8 January 2011

కలలు - కలవరింతలు ..

ఇవి నిద్రే నా ప్రాణం అనే వాళ్ళు చేసే పనులు..!!

నా లాంటి వాళ్ళు వాళ్ళ వల్ల మధ్య లో ఉండి లేచి ఉలిక్కి పడి...మళ్ళి నిద్ర రాక తన్నుకు చచ్చే బాధిత సంఘం..

నేను కంటాను కలలు...అని మొన్నే నాకు తెలిసొచ్చింది ...అది ఎలా జరిగిందంటే..

ఒక fine డే...నిద్ర లేచి

brush చేశా గుడ్ గర్ల్ లాగా...కాస్త రొజుకంటే ఎక్కువ సేపు brush చేసానేమో..concentration divert అయ్యింది..

నాకు నా సైకిల్ గుర్తొచ్చింది...!!
సైకిల్ ఆ??యా..సైకిల్ ఏ...

ఏమైందంటే....నేను రోజు ఒక షాప్ కి వెళ్తున్న అంట...

అక్కడ మా నాన్న వాళ్ళ ఆఫీసు లో పని చేసే ఒక labour ఉన్నారంట..

ఆ అంకుల్ గమనించారు...
మనం నిజంగానే పక్కన ఎవరు నడుస్తారో చూడం..ఇంకా కలలో ఏం గమనిస్తాం లెండి...

ఆ షాప్ కి నేను వారానికి ఒక సారి వెళ్తున్న అంట....అది ఎందుకో తెల్స...నా పాత సైకిల్ కి ఏదో ఒక చిన్న repair వచ్చిందంట ..

అయితే నేను నాన్నని వెళ్లి అడిగాను కొత్త సైకిల్ కావాలి అని..పిచ్చ ..?? వెర్రా..??...ఇంకో వారం లో కాలేజీ అయిపోతుంది..ఇక స్కూటీ కొనిద్దాం అనుకుంటుంటే....నువ్వేంటి ఇంకో సైకిల్ అంటావ్.... అని....నాన్న...

అదో వెర్రి ది లెండి...మీరేం కొనియ్యకండి ....అని అమ్మ..అమ్మ ప్లాన్ ఏంటో తెల్స...ఆ స్కూటీ...కొనిస్తే...అమ్మ కూడా నేర్చుకొని...మార్కెట్ కి...సూపర్ మార్కెట్ ల కి..నాన్న కు తెలియకుండా షాపింగ్ చేసేయచ్చు అని ప్లాన్.. :P

నేనేమో సైకిల్ ఓఒ అని కూర్చున్న...

ఏం చేస్కుంటావో చేస్కో పో అన్నారు..ఎప్పుడు కసరని నాన్న.. :(..

మనకు ఏం లేకపోయినా నెత్తి మీద కుండ... ఉక్రోషం ఉన్నాయి గ..అవి కలలోకి కూడా వచ్చేసాయి ... :P

ఒక సైకిల్ షాప్ కి వెళ్లి లేడీ బర్డ్ సైకిల్ అడిగా.....1800 వందలు(ఇప్పటి రేట్ లు నాకు తెలిదు..అందుకే అప్పటి రేట్ ఏ కలలో వచ్చింది.. :)) అని చెప్పాడు....సరే వారానికి 200 ఇస్తా అన్నాను..సరే అయితే నువ్వు 9 వారాల తర్వాత వచ్చి సైకిల్ తీసుకు పో అన్నాడు...!! ఆ షాప్ వాడు...

బిక్క మొహం వేస్కొని....ఇంకా వారానికి ఒక సారి వెళ్లి డబ్బులు ఇచ్హే దాన్ని.....ఆ టైం లో ఆ అంకుల్ చూసి నాన్నకు చెప్పేసారు....!!

నాన్న గట్టిగ అరిచారు....కిరణ్ అని..ఏంటి నాన్న గారు అన్నా..అంతొదు అన్నాడు మా తమ్ముడు వెధవ..వీడు నన్ను కలలో కూడా వదలట్లే..

చెప్పండి అన్న..వాడి మాటలు విని...ఆ షాప్ కి ఎందుకు వెళ్తున్నావ్... అన్నారు....ఇంకా ఏడుపు స్టార్ట్.....ఏయ్..అఆపు ఆ tap కట్టేసి చెప్పు అన్నారు..

చెప్పాను జరిగిందంతా.....

