నేను జీవని ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళే లోపే అందరూ అక్కడ ఉన్నారు.....ఆ కాలనీ లో కి అడుగుపెట్టంగనే...కావ్..కావ్..కావ్..అని వినిపించింది..ఇల్లు ఈజీ గా గుర్తుపట్టేసి ఇంట్లోకి దూరాను..వెళ్ళగానే పెద్ద quiz పెట్టారు...ఎవరు ఎవరో గుర్తు పట్టమని...అప్పు ని ముందే ఫోటోలలో చూడటం వల్ల సౌమ్య గారిని ఈజీ గా కనుక్కో గలిగాను...అప్పటికి అందరూ....టిఫ్ఫినీలు చేస్తున్నారంట...అంట అని ఎందుకు అన్నాను అంటే...ఉగ్గాని..,మిరపకాయ్ బజ్జి లు...,ఇడ్లి లు ..ఇన్ని plate లో ఉంటే నేను భోజనం అనుకున్నా మరి...ఎవరు తలెత్త లేదు..అయినా నేను చాలా తెలివిమంతురాలిని కదా....అందరిని చక చక గుర్తు పట్టేసా..!!....ఆ తర్వాత ప్రసాద్ గారు వచ్చి టిఫిన్ చేయండి అని plate చేతికిచ్చారు..అందరి plate లో ని పదార్థాల్ని చూసి చాలా భయం వేసింది...పొద్దున్నే అగ్ని పరీక్ష లాగా అనిపించింది...కాని ఆకలి ...మండుతోంది..!!కొంచమైనా తిందామనుకున్నా..కానీ నేను గర్వించేలాగా..plate మొత్తం ఖాళి చేసేసాను..!!.....కాకపోతే రెండు గంటలు పట్టింది...!!..ఇంతలో నన్ను చూస్తూ ఊరకే కూర్చోలేక మా గురూజీ కంపెనీ పేరు తో ఇంకాస్త ఉగ్గాని పెట్టుకున్నారు..కానీ ఆవిడది రెండో విడత కూడా అయిపోడం తో ...బంతి.."కిరణు నువ్వు త్వరగా తిను లేకపోతే నాకేమి మిగలదు.."అని వాపోయాడు...!!...పాపం చాల జాలేసింది..అసలే ఎర్ర చొక్కా వేసుకుని...మసి పట్టిన ఎర్ర తువాలు భుజం మీద కూడా ఉంది మరి...!!..ఉదయం నాలుగ్గంటలకే లేచాడు కానీ..అందరూ తింటున్నారా లేదా..అందరికి..స్నానికి నీళ్ళు ఉన్నాయా లేదా...తన శత్రువులు ఎన్ని ఇడ్లి లు బజ్జి లు తింటున్నారు లాంటి investigation లు చేస్తుండటం తో బిజీ...ఇంత జరుగుతున్నా ఏమి జరగనట్లు శీనన్న దించిన తల ఎత్తకుండా పలహారం అయిపోగోడ్తున్నారు.....పాపం..శీనన్న పూర్వ వైభవం గుర్తొచ్చిన నేను..ఏడుపోస్తున్నా దిగమింగి...ఓ సారి.. "శీనన్నా...." అన్నాను...నోట్లో బజ్జి పెట్టుకుంటూనే..తల పైకి ఎత్తారు.......అదే టైం లో మా గురూజీ క్లిక్కు మనిపించారు...:D...ఇలా సరదా సరదగా...టిఫ్ఫినీలు కానించేసి.....SRIT కాలేజీ కి వెళ్ళాము...
ఒక్క మాట గాట్టిగా చెప్తున్నాను......నేనే గనక ..SRIT లో గనక చదువుంటే జనులారా..!!.....ఆహా..ఒహో...ఆ రోజుల్లోనే నా భావుకత్వం పొంగిపోర్లేది..నేను కూడా ఒక అప్పు నో..ఓ మురళి గారో అయిపోయేదాన్ని...అవును మరి చుట్టూ కొండలు....కాలేజీ ఆవరణ లో చెట్లు..పెద్ద పెద్ద లైబ్రరీ..(మనలో మన మాట..బా నిద్రొస్తుంది అక్కడ కూర్చొని చదువుకుంటే..)..ఏదో కట్టించాము లే అంటే కట్టించాము లే అని కాక..అన్ని వసతులు ఉన్నాయి..ఇక రీడింగ్ రూం అయితే అద్బుతం.....గీతా మకరందం చూసి నేను ఎంత ఆనందపడ్డానో....!!...ఇక కాస్త వెనక్కి వెళ్ళిపోయి చాక్ పీస్ తీసుకుని బోర్డు మీద ఆడుకున్నాం..నేను,అప్పు,రాజ్,సౌమ్య గారు...కాలేజీ అంతా చూసాము....రాజ్ అలసి కింద కూలబడ్డాడు..:P..వెంటనే నేనున్నాని..నీకేం కాదనీ ..అంటూ కుక్కోచ్చేసింది :)..మళ్లీ వెంటనే సౌమ్య ఆంటీ ని చూసి పిల్లిని పిల్చుకు రావడానికి వెళ్ళింది..మా గురూజీ ని correspondent గా చూడాలన్న కోరిక కలగడం తో బిల్డింగ్ ముందు నుంచో పెట్టి రెండు కుటో లు తీసాము.....మనకు దుర్బుద్ధి ఎక్కువ కదా..నేను కూడా ఫోటో దిగాను...బాగుంది కదా అంటే..హా peon లాగా బాగుందన్నారు...వా...వా...కాని గుండె గట్టి చేసుకుని శీనన్న కి చెబుదాం అనుకున్నాను..కానీ దాని వల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు..అందుకే వీళ్ళ మీద పగ లోపల పెట్టుకుని ..... ఇంటికి వెళ్ళిపోయాము...
