13 January 2011

సంక్రాంతి..వచ్చింది తుమ్మెద... :)

పండగ వాతావరణం..చిన్నపుడు అయితే బాగా తెలిసేది...

అసలు..ఇప్పుడు..ఏంటో production issues...ఏవి లేక పోతేనే...అసలు సిసలైన పండగ.. :D
ఏదో కాస్త అవన్నీ మర్చిపోదమనే కదా బ్లాగుల ముందు కూర్చుంది అని మీరు అనుకుంటున్నారు..i know..i know.. :)

సంక్రాంతి అంటే బామ్మ ఇల్లు...దసరా అంటే అమ్మమ్మ ఇల్లు బాగా అలవాటు.. :)...
ఏదేమైనా సంక్రాంతి కి బామ్మ ఇంట్లో ఉండాల్సిందే..లేక పోతే నేను అరచి గోల చేసే దాన్ని..ఎందుకంటే అన్నికుటుంబాలు అక్కడ కలుస్తాం..కొత్త డ్రెస్ లు వేసుకోవచ్చు...ఒక్కర్తే ఆడ పిల్ల అని..పెద్దనాన్న వాళ్ళు,అత్తయ్య వాళ్ళు కూడా డ్రెస్ లు కొనిపెట్టేసే వాళ్ళు.. :P :) ..ఇక మా తాతయ్యగారు..దగ్గర కూర్చో పెట్టుకుని అయన కథలు..నాకు తెల్సిన పద్యాలూ చెప్పించుకుని...మురిసిపోయేవాళ్ళు.. :)

మీరు అలాంటివి అడగకండి...నాకు అసలే short term memory loss.. :D

ఇవన్ని ఒక ఎత్తైతే...ముగ్గులు..బానే నేర్చుకునే దాన్ని...ఏది చూసిన ఒక పుస్తకం లో వేసుకునే దాన్ని..మా అమ్మకు నాకే కాస్త వచ్చు..ఇంకా ఎవరికీ రాదు..అందుకే...మేమోస్తున్నాము అని అంటేనే...రంగులు కొనేది మా పెద్దమ్మ...ముగ్గు వేస్తూ ..అన్ని రంగులు ఐపోయాక...దానికి దిష్టి తీసి..కాలనీ లో ఎవరు ఎలా వేసారో చూడడానికి ఒక ట్రిప్ వెళ్ళే దాన్ని..మా సైన్యాన్ని వేసుకొని...వాళ్ళే కదా మరి రక్షకభటులు.. నాకు..
రాత్రి పది అయ్యిందే ఇప్పుడెక్కడికి అంటే...లేదు బామ్మ..ఇక్కడే ఆ కొట్టు ఉంది చూసావు..అక్కడి వరకు మాత్రమే..అని పరుగు....ఆ దారిలో...అక్క నువ్వేసిన ముగ్గే కెవ్వ్ అక్క...కేక అక్క..అని పోగిడేవాళ్ళు..ఒహ్హూ..సూపరు...అనుకునే దాన్ని..ఇప్పుడు నా ముగ్గు తప్ప...అందరి ముగ్గులు బాగుంటాయి అంటారు వెధవలు.. :(....వాళ్ళు అలాగే చిన్న గ ఉండి పోయి...నేనొక్క దాన్నే పెద్దదాన్నైతే బాగుండేది.. :) :P

ఐనా ముగ్గులు అసలు వేయట్లేదు..ఇప్పుడు..మా అమ్మ ఎంత అడిగిన వేయను..ఆ paintings వేస్కునే బదులు...నాకు సాయం చేయచ్చు కదా అంటే..చలి లో ఎవరు వేస్తారమ్మ పో అని అంటూ ఉంటా..ఇంతలో వచ్చేసాడు ...ఎవరో చెప్పుకోండి...ఆ కర్రెస్ట్ గ మా తమ్ముడే..అబ్బో ..వచ్చిందండి...రాబోయే కాలానికి కాబోయే పికాస్సో..అని నా ఫీలింగ్స్ ని..నా అపురూపమైన చిత్ర కళల్ని insult చేయడానికి..కొట్టుకోకండి..నేనే వేస్కుంట..అని అమ్మ అక్కడి నుండి బైటకు వెళ్ళిపోతుంది..నాకు తెల్సు ఏదో ఒక రోజు నా paintings అన్ని...భోగి మంటల్లోకే ..మా అమ్మకు మండిందంటే.. :P

భోగి మంటలు అంటే గుర్తొచ్చింది ..పల్లెటూరు ఏమి కాదు...city నే...అందుకే..ప్లేస్ ఉండేది కాదు...కానీ ఇంటి ముందర ఒక ఖాలీ స్థలం ఉండేది..అక్కడ...వేసే వాళ్ళు మంటలు..ఇది నేను ఏ రోజు ప్రత్యక్షంగా చూడలేదు..!!మనం సూర్యుడికంటే ముందు లేచి ఆయన్ని insult చేయాలని అనిపించేది కాదు కాబట్టి... :) :p


బొమ్మల కొలువు మాత్రం పెట్టేదాన్ని.....బోలుడు బొమ్మలు ఉండేవి....ఒక సారి మా బామ్మ అది ఇక్కడ పెట్టుకోనివ్వు ర..ఎప్పుడు మీ ఊర్లొనె అంటే...పాపం మా నాన్న ఎర్ర బుస్స్ లలో..ఆ అత్తపెట్టల్ని అంత మోసి...భుజాలు నొప్పెక్కి...వెళ్ళంగానే నీకు ఇలాంటి కోరికలు ఉంటె నువ్వే అక్కడికి ర..నన్ను వదిలేయ్..అని indirect గ వార్నింగ్ ఇచ్చారు...నేనేమో హ్యాపీ గ పట్టు పరికిణి వేస్కొని....అందర్నీ పేరంటం కి పిలిచి...వచ్చి బొమ్మల పక్క బుట్ట బొమ్మ లాగా నుంచొని ఫోటో లు దిగే దాన్ని.. :)..ఇదంతా సాయంత్రం....


