3 November 2009

ఇది నా మొదటి టపా

ఇదే నా మొదటి టపా...
ఏంటో నా లో ఉన్న రచయిత్రి రాసేయి..రాసేయి అని గొడవ చేస్తుంటే మొదలు పెట్టేస్తున్నాను...
అసలు రాయాలి అని ఆలోచన వచ్చిందంటే ...ఎవరో ఒకరు నీవు బాగా రాస్తావు అని అనే ఉంటారు కదా...
ఎవరు అన్నారు అంటే...ఇది వరకట్లో ..అంటే ఒక 8 ఏళ్ల క్రితం నా స్నేహితులకు..ఉత్తరాలు తెగ రాసే దాన్ని...వాళ్ళు అందరూ బలే రాస్తావే..మళ్లి మళ్లి చదవాలి అనిపిస్తోంది అనే వాళ్ళు..
అబ్బా..నేను క్షేమం ..అక్కడ నీవు క్షేమం...తిన్నావా...తింటున్నావా?...లాంటి మాటలకు..నీ స్నేహితులేదో నీ మీద అభిమానం తో అలా అంటే ఏకంగా బ్లాగ్ మొదలు పెట్టేస్తావా?? అని తిట్టకండి...
ఏదో కొంచం ప్రయత్నించి....చూస్తా....ఎలాగో సక్సెస్ అయ్యి..మీరు నా బ్లాగ్ చూడాలి అనుకున్నపుడు ...సర్వర్ బిజీ అని వస్తే అయ్యో మొదటి టపా లో తిటుకున్నాం కానీ కిరణ్ బలే రాస్తుంది అనుకోక పోతారా....
ఇంకో విషయం ఏంటంటే నాకు వెన్నెల అంటే చాలా ఇష్టం...అదే న బ్లాగ్ url కూడా పెట్టుకుందాం అంటే కుదరలేదు..ఎం పెట్టాలో అర్థం కాక..నా స్నేహితురాలిని అడిగితే తేనె పలుకులు అని పెట్టుకో అంది...నచ్చేసి...పెట్టుకున్న..దానికి నా కృతజ్ఞతలు..బ్లాగ్
కి url పెట్టుకోలేవు ..ఇక టపాలు ఏం రాస్తుందో అనుకోకండి..నాకు ఏమి తోచక పోతే నా స్నేహితురలినే అడుగుత టపా రాయమని.. :P
ఇక సుత్తి ఆపేస్తున్నా...
నా టపా లు మీకు నచ్చిన నచ్చక పోయిన బాగున్నాయి అని ఒక ముక్క రాసేయండి...నేను మీ బ్లాగ్ లో రాస్తాను లే.. :P..
నా అసలు టపా లో మళ్లి కలుద్దాం...

No comments:

అనన్య చురకలు !

మా పాపా పేరు అనన్య  ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను  దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...