మేము ఇంకా లోపలకి అడుగు పెడుతున్నామో లేదో...బోలెడు మంది పిల్లలు....అన్నయ్య బాగున్నావా...అక్క బాగున్నావా అంటూ...చిన్ని చిన్ని అమాయకత్వపు మొహాలు..అక్కడున్నంత సేపు ఏమి గుర్తు రావు..రాబోవు..!!..ఆ పిల్లలు నిజంగా అదృష్టవంతులు....ప్రసాద్ గారి కంట పడటం..!!ఎంత ప్రశాంతంగా నవ్వుతూ ఉన్నాయో వారి మొహాలు..ఇద్దో ఇంతకంటే భావుకత్వం నాకు రాదూ ..నేను త్వరలో బొమ్మేసి చూపిస్తా ...సౌమ్యాంటి ఎన్నో గిఫ్ట్ లు తీసుకొచ్చారు...పిల్లలకి గాజులు వేస్తూ .....ఏది ఈ గాజు పెద్దది..కాస్త పెద్ద చెయ్యి పట్టండి అన్నారు..మనకి సిగ్గా..ఎగ్గా..ముందుకి చేయి జాచాను..ఎహే పో అని ఒక్క తోపు తోసారు....చేయి మాత్రమే వెళ్లి శీనన్న కాళ్ళ దగ్గర పడింది...శీనన్నఈ చెల్లి బాధని ఇంత కూడా పట్టించుకోకుండా పిల్లల తో ఆడుకుంటూ తన బల ప్రదర్శన చేస్తున్నారు...క్షమించేసి..చేయి పెట్టుకుని..బుజ్జి బుజ్జి పిల్లలతో ఆడుకుని...ఎంతో సంబర పడుతున్న వేళ..మళ్లీ పరీక్ష అంటూ తిండికి పిలిచారు..వామ్మో అనుకున్నా..వెళ్లి ఒక రెండు పాలోలిగలు తిని బ్రేవ్వ్ మన్నాను....తినేసి మళ్లీ కాసేపు పిల్లలతో ముచ్చట్లు..ఆటలు..పాటలు...అయిపోయాక...రాజ్ రంగం లో కి దిగి కుటోలు అన్నాడు...మళ్లీ పండగ పండగ.....ఈ లోపు అ అంటే అమ్మ.. ఆ అంటే ఆవు అని పెద్ద పెద్ద అరుపులు..ఎవరు శనివారం మిట్ట మధ్యానం పిల్లలకి చదువు చెప్పిస్తోందని తొంగి చూస్తే..ఉబుంటు ఉన్న laptop ని పట్టుకుని రేహ్మాను...ఉబుంటు అంటే ఏంటి అన్నయ్య..అని పిల్లలు అడిగారు??...పాపం రెహ్మాన్ ఆలోచనల్లో పడేటప్పటికి....నేను చెప్పాను...ఎలుగుబంటి కజిన్ సిస్టర్ అని...ఇంతలో ఓ పిల్ల వచ్చి నాగార్జున ని చూపిస్తూ అక్క ఆ అన్న మాట్లాడితే నాకేం అర్థం కావట్లేదు అనింది..సరే అని ఒక పెన్ను పేపర్ చేతిలో పెట్టాను..తాను చెప్పాలనుకున్నదేమిటో ఇందులో రాయమనమ్మ అని..థాంక్స్ అక్క అంటూ వెళ్ళిపోయింది :)..అవును నా పేరు కూడా భలే పలుకుతాడు..రెండే రెండు అక్షరాలతో కిర్నా అని :D..కాస్త తొందరెక్కువ..:P
నాకు ఒక విషయం తెలిసింది..ఏంటంటే గొప్ప వాళ్ళెప్పుడు సింపులే.......ఉదాహరణకి : జీవని ప్రసాద్ గారు...SRIT correspondent ,ఒంగోలు శీనన్నాయ్...,వెన్నెల కిరణ్..హిహిహి :)
ఎవరినన్నా గొప్ప వాళ్ళు అని అన్నాం అంటే ఏదో ఒక కారణం ఉండాలి కదా..మరి ఆంగికం అనే కాన్సెప్ట్ ని కనిపెట్టి శీనన్న గొప్ప వారయిపోయారు :)