పొద్దున్న కూడా బిజీ గ ఉండాలి కదా...సో మా తమ్ముళ్ళు
..బావలు...పతంగ్ లు ఎగిరేసే వాళ్ళు..వాళ్ళందరికీ...టైం కి గాలి పటాలు..గం....అదే అవి చిరిగిపోతే అతికించుకుంటారు..దానికి..పాత న్యూస్ పేపర్ లు సకాలం లో అందివ్వడం...వెనకాల ఉండి మాంజా పట్టుకోడం..నా డ్యూటీ లు...దీనికి పైకి కిందకి ఒక 100 సార్లు తిప్పిస్తారు... :(....సాయంత్రం వెళ్లి..అమ్మ కాళ్ళు నొప్పులు అంటే..నీకు కావాల్సిందే..అని అదే కాళ్ళ మీద ఒకటి వేసేది అమ్మ.. :(..ఆ మగ వెధవల్తో పాటు నువ్వేంటే...??..కూర్చుని టీవీ చూడు అంటారు...పోనీ సినిమాలు ఎమన్నా పెడతార అంటే..లేదు....న్యూస్... నాకొద్దు...అని మళ్ళి పైకి వెళ్ళిపోత..

ఆ డాబా మీద నుంచుని చూస్తూ ఉంటె..బోలుడు గాలి పటాలు....నేను కొంచం నేర్చుకున్న..ఎలా ఎగరేయలో..హే కిరణ్ జాగ్రత్త..ఆ మాంజా ని చేత్తో పట్టుకోకు...only ఆ కర్ర ని పట్టుకో అని చెప్తూనే ఉన్నారు మా వాళ్ళు...వాళ్ళు ఏదో గాలిపటాన్ని...ఎటాక్ చేయాలని పోయి..అరుస్తూ...గెంతుతూ ఉంటె..అదే ఊపు లో
మర్చిపోయి...నా చేయి మాంజా మీద పడింది..ఇంతలో వేరే పతంగ్ ని కాట్ చేసే టప్పుడు..వెనక్కి లాగుతూ...గాట్టిగా కాట్ అని అరిచాడు...మా వెధవ...అదే టైం లో నేను కూడా అరిచ...అదే అరుపు... నా చెయ్యి తెగింది...:(....రక్తం కారిపోతోంది...!!

ఒకడు వెనక నుండి వచ్చీ..అన్నాడు కదా...ఈ బక్కి దాన్ని అసిస్టెంట్ ఏంట్రా అంటే ఎవరు వినలేదు..ఇప్పుడు చూడండి..అప్పటికప్పుడు డాబా మీద నా చేతికి ఏమి చుట్టడానికి లేక పోతే...పేపర్ లు తీస్కురంమన్నాడు ఒకడు...ఇంకొకడు...ఆ రోజు ఏం సినిమా వేసాడో..టీవీ లో ..సినిమా పేజి లో చూస్తున్నాడు.. :(..అంత సినిమా పిచ్చి వాడికి..:)..మొత్తానికి కిందికి వెళ్ళిన..ఏమి తెగనట్లు..ఊర్కున్నమ్..లేకపోతే అందరికి పడతాయి..పండగ పూట..

అన్నం ముద్దలు చేసి పిల్లలందరికీ పెట్టేది...మా అత్తయ్య..కిరణ్ రామ్మా చేయి జాపు..అంటే ..నోట్లో పెట్టు అన్నా...ఆఅ మరీ గారం ఎక్కువైందే అంటే..మా సైన్యం అంత..అబ్బ పెట్టు...అత్త...అడుగుతోంది కదా అని నాకు వంత పడే వాళ్ళు.. :)..మరి చెయ్యి చూసారంటే..ఎవరికీ ఇంకో ముద్ద పెట్టించుకునే ఛాన్స్ రాదు...అన్ని గుర్తు తెచ్చుకుంటే నవ్వొస్తుంది.. :)

చాల సరదా రోజులు...ఇప్పుడు కలుద్దాం అన్న..ఒకరు అమెరికా లో..ఒకరు ఢిల్లీ లో..ఇంకొకరు గోవా లో..ఉన్నారు...

ఇన్ని బాగున్నా..నాకు పల్లెటూర్లో సంక్రాంతి బాగా చేస్తారు అని విన్నాను...అక్కడికి వెళ్లి జరుపుకోవాలని ముచ్చట.. :)..ఏవండి..మీ పిలుపులు నాకు వినిపిస్తున్నాయి..వచ్చేయన..?? :)

అమ్మ పండగ వంట చేస్తోంది...ఒక కన్నేసోస్త..ఆ ..సాయం చేయడానికి కాదు..ఏవేవి వండిందో చూడటానికి...మీ batch లో ఉండి..నేను పనులెల చేస్తా..?? :p

అందరికి...సంక్రాంతి శుభాకాంక్షలు.. :)


8 January 2011

కలలు - కలవరింతలు ..

ఇవి నిద్రే నా ప్రాణం అనే వాళ్ళు చేసే పనులు..!!

నా లాంటి వాళ్ళు వాళ్ళ వల్ల మధ్య లో ఉండి లేచి ఉలిక్కి పడి...మళ్ళి నిద్ర రాక తన్నుకు చచ్చే బాధిత సంఘం..

నేను కంటాను కలలు...అని మొన్నే నాకు తెలిసొచ్చింది ...అది ఎలా జరిగిందంటే..

ఒక fine డే...నిద్ర లేచి

brush చేశా గుడ్ గర్ల్ లాగా...కాస్త రొజుకంటే ఎక్కువ సేపు brush చేసానేమో..concentration divert అయ్యింది..

నాకు నా సైకిల్ గుర్తొచ్చింది...!!
సైకిల్ ఆ??యా..సైకిల్ ఏ...

ఏమైందంటే....నేను రోజు ఒక షాప్ కి వెళ్తున్న అంట...

అక్కడ మా నాన్న వాళ్ళ ఆఫీసు లో పని చేసే ఒక labour ఉన్నారంట..

ఆ అంకుల్ గమనించారు...
మనం నిజంగానే పక్కన ఎవరు నడుస్తారో చూడం..ఇంకా కలలో ఏం గమనిస్తాం లెండి...

ఆ షాప్ కి నేను వారానికి ఒక సారి వెళ్తున్న అంట....అది ఎందుకో తెల్స...నా పాత సైకిల్ కి ఏదో ఒక చిన్న repair వచ్చిందంట ..

అయితే నేను నాన్నని వెళ్లి అడిగాను కొత్త సైకిల్ కావాలి అని..పిచ్చ ..?? వెర్రా..??...ఇంకో వారం లో కాలేజీ అయిపోతుంది..ఇక స్కూటీ కొనిద్దాం అనుకుంటుంటే....నువ్వేంటి ఇంకో సైకిల్ అంటావ్.... అని....నాన్న...