పిచ్హి నీకు బాగా ముదిరిందే...అన్నారు..అసలు విషయం ఏంటంటే..నేను ఆల్రెడీ వాడికి 400 వందలు నా పాకెట్ మనీ ఇచ్చేస ...అది చెప్పలేదు...

ఆ షాప్ వాడి దగ్గరికి వెళ్తే...నేనివ్వను..నా దగ్గర ఇన్కమింగ్ ఏ కానీ అవుట్ గోయింగ్ లేదు అన్నాడు... @#@$#%#...!!

ఇంకా ఏం చేస్తా మనకేమైనా బ్లాకు బెల్ట్ ఉందా....కనీసం బ్లాకు కలర్ బెల్ట్ కూడా లేదు...

ఇంకా ఏడుపు..శోకం..అయ్యయ్యో..ఎప్పటి నుండో దాచుకున్న ,అడుక్కున్న 400 పోయాయని.....!!....అదీ కాకా..నా ఫస్ట్ సైకిల్ మరూన్ రెడ్ అనమాట..నాకేమో పింక్ ఇష్టం..మేము వెళ్ళినపుడు ఆ కలర్ లేదు..ఏదైతే ఏంటి తొక్కడానికి అని నాన్న..అది ఓకే అనిపించేసారు..!!....

అయ్యో జీవితం లో ఇంకా పింక్ కలర్ సైకిల్ తొక్క లేనే అని....:(

ఇంత బాధలో షాక్ తగిలి మెలుకువ వచ్చేసింది ..ఇక మనకు నిద్ర ఎక్కడిది....చుక్కలు చుద్దాం అంటే కూడా కనిపించవు.....అందుకే నా బాధ ని అర్థం చేసుకున్న మా రూం మేట్ నాకు చుక్కలు చూపించడం స్టార్ట్ చేసింది...

ఏదో కలవరింత...

సడన్ గ బెడ్ మీద నుండి లేచి....అక్కయ్య..నా క్లిప్స్ ఎక్కడ...అని జుట్టు బర బర గోక్కుంటోంది.. :)...

నాకు నవ్వాగట్లేదు..ఇంతలో ఇంకో అమ్మాయికి మెలుకువ వచ్చి...ఏమైందే....అనింది..అక్క క్లిప్స్ అంది...తను ఎంత sincere గ ఎక్కడ పెట్టావ్...చైర్ లో ఉన్నాయా ..చూడు..cupboard లో ఉన్నాయా చూడు అని వెతుక్కుంటున్నారు..బెడ్ మీద నుండే. :D...

ఆఫీసు కి వెళ్ళేటప్పుడు కూడా ఇంత sincere గ వెతుక్కోరండి..చెప్తే నమ్మరు....నాకు పిచ్హ పిచ్హ గ నవ్వు....ఆగట్లే...కానీ నేను oనవ్వానంటే...పోద్దున్నకి స్టొరీ అల్లేస్తారు..నేను కూడా నిద్ర లో నవ్వేసాను అని..అందుకే మా క్లాసు లో టీచర్ ఉన్నపుడు కంట్రోల్ చెయ్యని నవ్వు కూడా వీళ్ళ కోసం త్యాగం చేసేస..

ఇవన్ని...చూస్తూ ఉంటె,..ఇంతలో మా బావ గుర్తొచ్చాడు....నాకు...ఎందుకంటార...మేము మా బామ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు...పిల్లలందరికీ ఒక గది ఇచ్చేసే వాళ్ళు..అక్కడే...బతకండి...అక్కడే కొట్టుకుని చచ్చి పొండి అని...అంతల కొట్టుకునే వాళ్ళు మరి..

నేను involve అయ్యే దాన్ని కాదసలు ...అయిదుగురు మగ రాక్షసులు..నేను వాళ్ళకి లీడర్...
matter ఏంటంటే...ఆ వెధవల తో కలిపి నేను కొట్టుకొని ఉంటె..మీరు ఒక గొప్ప బ్లాగర్ ని మిస్ అయ్యే వాళ్ళు.. :P :D
కొట్టుకోవడం..అయిపోయాక
అక్కడే వరుసగా పడుకునే వాళ్ళం...అందరికంటే మా బావ కి పిచ్హ క్రికెట్ పిచ్హ...రాత్రి లేచి సిక్సర్...ఫోర్..అవుట్..సచిన్ అని రోజుకొకటి అరిచి పడుకునే వాడు...వాడిని వెళ్లి వరుసగా...మా రైట్ లెగ్ తో లెఫ్ట్ సైడ్ తన్నేసి వచ్చి మళ్ళి పడుకునే వాళ్ళం..మొన్న మా బావ వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి మరి చెప్పా...ఇంకా కలవరిస్తుంటే నువ్వు నీ లెఫ్ట్ లెగ్ ఉపయోగించు అమ్మాయి అని..నువ్వేల చెప్తే అల అంది.. :D

అప్పుడంటే మెలుకువ వచ్చిన పడుకునే వాళ్ళం..