అసలీ ఆంగికం గురించి చెప్తాను...ఏంటంటే..ఈ అప్పు ,సౌమ్య గారు..వాళ్ళకి వచ్చిన తెలుగంతా మాట్లాడేసి మనకేమి తెలీదు అనే భావం కలిగిస్తారు కదా....అలాంటప్పుడు..మనమేదైతే చెప్పలనుకున్నమో దాన్ని..సైగల ద్వారా మొహం లో మార్పులు చేస్తూ చెప్పేస్తే వీజీ గా అర్థమయిపోతుందన్నమాట...!!..ఒక చిన్న ఉదాహరణ...భావుకత్వం పరిమళించింది అని శీనన్న చెప్పారు.. నేను వెంటనే ..అంటే అన్నాను....అప్పుడు రెండు చేతులు గాలిలో ఊపి...అటు ఇటు ఉపేసి..చుట్టు చూపించేసి......మొహం లో బెమ్మి నవ్వు ఒకటి పెట్టేసారు...నాకు మొత్తం అర్థమయిపోయింది...అదన్నమాట..!! :)(అర్థమైందని అనుకోడం మళ్లీ మన భ్రమ)..మీరు మళ్లీ డ్డ౮ లో ఆదివారం మధ్యానం వచ్చే వార్తలు అనుకునేరు..అస్సలు కాదు..అందులో expression అసలు ఉండదు...ఇక్కడ expressions perfect ..!! కాకపోతే ...శీనన్నకంటే తెలుగు నాకే బాగా వచ్చు అని రుజువయ్యింది :)....అవును మరి ఏదో సందర్భం లో "కడవడైన చాలు ఖరము పాలు" అని గట్టిగా నొక్కి వక్కాణించారు...ఆంగికం తో :D ...కాని హిందీ లో శీనన్న కే ఎక్కువ నాలెడ్జి ఉంది...అవను...అటు పో అనడానికి "ఆదర ఆవో" అన్నారు..
ఇక అందరం కలిసిన అసలు విషయాన్ని మరిచిపోయమన్న సంగతి గ్రహించిన ప్రసాద్ గారు మనం పెళ్ళికి వెళ్ళాలి అన్నారు...అనంతపురం లో నే నేను బెంగళూరు బస్సు ఎక్కేద్దాం అనుకున్నాను నాకు జరిగిన అవమానాలకి...కానీ వేడి వేడి అన్నం...,ఆవకాయ, అందులో నెయ్యి..తింటున్నప్పుడు మధ్యలో ఏ బుర్ర తక్కువ వెధవైన లేచి వేల్లిపోతాడా ...ఆనందం రుచి చూసాక కూడా వెళ్ళిపోడానికి నేనేమైన పిచ్చిదాన్నా???ఎన్ని రోజులయిందో పొట్ట చెక్కలయ్యేలా నవ్వి....కాలేజీ రోజుల్లో రెండు నెలలకి ఒక సారి క్లాసు బైట నుంచునేదాన్ని ....నవ్వి..నవ్వి :P .అలాంటి నవ్వుల్నీ మిస్ అవ్వాలని అనిపించక..వీళ్ళతోపాటు పెళ్ళికి బయలుదేరాను...ఆ మధ్యలో అప్పు వాళ్ల ఆఫీసు లో వాళ్ళకి లంచం ఇచ్చి కాల్స్ చేయించుకుంది...issues అని పోస్ కొట్టింది..అవును..బజ్జుల్లోకి ఎందుకు రావట్లేదు అంటే...బిజీ అంటోంది కదా మరి ..అది proove చేస్కొడానికి...(అప్పు ఖండ ఖండాలుగా నరకడానికి ఇప్పుడు బెంగుళూరు బస్సు ఎక్కేస్తుంది )...ఇక పెళ్లి ఇంటికి చేరి కార్తీక్ కి ఒక సారి ప్రెసెంట్ సర్ అని చెప్పేసి...అసలు పని(తిండి) కానించుకుని ఆ రోజూ నవ్వులకి ఫుల్ స్టాప్ పెట్టాము..