అదో వెర్రి ది లెండి...మీరేం కొనియ్యకండి ....అని అమ్మ..అమ్మ ప్లాన్ ఏంటో తెల్స...ఆ స్కూటీ...కొనిస్తే...అమ్మ కూడా నేర్చుకొని...మార్కెట్ కి...సూపర్ మార్కెట్ ల కి..నాన్న కు తెలియకుండా షాపింగ్ చేసేయచ్చు అని ప్లాన్.. :P

నేనేమో సైకిల్ ఓఒ అని కూర్చున్న...

ఏం చేస్కుంటావో చేస్కో పో అన్నారు..ఎప్పుడు కసరని నాన్న.. :(..

మనకు ఏం లేకపోయినా నెత్తి మీద కుండ... ఉక్రోషం ఉన్నాయి గ..అవి కలలోకి కూడా వచ్చేసాయి ... :P

ఒక సైకిల్ షాప్ కి వెళ్లి లేడీ బర్డ్ సైకిల్ అడిగా.....1800 వందలు(ఇప్పటి రేట్ లు నాకు తెలిదు..అందుకే అప్పటి రేట్ ఏ కలలో వచ్చింది.. :)) అని చెప్పాడు....సరే వారానికి 200 ఇస్తా అన్నాను..సరే అయితే నువ్వు 9 వారాల తర్వాత వచ్చి సైకిల్ తీసుకు పో అన్నాడు...!! ఆ షాప్ వాడు...

బిక్క మొహం వేస్కొని....ఇంకా వారానికి ఒక సారి వెళ్లి డబ్బులు ఇచ్హే దాన్ని.....ఆ టైం లో ఆ అంకుల్ చూసి నాన్నకు చెప్పేసారు....!!

నాన్న గట్టిగ అరిచారు....కిరణ్ అని..ఏంటి నాన్న గారు అన్నా..అంతొదు అన్నాడు మా తమ్ముడు వెధవ..వీడు నన్ను కలలో కూడా వదలట్లే..

చెప్పండి అన్న..వాడి మాటలు విని...ఆ షాప్ కి ఎందుకు వెళ్తున్నావ్... అన్నారు....ఇంకా ఏడుపు స్టార్ట్.....ఏయ్..అఆపు ఆ tap కట్టేసి చెప్పు అన్నారు..

చెప్పాను జరిగిందంతా.....

పిచ్హి నీకు బాగా ముదిరిందే...అన్నారు..అసలు విషయం ఏంటంటే..నేను ఆల్రెడీ వాడికి 400 వందలు నా పాకెట్ మనీ ఇచ్చేస ...అది చెప్పలేదు...

ఆ షాప్ వాడి దగ్గరికి వెళ్తే...నేనివ్వను..నా దగ్గర ఇన్కమింగ్ ఏ కానీ అవుట్ గోయింగ్ లేదు అన్నాడు... @#@$#%#...!!

ఇంకా ఏం చేస్తా మనకేమైనా బ్లాకు బెల్ట్ ఉందా....కనీసం బ్లాకు కలర్ బెల్ట్ కూడా లేదు...

ఇంకా ఏడుపు..శోకం..అయ్యయ్యో..ఎప్పటి నుండో దాచుకున్న ,అడుక్కున్న 400 పోయాయని.....!!....అదీ కాకా..నా ఫస్ట్ సైకిల్ మరూన్ రెడ్ అనమాట..నాకేమో పింక్ ఇష్టం..మేము వెళ్ళినపుడు ఆ కలర్ లేదు..ఏదైతే ఏంటి తొక్కడానికి అని నాన్న..అది ఓకే అనిపించేసారు..!!....

అయ్యో జీవితం లో ఇంకా పింక్ కలర్ సైకిల్ తొక్క లేనే అని....:(

ఇంత బాధలో షాక్ తగిలి మెలుకువ వచ్చేసింది ..ఇక మనకు నిద్ర ఎక్కడిది....చుక్కలు చుద్దాం అంటే కూడా కనిపించవు.....అందుకే నా బాధ ని అర్థం చేసుకున్న మా రూం మేట్ నాకు చుక్కలు చూపించడం స్టార్ట్ చేసింది...

ఏదో కలవరింత...

సడన్ గ బెడ్ మీద నుండి లేచి....అక్కయ్య..నా క్లిప్స్ ఎక్కడ...అని జుట్టు బర బర గోక్కుంటోంది.. :)...

నాకు నవ్వాగట్లేదు..ఇంతలో ఇంకో అమ్మాయికి మెలుకువ వచ్చి...ఏమైందే....అనింది..అక్క క్లిప్స్ అంది...తను ఎంత sincere గ ఎక్కడ పెట్టావ్...చైర్ లో ఉన్నాయా ..చూడు..cupboard లో ఉన్నాయా చూడు అని వెతుక్కుంటున్నారు..బెడ్ మీద నుండే. :D...

ఆఫీసు కి వెళ్ళేటప్పుడు కూడా ఇంత sincere గ వెతుక్కోరండి..చెప్తే నమ్మరు....నాకు పిచ్హ పిచ్హ గ నవ్వు....ఆగట్లే...కానీ నేను oనవ్వానంటే...పోద్దున్నకి స్టొరీ అల్లేస్తారు..నేను కూడా నిద్ర లో నవ్వేసాను అని..అందుకే మా క్లాసు లో టీచర్ ఉన్నపుడు కంట్రోల్ చెయ్యని నవ్వు కూడా వీళ్ళ కోసం త్యాగం చేసేస..

ఇవన్ని...చూస్తూ ఉంటె,..ఇంతలో మా బావ గుర్తొచ్చాడు....నాకు...ఎందుకంటార...మేము మా బామ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు...పిల్లలందరికీ ఒక గది ఇచ్చేసే వాళ్ళు..అక్కడే...బతకండి...అక్కడే కొట్టుకుని చచ్చి పొండి అని...అంతల కొట్టుకునే వాళ్ళు మరి..

