"హిహి...సరే దేవుడా..నా జీవితం మార్చేయి..."
"ఎలాగా?"
"ఏ రోజూ నిద్రలేచినా అది ఆదివారం అయ్యుండాలి...
ఎప్పుడు కళ్ళు తెరిచి అలారం చూసినా అది మోగడానికి ఇంకా అరగంట సమయం ఉండాలి ..
ఒక్క ఇడ్లీ అయినా నవ్వుతూ పెట్టే హాస్టల్ owner కావాలి....
"ఏ రోజూ నిద్రలేచినా అది ఆదివారం అయ్యుండాలి...
ఎప్పుడు కళ్ళు తెరిచి అలారం చూసినా అది మోగడానికి ఇంకా అరగంట సమయం ఉండాలి ..
ఒక్క ఇడ్లీ అయినా నవ్వుతూ పెట్టే హాస్టల్ owner కావాలి....
దుమ్ము లేని రోడ్ లు కావాలి....
TL లేని ప్రాజెక్ట్ ని కావాలి...
మాట్లాడలేని మేనేజర్ ని కావాలి....."
"కిరణు ఆపు..."
"ఏం దేవుడా...."
"ఊపిరి లేని కిరణ్ ని చేద్దాం అనుకుంటున్నా...!!..."
"గాడ్...!!!!"
"మరేంటి నీ కోరికలు??"
"నువ్వు మనిషివైతే తెలుస్తుంది...!!"
"ఇప్పుడేం చేయమంటావ్...""కిరణు ఆపు..."
"ఏం దేవుడా...."
"ఊపిరి లేని కిరణ్ ని చేద్దాం అనుకుంటున్నా...!!..."
"గాడ్...!!!!"
"మరేంటి నీ కోరికలు??"
"నువ్వు మనిషివైతే తెలుస్తుంది...!!"
"నన్ను దేవతను చెయ్యి..."
"ఆర్ యు sure....."
"yes ..ofcourse..."
"తథాస్తు.."
"అంటే ఇప్పుడు నేను దేవతానా....."
"అవును..నువ్వు దేవతవి...నేను మనిషిని....ఈ ఒక్క రోజూ ఆఫీసు కి సెలవ పెట్టి నా పక్కనే ఉండు..."
"అలాగే..నేను దేవత ని కదా..మా మేనేజర్ ని ఓ ఆట ఆడుకుంటా...చూడు..."
"ఆహా....కలలు కనకు..నీ PA వస్తుంది.."
దేవుడి PA : కిరణ్ దేవత....మీరు ఈ రోజూ X కి promotion లెటర్ వచ్చేలా చేయాలి...
నేను : X కి promotion ఆ ?..నో వే ...నేను ఇవ్వను..X ఏ నా మేనేజర్..
దేవుడు .. పాపా..దేవత కిరణు....ఇయ్యలమ్మా...స్క్రిప్ట్ ముందే రాసుంది....
నేను : :( :(
నేను : ఇద్దో ఆ X నిన్ను నానా మాటలు అనడానికి వస్తున్నాడు....చూసావా...కారాలు మిరియాలు టీం మొత్తం మీద రుద్దు తున్నాడు...
దేవుడు : ఏం పర్లేదు.....నేను మేనేజ్ చేస్కుంటా...
నేను : ఇన్ని రోజులు చేసిన పని కూడా గుర్తు లేదూ..
దేవుడు : ఎవరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు....నాకు నా పని ఎంతో నేర్పించింది..అది చాలు...
నేను : ఎహే నువ్వెలా ఉంటావ్ ఇలా..??
దేవుడు : సరే ఇప్పుడు ఆ గుడికి వచ్చిన భక్తుల్ని చూడు..
నేను : వింటున్నా...వింటున్నా...అన్ని దొంగ దండాలే సామి...పైగా తిట్లు కూడా....వామ్మో..
దేవుడు : చూడు మరి..నువ్వు ఒక్కరి తిట్లే...అది కూడా నీ ముందు తిడ్తే మాత్రమే తెలుస్తుంది...అది కూడా ఎప్పుడో ఓ సారి...