ఇక నిద్రా సమయమప్పుడు ఎవరెవరి గదుల్లోకి వెళ్లి బజ్జున్నాం...కాదు కాదు అప్పు మాత్రమే నిద్రపోయింది..నేను, మా గురూజీ అప్పు కి కాపలా కాసాము..కారణం..నాకు గాలి ఎక్కువయ్యి...మా గురువుకి గాలి తక్కువయ్యి ..నేను ఉదయం ఆరుగంటల నుండి అప్పు ని లేపుదాం అని తెగ ప్రయత్నించాను...కానీ జాలేసింది....కానీ ఏడింటికి లేపాక నా మీద నాకే జాలేసింది....అప్పు ని లేపిన తర్వాత తాను పలికిన పలుకులు...లేత మనసులు..మధురానుభుతులు..పూత రేకులు..పాల పీకలు....అబ్బబ్బ...మీకు మేటర్ అర్థం కావట్లేదు....నేను లేపాను అని..కిరణ్ బజ్జు లో ఎంత బుజ్జి గా ఉంటావు..కానీ ఇక్కడ రాక్షసి లా ఉన్నావు ...అంటూ నన్ను కొన్ని పొగిడింది..బేసిక్ గా నాకు ,నేస్తం గారికి పొగడ్తలు ఇష్టం ఉండవు కాబట్టి నాకు అలా పొడి పొడి పదాలు గుర్తున్నాయి..కానీ నాకు ఆ భావుకత్వం పొద్దున్నే ఎక్కక...తలనొప్పి ఫుల్లు గా ఎక్కేసింది....
మళ్లి టిఫ్ఫినీలు ..అసలు ఒక మనిషి మూడుపూటల టైం కి తినాలి అని ఎవడు రూల్ పెట్టాడో కాని...@#@$@$....నా లాంటి ప్రాణులు బలి.....నా టైం అస్సలు బాగోలేక....తిండి టయానికి..కూర్చుంటే సౌమ్య గారి పక్కనో...లేక పోతే రాజ్ అన్నయ్య...అప్పు చెల్లలి మధ్యలోనో..కూర్చోవాల్సి వచ్చేది...సౌమ్య గారేమో...తింటావా..చస్తావా..అంటూ వార్నింగ్ లు ఇస్తూనే తన పని తాను చాలా perfect గా..అసలు ఈ ఆకు లో ఎవరు కూర్చో లేదేమో అన్నట్లు ఖాలీ చేసేస్తారు....ఈ అప్పు ఏమో ఒక గరిటె పెట్టించుకుని మొత్తం ఖాళి చేసేసి..అన్నయ్య నేను గుడ్ గర్ల్ కదా అని తానా అనడం...అన్నయ్య....అవును చెల్లాయ్ నువ్వు కేక అని తందానా అనడం....మధ్యలో మాకేనా ఎవరు సపోర్ట్ లేనిది...లేనిది..లేనిది..అంటూ గర్జిస్తూ ..శీనన్నా అని కేక పెట్టాను....చెల్లాయ్ నేను తినడం లో బిజీ...చేతులు కడుక్కోచ్చి.....చప్పట్లు కొడ్తూ encourage చేస్తాను అని మళ్లీ బిజీ అయిపోయారు...అందరూ మన వాళ్ళే ఉన్నా..ఎవరు నా వైపు కాదు..అందుకే మీకు చెప్తాం లే అని అక్కడ ఉర్కున్నాను....ఇంతలోపల...ఫ్యామిలీ ప్యాక్ లు ఉన్న వంటవాళ్లు కూడా నా ఆకు ని చూసి నవ్వడం..లేకపోతే చిత్రంగా చూసిపోవడం...హథవిధీఈ...!!..అన్నట్లు మనలో మన మాట..రాజ్ రెండు ఇడ్లిలకి రెండు బకెట్ ల చట్నీ హుష్ కాకి..!!