నేను involve అయ్యే దాన్ని కాదసలు ...అయిదుగురు మగ రాక్షసులు..నేను వాళ్ళకి లీడర్...
matter ఏంటంటే...ఆ వెధవల తో కలిపి నేను కొట్టుకొని ఉంటె..మీరు ఒక గొప్ప బ్లాగర్ ని మిస్ అయ్యే వాళ్ళు.. :P :D
కొట్టుకోవడం..అయిపోయాక
అక్కడే వరుసగా పడుకునే వాళ్ళం...అందరికంటే మా బావ కి పిచ్హ క్రికెట్ పిచ్హ...రాత్రి లేచి సిక్సర్...ఫోర్..అవుట్..సచిన్ అని రోజుకొకటి అరిచి పడుకునే వాడు...వాడిని వెళ్లి వరుసగా...మా రైట్ లెగ్ తో లెఫ్ట్ సైడ్ తన్నేసి వచ్చి మళ్ళి పడుకునే వాళ్ళం..మొన్న మా బావ వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి మరి చెప్పా...ఇంకా కలవరిస్తుంటే నువ్వు నీ లెఫ్ట్ లెగ్ ఉపయోగించు అమ్మాయి అని..నువ్వేల చెప్తే అల అంది.. :D

అప్పుడంటే మెలుకువ వచ్చిన పడుకునే వాళ్ళం..

ఇప్పుడు చాల కష్టంగా ఉంది...నిద్ర పట్టడం..ఒక సారి మెలకువ వస్తే...పెద్ద దాన్నయ్య..కదా..బరువులు బాధ్యతలు..ఆలోచనలు..మరి..:D

అసలు ఈ కల ఐపోయాక...సాయంత్రం నాన్న తో మాట్లాడుతుంటే ఏదో భయం.. :D ...అది కల కిరణ్...అది కల అని నాకు నేను ఎన్ని సార్లు చెప్పుకున్ననో..

ఈ కల మీద నా analysis .. :P

ఈ మధ్య నేనొక డ్రెస్ కొన్నాను..కానీ నాన్నకు చెప్పలేదు...అది ఈ రూపం లో వచ్చిందేమో .. :D
నా పింక్ సైకిల్ మీద నాకు నిజంగా ఇంత లవ్ ఉందా.. ??

31 December 2010

Happy new year..!!

అప్పుడే 2011 వచ్చెసిందండీ..

మొన్నే కదా..2010 వచ్చింది.. :P

అందరికి ఇలాగే అనిపిస్తోంది కదా..!! :D

ఒక సంవతసరం గడిచిపోయింది..!!

ఎం సాధించావ్???..అయ్యో రోజు టైం కి తినడం …నిద్ర పోవడం…క్రమం తప్పకుండ చెసానండీ.. ..:p

ఇవి కాకుండా…!! Hmnnnn…..

గుర్తోచ్చేసాయి…!!

ఈ సంవత్సరం ఎప్పటి నుండో నేర్చుకోవాలి అనుకున్న భగవద్గీత నేర్చేసుకోడం మొదలు పెట్టేస....!!

ఇంకా దగ్గరుండి ఒక బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి,మా అన్నయ్య పెళ్లి జరిపించా..!! :)

జీవితం లో ఎప్పటికి నేను భరించలేను అని అనుకున్నవి..భరించాల్సి వచ్చింది..!!

అంటే నా పై నాకున్న నమ్మకం..,ఇష్టం..,ప్రేమ మరింత పెరిగాయి..!! :)

ధైర్యం,సహనం కూడా ..!!..

నన్ను నేను నమ్మ లేదు కొన్ని రోజులు…!!

అంటే మనిషి గా నేను ఎదిగాను అనే కదా..!! :D

అంటే ఇక్కడ మీకు కొన్ని డౌట్ లు రావచ్చు..…

మరి ఈ ఇయర్ లో ఏమి అనుకోవా..!!??...ఎదిగావ్ అని ఊరుకుంటావా అని..??

అల...ఎలా..??అన్ని direction ల లోను ఎదగాలి కదా.. :P

ఏది అనుకున్న ..అనుకోక పోయిన…ఒక 10 సంవత్సరాల నుండి…ఒకటి అనుకుంటున్నా…లావు కావాలి అని…

సో ఈ సారి కూడా అదే నా లిస్టు…లో మొదటి resolution..!! :P

అందరి జీవితం లో ను.ఎలాంటి పరిస్థితి వచ్చిన..వెళ్ళిపోయినా…!!సంతోషం మాత్రం ఎప్పుడు మీ దగరే ఉండాలి అని కోరుకుంటున్న… :D..

ప్రతి ఒక్కరికి ఒక గుర్తుండిపోయే సంవత్సరంగా..ప్రతి రోజు ఆనందం తో నిండి పోవాలి..!!

హ్యాపీ న్యూ ఇయర్..!! :D

21 December 2010

అమ్మమ్మ...ఐ మిస్ యు ...

అమ్మమ్మ..అప్పుడే ఒక సంవత్సరం అయిపోయింది..అమ్మ చెప్పి..అమ్మమ్మకు బాలేదు..అని...

ఆ రోజు నేను నీకు వెంటనే ఫోన్ చేస్తే...తాతయ్య..గొంతు లో నీరసం...

అమ్మమ్మకివ్వండి..అంటే....
పడుకుందమ్మ..లేచిన ఎవరితో మాట్లాడట్లేదు...నీరసంగా ఉంది అంటోంది...

ఏంటి..???అమ్మమ్మకు నీరసమా??..కనీసం మాట్లాడలేనంత...:(..

ఎప్పుడు ఇలా లేదే..

తను అందరి లాగా జలుబు కే ఆరు రోజులు రెస్ట్ తీసుకునే టైపు కాదు..

మనోధైర్యానికి...,ఓర్పుకి ప్రతి రూపం మా అమ్మమ్మ..!!

ఎంతో కంగారు వేసింది....వెంటనే నా గొంతు వణికి..నా ఫ్రండ్ కి ఫోన్ చేస్తే..

ఏం కాదు లే పెద్ద వాళ్ళు కదా..ఇవంతా మాములే..అని తను..

నేనేమో..లేదు..మా అమ్మమ్మ అందరి పెద్ద వాళ్ళలా కాదు...అని చెప్పా..

శరీరం చాల పెద్దది...అంతకన్నా active గ ఉంటుంది తను.....అని ఎక్ష్ప్లైన్ చేస్తూ...క్యాలెండర్ చుస్తే..ఆ రోజు అదృష్టం కొద్ది.. thursday..

ఇక friday రేపు అంటే అదొక ఆనందం..అమ్మమ్మని చూసి రావచ్చు అని...కానీ ఇంకో పక్క దిగులు...ఎలా చుడాల్సోస్తుందో..ఎప్పుడ మంచం మీద చూడలేదే అని..