ఇప్పుడు చాల కష్టంగా ఉంది...నిద్ర పట్టడం..ఒక సారి మెలకువ వస్తే...పెద్ద దాన్నయ్య..కదా..బరువులు బాధ్యతలు..ఆలోచనలు..మరి..:D

అసలు ఈ కల ఐపోయాక...సాయంత్రం నాన్న తో మాట్లాడుతుంటే ఏదో భయం.. :D ...అది కల కిరణ్...అది కల అని నాకు నేను ఎన్ని సార్లు చెప్పుకున్ననో..

ఈ కల మీద నా analysis .. :P

ఈ మధ్య నేనొక డ్రెస్ కొన్నాను..కానీ నాన్నకు చెప్పలేదు...అది ఈ రూపం లో వచ్చిందేమో .. :D
నా పింక్ సైకిల్ మీద నాకు నిజంగా ఇంత లవ్ ఉందా.. ??

13 comments:

హరే కృష్ణ said...

hmm..
కలలు పలు రకాలు
మీ కల మీద ఒక analysis చెయ్యాలంటే కనీసం రెండు పోస్ట్ లు రాయాల్సిందే

ఇందు said...

మీరు ఎప్పటికైనా పింక్ సైకిల్ కొంటారు కిరణ్...కొంటారు :)) నాకు మీలాగే సైకిల్ పిచ్చి.కానీ నాది పింక్ కలర్ సైకిలే! భలే ఉంటుంది తెల్సా! లేడీ బర్డ్.దానికి ముందు ఒక బుట్ట కూడా ఉంటుంది.తొక్కుతుంటే భలే ఉంటుందిలే కిరణ్ :))

మనసు పలికే said...

హహ్హహ్హా కిరణ్ చాలా బాగా రాసావు:) నీ కల, అందరి కలవరింతలు నవ్వు తెప్పించాయి;)మొత్తంగా టపా సూపర్:))

kiran said...

@హరే కృష్ణ - :)...మీకు మీ inception ని గుర్తు చేసేస కదా.. :)

@ఇందు - నా cycle కి కూడా బుట్ట...అన్ని ఉన్నాయండి...ఐనా మీది పింక్ సైకిల్ ఆ....నేనొప్పుకోను..ఇంకా ఉందా మీ దగ్గర.. :D ..ఉంటె ఇచ్చేయమని మనవి..:ద

@అప్పు - thank you .. :)..మీకు నవ్వు తెప్పించాయి...నా నిద్ర చెడగోట్టాయి...

భాను said...

బాగుంది పోస్ట్ మా అమ్మాయి కి తెలీకుండా అకస్మాత్తుగా లేడీ బర్డ్ పింక్ సైకిల్ తో ఇంటి ముందు ప్రత్యక్షంయ్యేసరికి దాని ఆనందం చూడాలి చెంగు చెంగున లేడి పిల్లలా ఓపది నిమిషాలు ఆనందంతో గంతులేసింది. ఇస్తంయ్యింది అనుకోకుండా ఎదురుగ కనపడితే వచ్చే సంతోషం బాగుంటుది కదా. సో అది మీరు మిస్ అయ్యారు

kiran said...

థాంక్స్ భాను గారు.. :)
సైకిల్ నాన్న నాకు కొనిచ్చినప్పుడు కూడా..అలాగే హ్యాపీ...!!
కానీ ఆశావాది కదా మనిషి..అందులో పింక్ కలర్ టైం కి లేక అల కోనేసం..:)

శివరంజని said...

హహ్హహ్హా కిరణ్ చాలా బాగా రాసావు:) నీ కల, అందరి కలవరింతలు నవ్వు తెప్పించాయి;)అప్పుడే అయిపోయిందా అనిపించింది

వేణూశ్రీకాంత్ said...