నేను : అవును...నాకు ఈ చెవులోద్దు..ఎన్ని కోరికలు బాబోయ్..ఒక క్షణానికి కొన్ని వేళ కోరికలు...తిట్లు...అప్పుడప్పుడు మాత్రమే పొగడ్తలు...!!
దేవుడు : ఏం తెలిసింది నీకు?
నేను : అన్నిటికన్నా మానవ జన్మ ఉత్తమం..!!
దేవుడు : కిరణు...basically u r very gud కిరణ్ :)
నేను : ఇంకా చెప్తా విను..నువ్వైనా పొగుడు నన్ను..
దేవుడు : చెప్పు..చెప్పు
నేను : మనిషికి కష్టాల్...సుఖాల్....లాభాల్..నష్టాల్..అన్ని కామన్....కానీ వాటి నుండి బైట పడే మార్గాలు కూడా బోలెడు..అయినా వాటినే పట్టుకుని వేలాడుతూ ఉంటాడు...
దేవుడు : సెబాష్..
నేను : ఇద్దో నన్ను మనిషిని చేసేయ్.....కానీ ఓ రిక్వెస్ట్..
దేవుడు : ఏంటో?
నేను : నా జాతకం మార్చేయి..
దేవుడు : ఓ అద్బుతం..దానికేం....
నేను : ఆ ..మొన్న ఒకళ్ళు ఇలాగే చెప్పారు.....ఆ మరుసటి వారం నుండి అబ్బో..జీవితం సూపరు..వాళ్ళు ఎప్పుడు కనిపిస్తారా..ఎప్పుడు కొట్టేద్దామా...అని వెయిటింగ్..
దేవుడు : వాళ్ళు అదృష్టవంతులు...నేనే ఇరుక్కుపోయనన్నమాట..
నేను : సర్లే పో...అందరి కోరికలు వినుపో..టాటా...
దేవుడు : టాటా కిరణ్...హ్యాపీ న్యూ ఇయర్..!!
మీరు వెళ్ళిపోకండి...మీకో అద్బుతమైన అవకాశం...
నా న్యూ ఇయర్ resolution ...కవితలు రాయడం......
హిహిహ్హహుఅహౌహౌఅహౌహాఅ..
ఇద్దో చదవకుండా పారిపోయారంటే..మీ బ్లాగుకొచ్చి..ఇదే కవిత కామెంట్ పెడతాను...
వస్తోంది వస్తోంది...నూతన సంవత్సరం..
పోతోంది పోతోంది....పోతున్న సంవత్సరం...(ప్రాస)
రావాలి రావాలి మీ దగ్గరికి బోలెడు సంబరం..
ఉండాలి ఉండాలి..ఆ..సంతోషం నిరంతరం.....
చెప్దాం చెప్దాం స్వాగతం మనమందరం...(మళ్లీ ప్రాస..)
(బా రాసా కదా....హిహిహిహి..)
మీరు ఏం కోరుకుంటే అవన్నీ మీ దగ్గరకు వచ్చేయాలి...అని మనస్పూర్తి గా కోరుకుంటున్నా... :D
హ..హ...హా...హ్యాపీ న్యూ ఇయర్ :D
39 comments:
హా హా హా....ఇదేదో వస్తోంది వస్తోంది ఉగాది అన్నట్టు విన్నట్టుగా ఉందండీ.. మొత్తానికి సూపర్ అనుభవం సంపాదించారు దేవుడితో. మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
బాగుంది:) మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
హహహ మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు :-)
మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
kEvvvvvv.. కిరణా...
కేక పోస్టూ.. కేకన్నర కవితా..
నూతన సంవత్సర శుభాకాంక్షలు... ;)
వచ్చింది వచ్చింది...నూతన సంవత్సరం..
పోయింది పోయింది ....పోయిన సంవత్సరం...(ప్రాస)
వస్తోంది వస్తోంది మీ దగ్గరికి బోలెడు సంబరం..
ఉంటూనే ఉంది ..ఆ..సంతోషం నిరంతరం.....