వెళ్ళాను..అమ్మమ్మను చూశాను....నాన్న కిరణు వచ్చావ....ఎంత సేపైంది..అన్నం పెట్టండే..దీనికి....కంగారు లో రాత్రి అన్నం తినిందో లేదో అంటూ పెద్దమ్మకు చెప్తోంది..

నాకు ఆ మధ్యే ఒక minor surgery జరగడం తో...ఏమ్మా..కాలు ఎలా ఉంది ఇప్పుడు...నొప్పి గ ఉందా...ప్రయాణం వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా..అని అడిగింది...తనకు అంత బాలేక పోయిన..నా గురించి అలా అడగడం తో...అమ్మమ్మ డబల్ నచ్చేసింది ఆ రోజు..!!

తర్వాత చిన్న కునుకు తీసి..కళ్ళు తెరిచి ఎప్పుడు వచ్హావ్ అంది...షాక్ తిన్నాను...ఇందాకే కదా అన్ని అడిగింది అంటూ...

అప్పుడు పిన్ని చెప్పింది..ఇది పరిస్థితి రెండు రోజుల నుండి.....కొన్ని కొన్ని గుర్తుంటాయి..కొన్ని మరచిపోతోంది అని...

మున్దువన్నీ గుర్తుంటున్నాయి..అని...ఒహో..అన్నాను...కాసేపయ్యాక లేచి అమ్మ రాలేదా అంది..అమ్మకు ఇంటికి ఎవరో వచ్చి నాతో రాలేక పోయిందని.. ఒక 5 నిమిషాల కిందే చేప్పాను...

ఐనా నిన్నే కదా వెళ్ళింది...వాళ్ళు వెల్లిపొంగనే..వచేస్తుంది లే అన్నాను...సరే అంది...నేను కనిపించినప్పుడల్లా..అమ్మ,నాన్న ఎప్పుడు వస్తారు అని అడుగుతూనే ఉంది...

నాకు అసలు ఆవిడ ను చూడడం ఎంత కష్టమైందో చెప్పలేను...కన్నీరు...వరదలు గ కారిపోయింది.....!! :(

ఆ ప్రవాహాన్ని చూసి..అమ్మమ్మ నాతో అంది కదా...ధైర్యంగా ఉండాలే...ఎందుకలా??...నన్ను చూడు అంది..దండం పెట్టి తల్లి నీకు ఉన్నంత ధైర్యం నాకు లేదు లే అన్నాను....నాకు తెల్సే....నాకు బాలేదని తెల్సినప్పటి నుండి..నువ్వు పడే కంగారు....!!...అంతలో పెద్దమ్మ వచ్చి చెప్తోంది...ఎవరొచ్చిన రాక పోయిన...నా కిరణమ్మ వస్తుంది...నన్ను చూడటానికి...ఈ వారం అందంట.. :D...

అమ్మమ్మ పక్కనే కుర్చుని తన చేత్తో ఆడుకుంటూ...తననే చూస్తూ చాల సేపు ఏడ్చాను...నాకు ఎందుకో చాల బాధ గ అనిపించింది..

నేను తను దగ్గర చదువుకుంటున్న రోజుల్లో...వాకింగ్ కి వెళ్ళే వాళ్ళం...కనీసం నా చేయి కూడా పట్టుకునేది కాదు..ఎందుకు అంటే...నువ్వేమో గాలికి ఎగిరి పోయే ల ఉంటావ్...

ఇక నేను పట్టుకుంటే...భూమి లోకే..అమ్మో మీ నాన్న వాళ్ళు గొడవ పెట్టేస్తారు.. అని నవ్వేది..

లేదు నేను strong అని...తనకు సపోర్ట్ గ మెట్లు దిగేటప్పుడు....ఎక్కేటప్పుడు..రోడ్ క్రాస్ చేసేటప్పుడు..హెల్ప్ చేసి తెగ సంబర పడిపోయే దాన్ని..

ఇంటికొచ్చాక.....నన్ను పట్టుకుని అలసి పోయావ్ అని....అన్నం ముద్దలు చేసి చేతిలో పెట్టేది...అల అయితే ఎక్కువ తింటాను....అని బోలుడు కబుర్లు చెప్తూ...!!

వద్దు అన్న వినేది..కాదు...

ఏదైనా పని కావాలి అంటే...నాయన కిరణు..నువ్వు మంచి దానివి కదూ..అంటూ మొదలు పెట్టేది.. :)

ఎం కావాలో చెప్పు అంటే..పెరట్లో కరివేపాకు కోసుకు రమ్మనో..తాతయ్యకు...పూజకు పూలు కోసుకు రమ్మనో...చెప్పేది.. :)

నేనేమో పెద్ద పిరికి దాన్ని...అమ్మమ్మ,తాతయ్య నేను ...పెద్ద ఇంట్లో..నాకంటూ ఒక గది కూడా ఉంది..కానీ ఒక్క దాన్నే అక్కడ పడుకోవాలి అంటే భయం..నెమ్మది గ వచ్చి అమ్మమ్మ పక్కన దూరే దాన్ని..

ఏమే భయమా అంటే..లేదు నాకేం భయం...ఊర్కె నీ దగ్గర పడుకోవాలి అనిపించి అనేదాన్ని...ఇక అర్థం చేస్కొని..పక్కకు జరిగేది...తన మీద చేయి వేస్తె సగం మాత్రమే కవర్ అయ్యేది..

అమ్మమ్మ నువ్వు చిన్నప్పటి నుండి ఇంతే లావా..??మరి సన్నగా ఉన్న తాతయ్య నిన్ను ఎలా పెళ్లి చేస్కున్నారు ..అంటూ రక రకాల ప్రశ్నలు వేసేదాన్ని..

మా అమ్మమ్మ నవ్వి..ఈ రోజుల్లో ఉన్నన్ని కోరికలు ఆ రోజుల్లో మా generation కి లేవే అంటూ..ఇంకో కబుర్లు ఏదో చెప్తూ ఉంటె పడుకునే దాన్ని.. :)

ఇక తన దగ్గరి నుండి వచ్చేసాక కూడా..తరచూ గానే వెళ్ళేదాన్ని...అందరు కలిసినప్పుడు....ఆ కిరణ్ ని పిలవండే..ఎక్కడో ఉంటుంది...అన్నానికి అని అంటే..