ఇక కార్తీక్ పెళ్లి గురించి చెప్పడానికి నాకు..ఈ అప్పు ,సౌమ్య గారు ఏమి మిగిల్చారు...భావుకత్వాన్ని అంతా పరిమళింపజేసేసారు..!!..నాకొచ్చిన బాషలో చెప్పాలంటే కనుల పండగ..!!..పాపం కార్తీక్ ని చూస్తేనే జాలి వేసింది...తన జీవితం లో ఒక అద్భుతమైన మొమెంట్ ని ఎంజాయ్ చేస్తూ కూడా...మేము కూర్చున్న వైపుకే తన కళ్ళు తిరుగుతున్నాయంటే..మేమక్కడ ఎంత గోల చేసామో మీరు ఊహించవచ్చు :)....పెళ్లి జరుగుతుండగా ఒక fake బ్లాగర్ వచ్చారు....ఎవరో కాదు శంకర్ గారు...నిజ్జం..ఈయన ఆయన కాదు....చాల సేపటి వరకు చాలా మౌనంగా అన్ని గమనిస్తూ ఉన్నారు....మాట్లాడండి శంకర్ గారు అంటే "బాబు కిరణ్" అన్నారు..ఇంకేం మాట్లాడుతాము...?...కాసేపయ్యాక మాట్లాడారు కానీ అన్ని రెండు మూడు ముక్కలే...అందుకే నాకు బాగా డౌట్ గా ఉంది...ఈయన fake ఏమో అని..!!...ఇక నాగానంద స్వాముల వారు హాయ్ చెప్పాక ...నాకు ఆయన పెట్టే smiley లాగా దొర్లి దొర్లి నవ్వేయాలని ఉంది..ఎందుకంటే..నేను ఆయనకి గడ్డం..చేతిలో కమండలం ఉన్న వేషం లో ఉహించేసుకుని నవ్వుకుంటున్నా...కానీ బయటకి చెప్పటానికి భయపడ్డాను..నేరుగా తన్నులు తినడం ఎందుకు అని :)...నా favorite కిట్టి ని గీసే favorite బ్లాగర్ విజయమోహన్ గారిని కలిసే భాగ్యం కూడా కలిగింది...
ఆ రెండు రోజులు.ఎంత నవ్వుకున్నమో..దానికి తొంబై శాతం కారకులు శీనన్న...!!....నిజ్జం...శీనన్న బ్లాగ్ లు కాకుండా podcast లు చేస్తే పిచ్చ పిచ్చ గా హిట్ అవుతుందని నా నమ్మకం..!!ఆ టైమింగ్ కాని..ఆ expression క్యారీ చేయడం కాని...ఆ ఆంగికం కాని...ఆ spontaneity కానీ...అబ్బో వద్దు లే...మా శీనన్న కి దిష్టి తగులుగుతుంది..:P
ఇక రోజూ అయిపోతోంది..బస్సు టైం అవుతోంది అంటే అయ్యో అనిపించింది......ఆ నిమిషం ఎలా అనిపించిందంటే...కళ్ళకి రికార్డింగ్ సిస్టం ఉంటే బాగుంటుంది..అని..కాని కొన్ని కొన్ని జ్ఞాపకాలు ఏ రికార్డింగ్ లేకపోయినా మనతోనే ఎప్పటికి ఉండి పోతాయి...ఈ రెండు రోజులు కూడా అంతే..!!అద్బుతం..అమోఘం..!!..వర్ణానీతం...(హిహిహి భావుకత విత్ ఆంగికం..).....ఆ రెండు రోజులు..నాతో నేను విన్న,మాట్లాడుకున్న మాటలు..."హహ్హహహహహహహ్హఃహుఅహౌఅహౌఅహహహహహహాహహ్ "
మొత్తానికి చెప్పాలంటే ఆ రెండు రోజులు రచ్చ..రచ్చవ్..రచ్చ రచ్చః.....నా 'వెన్నెల' నేస్తాలతో రెండు చల్లని రోజులు...:)
గమనిక : పైన ఉన్న బొమ్మ...ఆ రెండు రోజులు ..మా ముఖారవిందాలు :)
ఇంకో గమనిక... : ఈ కలయిక నా వెన్నెల.. దాని పుట్టిన రోజుకి నాకు ఇచ్చిన బహుమతి...:) :P
ఇంకో ఇంకో గమనిక : నూట ఎనిమిదో సారి.. కార్తీక్ కి happy married life :) (మరి నేరుగా...బజ్జులో...బ్లాగుల్లో నూట ఏడు సార్లు చెప్పాను )
ఇంకో ఇంకో ఇంకో గమనిక : ఏమి లేదు...హిహిహి :P
32 comments:
శీనన్నాయ్ గురించి శానాఆఆ బాగా రాశావ్...ముఖ్యంగా ’కడవెడైనా చాలు ఖరము పాలు’ :))))))))
ఈ రెండు మూడు రోజుల్లో బజ్‌లో దాడి జరిగితే ఆ దేవుడే నిన్ను కాపాడుగాక. ఆమెన్ :P
>>అన్న మాట్లాడితే నాకేం అర్థం కావట్లేదు అనింది.
GRRRRRRRRRRRRRRRRRRRRRRRR :x
బొమ్మలేశావ్ సరే మరి అందులో ఎవరెవరు కిధర్ కిధర్ హై ?
హహహహ్హ.....కుమ్మేసావు పో!
నిన్నుచూస్తే మాత్రం నీలో ఇంత కామెడి ఉన్నాదని అనిపించదు సుమీ!