చెప్పేశాం చెప్పేశాం స్వాగతం మేమందరం....
హహహ మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!
2012 నూతన సంవత్సర ( ఆంగ్ల ) శుభాకాంక్షలతో.....
నూతనోత్సాహం ( శిరాకదంబం )
Ha:-)Ha:-)మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు....
కిరణు నీ కవిత సూపర్ గా ఉంది.
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కిరణు నీ కవిత సూపర్ గా ఉంది.
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
>>>కిరణు...basically u r very gud కిరణ్
OMG...... దహా.
మీరు ఇలాగే హాయిగా నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలని కోరుకుంటూ మీకు
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
వ్రాయాలి వ్రాయలి నువ్వు కవితలు
వాటి ముందు చాలా చిన్నవి మా వెతలు
ముందు ముందు నువ్వు రాయాలి కతలు
ఒక్కటే దెబ్బకి పోవాలి మా మతులు :)
మీ డామేజర్ మంచోడే అన్నమాట. ఇన్నాళ్ళూ మా దగ్గర వాడి ఇమేజ్ డామేజ్ చేసి ఇప్పుడు నువ్వు రియలైజ్ అయ్యావా కిరణూ :P
కిరణ్గారూ.. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు... :)
wish you happy new year2012
Kevvvv kavitha kiran...
Happy New Year
రాసావు...రాసావు..కవిత...
గీసావు...గీసావు...బొమ్మ...
బాగుంది...ఇంకా వ్రాయి....
హ్యాపి న్యు ఇయర్ .....
బాబూ కిరణూ నీ కవిత అద్బుతం. అద్వితీయం అమోఘం. అపూర్వం. అనితర సాధ్యం.
(నువ్వు పొగడమన్నట్టే బాగా పొగిడాను కదా. ఇంక ఇప్పుడు మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఒక్కో విశేషణానికి వెయ్యి చొప్పున ఐదువేలు ట్రాన్స్ఫర్ చేసేయి. :))
అసలు అది కవితా? కాదు. కవితన్నర కవిత. లాస్ట్ ఇయర్ కాదు ఈ ఏడాది కూడా నువ్వు టిక్కుం టిక్కుం...ట్రియ్యుం ట్రియ్యుం
Happy New year!
కిరణ్ గారు చాల బాగా welcome చెప్పారు
నూతన సంవత్సర శుభాకాంక్షలు
అరె.. భలే ఉందే మీ సంభాషణ...
హాస్యంతో పాటు అంతర్లీనంగా మంచి message పెట్టారు...
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు... :)
కిరణ్...
నీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. :)
నీవు కోరుకున్నవన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఆరాటం వలదు. :)
కెవ్వ్ వ్వ్ వ్వ్.. కవిత్వం షురూ జేసినవా కిరణూ.. :)))))))
కొత్త సంవత్సరంలో నువ్విలాగే రోజుకో కవిత రాసిపారేయ్యాలని కోరుకుంటున్నా.. Happy new year! :)
chala baga rasaru
పోస్ట్ బాగుందండి :)
నూతన సంవత్సర శుభాకాంక్షలు
కవిత చదవకపోతే బ్లాగులోకి వచ్చి అదే కవిత కామెంటుగా పెట్టేస్తానన్న బెదిరింపు సూపరు...Happy New Year కాస్త లేటుగా...మా ఆఫీసులో ఇప్పటికీ చెప్పుకుంటున్నారమ్మా మరి...
హహహ కిరణూ...చించేసావు...సూపర్!