వెంటనే అమ్మమ్మ మమ్మల్నెందుకు పిలుస్తున్నారు...మేము గాలి భోంచేస్తం అని వెటకారంగా అనేది.. :)

ఇలా అన్ని తలచుకుంటుంఢగానే.. .. నిద్ర లేచి...నన్ను మంచం మీద నుండి కిందకి దింపు అంది..ఇంట్లో ఎవరు లేరు..వచ్చాక.. లేద్దువు లే అంటే...ఏమి లేపలేవ ని అడిగింది...

అసలు తన కండిషన్ ఏంటో అర్థం కాలేదు..ఇక అలా ఉంటె..హైదరాబాద్ కి తీసుకెళ్ళారు......హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు...

నేను అప్పుడు మాట్లాడిందే లాస్ట్....కానీ తను లాస్ట్ లో ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడ లేదు...

ఏదో మౌనంగా చూస్తూ ఉండేది...

మనుషులంటే ..విరక్తి కలిగిన దాని లాగా..!!

హాస్పిటల్ లో అడ్మిట్ చేసిన 2 డేస్ కే కోమా లో కి వెళ్ళిపోయింది.....ఇక ఎవరితో... మాట్లాడనే లేదు..

వెంటనే అందరం వెళ్ళాం...అక్కడికి....నేను వెళ్ళిన ఒక హాఫ్ డే కి దేవుడి దగ్గరకు వెళ్ళిపోయింది.... :(...

ఎంత భాదో... కళ్ళతో చుస్తే భరించలేము.....ఎక్కడ చుసిన pipe లే...నరకం...

చాల మంచిది.....అందరికి మంచే చేసింది..మరి ఇలా ఎందుకు బాధ అని నేను అంటే...

మా సత్య చెప్పారు..వాళ్ళకు ఇక ఈ జన్మ లో పాపాలు నెక్స్ట్ జన్మ కు క్యారీ ఫార్వర్డ్ కాకుండా....దేవుడు ఇప్పుడే పెట్టేసి..తీసుకేల్లిపోతడు...అంది..కాస్త రిలీఫ్..!!!

కానీ నాకు బాగా ఊహ వచ్హాక....అంత లవ్లీ పర్సన్ ని...నేను మిస్ చేస్కుంటాను..అని కూడా నేనెప్పుడు అనుకోలేదు..

తఃన దగ్గర వంటలు...సున్ని పిండి చేయడం ఎలాగో రాసుకుందాం అని ప్రతి సారి అనుకునేదాన్ని...కానీ కుదరలేదు..

దానికి కారణం నా లో ఉన్న ఓవర్ confidence....మా అమ్మమ్మ ఎప్పుడు నాతోనే ఉంటుంది...అని..!!స్వార్థ జీవి కదా మనిషి.. :P
మనం పెరిగేటప్పుడు...మన అమ్మలకి...అమ్మమ్మ లు ..బామ్మ లు ఎన్నెన్ని జాగ్రతలు చెప్తారో కదా...మరి అమ్మ వాళ్ళకు కూడా అప్పటికి తెలియదు కదా...!!
కాస్త పెద్దయ్యాక..బోలుడు కథలు..కబుర్లు...మన వైపే ఫుల్ సపోర్ట్..!!

కానీ ఎంత మనిషిని ప్రేమించిన...తను లేకుండా మన జీవితం మాత్రం అలా సాగిపోతూనే ఉంటుంది...ఇది ఎంతో విచిత్రంగా తోస్తుంది నాకు..!!

రెండు రోజులు ఎక్కువ సెలవలు వస్తే...అమ్మమ్మ ఇల్లు తప్ప ఏమి గుర్తు వచ్చేది కాదు నాకు...ఏం చేద్దాం......ఇప్పుడు ఆ రెండు రోజులు..సెలవలు..తన జ్ఞాపకాలు..తను నేర్పిన పాఠాలు ..తల్చుకోడానికే సరిపోవు...!!

అమ్మమ్మ..ఐ మిస్ యు సో ముచ్..... :(

18 December 2010

అన్నయ్య పెళ్లి..!! :)

మా అన్నయ్య పెళ్లి జరిగింది తెలుసా..!!మొన్న dec 16th ...:)

అన్నయ్య అంటే సొంత అన్నయ్య కాదు...అలా అని ఈ చుట్టమో కాదు...!!

ఒకే కాలేజీ లో చదువుకున్నాం...!!అంతే....!! :)

కాలేజీ ఎం నేర్పించిందో నాకు తెలిదు కానీ....

జీవితానికి సరిపోయేంత ప్రేమ పంచే నలుగురి స్నేహితులని మాత్రం ఇచ్హింది...:D....

ఆ నలుగురిలో ... ఒకడు...ఈ అన్నయ్య...అన్నయ్య..అని అలా తమాషా గ పిలవడం...మొదలు పెట్ట...

అది ఈ రోజుకి..నిజంగా అన్నయ్య ఉన్న అంత importance ఇచ్హే వాడు కాదేమో అని అనిపిస్తుంది...

నేను బాగా నచ్హక పోతే వాళ్ళకి ఏం చెప్పను..అసలు సతాయించను...:P

కానీ వీళ్ళ టైం బాలేక....అతి ఎక్కువగా నచ్చేసి..నాకు సంతోషం వచ్చిన....బాధ వచ్చిన....వీళ్ళనే హింసిస్తూ ఉండేదాన్ని..ఉంటాను...:P

తన పరిచయం అయిపొయింది కదా..!!

పెళ్ళికి...తను షాపింగ్ ఎన్ని రోజుల ముందు చేసాడో నాకు తెలిదు..నేను మాత్రం చేసానండి..ఒక నెల ముందే.. :D...!!

సాయంత్రం 6 ఇంటికి ట్రైన్..ఇక 12 నుండే పని చేయ బుద్ధి కావట్లేదు...

4 కే బయల్దేరిపోయాను.....ట్రైన్ ఎక్కాము...12 మంది...ఒకటే గోల ట్రైన్ దిగే వరకు...

కాలేజీ లో ,బైట కలిసినప్పుడు...మాములుగా కనిపిస్తారు...ఆ పెళ్లి రోజు అదేం కళ వస్తుందో...!!

అబ్బాయి ఐన సరే..అమ్మాయి ఐన సరే.....ఎంత కళగా కనిపిస్తారో...