మా మీద పంచులేస్తావా?...ఉండు చెప్తా నీ సంగతి. ఓరోజు మా ఇంటికి పిలిచి ఆకు నింపేసి, నువ్వు మొత్తం ఖాళీ చేసేవరకూ కదలనివ్వను ఆ.
హహహహ సూపర్ గా రాశారు కిరణ్... రానివాళ్ళందరం కుళ్ళుకునేలాగా రాశారు. పనిలోపనిగా ఎప్పుడైనా మీమీద పగసాధించాలంటే ఎలాగో మాకో కిటుకు నేర్పించేశారు :-) సౌమ్య గారన్నట్లు మీ ప్లేట్ నింపేసి ఖాళీ చేసే వరకూ పక్కన బెత్తం పట్టుకుని నుంచుంటే చాలనమాట :-)))
:)
"మేము ఇంకా లోపలకి అడుగు పెడుతున్నామో లేదో...బోలెడు మంది పిల్లలు....అన్నయ్య బాగున్నావా..."
నిజం చెప్పు వాళ్ళు "అన్నయ్యా" అన్నది నిన్నే కదా? :))). అయినా నువ్వు ఆ పిల్లల ముందు కూడా ఎలకపిల్లలా ఉంది ఉండి ఉంటావు.
"వేడి వేడి అన్నం...,ఆవకాయ, అందులో నెయ్యి..తింటున్నప్పుడు మధ్యలో ఏ బుర్ర తక్కువ వెధవైన లేచి వేల్లిపోతాడా"
వేల్లిపోతాడా...వేల్లిపోతాడా...వేల్లిపోతాడా...పోన్లే అబ్బాయ్ అని ఒప్పుకున్నావ్ కిరణూ :))))))))))))))))))))))
"కిరణ్ బజ్జు లో ఎంత బుజ్జి గా ఉంటావు..కానీ ఇక్కడ రాక్షసి లా ఉన్నావు ...అంటూ నన్ను కొన్ని పొగిడింది"
నిద్రమత్తులో అప్పు అన్నీ నిజాలే మాట్లాడుతుందన్న మాట :))
"అందుకే నాకు బాగా డౌట్ గా ఉంది...ఈయన fake ఏమో అని..!!.."
చూశావా అక్కడ అంత మంది ఉన్నా ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు నేను ఫేక్ అని. ఏమైనా నువ్వు సూపర్ అబ్బాయ్.
చివరిగా ఆ గ్రూప్ ఫోటో ఇరగదీశావ్ గా....ఫోటోల కింద వాళ్ళ వాళ్ళ పేర్లు కూడా రాసేయ్. తర్వాత కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది.
చాలా బాగా వ్రాసారు. మీరంతా ఎంత ఎంజాయ్ చేశారో పూర్తిగా అర్ధం అయ్యింది. ఇంకా కొన్ని విషయాలు తెలిసాయి.
1. శీనన్న గారు వాళ్ళ శ్రీమతి పక్కన లేకపోతే నోటితో ఒక పనే చేస్తారు. వారి నోరు తినడం లో బిజీ గా ఉండడం వల్ల మనం మాట్లాడాలంటే ఆంగికం నేర్చుకోవాలని.
2. రాజ్ చేతికి ఇడ్లీ ఇచ్చి కంచం లో చట్నీ పోయ్యాలి అని.
3. సౌమ్యకి డైనింగ్ టేబల్ అంత ఆకెసి ... వద్దులెండి ఆవిడ తిడుతుంది ఇంకేమైనా వ్రాస్తే ....
4. మీకు ఏటి కొప్పాక లక్కపిడతల లో వండి పెడితే సరిపోతుందని.
5. అపర్ణ ఉదయం నిద్ర లేచినప్పుడు మాత్రమే సత్యం చెబుతారని.
ఇంకేమైనా మిస్ అయ్యానా........ అహా.
అహో ఏమిటీ చిత్రవధ.. బ్లాగర్స్ అంతా నా మీదే కక్ష కట్టారా ...? కళ్ళకు కట్టినట్టు రాస్తూ, అక్కడకు రాని జనాలను కుల్లించడమే మీ లక్ష్యమా?
మీ వ్రాత నైపుణ్యం బహు బాగు.. బ్లాగర్స్ పులివెందుల గడ్డ మీద చేసిన రచ్చను చాలా బాగా చూపించారు...
జీవని ప్రసాద్ గారికి, వారి కుటుంబానికి శుభాభినందనలు.
కార్తిక్ మరియు వారి శ్రీమతి గారికి నూటా తొమ్మిదో సారి శుభాకాంక్షలు.