మీరు ఎప్పటికైనా ఒక పింక్ కలర్ లేడీబర్డ్ సైకిల్ కొంటారు కిరణ్ కొంటారు :-P
మీ స్కూటీ పింక్ కలర్ సైకిల్ గురించి చదివితే ఇలాటిదే నాదో కోరిక గుర్తొచ్చింది. నాకు పాతకాలపు గ్రాంఫోన్ రికార్డ్ ప్లేయర్ అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు ఇంట్లో కొనమని తెగ అడిగేవాడ్ని. ఇంపోర్టెడ్ క్యాసెట్ డెక్ తెప్పించినా.. ఎన్ని ప్లేయర్లు కొన్నా అలా చిర్పింగ్ సౌండ్ తో తిరిగే గ్రాం ఫోన్ స్పీకర్ ముందు కూర్చుని పాటలు వినాలన్న ఆ కోరికమాత్రం తీరలేదు. సిడిలు/డివిడిలు/బ్లూరేలు వచ్చాక ఇంకా గ్రాంఫోనేంట్రా అని మావాళ్ళంతా తిట్టినా సరే నాకు ఆ కోరిక కోరికగానే మిగిలిపోయింది :-(

kiran said...

@శివ రంజని - thanku so much. :ద
@వేణు గారు - అయ్యో..నా లేడీ బర్డ్ అన్న..కొనుక్కోవచు..
మరి మీగ్రాంఫోన్ అప్పుడే ఒకటి కొనుక్కోక పోయార..??
ఈ సారి కనిపిస్తే ..మీ కోసం నేను కొట్టేస్త లెండి.. :)

Krishna said...

కలలు-పింక్-సైకిల్-కిరణ్ ఎక్కడో లింక్ ఉన్నట్టుందేమో వీటన్నిటికి :P!! కలలు ఎలాగో కనేసారు కాబట్టి ఇక సైకిల్ కొనేయండి కావాలంటే అబ్దుల్ కలాం గారిని ఆదర్శం తీసేసుకుందాం. ఉలిక్కిపడి లేపే వాళ్ళు నా దగ్గర ఉన్నారండి. అది ఎంత పరాకాష్టకి చేరిందంటే ఓసారి ఏడున్నరికి బయల్దేరి పొట్టకూటి పనికెళ్ళి అలిసి సొలిసి రాతిరి రెండికి వచి పడుకుంటే నా సహనివాసి నిద్దట్లో ఏం కలవరించాడో ఏం కన్నాడో ఏం చూసాడో ఒక్కసారిగా ఎర్త్‌క్వేక్ అంటు అరిచేసాడు. అప్పుడే నిద్దట్లో జారుకున్న నేను వీడి ఆర్తనాదాలకి ఉలిక్కుల్లిక్కి పడి లేచి బేడ్ మీదనుంచి జంప్కొట్టా. ఆ సౌండ్కి వాడు నిద్రలేచి పడుకోనియవేంట్రా ఒకపక్క అర్దరాత్రి వస్తావు ఇంకో పక్క శబ్దాలు చేస్తావ్ అంటూ నన్నాడిపోసుకున్నాడు. మీరు అదృష్టవంతులండి కనీసం కిక్కన్న ఇచ్చారు. నేను ఆ బంగారు అవకాశంకోసం వేయిటింగ్. అసలు విషాయనికొస్తే మీకు కామెంటాలంటే అందులో సగం నా గోడు ఉంటది అదేంటో అయినా ఈ సారి ఆ లెఫ్ట్ రైట్ కిక్కుల సంగతి నేనో చూపు చూస్తా :D (ఇది కామెంట్ లా లేదు పోస్ట్‌లా ఉంది.లోల్ )

kiran said...

హహ..కృష్ణ గారు... :D
ఎన్ని కస్టాలండి మన లాంటి మొహమాతస్తులకి .. :P
ఏ వాళ్ళు అలోచించి కలవరిస్తున్నర...లేదు కదా..
మీరు ఆలోచించకుండానే కిక్ ఇవ్వండి.. :p :)
నాకు కామెంట్ లాగానే ఉంది.. :)..పోస్ట్ లాగా లేదు..thanks for sharing .. :)

Unknown said...

kiran, nee pelli ki nannu kachitam ga piluvu,nenu pink color lady bird koni isthanu tappakunda.. nuvvu feel avvaku.... :)

kiran said...

amrutha - pink color cycle nenu kokukkuntale...gani ii madya naku oka car thega nachesindi..emantav...pelliki pilavana.. :) :P

అనన్య చురకలు !

మా పాపా పేరు అనన్య  ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను  దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...