మా అన్నని పెళ్లి బట్టల్లో చూసి మురిసిపోయా... :)..చక్కగా చంద్రుడి ల ఉన్నాడు...!! :)

పెళ్లి మొత్తం దగ్గరుండి జరిపించాను... :)..హా మరి...ఆడపడుచుని కదా..!!:P :)

ఇంత కాకా ఎందుకు పట్టానో తెల్స...నేను PG షిఫ్ట్ చేసి మా అన్న ఇంటికి షిఫ్ట్ అయిపోవాలని ప్లాన్ వేసి..మా వదిన దగ్గర పర్మిషన్ తీసేస్కున్నా..!! :P...

ఆ పై ఎన్నో నెలల తర్వాత నా ఫ్రెండ్ ని కలిసాను.. :D....!!అదే నులుగు ఉన్నారు అని చెప్పా కదా...ఒకడు మాత్రం బెంగుళూరు లో ఉండడు...వాడిని...

సో ఆల్ వాస్ వెల్ అనమాట...!!

మా అన్న వదిన హ్యాపీ గ ఉండాలని...అందరు దీవించెసి విషెస్ చెప్పేయండి.. :).

10 December 2010

నేను watch కొనుక్కున్నా .. కదా …!!! :)

ఎన్ని లక్షలు పెట్టి ??

అబ్బ ..ఆశ ..అంత కరీదైనదైతే మీకు ఎందుకు చెప్తాను ..కొట్టేస్తారు కదా …. :P

:Pమాములు watch ఏ …

మరి ఇన్ని రోజులు watch లేదా నీకు …??

లేదు కదా .. :(

అప్పుడెప్పుడో ….ఒక watch ఉండేది ..దానికి పైన బోలెడు రంగు రంగుల rings ఉండేవి ..ఏ డ్రెస్ వేసుకేలితే ఆ రంగు పెట్టుకోవచ్చు …

అది chain టైపు ….లింక్ లు తీయించి ..తీయించి …అటు ఒక లింక్ ..ఇటు ఒక లింక్ ..మిగిలాయి ….అంత లావు గా ఉండేది నా చెయ్యి మరి …

మనిషి ఆశావాది కాబట్టి …

కనీసం , ఇటు 3 అటు 3 లింక్ లకు వచ్చే లావు అయ్యాకే ..chain స్ట్రాప్ ఉన్నది కొందాము అని అనుకున్న …

So next B.tech చేరాక మా నాన్న ఒక leather strap ఉన్న watch కొనిచ్చారు ..మామూలుగా నేను గమనించిన దాని ప్రకారం 7 చిల్లులు ఉంటాయి.. ..

మన లావుకి 10 చిల్లులు ఉండాలి ..ఆ లాస్ట్ పదో చిల్లులో దూరిస్తేనే ..నాకు watch ఉంటుంది ..లేక పోతే చెయ్యి కిందకి అనంగానే నేల మీద ఉంటుంది …

భలే ఊహించుకుంటున్నారే ….మీరసలు … :)

ఆ షాప్ అంకుల్ మాకు తెలిసిన ఆయనే …అవ్వడం తో కాస్త చనువు తీస్కోని ..ఏమ్మా ఇలా ఉంటే ఎలా …బాగా తినాలి …అని అన్నారు …మా నాన్న అదే ఛాన్స్ అనుకుని …ఆది మాత్రం చెప్పకండి మా అమ్మాయికి …అస్సలు ఎక్కదు అన్నారు …ఎలాగో ఒక్కరే ఉన్నప్పుడు చెప్తే ..ఇల్లు కదిలేలా అరుస్తాను ..లేక గుండె కదిలేలా ఏడుస్తాను.. ..నేనేం చేశాను …ఎంత తిన్న అంతే …ఐనా నాకేమి ఆకలి అంత ఉండదు ..ఊర్కె అరవకండి అని …నేను రివర్స్ లో అరుస్తూ.. :P

Road లో అందరి ముందు అరవను అనే ఒక నమ్మకం ..ఆయన చెప్పించిన చదువు ..ఆయనకే మేలు చేస్తోంది మరి … :)

ఇక అదే last watch నాన్న తో కొనిన్చుకోవడం …

ఆ watch కి కొన్నేల్లయ్యాక ..నూరేళ్ళు నిండాయి అనుకుని …కొత్త watch అన్నాను ..

లేదు …ఒక సారి shop లో చూపిద్దాం అన్నారు ..తీస్కెల్తే సెల్ అయిపోయింది ..మారిస్తే సరిపోతుంది అంటే ..okk అన్నాను …

మళ్ళి Bangalore వచ్హాక మళ్ళి పని చెయ్యట్లేదు …..bangalore లో చూపిస్తే …బానే ఉంది ..ఏమైందో తెలీదు అన్నారు …

ఈ సారి కొన్న చోటకే వెళ్ళాను ..ఆయన ..ఈ watch చర్మానికి కి టచ్ అయితేనే పని చేస్తుంది ….మీ అమ్మాయి చేతికి కండ లేదు …అందుకే ఆది పని చెయ్యట్లేదు అని చెప్పాడు …

ఇక నాకు ఆయన మీద పట్టరాని కోపం ….కొత్తది కొనుక్కుంట ..అంటే ..లావవ్వు కొందాం అని నాన్న …ఆది కుదిరే పని కాదు అనుకుని …ఇంటికి వచ్చి ఒక యుద్ధం చేసినా లాభం లేక పోయింది …

అదే watch కట్టుకుని ….ఊరంత తిరిగే దాన్ని …చేతిలో mobile ఉంది కదా అనే ధైర్యం తో ..

ఒకానొక మంచి రోజు..అంటే ముందు ముందు ఈ మంచి రోజే....ఎన్నో ట్విస్ట్ లు ఉంటాయని తెలియక...దాన్ని అప్పటికి మంచి రోజే అనుకున్నా..….ఒక చేతిలో water bottle..ఇంకో చేతిలో tea cup పట్టుకుని నా cubicle కి నడుస్తూ ఉండగా ..ఒక security అమ్మాయి ….టైం ఎష్టు madam అంది …..నేను 10.30 అనుకుంట అన్నాను ..కాదు madam కరెక్ట్ గా కావాలి సెకండ్ ల తో సహా అంది ..సెల్ తేలేదు అన్నాను ….madam చేతికి watch ఉంది కదా అంది …ఆది పని చేయదు అని చెప్పలేక ….ఇన్ని పట్టుకున్నా కదా …చూడలేను అని చెప్పి ఇక దౌడ్ ….