నీకు కూడా నూతన సంవత్సర శుభాకంక్షలు!...మరీ ఈ యెడాదంతా చెప్పుకోవచ్చట! :)
సుభ గారు,జయ గారు,వేణు గారు,చిన్ని ఆశ గారు --:))..ధన్యవాదాలండి :)
రాజ్ - హిహి థాంకులు :)
రసజ్ఞ గారు - పర్లేదే..మీకు కూడా నా లాగా గొప్పగా రాయడం వచ్చేసింది...హిహిహి...ఏదో సరదాకి అంటున్న లెండి :)...ధన్యవాదాలు :)
SRRao గారు ,Padmarpita గారు - ధన్యవాదాలండి :)
శైలు - థాంకులు..థాంకులు :)
బులుసు గారు - అలా నవ్వేస్తే ఎలా..??హుర్ట్ అవ్వనూఉ?? :ప్
పెద్ద వారి ఆశీర్వాదాలు..ఆహా..ఒహో...నాకు ఇది గొప్ప న్యూ ఇయర్ కాబోతోంది :)
ధన్యవాదాలు :)
మురళి గారు - మీకు కుళ్ళు ఎక్కువ అయిపొయింది..న లాగా కవితలు రాయలేరని....!! :ప్
మరే మీరు తప్ప మా డామేజర్ ని ఎవ్వరు పోగాడరు..
శోభ గారు - బోలెడు ధన్యవాదాలండి :)
kastephale గారు -థాంక్ యు :)
శశి గారు - అంతా మీ అభిమానం :)..థాంకులు...ధన్యవాదాలు :)
శంకర్ గారు - హహహ్హహహహహహహహహః :D
నాకు విశేషణా లు ..అణాలు ఏవీ తెలివండి..
అసలు మీరేవ్వరో తెలియదు :P
నా కవితని ఎన్ని రకాలుగా పోగాడలో అన్ని రకాలుగా పొగిడినందుకు...బోలెడు ధన్యవాదాలు :)
harekrishna - Thank u :)
sekhar garu - thank u very much :)
రాజ్ గారు - మీరు కేక :)..గుర్తించేసారు :)
thank u so much :)
వంశీ - thank uuuu :)
ఆరాటం నీకు కూడా వలదు :P :)
మధుర - నువ్వు ఎనకాల ఉండాలనే గాని...
రోజుకొకటి ఏందీ...పూటకొకటి రస్తా :పి
thank u very much :)
sandeep kumar garu - thank u very much :)
చైతన్య స గారు - బోలెడు థాంక్స్ లు :)
స్పురిత గారు - ఎవరు చదవట్లేదు మరి బెదిరించక పోతే :పి..thank u :)
పర్లేదండి..
మీ కోసం చూసి చూసి ఇప్పుడు ధన్యవాదాలు చెప్తున్నాం :)
సౌమ్య గారు...థాంకులు :)
అందుకే కదా...నేను కూడా ఆలస్యంగా చెప్పేస్తున్నా..ధన్యవాదాలు :)
girish - thank u so much :)
"ఏ రోజూ నిద్రలేచినా అది ఆదివారం అయ్యుండాలి...
ఎప్పుడు కళ్ళు తెరిచి అలారం చూసినా అది మోగడానికి ఇంకా అరగంట సమయం ఉండాలి ..
ఒక్క ఇడ్లీ అయినా నవ్వుతూ పెట్టే హాస్టల్ owner కావాలి....దుమ్ము లేని రోడ్ లు కావాలి....TL లేని ప్రాజెక్ట్ ని కావాలి... మాట్లాడలేని మేనేజర్ ని కావాలి....."
idi mathram super. okkataina teeruthundaa korika ki ki ki kiran.
హ...హ...హ..
హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయిందండి:) ఇప్పుడు సంక్రాంతి శుభాకాంక్షలు మీకు.
ఎహె ఏం పెడతాంలే కామెంటు అనుకున్నా కిరణు..;) మళ్లీ ఎక్కడ ఇదే కవిత కామెంటు పెడతావో అని భయమేసింది..హిహ్హ్హిహ్హీ..
సరే సరే జోక్స్ పక్కన పెడితే, ఈ మధ్య నీ క్రియేటివిటీకి హద్దు లేకుండా పోతుంది:) టపా సూపరుంది. తవికైతే.. అబ్బో కేక..:D:D
ajjajjo yelaa miss ayyaano...inkaa nayam inkonchem late ayyunte kavita comment pettedaanive nuvvu...thank god..good god...
post suparu......maa bujji kiranuvi kaduu..naa blog lo kavita comment pettanani promise cheyyi...
Post a Comment