అలాగే వెన్నెల, కిరాణా కూడా మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని మీ రచనలతో జనాలను చావగోట్టాలని కోరుకుంటున్నా.... :)
సూ.....పర్ పోస్ట్ కిర్నా... ;)
ఆ ఫొటో లో ఎవరెవరో చెప్తే బాగుంటాది కదా.. ;)
బులుసుగారూ మీ కామెంట్ అరుపులు...జ్హిహిహ్హిహిహ్
అన్నట్టు ఇందాకల చెప్పడం మరచిపోయాను...బొమ్మ కెవ్వుకేక...అదరగొట్టావ్!
పైకి కనిపించవ్ గానీ నీదగ్గర శానా కామెడి ఉంది కిర్నా
చమక్కులు అదుర్స్.. :), nice
కిరణూఊఊఊఊఊఊఊఊఊఊఊ నేను కుళ్ళుకుళ్ళుకుళ్ళుకుంటున్న్ననూఊఊఉ!!!!!! ఫో నువ్వు! :((
కాని ఏమాటకామాటా బారాసావ్ అబ్బాయ్ ;) ముఖ్యంగా అప్పూ నిద్రలేచినప్పుడు చెప్పింది చూడు....కేక ;)
kiran...
Thank u... mee navvullo sagam maaku panchaaru....
seenannayyaki hindi chala baga vacchannamaata....
akkadiki vellu anataniki 'adar aavo annaru.... idi kekaaaa..... lol.
మనలో మన మాట..బా నిద్రొస్తుంది అక్కడ కూర్చొని చదువుకుంటే..)....maa talle unna mokaalu kooda ayipotundi...jaagratta...very nice post.i enjoy it so much.
హహ్హహ్హా.. సూపర్ కిరణ్.. మీ నవ్వుల్నీ గుర్తు చేసుకుంటూ మమ్మల్నీ బోల్డు నవ్వించేసావ్! మీ బొమ్మ సూపర్.. అందరూ ఫ్రేమ్ కట్టించి పెట్టేసుకోండి.. :D
మై కిధర్ హై?
తుం ఆధర్ హాయ్ రెక్కమాను ఊడిన షేకు
కిరణ్ అబ్బాయి బాగా రాసావు.
బులుసు గారి కామెంట్స్ సూపర్.రానివల్లంతా కుళ్లుకునేలా ఉంది నీ పోస్ట్.
నీ ఆర్ట్ ఇంకా సూపర్.
నువ్వు రాసింది చదివాక ఏడాదికి ఒకసారి అయిన జీవానికి కి వెళ్లి రావాలని ఉంది.
:) Good post.
ఎంత మాట అన్నావ్ కిరణ్ అన్నాయ్! నాకు ఉబుంటూ గురించి తెలీదా????
:D
కిరణు. నిజంగా మళ్లీ ఆ రెండు రోజులకి తీస్కెళ్లిపోయావు. మళ్లీ అంతలా నవ్వుకున్నా టపా చదివి. ఇంక శంకర్ గారిది, గురు గారిది వ్యాఖ్యలు చూసి కడుపు నొప్పొచ్చేలా నవ్వేశా..
నిజంగా నిద్రలో నేనేం అన్నానో కూడా గుర్తు లేదు కిరణు;) నువ్వే కాస్త గట్టిగా ప్రయత్నించి "నిద్రమత్తులో అప్పు భావుకత్వం" అని ఓ టపా రాసెయ్యవా ప్లీజ్..;);)
ఇంక శీనన్న ఆంగికానికి పరాకాష్ట మర్చిపోయావు. "చైతన్యం, ఉల్లాసం , ఉత్సాహం అనునవి భావోద్వేగానికి సంబంధిన పేర్లు. వాటిని పెట్టుకోడానికి లింగ భేదం లేదు"
ఆ బొమ్మలో నేనెక్కడ ఉన్నా చెప్పవా ప్లీజ్..:)))
టపా మాత్రం కెవ్వు కేక రచ్చ రచ్చే..:):)
నాగార్జున - :))))....థాంకులు :)
నిజాలే రాసాను...:)
ఉన్న మాటంటే ఉలుకెక్కువ అంట :D
నువ్వే కనుక్కో నువ్వెక్కడున్నావో...
సౌమ్య గారు -ఎదురుగా వేస్తే ఏమవుతుందో తెలుసు కదా...అందుకే ఇలా బ్లాగులో sattire లు :)
థాంకులు...నేను ఢిల్లీ వచ్చినప్పటి సంగతి కదా :)
వేణు గారు - thank u very much :)...