నన్ను ఆ అమ్మాయి ఎంత చులకన గా చూసిందో నాకు ఆ sairam కి మాత్రమే తెల్సు ..

ఇక ఈ తీరని అవమానాన్ని భరించ లేక …watch ఎలాగైనా కోనేద్దామని ..వెళ్ళాను ….అక్కడ చాలా ఉన్నాయి …కానీ నాకు పట్టేవి కాదు .. :(

పోనీ 100,200 rs watch మోడల్స్ లో ఐనా సన్నగా ఉండే చేతులకి తయారు చేసుంటారు..లే..అవి తక్కువ కాబట్టి..ఒక 2 లింక్ లు తక్కువే పెట్టుంటారు అనీ కొంచం ఎక్కువ బ్రెయిన్ ఉపయోగించి..ఒక పనికి రాని ఆలోచన చేశాను....వెళ్లి చుస్తే..అవి కనీసం నా చేతికి 2 రెట్లు లావు ఉండే చేతికి మాత్రమే సరిపోతాయి...

ఇంతటి బాధని లోలోపలే అనుభవిస్తూ..నా కోసం పుట్టిన watch కోసం ఎదురు చూస్తూ..అప్పటికి కొనడమ విరమించుకున్న..

ఈ సారి birthday కి వచ్చిన విరాళాల తో ….మంచిదేదైనా కొందాం అని వెళ్ళాను …

ఎన్ని మంచి మంచి models ఓ ..Card లో డబ్బు …కానీ చేతికే కండ లేదు ….. :(

కొన్ని చైన్ watch లు try చేశాను ….అవి dial ఒక్కటే నా చెయ్యి మొత్తం కవర్ చేస్తున్నాయి..…ఇక నాతో పాటు వచ్చిన నా friends..కిరణ్ ఒక గం లాంటిది ఇప్పించుకో …dial ఒక్కటే అతికిన్చుకోడానికి అని అంటున్నారు ..లేక పోతే నీ office ట్యాగ్ కి ఇంకో దారం కట్టి వేలాడ తీయి అన్నారు … :(..ఇంతటి బాధ ని అవమానాన్ని భరించలేక ….

నా size కు తగట్ట్లే …ఒక చిన్న watch కొనుకున్న leather strap ది ..

ఇక దాన్ని చూసి కిడ్స్ సెక్షన్ లోని watch అంటే ఒక 10 నిమిషాలలో లో పని అయిపోయేది ర అంటూ వెక్కిరించారు...

నాకు ఇక ఉక్రోషం ఆగక....అవ్తుంది....నా చెయ్యి కూడా ఒక రోజు లావవుతుంది ...అంటూ ..శపథం చేస్తూ బైటకి వచ్హాను...

ఏదైనా చిట్కాలు చెప్పొచ్చు కదా …only చెయ్యి లావు అవ్వడానికి …మీకు బోలెడంత పుణ్యం వచ్చేలా నేను ప్రార్థనలు చేస్తాను .. :)

21 November 2010

కార్తీక పౌర్ణమి నాడు శివయ్య ...

నాకు ఈ శివయ్యతో మాట్లాడటం ..పెద్ద అలవాటు లేదండి..

ఎప్పుడు మన తోక సామీ,తొండం సామీ...బాబా తప్ప..

ఎక్కువ శివుడి గుడికి వెళ్ళినట్లు కూడా గుర్తు లేదు..

కానీ ఈ మద్య ఆయనే తెగ పిలుస్తున్నాడు నన్ను... :ప..

ఎం అదృష్టమో ఏమో..ఈ కార్తిక మాసం లో ఎప్పుడు లేనిది ..గుడి కి వెళ్ళాను..

వెళ్ళడమే కాక..దీపాలు వెలిగించాను...

మొన్న అనుకోకుండా..banaglore 100 kms దూరం లో కోటి లింగేశ్వర temple కి వెళ్ళాం..

అక్కడ ఉన్నంత సేపు..ఏమి పెద్ద భక్తి భావం..అల అనిపించలేదు..

కానీ రూం కి వచ్చాక ..ఆ ఫోటో లు చూస్తున్నంత సేపు హ్యాపీ..

ఎందుకబ్బా నేను ఇంత హ్యాపీ అని నన్ను నేను ప్రస్నించుకుంటే సమాధానం దొరికింది.. :)

నాకు ఎప్పుడు దేవుడంటే పెద్ద ..బాగా పెద్ద అని ఒక impression..అలా పెద్ద పెద్ద విగ్రహాలను చుస్తే ఇక పట్టరాని ఆనందం.మరి అంత పెద్ద దేవుణ్ణి చూసేసా కదా.. :)

ఇక ఇంటికొచ్చాక వెన్నెల్లో ఎంత బాగుంటుందో.. కదా ఆ ప్లేస్..వర్షం పడ్తే అద్బుతం కదా అనుకుంటూ ఉఉహించు కునే దాన్ని..

painting వేద్దాం అంటే complete చేయడానికి టైం పడ్తుంది..

రిస్క్ ఎందుకు లే అని..ఉఉర్కే అల photoshop తో ట్రై చేశాను..ఇలా వచ్చింది...

మొత్తం అయ్యాక నాకు నచ్చింది..కాకి పిల్ల కాకికి ముద్దు కదా మరి.. :)

సరే కానీ మీరందరూ ఏంటి...వన భోజనాలు...అదీ..ఇదీ అంటూ..ఎప్పుడు తిండి ధ్యసేన...:P

శివయ్య కి నా లాంటి భక్తులున్నారు కాబట్టి సరిపోయింది ..లేక పోతే ఆయన ఎంత hurt అయ్యేవాడు.. :P .. :)

నేను ఎంచక్కా early మార్నింగ్ 7 కే లేచి..8 కే స్నానం చేసి..9 కి గుడికి వెళ్లి వత్తులు వెలిగించ...

మరి మీరు???.....సరేలే..మీరేలగు వండటం లో బిజీ కదా...ఆ చేసిందంతా ఇటు పంపండి..

శివయ్యకు ప్రసాదం పెట్టి..నేను జస్ట్ taste చూస్తా అంతే... :) :P

అనన్య చురకలు !

మా పాపా పేరు అనన్య  ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను  దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...