మీరు దేవుడు - ఇప్పుడు చెప్పండి..ఇంకా..బెత్తం పట్టుకుంటారా..?:)
శ్రీకాంత్ గారు - :))
శంకర్ గారు - :D :D :D :D
నన్ను అన్నయ్య అనలేదు...లేదు..లేదు :(
అవును నేను ఎప్పుడూ సూపెరే :)
బొమ్మ..అంతా చక్కగా గీస్తే మళ్లీ ఎవరెవరు ఎక్కడ అని అడుగుతారే???గ్రర్ర్ర్ర్...
బులుసు గారు - kevvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
నేను ఏవేవి అయితే చదివేవాళ్ళు గుర్తించాలి అనుకున్నానో..అన్ని గుర్తించేసారు....నా weakness లతో సహా :)
కేక మీరు :ద..కిం.ప.దో.నా
ఫోటాన్ - :D ...థాంకులు :)....ఈ సరి మీరు కూడా వచ్చేయండి :)
రాజ్ నీ ఫోటోలకంటే ఇందులోనే క్లారిటీ ఉందని బయట టాక్..నువ్వేంటి..అల అడుగుతావ్..:)..థాంకులు :)
శీనన్న - హిహిహిహి :)..ఎవరు గుర్తించడం లేదు మరి....!!
గిరీష్ - thank u :)
ఇందు ..బాఆఆఆఆగాఆఆఆఆఅ...కుల్లేస్కో....:D
థాంకులు...grrrrrrrrrrrrrrrrr.....నువ్వు నా వైపు..:(
gora గారు - :) -thank u :)
sasi గారు - హిహిహిహిహి ...మోకాలు కూడా పోతే ఇంకా మీకు పండగే,....అప్పుడు నేను కవితలు రాయడం స్టార్ట్ చేస్తా :)
thank u very much :)
మధుర - అందుకే నువ్వు కేక..ఎవరికీ rani ఐడియా నీకు వచ్చింది :)..అందరు వినండి మధుర ఏం చెప్పిందో :)..థాంక్స్ :)
శైలు - grrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
కానీ పోస్ట్ బాగుంది అన్నందుకు థాంక్స్ :( :)
నిజంగా వెళ్తే ఆ పిల్లలు ఎంత ఆనంద పడతారో...:)
శిశిర గారు :) ..థాంక్ యు :)
రెహ్మాన్ - నిజమే కదా..మరి...మేకు రాదు కదా :)
జేబి - JB - :D
అప్పు - అమ్మో నీ మాటల్ని టపా గా నా..చాల కష్టం..తల్లి...ఆ నలుగు mukkalake నా మోకాలు మొత్తం hush kaki..:p
చాలా చాలా థాంక్స్ డియర్ :)
"చైతన్యం, ఉల్లాసం , ఉత్సాహం అనునవి భావోద్వేగానికి సంబంధిన పేర్లు. వాటిని పెట్టుకోడానికి లింగ భేదం లేదు" -- ఈ davilogu exact గా గుర్తు లేదు :)..అందుకే rayaledu :)
అప్పు - ఆ బొమ్మలో నువ్వెక్కడో కూడా గుర్తు పట్టలేదా :(
మీ బొమ్మ సూపర్..హహ్హహ్హా:):)
hahahahah... very nice andi... mee andaru chinnappatinundi friends ah leka blog loki vachaka friends ayyara... ela ayina kooda mee post and post tharvathi comments.. rendu super... chala baaga raasaru
చాలా చాలా నవ్వుకున్నాను... (కొన్ని చోట్ల అక్కడి జరిగినవి అర్థంకాకపోయినా..)
అపర్ణ/కిరణ్ గారూ ఇక్కడ మీ పోస్ట్‌లలో రాసినవాళ్ళ గురించి నాకు ఒక్క విషయమూ తెలియకపోయినా. మీరందరికీ కలిగిన ఆనందం నాకూ కలుగుతునట్టే ఉంది.అంత చక్కగా రాసారు మరి.
మీరు చేసిన అల్లరి చూసినట్టే అనిపించింది, వెన్నెల బ్లాగులో కిరణ్ గారు కూడా, పెళ్ళిలో నేను తిండి తక్కువ తిన్నానేమో గానీ రాతల్లో ఏమీ తక్కువ తినలేదన్నట్టూ నవ్వించేసారు.
నాకూ అందరిలానే కొంత బాధ కలిగింది నేనక్కడ లేనందుకు.కానీ మీ రాతలు చదవటం వల్ల అది కొంత తీరిందనేది మాత్రం నిజం.ఒకరిని మించి ఒకరు రాసారు.
ఇద్దరు రాసిన దానికి స్పందన కనుక ఇద్దరికీ ఒకటే కామెంట్.:-)
yento...inni rojulaki chadivaa..ayinaa baagaa enjoy chesaa...kartik nannu pilavalaa pelliki...pchc...pchc...
kartik meeku many many best wishes and I wish you very happy married life
Post a Comment